అంగోలా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉన్నయి. → ఉన్నాయి., ఉన్నది. → ఉంది., → (2), ) → ) using AWB
బొమ్మ:Coat_of_arms_of_Angola.svgను బొమ్మ:Emblem_of_Angola.svgతో మార్చాను. మార్చింది: commons:User:CommonsDelinker; కారణం: (File renamed: Criterion 4 (harmonizing names of file set)).
పంక్తి 5: పంక్తి 5:
|common_name = అంగోలా
|common_name = అంగోలా
|image_flag = Flag of Angola.svg
|image_flag = Flag of Angola.svg
|image_coat =Coat_of_arms_of_Angola.svg
|image_coat =Emblem of Angola.svg
|national_motto = ''"Virtus Unita Fortior"''{{spaces|2}}<small>([[లాటిన్]])<br />"సమైక్యత శక్తిని పటిష్ఠం చేస్తుంది"</small>
|national_motto = ''"Virtus Unita Fortior"''{{spaces|2}}<small>([[లాటిన్]])<br />"సమైక్యత శక్తిని పటిష్ఠం చేస్తుంది"</small>
|image_map = Location Angola AU Africa.svg
|image_map = Location Angola AU Africa.svg

21:00, 25 ఆగస్టు 2018 నాటి కూర్పు

República de Angola
రిపబ్లిక్ ఆఫ్ అంగోలా
Flag of అంగోలా అంగోలా యొక్క చిహ్నం
నినాదం
"Virtus Unita Fortior"  (లాటిన్)
"సమైక్యత శక్తిని పటిష్ఠం చేస్తుంది"
జాతీయగీతం
అంగోలా అవాంతే  (పోర్చుగీసు)
అంగోలా పురోగమించూ

అంగోలా యొక్క స్థానం
అంగోలా యొక్క స్థానం
రాజధానిలువాండా
8°50′S 13°20′E / 8.833°S 13.333°E / -8.833; 13.333
అతి పెద్ద నగరం రాజధాని
అధికార భాషలు పోర్చుగీసు1
ప్రజానామము అంగోలన్
ప్రభుత్వం నామమాత్రపు బహు పార్టీ వ్యవస్థ (స్వేఛ్ఛాయుత ఎన్నికలు ఇప్పటివరకు జరగలేదు)
 -  అధ్యక్షుడు హోసే ఎడ్వర్డో దోస్ శాంటోస్
 -  ప్రధానమంత్రి ఫెర్నాండో డా పీడాడే దియాస్ దోస్ శాంటోస్
స్వాతంత్ర్యము పోర్చుగల్ నుండి 
 -  తేదీ నవంబర్ 11 1975 
విస్తీర్ణం
 -  మొత్తం 1,246,700 కి.మీ² (23వది)
481,354 చ.మై 
 -  జలాలు (%) అత్యల్పం
జనాభా
 -  2016 అంచనా 22,565,986 (59వ)
 -  2014 జన గణన 5,646,166 
 -  జన సాంద్రత 18 /కి.మీ² (199వది)
43 /చ.మై
జీడీపీ (PPP) 2016 అంచనా
 -  మొత్తం $194.055 బిలియన్ (64వది)
 -  తలసరి $7,501 (91వది)
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) 0.532 (low) (149వది)
కరెన్సీ క్వాంజా (AOA)
కాలాంశం ప.ఆ.స (UTC+1)
 -  వేసవి (DST) పాటించరు (UTC+1)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .ao
కాలింగ్ కోడ్ +244
1 మాట్లాడే ఇతర భాషలు: ఉబుందు, కింబుందు, చోక్వే, కికోంగో

అంగోలా ఆఫ్రికా ఖండం నైరుతి భాగంలో పోర్చుగీసు వారి వలస దేశము. దీనికి ఉత్తరమున బెల్జియం, కాంగో, తూర్పున ఉత్తర రొడీషియా, పశ్చిమాన అట్లాంటిక్ మహా సముద్రాలు ఎల్లలుగా ఉన్నాయి. దీని సముద్ర తీరం పొడవు 920 మైళ్ళు. మొత్తం వైశాల్యం 4,80,000 చదరపు మైళ్ళు. ఈ సముద్రపు తీరం ఎక్కువగా చదునుగా ఉంది. అక్కడక్కడ ఎర్ర ఇసుక రాతితో కూడిన గుట్టలు, ఎత్తైన కొండలు ఉన్నాయి.

పేలియోలిథిక్ ఎరా నుంచి అంగోలా భూభాగంలో మనుషులు నివసించి ఉన్నా, ఆధునిక అంగోలా పోర్చుగీస్ వలసరాజ్యం వలన ఏర్పడింది. అది మెదలు అయినా, శతాబ్దాలు పాటు తీర ప్రాంతాలకే పరిమితమయిపోయింది. వాణిజ్య కేంద్రాలు 16వ శతాబ్దం నుంచి స్థాపించబడ్డాయి. 19వ శతాబ్దంలో ఐరోపా నుంచి వచ్చిన వారు ఆ దేశ లోపల భాగాలలో స్థిరపడ్డారు. పోర్చుగీస్ ఉపనివేశములో ఉండగా అంగోలా తన ప్రస్తుత సరిహద్దులు కలిగి లేదు. ప్రస్తుత సరిహద్దులు 20వ శతాబ్దంలో కుయామాటో, క్వన్యమా, బుండా వంటి గుంపుల ఆటంకాలు తర్వాతే ఏర్పడ్డాయి. స్వాతంత్ర్యం 1975 లో అంగోలా స్వాతంత్ర్య ఉద్యమం తర్వాత వచ్చింది. అదే సంవత్సరం నుంచి 2002 వరకు అంగోలా ఒక పౌర యుద్ధంలో ఉంది. అప్పటి నుంచి అది ఒక అధ్యక్షతరహా గణతంత్రంగా స్థిరపడింది.

