శివనాగేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎ఇతర లింకులు: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
పంక్తి 40: పంక్తి 40:
[[వర్గం:గుంటూరు జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:గుంటూరు జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:1956 జననాలు]]
[[వర్గం:1956 జననాలు]]
[[వర్గం:గుంటూరు జిల్లా వ్యక్తులు]]

16:13, 20 ఏప్రిల్ 2019 నాటి కూర్పు

శివనాగేశ్వరరావు
జననం
ఉప్పలపాడు, గుంటూరు జిల్లా
విద్యాసంస్థహిందూ కళాశాల, గుంటూరు
వృత్తిదర్శకుడు

శివనాగేశ్వరరావు తెలుగు సినిమా దర్శకుడు. ఆయన తన 23 వ యేట సినీ సినీపరిశ్రమలో అడుగు పెట్టాడు. ఆయన మొదట అసిస్టెంటు డైరక్టరుగా రామ్ గోపాల్ వర్మ వద్ద పనిచేసాడు. ఆయన మొదటి సినిమా మనీ.[1]

జీవిత విశేషాలు

ఆయన గుంటూరు జిల్లాకు చెందిన ఉప్పలపాడు గ్రామంలో జన్మించాడు. ఆయన గుంటూరులోని హిందూ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసాడు. ఆయనకు బాల్యం నుండి చిత్రపరిశ్రమలో చేరాలనే ఆసక్తి ఉండేది. తన 23వ యేట తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చేరుటకు 1979లో చెన్నై వెళ్లాడు. ఆరు నెలల వరకు యిబ్బందులు పడ్డాడు. జీవనాన్ని కొనసాగించుట కొరకు బుర్రిపాలెం బుల్లోడు మరియు సన్నాయి అప్పన్న చిత్రాలలో అనధికారిక జూనియర్ ఆర్టిస్టుగా నటించాడు. వారు మూడు రోజులకు 100 రూపాయలు యిచ్చేవారు. తరువాత ఆయన ఒక కార్యాలయంలో అకౌంటెంట్ గా జాయిన్ అయ్యాడు. ఘట్టమనేని కృష్ణ నటించిన అమ్మాయికి మొగుడు మామయ్యకి యముడు చిత్రానికి దర్శకత్వ విభాగంలో పనిచేయాల్సిందినా త్రిపురనేని చిట్టిబాబు కోరాడు. ఆ చిత్రం పూంపుహార్ బ్యానర్ పై కరుణానిథి నిర్మిస్తున్నది. ఆయన మధుసూదరరావు, లెనిన్‌బాబు, సి.ఎస్.రావు, ఎస్.ఎ.చంద్రశేఖర్ వంటి దర్శకుల వద్ద పనిచేసాడు. క్రాంతికుమార్ వద్ద స్వాతి చిత్రం నుండి ఆరు సంవత్సరాలు పనిచేసాడు.[2]

చిత్రాలు

దర్శకునిగా
నటునిగా
  • నిన్ను కలిసాక (2009)

మూలాలు

ఇతర లింకులు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో శివనాగేశ్వరరావు పేజీ