వాడుకరి చర్చ:K.Venkataramana: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 239: పంక్తి 239:


మీరు మీకు ఇష్టం వచ్చినట్టు వికీపీడియాలో పెడితే సహించేది లేదు తెలియకపోతే తెలుసుకోండి కులాల గురించి అంతేకాని ఏవో అర్ద రహితం గా మార్పులు చేస్తే ఉరుకొము. నా పేరు రావులకోల్లు వెంకట్ పండిత్ నేను ఒక రీసెర్చ్ స్కాలర్ ని మరియు ధన్వంతరి పరివార్, ధన్వంతరి పరివార్ వెల్ఫేర్ గ్రూపుల స్థాపకుడిని. ఎటువంటి సందేహాలు ఉన్న నేను చెప్పగలను అంతేగాని మీకు ఇష్టం వచ్చినట్టు వికీపీడియాలో పెడితే ఉరుకొము [[వాడుకరి:Nayeevaidya|Nayeevaidya]] ([[వాడుకరి చర్చ:Nayeevaidya|చర్చ]]) 03:51, 10 ఫిబ్రవరి 2019 (UTC)
మీరు మీకు ఇష్టం వచ్చినట్టు వికీపీడియాలో పెడితే సహించేది లేదు తెలియకపోతే తెలుసుకోండి కులాల గురించి అంతేకాని ఏవో అర్ద రహితం గా మార్పులు చేస్తే ఉరుకొము. నా పేరు రావులకోల్లు వెంకట్ పండిత్ నేను ఒక రీసెర్చ్ స్కాలర్ ని మరియు ధన్వంతరి పరివార్, ధన్వంతరి పరివార్ వెల్ఫేర్ గ్రూపుల స్థాపకుడిని. ఎటువంటి సందేహాలు ఉన్న నేను చెప్పగలను అంతేగాని మీకు ఇష్టం వచ్చినట్టు వికీపీడియాలో పెడితే ఉరుకొము [[వాడుకరి:Nayeevaidya|Nayeevaidya]] ([[వాడుకరి చర్చ:Nayeevaidya|చర్చ]]) 03:51, 10 ఫిబ్రవరి 2019 (UTC)

ఇది నా ధన్వంతరి పరివార్ సోషల్ మీడియా గ్రూపులు నన్ను సంప్రదించాలి అంటే ఇలా సంప్రదించవచ్చు.
https://m.facebook.com/groups/1910891595794613?ref=bookmarks [[వాడుకరి:Nayeevaidya|Nayeevaidya]] ([[వాడుకరి చర్చ:Nayeevaidya|చర్చ]]) 04:06, 10 ఫిబ్రవరి 2019 (UTC)

04:06, 10 ఫిబ్రవరి 2019 నాటి కూర్పు

ఇది నా చర్చా పేజి. మీ సందేహాన్ని "ఇక్కడ".తెలియజేయండి.


శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం

వెంకటరమణ గారూ నమస్కారము. పై వ్యాసం పై మీరు వెలిబుచ్చిన అభిప్రాయంనకు,అమూల్యమైన సూచనలకు ధన్వవాదములు.వ్యాసంనకు లంకెలు చేర్చాను.మీ సలహాలు మాలాంటి కొత్త వాడుకరులకు మార్గదర్శకాలు అని నా అభిప్రాయం. మళ్లీ కలుద్దాం.--యర్రా (చర్చ) 13:08, 26 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

నాయెక్క వ్యాసాన్ని తిరిగి రాసినందుకు

నాయెక్క వ్యాసాన్ని తిరిగి రాసినందుకు. ధన్యవాదాలు kvr.lohith గారు. ఇందులో ఉండవలసిన ఉపశీర్షికల గురించి సహాయం కావాలి చేస్తారా.? Bahulyapentakoti (చర్చ) 17:41, 12 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

Bahulyapentakoti గారూ, మీరు ఏ వ్యాసాన్ని గూర్చి సహాయం అడుగుతున్నారు? వ్యాస నిర్మాణానికై మీకు ఏ విధమైన సహాయం కావాలన్నా సహాయం చేస్తాను.----కె.వెంకటరమణచర్చ 00:56, 13 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
మీరు సహాయం చేస్తాను అన్నారు కాని సంతోషి మాతా ఆలయం గురించి వ్యాసం లో రాసిన వ్యాసం చదివి ఇంకా మార్పులను చెప్పండి. Bahulyapentakoti (చర్చ) 14:20, 13 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
Bahulyapentakoti గారూ, మీరు వ్రాసిన సంతోషిమాత ఆలయం వ్యాసంలో సరియైన మూలాలు లేవు. మూరు చేర్చిన సాక్షి పత్రిక ఆర్టికల్ ఆ ఆలయ ఉనికి మరియు ఉత్సవాలు గూర్చి తెలియజేస్తుంది. ఆలయం విశేషాలు, చరిత్ర గూర్చి మీరు వ్రాసిన వాక్యాలకు సరైన మూలాలు లభ్యమగుటలేదు. మూలాలు లేని వాక్యాలు తొలగించబడతాయి. మీరు చేర్చిన వాక్యాలను నిర్థారణ చేసేందుకు సరైన మూలాలను చేర్చండి.----కె.వెంకటరమణచర్చ 14:34, 13 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

సిలికాన్ వ్యాలి

సిలికాన్ వ్యాలి పేజిని మార్చాను. దయచేసి తొలిగించే ముందర ఇంకొక సారి చూడండి. మీకు కావాల్సినట్టుగా నేను మూలలు మరియు సమాచారాన్ని జోడించాను. తొలగించడం కన్నా, పేజిని మీకు నచ్చినట్టుగా మార్చండి. చదివినందుకు ధన్యవాదములు. --TheAwesome21

మీకొక పతకం!

నిరంతర నిర్వహణ కృషికి పతకం
Kvr.lohith గారూ! తెలుగు వికీపీడియాలో నిర్వహణ బాధ్యతలను గత ఎన్నో సంవత్సరాల్లాగానే 2017 గ్రెగేరియన్ సంత్సరంలో కూడా భుజాన వేసుకుని, మొదటి పేజీ నిర్వహణ నుంచి వ్యాసాల నాణ్యత పరిశీలన వరకూ ప్రతీ అంశంలోనూ నిరంతర కృషి చేస్తున్నందుకు మీకు ఒక పతకం. మీ కృషే ఈ పతకానికి వన్నె తీసుకువస్తుందని భావిస్తున్నాను. అందుకోండి పవన్ సంతోష్ (చర్చ) 06:48, 3 జనవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
పతకాన్నందించిన పవన్ సంతోష్ గారికి గారికి ధన్యవాదాలు.--కె.వెంకటరమణచర్చ 02:16, 4 జనవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

పై వ్యాసం సవరణకు మీరు వెలిబుచ్చిన అభిప్రాయంనకు,అమూల్యమైన సూచనలకు ధన్వవాదములు kvr.lohith గారు.వికీపీడియా పాలసీ హక్కుల ప్రకారం భావించే ఉచితంకాని కాపీ హక్కుల కలిగిన భాగాలను నాకు తెలిసినంతవరకు తొలగించి, సరైన ఉచిత అంశాలను పొందపర్చి, అదనంగా వ్యాసంనకు ముఖ్యమైన మూలాలు,వెలుపలి లింకులు కూర్పు చేసి సవరించాను.దయచేసి తొలిగించాటానికి నిర్ణయం చేసే ముందర ఇంకొక సారి చూడండి. ఇంకా ఎమైనా సవరించాల్సి ఉంటే మీరు శ్రమ అనుకోకుండా సవరించగలరని ఆశిస్తున్నాను. కొత్త వికీపీడియా వాడుకరిగా మేము తెలిసీ తెలియక చేసే తప్పులను గ్రహించి వెంటనే మీరు సవరించు చున్నందుకు మరియెక సారి ధన్యవాదాలు.-- యర్రా రామారావు (చర్చ) 04:57, 7 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

kvr.lohith గారు వ్యాసంలో తగిన మార్పులు చేసి సవరించినందుకు ధన్యవాదములు. --యర్రా రామారావు (చర్చ) 07:54, 10 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

