దొడ్డి కొమరయ్య: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎మూలాలు: AWB తో వర్గం మార్పు
పంక్తి 43: పంక్తి 43:
[[వర్గం:1927 జననాలు]]
[[వర్గం:1927 జననాలు]]
[[వర్గం:1946 మరణాలు]]
[[వర్గం:1946 మరణాలు]]
[[వర్గం:తెలంగాణ విమోచనోద్యమంలో పాల్గొన్న వ్యక్తులు]]
[[వర్గం:తెలంగాణ విమోచనోద్యమంలో పాల్గొన్న జనగామ జిల్లా వ్యక్తులు]]
[[వర్గం:తెలంగాణ సాయుధ పోరాట యోధులు]]
[[వర్గం:తెలంగాణ సాయుధ పోరాట యోధులు]]
[[వర్గం:తెలంగాణా విముక్తి పోరాట యోధులు]]
[[వర్గం:తెలంగాణా విముక్తి పోరాట యోధులు]]

15:36, 15 జూలై 2019 నాటి కూర్పు

దొడ్డి కొమరయ్య
తెలంగాణ
దస్త్రం:Doddi Komuraiah.jpg
చిత్రపటం.
జననం1927
మరణంజులై 4, 1946
జాతీయతభారతీయుడు
వృత్తిగొర్రెల కాపరి/Kuruma
రాజకీయ పార్టీకమ్యూనిస్టు
పురస్కారాలుతెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు, తొలి అమరుడు

దొడ్డి కొమరయ్య (1927 - జులై 4, 1946) తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు, తొలి అమరుడు.[1]

హైదరాబాద్ సంస్థానాధీశుడు ఏడవ నిజాం నవాబు ఉస్మాన్ ఆలీ ఖాన్ నుంచి విముక్తి కోసం సంస్థాన ప్రజలు 1946 నుంచి 1948 మధ్య వీరోచిత పోరాటం చేశారు. దీన్నే తెలంగాణ విమోచనోద్యమంగా పిలుస్తారు. తెలంగాణ సాయుధ పోరాటం చరిత్ర వినగానే మొదటగా గుర్తొచ్చేది తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు తొలి అమరుడు దొడ్డి కొమరయ్య . 1927లో వరంగల్లు జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో సాధారణ గొర్రెల పెంపకందార్ల కుటుంబములో జన్మించాడు.ఇతని అన్న దొడ్డి మల్లయ్య కమ్యూనిస్టు పార్టీ గ్రామ నాయకుడు.

నిజాం నిరంకుశత్వం

విసునూర్‌ దేశ్‌ముఖ్‌ రామచంద్రా రెడ్డి తల్లి జానకమ్మా దొరసాని. ఆమె కడికవెండిలో వుండేది. ఈమె ప్రజల పట్ల అతి క్రూరంగా వ్యవహరించేది. మనషులను వెట్టిచాకిరి చేయించడంలో వడ్డీలు వసూలు చేయడంలో రకరకాల శిక్షలు, జరిమానాలు విధించడంలో పేరుగాంచింది.

వెట్టి చాకిరికి దొపిడికి వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాట సేనాని ఆరుట్ల రాంచంద్రారెడ్డి, కడివెండి వెళ్లి ఆంధ్ర మహా సభ సందేశాన్ని ప్ర్ర్రజలకు వినిపించాడు. దీంతో గ్రామంలో సంఘమేర్పడింది. ఉత్సాహంగా యువతీ యువకులు ముందుకొచ్చారు. దిన దినంగా కడివెండిలో సంఘం బలంగా అయింది. వెట్టచాకిరిని నిర్మూలించారు. దొరలు, విసునూర్‌ ల ఆటలను అరికట్టించారు.

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిననూ నిజాం సంస్థానంలోని ప్రజలకు మాత్రం స్వాతంత్ర్యం లేకపోవడాన్ని ఇక్కడి ప్రజలు జీర్ణించుకోలేక పోయారు. దేశమంతటా స్వాతంత్ర్యోత్సవాలతో ప్రజలు ఆనందంతో గడుపుచుండగా నిజాం సంస్థాన ప్రజలు మాత్రం నిరంకుశ బానిసత్వంలో కూరుకుపోయారు.

1946 జులై 2 న విసునూర్‌ నైజాం అల్లరి మూకలు రౌడీలతో 40 మంది వాచ్చారు. ప్రజలంతా ఏకమై కర్రలు, బడిశెలు, గునపాలు అందుకుని విసునూర్‌, నిజాం, రజాకర్లను తరిమికొట్టారు. నైజాం అల్లరి మూకలు, విసునూర్‌ తుపాకి తూటాలకు నేలరాలిన అరుణతార, తెలంగాణ విప్లవంలో చెరగని ముద్రవేసుకున్నాడు దొడ్డి కొమురయ్య. మరణ వార్త జనగాం ప్రాంత ఆంధ్రమహాసభ కార్యకర్తలందరకీ విషాదకరమైన వార్తయింది. దేశ్‌ముఖ్‌, విసు నూర్‌ ఆగడాలన ఎదుర్కోవవడానికి పాలకుర్తి ప్రాంతం నుంచి యాదగిరిరావు, నిర్మల్‌ కృష్ణమూర్తి, నాయకత్వంలో ఆరు వేల మంది ప్రజాసైన్యం దొడ్డి కొమరయ్య మృతదేహానికి పోస్టుమార్టం జరిగింది. వేలాది మంది జనం నాయకత్వంలో అంతిమ యాత్ర జరిగింది.[2]

మూలాలు

  1. నవతెలంగాణ. "విప్లవోద్యమ జ్వాల దొడ్డి కొమరయ్య". Retrieved 4 July 2017.
  2. తెలంగాణ ఎక్స్ ప్రెస్. "తెలంగాణ తోలి అమరుడు దొడ్డి కొమురయ్య వర్థంతి నేడు". www.telanganaexpressnews.com. Retrieved 4 July 2017.