కమల్ హాసన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
বিসাল খান (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2715720 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
పంక్తి 3: పంక్తి 3:
| residence =చెన్నై, తమిళనాడు
| residence =చెన్నై, తమిళనాడు
| other_names =[[కమల్]]
| other_names =[[కమల్]]
| image =Backtowel.jpg
| image =Kamal_Haasan_FICCI_event.jpg
| imagesize = 200px
| imagesize = 200px
| caption =
| caption =

10:38, 28 ఆగస్టు 2019 నాటి కూర్పు

కమల్ హాసన్
జననంకమల్ హాసన్
(1954-11-07) 1954 నవంబరు 7 (వయసు 69)
పరమక్కుడి, తమిళనాడు,భారతదేశం
నివాస ప్రాంతంచెన్నై, తమిళనాడు
ఇతర పేర్లుకమల్
వృత్తిసినిమా నటుడు
దర్శకుడు
నిర్మాత
గాయకుడు
నృత్య దర్శకుడు
కథారచయిత &
మాటల రచయిత
రాజకీయ పార్టీనిష్పక్షపాతి
మతంనాస్తికుడు
భార్య / భర్తవాణీ గణపతి(మాజీ భార్య)
సారిక(మాజీ భార్య)[1]
పిల్లలుశ్రుతి హాసన్,అక్షర(సారిక కూతుళ్ళు)
తండ్రిశ్రీనివాసన్
తల్లిరాజ్య లక్ష్మి
వెబ్‌సైటు
http://www.universalherokamal.com

కమల్ హాసన్ (తమిళం : கமல்ஹாசன்) ( నవంబర్ 7, 1954లో తమిళనాడు రాష్ట్రం రామనాథ పురం జిల్లాలోని పరమక్కుడి లో పుట్టాడు) భారతదేశపు ప్రముఖ నటుడు. బహుముఖ ప్రజ్ఞగల ఈ నటుడు ప్రధానంగా దక్షిణ భారత చిత్రాలలో, అందునా ఎక్కువగా తమిళ చిత్రాలలో నటించినప్పటికీ భారత దేశ మంతటా సుపరిచితుడు. బాలనటుడిగా తాను నటించిన మొట్టమొదటి చిత్రానికే జాతీయ పురస్కారం అందుకున్న కమల్ తరువాత జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని మూడు సార్లు గెలుచుకున్నాడు.

బాల్య జీవితం

కమల్, శ్రీనివాసన్, రాజ్య లక్ష్మి దంపతులకు నాలుగో సంతానం మరియు ఆఖరి వాడు. కొడుకులందరికి చివరి పదం "హాసన్" అని వచ్చేలా పేరు పెట్టారు ఈ దంపతులు. ఇది హాసన్ అనబడే ఒక మిత్రుడితో తమకి ఉన్న అనుబంధానికి గుర్తు. కమల్ 3 1/2 యేళ్ళ పసి వయసులోనే చిత్ర రంగంలోకి ప్రవేశించారు. ఆయన మొదటి చిత్రం "కలత్తూర్ కన్నమ్మ". బాల్యంలోనే ఆయన శాస్త్రీయ కళలను అభ్యసించారు. నూనుగు మీసాల వయసులో సినిమాలలో నృత్య దర్శకుడిగా పనిచేసారు. అదే సమయంలో ప్రసిద్ధ తమిళ సినీ దర్శకుడు కె.బాలచందర్తో ఆయనకు ఏర్పడిన అనుబంధం తరువాత సుదీర్ఘ గురు-శిష్య సంబంధంగా మారింది. కమల్ నేపథ్య గాయకుడిగా కూడా శిక్షణ పొందాడు. ఇటీవలి కొన్ని చిత్రాలలో పాటల రచయితగా కూడా పనిచేసారు. భరత నాట్యం ప్రదర్శించటంలో ఆయనకి ఆయనే సాటి. తమిళ చిత్ర రంగంలో తిరుగులేని నటుడిగా ఎదిగాడు.

60 వ దశకం

కమల్ తన సినీ జీవితాన్ని కలత్తూర్ కన్నమ్మ అనే చిత్రంలో బాల నటుడిగా ఆరంభించాడు. ఇది ఆయనకి ఉత్తమ బాల నటుడిగా అవార్డ్ తెచ్చిపెట్టిన మొదటి చిత్రం. ఆ తర్వాత కూడా ఎం.జి.రామచంద్రన్,శివాజీ గణేషన్,నాగేష్,జెమినీ గణేష్ వంటి వారు నిర్మించిన చిత్రాలలో బాల నటుడుగా నటించాడు.

70 వ దశకం

70 వ దశాబ్ధంలో కమల్ పూర్తి స్థాయిలో సినిమాల్లో నటించారు. తమిళ చిత్రాలలోనే కాక ఆ నాటి ప్రసిద్ధ మళయాళ దర్శకులు నిర్మించిన మళయాళ చిత్రాలలో కూడా నటించారు. పూర్తి స్థాయి కథా నాయకుడిగా "అవర్‌గళ్", "అవళ్ ఓరు తొడరర్‌కదై", "సొల్ల తాన్ నినైక్కిరేన్", "మాణవన్", "కుమార విజయం" లాంటి చిత్రాలలో నటించినప్పటికీ శ్రీదేవి తో ఆయన నటించిన 16 వయదినిలె (తెలుగులో పదహారేళ్ళ వయసు) చిత్రం 23 ఏళ్ళ వయసులో యువ కథానాయకుడిగా మంచి పేరు తెచ్చింది. కమల్ హాసన్, శ్రీదేవి తెర మీద ప్రసిద్ధ జంటగా మారి సుమారు 23 చిత్రాలు కలిసి నటించారు. 16 వయదినిలె చిత్రం తర్వాత దర్శకుడు కె.బాలచందర్ నిర్మించిన మరో చరిత్ర అనే తెలుగు చిత్రంలో నటించారు.

