మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రవేశికలో కొంత భాగం, తిరుబటు తొలిదశలో కొంత భాగం చేర్చాను
++===ఢిల్లీ===
పంక్తి 48: పంక్తి 48:
| notes =
| notes =
}}
}}
1857–-58 మధ్యకాలంలో ఉత్తర, మధ్య [[భారతదేశం]]<nowiki/>లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్లను '''మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం''' అనీ, 1857 సిపాయిల తిరుగుబాటు అనీ పరిగణిస్తారు. దశాబ్దాలుగా భారతీయ సిపాయిలకూ బ్రిటీష్ అధికారులకూ మధ్యగల జాతీయ, సాంస్కృతిక వైరుధ్యాలు ఈ తిరుగుబాట్లకు దారితీసాయి. భారత పాలకులైన మొగలాయి, పేష్వాల పట్ల బ్రిటిష్ వారికి ఉన్న నిర్లక్ష్య వైఖరి, ఔధ్ విలీనం లాంటి రాజకీయ కారణాలూ భారతీయులలో బ్రిటిష్ పాలన పట్ల వ్యతిరేకత కలిగించాయి.
{{వికీకరణ}}
1857–-58 మధ్యకాలంలో ఉత్తర, మధ్య [[భారతదేశం]]<nowiki/>లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్లను '''మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం''' అనీ, 1857 సిపాయిల తిరుగుబాటు అనీ పరిగణిస్తారు. దశాబ్దాలుగా భారతీయ సిపాయిలకూ బ్రిటీష్ అధికారులకూ మధ్యగల జాతీయ, సాంస్కృతిక వైరుధ్యాలు ఈ తిరుగుబాట్లకు దారితీసాయి. భారత పాలకులైన మొగలాయి, పేష్వాల పట్ల బ్రిటిష్ వారికి ఉన్న నిర్లక్ష్య వైఖరి, ఔధ్ విలీనం లాంటి రాజకీయ కారణాలూ భారతీయులలో బ్రిటిష్ పాలన పట్ల వ్యతిరేకత కలిగించాయి.




పంక్తి 109: పంక్తి 108:


===తక్షణ కారణం===
===తక్షణ కారణం===

డల్హౌసీ తర్వాత భారతదేశానికి గవర్నర్ జనరల్‌గా వచ్చిన లార్‌‌డ కానింగ్ కాలంలో సైన్యంలో ఎన్‌ఫీల్డ్ తుపాకీలు ప్రవేశపెట్టారు. వీటికి ఉపయోగించే మందుగుండ్లకు (Catridges) ఆవు కొవ్వు లేదా పందికొవ్వుతో పూత పూసినట్లు సమాచారం వ్యాప్తి చెందింది. సైనికులు పంటితో బుల్లెట్లకు పూసిన [[కొవ్వు పదార్ధాలు|కొవ్వు]]<nowiki/>ను తొలగించి వాటిని తుపాకీలో దించి కాల్చాలి. సైన్యంలో ఎక్కువ మంది హిందువులు, ముస్లింలే కాబట్టి ఇది వారి మతాచారాల మీద తీవ్ర ప్రభావం చూపింది.
డల్హౌసీ తర్వాత భారతదేశానికి గవర్నర్ జనరల్‌గా వచ్చిన లార్డ్ కానింగ్ కాలంలో సైన్యంలో ఎన్‌ఫీల్డ్ తుపాకీలు ప్రవేశపెట్టారు. వీటికి ఉపయోగించే మందుగుండ్లకు (Catridges) ఆవు కొవ్వు లేదా పందికొవ్వుతో పూత పూసినట్లు సమాచారం వ్యాప్తి చెందింది. సైనికులు పంటితో బుల్లెట్లకు పూసిన [[కొవ్వు పదార్ధాలు|కొవ్వు]]<nowiki/>ను తొలగించి వాటిని తుపాకీలో దించి కాల్చాలి. సైన్యంలో ఎక్కువ మంది హిందువులు, ముస్లింలే కాబట్టి ఇది వారి మతాచారాల మీద తీవ్ర ప్రభావం చూపింది.


==తిరుగుబాటు ప్రారంభం, గమనం, వ్యాప్తి==
==తిరుగుబాటు ప్రారంభం, గమనం, వ్యాప్తి==
మందుగుండుకు కొవ్వు పూత పూస్తున్నట్లు 1857 జనవరి 23న డండం అనే ప్రాంతంలో వార్త మొదలై అన్ని ప్రాంతాలకూ వ్యాపించింది. 1857, మార్చి 29న బారక్‌పూర్‌లోని 34వ స్వదేశీ దళానికి చెందిన మంగల్‌పాండే అనే సేనాని ఎన్‌ఫీల్డ్ తుపాకీతో ఇద్దరు బ్రిటిష్ అధికారులను కాల్చి చంపాడు. ఈ తిరుగుబాటును బ్రిటిషర్లు పూర్తిగా అణచివేసి, ఏప్రిల్ 6న మంగల్‌పాండేను ఉరితీశారు. ఈ వార్త [[దావానలం]]<nowiki/>లా దేశమంతటా వ్యాపించింది. 19, 34వ స్వదేశీ దళాలను బ్రిటిష్ ప్రభుత్వం రద్దు చేసింది.

భారతీయ సైనికులందరూ బ్రిటిషర్లపై ఒక్కసారిగా తిరుగుబాటు చేయడానికి ప్రణాళిక రూపొందించారు. మే 31ని తిరుగుబాటు రోజుగా నిర్ణయించుకొని, [[చపాతీ]]<nowiki/>లు, కలువ పూలు పంచారు. కానీ విప్లవం మే 10నే ప్రారంభమైంది. మే 8వ తేదీన మీరట్‌లోని 3వ అశ్విక దళంలో ఈ బారు తుపాకీలు ప్రవేశపెట్టారు.

కానీ వాటిని ఉపయోగించడానికి నిరాకరించిన భారతీయ సైనికులపై బ్రిటిషర్లు తీవ్ర చర్యలు తీసుకున్నారు. దీంతో 1857 మే 10న సైనికులు అక్కడి అధికారులను చంపి మే 11న ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలోని ఎర్రకోటను ఆక్రమించి అప్పటి మొగల్ చక్రవర్తి రెండో బహదూర్‌షాను భారత జాతీయ చక్రవర్తిగా ప్రకటించారు. ఢిల్లీలోని ఈ విజయంతో దేశంలో ఉత్తర, కేంద్ర ప్రాంతాలు - అవధ్, రోహిల్‌ఖండ్, పశ్చిమ బీహార్‌ల్లో తిరుగుబాట్లు చెలరేగాయి.


=== తొలి దశ ===
=== తొలి దశ ===
పంక్తి 122: పంక్తి 127:
లాహోరుకు చెందిన ముస్లిము పండితుడు ముఫ్తీ నిజాముద్దీన్ బ్రిటిషు వారికి వ్య్తిరేకంగా రావ్ తులా రాం కు మద్దతు ఇమ్మని ఫత్వా జారీ చేసాడు. ఆ తరువాత నర్నౌల్ వద్ద జరిగిన పోరులో 1857 నవంబరు 16 న రావ్ తులా రాం ఓడిపోయాడు. ముఫ్తీ నిజాముద్దీన్‌ను, అతడి సోదరుడు, బావమరిదినీ బ్రిటిషు వారు అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకువెళ్ళి ఉరితీసారు.<ref>{{Citation|author=[[Hakim Syed Zillur Rahman]]|year=2008|title=Hayat Karam Husain|chapter=1857 ki Jung-e Azadi main Khandan ka hissa|edition=2nd|pages=253–258|publisher=[[Ibn Sina Academy of Medieval Medicine and Sciences]]|location=Aligarh/India|oclc=852404214}}</ref>
లాహోరుకు చెందిన ముస్లిము పండితుడు ముఫ్తీ నిజాముద్దీన్ బ్రిటిషు వారికి వ్య్తిరేకంగా రావ్ తులా రాం కు మద్దతు ఇమ్మని ఫత్వా జారీ చేసాడు. ఆ తరువాత నర్నౌల్ వద్ద జరిగిన పోరులో 1857 నవంబరు 16 న రావ్ తులా రాం ఓడిపోయాడు. ముఫ్తీ నిజాముద్దీన్‌ను, అతడి సోదరుడు, బావమరిదినీ బ్రిటిషు వారు అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకువెళ్ళి ఉరితీసారు.<ref>{{Citation|author=[[Hakim Syed Zillur Rahman]]|year=2008|title=Hayat Karam Husain|chapter=1857 ki Jung-e Azadi main Khandan ka hissa|edition=2nd|pages=253–258|publisher=[[Ibn Sina Academy of Medieval Medicine and Sciences]]|location=Aligarh/India|oclc=852404214}}</ref>


