అక్కిరాజు సుందర రామకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శతక సాహిత్యం
పంక్తి 42: పంక్తి 42:


==శతక సాహిత్యం==
==శతక సాహిత్యం==
# కృత్తివాస శతకం
# కృత్తివాస శతకం- [[File:Akkiraju Invitation.jpg|thumb|Akkiraju Book inauguration Invitation]]


==సంగీతం==
==సంగీతం==

12:48, 3 నవంబరు 2019 నాటి కూర్పు

అక్కిరాజు సుందర రామకృష్ణ
జననంఏప్రిల్ 23, 1949
నరసారావుపేట,
గుంటూరు జిల్లా
వృత్తినటుడు, రచయిత, వక్త
తల్లిదండ్రులు
  • రామయ్య (తండ్రి)
  • అన్నపూర్ణమ్మ (తల్లి)

అక్కిరాజు సుందర రామకృష్ణ (ఏప్రిల్ 23, 1949) పద్యకవి, రంగస్థల సినిమా నటుడు, గాయకుడు, అధ్యాపకుడు, మంచి వక్త.[1]

జీవిత విశేషాలు

అక్కిరాజు సుందర రామకృష్ణ తండ్రి అక్కిరాజు రామయ్య. తల్లి అన్నపూర్ణమ్మ. ఆయన గుంటూరు జిల్లా నరసారావుపేట లో 23 ఏప్రిల్ 1949లో జన్మించాడు. ప్రముఖ రచయిత అక్కిరాజు రమాపతిరావు ఈయన సోదరుడు. మరొక సోదరుడు అక్కిరాజు జనార్ధనరావు పేరుపొందిన జర్నలిస్ట్‌. నరసారావుపేటలో డిగ్రీ వరకు చదివిన సుందర రామకృష్ణ హైదరాబాద్‌లో ఎం.ఎ., ఎం.ఓ.ఎల్.,ఎం.ఫిల్ చేశాడు. తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి వేంకటపార్వతీశకవులు - రామాయణ పద్యకృతులు అనే అంశం పై ఇరివెంటి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నాడు. థియేటర్ ఆర్ట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేశాడు. తెలుగు సంస్కృతం ఆంగ్లం కలిపి నూతన మణిప్రవాళ భాషను సృష్టించినవాడు. సందర్భోచితంగా ఉర్దూ పదాలు కూడా మస్తుగా వాడుకున్నాడు.

సాహిత్యం

అమ్మతోడు, కేశవామాధవా, కోనేటి రాయనికి, బాపూరమణా, తేనీటి విందు, కవీశ్వరా, శంకరనారాణీయము,రాజేశ్వరీ శతకము,శ్రీ శనీశ్వర శతకము,అమెరికాలో కవిసుందర్ - శ్యామసుందర్, కవితాశరథి దాశరథి,ఆంజనేయ శతకం, భీమన్న, భీమలింగ శతకం మొదలైన కావ్యాలు వ్రాశాడు.

శతక సాహిత్యం

  1. కృత్తివాస శతకం-
    Akkiraju Book inauguration Invitation

సంగీతం

బాల్యం నుండే నటన గానం పట్ల మక్కువ చూపేవాడు. ఈలపాట రఘురామయ్య, సూరిబాబు, ఘంటసాల వెంకటేశ్వరరావు మొదలైన వారిని అనుకరించేవాడు. ఈయన గొప్ప గాయకుడే కాక మంచి సంగీతదర్శకుడు కూడా. లక్ష్మీనరసింహ సుప్రభాతం, బాసర సరస్వతీవైభవం, శ్రీకృష్ణరాయబారం, షిర్డీసాయి సుప్రభాతం, గణేశ సుప్రభాతం, వేంకటేశ్వర స్తుతి, క్రీస్తు రక్షకా మొదలైన సి.డి.లను కూర్చి విడుదల చేశాడు. ఆలిండియా రేడియో, దూరదర్శన్‌లలో ఏ గ్రేడ్ డ్రామా ఆర్టిస్ట్ గా వున్నాడు.

సినిమా రంగం

వందకు పైగా సినిమాలలో నటించాడు. మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ముఠామేస్త్రి చిత్రంలో అక్కిరాజు గవర్నర్‌గా నటించాడు. ఠాగూర్‌ సినిమాలో ప్రిన్సిపాల్‌గా కనిపించాడు. నాగార్జున నటించిన శివ సినిమాలో లెక్చరర్‌గా, ఎగిరే పావురమా చిత్రంలో సంగీతకారునిగా ఆయన నటించి అందరినీ మెప్పించాడు.

టి.వి./నాటకరంగం

ఆదికవి నన్నయ్య, శ్రీనాథ కవిసార్వభౌమ, అల్లసాని పెద్దన, తెనాలి రామకృష్ణ మొదలైన పాత్రలను టీవీ సీరియళ్ళలో పోషించాడు. పౌరాణిక నాటకాలలో శ్రీకృష్ణుడు, బిల్వమంగళుడు, భరతుడు, కాళిదాసు, అర్జునుడు మొదలైన పాత్రలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. శ్రీకృష్ణతులాభారం నాటకంలో ప్రముఖసినీనటి జమునతో కలిసి అనేక ప్రదర్శనలలో నటించాడు. జెమిని టీవీలో, తేజ టీవీఛానల్‌లో పెళ్లిపందిరి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. తి.తి.దే.బ్రహ్మోత్సవాలకు సుమారు 15 సంవత్సరాలపాటు వ్యాఖ్యానం చేశాడు.

అధ్యాపకుడిగా

2005లో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా ఉత్తమ అధ్యాపకుడిగా పురస్కరింపబడినాడు. ఇంటర్ మీడియెట్ తెలుగు పాఠ్యపుస్తకాలలో పాఠాలను తయారు చేశాడు. 2007లో లెక్చరర్‌గా పదవీ విరమణ చేశాడు.

బిరుదులు

  • కవితాగాండీవి
  • నాట్యశ్రీనాథ
  • అభినవ తెనాలిరామకృష్ణ
  • అభినవ ఘంటశాల
  • పద్యవిద్యామణి
  • కళాప్రవీణ
  • వశ్యముఖి

మూలాలు

ఇతర లింకులు