రైతు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ
 
చి Chaduvari, పేజీ వ్యవసాయదారుడు ను రైతు కు తరలించారు: ఎక్కువగా వాడుకలో ఉన్నపేరు
(తేడా లేదు)

02:15, 4 మార్చి 2019 నాటి కూర్పు

వ్యవసాయం చేసి, ఆహారాన్ని, ముడిసరుకునూ పండించే వ్యక్తిని రైతు అంటారు. వ్యవసాయదారుడు అని కూడా అంటారు. పంటలు పండించేవారినే కాక, మామిడి, కొబ్బరి, ద్రాక్ష వంటి తోటల పెంపకం, పాడి పశువుల పెంపకం, కోళ్ళ పెంపకం, చేపలు, రొయ్యల పెంపకం మొదలైన వాటిని చేపట్టిన వారిని కూడా రైతులనే అంటారు. సాధారణంగా రైతులు తమ స్వంత భూమిలోనే సాగు చేస్తూంటారు. ఇతరుల భూమిని అద్దెకు తీసుకుని కూడా సాగు చేస్తూంటారు. దాన్ని కౌలు అని, వారిని కౌలు రైతులనీ అంటారు. పొలం పనుల్లో భాగంగా తాను పనిలో పెట్టుకునే ఉద్యోగులను రైతుకూలీలు అంటారు.

చరిత్ర

వ్యవసాయం కొత్తరాతియుగంలోనే మొదలైంది. కంచుయుగం నాటికి, సా.పూ. 5000-4000 నాటికే సుమేరియన్లకు వ్యవసాయ కూలీలు ఉన్నారు. నీటిపారుదలపై ఆధారపడి పంటలు పండించారు. కోత నూర్పిళ్ళకు వాళ్ళు ముగ్గురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసేవారు.[1] ప్రాచీన ఈజిప్టు దేశస్థులు వ్యవసాయానికి నైలు నది నీటిపై ఆధారపడ్డారు.[2]

వ్యవసాయంలో వాడుకునేందుకు గాను పశుపోషణ చెయ్యడం వేల సంవత్సరాలుగా జరుగుతోంది. తూర్పు ఆసియాలో 15,000 ఏళ్ళ కిందటే కుక్కలను పెంచారు. సా.పూ. 7,000 నాటికి ఆసియాలో మేకలు, గొర్రెలను పెంచారు. సా.పూ. 7,000 నాటికి మధ్య ప్రాచ్యం, చైనాల్లో పందులను పెంచారు. సా.పూ. 4,000 నాటికి గుర్రాలను పెంచారు.[3]

  1. By the sweat of thy brow: Work in the Western world, Melvin Kranzberg, Joseph Gies, Putnam, 1975
  2. Nicholson (2000) p. 514
  3. "Breeds of Livestock - Oklahoma State University". Ansi.okstate.edu. Archived from the original on 2011-12-24. Retrieved 2011-12-10. {{cite web}}: Unknown parameter |deadurl= ignored (help)
"https://te.wikipedia.org/w/index.php?title=రైతు&oldid=2613984" నుండి వెలికితీశారు