బాదం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 82: పంక్తి 82:
రక్తప్రసరణ : బాదంలో పొటాషియం ఎక్కువ, [[సోడియం]] శాతం చాలా తక్కువ. కాబట్టి [[రక్తపోటు]] సమస్య ఉండదు. రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. ఇందులో లభించే [[మెగ్నీషియం]] కండరాల నొప్పులను దూరం చేసి ఎదృఢంగా ఉండటానికి తోడ్పడుతుంది.
రక్తప్రసరణ : బాదంలో పొటాషియం ఎక్కువ, [[సోడియం]] శాతం చాలా తక్కువ. కాబట్టి [[రక్తపోటు]] సమస్య ఉండదు. రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. ఇందులో లభించే [[మెగ్నీషియం]] కండరాల నొప్పులను దూరం చేసి ఎదృఢంగా ఉండటానికి తోడ్పడుతుంది.
ఎముకలు దృఢంగా : ఇందులో లభించే క్యాల్షియం ఆస్టియోపోరోసిస్‌ను దూరంగా ఉంచుతుంది. ఎముకలను దృఢంగా ఉంచడానికి తోడ్పడుతుంది. ఇనుము శరీరావయవాలకు, కణాలకు [[ఆక్సిజన్|ఆక్సిజన్‌]]<nowiki/>ను చేరవేస్తుంది.
ఎముకలు దృఢంగా : ఇందులో లభించే క్యాల్షియం ఆస్టియోపోరోసిస్‌ను దూరంగా ఉంచుతుంది. ఎముకలను దృఢంగా ఉంచడానికి తోడ్పడుతుంది. ఇనుము శరీరావయవాలకు, కణాలకు [[ఆక్సిజన్|ఆక్సిజన్‌]]<nowiki/>ను చేరవేస్తుంది.
బరువుతగ్గడానికి : బాదంలో ఉండే పీచు పదార్థం, మాంసకృత్తులు, కొవ్వులు బరువు తగ్గేవారికి మేలు చేస్తాయి. అంతేకాదు కెలొరీల శాతం తక్కువ కాబట్టి ప్రతిరోజు తీసుకున్నా సమస్య ఉండదు.
బరువుతగ్గడానికి : [http://manatelangana.news/dry-fruits-rich-in-proteins-vitamins-minerals/ బాదం]లో ఉండే పీచు పదార్థం, మాంసకృత్తులు, కొవ్వులు బరువు తగ్గేవారికి మేలు చేస్తాయి. అంతేకాదు కెలొరీల శాతం తక్కువ కాబట్టి ప్రతిరోజు తీసుకున్నా సమస్య ఉండదు.
*తక్షణశక్తికి : అలసటగా అనిపించినప్పుడు నాలుగు బాదాంలు తీసుకొంటే తక్షణ శక్తి సొంతమవుతుంది. అందులో రైబోఫ్లెవిన్‌, [[రాగి]], [[మాగ్నీషియం|మెగ్నీషియం]].. వంటి పోషకాలు శరీరానికి [[శక్తి]]<nowiki/>ని అందిస్తాయి. అందుకని *దూరప్రయాణాలు చేసేటప్పుడు, ఆఫీసుకు వెళ్లేటప్పుడు వెంట తీసుకెళితే ఆకలిగా అనిపించినప్పుడు తినొచ్చు.
*తక్షణశక్తికి : అలసటగా అనిపించినప్పుడు నాలుగు బాదాంలు తీసుకొంటే తక్షణ శక్తి సొంతమవుతుంది. అందులో రైబోఫ్లెవిన్‌, [[రాగి]], [[మాగ్నీషియం|మెగ్నీషియం]].. వంటి పోషకాలు శరీరానికి [[శక్తి]]<nowiki/>ని అందిస్తాయి. అందుకని *దూరప్రయాణాలు చేసేటప్పుడు, ఆఫీసుకు వెళ్లేటప్పుడు వెంట తీసుకెళితే ఆకలిగా అనిపించినప్పుడు తినొచ్చు.
*మధుమేహానికి : [[మధుమేహం]]<nowiki/>తో బాధపడేవారు భోజనం తరువాత తీసుకుంటే ఫలితం ఉంటుంది. ఇది రక్తంలో ఇన్సులిన్‌ శాతాన్నిపెంచుతుంది.
*మధుమేహానికి : [[మధుమేహం]]<nowiki/>తో బాధపడేవారు భోజనం తరువాత తీసుకుంటే ఫలితం ఉంటుంది. ఇది రక్తంలో ఇన్సులిన్‌ శాతాన్నిపెంచుతుంది.

