జీ తెలుగు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 82: పంక్తి 82:
డిసెంబరు 31, 2017న, జీ తెలుగు తన సోదర చానెల్ జీ సినిమాలును మొదలుపెట్టింది. ఈ చానెల్ ను [[చిరంజీవి]] జీ గోల్డెన్ అవార్డ్స్ లో ప్రారంభంచాడు. అలాగే [[సమంత]]ను బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించారు.
డిసెంబరు 31, 2017న, జీ తెలుగు తన సోదర చానెల్ జీ సినిమాలును మొదలుపెట్టింది. ఈ చానెల్ ను [[చిరంజీవి]] జీ గోల్డెన్ అవార్డ్స్ లో ప్రారంభంచాడు. అలాగే [[సమంత]]ను బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించారు.


==ప్రస్తుతం ప్రసారమవుతున్న కార్యక్రమాలు==
==Currently Broadcasting Programs==


===ధారావాహికలు===
===Serials===


'''Mon-Sat'''
'''సోమ-శని'''


{| class="wikitable"
{| class="wikitable"
! పేరు
! Name
! ప్రసార సమయం
! Airing Time
|-
|-
| Ganga Manga
| గంగ మంగGanga Manga
| మధ్యాహ్నం 12.30
| 12.30PM
|-
|-
| రక్త సంబంధం
| Rakta Sambandam
| మధ్యాహ్నం 1
| 1PM
|-
|-
| గుండమ్మ కథ
| Gundamma Katha
| మధ్యాహ్నం 1.30
| 1.30PM
|-
|-
| నిన్నే పెళ్ళాడతా
| Ninne Pelladatha
| మధ్యాహ్నం 2
| 2PM
|-
|-
| బంగారు గాజులు
| Bangara Gajulu
| మధ్యాహ్నం 2.30
| 2.30PM
|-
|-
| ముద్ద మందారం
| Mudda Mandaram
| సాయంత్రం 6
| 6PM
|-
|-
| అత్తారింట్లో అక్కా చెల్లెలు
| Attarintulu Akka Chellulu
| సాయంత్రం 6.30
| 6.30PM
|-
|-
| రాధమ్మ కూతురు
| Radhamma Kuthuru
| రాత్రి 7
| 7PM
|-
|-
| రామ సక్కని సీత
| Rama Sakkani Seetha
| రాత్రి 7.30
| 7.30PM
|-
|-
| ప్రేమ
| Prema
| రాత్రి 8
| 8PM
|-
|-
| మాటే మంత్రము
| Maate Mantramu
| రాత్రి 8.30
| 8.30PM
|}
|}



==మూలాలు==
==మూలాలు==

13:51, 21 అక్టోబరు 2019 నాటి కూర్పు

జీ తెలుగుZee Telugu
దేశంభారతదేశం
కేంద్రకార్యాలయంహైదరాబాద్, తెలంగాణా, భారతదేశం
యాజమాన్యం
యజమానిజీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్
లభ్యత

జీ తెలుగు , తెలుగు కేబుల్ టెలివిజన్ లో ప్రసారమయ్యే ఒక చానెల్. ఈ చానెల్ భారతదేశానికి చెందినది. ఎస్సల్ గ్రూప్ కు చెందిన జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ ఈ చానెల్ ను సమర్పిస్తోంది.[1]

స్థాపన

2004 నాటికి, జీ నెట్వర్క్ ఉత్తర, తూర్పు, పడమర భారతదేశ భాగాల్లో తనదైన ముద్ర వేసింది. అప్పటికే బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, పంజాబీ వంటి భాషల్లో తన చానెళ్ళను ఏర్పాటు చేసింది. దక్షిణ భారత ఎంటర్టైన్మెంట్ మార్కెట్ లోకి తమ ప్రయాణాన్ని తెలుగు తో మొదలుపెట్టాలన్నారు. అసలు ఆగస్టు 2004లోనే తెలుగు చానెల్ ప్రారంభించాలని ఆ సంస్థ భావించింది,[2] కానీ ఆగస్టు దాకా లాంచ్ చేయడం కుదరలేదు.[3] నిజానికి ముందు ఈ చానెల్ పేరు ఆల్ఫా టీవీ తెలుగు అని పెట్టినా, తరువాత జీ తెలుగుగా పేరు మార్చారు. మొదట్లో అమెరికాకు చెందిన పలు సినిమాలను తెలుగులో డబ్బింగ్ చేసేది ఈ సంస్థ. ఆగస్టు 2007లో, ఈ సంస్థ ప్రముఖ బాలీవుడ్ సినిమా షోలేను తెలుగులోకి అనువాదం చేసింది.[4]

