ఉన్ని కృష్ణన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
+ కొన్ని కుటుంబ విశేషాలు
చి వర్గం:భారతీయ గాయకులు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 56: పంక్తి 56:
[[వర్గం:తెలుగు సినిమా నేపథ్యగాయకులు]]
[[వర్గం:తెలుగు సినిమా నేపథ్యగాయకులు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
[[వర్గం:భారతీయ గాయకులు]]
[[వర్గం:భారతీయ పురుష గాయకులు]]
[[వర్గం:భారతీయ పురుష గాయకులు]]

04:10, 11 జూన్ 2019 నాటి కూర్పు

పి. ఉన్ని కృష్ణన్
ఉన్ని కృష్ణన్
జననంపి. ఉన్ని కృష్ణన్
(1966-07-09) 1966 జూలై 9 (వయసు 57)

పాలక్కాడ్, కేరళ, భారతదేశం
నివాస ప్రాంతంచెన్నై, తమిళనాడు
ఇతర పేర్లుఉన్ని కృష్ణన్
వృత్తినేపధ్య గాయకుడు
శాస్త్రీయ సంగీత గాయకుడు
మరియు సంగీత పోటీల న్యాయ నిర్ణేత
వెబ్‌సైటు
http://www.unnikrishnan.com/

ఉన్ని కృష్ణన్ (జననం: జూలై 9, 1966) ప్రముఖ శాస్త్రీయ సంగీత మరియు సినీ గాయకుడు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ మరియు ఆంగ్ల భాషలలో పాటలు పాడాడు. సినీ రంగంలో తన తొలి పాట ఎన్నావలె అది ఎన్నావలెకి గాను జాతీయ ఉత్తమ గాయకుడు పురస్కారాన్ని అందుకొన్న ప్రతిభాశాలి. ఇతడు సినీ గీతాలకన్నా శాస్త్రీయ సంగీత గీతాలాపనకు ప్రాముఖ్యత నిస్తాడు.

జీవిత విశేషాలు

ఉన్నికృష్ణన్ కె.రాధాకృష్ణన్, డాక్టర్ హరిణి దంపతులకు కేరళలోని పాలక్కాడ్ లో జన్మించాడు.[1] వారు నివాసం పేరు కేసరి కుటీరం. అది మద్రాసు నగరంలో పేరెన్నిక గన్నది. అతని ముత్తాత కె. ఎన్. కేసరి పేరుగాంచిన ఆయుర్వేద వైద్యుడు. తెలుగు మహిళల కోసం గృహలక్ష్మి అనే పత్రికను ప్రోత్సహించాడు. 1983 లో చెన్నైలోని ఆసాన్ మెమోరియల్ సీనియర్ సెకండరీ స్కూల్లో చదివాడు. రామకృష్ణ మిషన్ వివేకానంద కళాశాలలో చదివాడు. మద్రాసు విశ్యవిద్యాలయం నుంచి బీకాం పూర్తి చేశాడు. ప్యారీస్ కన్ఫెక్షనరీ లిమిటెడ్ అనే సంస్థలో 1987 నుంచి 1994 దాకా అధికారిగా పనిచేశాడు. తరువాత ఉద్యోగం వదిలి పెట్టి పూర్తి స్థాయి గాయకుడిగా మారాడు.

ఉన్నికృష్ణన్ భార్య ప్రసిద్ధ భరతనాట్య కళాకారిణి ప్రియ. వారికి ఒక కుమారుడు ఒక కుమార్తె. వీరి కుమార్తె ఉత్తర కూడా గాయనిగా రాణిస్తోంది. ఆమె పాడిన నేపథ్య గీతానికి జాతీయ పురస్కారం అందుకుంది.

జనాదరణ పొందిన పాటలు

తెలుగు

బయటి లింకులు

  1. "Unnikrishnan:Profile And Biography". Metromatinee.com. 1966-07-09. Retrieved 2011-11-07.