కమ్మ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Reverted 1 edit by Lillinan1 (talk) identified as vandalism to last revision by Pavan santhosh.s. (TW)
ట్యాగు: రద్దుచెయ్యి
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''కమ్మ''' (Kamma) లేక '''కమ్మవారు''' అనునది [[భారతదేశం]]లో ఒక [[కులం]]<ref>కమ్మవారి చరిత్ర, కొత్త బాపయ్య చౌదరి, 1939, పావులూరి పబ్లిషర్స్, గుంటూరు, కొత్త ఎడిషన్, 2006</ref>. ఈ కులస్తులు ప్రధానంగా [[ఆంధ్ర ప్రదేశ్]], [[తెలంగాణా]] మరియు [[తమిళనాడు]] రాష్ట్రాలలోను, కొద్ది సంఖ్యలో [[కర్ణాటక]], [[గుజరాత్]], [[ఒరిస్సా]], [[మహారాష్ట్ర]] మరియు [[ఢిల్లీ]]లో ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్ జనాభాలో 5 నుండి 6% ఉంటారని అంచనా.<ref>[http://www.odi.org.uk/publications/working_papers/wp180.pdf Democratic Process and Electoral Politics in Andhra Pradesh, India], కె.సి.సూరి (సెప్టెంబరు 2002), 11వ పేజీ</ref><ref>1921 జనాభా లెక్కల ప్రకారం కమ్మ కులం జనాభా 4.8%. కులాల వారీగా జనాభా లెక్కల నమోదు 1921 తరువాత జరుగలేదు. [http://www.odi.org.uk/publications/working_papers/wp179.pdf Caste, Class and Social Articulation in Andhra Pradesh: Mapping Differential Regional Trajectories], కె.శ్రీనివాసులు (సెప్టెంబరు 2002), పొలిటికల్ సైన్సు విభాగం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాదు; 3వ పేజీ. ఇప్పటి జనాభాలో ఏ కులం శాతం ఎంత అనే విషయంపై అంచనాలు మాత్రమే చలామణీ అవుతున్నాయి</ref>. వీరి భాష ప్రధానంగా [[తెలుగు]]. ఈ కులమువారు ముఖ్యముగా ఆంధ్ర ప్రదేశ్‌లోని, తెలంగాణాలోని [[అనంతపురం]], [[పశ్చిమ గోదావరి]], [[తూర్పు గోదావరి]], [[కరీంనగర్]], [[నిజామాబాద్]], [[వరంగల్]], [[కృష్ణా జిల్లా|కృష్ణా]], [[గుంటూరు]], [[ప్రకాశం]], [[నెల్లూరు]], [[చిత్తూరు]], [[ఖమ్మం]], [[రంగారెడ్డి]], [[హైదరాబాద్]] జిల్లాలలోను, మరియు [[తమిళనాడు]]లో కొన్ని ప్రాంతాల ([[కోయంబత్తూరు]], [[మదురై]], రాజాపాళ్యం, [[తంజావూరు]]) లోను ఉన్నారు. కొంతమంది కమ్మవారు తమ కులనామం అయిన "కమ్మ" అనే పేరునే తమ ఇంటిపేరుగా ఉపయోగిస్తున్నారు<ref>కమ్మవారి చరిత్ర, [[కొత్త భావయ్య]], 1939, కొత్త ఎడిషను, 2006, పావులూరి పబ్లిషర్సు, గుంటూరు</ref>.
'''కమ్మ''' (Kamma) లేక '''కమ్మవారు''' అనునది [[భారతదేశం]]లో ఒక సామాజిక వర్గం లేక [[కులం]]<ref>కమ్మవారి చరిత్ర, కొత్త బాపయ్య చౌదరి, 1939, పావులూరి పబ్లిషర్స్, గుంటూరు, కొత్త ఎడిషన్, 2006</ref>. కమ్మవారు ప్రధానంగా [[ఆంధ్ర ప్రదేశ్]], [[తెలంగాణా]] మరియు [[తమిళనాడు]] రాష్ట్రాలలోను, కొద్ది సంఖ్యలో [[కర్ణాటక]], [[గుజరాత్]], [[ఒరిస్సా]], [[మహారాష్ట్ర]] మరియు [[ఢిల్లీ]]లో ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్ జనాభాలో 5 నుండి 6% ఉంటారని అంచనా.<ref>[http://www.odi.org.uk/publications/working_papers/wp180.pdf Democratic Process and Electoral Politics in Andhra Pradesh, India], కె.సి.సూరి (సెప్టెంబరు 2002), 11వ పేజీ</ref><ref>1921 జనాభా లెక్కల ప్రకారం కమ్మ కులం జనాభా 4.8%. కులాల వారీగా జనాభా లెక్కల నమోదు 1921 తరువాత జరుగలేదు. [http://www.odi.org.uk/publications/working_papers/wp179.pdf Caste, Class and Social Articulation in Andhra Pradesh: Mapping Differential Regional Trajectories], కె.శ్రీనివాసులు (సెప్టెంబరు 2002), పొలిటికల్ సైన్సు విభాగం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాదు; 3వ పేజీ. ఇప్పటి జనాభాలో ఏ కులం శాతం ఎంత అనే విషయంపై అంచనాలు మాత్రమే చలామణీ అవుతున్నాయి</ref>. వీరి భాష ప్రధానంగా [[తెలుగు]]. ఈ కులమువారు ముఖ్యముగా ఆంధ్ర ప్రదేశ్‌లోని, తెలంగాణాలోని [[అనంతపురం]], [[పశ్చిమ గోదావరి]], [[తూర్పు గోదావరి]], [[కరీంనగర్]], [[నిజామాబాద్]], [[వరంగల్]], [[కృష్ణా జిల్లా|కృష్ణా]], [[గుంటూరు]], [[ప్రకాశం]], [[నెల్లూరు]], [[చిత్తూరు]], [[ఖమ్మం]], [[రంగారెడ్డి]], [[హైదరాబాద్]] జిల్లాలలోను, మరియు [[తమిళనాడు]]లో కొన్ని ప్రాంతాల ([[కోయంబత్తూరు]], [[మదురై]], రాజాపాళ్యం, [[తంజావూరు]]) లోను ఉన్నారు. కొంతమంది కమ్మవారు తమ కులనామం అయిన "కమ్మ" అనే పేరునే తమ ఇంటిపేరుగా ఉపయోగిస్తున్నారు<ref>కమ్మవారి చరిత్ర, [[కొత్త భావయ్య]], 1939, కొత్త ఎడిషను, 2006, పావులూరి పబ్లిషర్సు, గుంటూరు</ref>.