2000 దశాబ్ద చరిత్ర

డిసెంబరు 2005 నాటికి, ఉదయ భాను వ్యాఖ్యాతగా గోల్డ్ రష్(గేమ్ షో), నిశ్శబ్దం అనే ధారావాహిక ప్రసారమయ్యేవి. ఆంధ్రప్రదేశ్ మార్కెట్లో వారపు రోజుల్లో 1.24%, వారాంతాల్లో 1.86% షేర్ మాత్రమే సాధించగలిగింది. దాంతో, లక్ష్యాన్ని మాస్ ప్రేక్షకుల నుంచీ యువ ప్రేక్షకులకు మార్చుకుని, కొత్త కార్యక్రమాలను రూపొందించింది.[3][5] ఈ నెట్వర్క్, 2007కు గానూ దాదాపు 460 మిలియన్ రూపాయల నష్టాన్ని భరించింది.[1]

2006 ఆఖర్లో, జీ తెలుగు చానెల్ స రి గ మ ప అనే తెలుగు సంగీత పోటీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. నంది అవార్డు గ్రహీత గాయని సునీత ఉపద్రష్ట వ్యాఖ్యాతగా, ప్రముఖ సంగీత దర్శకులు కోటి, రమణ గోగులలు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమం 35 ఎపిసోడ్ల పాటు ప్రసారం చేశారు.[6] ఈ కార్యక్రమం ఎంత విజయవంతమైంది అంటే ఫిబ్రవరి 2007లో 6-13 ఏళ్ళ వయసు గల చిన్నపిల్లల సంగీత పోటీ కార్యక్రమం లిటిల్ చాంప్స్ కార్యక్రమాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ఇండియన్ ఐడెల్ రన్నర్ అప్ కారుణ్య వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.[7]

మీ ఇంటి వంట, అనే వంట కార్యక్రమాం, 1000 ఎపిసోడ్లు ప్రసారమైంది. ఈ కార్యక్రమానికి సుమలత వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఈ కార్యక్రమం మహిళా ప్రేక్షకులను బాగా ఆకర్షించింది. అంతే కాక, మధ్యాహ్న సమయంలో ఈ కార్యక్రమాన్ని ఎక్కువగా చూడటంతో, టీఆర్పీ కూడా బాగా పెరిగింది. దీంతో మిగిలిన చానెల్స్ కూడా వంట కార్యక్రమాలను మొదలుపెట్టేంతగా ఈ కార్యక్రమం విజయవంతమైంది.

జీ తెలుగులో విజయవంతమైన మరో కార్యక్రమం మిడ్ నైట్ మసాలా. ఈ కార్యక్రమంలో సినిమాల్లో వచ్చే పెద్దల సన్నివేశాలూ, పాటలు వేసేవారు. రాత్రి 12 గంటలకు ప్రసరమయ్యే ఈ కార్యక్రమానికి 2.0 టీఆర్పీ వచ్చింది. ఆ సమయానికి ప్రసారమయ్యే కార్యక్రమాలకు వచ్చే టీఆర్పీ కన్నా ఇది ఎంతో ఎక్కువ. ఇప్పటికీ ఆ స్లాట్ లో ఏ తెలుగు షోకూ అంత టీఆర్పీ రాకపోవడం విశేషం. ఈ కార్యక్రమం 2007 డిసెంబరు - 2008 డీసెంబరు మధ్య ప్రసారమైంది. అయితే ఈ కార్యక్రమం చాలా రెచ్చగొట్టే విధంగా ఉందనీ, ఇంత పెద్దల కంటెంట్ సామాన్య టీవీలో రావడం మంచిది కాదని కొందరు చేసిన విమర్శల వల్ల ఆపేశారు.