I have chalam books. So I have added stories list. How can I get sources for that? Should I publish it somewhere on the web and link it here?--09:20, 25 ఫిబ్రవరి 2018‎ ChillarAnand (చర్చ | రచనలు | నిరోధించు)

ChillarAnand గారూ, మీ వద్ద ఉన్న పుస్తకం నోటబిలిటీ ఉన్నదైనా దానియొక్క మూలాలను వికీ వ్యాసాలలో చేర్చాలి. వికీపీడియాలో స్వంత అభిప్రాయాలను, వాక్యాలను రాయరాదు. మనం చేర్చే ప్రతీ అంశానికీ సరైన మూలాలు అందించాలి. మూలాలు లేని వాక్యాలు తరువాతి కాలంలో తొలగించబడతాయి. ఆ పుస్తకం గూర్చి వివిధ వెబ్‌సైట్లలో ఉన్న పుస్తక పరిచయాలు, వివిధ రచయితలు చెప్పిన వ్యాఖ్యలు మూలాలుగా చేర్చాలి. వివిధ పత్రికలలో ఆ పుస్తకం గూర్చి జరిగిన చర్చలు, విశ్లేషణలు, పుస్తక పరిచయాలు, పుస్తక సమీక్షలు, సాహిత్య విమర్శ రచనలను కూడా మూలాలుగా చేర్చవచ్చు. నేను కొన్ని మూలాలను ఆ వ్యాసంలో చేర్చాను. పరిశీలించండి.--కె.వెంకటరమణచర్చ 13:08, 25 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

14వ వారానికి "ఈవారం వ్యాసం"గా ప్రత్యేక హోదాని పరిశీలన కోసం

నమస్తే,
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోనూ, ఆమాటకి వస్తే దేశ వ్యాప్తంగానూ, ప్రత్యేక హోదా గురించి చర్చలు, ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ ప్రత్యేక హోదా అంటే ఏమిటి అన్న కుతూహలం వస్తుందనీ, పాక్షిక సమాచార మూలాల నుంచి కాకుండా వికీపీడియా నుంచి తెలుసుకోవాలని జనం ఆశిస్తారని అంచనా వేసి ప్రత్యేక హోదా వ్యాసాన్ని సృష్టించి అభివృద్ధి చేశాను. ఈ అంశంపై వ్యక్తిగత అభిరుచి కాకుండా తెలుగు వికీపీడియా వ్యాప్తికీ, పాఠకాదరణకు ఉపకరిస్తుందనే ఈ వ్యాస రచన చేశాను. ఈ నేపథ్యంలోనే దానిని ఈవారం వ్యాసంగా ప్రతిపాదించాను. 14వ వారానికి ఈవారం వ్యాసం స్థలం ఖాళీగా ఉండడాన దయచేసి దీనిని పరిశీలించి, పరిగణనలోకి తీసుకొమ్మని మనవి. --పవన్ సంతోష్ (చర్చ) 04:21, 22 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి చర్చలు, ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో అందరికీ "ప్రత్యేక హోదా" అంటే ఏమిటో తెలియజేయడానికి ఈ వ్యాసం ఉపయోగపడుతుందనే మీ సూచనతో ఏకీభవిస్తూ 2018,14వ వారం లో ఈ వారపు వ్యాసంగా ప్రచురించడం జరిగినది.--కె.వెంకటరమణచర్చ 12:50, 22 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

Share your experience and feedback
as a Wikimedian in this global survey

WMF Surveys, 18:19, 29 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టు టైగర్ - కొన్ని శుద్ధి సూచనలు

వెంకటరమణ గారూ! నమస్తే. ప్రాజెక్టు టైగర్ పోటీలో భాగంగా పాఠకాదరణ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న వ్యాసాల జాబితా నుంచి చక్కని అంశాలను ఎంచుకుని వ్యాసాలు సృష్టిస్తున్నందుకు అభినందనలు. మరీ ముఖ్యంగా రసాయన పదార్ధాల వ్యాసాలు తెలుగు వికీపీడియాకు విద్యా సమాచారం జ్యూరీ సభ్యులు ఇద్దరి చర్చల్లో భాగంగా వ్యాసాల్లో నాణ్యతను పరిశీలించి చక్కని నాణ్యమైన వ్యాసాల రూపకల్పన ప్రోత్సహించేలా పోటీ నిబంధనలు ఉండాలన్న లక్ష్యంతో వ్యాసాల అభివృద్ధిని సూచిస్తూ శుద్ధి మూసలు, తదనుగుణమైన చర్చ పేజీలో సూచనలు చేస్తున్నాం. దయచేసి రంగస్థలం (సినిమా), గ్లూకోస్, కె.కె.సెంథిల్ కుమార్ వ్యాసాలు, చర్చపేజీలు గమనించి మార్పులు చేయగలరు. వికీపీడియాలో కృషి అంతా సమిష్టి కృషి కాబట్టి మేం కూడా మార్పులు చేర్పులు చేస్తూండవచ్చన్నది తెలిసినా, ఇది పోటీ కాబట్టి సూచనలు అందిస్తూ వ్యాసకర్తలను/అభివృద్ధి చేస్తున్నవారిని ప్రోత్సహించాలని ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ ఈ సూచనలు ప్రస్తుత వికీపీడియా విధానాలకు అనుగుణం కావని భావించిన పక్షంలో సంబంధిత విధానాన్ని చర్చ పేజీలోనే ప్రస్తావిస్తూ,మూస తొలగించగలరు. సముచితమని భావిస్తే శుద్ధికి అవసరమైన కొద్ది మార్పుచేర్పులు చేసి మూస మీరే తొలగించగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 07:11, 30 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

మార్పుచేర్పు ఆధారంగా గ్లూకోస్ వ్యాసంలో శుద్ధి మూస తీసేశాను. --పవన్ సంతోష్ (చర్చ) 07:19, 30 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టు టైగర్‌లో కొత్త అంశాల కోసం

ప్రాజెక్టు టైగర్‌లో కొత్త అంశాలు ఉంటే రాయడానికి ప్రోత్సాహకరంగా ఉంటుందని సభ్యులు భావించినందున వికీపీడియా_చర్చ:వికీప్రాజెక్టు/ప్రాజెక్టు_టైగర్_రచనా_పోటీ/అంశాలు పేజీలోని "ప్రాజెక్టు టైగర్ రచనా పోటీకి కొత్త అంశాలకై ప్రతిపాదన" అన్న దగ్గర వ్యక్తిగతంగా అభిరుచి ఉన్న అంశాలు, సముదాయ కృషికి సంబంధించిన అంశాలు అన్న రెండు ఉప విభాగాల కింద ప్రతిపాదనలు చేస్తే చర్చించేందుకు వీలుగా ఉంటుందనుకుంటున్నాం. దయచేసి మీకు పేజీలోని సంబంధిత విభాగం పరిశీలించి మీ ప్రతిపాదనలు అక్కడ చర్చకుపెట్టండి. సమిష్టిగా కొన్ని అంశాలు కోరుతూ ప్రతిపాదనలు చేస్తే జాతీయ స్థాయిలో సమన్వయం చేస్తున్నవారికి మన ఉద్దేశాలు, అభిప్రాయాలు ఈ అంశాల విషయంలో బలంగా తెలియజేయవచ్చన్న ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నం ఇది. ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 05:15, 3 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

