కెప్టెన్ రాజు (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:తెలుగు సినిమా ప్రతినాయకులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి వర్గం:కేరళ ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 43: పంక్తి 43:
[[వర్గం:భారతీయ సినిమా నటులు]]
[[వర్గం:భారతీయ సినిమా నటులు]]
[[వర్గం:తెలుగు సినిమా ప్రతినాయకులు]]
[[వర్గం:తెలుగు సినిమా ప్రతినాయకులు]]
[[వర్గం:కేరళ ప్రముఖులు]]

16:42, 16 అక్టోబరు 2018 నాటి కూర్పు

కెప్టెన్ రాజు
మోడల్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద కెప్టెన్ రాజు
జననం
రాజు డేనియల్

(1950-06-27)1950 జూన్ 27
ఒమల్లూర్, ట్రావెన్స్‌కోర్-కొచ్చిన్, భారతదేశం
మరణం2018 సెప్టెంబరు 17(2018-09-17) (వయసు 68)
కొచ్చి, కేరళ, భారతదేశం
వృత్తిసినిమా నటుడు, సైనికాధికారి

రాజు డేనియల్ (1950 జూన్ 27 - 2018 సెప్టెంబరు 17) సినిమా రంగంలో కెప్టెన్ రాజుగా సుపరిచితుడు. అతను సైనికాధికారి మరియు నటుడు. అతను మలయాళం, హిందీ, తమిళం, తెలుగు, కన్నడం మొదలైన భారతీయ భాషలలో సుమారు 600 సినిమాలలో నటించాడు. అతను కారెక్టర్ పాత్రలు మరియు ప్రతినాయకుని పాత్రలలో నటించాడు. అతను టెలివిజన్ సీరయల్స్ మరియు వ్యాపారప్రకటనలలో కూడా నటించాడు.

జీవిత విశేషాలు

రాజు డేనియల్
రాజభక్తి India
సేవలు/శాఖ Indian Army
సేవా కాలం1971-1976
ర్యాంకు Captain

అతను కేరళలోని పతనమిట్ట జిల్లాకు చెందిన ఒమల్లూర్ లో కె.జి. డేనియల్, అన్నమ్మ దంపతుల ఏడుగురు సంతానంలో రెండవ వానిగా జన్మించాడు. [1] అతనికి ఎలిజిబెత్, సజి, సోఫీ, సుధా అనే సోదరీమణులు మరియు జార్జ్, మోహన్ అనే సోదరులు ఉన్నారు. అతని తల్లిదండ్రులు ఒమల్లూరులోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాద్యాయులుగా పనిచేసేవారు. [2] అతను ప్రాథమిక విద్యను స్థానిక ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలోను, ఒమల్లూరు లోని ఎన్.సి.సి ఆంగ్ల మాధ్యమ పాఠశాలలోనూ పూర్తిచేసాడు. అతను వాలీబాల్ క్రీడాకారుడు.[3] అతను పతనంతిత్త లోణి కాథొలికేట్ కళాశాలలో జంతుశాస్త్రంలో డిగ్రీని చేసాడు.[4] గ్రాడ్యుయేషన్ చేసిన తరువాత తన 21వ యేట భారత సైనిక దళంలో చేరి కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. అతను భారత సైనిక దళంలో ఐదు సంవత్సరములు పూర్తిచేసిన తరువాత ముంబయిలోని లక్ష్మీ స్టార్చ్, గ్లూకోజ్ తయారీ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. తరువాత సినిమా రంగంలో ప్రవేశించాడు.[5] అతను కంపెనీలో ఉద్యోగంలో చేస్తున్నప్పుడు ముంబయిలోని ప్రతిభా థియేటర్ లోని నాటక బృందాలతో కలసి నటించేవాడు. తరువాత సినిమాలలోనికి ప్రవేశించాడు. అతను 1997లో "ఎత ఓరు స్నేహగత" అనే మలయాళ చిత్రంద్వారా సినిమా అరంగేట్రం చేసాడు.

అతను ప్రమీళను వివాహమాడాడు. వారికి ఒక కుమారుడు ఉన్నాడు. [6][7] అతను పుట్టుకతో క్రిస్టియన్ అయినప్పటికీ అన్ని మతాల దేవాలయాలను సందర్శించేవాడు. అతను సెయింట్ జార్జ్ ఆర్థడాక్స్ చర్చి, పలరివట్టంలో క్రియాశీలక సభ్యుడు.

అతను తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో సుమారు 500 చిత్రాల్లో వివిధ పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పించాడు. అందులో మలయాళం చిత్రాలే దాదాపు 450 ఉన్నాయి. ఎక్కువగా ప్రతినాయకుడిగానే కనిపించాడు. రౌడీ అల్లుడు, శత్రువు, మాతో పెట్టుకోకు, కొండపల్లి రాజా, జైలర్‌ గారి అబ్బాయి, గాండీవం, మొండి మొగుడు పెంకి పెళ్లాం చిత్రాలు ఆయనకు పేరు తీసుకొచ్చాయి. రెండు చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు.[8]

మరణం

అతను చివరిదినాలలో డయాబెటిస్ తో బాధపడ్డాడు. కొచ్చిలోని తన నివాసంలో గుండెపోటుతో 2018 సెప్టెంబరు 17న తన 68వ యేట మరణించాడు. అతను అనేక రాష్ట్ర పురస్కారాలను అందుకున్నాడు. [9][10]

మూలాలు

  1. "Omalloorile Onakazhchakal". mangalamvarika.com. Retrieved 9 September 2015.
  2. "Life of Captain 1". mangalamvarika.com. Retrieved 9 September 2015.
  3. "Life of Captain". mangalamvarika.com. Retrieved 9 September 2015.
  4. http://cinidiary.com/people.php?pigsection=Actor&picata=1&no_of_displayed_rows=11&no_of_rows_page=10&sletter=
  5. "സിനിമയിലെ ക്യാപ്റ്റന്‍". webdunia.com.
  6. "മിസ്റ്റര്‍ പവനായി സ്‌പീക്കിങ്‌, Interview – Mathrubhumi Movies" Archived 15 డిసెంబరు 2013 at the Wayback Machine. mathrubhumi.com.
  7. "ചെയര്മാന്റെ പിറന്നാള് സമ്മാനം". mangalamvarika.com. Retrieved 11 October 2015.
  8. "కెప్టెన్‌ ఇకలేరు!".
  9. "Noted Malayalam actor Captain Raju dies". OnManorama. Retrieved 2018-09-17.
  10. https://www.mathrubhumi.com/movies-music/specials/captain-raju/-captain-raju-passess-away-mohanlal-remembering-captain-raju-1.3147518

బయటి లంకెలు