<br />
మందుగుండుకు కొవ్వు పూత పూస్తున్నట్లు 1857 జనవరి 23న డండం అనే ప్రాంతంలో వార్త మొదలై అన్ని ప్రాంతాలకూ వ్యాపించింది. 1857, మార్చి 29న బారక్‌పూర్‌లోని 34వ స్వదేశీ దళానికి చెందిన మంగల్‌పాండే అనే సేనాని ఎన్‌ఫీల్డ్ తుపాకీతో ఇద్దరు బ్రిటిష్ అధికారులను కాల్చి చంపాడు. ఈ తిరుగుబాటును బ్రిటిషర్లు పూర్తిగా అణచివేసి, ఏప్రిల్ 6న మంగల్‌పాండేను ఉరితీశారు. ఈ వార్త [[దావానలం]]<nowiki/>లా దేశమంతటా వ్యాపించింది. 19, 34వ స్వదేశీ దళాలను బ్రిటిష్ ప్రభుత్వం రద్దు చేసింది.


=== ఢిల్లీ ===
భారతీయ సైనికులందరూ బ్రిటిషర్లపై ఒక్కసారిగా తిరుగుబాటు చేయడానికి ప్రణాళిక రూపొందించారు. మే 31ని తిరుగుబాటు రోజుగా నిర్ణయించుకొని, [[చపాతీ]]<nowiki/>లు, కలువ పూలు పంచారు. కానీ విప్లవం మే 10నే ప్రారంభమైంది. మే 8వ తేదీన మీరట్‌లోని 3వ అశ్విక దళంలో ఈ బారు తుపాకీలు ప్రవేశపెట్టారు.
[[File:Attack1857.jpg|link=https://en.wikipedia.org/wiki/File:Attack1857.jpg|thumb|Assault of Delhi and capture of the Cashmere Gate, 14 September 1857]]
తిరుగుబాటును అణచడంలో మొదట్లో బ్రిటిషు వారు కొంత మందకొడిగా వ్యవహరించారు. బ్రిటను నుండి సైన్యాలు సముద్రం మీదుగా రావడం కొంత ఆలస్యమైంది. చైనా వెళ్ళే దాఅరిలో ఉన్న కొన్ని దళాలను భారత్‌కు మళ్ళించారు.


మీరట్, సిమ్లాల నుండి బ్రిటిషు దళాలు ఢిల్లీకి బయల్దేరి దారిలో అనేకమంది తిరుగుబాటుదార్లను చంపుతూ కర్నాల్‌ వద్ద కలుసుకున్నాయి. ఈ రెండు సైన్యాలు నేపాల్ నుండి వచ్చిన రెండు గూర్ఖా దళాలతో కలిసి బద్లీ కే సరాయ్ వద్ద తిరుగుబాటుదార్ల ప్రధాన దళాన్ని ఎదుర్కొన్నాయి.
కానీ వాటిని ఉపయోగించడానికి నిరాకరించిన భారతీయ సైనికులపై బ్రిటిషర్లు తీవ్ర చర్యలు తీసుకున్నారు. దీంతో 1857 మే 10న సైనికులు అక్కడి అధికారులను చంపి మే 11న ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలోని ఎర్రకోటను ఆక్రమించి అప్పటి మొగల్ చక్రవర్తి రెండో బహదూర్‌షాను భారత జాతీయ చక్రవర్తిగా ప్రకటించారు. ఢిల్లీలోని ఈ విజయంతో దేశంలో ఉత్తర, కేంద్ర ప్రాంతాలు - అవధ్, రోహిల్‌ఖండ్, పశ్చిమ బీహార్‌ల్లో తిరుగుబాట్లు చెలరేగాయి.

ఢిల్లీకి ఉత్తరాన స్థావరాన్ని నిర్మించుకుని కంపెనీ దళాలు నగరాన్ని ముట్టడించాయి. జూలై 1 నుండి సెప్టెంబరు 21 దాకా ఈ ముట్టడి కొనసాగింది. అయితే నగరాన్ని చుట్టుముట్టేంత సైన్యం బ్రిటిషు వారి వద్ద లేదు. తిరుగుబాటు సైన్యం బ్రిటిషు సైన్యం కంటే సంఖ్యలో చాలా ఎక్కువగా ఉంది. ముట్టడిలో ఉన్నది ఢిల్లీ కాదు, బ్రిటిషు సైన్యమా ఆన్నట్టు ఉండేది. తిరుగుబాటుదార్ల నిరంతర దాడులు, రోగాలు, అలసట కారణంగా బ్రిటిషు సైన్యం వెనక్కి తగ్గుతుందేమో అన్నట్టుండేది. ఆగస్టు 14 న పంజాబు నుండి బ్రిటిషు, సిక్ఖు, పఖ్తూన్ దళాలు జాన్ నికోల్సన్ నాయకత్వంలో వచ్చి చేరడంతో బ్రిటిషు సైన్యాం బలపడింది.<ref>[http://www.hindu.com/mp/2006/10/28/stories/2006102801590100.htm God's Acre]. [[The Hindu]] Metro Plus Delhi. 28 October 2006.</ref><ref>[http://www.jonathanforeman.com/movies/mangal.html 'The Rising: The Ballad of Mangal Pandey'] {{webarchive|url=https://web.archive.org/web/20070714182441/http://www.jonathanforeman.com/movies/mangal.html|date=14 July 2007}}. Daily Mail, 27 August 2005.</ref> <gallery mode="packed">
File:1857 ruins jantar mantar observatory2.jpg|The [[Jantar Mantar]] observatory in Delhi in 1858, damaged in the fighting
File:1857 cashmeri gate delhi.jpg|Mortar damage to [[Kashmiri Gate (Delhi)|Kashmiri Gate]], Delhi, 1858
File:1857 hindu raos house2.jpg|[[Raja Hindu Rao|Hindu Rao]]'s house in Delhi, now a hospital, was extensively damaged in the fighting
File:1857 bank of delhi2.jpg|Bank of Delhi was attacked by mortar and gunfire
</gallery>సెప్టెంబరు 7 న బ్రిటిషు వారి శతఘ్నులతో గోడలను బద్దలు కొట్టి తిరుగుబాటుదార్ల శతఘ్నులను పట్టుకున్నారు.<ref name="HCRE">{{cite book|last=Porter|first=Maj Gen Whitworth|title=History of the Corps of Royal Engineers Vol I|year=1889|publisher=The Institution of Royal Engineers|location=Chatham}}</ref>{{rp|478}} సెప్టెంబరు 14 న కాశ్మీరీ గేట్ ద్వారా నగరంలోకి ప్రవేశించేందుకు బ్రిటిషు దళాలు ప్రయత్నించారు.<ref name="HCRE" />{{rp|480}} నగరంలో కాలుమోపినప్పటికీ బ్రిటిషు దళాలకు అపార నష్టం జరిగింది. జాన్ నికోల్సన్ కూడా మరణించాడు. బ్రిటిషు కమాండరు వెనక్కి తగ్గాలని అనుకున్నాడు. కానీ, అతడి కింది అధికారులు నచ్చజెప్పడంతో పోరు కొనసాగించాడూ. ఒక వారంలో బ్రిటిషు దళాలు ఎర్రకోటను పట్టుకున్నాయి. ఢిల్లీ తిరిగి బ్రిటిషు వారి స్వాధీనమైంది. బహదూర్ షా జఫర్ అప్పటికే హుమాయూన్ సమాధికి పారిపోయాడు.
[[File:"Capture_of_the_King_of_Delhi_by_Captain_Hodson".jpg|link=https://en.wikipedia.org/wiki/File:%22Capture_of_the_King_of_Delhi_by_Captain_Hodson%22.jpg|thumb|Capture of [./https://en.wikipedia.org/wiki/Bahadur_Shah_Zafar Bahadur Shah Zafar] and his sons by [./https://en.wikipedia.org/wiki/William_Stephen_Raikes_Hodson William Hodson] at [./https://en.wikipedia.org/wiki/Humayun's_tomb Humayun's tomb] on 20 September 1857]]
బ్రిటిషు సైన్యాలు నగరంలో దోపిడీలు దౌర్జన్యాలు చేసాయి. అనేకమంది పౌరులను చంపారు. ప్రధాన మసీదును, ఇతర ప్రాంతాలనూ శతఘ్నులతో పేల్చివేసారు. కులీన ముస్లిముల ఇళ్ళను ధ్వంసం చేసారు.