Reminder: Share your feedback in this Wikimedia survey

WMF Surveys, 01:17, 13 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

"గణితం" వ్యాసం యొక్క "మీ యాంత్రిక అనువాదము" భావన గురించి

నమస్కారము లోహిత్ గారు,

శాస్త్రీయ లేక వైజ్ఞానిక వ్యాసాలలో కొంత భాగము యాంత్రికము గానే తొచవచును. ఆంగ్ల పదాల వాడుక చాలా తెలిక. అలా కాక నేను మొత్తము తెలుగులోనే రాయుచున్నాను. మన వాడుక భాషలో చాలా వరకు ఆంగ్లము ఉండే సరికి మన భాషని సుద్ధ పరిమాణము కష్టముగా తోచవచు. ఉదాహరణకి మీ రంగస్థలం వ్యాసములో, రాం చరణ్ చాలెంజింగ్ రోల్ అనే బదులు రాం చరణ్ యొక్క పాత్ర ఆయన ఇన్ని సంవత్సరాల వృత్తికే సవాలు అని రాయవచ్చు. ఆంగ్ల పదాలు వాడెదే ఐతే తెలుగులో అసలు వికీ రాయల్సిన అవసరము లెదు కదా లోహిత్ గారు. ఐనప్పట్టికీ మీ సలహా మేరకు నేను కొన్ని భాగాలు మార్చాను. మీరు వ్యాసము పైన పెట్టిన నినాదము గురించి పునరాలోచన చేస్తారు అని ఆశిస్తూ. --మీ శ్రీకాంత్ 13:50, 18 ఏప్రిల్ 2018.

మీ శ్రీకాంత్ గారూ, మీరు గణిత శాస్త్ర వ్యాసాలను వ్రాయ సంకల్పించినందులకు ధన్యవాదాలు. మీరు ఆంగ్ల వాక్యాలను గూగుల్ అనువాద పరికరం ద్వారా అనువాదం చేస్తున్నట్లుంది. అందువలన వాక్య నిర్మాణం సరిగా లేదు. గణితము వ్యాసం చదివేవారికి అర్థమయ్యే రీతిలో సులభమైన భాషలో రాస్తే బాగుంటుంది. ఆ వ్యాసంలో అక్షర దోషాలు కూడా ఉన్నాయి. గూగుల్ అనువాదం సరిగా ఉండదు. కనుక మనం వాక్యాలను శుద్ధి చేయవలసి ఉంటుంది. గణితంలో కొన్ని పదాలకు సరైన తెలుగు పదాలుంటాయి. వాటిని ఉపయొగించవచ్చును. లేని వాటికి ఆంగ్ల పదాలను వాడవచ్చును. భౌతిక శాస్త్రంలో ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాను వంటి అనేక పదాలకు సరైన తెలుగు పదాలు సృష్టింపబడలేదు. వాటిని అలాగే రాస్తే చదువరులకు అర్థం అవుతుంది. కనుక ఆంగ్ల పదాలను ఉపయోగించవద్దని నేననలేదు. వాక్య నిర్మాణం అర్థమయ్యే రీతిలో ఉండే విధంగా అనువాదం చేయమని నా సలహా. మీరు చేర్చిన వ్యాస భాగాలు అర్థమయ్యే రీతిలో అనువాదం జరిగిన తరువాత ఆ మూసను తొలగిస్తాను.ధన్యవాదాలు.--కె.వెంకటరమణచర్చ 14:04, 18 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

Your feedback matters: Final reminder to take the global Wikimedia survey

WMF Surveys, 00:27, 20 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

చీర్కపల్లి (రేవల్లి) గ్రామం పేజి తొలగింపు గురించి

నమస్తే,

చీర్కపల్లి (రేవళ్లి) గ్రామ వ్యాసం పేజి తొలగించబడింది.ఈ గ్రామం లోగడ మహబూబ్ నగర్ జిల్లా, గోపాలపేట మండలానికి చెందింది. జిల్లాలు,మండలాలు పునర్వవ్వస్థీకరణలో భాగంగా వనపర్తి జిల్లాలో కొత్తగా ఏర్పడిన రేవల్లి మండల పరిధిలో చేరింది.(GO Ms.No.242 Dt.11.10.2016) మండలంలోని గ్రామాలు లంకె లోగడ చెరుకుపల్లి (గోపాలపేట) గ్రామ వ్యాసం పేజికి కలపబడింది.వాస్తవంగా ఈ గ్రామాన్ని తొలగించాలి. చీర్కపల్లి గ్రామ జనగణన డేటా ఎక్కించుటకు పునరుద్దరించగలరు--యర్రా రామారావు (చర్చ) 04:30, 29 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

యర్రా రామారావు గారూ, చీర్కపల్లి వ్యాసం చెరుకుపల్లి (గోపాలపేట మండలం) కు దారిమార్పు చెందింది. దారిమార్పు తొలగించాను. చీర్కపల్లి వ్యాసాన్ని అభివృద్ధి చేయండి.--కె.వెంకటరమణచర్చ 05:23, 29 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టు టైగర్ వ్యాసాల అభివృద్ధి

వెంకటరమణ గారూ ప్రాజెక్టు టైగర్ ఏప్రిల్ నెల పోటీకి గాను మీరు సమర్పించిన వ్యాసాల్లో ఈ మూడు వ్యాసాల్లో సూచించిన మార్పులు చేస్తే అంగీకరించవచ్చు. ఈ వ్యాసాల్లో కొద్ది మేరకే సమస్యలు ఉన్నందున ఇలా రాస్తున్నాను.

  1. మరకతము: ఈ వ్యాసంలో సమాచారపెట్టె ఆంగ్లంలో ఉంది. పరామితులు కాకున్నా కనీసం విలువ వరకూ అయినా తెలుగులోకి అనువదించగలరు.
  2. నగ్మా: ఆమె నటించిన తెలుగు సినిమాల జాబితా తప్ప ఏమీ లేని ఈ ముఖ్యమైన వ్యాసాన్ని విస్తరించి చాలాచక్కని కృషి చేశారు. ఐతే కాస్త ఎక్కువగానే అక్షరదోషాలు ఉన్నాయి. సరిదిద్ది, copy-edit మూస తీసేయగలరు.
  3. మణిశంకర్: వ్యాసం చర్చ పేజీలో చేసిన సూచనలు చూడండి. తదనుగుణంగా అభివృద్ధి చేయండి. స్వీకరించవచ్చు.