1970 లో విభిన్న పాత్రలను పోషించారు.

  • వెంట్రిలోక్విస్ట్గా అవర్ గళ్ చిత్రంలో (తెలుగులో ఇది కథ కాదు)
  • అమాయకమైన పళ్ళెటూరి వాడిగా 16 వయతినిలె చిత్రంలో (తెలుగులో చంద్రమొహన్ కథానాయకుడుగా పదహారేళ్ళ వయసు)
  • డిస్కో జాకిగా ఇళమై ఊన్జలాడుగిరదు చిత్రంలో
  • వరుస హత్యల స్త్రీ హంతకుడిగా ఉన్మాది పాత్రలో సిగప్పు రోజక్కళ్ చిత్రంలో (తెలుగులో ఎర్రగులాబీలు)
  • ఎత్తు పళ్ళ పళ్ళెటూరి వాడిగాకళ్యాణరామన్ చిత్రంలో (తెలుగులో కల్యాణరాముడు)
  • అలాద్దిన్ గా అలావుద్దీనమ్ అర్పుధ విలక్కుమ్ చిత్రంలో

80వ దశకం

దర్శకుడిగా ఆయన చేపట్టిన మొదటి చిత్రం "శంకర్ లాల్" చిత్రీకరణ జరుగుతుండగా టి.ఎన్.బాలు దుర్మరణం జరిగింది. 1979 లో కమల్ పలు క్లాసిక్, మాస్ చిత్రాలలో నటించి మంచి స్టార్ డమ్ పొందాడు. దీనికి ఎమ్.జీ.అర్/శివాజి వంటి చిత్ర రంగం నుండి తప్పుకోవడం కూడా తోడైంది. (ఎమ్.జీ.ఆర్ చిత్ర రంగం నుండి విరమించుకోగా, 1977 తర్వాత 1990 వరకు శివాజి చిత్రాలకు దూరంగా ఉన్నారు). చిత్ర రంగంలో ఉన్న పోటీని ఎప్పటికప్పుడు ఎదుర్కోవడానికి కమల్ తన చిత్రాలలో విభిన్న కథలతో, పాత్రలతో ముందుకు వచ్చారు.

ఈ దశకంలో నటించిన వివిధ పాత్రలు:

  • అంధ వయొలిన్ విద్వాంసునిగా రాజ పార్వయి చిత్రంలో 27 ఏళ్ళ వయసులో నటించాడు. (ఇదే కమల్ స్క్రీన్ ప్లే వహించిన తొలి చిత్రం)
  • శాస్త్రీయ నృత్య కళాకారునిగా సాగర సంగమం చిత్రంలో
  • ప్రేమలో పడే మానసిక వికలాంగిగా స్వాతి ముత్యం చిత్రంలో
  • అజ్ఞాత పోలీసుగా కాకి చట్టై చిత్రంలో
  • అండర్ వరల్డ్ డాన్ గా నాయగన్ (నాయకుడు) చిత్రంలో 33 ఏళ్ళ వయసులో మణి రత్నం దర్శకత్వంలో
  • ఒక నిరుద్యోగ యువకుడు ఒక వారం పాటు భోగ భాగ్యాలు అనుభవించే పాత్రలో మూకీ చిత్రం అయిన పుష్పక్లో (తెలుగులో పుష్పక విమానం)
  • నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ గా, సర్కస్ లో మరుగుజ్జు బఫూన్ గా, సరదాగా ఉండే మెకానిక్ పాత్రలలో అపూర్వ సగోదరర్‌గళ్(విచిత్ర సోదరులు) చిత్రంలో 35 ఏళ్ళ వయసులో (ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే కూడా కమల్ చేశారు)
  • చెడ్డవాడు అయిన మేయర్ గా ఇంద్రుడు చంద్రుడు, తెలుగు చిత్రంలో
  • 1989 లో విడుదల అయిన అపూర్వ సగోదరగళ్ (తెలుగులో విచిత్ర సహోదరులు) చిత్రం బాక్సాఫీస్ వద్ద సుమారు10 కోట్ల రూపాయలను వసూలు చేసిన మొదటి కమల్ చిత్రం.

90వ దశకం

1997 లో మరొక యాదృచ్ఛికమైన సంఘటన కారణంగా కమల్ తిరిగి దర్శకత్వం చేపట్టాల్సి వచ్చింది. చాచి 420 (తెలుగులో భామనే సత్యభామనే) చిత్ర దర్శకుడు శంతను షెనొయ్ పనితనం నచ్చక పోవడంతొ కమల్ మళ్ళి దర్శకుడిగా మారారు. అటుపై ఐరోప చిత్ర విధానాలను అనుసరిస్తూ, కమల్ నిజ జీవితానికి దగ్గరైన సహజ హాస్యం పండిస్తూ అనేక చిత్రాలను తీస్తూ వచ్చారు. ఈ చిత్రాల కారణంగా కొంతమంది అభిమనులని నిరాశపరిచినా, నటుడిగా ఎంతో ఎత్తుకి ఎదిగారు.

ఈ కాలంలో ఆయన నటించిన పాత్రలు:

  • తమిళ హాస్య చిత్రం "సతీలీలావతి"లో డాక్టరుగా (తెలుగులో అదే పేరు)
  • నలుగురు కవలలుగా హాస్య చిత్రం "మైకేల్ మదన కామరాజన్" (తెలుగు: "మైకేల్ మదన కామరాజు")
  • ప్రేమలో పడ్డ ఉన్మాదిగా "గుణ"
  • గ్రామంలో స్థిర పడే ఆధునిక యువకుడిగా "దేవర్ మగన్" (తెలుగు: క్షత్రియ పుత్రుడు) - 38 ఏళ్ళ వయసులో రచించి నిర్మించిన చిత్రం.
  • గ్రామం నుంచి వలస వచ్చి పట్టణంలో కుటుంబాన్ని కోల్పొయే వ్యక్తిగా "మహానది"
  • ఒక విప్లవాత్మకమైన ఉపాధ్యయుడిగా "నమ్మవర్" (తెలుగు: "ప్రొఫెసర్ విశ్వం")
  • ఉగ్రవాదాన్ని అణిచివేసే ప్రత్యేక పొలీసు అధికారిగా "ద్రోహి" (తమిళం: కురుదిప్పునల్)
  • ముదుసలి స్వతంత్రసమరయోధుడిగా, అతని లంచగొండి కొడుకుగా ద్విపాత్రాభినయనం "ఇండియన్" (తెలుగు: "భారతీయుడు")
  • 42 ఏళ్ళ వయసులో ముసలి దాదిగా (naany) (ఇంగ్లీషు చిత్రం మిసెస్ డౌట్ ఫైర్ ఆధారంగా) "అవ్వై షణ్ముఖి" (తెలుగు: భామనే సత్యభమనే)