==చరిత్ర==
==చరిత్ర==
[[File:Kaapaneedu.jpg|thumb|కాకతీయుల పతనం అనంతరం ఢిల్లీ సుల్తానులు ఓడించి స్వతంత్ర రాజ్యం స్థాపించిన ముసునూరి కాపయ నాయకుడు]]
[[File:Kaapaneedu.jpg|thumb|కాకతీయుల పతనం అనంతరం ఢిల్లీ సుల్తానులు ఓడించి స్వతంత్ర రాజ్యం స్థాపించిన ముసునూరి కాపయ నాయకుడు]]
=== పుట్టు పూర్వోత్తరాలు ===
=== పుట్టు పూర్వోత్తరాలు ===
కమ్మ అన్న పదం సా.శ. ఒకటో శతాబ్దం నుంచి ఉంది.<ref>[http://www.archive.org/details/andhrulacharitra025965mbp ఆంధ్రుల చరిత్రము - మొదటి భాగము, చిలుకూరి వీరభద్ర రావు, 1910, పేజి 232]</ref> కమ్మవారి పుట్టుపూర్వోత్తరాలు, చరిత్ర విషయంలో పలు సిద్ధాంతాలు, వాదనలు ఉన్నాయి. గుండ్లకమ్మ వాగు పరిసర ప్రాంతాలను ప్రాచీన ప్రాంత విభాగమైన కమ్మనాడుగా పిలిచేవారనీ, ఆ ప్రాంతంతో మూలాలు ముడిపడివుండడంతో ఈ కులానికి కమ్మ అన్న పేరు వచ్చినట్టు చెప్తారు. ప్రధానంగా దీని ప్రకారం వీరు ఈ ప్రాంతానికి స్థానికులు, వ్యవసాయదారులు. 1940ల నుంచి పలువురు కమ్మ కులస్తులైన చరిత్రకారులు రాసిన కుల చరిత్రల్లో మూలాలకు సంబంధించి మరో కథనం వ్యాప్తిలో ఉంది. దాని ప్రకారం వీరు సామాన్య శక పూర్వం గంగా మైదానంలోని కర్మ రాష్ట్రానికి చెందిన బౌద్ధులనీ, సా.శ.పూ. 184 సమయంలో రాజ్యానికి వచ్చిన పుష్యమిత్ర సుంగుని అణచివేత తట్టుకోలేక పెద్ద సంఖ్యలో దక్షిణాదిన ఉన్న కృష్ణా నదీ పరివాహక ప్రాంతానికి వలసవచ్చారనీ చెప్తారు. సంస్కృతంలోని కర్మ పదం పాళి భాషలోని కమ్మగా మారిందనీ, ఆ పదాన్నే వీరు వెంట తీసుకువచ్చి తమను కమ్మ కులస్తులుగా చెప్పుకున్నారనీ ఈ ప్రత్యామ్నాయ కథనం చెప్తోంది. ఈ సిద్ధాంతం కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని బౌద్ధ సంస్కృతిని వారు కమ్మ రాష్ట్రం నుంచి తీసుకువచ్చారని పేర్కొంటోంది. మరికొన్ని భేదాలతో ఇటువంటి సిద్ధాంతాలు విరవిగా కనిపిస్తున్నాయి. సా.శ. పదో శతాబ్దం నుంచి కమ్మ వారు కులంగా ఉన్నట్టు ప్రస్తావనలు ఉన్నాయి.
కమ్మ అన్న పదం సా.శ. ఒకటో శతాబ్దం నుంచి ఉంది.<ref>[http://www.archive.org/details/andhrulacharitra025965mbp ఆంధ్రుల చరిత్రము - మొదటి భాగము, చిలుకూరి వీరభద్ర రావు, 1910, పేజి 232]</ref> కమ్మవారి పుట్టుపూర్వోత్తరాలు, చరిత్ర విషయంలో పలు సిద్ధాంతాలు, వాదనలు ఉన్నాయి. గుండ్లకమ్మ వాగు పరిసర ప్రాంతాలను ప్రాచీన ప్రాంత విభాగమైన [[కమ్మనాడు]]గా పిలిచేవారనీ, ఆ ప్రాంతంతో మూలాలు ముడిపడివుండడంతో ఈ కులానికి కమ్మ అన్న పేరు వచ్చినట్టు చెప్తారు. ప్రధానంగా దీని ప్రకారం వీరు ఈ ప్రాంతానికి స్థానికులు, వ్యవసాయదారులు. 1940ల నుంచి పలువురు కమ్మ కులస్తులైన చరిత్రకారులు రాసిన కుల చరిత్రల్లో మూలాలకు సంబంధించి మరో కథనం వ్యాప్తిలో ఉంది. దాని ప్రకారం వీరు సామాన్య శక పూర్వం గంగా మైదానంలోని కర్మ రాష్ట్రానికి చెందిన బౌద్ధులనీ, సా.శ.పూ. 184 సమయంలో రాజ్యానికి వచ్చిన పుష్యమిత్ర సుంగుని అణచివేత తట్టుకోలేక పెద్ద సంఖ్యలో దక్షిణాదిన ఉన్న కృష్ణా నదీ పరివాహక ప్రాంతానికి వలసవచ్చారనీ చెప్తారు. సంస్కృతంలోని కర్మ పదం పాళి భాషలోని కమ్మగా మారిందనీ, ఆ పదాన్నే వీరు వెంట తీసుకువచ్చి తమను కమ్మ కులస్తులుగా చెప్పుకున్నారనీ ఈ ప్రత్యామ్నాయ కథనం చెప్తోంది. ఈ సిద్ధాంతం కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని బౌద్ధ సంస్కృతిని వారు కమ్మ రాష్ట్రం నుంచి తీసుకువచ్చారని పేర్కొంటోంది. మరికొన్ని భేదాలతో ఇటువంటి సిద్ధాంతాలు విరవిగా కనిపిస్తున్నాయి. సా.శ. పదో శతాబ్దం నుంచి కమ్మ వారు కులంగా ఉన్నట్టు ప్రస్తావనలు ఉన్నాయి. ఐతే [[కమ్మనాడు]] సంబంధించిన మిగతా వర్గములను కూడ చారిత్రకముగా కమ్మబ్రాహ్మణులు, కమ్మకాపులు, కమ్మకోమటులు అని పిలిచేవారు. కాలక్రమములో ఈ భౌగోళిక సూచన కమ్మవారికి మాత్రమే కులనామముగా మిగిలిపోయింది.
==పరిశోధన==

ఆధునిక విజ్ఞాన పరముగా తెలుగువారిలోని కమ్మవారిలో మధ్యాసియా వాసులలో గుర్తించిన M124 జన్యువు 75% శాతము కలదు. ఈ జన్యువు ఉత్తర భారతములోని వారణాసి ప్రాంతంలో నివసించు జౌంపూర్ (Jaunpur) క్షత్రియులలో 80% శాతము కలదు. దీనిని హాప్లో గ్రూపు haplogroup R2 అందురు. ఐరోపా మరియు ఉత్తర భారత ఆర్యులలో హాప్లోగ్రూపు R2 నకు బహుసమీపములో ఉండు హాప్లోగ్రూపు R1a1(M17) కలదు. ఈ పరిశోధన ఇంకా ఎక్కువమంది నమూనాలు సేకరించి నిశితముగా చేయవలిసిన అవసరమున్నది.

