నాగర్‌కర్నూల్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
[[File:Nagarkurnool District Revenue divisions.png|thumb|నాగర్‌కర్నూల్ జిల్లా]]
[[File:Nagarkurnool District Revenue divisions.png|thumb|నాగర్‌కర్నూల్ జిల్లా]]
'''నాగర్‌కర్నూల్ జిల్లా,''' [[తెలంగాణ]]లోని 31 జిల్లాలలో ఒకటి. 2016 అక్టోబరు 11న ఈ జిల్లా అవతరించింది. జిల్లాలో 20 మండలాలు, 3 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 243 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
'''నాగర్‌కర్నూల్ జిల్లా,''' [[తెలంగాణ]]లోని 33 జిల్లాలలో ఒకటి. 2016 అక్టోబరు 11న ఈ జిల్లా అవతరించింది. జిల్లాలో 20 మండలాలు, 3 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 243 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>

తెలంగాణలోనే ప్రముఖమైన అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్, మామిడిపండ్లకు ప్రసిద్ధి చెందిన కొల్లాపూర్, ప్రాచీన రాజధాని వర్థమానపురం, ప్రముఖ ఆంజనేయస్వామి దేవాలయం ఊర్కొండ ఈ జిల్లాకు చెందినవి. ఈ ప్రతిపాదిత జిల్లాలోని అన్ని మండలాలు మునుపటి మహబూబ్‌నగర్ జిల్లాలోనివే. ఒకప్పుడు జిల్లా పరిపాలన కేంద్రంగా పనిచేసిన నాగర్‌కర్నూల్ పట్టణం మళ్ళీ 133 సంవత్సరాల అనంతరం జిల్లా పరిపాలన కేంద్రంగా మారింది.

13:42, 2 మార్చి 2019 నాటి కూర్పు

నాగర్‌కర్నూల్ జిల్లా

నాగర్‌కర్నూల్ జిల్లా, తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి. 2016 అక్టోబరు 11న ఈ జిల్లా అవతరించింది. జిల్లాలో 20 మండలాలు, 3 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి.[1]

తెలంగాణలోనే ప్రముఖమైన అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్, మామిడిపండ్లకు ప్రసిద్ధి చెందిన కొల్లాపూర్, ప్రాచీన రాజధాని వర్థమానపురం, ప్రముఖ ఆంజనేయస్వామి దేవాలయం ఊర్కొండ ఈ జిల్లాకు చెందినవి. ఈ ప్రతిపాదిత జిల్లాలోని అన్ని మండలాలు మునుపటి మహబూబ్‌నగర్ జిల్లాలోనివే. ఒకప్పుడు జిల్లా పరిపాలన కేంద్రంగా పనిచేసిన నాగర్‌కర్నూల్ పట్టణం మళ్ళీ 133 సంవత్సరాల అనంతరం జిల్లా పరిపాలన కేంద్రంగా మారింది.

జిల్లా చరిత్ర

పూర్వం1870 సం. లో నిజాం ప్రభుత్వం నాగర్ కర్నూల్ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసుకుంది.  అపుడు 8 తాలుకాలు ఉండేవి . 1881 నాటికి వాటి సంఖ్య 10 కి పెరిగింది. 1883 లో జిల్లా కేంద్రాన్ని మహబుూబ్ నగర్ కు బదిలీ చేశారు.

పేరు వెనుక చరిత్ర

పూర్వము నాగర్ కర్నూల్ పరిసర ప్రాంతాలను  నాగన్న మరియు  కందన్న అనే ఇద్దరు సోదర రాజులు పాలించేవారు. సుమారు 110 లేదా 120 సంవత్సరాల క్రితం, నాగర్ కర్నూల్ దక్షిణ తెలంగాణా ప్రాంతంలో ఎక్కువ భాగం రవాణా మరియు జిల్లా కేంద్రం. ఒక ముఖ్య కూడలిగా ఉంది. ఈ ప్రాంతంలోని  రైతులు బండ్లకు  వాడే కందెనను రాజు పేరుమీదగా విపరీతంగా అమ్మేవారు. అదే విదంగా కందెనను అమ్మే పట్టణం కందనూల్ అనే పేరు వచ్చింది. అదే పేరు కాలక్రమేన చిన్నకర్నూల్ గా మారింది. అదేవిదంగా నాగనా పేరు మీద ఒక గ్రామాన్ని ఏర్పరిచారు. దానికి నాగనూల్ అని పేరుంది. ఆ గ్రామం ఇప్పటికి కూడా నగనూల్ గానే పిలువబడుతుంది. ఆ గ్రామం నాగర్ కర్నూల్ కు 1 కి.మీ. దూరంలో ఆగ్నేయ (Southeast) దిశలో ఉంది. ఆ గ్రామ మరియు కందనూల్ అనే రెండు (ఇద్దరు రాజుల ) పేర్ల మీదుగా నాగర్ కర్నూల్ కు ఈ పేరు వచ్చింది.