బహదూర్ షా జఫర్‌ను అరెస్టు చేసారు. అతడి కుమారులలో ఇద్దరిని, ఒక మనుమడినీ బ్రిటిషు ఏజెంటు కాల్చి చంపించాడు. ఈ సంగతి తెలిసి బహదూర్ షా మ్రాన్పడి పోయాడు. అతడి భార్య జీనత్ మహల్ మాత్రం ఇక తన కొడుకు జఫర్ వారసుడౌతాడని సంతోషించింది.<ref>{{Harvnb|Dalrymple|2006|p=400}}</ref>


==తిరుగుబాటు నాయకులు==
==తిరుగుబాటు నాయకులు==

07:36, 12 మార్చి 2019 నాటి కూర్పు

మొదటి భారత స్వాతంత్ర్య ఉద్యమము

1912 నాటి ఉత్తరభారతదేశం - తిరుగుబాటు 1957-59 దేశపటం. దీనిలో తిరుగుబాటు కేంద్రాలు గుర్తించారు.
తేదీ1857 మే 10 (1857-05-10) – 20 జూన్ 1858 (1858-06-20)
(1 సంవత్సరం, 1 నెల, 2 వారాలు , 5 రోజులు)
ప్రదేశంభారత దేశం (cf. 1857)[1]
ఫలితంఅంగ్లేయులు విజయం సదించారు* తిరుగుబాటును అణిచివేయటం జరిగింది* మొఘల్_సామ్రాజ్యం యొక్క పతనం* భారతదేశంలో కంపెనీ పాలనకి ముగింపు* బ్రిటీష్ క్రౌన్కు పరిపాలన బదిలీ
రాజ్యసంబంధమైన
మార్పులు
ఈస్ట్ ఇండియా కొపేని పాలిత ప్రాంతం నుంచి బ్రిటిషు ఇండియా సమ్రాజ్య స్థాపన (కొన్ని భూములు స్థానిక పాలకులు తిరిగి వచ్చాయి,కొంత భూమిని బ్రిటిషు ప్రభుత్వం స్వదీనం చెసుకుంది)
ప్రత్యర్థులు
East India Company rebel sepoys
Seven Indian princely states
 British Empire
East India Company loyalist sepoys
Native irregulars
East India Company British regulars

United Kingdom British and European civilian volunteers raised in the Bengal Presidency
21 princely states


Kingdom of Nepal
సేనాపతులు, నాయకులు
మూస:Country data Mughal Empire Bahadur Shah II
Nana Sahib Peshwa
Bakht Khan
Rani Lakshmibai
Tantya Tope
Begum Hazrat Mahal
Babu Kunwar Singh
Ishwori Kumari Devi, Rani of Tulsipur
Commander-in-Chief, India:
United Kingdom George Anson (to May 1857)
United Kingdom Sir Patrick Grant
United Kingdom Sir Colin Campbell (from August 1857)
Jang Bahadur[2]

1857–-58 మధ్యకాలంలో ఉత్తర, మధ్య భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్లను మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం అనీ, 1857 సిపాయిల తిరుగుబాటు అనీ పరిగణిస్తారు. దశాబ్దాలుగా భారతీయ సిపాయిలకూ బ్రిటీష్ అధికారులకూ మధ్యగల జాతీయ, సాంస్కృతిక వైరుధ్యాలు ఈ తిరుగుబాట్లకు దారితీసాయి. భారత పాలకులైన మొగలాయి, పేష్వాల పట్ల బ్రిటిష్ వారికి ఉన్న నిర్లక్ష్య వైఖరి, ఔధ్ విలీనం లాంటి రాజకీయ కారణాలూ భారతీయులలో బ్రిటిష్ పాలన పట్ల వ్యతిరేకత కలిగించాయి.


ఆధునిక భారతదేశ చరిత్రలో 1857 తిరుగుబాటుకు ప్రత్యేకస్థానం ఉంది. దీన్ని బ్రిటిష్ సామ్రాజ్యాధికారంపై స్వదేశీ బలాలు చేసిన చారిత్రక తిరుగుబాటుగా పేర్కొన్నారు. కానీ ఈ తిరుగుబాటుకు భారతదేశంలో మెజార్టీ వర్గం మద్దతు లభించలేదు. ఈ తిరుగుబాటును బ్రిటిషర్లు పూర్తిగా అణచివేయగలిగారు. 1757 ప్లాసీ యుద్ధానంతర సంఘటనలన్నీ బ్రిటిషర్లకు విజయాలను తెచ్చిపెట్టాయి. ప్లాసీ యుద్ధం తరువాత సరిగ్గా ఒక శతాబ్ది కాలానికి జరిగిన ఈ తిరుగుబాటులో అణచివేతకు గురైన ఒక చిన్న వర్గం మాత్రమే బ్రిటిష్ ఆధిపత్యాన్ని వ్యతిరేకించి పోరాడింది.

మీరట్‌లో తిరుగుబాటు మొదలయ్యాక, తిరుగుబాటుదార్లు వెంటనే ఢిల్లీ చేరుకుని చివరి మొగల్ చక్రవర్తై బహదూర్‌షాను తిరుగుబాటుకు నాయకుడిగా, భారతదేశ చక్రవర్తిగా ప్రకటించారు. అప్పటికి అతడి వయసు 80 ఏళ్లు దాటింది. పెద్ద సంస్థానాలైన హైదరాబదు, మైసూరు, తిరువాన్కూరు, కాశ్మీరులతో పాటు రాజపుటానా లోని చిన్న సంస్థానాలు కూడా ఈ తిరుగుబాటులో పాల్గొనలేదు. బ్రిటిషు గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్ మాటల్లో చెప్పాలంటే తుపానులో నిలబడ్డ బ్రేక్‌వాటర్స్ లాగ ఈ సంస్థానాలు బ్రిటిషు వారికి అండగా నిలబడ్డాయి.[3]


అంతేకాకుండా భారత సైన్యంలో కూడా ఒక వర్గం బ్రిటిష్‌పై వ్యతిరేక భావాన్ని చూపగలిగింది. ఏదేమైనా 1650 తర్వాత భారతదేశంలో పునాదులు పాతుకుపోయి, దేశమంతటా వ్యాపించిన ఈస్టిండియా కంపెనీ అధికార దాహానికి అడ్డుకట్ట వేసి, కంపెనీ పాలనకు స్వస్తి పలికిన చారిత్రాత్మక సంఘటన ఇది. 1857 మే 10న మీరట్‌లో మొదలైన తిరుగుబాటు 1858 సెప్టెంబరు 20న ఢిల్లీలో ముగిసింది.


