Coordinates: 18°25′53″N 79°51′38″E / 18.4314°N 79.8605°E / 18.4314; 79.8605

హుజూరాబాద్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 1: పంక్తి 1:
'''హుజూరాబాద్''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[కరీంనగర్ జిల్లా|కరీంనగర్ జిల్లాకు]] చెందిన మండలం, గ్రామం.<ref name="”మూలం”">http://www.mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Karimnagar.pdf</ref>
'''హుజూరాబాద్''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[కరీంనగర్ జిల్లా|కరీంనగర్ జిల్లాలోని]] [[హుజూరాబాద్ మండలం]] చెందిన గ్రామం.<ref name="”మూలం”">http://www.mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Karimnagar.pdf</ref>
{{భారత స్థల సమాచారపెట్టె
{{భారత స్థల సమాచారపెట్టె
|type = [[పట్టణం]]
|type = [[పట్టణం]]

09:55, 19 ఫిబ్రవరి 2019 నాటి కూర్పు

హుజూరాబాద్ తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ మండలం చెందిన గ్రామం.[1]

  ?హుజురాబాద్
తెలంగాణ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 18°25′53″N 79°51′38″E / 18.4314°N 79.8605°E / 18.4314; 79.8605
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 32.24 కి.మీ² (12 చ.మై)[2]
జిల్లా (లు) కరీంనగర్ జిల్లా
జనాభా
జనసాంద్రత
37,665[3] (2011 నాటికి)
• 1,168/కి.మీ² (3,025/చ.మై)
అధికార భాష తెలుగు
పురపాలక సంఘం హుజూరాబాద్ నగర పంచాయతి


ఇది మండల కేంద్రమైన హుజూరాబాద్ నుండి 0 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన వరంగల్ నుండి 30 కి. మీ. దూరంలోనూ ఉంది.ఇది కరీంనగర్ జిల్లాలో ముఖ్యమైన పట్టణాలలో ఒకటి.ఇక్కడినుండి కరీంనగర్ 40 కి.మీ. దూరంలోను, హనుమకొండ 30 కి.మీ. హుజురాబాద్ వయా హన్మకొండ హైదరాబాద్ 170 కి.మీ.,హుజురాబాద్ వయా హుస్నాబాద్ హైదరాబాద్ 177 కి.మీ.,హుజురాబాద్ వయా కరీంనగర్ హైదరాబాద్ 200 కి. మీ.దూరంలోను ఉన్నాయి.

గణాంకాలు

మండల జనాభా: 2011భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 74,721- పురుషులు 37,702 - స్త్రీలు 37,019

పట్టణ జనాభా: 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 9717 ఇళ్లతో, 37665 జనాభాతో 3229 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 19208, ఆడవారి సంఖ్య 18457. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 6560 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 351. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 572648[4].పిన్ కోడ్: 505468.

గ్రామ విశేషాలు

హుజురాబాద్ లోని ఎప్.బి.ఐ. బ్యాంక్

ఇక్కడ సమీపంలో బిజగీర్ దర్గా ప్రసిద్ధి చెందింది.హుజురాబాద్ ప్రజలు తెలుగు మరియు ఉర్దుభాషను (యాస) మాట్లాడుతుంటారు. ప్రజలు సంప్రదాయమైన చీరె మరియు ధోవతి వంటి దుస్తులతో అధునిక వస్త్రాలను కూడా ధరిస్తుంటారు. ప్రతీ రెండేళ్ళ కొకసారి జుపాకలో జరిగే సమ్మక్క-సారక్క జాతర జరుగుతుంది,హుజురాబాద్ లో గుట్ట చుట్టుపక్కల తాత్కాలిక నివాసాలను ఏర్పాటు చేసుకుని భక్తులు ఈ జాతర జరుపుకుంటారు.హుజురాబాద్ నుండి అత్యధికంగా యువత విదేశాలలో పనిచేస్తున్నారు. ప్రధానంగా అమెరికా మరియు సౌది అరేబియా దేశాలలో ఉన్నారు.భారత ప్రధానమంత్రిగా పనిచేసిన పి.వి.నరసింహారావు ఇక్కడి ప్రభుత్వ పాఠశాలలో చదివినవారే.2014 శాసనసభ ఎన్నికలలో ఈటెల రాజేందర్ విజయం సాధించారు ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రిగా ఉన్నారు.