09:43, 18 ఆగస్టు 2018 నాటి కూర్పు


బాదం
Almonds in and out of shell
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Subfamily:
Genus:
Subgenus:
Amygdalus
Species:
P. dulcis
Binomial name
Prunus dulcis
(Mill.) D. A. Webb

బాదం (ఆంగ్లం Almond) చెట్టులను విత్తనాలలోని పిక్కలకోసం పెంచుతారు.బాదం గింజలు బలవర్థకమైన ఆహారం.జలుబు,జ్వరాలకు ఔషధంగా పనిచేస్తాయి.బాదం పైపొట్టు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.రోజూ బాదం గింజలు తినడం ద్వారా శరీరంలో వైరల్‌ ఇన్‌ఫెక్షన్లపై పోరాడే శక్తి పెరుగుతుంది.తెల్లరక్తకణాల సామర్థ్యం పెరుగుతుంది.

బాదంచెట్టు[1]

బాదం చెట్టురోసేసి (Rosaceae) కుటుంబానికిచెందిన చెట్టు. బాదంచెట్టు వృక్షశాస్త్రనామం: పునస్‌ డల్సిస్‌ (Prunus dulcis). బాదంలో ఇంకను రెండు, మూడు తెగలు ఉన్నాయి. వ్యవహారికంగా తీపిబాదం (sweet), చేదుబాదం (bitter) అను రెండు రకాలు ఉన్నాయి. తినుబండారాల తయారిలో తీపి బాదంను వాడెదరు[2] . బాదం పుట్టుక మధ్య, మరియు దక్షిణ ఆసియా దేశాలు. ఆ తరువాత మిగతా ప్రాంతాలకు వ్యాపించినది. బాదం చెట్టు 4-10 మీటర్ల ఎత్తు పెరుగును. ప్రధానకాండం 25-30 సెం.మీ వ్యాసం కల్గివుండును. బారం ఆకురాల్చు బహువార్షికం. ఆకులు 3-5 అంగుళాలువుండును.కొమ్మలు కలిగివుండును.ఆకులు దీర్ఘాండాకారంగా వుండును. తీపిబాదంపూలు తెల్లగా వుండి, అడుగుభాగం, అంచులు కొద్దిగా పింకురంగులో వుండును. పూలు 3-5 సెం.మీ.వుండును. మందమైన 5 పుష్పదళాలుండును.5-6 సంవత్సరాల నుండి బాదం దిగుబడి మొదలగును.

బాదం కాయ

బాదం పప్పు యొక్క పోషక విలువలు

143 గ్రాముల బాదం పప్పులో ఉండే పదార్థాల పోషక విలువలు [3]

పోషక పదార్థం విలువలు
తేమ 6.31గ్రాం
ప్రోటిను 30.24గ్రాం
పిండిపదార్థాలు 30.82గ్రాం
చక్కెర 6.01గ్రాం
పీచుపదార్థం 17.9
శక్తి 828Kcal
మొత్తం ఫ్యాట్ 71.4గ్రాం

బాదం పప్పులో ఐరన్(ఇనుము),కాల్షియం,మెగ్నిసియం,జింకు,ఫాస్పరసు మరియు సోడియం ఖనిజాలు విరివిగా ఉన్నాయి.