తిరుగుబాటు స్వభావం

వి.డి. సావర్కర్ 1909లో లండన్‌లో ప్రచురించిన "First War of Indian Independence" అనే పుస్తకం 1857 తిరుగుబాటు స్వరూప స్వభావాలను ప్రశ్నించింది. దీనిపై జాతీయ వాదులు, చరిత్రకారుల మధ్య చర్చలు మూడు అంశాల చుట్టూ పరిభ్రమించాయి. అవి 1) తిరుగుబాటు అనేది సిపాయిల ప్రతిఘటన (పితూరి). 2) అది జాతీయ పోరాటం లేదా స్వాతంత్య్రం యుద్ధం 3) అది జమీందార్ల అసంతృప్తి, వారి ప్రతిచర్య.

సిపాయిల పితూరి

19వ శతాబ్దం చివర్లో బ్రిటిష్ చరిత్రకారులు, కొంతమంది పరిశీలకులు ఈ తిరుగుబాటును ‘సిపాయిల పితూరి’గానే అభిప్రాయపడ్డారు. సిపాయిలు తరుచూ అతి స్వల్ప కారణాలకు సైతం తిరుగుబాటు చేయడం వల్ల జాన్ లారెన్‌‌స, స్మిత్ లాంటి చరిత్రకారులు దీన్ని కేవలం ‘సిపాయిల పితూరి’గా వర్ణించారు. ఈ సంఘటన గురించి ‘పూర్తిగా దేశభక్తి లోపించింది, సరైన స్వదేశీ నాయకత్వం లేదు. మద్దతు లేదు’ అని జాన్, సీలే పేర్కొన్నారు.

టి. ఆర్. హోల్నెస్ అనే చరిత్రకారుడు 1857 తిరుగుబాటును ‘నాగరికత, అనాగరికతల మధ్య జరిగిన సంఘర్షణ’ గా పేర్కొన్నాడు. బ్రిటిషర్లకు నాగరికత ఉందని, భారతీయులకు లేదనే తడి భావం అనేక విమర్శలకు గురైంది. ‘హిందువులకు కష్టాలు సృష్టించడానికి మహమ్మదీయుల కుట్ర’ అని ౌఠ్టట్చ, ఖ్చీడౌట లాంటి వాళ్లు అభిప్రాయపడ్డారు.


మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం

20వ శతాబ్దం ప్రారంభంలో ఈ తిరుగుబాటును V.D. Savarkar. "A planned war of National Independence‘ అని పేర్కొన్నారు. డా॥ఎస్.ఎన్.సేన్ తన గ్రంథం "Eighteen fifty Seven‘లో వి.డి.సావర్కర్ అభిప్రాయాన్ని పాక్షికంగా అంగీకరించారు.1857 తిరుగుబాటు మత పోరాటం అనే వాదనను డా॥ఆర్.డి.మజుందార్ అంగీకరించలేదు

ఈ తిరుగుబాటులో పాల్గొన్న సిపాయిల కంటే పాల్గొనని సిపాయిల సంఖ్య అధికం. ఏది ఏమైనా 1857 తిరుగుబాటును స్వాతంత్య్ర సమర యుద్ధమని చెప్పలేమన్న దానికే ఎక్కువ మంది చరిత్రకారులు అంగీకరించారు.[ఆధారం చూపాలి] 1857 తిరుగుబాటు గురించి మార్క్సిస్టు వాదులు ‘కర్షక సైనికుల తిరుగుబాటు విదేశీయులైన, భూస్వామ్య సంకెళ్లపైన’ అని అన్నారు.[ఆధారం చూపాలి]

తిరుగుబాటుకు కారణాలు

1857 తిరుగుబాటు వలస పాలనలో అవలంబించిన పద్ధతుల నుంచే ఉద్భవించింది. బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణ విధానాలు, ఆర్థిక దోపిడి, పరిపాలనా సంస్కరణలు అన్నీ కలసి.. భారతదేశంలోని సంస్థానాలు, సిపాయిలు, జమీందారులు, కర్షకులు, వ్యాపారస్థులు, కళాకారులు, చేతివృత్తులవారు, పండితులు, మిగతా వర్గాల వారికి ఇబ్బందులు కలిగించాయి.

డల్హౌసీ రాజ్యసంక్రమణ సిద్దాంతం, మొగలాయిలని వారి వారసత్వ స్థలం నుంచి కుత్బ్ కు తరలిపొమ్మనటం ప్రజాగ్రహానికి కారణమయ్యాయి. ఆయితే తిరుగుబాటుకి ముఖ్య కారణం పి/53 లీ ఏన్ఫిల్ద్ రైఫిల్, 557 కాలిబర్ రైఫిళ్ళలో ఆవు, పంది కొవ్వు పూసిన తూటాలను వాడటం. సిపాయిలు ఈ తూటాలను నోటితో ఒలిచి, రైఫిళ్ళలో నింపాల్సి రావటంతో హిందూ ముస్లిం సిపాయిలు వాటిని వాడటానికి నిరాకరించారు. ఆయితే బ్రిటీష్ వారు ఆ తూటాలను మార్చామనీ, కొవ్వులను తేనె పట్టునుండి లేదా నూనెగింజలనుండి సొంతంగా తయారు చేసుకోవటాన్ని ప్రోత్సహించామని చెప్పినప్పటికీ అవి సిపాయిలకు నమ్మకాన్ని కలిగించలేక పోయాయి.

1857 మార్చినెలలో 34వ దేశీయ పదాతిదళానికి చెందిన మంగళ్ పాండే అనే సైనికుడు బ్రిటిష్ సార్జంట్ మీద దాడిచేసి అతని సహాయకుని గాయపరచాడు. జనరల్ హెన్రీ మగళ్ పాండేని మతపిచ్చి పట్టినవాడిగా భావించి, మంగళ్ పాండేని బంధించమని జమేదార్ని ఆజ్ఞాపించటం, జమేదార్ అతని ఆజ్ఞని తిరస్కరించటంతో తిరుగుబాటు మొదలయిందని చెప్పవచ్చు. బ్రిటీష్ వారు మంగళ్ పాండే ని,జమేదార్నుఏప్రిల్ 7న ఉరితీసి, దళం మొత్తాన్నీ విధులనుండి బహిష్కరించారు. మే 10న 11వ, 20వ అశ్వదళం సమావేశమై అధికారులను ధిక్కరించి 3వ పటాలాన్ని విడిపించారు. మే 11న ఇతర భారతీయులతో కలసి సిపాయిలు ఢిల్లీ చేరుకొని చివరి మొగలు చక్రవర్తి బహదూర్‌షా 2 నివాసమైన ఎర్రకోటని ఆక్రమించి చక్రవర్తిని ఢిల్లీసుల్తాన్ గా తిరిగి అధికారాన్ని స్వీకరించాల్సిందిగా వత్తిడి చేసారు. బహదూర్‌షా మొదట అంగీకరించకపోయినా, తరువాత ఒప్పుకొని తిరుగుబాటుకు నాయకత్వాన్ని వహించాడు.