ఈ మూడు వ్యాసాలు మీరు అభివృద్ధి చేస్తే ఏప్రిల్ నెలకు మీ స్కోరు 8 అవుతుంది, అలా కాక ఆ మూడు ఆమోదం పొందని పక్షంలో 5 పాయింట్లతో మొదటి స్థానం టై అయివుంది. గమనించగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 10:39, 30 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్ గారూ శుద్ధి చేసాను పరిశీలించగలరు.--కె.వెంకటరమణచర్చ 11:53, 30 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]
కె.వెంకటరమణ గారూ, మరకతం, నగ్మా వ్యాసాలను ప్రాజెక్టు టైగర్ పోటీకి ఆమోదించాను. మణిశంకర్ వ్యాసం విషయంలో మాత్రం ఇప్పటికే జ్యూరీ సభ్యులం ఇద్దరమూ తిరస్కరించి ఉండడంతో, మీరు తిరిగి సమర్పించడానికి వీలుగా తిరస్కరించాను. వ్యాసాన్ని మీరు శుద్ధిచేసినందున దయచేసి తిరిగి సమర్పించండి. --పవన్ సంతోష్ (చర్చ) 12:42, 30 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

Thank you for keeping Wikipedia thriving in India

I wanted to drop in to express my gratitude for your participation in this important contest to increase articles in Indian languages. It’s been a joyful experience for me to see so many of you join this initiative. I’m writing to make it clear why it’s so important for us to succeed.

Almost one out of every five people on the planet lives in India. But there is a huge gap in coverage of Wikipedia articles in important languages across India.

This contest is a chance to show how serious we are about expanding access to knowledge across India, and the world. If we succeed at this, it will open doors for us to ensure that Wikipedia in India stays strong for years to come. I’m grateful for what you’re doing, and urge you to continue translating and writing missing articles.

Your efforts can change the future of Wikipedia in India.

You can find a list of articles to work on that are missing from Wikipedia right here:

https://meta.wikimedia.org/wiki/Supporting_Indian_Language_Wikipedias_Program/Contest/Topics

Thank you, — Jimmy Wales, Wikipedia Founder 18:18, 1 మే 2018 (UTC)

ప్రాజెక్టు టైగర్‌లో కొత్త వ్యాసాలొచ్చాయి!

వెంకటరమణ గారూ! నమస్తే. ప్రాజెక్టు టైగర్ రచనా పోటీలోకి కొత్త వ్యాసాలు వచ్చిచేరాయి. అవి కూడా మన సముదాయ సభ్యులు కోరుకోగా, జ్యూరీ పలు ప్రాతిపదికలు ఏర్పరుచుకుని రూపొందించినవి.
స్థానిక ప్రాధాన్యత కల అంశాల జాబితాలో మహిళల గురించి వ్యాసాలు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ప్రఖ్యాతులైన మహిళలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రసిద్ధులైన కొందరు మహిళలు, తిరుమల-తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన అంశాలు, సింధులోయ నాగరికత విశేషాలు, ప్రాచీన-మధ్యయుగ భారతీయ సామ్రాజ్యాలు, జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు చిత్రాలుగా ఎంపికైన సినిమాలు, ఆస్కార్ నామినేషన్ పొందిన, ప్రపంచ వేదికలపై సత్తాచాటిన భారతీయ చలనచిత్రాలు, భారత సైనిక దళాలు, క్షిపణులు, భారతదేశం-విదేశీ సంబంధాలు, సంస్కృత-తెలుగు సాహిత్య రచనలు, రచయితలు, భారతీయ రైల్వేలు, వంటకాలు వంటివి వీటిలో కొన్ని. ఇక జాతీయ ప్రాధాన్యత కల అంశాలలో రసాయన మూలకాలు, లోహాలు, ఖనిజాలు వగైరా విజ్ఞాన శాస్త్ర అంశాలు, అన్ని దేశాలు, అన్ని నదులు, యుద్ధాలు-పోరాటాలు వంటి భౌగోళిక, చారిత్రక అంశాలు, భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు, అన్ని అధికారిక భాషలు, జాతీయ ప్రాధాన్యత కల సంస్థలు, ప్రధానులు, రాష్ట్రపతులు, జ్ఞానపీఠ్, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలు, అనేక సంస్థలు, విమానాశ్రయాలు, జాతీయ రహదారులు, డ్యాములు, వగైరా ఎన్నో భారతదేశ వ్యాప్తంగా ముఖ్యమైన అంశాలూ ఉన్నాయి. ఇక అంతర్జాతీయ స్థాయిలో అన్ని వికీపీడియాల్లోనూ ఉండవలసిన పదివేల వ్యాసాల జాబితా భౌగోళికం నుంచి మతం వరకూ, వ్యక్తుల నుంచి విజ్ఞాన శాస్త్రాల వరకూ అనేక విభాగాలతో పదివేల వ్యాసాలతో ఉండనే ఉంది.
ఇవి మీ ఆసక్తులకు సరిపడే అంశాలు కలిగివున్నాయని ఆశిస్తున్నాం. దయచేసి ఈ జాబితాల్లోంచి మీకు నచ్చిన వ్యాసాలను ఎంపికచేసుకుని అభివృద్ధి చేయండి. --పవన్ సంతోష్ (చర్చ) 04:40, 7 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

అభివాదములు

వెంకటరమణ గారూ! నమస్కారము. మీరు నా పేజీని శుద్ధి చేయటం చూసి, చాలా సంతోషిస్తున్నాను. నా వాడుకరి పేజీని సరిచేసుకోవటం నాకు చేతకాదు. చాలాకాలం నుండి అస్తవ్యస్తంగా ఉన్నది. ఈ సందర్భముగా, మీరు దయచేసి నా వాడుకరి పేజీని సరిచేయగలరని అభ్యర్ధిస్తున్నాను. మీకు వినమ్రపూర్వక సవినయముగా అభివందనములు తెలియజేసుకుంటున్నాను. JVRKPRASAD (చర్చ) 02:32, 26 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

JVRKPRASAD గారూ, వాడుకరి పేజీలో అస్తవ్యస్తంగా ఉన్న అంశాలను, పెట్టెలను సరిచేసితిని.--కె.వెంకటరమణచర్చ 06:28, 26 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]
వెంకటరమణ గారు, మీరు నాయందు అభిమానముతో అడిగిన తడవుగా నాకు మీరు చేసిన సహాయ సహకారములకు మిక్కిలి కృతజ్ఞుడను. మీకు విధేయతతో కూడిన అభివాదములతో ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. రమణ గారు, చాలా సంతోషమండి. 06:48, 26 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

మొన్కొంబు సాంబశివన్ స్వామినాథన్ పేజీలో

వెంకటరమణ గారూ, మొన్కొంబు సాంబశివన్ స్వామినాథన్ పేజీలోమొదటి పేరాలోని "స్వాతంత్ర్యానంతరం భారతదేశం ప్రజల అవసరాలకు సరిపడినంత ఆహారధాన్యాలను ఉత్పత్తి చేయలేని పరిస్థితుల్లో ఉంది. ఆకాలంలో నోబెల్ బహుమతి గ్రహీత నార్మన్ బోర్లాగ్ సృష్టించిన మెక్సికన్ పొట్టి గోధుమ రకాలను మనదేశంలోకి ప్రవేశపెట్టారు. వీని ప్రభావంతో పరిశోధనలు సాగించి అధిక దిగుబడినిచ్చే గోధుమ రకాలను రూపొందించారు. దీని వలన గోధుమ ఉత్పత్తి పెరిగింది." అనే పాఠ్యం మిగతా పాఠ్యంతో ఇమడటం లేదు. పరిశీలించగలరు. అలాగే దీనికి ఎమ్.ఎస్.స్వామినాథన్ పేరే సరైనదేమో కూడా చూడండి.__చదువరి (చర్చరచనలు) 05:27, 2 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరిగారూ, మీరన్నట్లు ఈ వ్యాసం శీర్షిక "ఎం.ఎస్.స్వామినాథన్" అని ఉంటే బాగుంటుంది. --కె.వెంకటరమణచర్చ 05:35, 2 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

