అంట్యాకుల పైడిరాజు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:చిత్రకారులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎మూలాలు: +{{Authority control}}
పంక్తి 73: పంక్తి 73:
==మూలాలు==
==మూలాలు==
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}

{{Authority control}}


[[వర్గం:1919 జననాలు]]
[[వర్గం:1919 జననాలు]]

09:36, 25 ఆగస్టు 2018 నాటి కూర్పు

అంట్యాకుల పైడిరాజు
జననంనవంబర్ 1, 1919
మరణం1986 డిసెంబరు 26
విశాఖపట్నం
నివాస ప్రాంతంవిజయనగరం జిల్లా
ప్రసిద్ధిచిత్రకారుడు , శిల్పి.
తండ్రిరాజయ్య,
తల్లినరసమ్మ

అంట్యాకుల పైడిరాజు విజయనగరం జిల్లాకు చెందిన ప్రముఖ చిత్రకారుడు మరియు శిల్పి.

జీవిత చరిత్ర

ఇతడు నవంబర్ 1, 1919న బొబ్బిలిలో రాజయ్య, నరసమ్మ దంపతులకు జన్మించాడు. అన్నయ్య అప్పారావు చిత్రకారుడు కావడం వల్ల పైడిరాజు అతడిని అనుకరించి చిన్నప్పటి నుండే సుద్దముక్కతో చూసిన ప్రతి బొమ్మనీ నేలమీద చిత్రించడం అలవాటయింది.

విజయనగరం మహారాజా కళాశాలలో ప్రాథమిక విద్యనభ్యసించాడు. అక్కడి నాటక లలిత సంగీత పోటీలలో వివిధ బహుమతులు గెలుచుకున్నాడు. 1940-1944లో మద్ర్రాసు ప్రభుత్వ చిత్రకళాశాలలో డిప్లమా పొందాడు. ప్రముఖ బెంగాలీ చిత్రకారుడు, శిల్పి, దేవీప్రసాద్ రాయ్ చౌదరి పైడిరాజు గురువు.

పైడిరాజు 1949లో విజయనగరములో చిత్రకళాశాలను నెలకొల్పాడు. పైడిరాజు చిత్రాలు లండన్, పోలెండ్, ఆఫ్ఘనిస్తాన్, రష్యా, అమెరికా మరియు సింగపూర్ లకు చెందిన ప్రభుత్వ మరియు ప్రయివేటు ఆర్ట్ గ్యాలరీలలో వెలుగులీనుతున్నాయి.[1] విజయనగరంలో బొడ్డు పైడన్న, పి.ఎల్.ఎన్. రాజు విగ్రహాలు మరియు వైజాగ్ బస్ స్టాండు దగ్గర వున్న గురజాడ అప్పారావు విగ్రహం పైడిరాజు చేసినవే.

అనాటమీ స్కెచెస్ వేయడంలో పైడిరాజు అందెవేసిన చేయి. తైలవర్ణ చిత్రరచనలో ఇతనిది ఒక ప్రత్యేకశైలి. ఇతడు చిత్రించిన 'పేరంటం', 'అలంకరణ', 'బొట్టు' మున్నగు అద్భుత కళాఖండాలు కేంద్ర లలితకళా అకాడమీ బహుమతులు గెల్చుకున్నాయి. భారతీయత, ఆంధ్రత్వం, అధివాస్తవికత, క్యూబిజం ఇతని చిత్రాలలో జీవకళగా ఉట్టిపడుతూ ఉంటాయి.

1977లో ఆంధ్ర విశ్వ కళాపరిషత్ ఆహ్వానాన్ని మన్నించి లలితకళా విభాగ ఆచార్యులయ్యారు. చిత్రకళా శిరోవిభూషణ, కళా ప్రపూర్ణ గౌరవాలందుకున్నారు. బోగి జగన్నాధరాజు, అబ్బూరి గోపాలకృష్ణ, కేతినీడి, వేదుల రాజ్యలక్ష్మి, శ్యామా కౌండిన్య, ద్వివేదుల సోమనాథశాస్త్రి మొదలగు వారెందరో పైడిరాజు శిష్యులు.

కవిత్వంలో కూడా చక్కని అభినివేశం గల పైడిరాజు 1986 సంవత్సరంలో డిసెంబరు 26న విశాఖపట్నంలో మరణించాడు.

పైడిరాజు చిత్రపటాలు

  • పేరంటం,
  • అలంకరణ,
  • బొట్టు,
  • స్నానానంతరం,
  • తిలకం,
  • అలంకరణ,
  • సంతకు

పైడిరాజు చెక్కిన శిల్పాలు

ఇతర విశేషాలు

మూలాలు