ఇలా ప్రారంభమైన తిరుగుబాటు, వేగంగా ఉత్తర భారతం మొత్తానికి నిస్తరించింది. మీరట్, ఝాన్సీ, కాన్పూర్, లక్నోలు తిరుగుబాటు తలెత్తిన ముఖ్యప్రాంతాలు. బ్రిటిష్ వారు మొదట వేగంగా స్పందించనప్పటకీ, తరువాత తీవ్రమైన బలప్రయోగంతో తిరుగుబాటుని అణచివేసేందుకు యత్నించారు. వారు క్రిమియన్ యుద్ధంలో పాల్గొన్న పటాలాలనీ, చైనా వెళ్ళేందుకు బయలుదేరిన ఐరోపా పటాలాలని తిరుగుబాటును అణచివేసేందుకు వినియోగించారు. తిరుగుబాటుదారుల ప్రధాన సైన్యానికి, బ్రిటిష్ వారికీ ఢిల్లీకి దగ్గరలోని బద్ల్-కీ-సరైలో యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో బ్రిటిష్ సైనికులు మొదట తిరుగుబాటుదారులని ఢిల్లీకి పారద్రోలి తరువాత ఢిల్లీని ఆక్రమించారు. ఢిల్లీ ఆక్రమణ జూలై 1న ప్రారంభమై ఆగస్టు 31 న పూర్తయింది. ఈ యుద్ధంలో ఒకవారంపాటు అడుగడుగునా వీధిపోరాటం జరిగింది. అయితే తిరుగుబాటుదారుల మీద బ్రిటీష్ వారు విజయం సాధించి నగరాన్ని తిరిగి ఆక్రమించారు. జూన్ 20న గ్వాలియర్‌లో చివరి ముఖ్యపోరాటం జరిగింది. ఈ పోరాటంలో రాణీ లక్ష్మీబాయి మరణించింది. ఆయితే చెదురుమదురు పోరాటాలు 1859 లో తిరుగుబాటుదారులను పూర్తిగా అణచివేసేవరకూ జరిగాయి. ఔధ్ రాజు అంతరంగికుడైన అహ్మదుల్లా, నానా సాహిబ్ మరియూ రావ్ సాహిబ్ పరివారము, తాంతియా తోపే, అజ్ముల్లాఖాన్, రాణీ ఝాన్సీ లక్ష్మీబాయి, కున్వర్సింగ్, బీహారులోని రాజపుత్ర నాయకుడైన జగదీష్పూర్, మొగలుచక్రవర్తి బంధువైన ఫిరోజ్ షా, 2వ బహాదుర్ షా, ప్రాణ్ సుఖ్ యాదవ్ మరియూ రెవారి బ్రిటీష్ వారిని ఎదిరించిన తిరుబాటుదారులలోని ముఖ్య నాయకులు.

రాజకీయ కారణాలు

1757 ప్లాసీ యుద్ధంతో భారతదేశంలో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ పాలనకు పునాదులుపడ్డాయి. ఆ తర్వాత 1764 బక్సార్ యుద్ధం, దాని ఫలితంగా కుదిరిన 1765 అలహాబాద్ సంధి బ్రిటిషర్లకు భారతదేశంలో దివానీ, పన్నులు వసూలు చేసే హక్కు కల్పించింది.

ఇదే సమయంలో రాబర్‌‌ట క్లైవ్ ద్వంద్వ పాలన ప్రవేశపెట్టారు. దీని వల్ల భారతీయ రాజులు, ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత 1798లో గవర్నర్ జనరల్‌గా భారతదేశానికి వచ్చిన లార్‌‌డ వెల్లస్లీ సైన్యసహకార పద్ధతిని ప్రవేశపెట్టారు. ఈ పద్ధతిలో వెల్లస్లీ అనేక దురాక్రమణలకు పాల్పడ్డాడు. హైదరాబాదు, మైసూర్ లాంటి అనేక స్వదేశీ సంస్థానాలు బ్రిటిష్ పాలన కింద తొత్తులయ్యాయి.

1848లో లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టిన రాజ్యసంక్రమణ సిద్ధాంతం తీవ్రస్థాయిలో అసంతృప్తి జ్వాలలు రేకెత్తించింది. రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రయోగించి డల్హౌసీ సతారా (1848), శంబల్‌పూర్ (1849), బగ ల్ (1850), ఉదయ్‌పూర్ (1852), ఝాన్సీ (1853), నాగపూర్ (1854) లను ఆక్రమించారు. 1856లో పరిపాలనా వైఫల్యం అనే నెపంతో అయోధ్యను ఆక్రమించి బ్రిటిషర్ల దృష్టిలో డల్హౌసీ మంచి పేరు సంపాదించాడు.

ఈ లోప భూయిష్ట విధానాలు భారతీయుల్లో అసంతృప్తి, వ్యతిరేకతను తెచ్చిపెట్టాయి. పీష్వా రెండో బాజీరావు దత్తపుత్రుడు నానాసాహెబ్‌ను అవమానించిడం, ఝాన్సీలో లక్ష్మీబాయిని అణగదొక్కడం లాంటి వారి పద్ధతులు రెచ్చగొట్టాయి. రిచర్‌‌డ టెంపుల్ మాటల్లో .. ‘‘రాబర్‌‌ట క్లైవ్ భారతదేశంలో బ్రిటిష్ అధికారాన్ని తయారు చేస్తే, దాన్ని వెల్లస్లీ ఒక గొప్ప శక్తిగా తయారు చేశారు. కానీ డల్హౌసీ బ్రిటిష్‌ను భారతదేశంలో ఏకైక శక్తిగా నిలిపాడు’’ అన్నాడు.

ఆర్థిక కారణాలు

బ్రిటిషర్ల మార్కెటిజం, ఆర్థిక సామ్రాజ్యవాదం కూడా 1857 తిరుగుబాటుకు కారణమయ్యాయి. వలస పాలనతో భారతీయ చేతివృత్తులు, కళాకారులు, కర్షకులు ఆర్థిక జీవనంపై ప్రభావం చూపింది. బ్రిటిష్ విధానాల వల్ల భారతీయ కుటీర పరిశ్రమలు, వ్యవసాయం తీవ్రస్థాయిలో దెబ్బతిన్నాయి. బ్రిటిష్ పాలనలో వివిధ గవర్నర్ జనరల్‌లు ప్రవేశపెట్టిన జమీందారి, మహల్వారీ, రైత్వారీ పద్ధతులతో రైతులు తీవ్ర కష్టాలకు లోనయ్యారు. 1813 చార్టర్ చట్టంతో బ్రిటిష్ నుంచి ఉత్పత్తులు భారత మార్కెట్‌లో వరదల్లా ప్రవహించాయి. భారతదేశం నుంచి ముడి సరుకులు లండన్‌కు ఎగుమతయ్యేవి. ఉత్పత్తులు ఎగుమతి చేసే భారత్ ముడిసరుకు ఎగుమతి చేసే దేశంగా మారింది. చిన్న పరిశ్రమల యజమానులు వ్యవసాయ కూలీలుగా మారారు. భారత గవర్నర్ జనరల్ విలియం బెంటిక్ కాలంలో నిర్వహించిన సర్వే చేతివృత్తుల దీనస్థితి గురించి తెలిపింది.

అప్పుడు బెంటిక్ ‘‘భారత భూభాగాలు, చేతి వృత్తుల వారి ఎముకలతో శ్వేత వర్ణమయ్యాయి’’ అని అన్నాడు. ఈ విధంగా అనేక వర్గాల వారి ఆర్థిక స్థితిగతులను బ్రిటిష్ విధానాలు దెబ్బతీశాయి. రాజులు, రాకుమారులు ఇతర మంత్రులు, అధికారులు వారికి రావాల్సిన పెన్షన్‌ను నష్టపోయి, సమాజంలో తమ స్థాయిని కోల్పోయారు. ఆ కాలంలో ఏర్పడిన ప్రకృతి వైపరీత్యాలు కూడా భారతీయులను ఆర్థికంగా అధోగతిలోకి నెట్టాయి. భూస్వామ్య వ్యవస్థ నశించింది. ఇబ్బందులు పడిన వర్గాలన్నీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సిపాయిలకు మద్దతు పలికారు.

సామాజిక, మత కారణాలు: ఈస్టిండియా కంపెనీ అధికారుల విధానాలు సంప్రదాయ భారతీయ సమాజంపై తీవ్ర ప్రభావం చూపాయి. 1813 చార్టర్ చట్టం భారతదేశంలో క్రైస్తవ మిషనరీలకు అనుమతి, మత మార్పిడులకు ఆహ్వానం పలికింది. ఈ చట్టం భారతీయుల మతజీవనంపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపింది. బలవంత మత మార్పిడులకు బహిరంగంగా ప్రోత్సహించారు.