=== రాజ్యపాలన, సైనిక వృత్తి ===
=== రాజ్యపాలన, సైనిక వృత్తి ===
కమ్మ వారు శూద్ర వర్ణస్తులు. అయితే వీరు చారిత్రకంగా క్షత్రియులు అనీ, దుర్జయ వంశస్థులనీ కొన్ని కుల చరిత్రల్లో వాదనలు ఉన్నాయి. కాకతీయ చక్రవర్తులకు వీరికి వివాహ సంబంధాలు ఉండడం ఆధారంగా కాకతీయ వంశం కమ్మ కులస్తులన్న వాదన, తద్వారా కమ్మవారికి క్షత్రియత్వం ఉండేదన్న వాదన ఉంది. కమ్మవారిని దుర్జయ వంశస్థులుగా కొన్ని శాసనాలు పేర్కొనడంతో, దుర్జయ వంశస్థులైన కాకతీయులు కమ్మవారు కావచ్చునని కొందరు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.<ref>తెలంగాణ సమగ్ర చరిత్ర, 2016, తెలుఁగు అకాడమీ ముద్రణ</ref> కమ్మ కులస్తులు తాము ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ఉన్నత స్థితికి చేరుకున్నాకా కాకతీయుల పేరును, కాకతీయ తోరణం వంటి చిహ్నాలను తమ కుల సంఘాలు, కాలనీలు, ప్రదేశాలకు ఔన్నత్య సూచకంగా ఉపయోగించారు.
కమ్మ వారు శూద్ర వర్ణస్తులు. పలు శాసనలములోకమ్మనాయకులు దుర్జయ వంశ, చతుర్థాన్వయ అని పేర్కొనబడ్డారు. అయితే వీరు చారిత్రకంగా క్షత్రియులు అనీ, దుర్జయ వంశస్థులనీ కొన్ని కుల చరిత్రల్లో వాదనలు ఉన్నాయి. కాకతీయ చక్రవర్తులకు వీరికి వివాహ సంబంధాలు ఉండడం ఆధారంగా కాకతీయ వంశం కమ్మ కులస్తులన్న వాదన, తద్వారా కమ్మవారికి క్షత్రియత్వం ఉండేదన్న వాదన ఉంది. కమ్మవారిని దుర్జయ వంశస్థులుగా కొన్ని శాసనాలు పేర్కొనడంతో, దుర్జయ వంశస్థులైన కాకతీయులు కమ్మవారు కావచ్చునని కొందరు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.<ref>తెలంగాణ సమగ్ర చరిత్ర, 2016, తెలుఁగు అకాడమీ ముద్రణ</ref> కమ్మ కులస్తులు తాము ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ఉన్నత స్థితికి చేరుకున్నాకా కాకతీయుల పేరును, కాకతీయ తోరణం వంటి చిహ్నాలను తమ కుల సంఘాలు, కాలనీలు, ప్రదేశాలకు ఔన్నత్య సూచకంగా ఉపయోగించారు.


[[కాకతీయ సామ్రాజ్యం]]లో కమ్మవారు సైన్యాధ్యక్ష హోదా నుంచి పలు సైనిక పదవుల్లోనూ, సైన్య భాగంలోనూ ఉండేవారు. కాకతీయ సామ్రాజ్యం పతనం చెందాకా [[బెండపూడి అన్నయ మంత్రి|అన్నయ మంత్రి]] ఆధ్వర్యంలో కాకతీయ సేనానులు [[ముసునూరి కాపయ నాయుడు|ముసునూరి కాపయ నాయుడి]] నాయకత్వంలో తిరుగుబాటు చేసి [[ఓరుగల్లు]] స్వాధీనం చేసుకున్నారు. సంక్లిష్టమైన దశాబ్దాల్లో కమ్మవారైన [[ముసునూరి నాయకులు]] ఓరుగల్లు రాజధానిగా ఆంధ్రదేశాన్ని పరిపాలించి, దక్షిణ భారతదేశంలో హైందవ రాజవంశాలు పట్టు సంపాదించేందుకు వీలిచ్చారు.<ref>ముసునూరి నాయకులు, మల్లంపల్లి సోమశేఖర శర్మ ఎమెస్కో పునర్ముద్రణ, 2015</ref> ముసునూరి నాయకుల రాజ్యం పతనం చెందాకా [[విజయనగర సామ్రాజ్యం]]లో సైనిక విభాగంలోనూ, సామంత రాజులుగానూ కమ్మవారు పనిచేశారు. ఈ క్రమంలో విజయనగర సామ్రాజ్య విస్తరణలో భాగంగా నేటి తమిళనాడు ప్రాంతాలకు సైనికుల నుంచి సైన్యాధ్యక్షుల వరకూ పలు హోదాల్లో కమ్మవారు వెళ్ళారు. ఆ ప్రాంతాన్ని ఆక్రమించాకా స్థానికంగా ఒక పక్క రాజకీయ నాయకత్వం, మరోపక్క వ్యవసాయ వృత్తి చేపట్టి స్థిరపడ్డారు. [[అమరావతీ సంస్థానం|వాసిరెడ్డి]], [[దూపాడు సంస్థానం|శాయపనేని]], [[పెమ్మసాని నాయకులు|పెమ్మసాని]], [[రావిళ్ల నాయకులు|రావెళ్ళ]]వంటి కమ్మవారి వంశాలు రాజ్యాలు, సంస్థానాలను పరిపాలించాయి..<ref>శ్రీ కృష్ణ దేవ రాయలు వంశ మూలాలు, ముత్తేవి రవీంద్రనాథ్, సావిత్రి పబ్లికేషన్స్</ref>
[[కాకతీయ సామ్రాజ్యం]]లో కమ్మవారు సైన్యాధ్యక్ష హోదా నుంచి పలు సైనిక పదవుల్లోనూ, సైన్య భాగంలోనూ ఉండేవారు. కాకతీయ సామ్రాజ్యం పతనం చెందాకా [[బెండపూడి అన్నయ మంత్రి|అన్నయ మంత్రి]] ఆధ్వర్యంలో కాకతీయ సేనానులు [[ముసునూరి కాపయ నాయుడు|ముసునూరి కాపయ నాయుడి]] నాయకత్వంలో తిరుగుబాటు చేసి [[ఓరుగల్లు]] స్వాధీనం చేసుకున్నారు. సంక్లిష్టమైన దశాబ్దాల్లో కమ్మవారైన [[ముసునూరి నాయకులు]] ఓరుగల్లు రాజధానిగా ఆంధ్రదేశాన్ని పరిపాలించి, దక్షిణ భారతదేశంలో హైందవ రాజవంశాలు పట్టు సంపాదించేందుకు వీలిచ్చారు.<ref>ముసునూరి నాయకులు, మల్లంపల్లి సోమశేఖర శర్మ ఎమెస్కో పునర్ముద్రణ, 2015</ref> ముసునూరి నాయకుల రాజ్యం పతనం చెందాకా [[విజయనగర సామ్రాజ్యం]]లో సైనిక విభాగంలోనూ, సామంత రాజులుగానూ కమ్మవారు పనిచేశారు. ఈ క్రమంలో విజయనగర సామ్రాజ్య విస్తరణలో భాగంగా నేటి తమిళనాడు ప్రాంతాలకు సైనికుల నుంచి సైన్యాధ్యక్షుల వరకూ పలు హోదాల్లో కమ్మవారు వెళ్ళారు. ఆ ప్రాంతాన్ని ఆక్రమించాకా స్థానికంగా ఒక పక్క రాజకీయ నాయకత్వం, మరోపక్క వ్యవసాయ వృత్తి చేపట్టి స్థిరపడ్డారు. [[అమరావతీ సంస్థానం|వాసిరెడ్డి]], [[దూపాడు సంస్థానం|శాయపనేని]], [[పెమ్మసాని నాయకులు|పెమ్మసాని]], [[రావిళ్ల నాయకులు|రావెళ్ళ]]వంటి కమ్మవారి వంశాలు రాజ్యాలు, సంస్థానాలను పరిపాలించాయి..<ref>శ్రీ కృష్ణ దేవ రాయలు వంశ మూలాలు, ముత్తేవి రవీంద్రనాథ్, సావిత్రి పబ్లికేషన్స్</ref>