బాదంపాలు

ప్రధాన వ్యాసం బాదంపాలు

బాదం చెట్టు (వనస్థలిపురం)
A bottle of raw almond milk.

బాదంపాలును బాదంపప్పులను ఉపయోగించి తయారు చేస్తారు. ఆవు పాలు లేక ఇతర జంతువుల పాలు ఎలర్జీ అయిన వారికి ఈ పాలు ఇవ్వడం వలన సంపూర్ణ ఆహారం అందుతుంది. బలవర్ధకం కూడా.

బాదం పప్పులను నానబెట్టి, తొక్కదీసి, మెత్తగా రుబ్బి, కాచి చల్లార్చిన నీళ్ళని, పాలలా చిక్కగా కనబడే వరకు కలపాలి.

మామూలుగా ఇది తెలుపు రంగులో ఉంటుంది. రుచి కొరకు, ఆకర్షణ కొరకు ఇతర పదార్థములను కలుపుట వలన రంగు మారుతుంది.

జ్యూస్

జ్యూస్ అనగానే గుర్తుకు వచ్చేది బాదంపాలు. ఎందుకంటే వేసవి కాలం వస్తే చాలు జ్యూసు షాపుల్లో ఎక్కువగా బాదం పాలు అమ్ముడు పోతుంది. ఫ్రూట్ జ్యూస్ లో బాదంపాలు కలుపుకొని తాగుతారు.

  • బాదం (Almond) : ఇది మిడిల్ ఈస్ట్ లో పుట్టి ప్రపంచమతా వ్యాపించింది . బాదం పప్పు నే తినేందుకు వాడుతారు . కాయలు, పళ్ళు పనికిరావు .
  • పచ్చి గింజలు తినవచ్చును, రోస్ట్ చేసికొని తింటే చాలా బాగుంటాయి . బాదం సిరప్, నీనే ను వాడురు .
  • బలము వస్తుంది .
  • గుండె ఆరోగ్యం పదిలం గా ఉంటుంది,
  • వీటి లో ఉండే 'ఫైటో కెమికల్స్' - కాన్సర్ ను నిరోధించును .
  • దీని లోని పీచు పదార్థము మలబద్దకం ను నివారించును .
  • ఇందులో లబించే విటమిన్ "ఇ" యాంటి ఆక్షిడేంట్ గా పనిచేయడం వల్ల ముసలితనం తొందరగా రాదు .
  • పిండి పదార్థము చాలాతక్కువ ... మధుమేహ రోగులకు మంచిది .

బాదం.. పోషకాహారం. ఇది ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మసంరక్షణకు దోహదం చేస్తుంది. అందుకే ప్రతిరోజూ నాలుగు తీసుకున్నా ఎంతో మేలు జరుగుతుంది .

పోషకాలు :

బాదంలో మాంసకృత్తులు, ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వులు, విటమిన్లు, మినరల్స్‌ సమృద్ధిగా లభిస్తాయి. వీటిని మిల్క్‌షేక్‌, ఇతర రూపంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు దీనికి శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపే గుణం ఉంది. గుండెకు : పది బాదం పప్పుల చొప్పున వారంలో ఐదుసార్లు తీసుకొంటే హృద్రోగ సమస్యలు నియంత్రణలో ఉంటాయి. ఇందులో విటమిన్‌ 'ఇ' ఉంటుంది. ఇది చక్కని యాంటీఆక్సిడెంట్‌. కొలెస్ట్రాల్‌ నియంత్రణ : వీటిలో మోనోశాచ్యురేటెడ్‌, పాలీశాచ్యురేటెడ్‌ ఫ్యాట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో చెడుకొవ్వు నిల్వలను నాశనం చేస్తాయి. అందుకే ప్రతిరోజూ రెండుమూడు బాదంపప్పులను ఉదయాన్నే తీసుకొంటే మంచిది.

