పంచారామాలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 157.48.209.239 (చర్చ) చేసిన మార్పులను 223.182.20.233 చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 31: పంక్తి 31:
</blockquote>
</blockquote>
ఇవన్నీ దేవతలు ప్రతిష్ఠించినవేనని స్థలపురాణం చెపుతొంది.
ఇవన్నీ దేవతలు ప్రతిష్ఠించినవేనని స్థలపురాణం చెపుతొంది.

==[[అమరారామము]]==
[[బొమ్మ:Amaraavati.jpg||thumb|75px|right]]

గుంటూరు జిల్లాలో గుంటూరుకు 35 కి.మీ. దూరంలో [[అమరావతి]] క్షేత్రం jsusaisrkssఉంది. ఇచ్చidkaiidkksduksuff

టJjfksdlటJfkటKfsటJjsటNsnsటNsnటNdmaటNdటJdnటHsటHfmsటHave to go to the store and get some rest and feel better soon and that is why I am asking for a nice dinner and a movie and



==[[ద్రాక్షారామం|దక్షారామము]]==
==[[ద్రాక్షారామం|దక్షారామము]]==

04:49, 11 ఆగస్టు 2019 నాటి కూర్పు


పంచారామములు
పంచారామాల దర్శనం టూర్ ప్యాకేజీ - నూజివీడు బస్ స్టాండులో ప్రకటన

ఆంధ్ర దేశములో 5 శివక్షేత్రాలు పంచారామాలుగా ప్రసిద్ధము. సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుని సంహరించినపుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగము ముక్కలై 5 ప్రదేశములలో పడినదని, ఆ 5 క్షేత్రములే పంచారామములని కథనము.

పంచారామాల పుట్టుక

శ్రీనాధుడు (క్రీ||శ|| 14 నుండి 15వ శతాబ్డము) రచించిన బీమేశ్వర పురాణములో ఈ పంచారామముల ఉత్పత్తిని గురించి ఒక కథ ఇలా ఉంది. క్షీరసాగర మథనంలో వెలువడిన అమృతాన్ని మహావిష్ణువు మోహినీ రూపము ధరించి సురాసురులకు పంచుచుండగా, పంపకంలో అన్యాయం జరిగిందని అసంతృప్తి చెందిన రాక్షసులు త్రిపురనుల, నాధుల నేత్రత్వములో తీవ్రమైన జపతపములను ఆచరించగా శివుడు మెచ్చి, వారికి వరములిచ్చాడు. కొత్తగాసంపాదించిన శక్తితో రాక్షసులు దేవతలను అనేక బాధలకు గురిచేయడంతో వారు మహదేవుని శరణువేడుకున్నారు. దేవతల మోర ఆలకించిన శివుడు దేవతల మీద జాలిపడి తన పాశుపతంతో రాక్షసులనూ వారి రాజ్యాన్ని కూడా బూడిద గావించాడు. శివుని ఈ రుద్రరూపమే త్రిపురాంతకుడుగా ప్రసిధ్దికెక్కినది. ఈ దేవాసుర యుద్ధంలో త్రిపురాసురులు పూజ చెసిన ఒక పెద్ద లింగము మాత్రము చెక్కుచెదరలేదు. దీనినే మహదేవుడు ఐదు ముక్కలుగా ఛెదించి ఐదు వేరు వేరు ప్రదేసములందు ప్రతిష్ఠించుటకు గాను పంచిపెట్టడం జరిగింది. లింగ ప్రతిష్ఠ చెసిన ఈ ఐదు ప్రదేశములే పంచారమములుగా ప్రసిద్ధికెక్కినవి.

స్కాంద పురాణంలోని తారాకాసుర వధా ఘట్టం ఈ పంచారామాల పుట్టుక గురించి మరొకలా తెలియజేస్తొంది.

హిరణ్యకశ్యపుని కుమారుడు నీముచి. నీముచి కొడుకు తారకాసురుడనే రాక్షసుడు. అతడు పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సు చెసి ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. అంతే కాకుండా ఒక అర్భకుడి (బాలుడి) చెతిలో తప్ప ఇతరులెవ్వరి వల్లా తనకు మరణం లెకుందా ఉండేలా వరం పొందుతాడు. బాలకులు తననేం చేయగలరని ఆ దానవుడి ధీమా! సహజంగానే వరగర్వితుడైన ఆ రాక్షసుడు దేవతల్ని బాధించడమూ, వారతనిని గెలవలేకపొవటము జరిగిన పరిస్థితిలో అమిత పరాక్రమశీలీ, పరమేశ్వర రక్షితుడూ అయిన తారకుడిని సామాన్య బాలకులేవ్వరూ గెలవడం అసాధ్యని గుర్తించి దేవతలు పార్వతీ పరమేశరుల్ని తమకొక అపూర్వ శక్తిమంతుడైన బాలుడ్ని ప్రసాదించమని ప్రార్ధిస్తారు. దేవతల కోరిక నెరవేరింది. శివ బాలుడు - కుమారస్వామి ఉదయించాడు. ఆయన దేవతలకు సేనానిగా నిలిచి తారకాసురుని సంహరించాడు.