05:05, 23 ఫిబ్రవరి 2019 నాటి కూర్పు

కమ్మ (Kamma) లేక కమ్మవారు అనునది భారతదేశంలో ఒక సామాజిక వర్గం లేక కులం[1]. కమ్మవారు ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా మరియు తమిళనాడు రాష్ట్రాలలోను, కొద్ది సంఖ్యలో కర్ణాటక, గుజరాత్, ఒరిస్సా, మహారాష్ట్ర మరియు ఢిల్లీలో ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్ జనాభాలో 5 నుండి 6% ఉంటారని అంచనా.[2][3]. వీరి భాష ప్రధానంగా తెలుగు. ఈ కులమువారు ముఖ్యముగా ఆంధ్ర ప్రదేశ్‌లోని, తెలంగాణాలోని అనంతపురం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలలోను, మరియు తమిళనాడులో కొన్ని ప్రాంతాల (కోయంబత్తూరు, మదురై, రాజాపాళ్యం, తంజావూరు) లోను ఉన్నారు. కొంతమంది కమ్మవారు తమ కులనామం అయిన "కమ్మ" అనే పేరునే తమ ఇంటిపేరుగా ఉపయోగిస్తున్నారు[4].

చరిత్ర

కాకతీయుల పతనం అనంతరం ఢిల్లీ సుల్తానులు ఓడించి స్వతంత్ర రాజ్యం స్థాపించిన ముసునూరి కాపయ నాయకుడు

పుట్టు పూర్వోత్తరాలు

కమ్మ అన్న పదం సా.శ. ఒకటో శతాబ్దం నుంచి ఉంది.[5] కమ్మవారి పుట్టుపూర్వోత్తరాలు, చరిత్ర విషయంలో పలు సిద్ధాంతాలు, వాదనలు ఉన్నాయి. గుండ్లకమ్మ వాగు పరిసర ప్రాంతాలను ప్రాచీన ప్రాంత విభాగమైన కమ్మనాడుగా పిలిచేవారనీ, ఆ ప్రాంతంతో మూలాలు ముడిపడివుండడంతో ఈ కులానికి కమ్మ అన్న పేరు వచ్చినట్టు చెప్తారు. ప్రధానంగా దీని ప్రకారం వీరు ఈ ప్రాంతానికి స్థానికులు, వ్యవసాయదారులు. 1940ల నుంచి పలువురు కమ్మ కులస్తులైన చరిత్రకారులు రాసిన కుల చరిత్రల్లో మూలాలకు సంబంధించి మరో కథనం వ్యాప్తిలో ఉంది. దాని ప్రకారం వీరు సామాన్య శక పూర్వం గంగా మైదానంలోని కర్మ రాష్ట్రానికి చెందిన బౌద్ధులనీ, సా.శ.పూ. 184 సమయంలో రాజ్యానికి వచ్చిన పుష్యమిత్ర సుంగుని అణచివేత తట్టుకోలేక పెద్ద సంఖ్యలో దక్షిణాదిన ఉన్న కృష్ణా నదీ పరివాహక ప్రాంతానికి వలసవచ్చారనీ చెప్తారు. సంస్కృతంలోని కర్మ పదం పాళి భాషలోని కమ్మగా మారిందనీ, ఆ పదాన్నే వీరు వెంట తీసుకువచ్చి తమను కమ్మ కులస్తులుగా చెప్పుకున్నారనీ ఈ ప్రత్యామ్నాయ కథనం చెప్తోంది. ఈ సిద్ధాంతం కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని బౌద్ధ సంస్కృతిని వారు కమ్మ రాష్ట్రం నుంచి తీసుకువచ్చారని పేర్కొంటోంది. మరికొన్ని భేదాలతో ఇటువంటి సిద్ధాంతాలు విరవిగా కనిపిస్తున్నాయి. సా.శ. పదో శతాబ్దం నుంచి కమ్మ వారు కులంగా ఉన్నట్టు ప్రస్తావనలు ఉన్నాయి. ఐతే కమ్మనాడు సంబంధించిన మిగతా వర్గములను కూడ చారిత్రకముగా కమ్మబ్రాహ్మణులు, కమ్మకాపులు, కమ్మకోమటులు అని పిలిచేవారు. కాలక్రమములో ఈ భౌగోళిక సూచన కమ్మవారికి మాత్రమే కులనామముగా మిగిలిపోయింది.

పరిశోధన

ఆధునిక విజ్ఞాన పరముగా తెలుగువారిలోని కమ్మవారిలో మధ్యాసియా వాసులలో గుర్తించిన M124 జన్యువు 75% శాతము కలదు. ఈ జన్యువు ఉత్తర భారతములోని వారణాసి ప్రాంతంలో నివసించు జౌంపూర్ (Jaunpur) క్షత్రియులలో 80% శాతము కలదు. దీనిని హాప్లో గ్రూపు haplogroup R2 అందురు. ఐరోపా మరియు ఉత్తర భారత ఆర్యులలో హాప్లోగ్రూపు R2 నకు బహుసమీపములో ఉండు హాప్లోగ్రూపు R1a1(M17) కలదు. ఈ పరిశోధన ఇంకా ఎక్కువమంది నమూనాలు సేకరించి నిశితముగా చేయవలిసిన అవసరమున్నది.

రాజ్యపాలన, సైనిక వృత్తి

కమ్మ వారు శూద్ర వర్ణస్తులు. పలు శాసనలములోకమ్మనాయకులు దుర్జయ వంశ, చతుర్థాన్వయ అని పేర్కొనబడ్డారు. అయితే వీరు చారిత్రకంగా క్షత్రియులు అనీ, దుర్జయ వంశస్థులనీ కొన్ని కుల చరిత్రల్లో వాదనలు ఉన్నాయి. కాకతీయ చక్రవర్తులకు వీరికి వివాహ సంబంధాలు ఉండడం ఆధారంగా కాకతీయ వంశం కమ్మ కులస్తులన్న వాదన, తద్వారా కమ్మవారికి క్షత్రియత్వం ఉండేదన్న వాదన ఉంది. కమ్మవారిని దుర్జయ వంశస్థులుగా కొన్ని శాసనాలు పేర్కొనడంతో, దుర్జయ వంశస్థులైన కాకతీయులు కమ్మవారు కావచ్చునని కొందరు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.[6] కమ్మ కులస్తులు తాము ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ఉన్నత స్థితికి చేరుకున్నాకా కాకతీయుల పేరును, కాకతీయ తోరణం వంటి చిహ్నాలను తమ కుల సంఘాలు, కాలనీలు, ప్రదేశాలకు ఔన్నత్య సూచకంగా ఉపయోగించారు.