విద్యా సౌకర్యాలు

హుజురాబాద్ అంబేద్కర్ విగ్రహం

చుట్టుప్రక్కల గ్రామాలకు ఇది విద్యా కేంద్రం,మండలంలోని గ్రామములతో పాటు ఎల్కతుర్తి,సైదాపూర్,శంకరపట్నం,కమలాపూర్ మండలములలోని విద్యార్థులు కూడా ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారు.ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలతో పలు ప్రైవేటు పాఠశాలలు పదుల సంఖ్యలో ఉన్నాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాల, కాకతీయ జూనియర్ కళాశాల, మాతృశ్రీ జూనియర్ కళాశాలలు, జాగృతి డిగ్రీ కళాశాల, మాతృశ్రీ డిగ్రీ కళాశాల, హుజూరాబాద్ పట్టణానికి 3 కి.మీ. దూరంలో గల కే.సి. క్యాంప్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, పట్టణంలో ఐ.టి.ఐ., బి.ఇ.డి., ఎమ్.బి.ఎ. కళాశాలలు, 5 కి.మీ. దూరంలో ఉన్న సింగాపూర్ గ్రామంలో ఇంజనీరింగ్ కళాశాల, 7 కి.మీ. దూరంలో ఉన్న వల్బాపూర్ గ్రామంలో ఫార్మసీ కళాశాలలు ఉన్నాయి.

గ్రామంలో 10 ప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 15, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు 16, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు నాలుగు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు 23, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు నాలుగు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు 16 ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, 8 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఒక ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, 3 ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది.

సమీప ఇంజనీరింగ్ కళాశాల సింగాపూర్లో ఉంది. సమీప మేనేజిమెంటు కళాశాల హుజూరాబాద్లోను, వైద్య కళాశాల, పాలీటెక్నిక్‌లు వరంగల్లోనూ ఉన్నాయి.సమీప అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల వరంగల్లో ఉన్నాయి.

హుజురాబాద్ లోని జగన్నాధనాయుడి విగ్రహం

వైద్య సౌకర్యం

హుజురాబాద్ బస్టాండ్

ప్రభుత్వ వైద్య సౌకర్యం

హుజూరాబద్లో ఉన్న ఒక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఐదుగురు డాక్టర్లు, 15 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

హుజురాబాద్ లోని అంబేద్కర్ కూడలి

గ్రామంలో20 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ డాక్టర్లు 8 మంది, ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీ చదివిన డాక్టర్లు ఐదుగురు, డిగ్రీ లేని డాక్టర్లు ఏడుగురు ఉన్నారు. 40 మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా, చెరువు ద్వారా కూడా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

హుజురాబాద్ ప్రధాన రహదారి

హుజూరాబద్లో పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

హుజురాబాద్ ఫంక్షన్ హాల్

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. శాసనసభ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి.

విద్యుత్తు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

హుజురాబాద్ అంబేద్కర్ కూడలి-1

హుజూరాబద్లో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 866 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 165 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 6 హెక్టార్లు
  • బంజరు భూమి: 518 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1673 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 518 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1673 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

హుజూరాబద్లో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 597 హెక్టార్లు* బావులు/బోరు బావులు: 1076 హెక్టార్లు

ఉత్పత్తి

హుజూరాబద్లో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

వరి, ప్రత్తి, మొక్కజొన్న

ప్రముఖవ్యక్తులు

పి.వి.నరసింహారావు (మాజీ భారత ప్రధానమంత్రి), సింగాపురం రాజేశ్వర్ రావు (మాజీ రాష్ట్ర శాసన మండలి సభ్యులు), ఇనుగల పెద్దిరెడ్డి (రాష్ట్ర మాజీ మంత్రి),కెప్టెన్ లక్ష్మి కాంత రావు (రాష్ట్ర మాజీ మంత్రి),ఈటల రాజేదర్ (తెలంగాణ తొలి ఆర్థిక శాఖా రాష్ట్ర మంత్రి), వకులాభారణం కృష్ణమోహన్ (సీనియర్ బీసీ కమిషన్ మెంబర్), వడ్లూరి విజయ్ కుమార్ (తొలి మున్సిపల్ చెర్మెన్), రావుల అశోక్ (జాతీయ బీసీ సంక్షేమ సంగం మండల అధ్యక్షులు)