ఇంగ్లిష్ విద్యావిధానం ప్రవేశపెట్టారు. కొత్తగా ప్రారంభమైన విద్యాలయాల్లో క్రైస్తవ మత బోధన తప్పనిసరైంది. ప్రాచీన విద్యాలయాలు తమ స్థానాన్ని కోల్పోయాయి. 1833 నుంచి హిందూ, ముస్లింలను బహిరంగంగా క్రైస్తవమతంలోకి చేర్చుకోవడంతో భారతీయ సంప్రదాయాలు దెబ్బతిన్నాయి. భారత సమాజంలో అంతర్లీనమైన ఆచార వ్యవహారాలను బ్రిటిషర్లు రద్దు, లేదా మార్పు చేశారు. 1829లో సతీ నిషేధ చట్టం, 1846లో స్త్రీ శిశుహత్యా నిషేధ చట్టం, 1856లో వితంతు పునర్వివాహ చట్టాలు భారతీయుల హృదయాల్లో అభద్రతాభావాన్ని రేకెత్తించాయి. వివిధ రూపాల్లో బాధపడ్డ వర్గాలన్నీ తిరుగుబాటును ప్రోత్సహించాయి.

సైనిక కారణాలు

1853లో కార్‌‌లమార్‌‌క్స ‘బ్రిటిషర్లు భారతీయ సైనిక సహాయంతో రాజ్యాన్ని స్థాపించి, భారతదేశ సొమ్ముతోనే పాలన కొనసాగించార’ని పేర్కొన్నారు. 1856 నాటికి బ్రిటిష్ సైన్యంలో 2,32,234 మంది భారతీయ సిపాయిలున్నారు. కంపెనీ చట్టాలతో వీరు అవమానానికి గురయ్యారు. బ్రిటిష్ సైనికులతో సమాన వేతనాలు వీరికి అందలేదు. 1854-1856 మధ్య జరిగిన యుద్ధానికి భారతీయ సైనికులు సముద్రాన్ని దాటాల్సి వచ్చింది. సముద్రాన్ని దాటడాన్ని అప్పటి భారతీయ సమాజం అంగీకరించేది కాదు. దీన్ని బ్రిటిష్ సైన్యంలోని బ్రాహ్మణ సైనికులు వ్యతిరేకించారు.

లార్‌‌డ కానింగ్ 1856లో ప్రవేశపెట్టిన సాధారణ సేవా నియుక్త చట్టం భారతీయ సైనికుల్లో అసంతృప్తి కలిగించింది. ముస్లింలు, సిక్కులు, ఇతర భారతీయ సైనికులు కూడా బ్రిటిషర్ల వలే ఉండాలనే చట్టం అమలు చేశారు.

తక్షణ కారణం

డల్హౌసీ తర్వాత భారతదేశానికి గవర్నర్ జనరల్‌గా వచ్చిన లార్డ్ కానింగ్ కాలంలో సైన్యంలో ఎన్‌ఫీల్డ్ తుపాకీలు ప్రవేశపెట్టారు. వీటికి ఉపయోగించే మందుగుండ్లకు (Catridges) ఆవు కొవ్వు లేదా పందికొవ్వుతో పూత పూసినట్లు సమాచారం వ్యాప్తి చెందింది. సైనికులు పంటితో బుల్లెట్లకు పూసిన కొవ్వును తొలగించి వాటిని తుపాకీలో దించి కాల్చాలి. సైన్యంలో ఎక్కువ మంది హిందువులు, ముస్లింలే కాబట్టి ఇది వారి మతాచారాల మీద తీవ్ర ప్రభావం చూపింది.

తిరుగుబాటు ప్రారంభం, గమనం, వ్యాప్తి

మందుగుండుకు కొవ్వు పూత పూస్తున్నట్లు 1857 జనవరి 23న డండం అనే ప్రాంతంలో వార్త మొదలై అన్ని ప్రాంతాలకూ వ్యాపించింది. 1857, మార్చి 29న బారక్‌పూర్‌లోని 34వ స్వదేశీ దళానికి చెందిన మంగల్‌పాండే అనే సేనాని ఎన్‌ఫీల్డ్ తుపాకీతో ఇద్దరు బ్రిటిష్ అధికారులను కాల్చి చంపాడు. ఈ తిరుగుబాటును బ్రిటిషర్లు పూర్తిగా అణచివేసి, ఏప్రిల్ 6న మంగల్‌పాండేను ఉరితీశారు. ఈ వార్త దావానలంలా దేశమంతటా వ్యాపించింది. 19, 34వ స్వదేశీ దళాలను బ్రిటిష్ ప్రభుత్వం రద్దు చేసింది.

భారతీయ సైనికులందరూ బ్రిటిషర్లపై ఒక్కసారిగా తిరుగుబాటు చేయడానికి ప్రణాళిక రూపొందించారు. మే 31ని తిరుగుబాటు రోజుగా నిర్ణయించుకొని, చపాతీలు, కలువ పూలు పంచారు. కానీ విప్లవం మే 10నే ప్రారంభమైంది. మే 8వ తేదీన మీరట్‌లోని 3వ అశ్విక దళంలో ఈ బారు తుపాకీలు ప్రవేశపెట్టారు.

కానీ వాటిని ఉపయోగించడానికి నిరాకరించిన భారతీయ సైనికులపై బ్రిటిషర్లు తీవ్ర చర్యలు తీసుకున్నారు. దీంతో 1857 మే 10న సైనికులు అక్కడి అధికారులను చంపి మే 11న ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలోని ఎర్రకోటను ఆక్రమించి అప్పటి మొగల్ చక్రవర్తి రెండో బహదూర్‌షాను భారత జాతీయ చక్రవర్తిగా ప్రకటించారు. ఢిల్లీలోని ఈ విజయంతో దేశంలో ఉత్తర, కేంద్ర ప్రాంతాలు - అవధ్, రోహిల్‌ఖండ్, పశ్చిమ బీహార్‌ల్లో తిరుగుబాట్లు చెలరేగాయి.

తొలి దశ

బహదూర్ షా జఫర్ ను భారత దేశ చక్రవర్తిగా ప్రకటించారు. దీనికి అతడు సుముఖంగా లేనప్పటికీ, సైనికులు, అతడి దర్బారులోని ఉద్యోగులూ చేసిన బలవంతం మీద అతడు ఒప్పుకొన్నాడని ఆనాటి చరిత్రకారులు, ఆధునికులూ కూడా భావిస్తున్నారు.[4] గడచిన శతాబ్దాల్లో మొగలుల అధికారం చాలావరకూ క్షీణించినప్పటికీ, ఉత్తర భారతంలో వారి పేరుకు ఇంకా చాలా ప్రతిష్ఠ ఉంది.[5] పౌరులు, కులీనులు, ఇతర పెద్దలూ అతడికి విధేయులుగా ఉంటామని ప్రతిజ్ఞ చేసారు. చక్రవర్తి తన పేరిట నాణేలు విడుదల చేసాడు. తమ అధికారాన్ని వెల్లడి చేసే పద్ధతి ఇది. మొగలులతో అనేక యుద్ధాలు చేసిన పంజాబీ సిక్ఖులు తిరిగి మహమ్మదీయ పాలనలోకి వెళ్ళేందుకు ఇష్టపడలేదు. అందుచేత వారు తిరుగుబాటును వ్యతిరేకించారు. ఈ తిరుగుబాటు సమయంలో బెంగాలు అంతా దాదాపుగా స్తబ్దుగానే ఉంది. జాఫర్ ఇచ్చిన తిరుగుబాటు పిలుపుకు సామాన్యులు స్పందించిన తీరుకు బ్రిటిషర్లు విస్తుపోయారు.[5]

తొలుత తిరుగుబాటు దార్లు కంపెనీ సైన్యాన్ని తరిమేసి, హర్యానా, బీహార్, కేంద్ర పరగణాలు, ఐక్య పరగణాల్లోని అనేక పట్టణాలను స్వాధీనం చేసుకున్నారు. కంపెనీ దళాలను కూడదీసుకుని ఎదురుదాడి చెయ్యడం మొదలుపెట్టే సమయానికి తిరుగుబాటు దార్లకు ఒక కేంద్రీయ నాయకత్వం కరువైంది. బఖ్త్ ఖాన్ వంటి నాయకులు కొందరున్నప్పటికీ, తిరుగుబాటుదార్లు ఎక్కడికక్కడ చిన్న చిన్న సంస్థానాధీశుల నాయక్త్వంలోనే యుద్ధం చేసారు. వీరిలో కొందరు గట్టిగానే పోరాడినప్పటికీ, మిగతావారు మాత్రం స్వార్థపూరితంగాను, అసమర్ధులుగానూ మిగిలిపోయారు.

