గంధం నాగరాజు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎జననం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆగష్టు → ఆగస్టు using AWB
చి →‎మూలాలు: +{{Authority control}}
పంక్తి 94: పంక్తి 94:
== మూలాలు ==
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}

{{Authority control}}


[[వర్గం:తెలుగు రచయితలు]]
[[వర్గం:తెలుగు రచయితలు]]

18:29, 25 ఆగస్టు 2018 నాటి కూర్పు

గంధం నాగరాజు
గంధం నాగరాజు
జననంగంధం నాగరాజు
ఆగష్టు 30, 1968
నరసరావుపేట, గుంటూరు జిల్లా
మరణంఏప్రిల్ 27, 2011
నివాస ప్రాంతంగుంటూరు జిల్లా నరసరావుపేట
ప్రసిద్ధికథారచయిత, నవలాకారుడు, నాటక రచయిత
తండ్రిగంధం యాజ్ఞవల్క్య శర్మ

గంధం నాగరాజు కథ, నవల, నాటక, సినిమా రచయిత.

జననం

నాగరాజు 1968 ఆగస్టు 30న గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన సూర్యప్రకాశరావు, రాధరుక్మిణి దంపతులకు జన్మించారు. ఈయన చిన్నతనంలోనే పెదనాన్న గారైన గంధం యాజ్ఞవల్క శర్మ ఈయన్ను దత్తత తీసుకున్నారు.

చదువు - ఉద్యోగం

ఎం.సీ.హెచ్ కోర్సును పూర్తిచేసిన నాగరాజు కుంభంమెట్టు కళాశాలలో ప్రిన్సిపల్గా పనిచేశారు.

రచనలు

1990లో అపరాజిత కథతో రచనను ప్రారంభించారు.

కథలు

  • జన్మభూమి
  • క్షమయాదరిత్రి
  • కర్మయోగి
  • సృష్టి
  • రజ్జుసర్పభ్రాంతి,
  • పునరావాసం
  • తెల్లమచ్చల నల్ల క్రోటన్ మొక్క
  • అపరాజిత
  • ప్రియాంక
  • జీవితానికో పుష్కరం
  • వెంకటప్పయ్య
  • ట్రామాకేర్

వంటి 18 కథలు[1]

నవలలు

  • పసిడిలంక
  • స్థితప్రజ్ఞ

నాటకాలు

  • వలస
  • రంగులరాట్నం

నాటికలు

  • ఆలోచించండి
  • సత్యాగ్రహి
  • పాదుకాస్వామ్యం
  • చదువు
  • శేషార్ధ్హం
  • నోట్ దిస్ పాయింట్
  • మిధ్యాబింబం
  • నువ్వు ప్లస్ నేను మైనస్ ఈజ్ ఈక్వల్ టూ పెళ్ళి
  • డాకట్ర్ జోసఫ్ మరకతమణి
  • అనంతం

ఆయన రాసిన నవలలు స్వాతి సపరివార పత్రికలోనూ, కథలు వివిధ వారపత్రికల్లోనూ ప్రచురించబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ లోని అనేక పరిషత్తుల్లో ఆయన రాసిన నాటికలు, నాటకాలు ప్రదర్శితమై, విమర్శకుల ప్రశంసలు పొందాయి. సత్యాగ్రహి నాటికకు ఉత్తమ రచనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు లభించింది.

సినిమారంగం

రాగం చిత్రానికి సహ రచయితగా తెలుగు సినీరంగంలో తొలి అడుగు వేసిన నాగరాజుకు గమ్యం చిత్రం మలి అడుగు. ఈ చిత్రానికి ఉత్తమ మాటల రచయితగా ఫిల్మ్ ఫేర్ అవార్డు లభించింది.

అటుతర్వాత బాణం[2], బెట్టింగ్ బంగార్రాజు, ఓం శాంతి ఓం, గాయం-2, ఇంకోసారి, రాగం వంటి సినిమాలకు మాటల రచయితగా పనిచేశారు.

మరణం

ఈయన 2011, ఏప్రిల్ 27న అనారోగ్యంతో మరణించారు.[3]

మూలాలు

  1. కథానిలయం. "గంధం నాగరాజు". kathanilayam.com. Retrieved 26 October 2016.
  2. జురాన్ సినిమా. "బాణం- ఓ నాలుగు ముక్కలు". zurancinema.wordpress.com. Retrieved 26 October 2016.
  3. తెలుగు వన్ ఇండియా. "గమ్యం సినిమా రచయిత గంధం నాగరాజు కన్నుమూత". telugu.oneindia.com. Retrieved 26 October 2016.