కాకతీయ సామ్రాజ్యంలో కమ్మవారు సైన్యాధ్యక్ష హోదా నుంచి పలు సైనిక పదవుల్లోనూ, సైన్య భాగంలోనూ ఉండేవారు. కాకతీయ సామ్రాజ్యం పతనం చెందాకా అన్నయ మంత్రి ఆధ్వర్యంలో కాకతీయ సేనానులు ముసునూరి కాపయ నాయుడి నాయకత్వంలో తిరుగుబాటు చేసి ఓరుగల్లు స్వాధీనం చేసుకున్నారు. సంక్లిష్టమైన దశాబ్దాల్లో కమ్మవారైన ముసునూరి నాయకులు ఓరుగల్లు రాజధానిగా ఆంధ్రదేశాన్ని పరిపాలించి, దక్షిణ భారతదేశంలో హైందవ రాజవంశాలు పట్టు సంపాదించేందుకు వీలిచ్చారు.[7] ముసునూరి నాయకుల రాజ్యం పతనం చెందాకా విజయనగర సామ్రాజ్యంలో సైనిక విభాగంలోనూ, సామంత రాజులుగానూ కమ్మవారు పనిచేశారు. ఈ క్రమంలో విజయనగర సామ్రాజ్య విస్తరణలో భాగంగా నేటి తమిళనాడు ప్రాంతాలకు సైనికుల నుంచి సైన్యాధ్యక్షుల వరకూ పలు హోదాల్లో కమ్మవారు వెళ్ళారు. ఆ ప్రాంతాన్ని ఆక్రమించాకా స్థానికంగా ఒక పక్క రాజకీయ నాయకత్వం, మరోపక్క వ్యవసాయ వృత్తి చేపట్టి స్థిరపడ్డారు. వాసిరెడ్డి, శాయపనేని, పెమ్మసాని, రావెళ్ళవంటి కమ్మవారి వంశాలు రాజ్యాలు, సంస్థానాలను పరిపాలించాయి..[8]

వృత్తులు

కమ్మ కులస్తులు చారిత్రకంగా సైన్యాధ్యక్షులుగా, పరిపాలకులుగా పాలన, రాజకీయ వృత్తుల్లో పలు హోదాల్లో పనిచేశారు. 20వ శతాబ్ది తొలినాళ్ళకు కమ్మవారు ప్రధానంగా వ్యవసాయదారులుగా ఉండేవారు. వీరు ప్రత్యేకించి వ్యవసాయ వృత్తిలో మంచి పేరు సంపాదించుకున్నారు. 20వ శతాబ్ది మలిభాగం నుంచి వివిధ వృత్తుల్లోకి ప్రవేశించి, విజయం సాధించడం పెరిగింది. సినిమా, ఆతిథ్యం, వైద్యం, విద్య, పత్రికలు, మీడియా - వంటి అనేక రంగాల్లో కమ్మవారు ప్రవేశించి వ్యక్తులుగానూ, సంస్థల అధిపతులుగానూ స్థిరపడ్డారు.

వ్యవసాయం

నేటి పశ్చిమగోదావరి జిల్లాలో కొంత భాగం, కృష్ణా, గుంటూరు జిల్లాలు కలిసిన ఉమ్మడి కృష్ణా జిల్లాలో కృష్ణా నదీ బేసిన్: కమ్మవారు వ్యవసాయదారులుగా దీర్ఘకాలంగా వున్న ప్రాంతం (లేత పసుపు రంగులో గుర్తించి ఉంది)

విజయనగర సామ్రాజ్య కాలంలోనూ, కాకతీయ కాలంలోనూ ముమ్మరంగా, ఆపైన కొంతమేరకు సైనిక, రాజకీయ, పరిపాలన వృత్తుల్లో పనిచేసినా, కమ్మవారికి శతాబ్దాలుగా వ్యవసాయం ప్రధాన వృత్తిగా కొనసాగింది. ప్రధానంగా కృష్ణా డెల్టా ప్రాంతంలో 20 శాతం జనాభా, 80 శాతం వ్యవసాయ భూమి వీరిదేనని ఒక అంచనా. విజయనగర సామ్రాజ్య పరిపాలనా కాలంలో సైనిక హోదాల్లో పనిచేసిన వీరు, దక్షిణాంధ్ర ప్రాంతాల(నేటి తమిళనాడు)ను ఆక్రమించడంలో సాయం చేశారు. యుద్ధంలో పనిచేసి, శాంతి సమయంలో అక్కడే భూములు సాధించుకుని స్థిరపడ్డారు. గణనీయమైన సంఖ్యలో నేటి తమిళనాడు ప్రాంతాల్లో స్థిరపడ్డ వీరు అప్పటికే ఉన్న వ్యవసాయ భూములను, కొత్తగా అడవులను కొట్టి సాగులోకి తెచ్చిన భూములను సాగుచేశారు.[9] హైదరాబాద్ సంస్థానాన్ని నిజాంలు పరిపాలిస్తున్న కాలంలో స్థానిక రాజకీయ సంతులన కోసం, రెవెన్యూ వృద్ధి కోసం కృష్ణా డెల్టా నుంచి వలసవచ్చిన కమ్మవారిని నిజాం సాగర్ ప్రాజెక్టు లబ్ది ప్రాంతాల్లో ఉదారంగా భూములు, రెవెన్యూ హోదాలు ఇచ్చాడు. ఈ ప్రాంతాల్లోనూ విస్తారంగా స్థిరపడి వ్యవసాయం చేశారు.[10] స్వాతంత్రం అనంతరం భారతదేశంలో భూసంస్కరణల ద్వారానూ, రైతాంగ పోరాటాల ద్వారానూ గ్రామాల్లో నివసించని భూస్వాములు, బ్రాహ్మణుల నుంచి గ్రామీణ రైతులైన మరికొందరు కమ్మవారికి దక్కాయి.[11]

1960ల మధ్యకాలంలో ప్రారంభమైన హరిత విప్లవం వల్ల పారంపర్యంగానూ, భూసంస్కరణలు, రైతాంగ పోరాటం ద్వారా లభించిన భూముల ద్వారానూ విస్తారమైన భూయజమానులుగా, వ్యవసాయదారులుగా ఉన్న కమ్మవారి ఆర్థిక స్థితిని బాగా అభివృద్ధి చేసింది. ఈ భూముల్లో కొన్నిటికి అప్పటికే బ్రిటీష్ ప్రభుత్వం, తర్వాతి భారత ప్రభుత్వం నిర్మించిన నీటిపారుదల వ్యవస్థల వల్ల కాలువల ద్వారా నీటి అందుబాటు ఉండడంతో వ్యవసాయదారులైన కమ్మవారికి సంపద మిగులుతో పాటుగా ఆ దశలో రాబడిలో స్థిరత్వమూ పెరిగింది.[11] వ్యవసాయ సంస్కరణలు, హరితవిప్లవం కారణంగా పెరిగిన ధరలకు ఇక్కడ భూమిని అమ్మి ఇతర ప్రాంతాల్లో వ్యవసాయానికి అనుకూలంగా ఉండి చవకగా దొరికే భూములు కొని సాగుచేశారు.[12] వ్యవసాయ వలసల్లోనూ కింది స్థాయి కమ్మ వ్యవసాయదారులు కృష్ణా డెల్టాలోని కొద్దిభూములను అమ్ముకుని తెలంగాణ, రాయలసీమల్లోని సాగునీటి సౌకర్యం లేని భూములను పెద్ద ఎత్తున కొనుగోలు చేసి, బోరు బావుల ద్వారా సాగు వృద్ధి చేసుకుని మధ్యస్థాయి వ్యవసాయదారులు అయ్యారు. మధ్యస్థాయి, సంపన్న కమ్మ వ్యవసాయదారులు నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులు, కెసి కెనాల్, తుంగభద్ర, పెన్న నదుల ఆయకట్టుల్లో విస్తారంగా భూములు కొన్నారు.[13]

