భక్త కన్నప్ప (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:వాణిశ్రీ నటించిన చిత్రాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:Q4900852
పంక్తి 50: పంక్తి 50:
[[వర్గం:కృష్ణంరాజు నటించిన సినిమాలు]]
[[వర్గం:కృష్ణంరాజు నటించిన సినిమాలు]]
[[వర్గం:వాణిశ్రీ నటించిన చిత్రాలు]]
[[వర్గం:వాణిశ్రీ నటించిన చిత్రాలు]]

[[en:Bhakta Kannappa]]

03:25, 29 ఆగస్టు 2019 నాటి కూర్పు

భక్త కన్నప్ప
(1976 తెలుగు సినిమా)
దర్శకత్వం బాపు
నిర్మాణం యు.వి.సూర్యనారాయణరాజు
రచన ముళ్ళపూడి వెంకటరమణ
కథ ముళ్ళపూడి వెంకటరమణ
చిత్రానువాదం బాపు
తారాగణం కృష్ణంరాజు, వాణిశ్రీ, రావుగోపాలరావు
సంగీతం సత్యం
నేపథ్య గానం రామకృష్ణ, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి
నృత్యాలు శీను
గీతరచన ఆరుద్ర, సి.నారాయణ రెడ్డి, వేటూరి సుందరరామమూర్తి
సంభాషణలు ముళ్ళపూడి వెంకటరమణ
ఛాయాగ్రహణం వి.యస్.ఆర్.స్వామి (డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ), ఎస్.గోపాలరెడ్డి (ఆపరేటివ్ కెమేరామేన్)
కళ భాస్కరరాజు, బి.వి.ఎస్.రామారావు
అలంకరణ మాధవయ్య, కృష్ణ, సత్యం, ఎ.సి.రాజు
కూర్పు మందపాటి రామచంద్రయ్య
రికార్డింగ్ యస్.పి.రామనాథన్ (ప్రసాద్), స్వామినాధన్ (విజయా గార్డెన్స్), కన్నియ్యప్పన్ (విజయలక్ష్మి), డి.మోహన సుందరం(వాహిని)
నిర్మాణ సంస్థ గోపీకృష్ణా మూవీస్
పంపిణీ లక్ష్మీ కంబైన్స్
నటేశ్ ఫిలిమ్స్ ఎక్స్ ఛేంజ్ (మైసూర్, సీడెడ్)
విడుదల తేదీ 1976
నిడివి 148 నిమిషాలు
దేశం ఇండియా
భాష తెలుగు

భక్త కన్నప్ప బాపు దర్శకత్వం వహించగా, కృష్ణంరాజు, వాణిశ్రీ, రావుగోపాలరావు ప్రధాన పాత్రల్లో నటించిన 1976 నాటి తెలుగు భక్తిరస ప్రధాన చలనచిత్రం. సినిమాను గోపీకృష్ణా మూవీస్ పతాకంపై నటుడు కృష్ణంరాజు తమ్ముడు యు.వి.సూర్యనారాయణరాజు నిర్మించారు. ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీకాళహస్తి ఆలయ మహాత్మ్యంలోని ముఖ్యమైన భాగమైన తిన్నడు లేదా కన్నప్ప కథను స్వీకరించి సినిమాగా తీశారు. ప్రముఖ కవి ధూర్జటి వ్రాసిన శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం కావ్యంలో ఆ క్షేత్రమహాత్యాల్లో భాగంగా ఈ కథాంశమూ ఉంది. 1954లో కొన్ని తేడాలతో ఈ కథాంశమే కాళహస్తి మహాత్యం సినిమాగా వచ్చింది, ఆ సినిమాలో కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ నటించారు.

నిర్మాణం

చిత్రీకరణ

భక్త కన్నప్ప సినిమా చిత్రీకరణ బుట్టాయగూడెం, పట్టిసీమ, గూటాల తదితర ప్రాంతాల్లో జరిగింది. బుట్టాయగూడెంలో గ్రామ ప్రముఖులైన కరాటం కృష్ణమూర్తి, కరాటం చంద్రయ్య, కుటుంబసభ్యులు సినిమా నిర్మాణానికి సహకారం అందించారు. డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా వి.ఎస్.ఆర్. స్వామి, ఆపరేటివ్ కెమేరామేన్ గా ఎస్.గోపాలరెడ్డి వ్యవహరించి సినిమాను చిత్రీకరించారు. మేకప్ విభాగంలో మాధవయ్య, కృష్ణ, సత్యం, ఎ.సి.రాజు పనిచేశారు. కాస్ట్యూమ్స్ బి.కొండయ్య సమకూర్చగా, ఫైట్ మాస్టర్ గా రాఘవులు వ్యవహరించారు. బాపు సినిమాకు దర్శకత్వం వహించగా, ఆయనకు సహాయదర్శకునిగా కంతేటి సాయిబాబా పనిచేశారు.[1] సినిమా సెట్లు కొంతవరకూ కళాదర్శకుడు భాస్కరరాజు వేశారు. అయితే ఆయనకు వేరే అత్యవసరమైన పని ఏర్పడడంతో ఈ సినిమా వదిలేసి మద్రాసు వెళ్ళారు. దాంతో యుద్ధక్షేత్రం (ఎరీనా)ను నిర్మించే పనులు సగంలో నిలిచిపోయాయి. బాపురమణలు, నిర్మాత అందుకు బాపురమణల స్నేహితుడు, ఇరిగేషన్ డిపార్ట్ మెంటులో పనిచేస్తున్న బి.వి.ఎస్.రామారావు సరైన వ్యక్తి అని భావించి ఆయనకే ఆ బాధ్యతలు అప్పగించేందుకు నిర్ణయించారు. మొదట సందేహించినా చివరకు రామారావు అంగీకరించి బాధ్యతలు వహించారు. ముందుగా అనుకున్నదానికన్నా పెద్ద ప్రహరీతో ఎరీనా సెట్ పూర్తచేశారు. సెట్టుని చక్కగా అలంకరించారు.[2]

మూలాలు

  1. అందాల రాముడు సినిమా టైటిల్స్ లోని వివరాలు
  2. బి.వి.ఎస్.రామారావు (అక్టోబర్ 2014). కొసరుకొమ్మచ్చి (3 ed.). హైదరాబాద్: వరప్రసాద్ రెడ్డి. {{cite book}}: Check date values in: |date= (help)