ఐతే ఎనభైలో మాదిరిగా తొంభైలలో అతని చిత్రాలు అంతగా విజయవంతం కాలేదు. 1996 లో విడుదలైన "ఇండియన్", "అవ్వై షణ్ముఖి" మాత్రం 200 మిలియన్లు వసూలు చేసి కమల్ ను అగ్రపథంలో నిలిపాయి.

2000లలో

నూతన శతాబ్దంలో కమల్ హసన్ బహుముఖ ప్రతిభ తెర మీద మాత్రమే కాకుండా తెర వెనుక అనేక విభాగాల్లో కూడా కనిపించనారంభించింది. ఈ కాలంలో నటన మాత్రమే కాకుండా ఆయన దర్శకత్వం, రచన, కథా సంవిధానం, సంగీతం మొదలైన విభాగాల్లో తనదైన శైలిని ప్రదర్శించాడు. నటనలో విభిన్న పాత్రలెన్నింటినో తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో పోషించాడు. వాటిలో కొన్ని:

  • కవల సోదరులుగా: ఆళవందాన్ (అభయ్)
  • ప్రేమలో పడే ఘోటక బ్రహ్మచారిగా: పమ్మల్ కె. సంబంధం (బ్రహ్మచారి)
  • రసికుడైన విమాన చోదకునిగా: పంచతంత్రం
  • వికలాంగుడైన మానవతావాదిగా: అన్బే శివం (సత్యమే శివం)
  • ప్రేయసి హత్యలో అన్యాయంగా ఇరికించబడి జైలు పాలైన మొరటు పల్లె వాసిగా: విరుమాండి (పోతురాజు)
  • సర్కస్ లో పోరాటాలు చేసే బధిరుడిగా: ముంబై ఎక్స్ ప్రెస్
  • ముదురు వయసులో వైద్య విద్యనభ్యసించే ఆకు రౌడీ పాత్రలో: వసూల్ రాజా ఎమ్. బి. బి. ఎస్. (హిందీ చిత్రం మున్నాభాయ్ ఎమ్. బి. బి. ఎస్. ఆధారంగా)
  • ప్రతిభావంతుడైన పోలీస్ అధికారి రాఘవన్ పాత్రలో: వేట్టైయాడు - విళయాడు (రాఘవన్)
  • ప్రతిదానికీ భయపడే అమాయకుడైన పిరికివాడిగా: తెనాలి (ఆంగ్ల చిత్రం వాట్ అబౌట్ బాబ్ ఆధారంగా)

2000లో విడుదలైన తెనాలి కమల్ హసన్ చిత్రాల్లో రూ. 30 కోట్లకు పైగా సాధించిన తొలి చిత్రం. 2005లో వచ్చిన వసుల్ రాజా ఎమ్. బి. బి. ఎస్ సుమారు రూ. 40 కోట్లు సాధించగా, 2006 లో వచ్చిన వేట్టైయాడు - విళయాడు రూ. 45 కోట్లు సాధించి తమిళ బాక్సాఫీసుపై కమల్ హసన్ ప్రభావం తగ్గలేదని నిరూపించాయి.

పురస్కారాలు

కేంద్ర ప్రభుత్వం ఏటా బహూకరించే ప్రతిష్ఠాత్మకమైన ఉత్తమ నటుడి పురస్కారాన్ని కమల్ హసన్ మూడు పర్యాయాలు గెలుచుకున్నాడు. ఆ చిత్రాలు వరుసగా: మూండ్రంపిరై, నాయకన్ (నాయకుడు) మరియు ఇండియన్ (భారతీయుడు). ఈయన ఉత్తమ బాలనటుడిగా కూడా కేంద్ర ప్రభుత్వ పురస్కారాన్ని కలతూర్ కన్నమ్మ చిత్రానికిగానూ గెలుచుకున్నాడు. ఇవే కాకుండా సాగర సంగమం, స్వాతి ముత్యం చిత్రాలకు వరుసగా 1983, 1985 లలో ఆసియా చిత్రోత్సవాల్లో ఉత్తమ నటుడి బహుమతి పొందాడు. మరో ప్రతిష్ఠాత్మక ఫిల్మ్ ఫేర్ బహుమతిని ఆయన రికార్డు స్థాయిలో 18 సార్లు సొంతం చేసుకున్నాడు. ఆయన నటించిన ఆరు చిత్రాలు భారతదేశం తరపున అధికారికంగా ఆస్కార్ బహుమతికై పంపబడ్డాయి. భారత ఉపఖండంలో మరే నటుడు/నటికీ ఈ గౌరవం దక్కలేదు. 1990లో కేంద్ర ప్రభుత్వం కమల్ హసన్ ను పద్మశ్రీ బిరుదంతో గౌరవించింది. 2005లో మద్రాసు లోని సత్యభామ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేటు ప్రదానం చేసింది. 2014లో కేంద్రప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.