కమ్మవారు 20వ శతాబ్ది రెండవ అర్థభాగం నుంచి పలు రంగాల్లో వ్యాపార, ఉద్యోగ హోదాల్లో రాణిస్తున్నా, పలు కుటుంబాల ఆర్థిక కేంద్రం వ్యవసాయం నుంచి తరలిపోయినా కృష్ణా డెల్టాలోని భూములను పూర్తిగా అమ్ముకోలేదు. అందుకు భిన్నంగా ఇతర పెట్టుబడుల నుంచి వచ్చిన మిగులును భూములకు మళ్ళించడం కనిపిస్తుంది. పలువురు ఇతర వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాల కారణంగా స్వయంగా వ్యవసాయం చేసే పరిస్థితి లేకున్నా ఈ భూములను కనీసం కౌలుకు ఇచ్చి భూములపై తమ యాజమాన్యాన్ని కొనసాగిస్తున్నారు.[14][10]

వ్యాపారం, పరిశ్రమలు

బ్రిటీష్ ఇండియా, భారత ప్రభుత్వాలు కాలువల తవ్వకం, భారీ నీటి పారుదల ప్రాజెక్టులు వంటి వ్యవసాయ సంస్కరణల ద్వారా చేసిన వ్యవసాయాభివృద్ధి నుంచి లాభం పొంది, వలసలతో ఇతర ప్రాంతాల్లోనూ వ్యవసాయ అవకాశాలను అందిపుచ్చుకున్న కమ్మవారు 20వ శతాబ్ది మధ్యభాగం నుంచి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. ఈ ప్రయత్నాలు సంపదను వికేంద్రీకరించడంలో ఉపకరించాయి. 1960లు, 70ల్లో జరిగిన హరిత విప్లవం ఈ ప్రయత్నాలకు తోడుకావడంతో పెట్టుబడికి మరింత అవకాశం కలిగి వ్యాపారాలను విస్తరించారు.

కమ్మవారిలో జమీందారీ ఉన్న కొద్ది కుటుంబాలు స్వాతంత్రానంతరం తొలి దశాబ్దాల్లోనే పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు పెట్టారు.[నోట్ 1] అయితే హరిత విప్లవం ఫలితాలు ఇస్తున్నా కాలంలోనే వ్యవసాయోత్పత్తుల్లో మిగులును వ్యవసాయాధారిత పరిశ్రమల్లో, రవాణా రంగంలో ప్రధానంగా పెట్టుబడులు పెట్టారు. క్రమేపీ ఈ వ్యాపారాలు వృద్ధిచేస్తూ వ్యవసాయం కొనసాగిస్తూనే, కేవలం వ్యవసాయంపైనే ఆధారపడాల్సిన స్థితి లేకుండా చేసుకున్నారు. ఉద్యోగ రంగంతో పాటుగా వ్యాపార రంగంలోని వీరి అభివృద్ధి కమ్మవారిని మరింత పట్టణీకరణ, నగరీకరణ చెందేలా, హైదరాబాద్‌, విజయవాడ వంటి నగరాల్లో తాము స్థిరపడే దిశగా తీసుకువెళ్ళింది.[12] భారతదేశంలోని రెండవ అతిపెద్ద సినీ పరిశ్రమగా ఎదిగిన తెలుగు సినిమా పరిశ్రమలోనూ కమ్మవారి ప్రభావం విస్తరించింది. అగ్ర కథానాయకులు, దర్శకులు, నిర్మాతల్లో వీరి సంఖ్య ప్రబలంగా ఉండడంతో తెలుగు సినిమా రంగ అభివృద్ధిలో గట్టి పాత్ర పోషించారు. పత్రికా రంగంలోనూ, తర్వాతి దశలో వచ్చిన టీవీ రంగంలోనూ వీరు గణనీయమైన పెట్టుబడులు పెట్టి, పలు తెలుగు పత్రికలు, టీవీ ఛానెళ్ళ అధినేతలుగా కొనసాగుతున్నారు. [15]

కమ్మవారిలో విద్యాభివృద్ధి వల్ల 1960ల్లో తొలి తరం అమెరికా తెలుగు డయాస్పోరాగా వెళ్ళిన డాక్టర్లు, ఇంజనీర్లలో కొందరు పెట్టుబడి, నైపుణ్యంతో తిరిగివచ్చారు. వీరు అంతకుముందు కన్నా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌లో కార్పొరేట్ వైద్యశాలలు, పరిశ్రమలు స్థాపించి నిర్వహించసాగారు. ఇతర వ్యాపార రంగాల్లోనూ వృద్ధి చెందారు. క్రమేపీ 1991 తర్వాత భారతదేశం సరళీకరణ-ప్రపంచీకరణ జరిగడం, 1996 తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు సరళీకరణ-ప్రపంచీకరణ విధానాలను వినియోగించుకుని నియో-లిబరలైజేషన్ పద్ధతులను ప్రోత్సహించడం వంటి పరిణామాలతో ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్‌ కళాశాలలు, కార్పొరేట్ సంస్థలు వంటివాటి స్థాపనలో కమ్మవారు మరింతగా వ్యాపారాభివృద్ధి చేశారు. హైదరాబాద్‌ నగరంలో రియల్‌ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టి ఆ రంగంలో విజయం సాధించారు.[15]

విద్యాభివృద్ధి, ఉద్యోగాలు

20వ శతాబ్దికి ముందు భారతదేశంలో ఇతర వ్యవసాయ కులాలలానే వీరిలోనూ అక్షరాస్యత శాతం, ఉన్నత విద్య తక్కువగా ఉండేది. 20వ శతాబ్ది తొలి దశకాల నుంచే సాంఘిక చైతన్యం పెరిగి సంఘీభావం మద్దతు కావడంతో అక్షరాస్యత పెరిగింది. ఈ పెరుగుదలలో 20వ శతాబ్ది తొలినాళ్ళలో అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలో బ్రాహ్మణేతరుల్లో విద్య, ఉద్యోగాలు పెరగాలని బ్రాహ్మణేతరులైన జమీందారులు ప్రారంభించిన బ్రాహ్మణేతరోద్యమ ప్రభావం కూడా ఉంది. కమ్మ మహాజన సభ అన్న కులసంఘం కమ్మవారిలో విద్యాభివృద్ధి ఆవశ్యకతను విస్తారంగా, సుదీర్ఘకాలం చేసిన ప్రచారం త్వరితగతిన వీరిలో విద్యాభివృద్ధి చెందడానికి ఒక ప్రధానమైన కారణంగా నిలిచింది. వీరిలో సంపన్నులు పిల్లల విద్య కోసం అవసరమైన ఖర్చు భరించారు. చుట్టరికాల నెట్‌వర్క్, కులాభివృద్ధిని కేంద్రంగా చేసుకున్న విద్యాసంస్థలు, హాస్టళ్ళు వంటివి కమ్మవారిలో విద్యాభివృద్ధి చాలా ప్రోత్సహించాయి.[16]

విద్యాభివృద్ధి, అక్షరాస్యత కారణంగా బ్రాహ్మణులు ఆధిక్యతతో ఉన్న ఉద్యోగాల్లోకి క్రమేపీ కమ్మవారు ఇతర వ్యవసాయ కులాలతో పాటుగా సంఖ్యలో పెరుగుతూ వచ్చారు. 20వ శతాబ్ది ఉత్తరార్థంలో వైద్యం, ఇంజనీరింగ్ వంటి వృత్తి విద్యలు సహా పలు ఉన్నత విద్యావకాశాలు స్వీకరించి ఆయా ఉద్యోగాల్లో పనిచేశారు.