శివాత్మజో యదా దేవాః భవిష్యతి మహాద్యుతిః
యుధ్ధే పునస్తారకంచ వధిష్యతి మహబలః
‍         ‍          ‍         ‍          ‍         ‍          - స్కాందము

తారకాసురుడు నేల కూలడంతో అతనియందున్న ఆత్మలింగం ఐదు ముక్కలైంది. దేవతలు ఆ ఐదింటిని ఐదు చొట్ల ప్రతిష్ఠించారు. అవే పంచారామ క్షేత్రాలు.

దక్షారామము (ద్రాక్షారామము, తూ||గో|| జిల్లా) - భీమేశ్వరుడు
కుమారారామము (సామర్లకోట, తూ||గో|| జిల్లా) - భీమేశ్వరుడు
క్షీరారామము (పాలకోల్లు, ప||గో|| జిల్లా) - రామలింగేశ్వరుడు
భీమారామము (భీమవరం, ప||గో|| జిల్లా) - సోమేశ్వరుడు
అమరారామము (అమరావతి, గుంటూరు జి||) - అమరేశ్వరుడు

ఇవన్నీ దేవతలు ప్రతిష్ఠించినవేనని స్థలపురాణం చెపుతొంది.

అమరారామము

గుంటూరు జిల్లాలో గుంటూరుకు 35 కి.మీ. దూరంలో అమరావతి క్షేత్రం jsusaisrkssఉంది. ఇచ్చidkaiidkksduksuff

టJjfksdlటJfkటKfsటJjsటNsnsటNsnటNdmaటNdటJdnటHsటHfmsటHave to go to the store and get some rest and feel better soon and that is why I am asking for a nice dinner and a movie and

దక్షారామము

తూర్పుగోదావరి జిల్లాలో, కాకినాడకు ముఫ్పై కిలోమీటర్ల దూరంలో దక్షారామ క్షేత్రం ఉంది.
ఇచ్చట స్వామివారు భీమేశ్వరుడు, అమ్మ వారు మాణిక్యాంబ..క్షేత్రపాలకులు లక్ష్మీనారాయణులు
శివాలయంతో పాటు విష్ణ్వాలయం, శక్తి పీఠం ఉన్న దివ్య క్షేత్రం దక్షారామము. దక్షప్రజాపతి ఇచ్చట యజ్ఞం చేసాడని ప్రసిధ్ది . తారకుని సంహారానంతరం శివలింగ భాగం ఇక్కడ పడి ఉందని తెలుసుకున్న సప్తర్షులు సప్తగోదావరి తీర్థంలో సుప్రభాత సమయంలో భీమేశ్వరునికి అభిషేకం చేయాలకున్నారు. మార్గమధ్యమంలో తుల్యఋషి యజ్ఞం చేస్తున్నాడు. ఋుషులు తెస్తున్న గోదావరులు తన యజ్ఞాన్ని ముంచేస్తాయని ఋుషులను గోదావరులను వారించాడు. వాదోపవాదాల మధ్య తెల్లవారిపోయింది. సూర్యభగవానుడు శివలింగానికి ప్రథమ సుప్రభాత అభిషేకం చేశాడు. నిరాశ చెందిన ఋుషులను వేదవ్యాసుడు ఓదార్చి తాను సప్తగోదావరులను పుష్కరిణితో చేర్చానాని అది సప్తగోదావరిగా పిలువబడుతుందని, ఈ తీర్థంలోనే స్వామికి నిత్యాభిషేకం జరుగుతుందని చెప్పాడు.
నాలుగు ప్రవేశ ద్వారాలతో ఆలయ బాహ్యప్రాకారం ఎత్తైన రాజగోపురాలతో నిర్మితమైంది. బాహ్యప్రాకారంలో కాలభైరవాలయం, త్రికూటాలయం ఉన్నాయి. ధ్వజ స్ధంభం ముందు రావి వేప వృక్షాలు ఉన్నాయి. ఆ చెట్లనీడలో శివలింగం, విష్ణు విగ్రహం ఉన్నాయి. రెంటినీ శంకరనారాయణ స్వాములని పిలుస్తారు.
భీమేశ్వర లింగం 2.5 మీటర్ల ఎత్తులో నలుపు తెలుపు రంగులో ఉంటుంది. ఆలయం రెండో అంతస్తులో ఉందు. అభిషేకాదులు పై అంతస్తులో లింగ భాగానికి చేస్తారు.
ఈ ఆలయం తూర్పు చాళుక్యుల కాలంలో క్రీ.శ. 892-922 మధ్య నిర్మితమైంది. ఆలయ స్తంభాలపై, గోడలపై 800 పైగా శాసనాలు ఉన్నాయి.