మూడు దశాబ్దాలకు పైబడిన నట జీవితంలో కమల్ హసన్ మొత్తం 171 అవార్డులను సొంతం చేసుకున్నాడు. తమిళ సినిమాకు చేసిన సేవలకుగాను తమిళనాడు ప్రభుత్వం ఆయన్ను కలైమామణి (కళాకారుల్లో మాణిక్యం) బిరుదంతో సత్కరించింది.

నిర్మాతగా కమల్ హసన్ ప్రస్థానం

కమల్ హసన్ 1981 నుండి రాజ్ కమల్ పతాకంపై సినీ నిర్మాణం ప్రారంభించాడు. నిర్మాతగా ఆయన మొదటి చిత్రం రాజ పార్వై. ఆ తరువాత రాజ్ కమల్ సంస్థ నుండి అపూర్వ సహోదరగళ్, దేవర్ మగన్, కురుదిప్పునల్, విరుమాండి, ముంబై ఎక్స్ ప్రెస్ లాంటి మంచి చిత్రాలు రూపొందాయి.

కమల్ హసన్ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన మరుద నాయగం దశాబ్దంనర పైగా నిర్మాణంలోనే ఉంది. 19వ శతాబ్దపు మదురై నగర వాసియైన స్వతంత్ర పోరాట యోధుడు యూసఫ్ ఖాన్ సాహెబ్ (మొహమ్మద్ యూసఫ్ ఖాన్) గురించిన ఈ చిత్ర నిర్మాణమ్ రెండవ ఎలిజబెత్ రాణి చేతులమీదుగా మొదలయింది.

2005లో కమల్ హసన్ రాజ్ కమల్ ఆడియో పేరుతో ఆడియో వ్యాపారంలోకి ప్రవేశించాడు. ఆ మరుసటేడాది ఆయన సంస్థ మద్రాసులో మల్టీప్లెక్స్ సినిమా ధియేటర్ల నిర్మాణం కూడా చేపట్టింది.

వ్యక్తిగత జీవితం

కమల్ హాసన్ వాణి గణపతి అనే ఆమెను వివాహమాడాదు.తర్వాత సారికతో తన జీవితాన్ని పంచుకున్నాడు. వీరికి శృతి, అక్షర అను ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.ఇప్పుడు సారిక నుండి విడిపోయాడు. మరో ప్రముఖ తెలుగు నటియైన గౌతమితో సహజీవనం సాగిస్తున్నాడు.

సమాజ సేవా కార్యక్రమాలు

తన అభిమాన సంఘాలను సమాజానికి సేవ చేసే సేవా సంస్థలుగా మార్చిన మొదటి నటుడు కమల్ హాసన్.తన అభిమానుల ద్వారా పలు సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు.ఆయన పుట్టిన రోజున ఆయన అభిమానులంతా రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

వివాదాలు

మొదటి నుంచీ కమల్ హసన్ సినిమాలు సంచలనాలకే కాక వివాదాలకు కూడా కేంద్రబిందువులుగా ఉంటున్నాయి. 1992లో విడుదలైన తెవర్ మగన్ (తెలుగు అనువాదంలో క్షత్రియ పుత్రుడు) సినిమా తెవర్ కులస్తుల్లోని హింసాత్మక ప్రవృత్తిని గొప్పగా చూపించిందన్న ఆరోపణపై వివాదాలు చెలరేగాయి. సినిమాలోని తొలిపాట తెవర్ కులాన్ని, ఆ కులస్తుల పౌరుషాలను పొడుగుడతూ ఉండడంతో బహిరంగంగా వారు వినిపిస్తూండడం, ఇతరులపై ఆధిక్యసూచనగా ప్రదర్శించడం వంటివి సమాజంలోని వివాదాలను రేపేందుకు పనికివచ్చాయని భావించారు. 2000లో విడుదలైన కమల్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న హే రామ్ చిత్రం చాలా వివాదాలకు మూలబీజమైంది. స్వాతంత్ర్యానంతరం మహాత్మాగాంధీ హత్య వరకూ జరిగిన పరిణామాల నేపథ్యంలో నిర్మించిన చారిత్రికాంశాలతో కూడిన చిత్రమిది. ఈ సినిమాలో మహాత్మా గాంధీని తక్కువ చేసి చూపారని కాంగ్రెస్ నాయకులు భావించగా, స్వాతంత్ర్యోద్యమంలో తమ పాత్రను కించపరిచారని సంఘ్ పరివార్ సంస్థలు ఆరోపించాయి. 2002నాటి పంచతంత్రం సినిమాలోని ఒక పాటకు సెన్సార్ బోర్డు నుంచి వ్యతిరేకత వ్యక్తమైనప్పుడు సమస్యలు ఎదురయ్యాయి. చివరికి ఆ పాటను తీసివేసి సినిమా విడుదల చేశారు. సందియర్ అన్న పేరుతో ఓ సినిమాను చిత్రీకరిస్తున్నప్పుడు పుతియ తమిళగం సంస్థ నాయకుడు కె.కృష్ణమూర్తి, ఇతర దళిత సంఘాలు తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం చేశాయి. తెవర్-దళిత కులస్తుల మధ్య విభేదాలు, హింసాత్మక ఘటనలు నమోదైన దృష్ట్యా తెవర్ కులస్తుల ఆభిజాత్యానికి, వారి హింసాప్రవృత్తికి ఆ పేరు ఉత్తేజం కల్పిస్తుందని దళిత నాయకులు ఆరోపించారు. తన చిత్రబృందానికి రక్షణ కల్పించాలని స్థానిక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుని కమల్ హాసన్ కలవగా తర్వాత విస్తృత ప్రజానీకం భద్రత దృష్ట్యా కల్పించలేమని ఆయన తిరస్కరించారు. ఆనాటి ముఖ్యమంత్రి జయలలితను కమల్ హసన్ స్వయంగా కలిసి మాట్లాడి భద్రత తెచ్చుకున్నారు. అలానే సినిమా పేరును విరుమాండిగా మార్చి 2004లో చలనచిత్రాన్ని విడుదల చేశారు. 2004లోనే విడుదలైన వసూల్‌రాజా ఎం.బి.బి.ఎస్. సినిమా పేరు తమ వృత్తిని కించపరిచేదిగా ఉందని ఈరోడ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం 2005 నాటి ముంబై ఎక్స్ప్రెస్ సినిమాపై భాషాభిమానులు వ్యతిరేక ప్రదర్శనలు చేశారు. తమిళ సినిమాకు ఇంగ్లీషులో పేరు పెట్టడాన్ని నిరశిస్తూ సాగిన ఈ ఆందోళనకు పిఎంకె నేత, తమిళ భాషా పరిరక్షణ ఉద్యమానికి ఆద్యులైన ఎస్.రామదాసు నేతృత్వం వహించారు. 2010 నాటి మన్మథన్ అంబు (తెలుగులో మన్మథబాణం) సినిమాలోని ఒక పాటలోని సాహిత్యం హిందూ మక్కల్ కచ్చి వారు హిందూమతాన్ని కించపరిచేదిగా ఉందంటూ ఆందోళన చేశారు. పాటను తొలగించాకా సినిమా విడుదల అయింది. విశ్వరూపం సినిమా ఇస్లాం మతాన్ని తక్కువచేసి చూపిందని ఆరోపణలు రాగా, తమిళనాడు ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తవచ్చు అంటూ సినిమాను నిషేధించింది. కొన్ని దృశ్యాలను తొలగించి, కొన్ని సంభాషణలు మ్యూట్ చేసేందుకు కమల్ అంగీకరించాకా దాదాపు విడుదల అయిన 22 రోజులకు ప్రభుత్వం నిషేధాన్ని సడలించింది. 2015లో విడుదల అయిన ఉత్తమ విలన్ చలనచిత్రం క్లైమాక్స్ పాట హిందువులను అవమానిస్తోందని ఆరోపిస్తూ విశ్వహిందూపరిషత్ సినిమాను నిషేధించాలని ఆందోళన చేసింది, సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఒక ప్రెంచి ఫోటోగ్రాఫర్ చిత్రాన్ని కాపీచేస్తున్నట్టు వుందని గొడవ చెలరేగితే, చిత్రవర్గాలు "ఆ పోస్టర్లో చూపిన తెయ్యం అన్నది వేయి సంవత్సరాలకు పైగా వయసున్న భారతీయ కళ అని, దాన్ని వేరెవరి నుంచో కాపీ చేయాల్సిన అవసరం తమకు లేదని" స్పష్టీకరించాయి.[2]

