Coordinates: 18°28′37″N 80°19′44″E / 18.477004°N 80.328827°E / 18.477004; 80.328827

ఏటూరునాగారం మండలం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యర్రా రామారావు, పేజీ ఏటూరునాగారం ను ఏటూరునాగారం మండలం కు తరలించారు: సరైన పేరు బరి
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''ఏటూరునాగారం,''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[ములుగు జిల్లా|ములుగు జిల్లాకు]] చెందిన మండలం.<ref name="”మూలం”">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 233 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>.{{సమాచారపెట్టె తెలంగాణ మండలం‎|type = mandal||native_name=ఏటూరునాగారం||district=వరంగల్
'''ఏటూరునాగారం,''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[ములుగు జిల్లా|ములుగు జిల్లాకు]] చెందిన మండలం.<ref name="”మూలం”">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 233 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>.{{సమాచారపెట్టె తెలంగాణ మండలం‎|type = mandal||native_name=ఏటూరునాగారం||district=ములుగు జిల్లా
| latd = 18.477004
| latd = 18.477004
| latm =
| latm =

12:27, 2 మార్చి 2019 నాటి కూర్పు

ఏటూరునాగారం, తెలంగాణ రాష్ట్రం, ములుగు జిల్లాకు చెందిన మండలం.[1].

ఏటూరునాగారం
—  మండలం  —
తెలంగాణ పటంలో ములుగు జిల్లా, ఏటూరునాగారం స్థానాలు
తెలంగాణ పటంలో ములుగు జిల్లా, ఏటూరునాగారం స్థానాలు
తెలంగాణ పటంలో ములుగు జిల్లా, ఏటూరునాగారం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°28′37″N 80°19′44″E / 18.477004°N 80.328827°E / 18.477004; 80.328827
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ములుగు జిల్లా
మండల కేంద్రం ఏటూరునాగారం
గ్రామాలు 41
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 41,153
 - పురుషులు 20,312
 - స్త్రీలు 20,841
అక్షరాస్యత (2011)
 - మొత్తం 55.57%
 - పురుషులు 68.38%
 - స్త్రీలు 42.01%
పిన్‌కోడ్ {{{pincode}}}

ఇది సమీప పట్టణమైన వరంగల్ నుండి 107 కి. మీ. దూరంలో ఉంది.

గణాంకాలు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 41,153 - పురుషులు 20,312- స్త్రీలు 20,841.

జిల్లా మార్పులు

వరంగల్ జిల్లా నుండి జయశంకర్ జిల్లాకు

లోగడ ఏటూరునాగారం గ్రామం/ మండలం వరంగల్ జిల్లాలో,ములుగు రెవిన్యూ డివిజను  పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా ఏటూరునాగారం మండలాన్ని (1+38) ముప్పైతొమ్మది గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన జయశంకర్ (భూపాలపల్లి) జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[2].

జయశంకర్ జిల్లా నుండి ములుగు జిల్లాకు

2018 ఫిబ్రవరి 17 న ప్రభుత్వం ములుగు జిల్లాను ఏర్పాటు చేసింది. మరో 8 మండలాలతో పాటు ఏటూరు నాగారం మండలాన్ని కూడా కొత్త జిల్లాలోకి చేర్చారు.[3]

ఏటూరునాగారం వన్యప్రాణి సంరక్షణా కేంద్రం

ఇక్కడ వన్యప్రాణి సంరక్షణా కేంద్రం ఉంది.

గ్రామ విశేషాలు

ఏటారునాగారం ఓ చిన్న పట్టణంగా పేర్కొనవచ్చు. లక్నవరం (జంపన్న) ఉపనది గోదావరిలో కలిసే ప్రదేశంలో ఉన్న ఈ ఊరు ప్రకృతి సోయగాల మధ్య అలరారుతూ ఉంటుంది. ఇక్కడ ఐటీడీఏ ఉంది. గిరిజన జనాభా ఎక్కువగా కలిగిన ఈ ప్రాంతానికి ఏటూరునాగారం ఓ ముఖ్య కేంద్రం. అనేక ప్రభుత్వ కార్యాలయాలున్నాయి. మావోయిస్టులకు ఒకప్పుడు పెట్టని కోటగా ఉన్న ఈ ప్రాంతంలో అనేక విధ్వంసాలు కూడా జరిగాయి. ఏటూరునాగారం పోలీసుస్టేషన్ పేల్చివేత, తుపాకులగూడెం బస్సు పేల్చివేత వంటి దారుణ మారణహోమాలు కూడా ఉన్నాయి.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

గమనిక:నిర్జన గ్రామాలు 16 (పదహారు) పరిగణనలోకి తీసుకోలేదు.

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 233 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. http://bhoopalapally.telangana.gov.in/wp-content/uploads/2016/10/233.Jayashankar-.233.pdf
  3. "మరో 2 కొత్త జిల్లాలు". ఈనాడు. Archived from the original on 17 Feb 2019. Retrieved 17 Feb 2019.

వెలుపలి లంకెలు