సోమారామము

పశ్చిమ గోదావరి భీమవరం (గునిపూడి) లో ఈ క్షేత్రం ఉంది. ఇచ్చట స్వామివారు సోమేశ్వరుడు (కోటీశ్వరుడు) అమ్మ వారు రాజరాజేశ్వరి. ఈ దేవాలయాన్ని సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం అంటారు. తూర్పు చాళుక్య రాజైన చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని మూడో శతాబ్దంలో నిర్మించాడు. మామూలు రోజుల్లో తెలుపు నలుపు రంగులో ఉండే శివలింగం అమావస్య రోజున గోధుము వర్ణంలో మారుతుంది. తిరిగి పౌర్ణమి నాటికి యధారూపంలోకి వచ్చేస్తుంది. అందుకే దీనికి సోమారామం అనే పేరు వచ్చింది. ఈ ఆలయం రెండు అంతస్తులుగా ఉంటుంది. సోమేశ్వరుడు కింది అంతస్తులోను అన్నపూర్ణా దేవి అమ్మవాు పెఅంతస్తులోనూ ఉంటారు. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు జనార్దన స్వామి.

కుమారభీమారామము

తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట సమీపంలో ఈ క్షేత్రం ఉంది. ఇచ్చట స్వామివారు భీమేశ్వరుడు తల్లి బాలా త్రిపుర సుందరి.

ఈ క్షేత్రం ప్రశాంతంగా చుట్టూ పచ్చని పంటచేలతో ఉంటుంది. ఇక్కడ లింగం కూడా 60 అడుగుల ఎత్తున రెండస్తుల మండపంగా ఉంటుంది. సామర్లకోటలోని భీమేశ్వరాలయాన్ని చాళుక్య రాజయిన భీముడు నిర్మించాడని క్షేత్ర కథనంలో వివరించబడింది. ఈయనే దక్షరామ దేవాలయాన్నీ నిర్మించింది. అందుకె ఈ రెండు గుళ్ళు ఒకే రీతిగా వుండటమేగాక, రెంటి నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడా ఒకటేరకంగా మరియు నిర్మాణ శైలికూడా ఒకే విధంగా వుంటుంది. ఈ మందిరం నిర్మాణం 892లో ప్రారంభమై సుమారు 922 వరకు సాగింది.

కుమరారామ శ్రీ భీమేశ్వరస్వామి వేంచెసి ఉన్న భీమవరం గ్రామం తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణంలో ఒక భాగం (అక్షాంశము 17 02' ఉ, రేఖాంశము 82 12' తూ). ఇది పూర్వం ఛాళుక్య భీమవరంగా ప్రసిధ్ధి చెందినట్టు భీమేస్వరాలయంలోని శిలాశాసనాలనుబట్టి తెలుస్తోంది.

క్షీరారామము

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో ఈ క్షేత్రం ఉంది. ఇచ్చట స్వామి వారు రామలింగేశ్వర స్వామి, అమ్మ వారు పార్వతి. ఈ క్షేత్రంలో లింగాన్ని త్రేతా యుగంలో శ్రీరాముడు ప్రతిష్ఠించాడని ప్రతీతి. ఈ ఆలయ క్షేత్రపాలకుడు జనార్ధుడు. ఆలయ విశేషం తొమ్మిది అంతస్తులతో20 అడుగుల ఎత్తులో విరాజిల్లే రాజగోపురం. చివర అంతస్తు దాకా వెళ్లడానికి లోనికి మెట్లు ఉన్నాయి. తెల్లగా ఉండే ఇక్కడి శివలింగగం రెండున్నర అడుగుల ఎత్తు ఉంటుంది. ఏటా ఉత్తరాయణ దక్షిణాయన ప్రారంభంలో సూర్యోదయ సమయంలో కిరణాలు పెద్దగోపురం నుండి శివలింగంపే పడతాయి.

రవాణా సదుపాయం

1. అమరారామము, 2. దక్షారామము, 3. సోమారామము (భీమవరము), 4. కుమారారామము లేదా భీమారామము (సామర్లకోట), 5. క్షీరారామము (పాలకొల్లు) అనునవి పంచారామములు

తెలంగాణా రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ వారు పంచారామాలను బస్సులో ఒక్కరోజులో దర్శించే యాత్రా సౌకర్యాన్ని కలిగిస్తున్నారు. సుమారు 700 కి.మీ. సాగే ఈ యాత్ర ప్రతిరోజు రాత్రి 8.00 గంటలకు మొదలై మళ్ళీ మరునాడు రాత్రి 8.00 గంటలకు ముగుస్తుంది. ప్రస్తుతం ఈ యాత్ర టిక్కెట్టు 611 రూపాయలు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ వారు పంచారామాలను బస్సులో ఒక్కరోజులో దర్శించే యాత్రా సౌకర్యాన్ని కలిగిస్తున్నారు. సుమారు 700 కి.మీ. సాగే ఈ యాత్ర ప్రతిరోజు రాత్రి 8.00 గంటలకు మొదలై మళ్ళీ మరునాడు రాత్రి 8.00 గంటలకు ముగుస్తుంది. ప్రస్తుతం ఈ యాత్ర టిక్కెట్టు 727 రూపాయలు.


ఆధారాలు

ఈనాడు ఆదివారం అనుబంధం తేది 19.2.2012 లో వ్యాసం