వివిధ భాషలలో ఆరంగేట్రం

  • 1960 - తమిళ చిత్ర రంగ ప్రవేశం
  • 1962 - మలయాళ చిత్ర రంగ ప్రవేశం
  • 1977 - బెంగాలీ చిత్ర రంగ ప్రవేశం
  • 1977 - కన్నడ చిత్ర రంగ ప్రవేశం
  • 1977 - తెలుగు చిత్ర రంగ ప్రవేశం
  • 1977 - హిందీ చిత్ర రంగ ప్రవేశం

కమల్ హసన్ చిత్ర మాలిక: నటుడి గా

2000లో

సంవత్సరం పేరు పాత్ర సహ-నటులు భాష వివరములు
2015 చీకటి రాజ్యం త్రిష కృష్ణన్ తమిళం ఏక కాలంలో తమిళ, తెలుగు, హిందీ,ఇంగ్లీష్ బాషలలో రూపొందించబడి 2015 సెప్టెంబరు 16 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబడింది.
2007 దశావతారం ఆశిన్, మల్లిక షెరావత్ తమిళం ఏక కాలంలో తమిళ, తెలుగు, హిందీ,ఇంగ్లీష్ బాషలలో రూపొందించబడి 2008 జూన్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబడింది.
2006 వెట్టీయాడు విలైయాడు రాఘవన్ జ్యొతిక, కమిలిని ముఖర్జీ తమిళం తెలుగు లోకి రాఘవన్గా అనువదించబడింది
2005 రమ షమ బమ శ్యామ్ ఊర్వశి, శృతి కన్నడ
2005 ముంబాయి ఎక్స్ ప్రెస్ అవినాష్ మనీషా కొయిరాల హిందీ/తమిళం ఏక కాలంలో తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రూపొందింది
2004 వసూల్ రాజా MBBS రాజ సుబ్రమనియం స్నేహ, మాళవిక తమిళం
2004 విరుమాండి విరుమాండి అభిరామి తమిళం తెలుగు లోకి పోతురాజుగా అనువదించబడింది
2003 అన్బే శివం నల్ల శివం కిరణ్ రాథొడ్, ఆర్. మాధవన్ తమిళం తెలుగు లోకి సత్యమే శివంగా అనువదించబడింది
2002 పంచతంతిరం రామ చంద్ర మూర్తి సిమ్రాన్, రమ్యా క్రిష్నన్, దేవయాని తమిళం తెలుగులోకి పంచ తంత్రంగా అనువదించబడింది
2001 పమ్మళ్ కె. సంబంధం పమ్మాల్ సంబంధం సిమ్రాన్, స్నేహ తమిళం తెలుగు లోకి బ్రహ్మచారిగా అనువదించబడింది
2001 పార్తాలై పరవశం కమల్ హాసన్ ఆర్. మాధవన్, సిమ్రాన్, స్నేహ తమిళం కొద్ది నిడివి ప్రత్యేక పాత్ర
తెలుగు లోకి పరవశంగా అనువదించబడింది
2001 అలవంధన్ విజయ్/నందు మనీషా కొయిరాల, రవీనా టాండన్ హిందీ/తమిళం అభయ్గా హిందీ మరియు తెలుగు లోకి అనువదించబడింది
2000 తెనాలి తెనాలి సొమన్ జ్యోతిక, దేవయాని, మీనా తమిళం అదే పేరుతో తెలుగులోకి అనువదించబడింది
2000 హే రామ్ సాకేత్ రామ్ రాణీ ముఖర్జీ, వసుంధరా దాస్ హిందీ/తమిళం అదే పేరుతో తెలుగులోకి అనువదించబడింది

