దువ్వూరి సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37: పంక్తి 37:
[[భారతీయ రిజర్వ్ బాంక్]] 22వ <ref name="www.merinews.com"/> గవర్నర్‌గా నియమితుడైన '''దువ్వూరి సుబ్బారావు''' [[ఆగష్టు 11]], [[1949]]న [[పశ్చిమ గోదావరి]] జిల్లా [[ఏలూరు]]లో జన్మించిన చెందిన [[తెలుగు]] వ్యక్తి. [[అమెరికా]]లోని ఓహియో విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎస్.పట్టా పొందిన సుబ్బారావు [[1972]]లో సివిల్ సర్వీసు పరీక్షలో టాపర్‌గా నిలిచాడు. [[నెల్లూరు]] జాయింట్ కలెక్టర్‌గా, [[ఖమ్మం]] జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించాడు. ఆ తరువాత కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖలో జాయింట్ సెక్రటరీగాను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శిగాను పనిచేశాడు. 2004 నుంచి 2008 వరకు ఆర్థిక కార్యదర్శిగా పనిచేసిన తరువాత [[భారతదేశం|భారతదేశపు]] కేంద్రబ్యాంకు అయిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా నియమితుడై, ఆ పదవిలో 2013 సెప్టెంబరు 4 వరకు ఉన్నాడు.
[[భారతీయ రిజర్వ్ బాంక్]] 22వ <ref name="www.merinews.com"/> గవర్నర్‌గా నియమితుడైన '''దువ్వూరి సుబ్బారావు''' [[ఆగష్టు 11]], [[1949]]న [[పశ్చిమ గోదావరి]] జిల్లా [[ఏలూరు]]లో జన్మించిన చెందిన [[తెలుగు]] వ్యక్తి. [[అమెరికా]]లోని ఓహియో విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎస్.పట్టా పొందిన సుబ్బారావు [[1972]]లో సివిల్ సర్వీసు పరీక్షలో టాపర్‌గా నిలిచాడు. [[నెల్లూరు]] జాయింట్ కలెక్టర్‌గా, [[ఖమ్మం]] జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించాడు. ఆ తరువాత కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖలో జాయింట్ సెక్రటరీగాను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శిగాను పనిచేశాడు. 2004 నుంచి 2008 వరకు ఆర్థిక కార్యదర్శిగా పనిచేసిన తరువాత [[భారతదేశం|భారతదేశపు]] కేంద్రబ్యాంకు అయిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా నియమితుడై, ఆ పదవిలో 2013 సెప్టెంబరు 4 వరకు ఉన్నాడు.
==బాల్యం, విద్యాభ్యాసం==
==బాల్యం, విద్యాభ్యాసం==
దువ్వూరి సుబ్బారావు [[పశ్చిమ గోదావరి జిల్లా]] [[ఏలూరు]]<nowiki/>లో 1949 ఆగష్టు 11న పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేసిన తండ్రి మల్లికార్జునరావుకు మూడవ సంతానంగా జన్మించాడు. [[కోరుకొండ సైనిక పాఠశాల]]<nowiki/>లో ఉన్నత పాఠశాల విద్య పూర్తిచేసి బిఎస్సీకై సీఆర్ఆర్ కళాశాలలో ప్రవేశించాడు. అమెరికాలోని ఓహియో విశ్వవిద్యాలయం నుంచి ఆర్థికశాస్త్రంలో ఎంఎస్ పట్టా పొందగా, [[ఆంధ్ర విశ్వవిద్యాలయం|ఆంధ్రా విశ్వవిద్యాలయం]] నుంచి పిహెచ్‌డి పుచ్చుకున్నాడు. [[1972]]లో సివిల్ సర్వీసు పరీక్షలో టాపర్‌గా నిలిచి <ref>[http://economictimes.indiatimes.com/Corporate_Announcement/Finance_Secretary_D_Subbarao_appointed_RBI_Governor/articleshow/3434084.cms http://economictimes.indiatimes.com]</ref><ref>ఈనాడు దినపత్రిక, పేజీ 2, తేది 02-09-2008</ref> ఐఏఎస్ ఆంధ్రా కేడర్ అధికారిగా తొలుత [[నెల్లూరు]] జాయింట్ కలెక్టర్‌గా, ఆ తరువాత ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా పనిచేశాడు.
దువ్వూరి సుబ్బారావు [[పశ్చిమ గోదావరి జిల్లా]] [[ఏలూరు]]<nowiki/>లో 1949 ఆగష్టు 11న పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేసిన తండ్రి మల్లికార్జునరావు తల్లి సీతారామంకు మూడవ సంతానంగా జన్మించాడు. [[కోరుకొండ సైనిక పాఠశాల]]<nowiki/>లో ఉన్నత పాఠశాల విద్య పూర్తిచేసి బిఎస్సీకై సీఆర్ఆర్ కళాశాలలో ప్రవేశించాడు. అమెరికాలోని ఓహియో విశ్వవిద్యాలయం నుంచి ఆర్థికశాస్త్రంలో ఎంఎస్ పట్టా పొందగా, [[ఆంధ్ర విశ్వవిద్యాలయం|ఆంధ్రా విశ్వవిద్యాలయం]] నుంచి పిహెచ్‌డి పుచ్చుకున్నాడు. [[1972]]లో సివిల్ సర్వీసు పరీక్షలో టాపర్‌గా నిలిచి <ref>[http://economictimes.indiatimes.com/Corporate_Announcement/Finance_Secretary_D_Subbarao_appointed_RBI_Governor/articleshow/3434084.cms http://economictimes.indiatimes.com]</ref><ref>ఈనాడు దినపత్రిక, పేజీ 2, తేది 02-09-2008</ref> ఐఏఎస్ ఆంధ్రా కేడర్ అధికారిగా తొలుత [[నెల్లూరు]] జాయింట్ కలెక్టర్‌గా, ఆ తరువాత ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా పనిచేశాడు.