బాలు ABCDEFG ను బాలు (2005 సినిమా) కి విలీనం

నమస్తే,
బాలు ABCDEFG మరియూ బాలు (2005 సినిమా) రెండు ఒక సినిమా కి సంబంధిత పేజీలు కావటం వల్ల రెండు విలీనం చేయల్సిందిగా నా విన్నపం. ధన్యవాదాలు.-17:23 . . (+37)‎ . .‎KingDiggi (చర్చ | రచనలు | నిరోధించు

విలీనం జరిగినది.--కె.వెంకటరమణచర్చ 02:45, 10 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ఎం.వి.శ్రీధర్ వ్యాసం చర్చలో మూలాలు

మొలక స్థాయిలో ఉన్న ఎం.వి.శ్రీధర్ వ్యాసంలో బాగా కృషిచేసినవారిలో మీరు ముఖ్యులు. కాబట్టి ఆ వ్యాసపు చర్చపేజీలో కొన్ని మూలాలు, వనరులను జాబితా వేసిన విషయం మీ దృష్టికి తీసుకువస్తున్నాను. ఉపకరిస్తుందని ఆశిస్తూ --పవన్ సంతోష్ (చర్చ) 07:29, 8 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు

నా పేజీ బాబిలోనా సవరణకు ధన్యవాదాలు Lingalanga (చర్చ) 18:14, 9 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

సవరణకు ధన్యవాదాలు

బాబిలోనా సవరణకు ధన్యవాదాలు Lingalanga (చర్చ) 18:16, 9 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

మీ శ్రద్ద నాకూ అవసరం

రమణ గారు, నమస్కారము. నిర్వాహకునిగా నా తొలగింపుకు, అనవసర చర్చలకు, గొడవలకు మూల కారకుల్లో ఒకరు అయిన Hydkarthik తిరిగి అన్ని పేజీలలో అనవసరమయిన మార్పులు ప్రస్తుతం చేయడం జరుగు తున్నది. నేను ఉదయం పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‎ పేజీని పండిత నెహ్రూ ప్రయాణ ప్రాంగణము గా మార్చినది మార్పును రద్దు చేసి తిరిగి యథాస్థానం ఉంచాను. తిరిగి నా మార్పును రద్దు చేయడం జరిగింది, జరుగుతూ ఉంది. అలాగే అనేక పేజీలు మార్పులు చేయడం జరుగుతున్నది. దీనిని ఆపేవారు ప్రస్తుతం ఎవరూ అందుబాటులో మీరు తప్ప ఎవరూ లేరు. నేను ఎవరికీ ఏమీ చెప్పిన సరిగా అర్థం చేసుకోరు, ఎందుకు అలా చేస్తున్నారో కూడా వాళ్ళు వివరణ ఇవ్వరు. ఎవరికి తోచినట్లుగా వారు మార్పులు చేస్తూ ఉంటే వ్యాసాలకి లింకులు చాలా కష్టం, ఇదివరకు కొంతమంది నా మీద గొడవలు చేసి, అనవసర చర్చలు లేవదీసి, దానికి తోడు మన సీనియర్లు కూడా సరిగా అర్థం చేసుకోక నన్ను నిర్వాహకునిగా శాశ్వతంగా తొలగించారు, అయినా నా మనసు చంపుకుని, కొంతకాలం నిర్వాహకునిగా ఉంచమని తిరిగి అభ్యర్థించాను, అధికారులు వారికివారే నన్ను చేయవచ్చును, కానీ ఏమాత్రం ఫలితం లేదు, దాదాపు అందరూ తృణీకరించారు. నేను వికీపీడియాకి ఎటువంటి నష్టం కలిగే చర్యలు ఏనాడూ చేయలేదు. కేవలం వ్యక్తుల మధ్యన జరిగిన అనవసర చర్చలకు నన్ను ఒక్కడినే బలి చేసారు. మళ్ళీ ఇప్పుడు అటువంటి వాతావరణం ప్రస్తుతం ప్రారంభం చేసేసారు. ఇంక కొంతమంది కొత్త, పాత వాళ్ళు తప్పకుండా వచ్చి, వారికి తోచినది చేస్తూ ఉంటారు. నాకు కూడా పండిత నెహ్రూ బస్సు ప్రయాణ ప్రాంగణం అని పెట్టాలని ఉంది. వారు రైల్వే స్టేషన్లకు కూడా తెలుగు పేర్లు తప్పకూండా పెడతారు. మరొకరు తెలుగు భాష ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటూ వారు మరొక పేరును సూచిస్తారు. ఇలా ఎవరికి తోచినట్లు వారు పేర్లు పెడుతూ మారుస్తూ ఉంటారు. కొంతకాలానికి వచ్చిన అందరూ వాళ్ళ అనుకున్న లక్ష్యం నెరవేరాక ఎవరి దారిన వారు వెడతారు. ఎల్లకాలం, ఎక్కువ కాలం చేయలని రూలు లేదు, ఎవరైనా ఎప్పుడైనా, ఎలాగైనా, ఎన్నేళ్ళకైనా వస్తునే ఉంటాము, మాకు తోచింది మేము చేస్తాము, వస్తూ ఉంటాము వెళ్ళుతూ ఉంటాము, ఎవరి మాటా వినము, మా మాటే వేదం, వినాలి అని అంటూ ఉంటారు. ఇది వరకు ఇలాగే జరిగింది. నేను ఇప్పుడు ఎవరితో మాట్లాడను, చర్చలు చేయను, సలహాలు చెప్పను, నాకు అనవసర విషయం. కానీ, నేను వ్రాస్తున్న వ్యాసాలకి మాత్రం తప్పకుండా విపరీతమైన ఆటంకం కలిగిస్తాయి. ఈ రకమైనా విచిత్ర మార్పులను చేసేవారి విషయములో అందరూ తగిన శ్రద్ధ తీసుకుని, సరి అయిన చర్చలు చేసి, మీరందరూ ఒక పాలసీ విధానం రూపిందించ గలరని మనవి చేస్తున్నాను. మీకు నా సలహాలు, సూచనలు కావాలంటే నా చర్చా పేజీలో వ్రాయండి. నేను వ్రాస్తున్న వ్యాసాలలో పూర్తి చేయాల్సినవి మీకు కనిపిస్తే దయచేసి మూస ఇన్ యూజ్ పెట్టండి. నేను మరచి పోయినవి, తప్పకుండా పూర్తి చేస్తాను. మీకు ధన్యవాదములు.JVRKPRASAD (చర్చ) 02:51, 12 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

నేనేమి చేసితిని. మీరే అనవసరముగా నా మార్పులను రద్దు చేయుచున్నారు. రో.ర.సం. వారే బస్సు స్టేషనులపై "ప్రయాణ ప్రాంగణము" అని వ్రాయుచున్నారు. కనుక నేను పండిత నెహ్రూ ప్రయాణ ప్రాంగణము అని వ్రాసితిని. ఇందు తప్పేమియు లేదు.Hydkarthik (చర్చ) 02:55, 12 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ఆధారములు ప్రతి మార్పునకు సూచించబడ లేదు. మీరే అనవసరముగా అనేక మార్పులకు చేయుచున్నారు. నాకు మార్పులకు ఆధారములు కన్పడ లేదు, అందులకు నేను రద్దు చేసితిని. ఇందు తప్పిదము ఏమియును లేదు. JVRKPRASAD (చర్చ) 03:00, 12 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంగ్ల పద స్థానమున నేను తెలుగు పదమును పెట్టితిని. దీనిని రద్దు చేయనేల? దయచేసి గమనించుడి. Hydkarthik (చర్చ) 03:02, 12 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

