కృతి సనన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:హిందీ సినిమా నటీమణులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37: పంక్తి 37:
|-
|-
| 2014 || ''అల్లు అర్జున్ - త్రివిక్రం శ్రీనివాస్ చిత్రం'' || || తెలుగు ||
| 2014 || ''అల్లు అర్జున్ - త్రివిక్రం శ్రీనివాస్ చిత్రం'' || || తెలుగు ||
|-
| 2015 || ''[[దోచేయ్ (2015 సినిమా)|దోచేయ్]]'' || మీరా || తెలుగు ||
|}
|}



18:53, 3 ఆగస్టు 2019 నాటి కూర్పు

కృతి సనన్
Sanon at the launch of the song Whistle Baja, from Heropanti (2014)
జననం
కృతి సనన్

జులై 27, 1990
ఢిల్లీ, భారతదేశం
వృత్తినటి,
మోడల్
క్రియాశీల సంవత్సరాలు2010–ఇప్పటివరకూ


కృతి సనన్ (జ:జులై 27, 1990) ఒక భారతీయ నటి మరియూ మోడల్. ఎన్నో పెద్ద కంపెనీల కమర్షియల్సులో నటించిన కృతి తెలుగులో మహేష్ బాబు సరసన 1 - నేనొక్కడినే సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది. అటు హిందీలో జాకీ ష్రోఫ్ కొడుకు టైగర్ ష్రోఫ్ సరసన హీరోపంతి సినిమాతో తెరంగేట్రం చేస్తోంది.

సినీ జీవితం

హిందీలో ఎన్నో కమర్షియల్సులో నటించిన కృతి సనన్ మహేష్ బాబు నటించిన 1 - నేనొక్కడినే సినిమాతో తెలుగు సినీపరిశ్రమలోకి అడుగుపెట్టింది. తొలుత ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో కథానాయికగా ఎన్నుకోబడ్డా డేట్స్ ఖాళీ లేక, ఉన్నవి సద్దుబాటు చెయ్యలేకపోయింది.[1] ఈ సినిమాలో నటించడానికి మొగ్గుచూపినా ఎలాంటి గొడవ లేకుండా సినిమా నుంచి తప్పుకుంది. ఆ సమయంలో దర్శకుడు సుకుమార్ ఈమెని కథానాయికగా ఎంచుకున్నారు.[2] ఈ సినిమాలో కృతి ఒక జర్నలిస్ట్ పాత్రను పోషించింది. సంక్రాంతి కానుకగా 2014లో విడుదలైన ఈ సినిమా విమర్శకుల నుంచి మిశ్రమ స్పందనను రాబట్టినా కృతి మాత్రం సానుకూల స్పందనను రాబట్టగలిగింది. సాక్షి దినపత్రిక తమ సమీక్షలో "కృతి సనన్ జర్నలిస్ట్‌గా, గౌతమ్ ప్రేయసి సమీరగా పర్వాలేదనిపించింది. ఈ చిత్రంలో కొంత ప్రాధాన్యం ఉన్న పాత్ర కృతి సనన్‌కు దక్కింది. కొత్త నటి అనే ఫీలింగ్‌ను కలిగించకుండా కృతి బాగానే జాగ్రత్త పడింది" అని వ్యాఖ్యానించారు.[3]

ఆపై హిందీలో జాకీ ష్రోఫ్ కొడుకు టైగర్ ష్రోఫ్ తొలి చిత్రమైన హీరోపంతి సినిమా ద్వారా హిందీలో కథానాయికగా అడుగుపెట్టింది. ఈ సినిమా జాకీ ష్రోఫ్ నటించిన హీరో సినిమా రీమేక్ అయినప్పటికీ అల్లు అర్జున్ నటించిన పరుగు సినిమా ఛాయలు కూడా ఇందులో కనపడటం ఆశ్చర్యం ఎందరికో కలిగించింది.[4][5] ఆ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుంటోంది. ఇంతలోనే అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రం దర్శకత్వం వహిస్తున్న సినిమాలో సమంతతో పాటు నటిస్తున్న మరో ఇద్దరు కథానాయికల్లో ఒకరిగా కృతి ఎన్నుకోబడింది.[6]

నటించిన చిత్రాలు

సంవత్సరం సినిమా పాత్ర భాష ఇతర విశేషాలు
2014 1 - నేనొక్కడినే సమీర తెలుగు
2014 హీరోపంతి డింపి హిందీ
2014 అల్లు అర్జున్ - త్రివిక్రం శ్రీనివాస్ చిత్రం తెలుగు
2015 దోచేయ్ మీరా తెలుగు

మూలాలు

  1. "మహేష్ సినిమా నుంచి కాజల్ అవుట్ ?". వన్ఇండియా. September 23, 2012. Retrieved April 21, 2014.
  2. "మహేష్ బాబు హీరోయిన్ ఆ అమ్మాయే". 123తెలుగు.కామ్. January 13, 2013. Retrieved April 21, 2014.
  3. "సినిమా రివ్యూ: '1' నేనొక్కడినే". సాక్షి. January 12, 2014. Retrieved April 21, 2014.
  4. "'టైగర్' తో నటించే ఛాన్స్ కొట్టిన 'వన్' భామ..!". 10టీవీ.ఇన్. April 7, 2014. Retrieved April 21, 2014.
  5. "అల్లు అర్జున్ 'పరుగు' టైగర్ చేస్తున్నాడా?". ఫిల్మీబజ్. April 6, 2014. Retrieved April 21, 2014.
  6. "మహేష్ '1' హీరోయిన్ పెద్ద ఆఫరే పట్టింది". వన్ఇండియా. April 13, 2014. Retrieved April 21, 2014.

ఇతర లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=కృతి_సనన్&oldid=2702693" నుండి వెలికితీశారు