==నిర్వహించిన పదవులు==
==నిర్వహించిన పదవులు==

07:12, 2 జనవరి 2019 నాటి కూర్పు

దువ్వూరి సుబ్బారావు
దువ్వూరి సుబ్బారావు
జననందువ్వూరి సుబ్బారావు
ఆగష్టు 11, 1949
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు
వృత్తిభారతీయ రిజర్వ్ బాంక్ 22వ [1] గవర్నర్‌
ప్రసిద్ధిభారతీయ రిజర్వ్ బాంక్ 22వ [1] గవర్నర్‌
పదవి పేరురిజర్వ్ బ్యాంకు గవర్నర్
ముందు వారువై.వేణుగోపాలరెడ్డి
భార్య / భర్తఊర్మిళ
పిల్లలుమల్లిక్, రాఘవ

భారతీయ రిజర్వ్ బాంక్ 22వ [1] గవర్నర్‌గా నియమితుడైన దువ్వూరి సుబ్బారావు ఆగష్టు 11, 1949న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జన్మించిన చెందిన తెలుగు వ్యక్తి. అమెరికాలోని ఓహియో విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎస్.పట్టా పొందిన సుబ్బారావు 1972లో సివిల్ సర్వీసు పరీక్షలో టాపర్‌గా నిలిచాడు. నెల్లూరు జాయింట్ కలెక్టర్‌గా, ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించాడు. ఆ తరువాత కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖలో జాయింట్ సెక్రటరీగాను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శిగాను పనిచేశాడు. 2004 నుంచి 2008 వరకు ఆర్థిక కార్యదర్శిగా పనిచేసిన తరువాత భారతదేశపు కేంద్రబ్యాంకు అయిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా నియమితుడై, ఆ పదవిలో 2013 సెప్టెంబరు 4 వరకు ఉన్నాడు.

బాల్యం, విద్యాభ్యాసం

దువ్వూరి సుబ్బారావు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో 1949 ఆగష్టు 11న పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేసిన తండ్రి మల్లికార్జునరావు తల్లి సీతారామంకు మూడవ సంతానంగా జన్మించాడు. కోరుకొండ సైనిక పాఠశాలలో ఉన్నత పాఠశాల విద్య పూర్తిచేసి బిఎస్సీకై సీఆర్ఆర్ కళాశాలలో ప్రవేశించాడు. అమెరికాలోని ఓహియో విశ్వవిద్యాలయం నుంచి ఆర్థికశాస్త్రంలో ఎంఎస్ పట్టా పొందగా, ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్‌డి పుచ్చుకున్నాడు. 1972లో సివిల్ సర్వీసు పరీక్షలో టాపర్‌గా నిలిచి [2][3] ఐఏఎస్ ఆంధ్రా కేడర్ అధికారిగా తొలుత నెల్లూరు జాయింట్ కలెక్టర్‌గా, ఆ తరువాత ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా పనిచేశాడు.

నిర్వహించిన పదవులు

  • 1988-93 : కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖలో జాయింట్ సెక్రెటరీగా
  • 1993-98 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శిగా
  • 1998-04: ప్రపంచ బ్యాంకు తరఫున ఆఫ్రికా తదితర దేశాలలో ఆర్థిక అద్యయనం
  • 2004-08 : కేంద్ర ఆర్థిక కార్యదర్శిగా
  • 2008 - 09|04 : రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా

అవీ ఇవీ

  • అత్యధిక జ్ఞాపకశక్తి ఉన్న వారితో ఏర్పాటైన ఒక అంతర్జాతీయ సంఘంలో ఇతడు సభ్యుడు.[4]
  • ఆర్థిక కార్యదర్శి స్థాయి నుంచి నేరుగా రిజర్వ్ బ్యాంకు గవర్నర్‌గా నియమితుడైన తొలి వ్యక్తి [5]
  • ఇది వరకు రిజర్వ్ బ్యాంకు గవర్నర్‌గా పనిచేసిన వై.వేణుగోపాలరెడ్డి కూడా తెలుగు వ్యక్తే.[6]

మూలాలు

  1. 1.0 1.1 1.2 www.merinews.com
  2. http://economictimes.indiatimes.com
  3. ఈనాడు దినపత్రిక, పేజీ 2, తేది 02-09-2008
  4. ఈనాడు దినపత్రిక, తేది 02-09-2008
  5. సాక్షి దినపత్రిక, పేజీ 2, తేది 02.09.2008
  6. యాహు తెలుగు