2019 భారత సార్వత్రిక ఎన్నికలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి తెలుగు రాష్ట్రల వివరాలకు లింకులు చేర్చు
చి వర్గం:భారతదేశంలో ఎన్నికలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 617: పంక్తి 617:
[[వర్గం:భారతీయ ఎన్నికలు]]
[[వర్గం:భారతీయ ఎన్నికలు]]
[[వర్గం:17వ లోక్‌సభ]]
[[వర్గం:17వ లోక్‌సభ]]
[[వర్గం:భారతదేశంలో ఎన్నికలు]]

04:53, 3 ఏప్రిల్ 2019 నాటి కూర్పు

భారత దేశంలో 17 వ లోక్‌సభకు జరిగే ఎన్నికలే 2019 భారత సార్వత్రిక ఎన్నికలు. ఈ ఎన్నికల షెడ్యూలును భారత ఎన్నికల కమిషను 2019 మార్చి 10 న ప్రకటించింది. ఏడు దశల్లో జరిపే పోలింగు 2019 మే 19 వ తేదీతో ముగుస్తుంది. వోట్ల లెక్కింపు 2019 మే 23 వ తేదీన జరుగుతుంది. ఎన్నికల ప్రవర్తన నియమావళి తక్షణం అమల్లోకి వచ్చినట్లు ప్రధాన ఎన్నికల కమిషనరు సునీల్ అరోరా తెలిపాడు.

బీహారు, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ - ఈ మూడు రాష్ట్రాల్లో పోలింగు అన్ని దశల్లోనూ జరుగుతుంది. జమ్మూ కాశ్మీరులో పోలింగు 5 దశల్లో జరుగుతుంది. నాలుగు రాష్ట్రాల్లో 4 దశల్లోను, రెండు రాష్ట్రాల్లో మూడు దశల్లోను, నాలుగు రాష్ట్రాల్లో 2 దశల్లోనూ వోటింగు జరగనుంది. మిగతా రాష్ట్రాల్లో ఒకే దశలోనే వోటింగు పూర్తవుతుంది.

ఆంధ్ర ప్రదేశ్, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల శాసనసభల కాలం ముగుస్తున్నందున వాటి ఎన్నికలు కూడా సార్వత్రిక ఎన్నికలతో పాటు జరగనున్నాయి.

ఎన్నికల షెడ్యూలు

మార్చి 10 న ప్రధాన ఎన్నికల కమిషనరు సునీల్ అరోరా ప్రకటించిన ఎన్నికల షెడ్యూలు కింది విధంగా ఉంది.[1] ఎన్నికల ప్రవర్తన నియమావళి తక్షణమే అమల్లోకి వచ్చినట్లు అయన తెలిపాడు.[2]

2019 సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు
మొత్తం మొదటి దశ రెండవ దశ మూడవ దశ నాలుగవ దశ ఐదవ దశ ఆరవ దశ ఏడవ దశ
పోలింగు తేదీ 2019 ఏప్రిల్ 11 2019 ఏప్రిల్ 18 2019 ఏప్రిల్ 23 2019 ఏప్రిల్ 29 2019 మే 6 2019 మే 12 2019 మే 19
లెక్కింపు తేదీ 2019 మే 23 2019 మే 23 2019 మే 23 2019 మే 23 2019 మే 23 2019 మే 23 2019 మే 23
నియోజక వర్గాలు 543 91 97 115 71 51 59 59
ఒకే దశ మొత్తం మొదటి దశ రెండవ దశ మూడవ దశ నాలుగవ దశ ఐదవ దశ ఆరవ దశ ఏడవ దశ
1 ఆంధ్ర ప్రదేశ్ 25 25
2 అరుణాచల్ ప్రదేశ్ 2 2
3 గోవా 2 2
4 గుజరాత్ 26 26
5 హర్యానా 10 10
6 హిమాచల్ ప్రదేశ్ 4 4
7 కేరళ 20 20
8 మేఘాలయ 2 2
9 మిజోరం 1 1
10 నాగాల్యాండ్ 1 1
11 పంజాబ్ 13 13
12 సిక్కిమ్ 1 1
13 తమిళనాడు 39 39
14 తెలంగాణ 17 17
15 ఉత్తరాఖండ్ 5 5
16 అండమాన్ నికోబార్ దీవులు 1 1
17 దాద్రా నగర్ హవేలి 1 1
18 దామన్ డయ్యు 1 1
19 పుదుచ్చేరి 1 1
20 చండీగఢ్ 1 1
21 ఢిల్లీ 7 7
22 లక్షద్వీప్ 1 1
2 దశల్లో మొత్తం మొదటి దశ రెండవ దశ మూడవ దశ నాలుగవ దశ ఐదవ దశ ఆరవ దశ ఏడవ దశ
1 కర్ణాటక 28 14 14
2 మణిపూర్ 2 1 1
3 రాజస్థాన్ 25 13 12
4 త్రిపుర 2 1 1
3 దశల్లో మొత్తం మొదటి దశ రెండవ దశ మూడవ దశ నాలుగవ దశ ఐదవ దశ ఆరవ దశ ఏడవ దశ
6 అస్సాం 14 5 5 4
7 చత్తీస్ గఢ్ 11 1 3 7
4 దశల్లో మొత్తం మొదటి దశ రెండవ దశ మూడవ దశ నాలుగవ దశ ఐదవ దశ ఆరవ దశ ఏడవ దశ
1 జార్ఖండ్ 14 3 4 4 3
2 మధ్య ప్రదేశ్ 29 6 7 8 8
3 మహారాష్ట్ర 48 7 10 14 17
4 ఒరిస్సా 21 4 5 6 6
5 దశల్లో మొత్తం మొదటి దశ రెండవ దశ మూడవ దశ నాలుగవ దశ ఐదవ దశ ఆరవ దశ ఏడవ దశ
1 జమ్మూ కాశ్మీరు 6 2 2 1[వివరం 1] 1 2
7 దశల్లో మొత్తం మొదటి దశ రెండవ దశ మూడవ దశ నాలుగవ దశ ఐదవ దశ ఆరవ దశ ఏడవ దశ
1 బీహార్ 40 4 5 5 5 5 8 8
2 ఉత్తర్ ప్రదేశ్ 80 8 8 10 13 14 14 13
3 పశ్చిమ బెంగాల్ 42 2 3 5 8 7 8 9


