అనిల్ అంబానీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 48: పంక్తి 48:
* [http://www.relianceadagroup.com/ada/chairman.html Profile] at [[Reliance Anil Dhirubhai Ambani Group|Reliance ADAG]]
* [http://www.relianceadagroup.com/ada/chairman.html Profile] at [[Reliance Anil Dhirubhai Ambani Group|Reliance ADAG]]
* [https://www.forbes.com/profile/anil-ambani Profile] at [[Forbes]]
* [https://www.forbes.com/profile/anil-ambani Profile] at [[Forbes]]
* {{NYTtopic|people/a/anil_d_ambani}}
* {{Guardian topic}}
* [http://timesofindia.indiatimes.com/topic/Anil-Ambani Anil Ambani]: collected news and commentary at ''[[The Times of India]]''
* [http://timesofindia.indiatimes.com/topic/Anil-Ambani Anil Ambani]: collected news and commentary at ''[[The Times of India]]''
{{Authority control}}
{{Authority control}}

10:53, 22 మార్చి 2019 నాటి కూర్పు

అనిల్ అంబానీ
2012లో అనిల్ అంబానీ
జననం (1959-06-04) 1959 జూన్ 4 (వయసు 64)[1]
జాతీయతభారతీయుడు
విద్యాసంస్థముంబై విశ్వవిద్యాలయం
ద వార్టన్ స్కూల్ ఆఫ్ ద యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా
వృత్తివ్యాపారవేత్త
నికర విలువయుఎస్$1.8 బిలియన్లు (2019 ఫిబ్రవరి నాటికి)[2]
బిరుదుఛైర్మన్, రిలయన్స్ గ్రూప్
జీవిత భాగస్వామిటీనా అంబానీ
పిల్లలు2
తల్లిదండ్రులుధీరూబాయ్ అంబానీ
కోకిలాబెన్ అంబానీ
బంధువులుముఖేష్ అంబానీ (అన్నయ్య)

అనిల్ ధీరూబాయ్ అంబానీ (జననం 1959 జూన్ 4) ఒక భారతీయ వ్యాపారవేత్త. రిలయన్స్ గ్రూప్ (దీన్నే రిలయన్స్ ఎడిఎ గ్రూప్ అంటారు)కి ఇతను ఛైర్మన్. రిలయన్స్ క్యాపిటల్,[3] రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్,[4] రిలయన్స్ పవర్, రిలయన్స్ కమ్యూనికేషన్స్.[5] వంటివాటితో కూడిన రిలయన్స్ ఎడిఎ గ్రూప్ 2005 జూన్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నుంచి విడివడింది. ఇతని ప్రధానమైన వ్యాపార ఆసక్తుల్లో 44 ఎఫ్ఎం స్టేషన్లు, భారతదేశ వ్యాప్తంగా ఉన్న డీటీహెచ్ వ్యాపారం, యానిమేషన్ స్టూడియో, భారతదేశమంతటా ఉన్న పలు మల్టీప్లెక్సులు ఉన్నాయి.[6]

జీవిత చరిత్ర

ధీరూబాయ్ మరణం (2002-2005)

2002లో అతని తండ్రి ధీరుభాయ్ అంబానీ మరణించాకా, అనిల్ అంబానీ రిలయన్స్ సంస్థల్లో టెలికాం, వినోద రంగం, ఫైనాన్షియల్ సేవలు, విద్యుత్తు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి విభాగాల పగ్గాలు చేపట్టాడు.[7]

అన్నతో వివాదం, ఆస్తుల విభజన (2005)

ధీరూబాయ్ అంబానీ తన ఆస్తులను అనిల్ అంబానీ, అతని సోదరుడు ముఖేష్ అంబానీలు ఎలా పంచుకోవాలన్న విషయం మీద సరైన వీలునామా రాయకుండా చనిపోయాడు. దీనితో 2005లో అనిల్ కీ, అతని సోదరుడు ముఖేష్ కీ వివాదాలు చెలరేగి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ని విభజించారు. విభజన వెంటనే 2007లో అనిల్, ముఖేష్ ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో అగ్రభాగాన నిలిచారు.[8]

తొలినాటి వ్యాపారం (2005-2010)

రిలయన్స్ పవర్

భారతదేశపు అతిపెద్ద ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ రికార్డు నెలకొల్పినది అనిల్ అంబానీయే. 2008లో రిలయన్స్ పవర్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ కి వెళ్ళినప్పుడు 60 క్షణాలలోపే షేర్లన్నీ అమ్ముడుకావడం భారతీయ మార్కెట్లలో అత్యంత వేగవంతమైనదిగా రికార్డు సృష్టించింది.[9] ఈ షేర్లు ఒక్కొక్కటి వెయ్యి రూపాయలు దాటిపోతాయని, తద్వారా అనిల్ అంబానీ ముఖేష్ అంబానీని మించిపోతాడని అంచనాలు వేశారు. 2008 ఫిబ్రవరిలోనే షేర్లు దెబ్బతినడం, వాటాదారులు నష్టపోవడంతో ఈ పరిణామాలు తిరగబడి అనిల్ కు నష్టాలు తెచ్చిపెట్టాయి.