ప్రభుత్వ కార్యాలయములు

  • మండల పరిషత్ కార్యలయము,
  • మండల తహసిల్ కార్యలయము,
  • మెజీస్టృట్ కోర్ట్,
  • డి.యస్.పి కార్యాలయము,
  • పొలీస్ స్టేషను,
  • పొస్ట్ ఆఫిసు,
  • ఆసుపత్రి
  • నీటి పారుదల కార్యాలయము,
  • రీజిస్టేషను కార్యాలయము,
  • ఆగ్నిమాపక కార్యాలయము,
  • రోడ్డు రవాణా బస్సు డిపో
  • విద్యుత్ కార్యాలయం
  • టెలిఫొన్ కార్యలయము ఉన్నాయి

రోడ్డు రవాణా

కరీంనగర్, వరంగల్ నగరములకు మధ్యలో ఉండడం వలన రాష్ట్రంలోని ముఖ్య నగరాలతో పాటు ఇతర రాష్ట్రలకు కూడా రోడ్ రవాణా సంస్థ వవస్థ వుంది

రైలు రవాణా

హుజూరాబాద్ లో రైల్వే స్టేషను లేకున్నను 14 కి.మీ. దూరంలో ఉన్న జమ్మికుంట, 11 కి.మీ. దూరంలో ఉప్పల్, 30 కి.మీ. దూరంలో వరంగల్, ఖాజీపేట స్టేషన్లు ఉన్నాయి.

బ్యాంకులు

చూడదగిన ఇతర ప్రదేశాలు

దేవాలయంలు

  • జుపాక సమ్మక్క సారలమ్మ
  • వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం - (కస్తూరి నరేంద్రాచారి దేవాలయ అధ్యక్షులు)
  • హనుమాన్ దేవాలయం (బుసారపు వేంకటేశ్వర్లు)
  • శివాలయములు (అధ్యక్షులు ప్రతాప కృష్ణా)
  • రామాలయము
  • వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవాలయం
  • అయ్యప్ప దేవాలయం
  • సంతోషిమాత దేవాలయం
  • సాయిబాబా దేవాలయం
  • నాగేంద్రస్వామి దేవాలయం
  • పాటిమీద ఆజనేయస్వామి దేవాలయం
  • రంగనాయకుల గుట్ట, కొండ రాయికి వెలసిన గణపతి దేవాలయం
  • వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయం (చుట్టుూ వరాహం ఒక రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రదక్షిణలు చేస్తు అందరినీ ఆకట్టుకుంది)
  • కాకతీయుల కాలంనాటి శివాలయము. (ఒకే మండపమునకు తూర్పు, ఉత్తర దక్షిణ ముఖములుగాయున్న మూడు గర్భ గుడులతో నిర్మిచబడిఉంది),నంది, కోనేరు, అశ్వశాల.
  • హుజూరాబాద్ పట్టణానికి 7 కి.మీ. దూరంలో ఉన్న గొడిశాల గ్రామంలో ఉన్న శివాలయం

మసీదులు

  • జుమా మసీద్
  • ఏక్ మినర్ మసీద్
  • ఈద్-ఘా

ఇతరంలు

సకల జనుల సమ్మె

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా 2011 సెప్టెంబరు 13 నుంచి 2011 అక్టోబరు 23 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.సకలసమ్మెలో అన్ని కుల సంఘల వారు పాల్గొన్నరు విశ్వబ్రహ్మణుల అధ్యక్షులు బాణల సదానందంగారు చెయి కోసుకొని రక్తము అర్పించారు

కుల సంఘాలు

  • జాతీయ బీసీ సంక్షేమ సంఘం (అధ్యక్షులు: రావుల అశోక్)
  • విశ్వబ్రాహ్మణ మను మయ మండల కమిటి (అధ్యక్షులు: బాణాల సదానందం)
  • విశ్వబ్రాహ్మణ మనుమయ పట్టణ సంఘం (అధ్యక్షులు:రావుల వేణు)
  • విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం (అధ్యక్షులు:మునిగంటి నాగరాజు)
  • వీరబ్రహ్మేంద్రస్వామి స్వచ్ఛంద సేవ సంఘం (వ్యవస్థాపకులు:కస్తూరి నరేంద్రచారి)

మండలంలోని గ్రామాలు

  1. సింగాపూర్
  2. సిర్సపల్లి
  3. పోతిరెడ్డిపేట
  4. చెల్పూర్
  5. జూపాక
  6. హుజూరాబాద్
  7. తుమ్మనపల్లి
  8. బోర్నపల్లి
  9. కట్రేపల్లి
  10. కందుగుల
  11. కనుకులగిద్ద
  12. ధర్మరాజుపల్లి

మూలాలు

  1. http://www.mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Karimnagar.pdf
  2. "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Retrieved 28 June 2016.
  3. "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 26 July 2014.
  4. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లింకులు