నూతలపాటి గంగాధరం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 42: పంక్తి 42:


==మూలాలు==
==మూలాలు==
{{మూలాలజాబితా}}[http://telugurachayita.org/details/#/5c7ff7c842573a18b72ebb44 తెలుగు రచయిత. ఆర్గ్ లో నూతలపాటి గంగాధరం పేజీ]
{{మూలాలజాబితా}}

[[వర్గం:1931 జననాలు]]
[[వర్గం:1931 జననాలు]]
[[వర్గం:1975 మరణాలు]]
[[వర్గం:1975 మరణాలు]]

16:57, 7 మార్చి 2019 నాటి కూర్పు

నూతలపాటి గంగాధరం విలక్షణమైన కవి. మంచి విమర్శకుడు.

జీవిత విశేషాలు

ఇతడు 1939, డిసెంబరు 15న చిత్తూరు జిల్లా, సత్యవేడు మండలం రామగిరి గ్రామంలో జన్మించాడు[1]. ఇతని తల్లి కుప్పమ్మ, తండ్రి మునుస్వామినాయుడు. ఇతడు ప్రాథమిక విద్య రామగిరిలో, ఉన్నత విద్యాభ్యాసం చిత్తూరులో పూర్తి చేసుకున్నాడు. తిరుపతి ప్రాచ్య కళాశాలలో విద్వాన్ కోర్సు అనంతరం సత్యవేడులోనే తెలుగు పండితుడిగా ఉద్యోగం ప్రారంభించాడు. గంగాధరం చిన్నతనంలోనే సంస్కృత కావ్యాలు, అలంకార, వ్యాకరణ శాస్త్రగ్రంథాలు అధ్యయనం చేశాడు. గంగాధరం కొంతకాలం ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం కార్యవర్గ సభ్యుడిగా ఉన్నాడు. ఇతని కవిత్వం పై కోసూరి దామోదర నాయుడు శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎం.ఫిల్ పరిశోధన గావించాడు.

రచనలు

ఇతడు అనేక కవితలు, కథలు, విమర్శనాత్మక వ్యాసాలు రచించాడు.

  • 1965లో భారతిలో ప్రచురితమైన గురజాడకు మార్గదర్శి వేమన[2] అనే వ్యాసం ఇతనికి మంచిపేరు తెచ్చింది.
  • వేమన, గురుజాడ, శ్రీశ్రీ, కుందుర్తి తదితర కవుల గురించి రాసిన సాహిత్య గంగాలహరి అనే వ్యాస సంకలనం విమర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చింది.
  • కథల్లో 'తివాచీకల', 'కొత్తచీర', 'పందెం'
  • నవలల్లో కాగితం పులి పేర్కొనదగినవి.
  • చీకటి నుంచి వెలుగులోకి కవితా సంకలనం కవిగా పేరు తెచ్చింది.


మరణం

ఇతడు 1975, మే 29న తన స్వగ్రామంలో పాముకాటుకు గురై మరణించాడు.

నూతలపాటి గంగాధరం సాహిత్య పురస్కారం

ఇతని మరణానంతరం ఇతని మిత్రులు కొందరు నూతలపాటి సాహితీకుటుంబం పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి 1976 నుండి ఇతని పేరిట ఒక పురస్కారాన్ని ఏటా వివిధ ప్రక్రియల్లో సాహిత్య కృషికి గుర్తింపుగా ఒక రచయితకు బహూకరిస్తున్నారు. ఈ పురస్కారం పొందిన కొందరు

మూలాలు

  1. వి.రంగాచార్యులు. "వచన కవిత". ఈనాడు. ఉషోదయా పబ్లికేషన్స్. Retrieved 16 February 2015.
  2. నూతలపాటి, గంగాధరం (1965-01-01). "గురజాడకు మార్గదర్శి వేమన". భారతి. 42 (1): 31–38. Retrieved 16 February 2015.

తెలుగు రచయిత. ఆర్గ్ లో నూతలపాటి గంగాధరం పేజీ