ఇతర ఎన్నికలు

సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్ర ప్రదేశ్, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు, దేశవ్యాప్తంగా 34 శాసనసభల స్థానాలకు ఉప ఎన్నికలూ జరగనున్నాయి.

ఇతర విశేషాలు

ఈ సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని ప్రత్యేకతలున్నాయి. అవి:

  • జమ్మూ కాశ్మీరు లోని అనంతనాగ్ నియోజకవర్గంలో పోలింగు మూడు విడతల్లో - మూడు, నాలుగు, దశల్లో - జరుగుతుంది. ఒకే నియోజకవర్గంలో ఇన్ని విడతల్లో పోలింగు జరగడం ఇదే తొలిసారి.[3] ఈ నియోజకవర్గంలో మూడు దశల్లో పోలింగ్‌ జరగనుందంటే అక్కడ ఎంతటి సమస్యాత్మక పరిస్థితులు నెలకొన్నాయో అర్ధం చేసుకోవచ్చని ప్రధన ఎన్నికల కమిషనరు అన్నాడు.
  • ఉత్తర ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మొత్తం 7 దశల్లోనూ పోలింగు జరుగుతుంది. ఒకే రాష్ట్రంలో ఇన్ని దశల్లో పోలింగు జరగడం ఇదే ప్రథమం.
  • సార్వత్రిక ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ వోటింగు యంత్రంతో పాటు వీవీప్యాట్‌లు కూడా ఉపయోగించడం ఇదే తొలిసారి.
  • వోటింగు యంత్రంపై పార్టీ గుర్తు, అభ్యర్థి పేరుతో పాటు, 2019 ఎన్నికల్లో అభ్యర్థి ఫోటో కూడా ముద్రిస్తారు. ఒకేపేరుతో వేరువేరు పార్టీలనుంచి అభ్యర్థులుంటే ఓటర్లు తికమక పడకుండా ఉండేందుకు వీలుగా ఈ ఏర్పాటు చేసారు.

ఇవీ చూడండి

నోట్స్

  1. జమ్మూ కాశ్మీరు లోని అనంతనాగ్ నియోజకవర్గంలో పోలింగు మూడు విడతల్లో - మూడు, నాలుగు, దశల్లో - జరుగుతుంది. అందుచేత ఈ నియోజక వర్గాన్ని మూడు దశల్లోనూ చూపించాం. అందుచేతనే అన్ని దశల్లోని నియోజకవర్గాల సంఖ్యను కూడితే అసలు కంటే 2 నియోజకవర్గాలు ఎక్కువ వస్తాయి.

మూలాలు

  1. "ఫుల్ షెడ్యూల్ ఆఫ్ 2019 లోక్‌సభ ఎలెక్షన్స్: 7-ఫేస్ పోలింగ్ ఇన్ యుపి, బీహార్". ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్. 10 Mar 2019. Archived from the original on 10 Mar 2019.
  2. "మోగింది భేరి". ఈనాడు. 11 Mar 2019. Archived from the original on 11 Mar 2019. Retrieved 11 Mar 2019.
  3. "ఆ నియోజకవర్గంలో మూడు దశల్లో పోలింగ్‌." సాక్షి. 11 Mar 2019. Archived from the original on 11 Mar 2019.