ఈ ప్రాంతాన్ని పూర్వం చాళుక్యులు,కందూరు చోడులూ కాకతీయులు, నిజాం నవాబ్లు పాలించారు. భారతదేశం లోనే రెండవ పెద్ద అడవి నల్లమల అడవి ఈ ప్రాంతం లోనే ఉంది. ఇది మొత్తం 2,48,749.55 చదరపు అడుగుల విస్తీరణంలో ఉంది. ఎంతో ప్రకృతి రమణీయంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.

జిల్లాలోని మండలాలు

  1. బిజినపల్లి మండలం
  2. అచ్చంపేట మండలం
  3. పెద్దకొత్తపల్లి మండలం
  4. తెల్కపల్లి మండలం
  5. తిమ్మాజిపేట్ మండలం
  6. తాడూరు మండలం
  7. కొల్లాపూర్ మండలం
  8. పెంట్లవెల్లి మండలం
  9. కోడేర్ మండలం
  10. కల్వకుర్తి మండలం
  11. ఊర్కొండ మండలం
  12. వెల్దండ మండలం
  13. వంగూర్ మండలం
  14. చారకొండ మండలం
  15. అచ్చంపేట మండలం
  16. అమ్రాబాద్ మండలం
  17. పదర మండలం
  18. బల్మూర్ మండలం
  19. లింగాల్ మండలం
  20. ఉప్పునూతల మండలం

రవాణా సౌకర్యాలు

హైదరాబాదు నుంచి శ్రీశైలం వెళ్ళు రహదారి ఈ జిల్లా గుండా వెళుతుంది. బిజినేపల్లి జిల్లాలోని ప్రధాన రోడ్డు కూడలి. ఇక్కడి నుంచి మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, హైదరాబాదుకు వెళ్ళు ప్రధాన మార్గాలున్నాయి. ఈ జిల్లాకు రైలుమార్గం లేదు.

జిల్లా ప్రముఖులు

  • గోనగన్నా రెడ్డి,
  • కపలవాయి లింగమూర్తి,
  • పాలెం సుబ్బయ్య
  • తోటపల్లి సుబ్రమణ్య శర్మ
  • వి.ఎన్.గౌడ్,
  • పెంటమరాజు సుదర్శన రావు,
  • పాపయ్య పర్స,
  • కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి,
  • డా.నాగం జనార్ధన్ రెడ్డి,
  • యశోదారెడ్డి.
  • మర్రి జనార్దన్‌రెడ్డి
  • జూపల్లి కృష్ణారావు
  • గువ్వల బాలరాజు
  • ఎస్‌.జైపాల్‌రెడ్డి
  • వంశీకృష్ణ చిక్కుడు
  • వంశీచంద్‌రెడ్డి
  • హర్షవర్ధన్‌రెడ్డి
  • ఎడ్మ కిష్టారెడ్డి
  • జైపాల్‌ యాదవ్‌
  • కసిరెడ్డి నారాయణరెడ్డి

వ్యవసాయ పరిశోధనా కేంద్రం

పాలెం దుంధుభి వ్యవసాయ పరిశోధనా కేంద్రం & పాల్టెక్నిక్ కళాశాల 1989 లో స్థాపించబడింది.

పుణ్యక్శేత్రాలు

  • సలేశ్వరం,
  • ఉమామహేశ్వరం,
  • లొద్దిమల్లయ్య,
  • ఊరుకొండ ఆంజనేయస్వామి,
  • సోమేశ్వరాలయం సోమశిల,
  • శిర్సనగండ్ల సీతారామాలయం,
  • వట్టెం వేంకటేశ్వారాయం,
  • సింగోటం లక్శ్మీనరసింహస్వామి ఆలయం.
  • మదన గోపాలయం.

సినిమా హాళ్ళు

రవి , రమణ, రామక్రిష్ణ

జిల్లా సంఘటనలు

1990 లో నుంచి నక్సల్స్ కాల్పులు మొదలైనాయి, 1991 లోయిట్ల ప్రభాకర్, 1993 లో యస్.పి పరదేసి నాయిడు..ఇలా 2006 వరకు 30 మంది పొలీసుల ఎంకౌంటర్ ఐనారు.

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 243 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లింకులు