అంగోలాకు విస్తారమైన ఖనిజ మరియు పెట్రొలియం నిల్వలు ఉన్నాయి. పౌర యద్ధం తర్వాత అంగోలా ఆర్థిక వ్యవస్థ ప్రపంచం లోనే అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న వాటిల్లో ఒకటి. అది అలా ఉన్నప్పటికీ ఎక్కువ మంది జనాభాకి సగటు జీవన ప్రమాణము చాలా తక్కువగా ఉంది. అంగోలా జనాభా ఆయుర్దాయం మరియు శిశు మరణాలు ప్రపంచం లోనే అతి హీనమైనవి. అంగోలా ఆర్థిక అభివృద్ధి కూడా చాలా అసమానం, ముఖ్యంగా దేశ సంపద అంతా చిన్న జనాభా భాగంలో కేంద్రీకృతమై ఉంది.

అంగోలా ఐక్యరాజ్య సమితి, ఒపెక్, ఆఫ్రికన్ యూనియన్, కమ్మ్యూనిటీ ఆఫ్ పోర్చుగీస్ లాంగ్వేజ్ దేశాలు, లాటిన్ యూనియన్, సదర్న్ ఆఫ్రికన్ డెవెలప్మెంట్ కమ్మ్యూనిటీలో సభ్యుడు. అంగోలాలో ఎన్నో తెగలకు, జాతులకు, సంప్రదాయాలకు చెందిన 24.3 మిలియన్ జనాభా ఉన్నారు. అంగోలా సంస్కృతి శతాబ్దాల పాటు ఉన్న పోర్చుగీస్ పరిపాలనను ప్రతిబింబిస్తుంది, ముఖ్యంగా పోర్చుగీస్ భాష, రోమన్ కాథలిక్కులు మరియు ఎన్నో ఇతర దేశీయ ప్రభావాలు.

శబ్దవ్యుత్పత్తి

అంగోలా అనే పేరు పోర్చుగీస్ వలస నామము ఐన రీనో డి అంగోలా (అంగోలా రాజ్యము) 1571 కే డియాస్ డి నొవాయిస్ సంఘ నిర్మాణ వ్యవహార నిబంధనలలో కనిపిస్తుంది. ఆ స్థలవర్ణన పేరు పోర్చుగీస్ లో డోంగొ రాజుల బిరుదు నామమైన గోలా నుంచి ఉద్భవించింది. డోంగో 16వ శతాబ్దంలో క్వాంజా మరియు లుకాలా నదుల మధ్య పర్వతాలలో రాజ్యం. అది నామ మాత్రంగా కాంగో రాజుకి కప్పము చెల్లించి స్వాతంత్ర్యం కోరుతున్న రాజ్యము.

చరిత్ర

మొదటి వలసలు మరియు రాజకీయ విభాగాలు

డోంగా రాజ్యం మరియు ప్రస్తుత రోజు అంగోలా ఉన్న చిత్రం

ఆ ప్రాంతంలో ఖొయ్ మరియు శాన్ వేటగాళ్ళు మనకు తెలిసిన ప్రథమ ఆధునిక మానవ నివాసులు. వాళ్ళందరూ ఎక్కువగా బంటూ వలసలలో బంటూ గుంపుల వలన భర్తీ చెయ్యబడ్డారు. కానీ ఇంకా చిన్న సంఖ్యలలో దక్షిణ అంగోలాలో మిగిలి ఉన్నారు. బంటూ వాళ్ళు ఉత్తరం నుంచి వచ్చారు, బహుశా ప్రస్తుత రిపబ్లిక్ ఆఫ్ కామెరూన్ కు దగ్గర ఉన్న ప్రాంతం నుంచి.

అదే సమయంలో బంటూ వాళ్ళు ఎన్నో రాజ్యాలను, సామ్రాజ్యాలు ప్రస్తుత రోజు అంగోలాలో చాలా భాగాలలో స్థాపించారు. అందులో అతి ప్రాముఖ్యమైన వాటిల్లో కాంగో రాజ్యం, దాని కేంద్రం ప్రస్తుత అంగోలా దేశానికి వాయువ్యంలో ఉన్నా, ప్రస్తుత రోజు డెమొక్రాటిక్ రిపబ్లిక్, రిపబ్లిక్ ఆఫ్ కాంగోకి దక్షిణాన ఉన్న ప్రాంతాలను కలిగి ఉంది. అది ఇతర వాణిజ్య నగరాలతో, నాగరికతలతో నైరుతి మరియు దక్షిణ ఆఫ్రికా తీరం ఇరు వైపులా మహా జింబాబ్వే ముటాపా సామ్రాజ్యంతో కూడా వర్తక మార్గాలు స్టాపించారు. వాళ్ళు అతి తక్కువ ఆవలి వాణిజ్యం జరిపారు. దాని దక్షిణానికి డోంగో సామ్రాజ్యం ఉంది. అదే తర్వాత పోర్చుగీస్ వలస అయిన డోంగో గా పిలవబడింది.

"https://te.wikipedia.org/w/index.php?title=అంగోలా&oldid=2445449" నుండి వెలికితీశారు