రోజారమణి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2: పంక్తి 2:
| name = రోజా రమణి
| name = రోజా రమణి
| native_name = రోజా రమణి
| native_name = రోజా రమణి
| image =File:Roja Ramani.jpg
| image = Roja Ramani 1.jpg
| caption =[[సినివారం]]లో రోజా రమణి
| caption =
| birth_date = {{Birth date and age |1959|9|16|df=y}}
| birth_date = {{Birth date and age |1959|9|16|df=y}}
| birth_place = [[మద్రాసు]], [[తమిళనాడు]]
| birth_place = [[మద్రాసు]], [[తమిళనాడు]]

08:05, 15 సెప్టెంబరు 2019 నాటి కూర్పు

రోజా రమణి
రోజా రమణి
జననం (1959-09-16) 1959 సెప్టెంబరు 16 (వయసు 64)
ఇతర పేర్లుచెంబరుతి శోభన
వృత్తినటి
జీవిత భాగస్వామిచక్రపాణి
పిల్లలుతరుణ్ కుమార్ మరియు అమూల్య

రోజారమణి తెలుగు సినిమా నటి. భక్త ప్రహ్లాదలో బేబి రోజారమణిగా చాలా మంచి పేరు సంపాదించింది. ఆ సినిమాలో నటనకుగాను జాతీయ ఉత్తమ బాలనటిగా పురస్కారం పొందింది. 1970 మరియు 1980 వ దశకాల్లో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ సినిమాలలో కథానాయికగా నటించింది. సుమారు 400 సినిమాలకు డబ్బింగ్ కళాకారిణిగా పనిచేసింది. ఆమె బ్లూ క్రాస్ లో సభ్యురాలిగా చేరి సమాజ సేవ చేస్తోంది. మాస్టర్ తరుణ్ అనే పేరుతో బాలనటుడిగా చక్కగా నటించి తరువాత యువ కథానాయకుడిగా స్థిరపడిన తరుణ్ రోజారమణి కొడుకు.

జీవిత విశేషాలు

రోజారమణి మద్రాసులో జన్మించింది. ఆమె తండ్రి ఒక విలేఖరి. ఆమెకు ఇద్దరు సోదరులున్నారు.[1] ఆమె ఒడియా నటుడైన చక్రపాణిని వివాహం చేసుకున్నది. ఆయన ప్రస్తుతం ఈటీవీ ఒడియా చానల్ లో దర్శకుడు మరియు నిర్మాత. వారి కుమారుడు ప్రముఖ తెలుగు నటుడు తరుణ్. కూతురు అమూల్య సైకాలజీ గ్రాడ్యుయేట్.

కెరీర్

ఆమె 5 సంవత్సరాల వయసులో భక్త ప్రహ్లాద సినిమాలో ప్రహ్లాదుడిగా నటించింది. ఏవీయం నిర్మించిన ఈ సినిమా మొట్టమొదటి పూర్తి నిడివి ఈస్ట్ మన్ కలర్ సినిమా. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నది. బాలనటిగా సుమారు 70 సినిమాల్లో నటించిన తర్వాత 13 ఏళ్ళ వయసులోనే చంబరతి అనే మలయాళ సినిమాలో కథానాయికగా నటించింది. ఆ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇదే సినిమా తెలుగులో కూడా రోజా రమణి కథానాయికగా కన్నె వయసు అనే సినిమా గా, తమిళంలో పరువ కాలంగా పునర్నిర్మించారు.

తరువాత అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీ, ఒడియా భాషల్లో దాదాపు 300 సినిమాల్లో నటించింది. తెలుగు, తమిళ భాషల్లో సుమారు 400 సినిమాల్లో సుహాసిని, మీనా, రాధిక, రమ్యకృష్ణ, రోజా, విజయశాంతి, శిల్పాశెట్టి, దివ్యభారతి, నగ్మా, కుష్బూ లాంటి నటీమణులకు గాత్రదానం చేసింది.

నటించిన సినిమాలు

మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=రోజారమణి&oldid=2728085" నుండి వెలికితీశారు