1990s

1980s

  • 1989 - ఇంద్రుడు చంద్రుడు (తెలుగు) (రెండు పాత్రలు) - ఇది తమిళంలో ఇంద్రన్ చంద్రన్ గా పునర్నిర్మించబడి హిందీలో మేయర్ సాబ్ గా డబ్బింగ్ చేసి విడుదల చేశారు. పాటలు
  • 1989 - వెట్రి విళా పాటలు
  • 1989 - చాణిక్యన్ (మలయాళం)
  • 1989 - అపూర్వ సగోదరర్‌గళ్ (మూడు పాత్రలు) (ఎ) -ఇది డబ్బింగ్ చేసి తెలుగు మరియు హిందీలలో విడుదల చేసారు. పాటలు
  • 1989 - అప్పు రాజా (హిందీ) (త్రిపాత్రాభినయం) (ఎ)
  • 1989 - అపూర్వ సహోదరులు (తెలుగు) (త్రిపాత్రాభినయం) (ఎ)
  • 1988 - ఉన్నాల్ ముడియుం తంబి పాటలు
  • 1988 - సూర సంహారం పాటలు
  • 1988 - డైసీ (మలయాళం)
  • 1988 - సత్య (a) పాటలు
  • 1988 - పేసుమ్ పడమ్ (సంభాషణ రహితం)
  • 1987 - పుష్పక్ (హిందీ) (సంభాషణ రహితం)
  • 1987 - పుష్పకవిమానం (తెలుగు) (సంభాషణ రహితం)
  • 1987 - పుష్పక విమాన (కన్నడ) (సంభాషణ రహితం)
  • 1987 - కడమై కణ్ణియమ్ కట్టుబాటు (అథిధి) (ఎ)
  • 1987 - నాయకుడు (తెలుగు)
  • 1987 - వేలు నాయకన్ (హిందీ)
  • 1987 - నాయగన్ - ఇది తెలుగులోనూ హిందీలోనూ పునర్నిర్మించబడింది.దయావన్గా కాఫీ చేయబడింది. పాటలు
  • 1987 - పేర్ చొల్లుమ్ పిళ్ళై
  • 1987 - అందరికంటే ఘనుడు (తెలుగు)
  • 1987 - వ్రతం (మలయాళం)
  • 1987 - కాదల్ పరిసు పాటలు
  • 1986 - డిసెంబర్ పూక్కళ్ (అథిధి)
  • 1986 - డాన్స్‌మాష్టర్ (తెలుగు) (ద్విపాత్రాభినయం) పాటలు
  • 1986 - పున్నగై మన్నన్ (ద్విపాత్రాభినయం) పాటలు
  • 1986 - ఒక రాధ ఇద్దరు క్రిష్ణులు (తెలుగు)
  • 1986 - విక్రమ్ (a) పాటలు
  • 1986 - నానుమ్ ఒరు తొళిలాళి
  • 1986 - సిప్పికుళ్ ముత్తు పాటలు
  • 1986 - స్వాతిముత్యం (తెలుగు) - ఇది అనిల్ కపూర్ నాయకుడుగా హిందీలోఈశ్వర్గా పునర్నిర్మించ బడింది. పాటలు
  • 1986 - మనకణక్కు (అథిధి)
  • 1985 - దేఖా ప్యార్ తుమ్హారా (హిందీ).
  • 1985 - జపానిల్ కల్యాణ రామన్ (ద్విపాత్రాభినయం) పాటలు
  • 1985 - మంగమ్మా శపధం
  • 1985 - గిరఫ్తార్ (హిందీ)
  • 1985 - సాగర్ (హిందీ) పాటలు
  • 1985 - ఉయర్న్ద ఉళ్ళమ్ పాటలు
  • 1985 - అంద ఒరు నిమిడమ్ పాటలు
  • 1985 - కాక్కి చట్టై పాటలు
  • 1985 - ఒరు కైదియిన్ డైరీ (ద్విపాత్రాభినం) - ఇది అమితాబచ్చన్ నాయకుడిగా హిందీలో ఆఖరీ రాస్తా గా పునర్నిర్మించబడింది. పాటలు
  • 1984 - కరిష్మా (హిందీ)
  • 1984 - ఎనక్కుళ్ ఒరువన్ (ద్విపాత్రాభినం) పాటలు
  • 1984 - రాజ్ తిలక్ (హిందీ)
  • 1984 - యాద్ గార్ (హిందీ)
  • 1984 - ఏక్ నయీ పహేలీ (హిందీ)
  • 1984 - ఎహ్ దేష్ (హిందీ)
  • 1983 - తూంగాదె తంబి తూంగాదే (ద్విపాత్రాభినయం) పాటలు
  • 1983 - బెనకియల్లి అరళింద హువు (కన్నడ)
  • 1983 - పొయ్‌క్కాల్ కుదిరై (అథిధి)
  • 1983 - సద్మ (హిందీ) పాటలు
  • 1983 - సలంగై ఒలి పాటలు
  • 1983 - సాగరసంగమం (తెలుగు) పాటలు
  • 1983 - స్నేహ బంధం (మలయాళం)
  • 1983 - చట్టం పాటలు
  • 1983 - ఉరువంగళ్ మారలామ్ (అథిధి పాత్ర)
  • 1983 - జరాసీ జిందగీ
  • 1982 - వసంత కోకిల
  • 1982 - పాడగన్ (ఇది 90 లలో నిర్మించబడిన హిందీ చిత్రం తనమ్ మేరీ కసమ్ యొక్క తమిళ డబ్బింగ్ చిత్రం)
  • 1982 - అగ్ని సాక్షి (తమిళం - అథిధి పాత్ర)
  • 1982 - ప్యార్ తరనా (ఇది 80 లో నిర్మించబడిన తమిళ చిత్రం నినైత్తాలే ఇనిక్కుమ్ యొక్క డబ్బింగ్ హిందీ చిత్రం)
  • 1982 - పగడ్సై పన్నిరెండు
  • 1982 - ఎహ్ తో కమాల్ హోగయా (హిందీలో మొదటి ద్విపాత్రాభినయం) (హిందీ)ఇది పునర్నిర్మించబడిన "చట్టమ్ ఎన్ కైయ్యిల్ "యొక్క హిందీ చిత్రం.
  • 1982 - రాణీ తేనీ (అథిధి పాత్ర)
  • 1982 - ఎళమ్ రాత్తిరి (మలయాళం)
  • 1982 - సకల కళా వల్లవన్ పాటలు
  • 1982 - సనమ్ తేరీ కసమ్ (హిందీ) [1]
  • 1982 - సిమ్లా స్పెషల్ పాటలు
  • 1982 - మూన్రామ్ పిరై - ఇది హిందీలో సద్మా గా పునర్నిర్మించబడింది.html పాటలు
  • 1982 - అంది వెయిలిలే (మలయాళం)
  • 1982 - అందగాడు (తెలుగు)
  • 1982 - వాళ్వే మాయమ్ (మలయాళం)
  • 1982 - వాళ్వే మాయమ్ పాటలు
  • 1981 - దో దిల్ దివానే
  • 1981 - చిలిపి చిన్నోడు (ఎల్లామ్ ఇన్బమయమ్)
  • 1981 - టిక్!టిక్ !టిక్ ! పాటలు
  • 1981 - అమావాస్య చంద్రుడు (తెలుగు) (ఎ)
  • 1981 - శంకరలాల్
  • 1981 - సవాల్
  • 1981 - కడల్ మీన్‌గళ్ html
  • 1981 - ఏక్ దుజే కేలియే (హిందీ) పాటలు
  • 1981 - రాజ పార్వై (a) పాటలు
  • 1981 - ప్రేమ పిచ్చి (తెలుగు)
  • 1981 - మీండుమ్ కోకిలా పాటలు
  • 1981 - ఆకలి రాజ్యం (తెలుగు) పాటలు
  • 1981 - తిల్లు ముల్లు (అథిధి)
  • 1980 - నట్చత్త్రిరమ్ (అథిధి)
  • 1980 - మరియ మై డార్లింగ్ (తమిళం) ఇది అదే పేరుతో కన్నడంలో పునర్నిమించబడింది.
  • 1980 - వరుమైయిన్ నిరమ్ సివప్పు (కన్నడమ్)
  • వరుమైయిన్ నిరమ్ సివప్పు పాటలు
  • 1980 - గురు పాటలు
  • 1980 - ఉల్లాస పరవైగళ్పాటలు