ఆ తరువాతి కాలంలో శ్రీకరం శుభకరం అనే జాతక సంబంధ లైవ్ కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సిద్ధాంతి వక్కంతం చంద్రమౌళి రోజూవారి జాతకాలు చెప్పగా, సుమలత వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఆ తరువాత మిగిలిన చానెళ్ళు కూడా జాతక సంబంధ కార్యక్రమాలు మొదలుపెట్టడం విశేషం.

సెప్టెంబరు 2005లో, ఎన్నో తర్జనభర్జనల తరువాత తమ చానెల్ ప్రధాన నిర్వాహణ అధికారిగా సంజయ్ రెడ్డిని ప్రకటించింది. సంజయ్ అంతకు ముందు వాల్ట్ డిస్నీ సంస్థలోనూ, పెర్ల్ మీడియాలోనూ పని చేశాడు. అంతకు కొన్ని నెలల ముందే అజయ్ కుమార్ ఈ సంస్థను వీడటంతో సంజయ్ ను నిర్వాహణాధికారిగా ప్రకటించింది ఈ సంస్థ.[8] 2008లో సంజయ్ కొత్త సీరియళ్ళనూ, చిన్నపిల్లల కార్యక్రమాలనూ ప్రారంభించాడు.[9]

2010 తరువాత

మే 22, 2015న, జీ తెలుగు 10 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా వేడుకలు జరుపుకుంది.

15 అక్టోబరు 2017న, మిగిలిని అన్ని జీ చానెళ్ళతో పాటుగా, నీలం రంగు లోగోను మార్చుకుంది.

డిసెంబరు 31, 2017న, జీ తెలుగు తన సోదర చానెల్ జీ సినిమాలును మొదలుపెట్టింది. ఈ చానెల్ ను చిరంజీవి జీ గోల్డెన్ అవార్డ్స్ లో ప్రారంభంచాడు. అలాగే సమంతను బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించారు.

ప్రస్తుతం ప్రసారమవుతున్న కార్యక్రమాలు

ధారావాహికలు

సోమ-శని

పేరు ప్రసార సమయం
గంగ మంగGanga Manga మధ్యాహ్నం 12.30
రక్త సంబంధం మధ్యాహ్నం 1
గుండమ్మ కథ మధ్యాహ్నం 1.30
నిన్నే పెళ్ళాడతా మధ్యాహ్నం 2
బంగారు గాజులు మధ్యాహ్నం 2.30
ముద్ద మందారం సాయంత్రం 6
అత్తారింట్లో అక్కా చెల్లెలు సాయంత్రం 6.30
రాధమ్మ కూతురు రాత్రి 7
రామ సక్కని సీత రాత్రి 7.30
ప్రేమ రాత్రి 8
మాటే మంత్రము రాత్రి 8.30

మూలాలు

  1. 1.0 1.1 Das, Sibabrata (6 జూలై 2006), "Zee Tele's stock soars on ratings upswing, future prospects", IndianTelevision.com, retrieved 21 మార్చి 2008
  2. Kurmanath, K.V. (15 జూన్ 2007), "Zee's Telugu channel likely in August", Business Line, retrieved 21 మార్చి 2008
  3. 3.0 3.1 "Zee Telugu identifies key properties; to launch telefilm band in January", IndianTelevision.com, 15 డిసెంబరు 2007, retrieved 21 మార్చి 2008
  4. "Get set for Sholay in Telugu", The Hindu, 27 ఆగస్టు 2005, retrieved 21 మార్చి 2008
  5. Singh, T. Lalith (2 జూలై 2007), "Get set for 'Gold Rush'", The Hindu, retrieved 21 మార్చి 2008
  6. "A talent hunt for singers", The Hindu, 31 అక్టోబరు 2006, retrieved 21 మార్చి 2008
  7. "It's 'no acting, only singing' for Karunya; To anchor a music show on a Telugu television channel soon", The Hindu, 20 ఫిబ్రవరి 2007, retrieved 21 మార్చి 2008
  8. Singh, T. Lalith (17 సెప్టెంబరు 2007), "Zee Telugu has a new CEO out of the box", The Hindu, retrieved 21 మార్చి 2008
  9. Singh, T.L. (4 జనవరి 2008). "Zee Telugu on a roll out of the box". The Hindu. Retrieved 20 మార్చి 2008.
"https://te.wikipedia.org/w/index.php?title=జీ_తెలుగు&oldid=2762253" నుండి వెలికితీశారు