నిండుపున్నమి పండువెన్నెలలో: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
(తేడా లేదు)

15:06, 9 అక్టోబరు 2018 నాటి కూర్పు

ఈ ప్రసిద్ధమైన లలితగీతాన్ని డా. దాశరథి కృష్ణమాచార్య రచించారు. రావు బాలసరస్వతీ దేవి గానం చేసిన ఈ పాట ఆకాశవాణిలో వినిపిస్తూ ఉండేది.

పాట సాహిత్యం

నిండుపున్నమి పండువెన్నెలలో
నిను చేరగా నేనెటుల రాగలనో!

నీలి నీలి ఆకశము నీడ, నే కాలిసవ్వడి లేక రాబోతే..
దొంగ తారలు తొంగి చూచెను! చందమామ దారి కాచెను!

నిండుపున్నమి పండువెన్నెలలో
నిను చేరగా నేనెటుల రాగలనో!

తెల్లతెల్లని బొండుమల్లెలతో తనువెల్ల చల్లగా రాచుకుంటేను!
నల్ల నల్లని గండుతుమ్మెదలు నావెంట పడి గల్లంతు చేసేను!
మనసు నీకై పరుగుతీసెను! నా తనువు నీకై వేచెను రా!

నిండుపున్నమి పండువెన్నెలలో
నిను చేరగా నేనెటుల రాగలనో!