రక్తప్రసరణ : బాదంలో పొటాషియం ఎక్కువ, సోడియం శాతం చాలా తక్కువ. కాబట్టి రక్తపోటు సమస్య ఉండదు. రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. ఇందులో లభించే మెగ్నీషియం కండరాల నొప్పులను దూరం చేసి ఎదృఢంగా ఉండటానికి తోడ్పడుతుంది. ఎముకలు దృఢంగా : ఇందులో లభించే క్యాల్షియం ఆస్టియోపోరోసిస్‌ను దూరంగా ఉంచుతుంది. ఎముకలను దృఢంగా ఉంచడానికి తోడ్పడుతుంది. ఇనుము శరీరావయవాలకు, కణాలకు ఆక్సిజన్‌ను చేరవేస్తుంది. బరువుతగ్గడానికి : బాదంలో ఉండే పీచు పదార్థం, మాంసకృత్తులు, కొవ్వులు బరువు తగ్గేవారికి మేలు చేస్తాయి. అంతేకాదు కెలొరీల శాతం తక్కువ కాబట్టి ప్రతిరోజు తీసుకున్నా సమస్య ఉండదు.

  • తక్షణశక్తికి : అలసటగా అనిపించినప్పుడు నాలుగు బాదాంలు తీసుకొంటే తక్షణ శక్తి సొంతమవుతుంది. అందులో రైబోఫ్లెవిన్‌, రాగి, మెగ్నీషియం.. వంటి పోషకాలు శరీరానికి శక్తిని అందిస్తాయి. అందుకని *దూరప్రయాణాలు చేసేటప్పుడు, ఆఫీసుకు వెళ్లేటప్పుడు వెంట తీసుకెళితే ఆకలిగా అనిపించినప్పుడు తినొచ్చు.
  • మధుమేహానికి : మధుమేహంతో బాధపడేవారు భోజనం తరువాత తీసుకుంటే ఫలితం ఉంటుంది. ఇది రక్తంలో ఇన్సులిన్‌ శాతాన్నిపెంచుతుంది.
  • మెదడుకు మేత : నీళ్లలో రెండు మూడు బాదం పప్పులు నానబెట్టి మర్నాడు చిన్నారులకు తినిపిస్తే జ్ఞాపకశక్తి వృద్ధవుతుంది.
  • బద్ధకం దూరం : వీటిలో పీచు పదార్థం సమృద్ధిగా లభిస్తుంది. మలబద్ధకం, ఇతర సమస్యలున్నవారు రోజుకు నాలుగైదు బాదం పప్పులు తీసుకొని.. బాగా నీళ్లు తాగితే చక్కటి పరిష్కారం దొరుకుతుంది.
  • పెద్దప్రేగు క్యాన్సర్ : బాదం తినడము వలన పెద్దప్రేగుకు క్యాన్సర్ రాకుండ ఉంటుంది.
  • అమెరికన్ అసోసియేషన్ ఆహార నియంత్రణ జర్నల్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం బాదం ప్లాస్మా మరియు ఎర్ర రక్త కణాలలో విటమిన్ ఇ స్థాయిని పెంచుతుంది మరియు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.[4]

మూలాలు

  1. "INDIAN ALMOND TREE". aleysfruit.com.au. Retrieved 2015-0316. {{cite web}}: Check date values in: |accessdate= (help)
  2. "Benefits of eating almonds". catalogs.com. Retrieved 2015-0316. {{cite web}}: Check date values in: |accessdate= (help)
  3. "What are the health benefits of almonds". medicalnewstoday.com. Retrieved 2015-03-16.
  4. "బాదం యొక్క ఆరోగ్య ప్రయోజనాలు"."Meical News Today".
"https://te.wikipedia.org/w/index.php?title=బాదం&oldid=2435555" నుండి వెలికితీశారు