సి.కృష్ణవేణి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
→‎మూలాలు: AWB వాడి వర్గాల మార్పులు చేసాను
పంక్తి 75: పంక్తి 75:
[[వర్గం:తెలుగు సినిమా నేపథ్యగాయకులు]]
[[వర్గం:తెలుగు సినిమా నేపథ్యగాయకులు]]
[[వర్గం:తెలుగు సినిమా బాలనటులు]]
[[వర్గం:తెలుగు సినిమా బాలనటులు]]
[[వర్గం:మహిళా గాయకులు]]
[[వర్గం:భారతీయ గాయకులు]]
[[వర్గం:భారతీయ గాయకులు]]
[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా సినిమా నటీమణులు]]
[[వర్గం:భారతీయ మహిళా గాయకులు]]
[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా సినిమా నటులు]]
[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా రంగస్థల నటీమణులు]]
[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా మహిళా గాయకులు]]
[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా మహిళా సినిమా నిర్మాతలు]]

03:03, 8 జూన్ 2019 నాటి కూర్పు


ఇదే పేరుగల ఇతర వ్యాసాలకోసం అయోమయ నివృత్తి పేజీ కృష్ణవేణి చూడండి.

మేకా కృష్ణవేణి
గొల్లభామ సినిమాలో కృష్ణవేణి
జననండిసెంబర్ 24, 1924
పంగిడి గూడెం, కృష్ణా జిల్లా,
మద్రాసు రాష్ట్రం
నివాస ప్రాంతంమద్రాసు (చెన్నై), హైదరాబాదు
ఇతర పేర్లుసి.కృష్ణవేణి, మీర్జాపురం రాణి
వృత్తితెలుగు చలనచిత్ర నటి,
గాయని,
నిర్మాత
మతంహిందూ మతం
భార్య / భర్తమీర్జాపురం రాజు మేకా రంగయ్య
పిల్లలుమేకా రాజ్యలక్ష్మి అనూరాధ
తండ్రిడాక్టర్ యర్రంశెట్టి లక్ష్మణరావు[1]
తల్లినాగరాజు

సి.కృష్ణవేణి లేదా ఎం.కృష్ణవేణీ (జ.1924) అలనాటి తెలుగు సినిమా నటీమణి, గాయని మరియు నిర్మాత

జీవిత చరిత్ర

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని రాజమండ్రికి చెందిన కృష్ణవేణి సినిమాలలోకి రాక ముందు రంగస్థల నటిగా పనిచేసింది. 1936లో సతీఅనసూయ /ధృవ చిత్రముతో బాలనటిగా సినీ రంగము ప్రవేశం చేసింది. ఆ తరువాత కథానాయకిగా తెలుగులో 15 చిత్రాలలో నటించింది. కొన్ని తమిళ మరియు కన్నడ భాషా చిత్రాలలో కూడా కథానాయకిగా నటించంది.

వారపత్రిక కవర్ పేజీపై కృష్ణవేణి

కృష్ణవేణి తెలుగు సినిమా నిర్మాత అయిన మీర్జాపురం రాజా (జన్మనామం: మేకా రంగయ్య)ను వివాహమాడి ఆ తరువాత ఈమె కూడా స్వయంగా అనేక సినిమాలు నిర్మంచింది. ఈమె తన సినిమాలలో తెలుగు సాంప్రదాయ విలువలకు అద్దంపట్టి జానపదగీతాలకు పెద్దపీట వేసింది. 1949 తెలుగులో సినిమా చరిత్రలో మైలురాయి అయినటువంటి మన దేశం చిత్రాన్ని నిర్మించి అందులో తెలుగు తెరకు నందమూరి తారక రామారావు ను, యస్వీ రంగారావు ను, మరియు నేపథ్యగాయకునిగా ఘంటసాల వెంకటేశ్వరరావును పరిచయం చేసింది. ఆ తరువాత సినిమాలలో అనేక గాయకులు నటులు మరియు సంగీత దర్శకులను పరిచయం చేసింది. 1957 లో తీసిన దాంపత్యం సినిమాతో మరో ప్రముఖ సంగీత దర్శకుడు రమేష్ నాయుడును తెలుగు సినిమాకు పరిచయం చేసింది.

పురస్కారాలు

కృష్ణవేణి నటించిన సినిమాలు

  1. సతీ అనసూయ -ధ్రువ (1936)
  2. మోహినీ రుక్మాంగద (1937)
  3. కచ దేవయాని (1938)
  4. మళ్ళీ పెళ్ళి (1939)
  5. మహానంద (1939)
  6. జీవనజ్యోతి (1940)
  7. దక్షయజ్ఞం (1941)
  8. భీష్మ (1944)
  9. బ్రహ్మరథం (1947)
  10. మదాలస (1948)
  11. మన దేశం (1949)
  12. గొల్లభామ
  13. లక్ష్మమ్మ (1950)

నిర్మాతగా కృష్ణవేణి

కృష్ణవేణి నిర్వహించిన నిర్మాణ సంస్థలు

  • భర్త స్థాపించిన సంస్థ - జయా పిక్చర్స్ ఆ తరువాతి కాలంలో దీన్ని శోభనాచల స్టూడియోస్ గా నామకరణం చేశారు.
  • సొంత సంస్థ - తన కుమార్తె మేక రాజ్యలక్షీ అనురాధ పేరు మీదుగా ఎం.ఆర్.ఏ.ప్రొడక్షన్స్

కృష్ణవేణి నిర్మించిన సినిమాలు

గమనిక: ఈ జాబితా అసంపూర్ణమైనది

బయటి లింకులు

మూలాలు