రిలయన్స్ ఎంటర్టైన్మెంట్

ఫిల్మ్ ప్రాసెసింగ్, నిర్మాణం, ప్రదర్శన, డిజిటల్ సినిమా వంటివాటిలో ఆసక్తులు కలిగిన యాడ్ లాబ్స్ ఫిల్మ్స్ కొనుగోలు చేయడం ద్వారా 2005లో అనిల్ అంబానీ వినోద రంగంలో అడుగుపెట్టాడు. 2009లో కంపెనీని రిలయన్స్ మీడియా వర్క్స్ గా పేరు మార్చారు.[10][11][12] 2008లో స్టీవెన్ స్పీల్‌బెర్గ్ నిర్మాణ సంస్థ డ్రీమ్ వర్క్స్ తో కలిసి ప్రారంభించిన 1.2 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువ గల సంయుక్త వ్యాపార ప్రయత్నం ద్వారా అనిల్ అంబానీ అంతర్జాతీయ వినోద పరిశ్రమలో ప్రవేశించాడు.[13] ఈ ప్రయత్నం ద్వారా అకాడమీ పురస్కారం అందుకున్న లింకన్ సహా పలు స్పీల్ బర్గ్ చిత్రాల నిర్మాణానికి తనవంతు పెట్టుబడి పెట్టాడు.[14][15]

రిలయన్స్ కమ్యూనికేషన్స్

ఆస్తుల విభజన నాటికి అతని అతిపెద్ద ఆస్తి అయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (67శాతం వాటాతో) ఆస్తులు ఏటా 16.6 శాతం తగ్గుతూ రాగా, అప్పులు ఏటా 8.7 శాతం పెరుగుతూ పోయాయి. 2008లో రిలయన్స్ కమ్యూనికేషన్ ను దక్షిణాఫ్రికా టెలికాం సంస్థ ఎంటిఎంలో కలిపడం ద్వారా భారతదేశపు అతిపెద్ద ఓవర్ సీస్ డీల్ చేయాలని అనిల్ భావించాడు. ఈ డీల్ ని అడ్డుకుంటూ రిలయన్స్ కమ్యూనికేషన్స్ లో వాటా ఉన్న ముఖేష్ తొలుత తిరస్కరించే తన హక్కును వాడుకుంటున్నాననీ, డీల్ చేస్తే కోర్టుకు వెళ్ళాల్సివుంటుందని హెచ్చరించడంతో అది ఆగిపోయింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ తర్వాత 2012 నాటి 2జీ కుంభకోణంలోనూ ఇరుక్కుంది.[16]

మూలాలు

  1. "Date of birth". daily.bhaskar.com. Retrieved 6 సెప్టెంబరు 2016.
  2. "Anil Ambani". Forbes. Retrieved 7 ఫిబ్రవరి 2019.
  3. "Reliance Capital". Reliance Capital. 17 ఏప్రిల్ 2014. Retrieved 18 ఏప్రిల్ 2014.
  4. "Reliance Infra". Reliance Infra. 17 ఏప్రిల్ 2014. Retrieved 17 ఏప్రిల్ 2014.
  5. "Reliance Communication". Reliance Communication. 17 ఏప్రిల్ 2014. Retrieved 17 ఏప్రిల్ 2014.
  6. "Ambani & Sons". CNNGO. 12 జూన్ 2012. Retrieved 16 ఫిబ్రవరి 2014.
  7. "The Ambani Achievements". Rediff.com. 7 జూలై 2002. Retrieved 16 ఫిబ్రవరి 2014.
  8. "తమ్ముడూ ఈ డబ్బులు తీసుకో ఆ అప్పు తీర్చేయ్". 19 March 2019. 19 మార్చి 2019. Retrieved 21 మార్చి 2019.
  9. "Anil Ambani". EXHIBIT MAGAZINE. 22 మే 2014. Archived from the original on 6 ఫిబ్రవరి 2015. {{cite web}}: Unknown parameter |deadurl= ignored (help)
  10. "Reliance Cap buys 51% in Adlabs for Rs 360 crore". The Economic Times. Bennett, Coleman & Co. Ltd. 1 జూలై 2005. Retrieved 11 ఫిబ్రవరి 2015.
  11. "The Reliance-Spielberg Deal: Anil Ambani's Next Blockbuster?". Knowledge@Wharton. The Wharton School, University of Pennsylvania. 2 అక్టోబరు 2008. Retrieved 11 ఫిబ్రవరి 2015.
  12. "Adlabs Films to be renamed Reliance MediaWorks". Live Mint. HT Media. 4 సెప్టెంబరు 2009. Retrieved 11 ఫిబ్రవరి 2015.
  13. "DreamWorks to Receive Funds From Reliance". The Wall Street Journal. News Corporation. 10 ఏప్రిల్ 2012. Retrieved 11 ఫిబ్రవరి 2015.
  14. "Reliance Entertainment [in]". IMBD. Retrieved 11 ఫిబ్రవరి 2015.
  15. "Lincoln (2012) - Company credits". IMDB. Retrieved 11 ఫిబ్రవరి 2015.
  16. అనిల్ అంబానీ గురించి డెక్కన్ హెరాల్డ్ లో (2019 మార్చి)

బాహ్య లంకెలు