Attack of the mutineers on the Redan Battery at Lucknow, 30 July 1857

మీరట్ చుట్టుపట్ల ఉన్న గ్రామీణ ప్రాంతంలో గుర్జర్ల తిరుగుబాటు బ్రిటిషర్లకు అతి పెద్ద బెడద తెచ్చిపెట్టింది. పరీక్షిత్‌గఢ్ లో గుర్జర్లు చౌధురీ కదమ్ సింగ్‌ను తమ నాయకుడిగా ప్రకటించి, కంపెనీ పోలీసులను పారదోలారు. కదమ్ సింగ్ గుర్జర్ 2 వేల నుండి 10 వేల వరకూ ఉన్న పెద్ద సైన్యానికి నాయకత్వం వహించాడు.[6] బులంద్‌షహర్ వలిదాద్ ఖాన్ నాయకత్వంలోను, బిజ్‌నోర్ మహో సింగ్ నేతృత్వంలోనూ గుర్జర్ల నియ్ంత్రణ లోకి వచ్చింది. సమకాలికుల నివేదికల ప్రకారం, మీరట్ ఢిల్లీల మధ్య ఉన్న గుర్జర్ల గ్రామాలన్నీ తిరుగుబాటులో పాల్గొన్నాయి. వారికి కొన్ని చోట్ల జలంధర్ మద్దతు లభించింది. జూలై అంతానికి గాని బ్రిటిషర్లు ఈ ప్రాంతంపై నియంత్రణ తెచ్చుకోలేకపోయారు; అది కూడా స్థానిక జాట్‌ల సహాయంతో.[6]

లాహోరుకు చెందిన ముస్లిము పండితుడు ముఫ్తీ నిజాముద్దీన్ బ్రిటిషు వారికి వ్య్తిరేకంగా రావ్ తులా రాం కు మద్దతు ఇమ్మని ఫత్వా జారీ చేసాడు. ఆ తరువాత నర్నౌల్ వద్ద జరిగిన పోరులో 1857 నవంబరు 16 న రావ్ తులా రాం ఓడిపోయాడు. ముఫ్తీ నిజాముద్దీన్‌ను, అతడి సోదరుడు, బావమరిదినీ బ్రిటిషు వారు అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకువెళ్ళి ఉరితీసారు.[7]


ఢిల్లీ

Assault of Delhi and capture of the Cashmere Gate, 14 September 1857

తిరుగుబాటును అణచడంలో మొదట్లో బ్రిటిషు వారు కొంత మందకొడిగా వ్యవహరించారు. బ్రిటను నుండి సైన్యాలు సముద్రం మీదుగా రావడం కొంత ఆలస్యమైంది. చైనా వెళ్ళే దాఅరిలో ఉన్న కొన్ని దళాలను భారత్‌కు మళ్ళించారు.

మీరట్, సిమ్లాల నుండి బ్రిటిషు దళాలు ఢిల్లీకి బయల్దేరి దారిలో అనేకమంది తిరుగుబాటుదార్లను చంపుతూ కర్నాల్‌ వద్ద కలుసుకున్నాయి. ఈ రెండు సైన్యాలు నేపాల్ నుండి వచ్చిన రెండు గూర్ఖా దళాలతో కలిసి బద్లీ కే సరాయ్ వద్ద తిరుగుబాటుదార్ల ప్రధాన దళాన్ని ఎదుర్కొన్నాయి.

ఢిల్లీకి ఉత్తరాన స్థావరాన్ని నిర్మించుకుని కంపెనీ దళాలు నగరాన్ని ముట్టడించాయి. జూలై 1 నుండి సెప్టెంబరు 21 దాకా ఈ ముట్టడి కొనసాగింది. అయితే నగరాన్ని చుట్టుముట్టేంత సైన్యం బ్రిటిషు వారి వద్ద లేదు. తిరుగుబాటు సైన్యం బ్రిటిషు సైన్యం కంటే సంఖ్యలో చాలా ఎక్కువగా ఉంది. ముట్టడిలో ఉన్నది ఢిల్లీ కాదు, బ్రిటిషు సైన్యమా ఆన్నట్టు ఉండేది. తిరుగుబాటుదార్ల నిరంతర దాడులు, రోగాలు, అలసట కారణంగా బ్రిటిషు సైన్యం వెనక్కి తగ్గుతుందేమో అన్నట్టుండేది. ఆగస్టు 14 న పంజాబు నుండి బ్రిటిషు, సిక్ఖు, పఖ్తూన్ దళాలు జాన్ నికోల్సన్ నాయకత్వంలో వచ్చి చేరడంతో బ్రిటిషు సైన్యాం బలపడింది.[8][9]

సెప్టెంబరు 7 న బ్రిటిషు వారి శతఘ్నులతో గోడలను బద్దలు కొట్టి తిరుగుబాటుదార్ల శతఘ్నులను పట్టుకున్నారు.[10]: 478  సెప్టెంబరు 14 న కాశ్మీరీ గేట్ ద్వారా నగరంలోకి ప్రవేశించేందుకు బ్రిటిషు దళాలు ప్రయత్నించారు.[10]: 480  నగరంలో కాలుమోపినప్పటికీ బ్రిటిషు దళాలకు అపార నష్టం జరిగింది. జాన్ నికోల్సన్ కూడా మరణించాడు. బ్రిటిషు కమాండరు వెనక్కి తగ్గాలని అనుకున్నాడు. కానీ, అతడి కింది అధికారులు నచ్చజెప్పడంతో పోరు కొనసాగించాడూ. ఒక వారంలో బ్రిటిషు దళాలు ఎర్రకోటను పట్టుకున్నాయి. ఢిల్లీ తిరిగి బ్రిటిషు వారి స్వాధీనమైంది. బహదూర్ షా జఫర్ అప్పటికే హుమాయూన్ సమాధికి పారిపోయాడు.

Capture of [./https://en.wikipedia.org/wiki/Bahadur_Shah_Zafar Bahadur Shah Zafar] and his sons by [./https://en.wikipedia.org/wiki/William_Stephen_Raikes_Hodson William Hodson] at [./https://en.wikipedia.org/wiki/Humayun's_tomb Humayun's tomb] on 20 September 1857

బ్రిటిషు సైన్యాలు నగరంలో దోపిడీలు దౌర్జన్యాలు చేసాయి. అనేకమంది పౌరులను చంపారు. ప్రధాన మసీదును, ఇతర ప్రాంతాలనూ శతఘ్నులతో పేల్చివేసారు. కులీన ముస్లిముల ఇళ్ళను ధ్వంసం చేసారు.