Hydkarthik గారూ, మీరు తెలియజేసిన అచ్చ తెలుగు పదములు చాలా తక్కువగా వాడబడుతున్నవి. వాటికి సరైన ఆధారాలు లేవు. విజ్ఞాన సర్వస్వంలో అందరికీ బహుళ ప్రాచుర్యంలో ఉన్న పదాలను వాడితే మంచిది. ఆ పదాలతోనే వెతుకుతారు. మీరు తెలియజేసిన "ప్రయాణ ప్రాంగణం" గూగుల్ లో శోధిస్తే 138 ఫలితాలను చూపిస్తుంది. అదే "బస్ స్టేషన్" పదాన్ని శోధిస్తే 54,30,00,000 ఫలితాలను చూపిస్తుంది. బహుళ వాడుకలో ఉన్న పదం "బస్ స్టేషన్" కనుక అదే పేరుతో శీర్షిక ఉండటం మంచిది. మూలాలు లేని వాక్యాలను చేర్చరాదని మీకు తెలియనిది కాదు. సరైన విధంగా వ్యాసాభివృద్ధికి తోడ్పడండి. JVRKPRASAD గారి వ్యాసాలలో కావాలనే ఆధారాలు లేకుండా వాదనలు చేస్తున్నట్లుగా అనిపిస్తుంది.--కె.వెంకటరమణచర్చ 13:44, 12 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

మూస:Convert/sqft

భారతదేశంలోని షాపింగ్ మాల్స్ జాబితా వ్యాసంలో 2,500,000 sq ft (230,000 m2) అనే దానికి బదులుగా 2,500,000 చ.అ. (230,000 మీ2) గా కనిపించడానికి నేను పై మూసను మార్పు చేయడానికి ప్రయత్నించాను. కానీ వీలుకాలేదు. దయచేసి మీరు ఆ మార్పులు చేయగలరు. --స్వరలాసిక (చర్చ) 04:08, 16 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

స్వరలాసిక గారూ, మీరు కోరినట్లు మాడ్యూల్ ను సరిచేసాను.--కె.వెంకటరమణచర్చ 16:48, 16 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]
కె.వెంకటరమణ గారూ! ధన్యవాదాలు.--స్వరలాసిక (చర్చ) 16:59, 16 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ఒకసారి చూడండి

కె.వెంకటరమణ గారు, నాకు వచ్చిన మెసేజ్ గురించి ఏమీ తెలియదు, అందుకని మీకు పంపుతున్నాను. మీరు, ఇది వికీకి అవసరమేమో దయచేసి ఒకసారి చూడండి.JVRKPRASAD (చర్చ) 02:29, 18 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

Translation

Hello! May I ask you for a translation of the code placed on this page into తెలుగు? Can you put in under the English version. Thank you very much! :) -XQV- (చర్చ) 19:05, 17 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

వాడుకరి:Adityamadhav83 మార్పులు గమనించండి

వాడుకరి:K.Venkataramana గారు, రైల్వే వ్యాసాలలో మార్పులు చేస్తున్న వారిలో వాడుకరి:Adityamadhav83 గారు కూడా ఒకరు. వీరు 'రైల్ రోడ్ ' అనే దానికి రైలు సముదాయం అని మార్పు చేస్తున్నట్లుగా ఉంది. కాని అది సరి అయిన తెలుగు పదం కాదు. సముదాయం అంటే ఒకటి కంటే ఎక్కువ ఉన్న వాటిని సముదాయం అని ఆర్థం అనుకుంటాను. దయచేసి మార్పులను ఆపమని మీరు వారికి వివరించ గలరు. JVRKPRASAD (చర్చ) 13:03, 19 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

సంకేతము అను సంస్కృత పదము అతికినట్లు సరిపోవును. లేనిచో, గుఱి, డాగు, తాపి, పులుగు, పొక్కి, పొడ, బచ్చెన అను తెలుగు పదములు ఉండనేయున్నవి. Hydkarthik (చర్చ) 04:02, 20 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

తెలంగాణ శాసనసభ

కె.వెంకటరమణ గారు, తెలంగాణ శాసనసభ ఎన్నికైన వారి పట్టీక లో తెలుగుదేశం తరపున ఎన్నికైన వారిని తెరస ఖాతాలో చూపించారు. దయచేసి దీనిని తె.దే.ప. ఖాతా లోకి మార్చవలసినది. Hydkarthik (చర్చ) 18:23, 1 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

కామేశ్వరీ వ్రతం

కామేశ్వరీ వ్రతం పేజీ లోకి మేటర్ యాడ్ చెయ్యలేక పోతున్నాను. దయచేసి నోట్ తొలగించ ప్రార్ధన. - (Malladi kameswara rao (చర్చ) 12:27, 29 జూలై 2018 (UTC))[ప్రత్యుత్తరం]

'రమణ గారూ..... "కామేశ్వరీ వ్రతం" పేజీ లోకి మేటర్ యాడ్ చెయ్యలేక పోతున్నాను. దయచేసి నోట్ తొలగించ ప్రార్ధన. - ( Malladi kameswara rao (చర్చ) 12:31, 29 జూలై 2018 (UTC) )[ప్రత్యుత్తరం]
కామేశ్వరీ వ్రతం వ్యాసంలో తొలగింపు మూసను తొలగించి విస్తరణ మూసను చేర్చితిని. మీరు విస్తరణ చేయగలరు.--కె.వెంకటరమణచర్చ 13:55, 29 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

మంచి వ్యాసం ప్రతిపాదనలు - పద్ధతి

రమణ గారూ,
నమస్తే. మంచి వ్యాసం ప్రమాణాల ప్రకారం మంచి వ్యాసం ప్రతిపాదనలు చేస్తున్నాం. ఈ ప్రతిపాదనలు పేజీలోని క్రమంలో మొదటిది - మంచుమనిషి వ్యాసాన్ని ఇప్పటికే నేను ఒక దఫా సమీక్షించి, రెండో అభిప్రాయాన్ని కోరాను. అక్కడ మీరు విభాగం సృష్టించి రెండవ అభిప్రాయం చెప్పవచ్చు. అలానే అక్కడే ఉన్న ప్రతిపాదనల్లో మూడిటిని ఇంకా సమీక్షకు ఎవరూ స్వీకరించలేదు, మీరు సాధ్యమైతే ఒకటి, రెండు సమీక్షకు స్వీకరించవచ్చు. అలాగే మీ వ్యాసాల్లో మీకు మంచి వ్యాసం అవుతుందని అనిపిచినదాని {{GA nominee|~~~~~|nominator=~~~|page=1|status=|subtopic=}} ఉపయోగించి ప్రతిపాదించవచ్చు. --పవన్ సంతోష్ (చర్చ) 16:53, 8 ఆగస్టు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