1970s

  • 1979 - అళియాద కోలన్గల్ (అతిథి)
  • 1979 - నీల మలర్గల్ (అతిథి)
  • 1979 - మంగల వాథియమ్
  • 1979 - కల్యాణరామన్ (తమిళం)
  • 1979 - కళ్యాణరమన్ పాటలు
  • 1979 - ఇది కథ కాదు (తెలుగు)
  • 1979 - అల్లా ఉధ్ధీన్ అధ్బుత దీపం (తెలుగు)
  • 1979 - అలా ఉధ్ధీనుమ్ అర్పుద విలక్కుమ్
  • 1979 - అందమైన అనుభవం (తెలుగు)
  • 1979 - నినైత్తాలే ఇనిక్కుమ్ పాటలు
  • 1979 - థాయిల్లమల్ నాన్ ఇల్ల్ య్ పాటలు
  • 1979 - అలవుదీనుమ్ అల్బుత వెలక్కుమ్ (మలయాళం)
  • 1979 - నీయా!
  • 1979 - సిగపుక్కల్ మూక్కుథి
  • 1979 - సొమ్మొకడిది సోకొకడిది (తెలుగులో మొదటి ద్వి-పాత్రాభినయం) (తెలుగు) తమిళంలో "ఇరు నిలవుగల్ "గా విడుదల చేశారు.
  • 1978 - తప్పు తాళంగళ్ (అతిథి)
  • 1978 - తప్పిట తల (తెలుగు) (అతిథి)
  • 1978 - మదనోత్సవమ్ (మలయాళం)
  • 1978 - ఏట్టా (మలయాళం)
  • 1978 - అవళ్ అప్పడిదాన్
  • 1978 - మనిదరిల్ ఇత్తని నిరంగళా!
  • 1978 - సిగప్పు రోజాగళ్ పాటలు
  • 1978 - వయానధన్ తంబన్ (మలయాళం)
  • 1978 - వయస్సు పిలిచింది (తెలుగు)
  • 1978 - చట్టమ్ ఎన్ కైయ్యిల్ (తమిళంలో మొదటి ద్విపాత్రాభినయం)పాటలు
  • 1978 - ఇళమై ఊంజలాడు గిరదు పాటలు
  • 1978 - మరో చరిత్ర (తెలుగు) పాటలు
  • 1978 - నిళల్ నిజమాగిరదు పాటలు
  • 1977 - ఆద్యపాదమ్ (మలయాళమ్) (అతిథి)
  • 1977 - సత్యవాన్ సావిత్రి (మలయాళం)
  • 1977 - కోకిల (కన్నడంలో మొదటి చిత్రం)
  • 1977 - నామ్ పిరంద మణ్
  • 1977 - ఆనందం పరమానందం (మలయాళం) (అతిథి)
  • 1977 - ఆడు పులి ఆట్టమ్
  • 1977 - ఆడు పులి ఆట్టమ్ పాటలు
  • 1977 - ఓర్ మగళ్ మరిక్కుమో (మలయాళం) (అతిథి)
  • 1977 - నిరకుడమ్ (మలయాళం)
  • 1977 - ఆష్త మాంగల్యమ్ (మలయాళం) (అతిథి)
  • 1977 - కబిత (బెంగాలి)
  • 1977 - ఉన్నై సుట్రుమ్ ఉలగమ్
  • 1977 - శ్రీ దేవి (మలయాళం)
  • 1977 - మదుర సొప్పనమ్ (మలయాళం)
  • 1977 - అవర్గళ్ (అథిధి) పాటలు
  • 1977 - ఆశీర్వాదమ్ (మలయాళం)
  • 1977 - శివతాండవమ్ (మలయాళం)
  • 1977 - ఉయర్న్దవర్‌గళ్
  • 1977 - భలే బ్రహ్మచారి (తెలుగు)
  • 1976 - లలిత (అతిథి)
  • 1976 - మోగమ్ ముప్పదు వ్రుషమ్
  • 1976 - మూన్రు ముడిచ్చు
  • 1976 - Nee Ente Lahari (మలయాళం)
  • 1976 - పొన్ని (మలయాళం)
  • 1976 - ఇదయ మలర్
  • 1976 - కుమార విజయమ్
  • 1976 - కుట్టువమ్ సిత్షయుమ్ (మలయాళం)
  • 1976 - ఉణర్చిగళ్ (మలయాళం)
  • 1976 - ఒరు ఊదాప్పూ కణ్ సిమిట్టు గిరదు
  • 1976 - సత్యమ్
  • 1976 - అరుతు (మలయాళం) (అతిథి)
  • 1976 - స్విమ్మింగ్ పూల్ (మలయాళం)
