వంశీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎బాల్యం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నవంబర్ → నవంబరు using AWB
పంక్తి 70: పంక్తి 70:
== మూలాలు ==
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}

* [http://telugurachayita.org/details/#/5c66b20742573a18b72ebb31 తెలుగు రచయిత. ఆర్గ్ లో వంశీ పేజీ]


[[వర్గం:తెలుగు సినిమా దర్శకులు]]
[[వర్గం:తెలుగు సినిమా దర్శకులు]]

16:48, 17 ఫిబ్రవరి 2019 నాటి కూర్పు

వంశీ
జననం
నల్లమిల్లి భామిరెడ్డి

(1956-11-20) 1956 నవంబరు 20 (వయసు 67)
వృత్తిదర్శకుడు
రచయిత
స్క్రీన్‌ప్లే రచయిత
సంగీతదర్శకుడు

వంశీ తెలుగు సినిమా దర్శకుడు మరియు రచయిత. అసలు పేరు నల్లమిల్లి భామిరెడ్డి .ఈయన సినిమాల కథలు సహజంగా ఉంటూ పల్లె అందాలను ఆవిష్కరిస్తుంటాయి.

బాల్యం

వంశీ తూర్పు గోదావరి జిల్లా, అనపర్తికి దగ్గరలో ఉన్న పసలపూడి అనే గ్రామంలో 1956, నవంబరు 20 న పుట్టి అక్కడే పెరిగాడు. ప్రాథమిక విద్యను అక్కడే పూర్తి చేశాడు.[1]

కెరీర్

తెలుగు సినీ చరిత్రలో ఆణిముత్యమైన శంకరాభరణం సినిమాకు వంశీ సహాయ దర్శకుడిగా వ్యవహరించాడు. దర్శకుడిగా ఆయన మొదటి సినిమా 1982లో చిరంజీవి, సుహాసిని, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రధారులుగా నటించిన మంచు పల్లకి అనే సినిమా. ఈ సినిమాకు యండమూరి వీరేంద్రనాథ్ రచయిత. యండమూరి, చిరంజీవి కలయికలో వచ్చిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం.

1984లో ఆయన రూపొందించిన సితార సినిమా విమర్శకుల మన్ననలనందుకుంది. ఇదే సినిమాతో భానుప్రియ తెలుగు సినిమాకు కథానాయికగా పరిచయమైంది. ఆయన రూపొందించిన చాలా వరకు సినిమాలకు ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించాడు.

వంశీ దర్శకత్వం వహించిన అనేక తెలుగు సినిమాలలో ప్రస్పుటంగా కనిపించే అంశములు కామెడీ మరియు తెలుగువారి వ్యావహారిక పద్ధతులు. గోదావరి పట్ల వంశీకి వున్న ప్రేమ అంతా ఇంతా కానిది. ఆయన ప్రతి సినిమాలో ఏదో ఒక పాత్ర గోదావరి జిల్లాతో సబంధముండి వుంటుంది.

అవార్డుల సినిమాలు

వంశీ సినిమాల జాబితా

  1. మంచు పల్లకి
  2. ఆలాపన
  3. అన్వేషణ
  4. సితార
  5. లేడీస్ టైలర్
  6. ప్రేమించు పెళ్ళాడు
  7. డిటెక్టివ్ నారద
  8. లాయర్ సుహాసిని
  9. మహర్షి
  10. చెట్టు క్రింద ప్లీడర్
  11. స్వర కల్పన
  12. శ్రీ కనకమహలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్
  13. ఏప్రిల్ 1 విడుదల
  14. లింగబాబు లవ్ స్టోరి
  15. జోకర్
  16. నీకు 16 నాకు 18
  17. ప్రేమ ‍‍& కో
  18. వైఫ్ ఆఫ్ వి.వరప్రసాద్
  19. అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు
  20. దొంగ రాముడు అండ్ పార్టి
  21. కొంచెం టచ్ లో ఉంటే చెబుతాను
  22. అనుమానాస్పదం
  23. గోపి గోపిక గోదావరి
  24. సరదాగా కాసేపు
  25. తను మొన్నే వెళ్లిపోయింది (2013)

రచనలు

ప్రభావాలు

వంశీపై తెలుగు, తమిళ సినీదర్శకులు, సాంకేతిక నిపుణులు బాపు, భారతీరాజా, విశ్వనాథ్, బాలచందర్, పుట్టణ్ణకణగాళ్, ఇళయరాజాల ప్రభావం ఉంది. తాను దర్శకుణ్ణి కావడానికి వీరి ప్రభావమే కారణమని, వీరు తనకు గురువులని పేర్కొంటారు.[2] ఆయన మిస్టరీ సినిమాలపై సుప్రసిద్ధ ఆంగ్ల దర్శకుడు, మాస్టర్ ఆఫ్ సస్పెన్స్‌గా పేరుపొందిన ఆల్‍ఫ్రెడ్ హిచ్‌కాక్ ప్రభావం ఉంది.

మూలాలు

  1. కృష్ణేశ్వరరావు. "అనితర సాధ్యం ఆయన మార్గం". acchamgatelugu.com. Retrieved 19 September 2016.
  2. వంశీ (1 march 2015). "వంశీ ఇళయరాజా". సాక్షి ఫన్‌డే. Retrieved 4 March 2015. {{cite journal}}: Check date values in: |date= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=వంశీ&oldid=2596277" నుండి వెలికితీశారు