భారత స్వాతంత్ర్యోద్యమ వ్యాసాల్లో చేయదగ్గ మార్పులు

భారత స్వాతంత్ర్య ఉద్యమం ఎడిటథాన్‌లో పాల్గొంటున్నందుకు అభినందనలు, శుభాకాంక్షలు. ఈ ఎడిటథాన్ ద్వారా మరింత కృషి జరిగేందుకు వీలుగా కొన్ని పనులు చేశాను. అవేమిటో రాస్తున్నాను, మీ కృషిలో ఉపయోగపడతాయేమో పరిశీలించండి, ఇప్పటికే ఆంగ్లంలో ఉన్న భారత స్వాతంత్ర్యోద్యమ వ్యాసాలు జాబితా వేయడం కాకుండా చేసినవి:

  1. వనరులు: రాయడానికి అవసరమైన వనరులు కొన్ని అంతర్జాలంలో అందుబాటులో ఉన్న మేరకు జాబితా వేశాం. దీనిని ఉపయోగించుకుని వ్యాసాల్లో సమాచారం చేర్చవచ్చు. అలానే మీకు ఏదైనా మంచి వనరులు తెలిస్తే (భాషల వారీగా రాయండి, ఆంగ్లం విడిగా ఓ ఉపవిభాగంలో) అక్కడ చేర్చవచ్చు.
  2. చేయదగ్గ పనులు: భారత స్వాతంత్ర్యోద్యమం వర్గానికి చెందిన వ్యాసాల్లో మొలకలు, విస్తరించదగ్గ వ్యాసాలు, కామన్సులో బొమ్మలు ఉండి ఇక్కడ బొమ్మలు లేని వ్యాసాలు ఇలా జాబితా వేసుకుంటూ వెళ్తున్నాం. మీకు వీటిలో ఏదైనా ఒక అంశాన్ని అభివృద్ధి చేసే ఆసక్తి ఉంటే అది తీసుకుని నాణ్యత మెరుగుపరచవచ్చు.

ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 08:02, 14 ఆగస్టు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వికీడేటా లేబులథాన్

భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలుగు సహా వివిధ భారతీయ భాషల వికీమీడియా సముదాయాల్లో ఎడిటథాన్ నిర్వహిస్తున్నట్టే వికీడేటాలో వికీప్రాజెక్టు ఇండియా వారు భారతదేశానికి సంబంధించిన లేబులథాన్ నిర్వహిస్తున్నారు. ఆ పేజీ ఇదిగో ఇక్కడ చూడవచ్చు. సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలు, భారత స్వాతంత్ర్యోద్యమం, భారత స్వాతంత్ర్య సమరయోధులు, వగైరా కేటగిరీలకు చెందిన లేబుళ్ళు, డిస్క్రిప్షన్లు వివిధ భారతీయ భాషల్లో చేరుస్తున్నారు. ఒక సారి సదరు పేజీ సందర్శించి, ఆసక్తి మేరకు పాల్గొంటారని ఆశిస్తున్నాను. అదే నేపథ్యంలో మన వికీపీడియా:వికీప్రాజెక్టు/భారత స్వాతంత్ర్య ఉద్యమం ఎడిటథాన్ పేజీలో చేయదగ్గ పనులు ఉప విభాగంలో వికీడేటా ఐటంలో వివరణ (డిస్క్రిప్షన్) లేనివి, తెలుగులో స్వాతంత్ర్యోద్యమం గురించి ఉన్నవీ వ్యాసాలు, వాటి వికీడేటా ఐటంలు జాబితా వేశాను. వికీడేటా పేజీలో పేరు నమోదుచేసుకుని, నేను అందించిన పట్టిక ఉపయోగించి కృషి ప్రారంభించవచ్చు.--పవన్ సంతోష్ (చర్చ) 05:46, 15 ఆగస్టు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్తపల్లి (జి) గ్రామ వ్యాసం పునరుద్దరణ

వెంకటరమణ గారూ నమస్తే! కొత్తపల్లి (జి) గ్రామం లోగడ అదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలో ఉంది.నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా నార్నూర్ మండలం నుండి GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 ప్రకారం కొత్తగా ఏర్పడిన గాదిగూడ మండలంలో చేరింది.భారత జనగణన డేటా ఎక్కించి వ్యాసం అభివృద్ది చేయుటకు పునరుద్దరించగలరు.--యర్రా రామారావు (చర్చ) 14:52, 22 ఆగస్టు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

యర్రా రామారావు గారూ కొత్తపల్లి (జి) వ్యాసాన్ని పునరుద్ధరించాను. దానిని విస్తరించగలరు.--కె.వెంకటరమణచర్చ 16:22, 23 ఆగస్టు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

File:StatueofUnity.png listed for discussion

A file that you uploaded or altered, File:StatueofUnity.png, has been listed at Wikipedia:Files for discussion. Please see the discussion to see why it has been listed (you may have to search for the title of the image to find its entry). Feel free to add your opinion on the matter below the nomination. Thank you. --వాడుకరి:KCVelaga 15:15, 03:20, 1 November 2018‎
కె.సి.వెలగ గారూ, కామన్స్ లో ఉచిత చిత్రాలున్నందున ఈ చిత్రాన్ని తొలగించితిని.--కె.వెంకటరమణచర్చ 15:18, 1 నవంబర్ 2018 (UTC)

JVRKPRASAD గారి మూడవ స్వీయ నిర్వాహక అభ్యర్ధన

వెంకటరమణ గారూ, JVRKPRASAD గారు చేసిన మూడవ ప్రతిపాదనను (మొదటి స్వీయ ప్రతిపాదన నెగ్గింది, రెండవది వీగింది, మూడవది ఉపసంహరించుకున్నారు, ప్రస్తుతం పరిశీలనలో ఉన్నది నాలుగవది) - ఆయన అభ్యర్ధన మేరకే - తొలగించారు. అభ్యర్ధి తన ప్రతిపాదనను ఉపసంహరించుకున్న సందర్భంలో అదే విషయాన్ని ఉటంకిస్తూ, ప్రతిపాదనను ముగించాలి. కానీ, పేజీని తొలగించకూడదనుకుంటాను. పరిశీలించగలరు. __చదువరి (చర్చరచనలు) 14:42, 21 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారూ అతని రెండవ ప్రతిపాదన వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/JVRKPRASAD 2 పేజీలోఉంది. అతను రెండు పుటలను తయారు చేసి, ఒక పుటను ఉంచి రెండవదైన మూడవ ప్రతిపాదనను ను తొలగించమని తెలియజేసారు.--కె.వెంకటరమణచర్చ 14:52, 21 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
థాంక్సండీ, విషయం అర్థమైంది. __చదువరి (చర్చరచనలు) 15:05, 21 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

నాయీబ్రాహ్మణులు

నాయీబ్రాహ్మణ వికీపీడియా ను ఎందుకు లాక్ చేసేరో చరప్పగలరు Nayeevaidya (చర్చ) 02:22, 7 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు Nayeevaidya, రావులకోల్లు వెంకట్ అనే రెండు వాడుకరి పేర్లతో నాయీబ్రాహ్మణులకు సంబంధించిన వ్యాసాలలో మూలాలు లేని అంశాలను చేర్చడం, ఉన్న విషయాలను తొలగించడం నిరంతరంగా చేస్తున్నారు. ఆ వ్యాసంలో మూలాలు లేని వాక్యాలు తొలగించబడతాయి. మీరు {{మూలాలు లేవు}}, {{మూలాలు సమీక్షించండి}} వంటి మూసలను ఎన్నిసార్లు మేము చేర్చినా వాటిని తొలగిస్తున్నారు. నిర్మాణాత్మకంగా లేని మార్పుల యుద్ధం జరుగుతున్నందున, వాండలిజం జరుగుతున్నందున ఆ వ్యాసాన్ని సంరక్షించితిని.