  • 1976 - మన్మద లీలై పాటలు
  • 1976 - సమస్సియ (మలయాళం)
  • 1976 - అప్పూపన్ (మలయాళం)
  • 1976 - అగ్ని పుష్పమ్ (మలయాళం)
  • 1975 - అంతరంగమ్
  • 1975 - రాసలీల (మలయాళం)
  • 1975 - మట్టొరు సీతా (మలయాళం)
  • 1975 - తిరువోణమ్ (మలయాళం)
  • 1975 - అపూర్వ రాగంగళ్ పాటలు
  • 1975 - మాలై సూడవా
  • 1975 - నాన్ నిన్నె ప్రేమిక్కున్ను (మలయాళం)
  • 1975 - పట్టికాట్టు రాజా
  • 1975 - తంగత్తిలే వైరమ్
  • 1975 - మేల్‌నాట్టు మరుమగళ్ (ఈ చిత్ర నిర్మాణ సమయంలో వాణి గణపతిని కలుసుకొని ప్రేమలో పడి తరువాత ఆమెను వివాహం చేసుకున్నాడు )
  • 1975 - తేన్ సిందుదే వానమ్
  • 1975 - ఆయిరత్తిల్ ఒరుత్తి
  • 1975 - పట్టామ్ బూచ్చి
  • 1975 - సినిమా పైత్యమ్
  • 1974 - పణత్తుక్కాగ
  • 1974 - ఆయినా (హిందీ) (ఇది తెరమీద అనుకున్నంత విజయం సాధించలేదు)
  • 1974 - అంతులేని కథ (తెలుగు) (ఇది తెరమీద అనుకున్నంత విజయం సాధించలేదు)
  • 1974 - అవళ్ ఒరు తొడర్ కదై (మలయాళం) (ఇది తెరమీద అనుకున్నంత విజయం సాధించలేదు)
  • 1974 - అవళ్ ఒరు తొడర్ కదై (ఇది తెరమీద అనుకున్నంత విజయం సాధించలేదు) పాటలు
  • 1974 - విష్ణు విజయమ్ (మలయాళం)
  • 1974 - అన్బు తంగై
  • 1974 - కన్యాకుమారి (మలయాళం)
  • 1974 - నాన్ అవనిల్లై
  • 1974 - గుమస్తావిన్ మగళ్
  • 1974 - పరువ కాలమ్
  • 1974 - చొల్లత్తాన్ నినైక్కిరేన్
  • 1973 - అరంగేట్రమ్
  • 1972 - కురత్తి మగన్
  • 1970 - మాణవన్

1960s

  • 1963 - అనంధ జోధి
  • 1963 - వానంపడి పాటలు
  • 1962 - కన్నుమ్ కరులుమ్ (మలయాళం)
  • 1962 - పాధ కానిక్కై పాటలు
  • 1962 - పార్దాల్ పాసి థీరుమ్ (మొట్ట మొదటి ద్వి-పాత్రాభినయం) (అతిథి పాత్రలో) పాటలు
  • 1960 - కలథుర్ కన్నమ్మ ("ఉత్తమ బాల నటుడి"గా జాతీయ బహుమతి వచ్చింది.)

నిర్మాత గా

  • పై చిత్రాలలో (ఎ) గా గుర్తుంచ బడినవాటికి కమల్ హాసన్ నిర్మాత.

రచయిత గా

  • 1999 - బీవీ నెం.1 (హిందీ) పాటలు
  • 1997 - విరాసత్ (హిందీ) పాటలు
  • అంతే కాకుండా పై చిత్రాలలో (బి) గా చూపించ బడినవి కమల్ హాసన్ చే రచించబడినవి.

దర్శకుడి గా

  • పైన (సి) గా రాసిన చిత్రాలు కమల్ హాసన్ చే దర్శకత్వం ఛేయబడినవి.
  • 2000 - హే రామ్
  • 2004 - విరుమాండి
  • 2013- విశ్వరూపం

ఇతర విభాగాల్లో

వెలుపలి లింకులు

కమల్ హసన్ & అభిమానుల అధికారిక వెబ్సైట్

ఇతర మూలాలు

మూలాలు

  1. ఇంటర్నెట్ మూవీ డేటాబేసు వెబ్ సైట్ లోకమల్ హసన్ జీవిత చరిత్రజూన్ 16,2008న సేకరించబడినది.
  2. సంపాదక, బృందం (2015). "Kamal Haasan and contraversy". The Hindu. Retrieved 14 June 2015.