బహదూర్ షా జఫర్‌ను అరెస్టు చేసారు. అతడి కుమారులలో ఇద్దరిని, ఒక మనుమడినీ బ్రిటిషు ఏజెంటు కాల్చి చంపించాడు. ఈ సంగతి తెలిసి బహదూర్ షా మ్రాన్పడి పోయాడు. అతడి భార్య జీనత్ మహల్ మాత్రం ఇక తన కొడుకు జఫర్ వారసుడౌతాడని సంతోషించింది.[11]

తిరుగుబాటు నాయకులు

నానాసాహెబ్: కాన్పూర్‌లో తిరుగుబాటు చేసిన నానాసాహెబ్ అసలు పేరు దొండుపంత్. ఇతడు మరాఠా చివరి పీష్వా రెండో బాజీరావు దత్తపుత్రుడు. తిరుగుబాటు సమయంలో బితూర్ (కాన్పూర్ జిల్లా, ఉత్తరప్రదేశ్) లో తన కుటుంబంతో పాటు నివసించేవాడు. జూన్ 4న 2వ అశ్విక దళం, 1వ స్వదేశీ పదాతి దళం కాన్పూర్‌లో తిరుగుబాటు చేసి అనేకమంది బ్రిటిష్ అధికారులను చంపాయి. ఈ తిరుగుబాటుకు నానాసాహెబ్ నాయకత్వం వహించారు.

తండ్రి మరణం తర్వాత ఇతనికి రావాల్సిన పెన్షన్‌ను కంపెనీ నిలిపివేసి, పీష్వా పదవిని రద్దు చేసింది. నానాసాహెబ్ తిరుగుబాటుకు తాంతియాతోపే మద్దతు పలికాడు. అనేక అపజయాలు ఎదుర్కొన్న నానాసాహెబ్ నేపాల్ అడవులకు పారిపోయాడు. తాంతియాతోపే ఝాన్సీ వెళ్లి లక్ష్మీబాయితో చేతులు కలిపాడు.

రెండో బహదూర్‌షా: చివరి మొగల్ చక్రవర్తై బహదూర్‌షాను 1857 తిరుగుబాటుకు నాయకుడిగా, భారతదేశ చక్రవర్తిగా భారత సైనికులు ప్రకటించారు. అప్పటికి అతడి వయసు 80 ఏళ్లు దాటింది. షా హిందీ, ఉర్దూ భాషల్లో పండితుడు. ‘జాఫర్’ అనే కలంపేరుతో రచనలు చేశాడు. తిరుగుబాటు సమయంలో భారతీయులను కాపాడడానికి తన శాయశక్తులా ప్రయత్నించి, బ్రిటిషర్లకు దొరికిపోయాడు. 1862లో రంగూన్ జైల్లో మరణించాడు. షా చక్రవర్తిగా అనేక సంస్కరణలు కూడా చేశాడు. ఢిల్లీలో గోవధను నిషేధించాడు. అతని మరణం ముందు అతని గొప్పదనం చెప్పాలంటే ‘‘మొగలు చక్రవర్తి జాఫర్ భౌతికకాయాన్ని పూడ్చడానికి అతడు 2 గజాల భూమిని కూడా నిలుపుకోలేకపోయాడు’’

ఝాన్సీ లక్ష్మీబాయి: లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. ఈమెను ఝాన్సీ రాజు గంగాధరరావుతో వివాహం చేశారు. భర్త మరణంతో దామోదరరావును దత్తపుత్రుడిగా తీసుకున్నారు. 1848లో డల్హౌసీ ప్రవేశపెట్టిన రాజ్యసంక్రమణ సిద్ధాంతం ప్రకారం ఝాన్సీ రాజ్యాన్ని బ్రిటిషర్లు ఆక్రమించారు. దీంతో 1857 జూన్ 4 న ఝాన్సీ లక్ష్మీబాయి తిరుగుబాటు చేసి యుద్ధభూమిలో మరణించింది. ఈ తిరుగుబాటును సర్‌ హ్యూ రోజ్ అణచివేశాడు. ఆమెకు సహకరించిన తాంతియా తోపేను బ్రిటిషర్లు ఉరితీశారు. లక్ష్మీబాయి గురించి సర్‌ హ్యూ రోజ్ ‘‘1857 తిరుగుబాటులో అత్యంత ఉత్తమమైన, ధైర్యమైన నాయకురాలు’’ అని పొగిడాడు

తిరుగుబాటు తదనంతర పరిణామాలు

1857 తిరుగుబాటు భారతదేశ చరిత్రలో ఒక ముఖ్య మలుపుగా చెప్పవచ్చు. బ్రిటీష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనను రద్దుచేసి విక్టోరియా రాణి పరిపాలనను ప్రవేశపెట్టారు. భారత పాలనావ్యవహారాలను చూసుకోవటానికి వైస్రాయిని నియమించారు. ఈవిధంగా భారతదేశం నేరుగా బ్రిటీష్ పాలనలోకి వచ్చింది. తన పాలనలో భారతదేశ ప్రజలకు సమాన హక్కులు కల్పిస్తానని బ్రిటీష్ రాణి ప్రమాణం చేసింది, అయినప్పటికీ బ్రిటిష్ వారిపట్ల భారత ప్రజలకు అనుమానాలు తొలగలేదు. ఈ అనుమానాలు 1857 తిరుగుబాటు అనంతరం విస్తృతమయ్యాయి.

బ్రిటిష్ వారు తమ పాలనలో అనేక రాజకీయ సంస్కరణలను ప్రవేశపెట్టారు. భారతదేశంలోని అగ్రవర్ణాల వారిని, జమీందారులను పరిపాలనలో భాగస్వాములను చేసారు. భూఆక్రమణలకు స్వస్తి పలికారు, మతవిషయాలలో ప్రభుత్వ జోక్యం నిలిపివేసారు. భారతీయులను ప్రభుత్వ ఉద్యోగాలలోకి అనుమతించారు, అయితే ఆచరణలో క్రిందితరగతి ఉద్యోగాలకే పరిమితం చేసారు. సైన్యంలో బ్రిటిష్ సైనికుల నిష్పత్తిని పెంచటం, ఫిరంగులు మొదలయిన భారీ అయుధాలను బ్రిటిష్ సైనికులకే పరిమితం చేసారు. బహదూర్‌షాను దేశ బహిష్కృతుని గావించి బర్మాకి తరలించారు. 1862 లో అతను బర్మాలో మరణించటంతో భారతరాజకీయాలలో మొగలాయిల వంశం అంతమైందని చెప్పవచ్చు. 1877 లో బ్రిటన్ రాణి, తనను భారతదేశానికి రాణిగా ప్రకటించుకుంది.

ఇవీ చూడండి

బయటి లింకులు

అంతకు ముందువారు
Second Anglo-Sikh War
Indo-British conflicts తరువాత వారు
Hindu German Conspiracy
  1. File:Indian revolt of 1857 states map.svg
  2. The Gurkhas by W. Brook Northey, John Morris. ISBN 81-206-1577-8. Page 58
  3. Spear 1990, pp. 147–148
  4. The Indian Mutiny 1857–58, Gregory Fremont-Barnes, Osprey 2007, p. 34.
  5. 5.0 5.1 Dalrymple 2008, p. 23
  6. 6.0 6.1 Stokes, Eric; Bayly, Christopher Alan (1986), The peasant armed: the Indian revolt of 1857, Clarendon Press, ISBN 978-0-19-821570-7
  7. Hakim Syed Zillur Rahman (2008), "1857 ki Jung-e Azadi main Khandan ka hissa", Hayat Karam Husain (2nd ed.), Aligarh/India: Ibn Sina Academy of Medieval Medicine and Sciences, pp. 253–258, OCLC 852404214
  8. God's Acre. The Hindu Metro Plus Delhi. 28 October 2006.
  9. 'The Rising: The Ballad of Mangal Pandey' Archived 14 జూలై 2007 at the Wayback Machine. Daily Mail, 27 August 2005.
  10. 10.0 10.1 Porter, Maj Gen Whitworth (1889). History of the Corps of Royal Engineers Vol I. Chatham: The Institution of Royal Engineers.
  11. Dalrymple 2006, p. 400