రాజకీయం

ప్రస్తుతం పలువురు కమ్మ వారు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల రాజకీయాల్లో ప్రముఖ స్థానంలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌.టి.రామారావు, ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ కేంద్ర మంత్రి, భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, మాజీ కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, పలువురు రాష్ట్ర మంత్రులు కమ్మ కులానికి చెందినవారు.

20వ శతాబ్ది తొలినాళ్ళలో బ్రాహ్మణవ్యతిరేకోద్యమం పేరిట ఉద్యోగాలు, విద్య, అధికారం వంటివాటిలో బ్రాహ్మణేతరులకు జనాభా ప్రాతిపదికన అవకాశం దక్కాలని వాదించిన జస్టిస్‌ పార్టీకి కొందరు కమ్మవారు మద్దతుగా ఉండేవారు. జాతీయవాదులుగా బ్రిటీష్ వారు భావించిన బ్రాహ్మణుల ఆధిపత్యం దీని ద్వారా బద్దలుకొట్టవచ్చని భావిస్తూ బ్రిటీష్ ప్రభుత్వం ఈ ఉద్యమానికి మద్దతునిచ్చింది. అయితే 1930ల్లో ఆర్థిక మాంద్యం కారణంగా రైతుల మీద పన్నులు బాగా పెరిగాయి. ఈ దశలో వ్యవసాయదారులైన కమ్మవారు అప్పటివరకూ జస్టిస్ పార్టీ విధానమైన బ్రిటీష్‌ అనుకూలత విడిచిపెట్టి జాతీయోద్యమంలో పనిచేశారు.[17] 1934లో ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచీ పార్టీ ఉన్నత నాయకత్వం నుంచి శ్రేణుల వరకూ కమ్మవారు ఎక్కువగా ఉంటూ వచ్చారు. కమ్యూనిస్టు పార్టీ శాఖ ఆర్థికంగా బలపడడానికి అవసరమైన నిధులు కమ్మవారు విస్తారంగా అందించారు.[18] 20వ శతాబ్ది తొలినాళ్ళలో బ్రాహ్మణేతరోద్యమంలో కీలకంగా పనిచేసిన మరో తెలుగు కులం వారైన రెడ్లు క్రమేణా 1930ల నుంచి రెండు దశాబ్దాల్లో కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గచూపుతూ 1950ల నాటికి ఆంధ్ర కాంగ్రెస్‌లో నిర్ణయాత్మకంగా ఎదిగారు.[19][నోట్ 2]

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో, మరీ ముఖ్యంగా కోస్తాంధ్ర డెల్టాలో, కీలకపాత్ర వహించి, సామాజికంగా, సాంస్కృతికంగా ప్రభావశీలంగా ఉన్నా కమ్మ కులస్తులకు ఎవరికీ రాజకీయాల్లో ముఖ్యమంత్రిత్వం ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన తొలి మూడు దశకాలలో (1950, 1960, 1970) కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో లభించలేదు.[నోట్ 3] 1980 దశకంలో సినీ నటుడు ఎన్‌.టి.రామారావు ఈ పరిణామాన్ని మారుస్తూ తెలుగు దేశం పార్టీ స్థాపించి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అయ్యాడు.[20]

సంస్కృతి

సాహిత్యం

19వ శతాబ్ది వరకూ కమ్మవారిలో కొందరు సంస్థానాధీశులు, పరిపాలకులు సాహిత్య పోషకులు సాహిత్య సేవ చేసేవారు. ముందు శతాబ్దులతో పోలిస్తే 20వ శతాబ్దిలో కవులుగా, రచయితలుగా కమ్మవారు సాహిత్య సృష్టి చేయడం శిఖరాయమానమైన స్థితిని అందుకుంది. ప్రాచీన, మధ్య, ఆధునిక పూర్వ యుగాల్లో కాకతీయుల సేనాని జాయప సేనాని నృత్యరత్నాకరం, వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు

అభివృద్ధి కోసం వలసలు

కొత్త నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం జరిగినా, పెట్టుబడులకు అవకాశాలు కనిపిస్తున్నా, వృత్తి, ఉద్యోగాలకు డిమాండ్ ఉన్నా కమ్మవారు వలస వెళ్ళి స్థిరపడడానికి ఎక్కువ మొగ్గుచూపారు. ఈ క్రమంలో ప్రస్తుత తెలంగాణాలోని నిజామాబాద్ ప్రాంతానికి, హైదరాబాద్, బెంగుళూరు వంటి నగరాలకు, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు, అమెరికా, కెనడా వంటి దేశాలకు భారీ ఎత్తున వలసలు వెళ్ళి వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో అవకాశాలు అందుకున్నారు. అమెరికాలో ఐటీ ఉద్యోగులుగా కానీ, వాణిజ్యవేత్తలుగా కానీ స్థిరపడ్డారు, ప్రస్తుతం తెలుగు డయాస్పోరాలో పెద్ద సంఖ్యలోని వారిలో వీరూ ఉన్నారు. అమెరికాలో న్యూజెర్సీ, కాలిఫోర్నియా వంటి రాష్ట్రాలు సహా పలు రాష్ట్రాల్లో స్థిరపడ్డ వీరు ఉత్తర అమెరికాలోని తెలుగు సాంస్కృతిక సంఘాల్లో ఒకటైన తానాలో ఎక్కువ సంఖ్యలో ఉంటూ సంస్థ నిర్వహణలో కీలకంగా ఉన్నారు.[21]

సామెతల్లో

ప్రతీ కులంపైనా ఉన్నట్టే కమ్మ వారిపైనా సామెతలు ఉన్నాయి. పూర్వం నుంచీ జనం నోళ్ళలో నానుతున్న ఈ సామెతల్లో సాధారణీకరణ కనిపిస్తుంది. క్రమేపీ సమాజంలోని స్థితిగతుల వల్ల ఇవి ప్రాసంగికత కోల్పోతున్నాయి.