అదే విధంగా ఆయనే ఉంటే మంగలెందుకు వంటి సామెతలపై మీ అభిప్రాయాలను ఆ వ్యాస చర్చాపేజీలో రాయకుండా దానిని వికీపీడియా:పనికమాలిన సమేత కు తరలించారు. కౌండిన్యులు వ్యాసాన్ని వాడుకరి చర్చ:కౌండిన్యులు అనే పేరుకు తరలిస్తున్నారు. వ్యాసాలలో సమాచారాన్ని తొలగించుట, అనవసర అంశాలను చేర్చుట, అనవసర దారిమార్పులు వంటి కార్యక్రమాలను చేస్తున్న మీరు మీ థోరణి మార్చుకొననిచో మీపై కూడా నిరోధం విధించబడుతుంది.--కె.వెంకటరమణచర్చ 02:43, 7 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

మీకు ఎటువంటి ఆధారాలు కావాలి మిత్రమా?? నాకు మీ ఉద్దేశం అర్ధం కావడంలేదు Nayeevaidya (చర్చ) 01:57, 8 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
అంటే మీరు మీ వికీపీడియాలో కులపరమైన సామెతలను ప్రోత్సహిస్తారా ?? Nayeevaidya (చర్చ) 02:01, 8 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
మీకు స్పెల్లింగ్ లు రాకపోతే నేర్చుకోండి అంతేకాని మీకు నచ్చిన విధముగా వికీపీడియాలో వ్రాస్తే సహించేది లేదు. నాయిబ్రాహ్మణలో ఉపకులాలను మంగలి, మంగళ, భజంత్రీ అంటారు. మీకు మంగళ స్పెల్లింగ్ ఏ సరిగా రాయడంలేదు మరి మీరు వ్యాసకర్త ఎలా అయ్యారు?? నాయీబ్రాహ్మణ పక్కన బ్రాకెట్ లో మంగలి అనే పదం తొలగించవలసినది గా కోనుకుంటున్నాను. Nayeevaidya (చర్చ) 06:32, 8 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
Nayeevaidya గారూ, వికీపీడియాలో స్వంత అభిప్రాయాలకు తావులేదు. సరైన మూలాలను చేర్చాలి. మీరు మీ బ్లాగులో చేర్చిన మూలాలు అనుమతించబడవు. వికీపీడియాలో నోటబిలిటీ ఉన్న అంశాలు, సరైన మూలాలతో చేర్చాలనేది నియమం. నిజమైన వికీపీడియనుకు కుల, మత, ప్రాంతీయ అభిమానాలు ఉండవు. అన్ని వ్యాసాలను సరైన రీతిలో తీర్చిదిద్ది విజ్ఞాన సర్వస్వాన్ని అందరికీ అంచించాలనే తలంపు ఉంటుంది. మీరు తెలియజేసిన ఆయనే ఉంటే మంగలెందుకు వ్యాసంలో {{మూలాలు లేవు}} అనే నిర్వహణ మూసను ఉంచాను. ఎవరైనా సరైన మూలాలను చేర్చినట్లైతే ఆ వ్యాసంలోని విషయాలు తొలగించబడవు. మూడవది ఆంగ్లంలోని గజెట్ లో "mangala" అని ఉన్నందున "మంగల" అని రాసాను. మీరు తెలియజేసిన తరువాత వ్యాసంలో సరిచేసితిని. మీరు తెలియజేసినట్లు "నాయీబ్రాహ్మణ" అనే పదం తరువాత భారత ప్రభుత్వ గజెట్ నోటిఫికేషన్ ప్రకారం "మంగలి, మంగళ, భజంత్రీ" అనే పదాలను అతికించాను. అక్షర దోషాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు.--కె.వెంకటరమణచర్చ 15:28, 8 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

ఒకసారి రంగాచారి గారు రచించిన గ్రంధాలు చదివితే కులాల గురించి మీకే ఒక అవగాహన వస్తుంది పులి (చర్చ) 01:40, 9 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

క్యాస్ట్స్ అండ్ ట్రైబ్స్ అనే గ్రంధంలో ప్రతి కులం యొక్క గొప్పతనాన్ని మరియు ఆ కులాన్ని 1900 సంవత్సరం లో ఏమని పిలిచేవారు అని క్లుప్తంగా వివరించారు. నేను ఆ గ్రంధంకు అనుగుణంగానే వికీపీడియాలు క్రియేట్ చేస్తున్న తప్ప కల్పితాలు రాయడంలేదు అనివగమనించాలి మీరు 🙏🙏 Nayeevaidya (చర్చ) 04:59, 9 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

ఇంకొక చిన్న వివరణ ఇంతకుముందు నాయీబ్రాహ్మణులను మంగలి అని అనేవారు అని వ్రాసేరు. కానీ ఆ పదం "మంగళ" అని మార్చవలెను అని నా మనవి Nayeevaidya (చర్చ) 05:47, 9 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

పులి గారూ ఆ రంగాచారి ఎవరో తెలియజేయగలరు. అతను రాసిన గ్రంథమేది? Nayeevaidya గారూ "క్యాస్ట్స్ అండ్ ట్రైబ్స్" గ్రంథం ఎవరు రాసారు? ఆ పుస్తకానికి నోటబిలిటీ ఉందా? తెలియజేయగలరు. భారతదేశ రాజపత్రం లోని ఆరవ పుటలో "నాయీబ్రాహ్మణులు" కు పూర్వపు పేరు "మంగలి" అనే ఉన్నదండీ. మంగళ గా ఎలా మారుస్తాము? ఒకసారి రాజపత్రాన్ని పరిశీలించండి.--కె.వెంకటరమణచర్చ 10:26, 9 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

"షెడ్యూల్ కులంగా మార్పుకై పోరాటం" ఈ లైన్ తొలగించండి. మీరు చెప్తుంది ఉత్తర భారతదేశంలో కొన్ని వెనుకబడిన ప్రాంతాలలో చేస్తున్నారు. నిజానికి వారికి మాకు ఎలాంటి సంబంధం లేదు. మీరు ఇలాంటివి వికీపీడియాలో పెట్టడం మా భావాలకు వ్యతిరేకం . దయచేసి తొలగించండి Nayeevaidya (చర్చ) 03:44, 10 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు మీకు ఇష్టం వచ్చినట్టు వికీపీడియాలో పెడితే సహించేది లేదు తెలియకపోతే తెలుసుకోండి కులాల గురించి అంతేకాని ఏవో అర్ద రహితం గా మార్పులు చేస్తే ఉరుకొము. నా పేరు రావులకోల్లు వెంకట్ పండిత్ నేను ఒక రీసెర్చ్ స్కాలర్ ని మరియు ధన్వంతరి పరివార్, ధన్వంతరి పరివార్ వెల్ఫేర్ గ్రూపుల స్థాపకుడిని. ఎటువంటి సందేహాలు ఉన్న నేను చెప్పగలను అంతేగాని మీకు ఇష్టం వచ్చినట్టు వికీపీడియాలో పెడితే ఉరుకొము Nayeevaidya (చర్చ) 03:51, 10 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

ఇది నా ధన్వంతరి పరివార్ సోషల్ మీడియా గ్రూపులు నన్ను సంప్రదించాలి అంటే ఇలా సంప్రదించవచ్చు. https://m.facebook.com/groups/1910891595794613?ref=bookmarks Nayeevaidya (చర్చ) 04:06, 10 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]