  • కమ్మవాని చేతులు కట్టినా నిలవదు
  • కమ్మవాళ్ళు చేరితే కడమ జాతులు వెళ్ళును
  • కమ్మవారికి భూమి భయపడుతుంది

విమర్శలు

1980ల్లో వ్యాపార రంగంలోని కమ్మవారు రాజకీయ ఎదుగుదలకు సహకరించారని తరచుగా పరిశీలకులు పేర్కొంటారు. 1990లు, 2000లో వారి రాజకీయ ఆధిక్యత వ్యాపారంలో కమ్మవారి విజయాలకు పాక్షికతతో సహకారం అందించిందన్న విమర్శలు ఉన్నాయి.[15][నోట్ 4]

మూలాలు

  1. కమ్మవారి చరిత్ర, కొత్త బాపయ్య చౌదరి, 1939, పావులూరి పబ్లిషర్స్, గుంటూరు, కొత్త ఎడిషన్, 2006
  2. Democratic Process and Electoral Politics in Andhra Pradesh, India, కె.సి.సూరి (సెప్టెంబరు 2002), 11వ పేజీ
  3. 1921 జనాభా లెక్కల ప్రకారం కమ్మ కులం జనాభా 4.8%. కులాల వారీగా జనాభా లెక్కల నమోదు 1921 తరువాత జరుగలేదు. Caste, Class and Social Articulation in Andhra Pradesh: Mapping Differential Regional Trajectories, కె.శ్రీనివాసులు (సెప్టెంబరు 2002), పొలిటికల్ సైన్సు విభాగం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాదు; 3వ పేజీ. ఇప్పటి జనాభాలో ఏ కులం శాతం ఎంత అనే విషయంపై అంచనాలు మాత్రమే చలామణీ అవుతున్నాయి
  4. కమ్మవారి చరిత్ర, కొత్త భావయ్య, 1939, కొత్త ఎడిషను, 2006, పావులూరి పబ్లిషర్సు, గుంటూరు
  5. ఆంధ్రుల చరిత్రము - మొదటి భాగము, చిలుకూరి వీరభద్ర రావు, 1910, పేజి 232
  6. తెలంగాణ సమగ్ర చరిత్ర, 2016, తెలుఁగు అకాడమీ ముద్రణ
  7. ముసునూరి నాయకులు, మల్లంపల్లి సోమశేఖర శర్మ ఎమెస్కో పునర్ముద్రణ, 2015
  8. శ్రీ కృష్ణ దేవ రాయలు వంశ మూలాలు, ముత్తేవి రవీంద్రనాథ్, సావిత్రి పబ్లికేషన్స్
  9. Benbabaali 2013, p. 2.
  10. 10.0 10.1 Benbabaali 2013, p. 3.
  11. 11.0 11.1 Purendra Prasad 2015, p. 78.
  12. 12.0 12.1 Benbabaali 2013, p. 5.
  13. Purendra Prasad 2015, p. 79.
  14. Benbabaali 2013, p. 7.
  15. 15.0 15.1 15.2 Benbabaali 2013, p. 6.
  16. A. Satyanarayana, 2002 & 58.
  17. Benbabaali 2013, p. 4.
  18. Selig S. Harrison 1956, p. 381.
  19. Selig S. Harrison 1956, p. 384.
  20. Prakash Sarangi 2004, p. 109.
  21. Benbabaali 2016, p. 1.

నోట్స్

  1. ఉదాహరణకు కపిలేశ్వరం - కేశవకుర్రు జమీందారీకి చెందిన ఎస్.బి.పి.బి.కె.సత్యనారాయణ కాకినాడ, ఉయ్యూరు ప్రాంతాల్లో, ఉండ్రాజవరం జమీందారీకి చెందిన ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ తణుకు, కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో మధ్య, భారీ పరిశ్రమలు స్థాపించారు.
  2. ఈ పరిణామానికి ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం నుంచే పార్టీలో పనిచేస్తూ, అగ్ర నాయకుడిగా కొనసాగిన పుచ్చలపల్లి సుందరయ్య, కాంగ్రెస్‌ నాయకుడు ఎన్‌.జి.రంగా ముఖ్యమైన మినహాయింపులుగా ఉన్నారు పుచ్చలపల్లి సుందరయ్య సంపన్న భూస్వామి రెడ్డి కుటుంబంలో జన్మించిన వ్యక్తి, రంగా వ్యవసాయదారులైన కమ్మవారి కుటుంబంలో జన్మించాడు.. సుందరయ్య జన్మనామం పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి, కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా తన పేరులోని కులసూచకమైన రెడ్డి విడిచిపెట్టాడు. రంగా కాంగ్రెస్ నాయకుల్లో ముఖ్యుడైనా మంత్రి, ముఖ్యమంత్రి వంటి పదవులు దక్కలేదు. కాంగ్రెస్ వదిలి స్వతంత్ర పార్టీ స్థాపకుల్లో ఒకరిగా వెళ్ళి, దశాబ్ది తర్వాత కాంగ్రెస్‌కు తిరిగివచ్చాడు. సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్‌గా పనిచేశాడు.
  3. ఎన్టీరామారావుకు ముఖ్యమంత్రి కాక పూర్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి ఎక్కువగా రెడ్డి కులస్తులకు దక్కింది. తొమ్మిదిమంది ముఖ్యమంత్రులు అయితే వారిలో ఆరుగురు రెడ్లు, ఒక్కరూ కమ్మవారు లేరు.
  4. హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్‌ రంగంలో కమ్మవారి విజయాలను తరచుగా వారి రాజకీయ ప్రాబల్యానికి ఆపాదిస్తూంటారు. ఉదాహరణకు ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయంలో దలేల్ బెన్‌బబాలి కమ్మవారి ఆధిపత్యం-ప్రాంత స్థితిగతుల గురించి పరిశోధించి ఇచ్చిన అకడమిక్‌ టాక్‌లో "అతను (చంద్రబాబు) వలసవచ్చి జీవిస్తున్న కమ్మవారు నివసించే జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి ప్రాంతాలకు సమీపంలో హైదరాబాద్ పశ్చిమ సరిహద్దుల్లో హైటెక్‌ సిటీని అభివృద్ధి చేయాలని నిర్ణయించాడు. ఇది వారి భూముల విలువ విపరీతంగా పెరిగేందుకు దారితీసింది. రాజకీయ బలం తద్వారా రియల్‌ ఎస్టేట్ అంచనాకు వీలైన ప్రత్యేక సమాచారం అందుబాటులో ఉన్న కమ్మ వ్యాపారస్తులు ఈ ప్రాంతంపై పెట్టుబడులు పెట్టి పెద్ద ఎత్తున లాభాలు సంపాదించారు." అని అభిప్రాయపడ్డారు.

ఆధార గ్రంథాలు, వనరులు

  • Benbabaali, Dalel (2013), "Dominant caste and territory in South India: The case of the Kammas of Andhra Pradesh", academia.edu (in English), retrieved 25 June 2018, Talk in Princeton University{{citation}}: CS1 maint: unrecognized language (link)
  • Purendra Prasad (2015), "Agrarian Class and Caste Relations in 'United' Andhra Pradesh, 1956–2014" (PDF), Economic and Political Weekly (16), retrieved 26 June 2018
  • A. Satyanarayana (2002), Sabyasachi Bhattacharya (ed.), Education and the Disprivileged: Nineteenth and Twentieth Century India, Orient Blackswan, ISBN 978-81-250-2192-6
  • Selig S. Harrison (1956), "Caste and the Andhra Communists", The American Political Science Review, American Political Science Association, 50 (2), retrieved 30 June 2018
  • Prakash Sarangi (2004), "Telugu Desam Party: The Dialectics of Regional Identity and National Politics", in Subrata Kumar Mitra (ed.), Political Parties in South Asia (in English), Mike Enskat, Clemens Spiess, Greenwood Publishing Group, ISBN 978-0-275-96832-8, retrieved 1 July 2018{{citation}}: CS1 maint: unrecognized language (link)
"https://te.wikipedia.org/w/index.php?title=కమ్మ&oldid=2604205" నుండి వెలికితీశారు