పడుకున్న భంగిమలో ఉన్న బుద్ధుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Created page with 'File:Paranirvana.JPG|thumb|మహాపరినిర్వాణం చెందిన బుద్ధుడు, గాంధార కళాచిత్ర...'
(తేడా లేదు)

15:47, 7 డిసెంబరు 2019 నాటి కూర్పు

మహాపరినిర్వాణం చెందిన బుద్ధుడు, గాంధార కళాచిత్రం, 2వ లేదా 3వ శతాబ్దం
గల్విహారలో పడుకున్న భంగిమలో ఉన్న బుద్ధుడు(శ్రీలంక, 12వ శతాబ్దం)

పడుకున్న భంగిమలో ఉన్న బుద్ధుడు బౌద్ధమత కళలో చాలా ప్రాముఖ్యత ఉన్న ఆకృతి. ఈ ఆకృతిలో బుద్ధుడు నిద్రపోతున్నట్టు భూమికి వాలి, ఒక పక్కకు తిరిగి పడుకున్నట్టు ఉంటుంది. ఇది బుద్ధుని జీవితంలోని ఆఖరి రోజుల్లో ఆరోగ్యం విషమించినప్పుడు శరీరం వదిలివేసే(మహాపరినిర్వాణం) అవస్థకు ముందున్న పరిస్థితిని చూపిస్తుంది.[1] ఈ ఆకృతిలో బుద్ధుడు తన కుడివైపుకి తిరిగి, కుడి చేతిని తల కింద ఆధారంగా చేసుకొని పడుకుని ఉంటాడు. బుద్ధుడి మరణం తరువాత, అతని అనుచరులు బుద్ధుడు శయనావస్థలో ఉన్న విగ్రహాన్ని రూపొందించాలని అనుకున్నారు.మొదటగా అలాంటి విగ్రహాన్ని వాట్ ఫొ లో తయారు చేసి, కాలక్రమేణా ఆగ్నేయ ఆసియాలోని అన్ని ప్రాంతాలలో ఈ భంగిమలో విగ్రహాలు ప్రతిష్ఠించడం ఒక పోకడగా మారింది.


థాయి చిత్రకళలో

థాయి బౌద్ధ చిత్రకళలో పడుకున్న భంగిమలో ఉన్న బుద్ధుడు, బుద్ధుని జీవితానికి సంబంధించిన మూడు ఘట్టాలను గురించి అయి ఉండవచ్చు.

  • నిర్వాణ స్థితి (ปางปรินิพพาน; పాంగ్ పరి నిప్ఫన్)
  • అసురుడైన రాహుకు బోధ చేస్తున్న స్థితి (ปางโปรดอสุรินทราหู; పాంగ్ ప్రోడ్ అసురిన్ త్రా రాహు)
  • నిద్రా స్థ్తి (ปางทรงพระสุบิน; పాంగ్ సొంగ్ ఫ్రా సుబిన్)

కొన్ని ఉదాహరణలు

ఝాంగ్యె దేవాలయంలో నిద్రావస్థ బుద్ధుడు
హ్పొ విన్ గుహలలో నిద్రావస్థ బుద్ధుడు
క్రేటీ నిద్రావస్థ బుద్ధుడు
కాంబోడియాలోని సంబొక్ పర్వతంపై బంగారు తాపడం చేసిన నిద్రావస్థ బుద్ధుడు[2]
కంగోబిజి
దస్త్రం:Reclining Buddha statues of Nanzoin.jpg
నన్‌జైన్

బర్మా:

  • మవ్లమ్యైంగ్ లో ఉన్న విన్‌సీయిన్ తవ్యా బుద్ధుడు - 182.9 metres (600 ft)[3]
  • మొనైవాలో ఉన్న థన్‌బొద్ధాయ్ పగోడా - 101 metres (331 ft)[3]
  • బాగో లోని మైయతల్యౌంగ్ బుద్ధుడు - 82 metres (269 ft)[3]
  • దవెయ్ లో ఉన్న లౌక తరహ్పు బుద్ధుడు - 73.6 metres (241 ft)[3]
  • యాంగన్ లో ఉన్న చౌఖ్తత్గై బౌద్ధాలయం - 66 metres (217 ft)[3]
  • బాగో లోని శ్వేతల్యౌంగ్ బుద్ధుడు - 54.8 metres (180 ft)[3]
  • బాగన్ లోని మనూహా దేవాలయం
  • మొనైవా దగ్గర ఫొవింతౌంగ్

కాంబోడియా:

  • అంగ్ కోర్ వాట్ లోని బఫువాన్ లో పశ్చిమ భాగం
  • ఫ్నొం కులెన్ లో ఎడమ వైపుకు పడుకుని ఉన్న ఏకశిలా బుద్ధుడు
  • క్రేటీ ప్రావిన్స్ లో బంగారు తాపడం చేసిన బుద్ధుడు, సంబొక్ పర్వతం పై (కుడివైపుకు ఆని ఉన్న విగ్రహం)

చైనా

  • ఝాంగ్యె లోని డఫొ దేవాలయం

పాకిస్తాన్:

  • భమల బుద్ధ పరినిర్వాణ, 1800 ఏళ్ళ పాతది. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైనది. [4]

భారతదేశం:

ఇండోనేషియా:

  • తూర్పు జావాలోని త్రొవులాన్ లో మహా విహార మొజొపహిత్

జపాన్

  • కోయా పర్వతంపై కొంగోబూజీ
  • నన్‌జొయిన్ దేవాలయం, ఫుకుఒక లో.

మలేషియా:

  • పెనాంగ్ లోని వాట్ ఛాయమంగ్కలరం
  • పెరాక్ లోని సాం పొహ్ తొంగ్ దేవాలయం
  • కెలంతన్ లోని తుంపాత్ లో ఉన్న వాట్ ఫొథివిహన్

శ్రీలంక:

  • దంబుల్లా
  • గల్విహార (12వ శతాబ్దం)

తజికిస్తాన్:

  • దుషాన్బె లోని తజికిస్తాన్ జాతీయ సంగ్రహాలయంలో ఉన్న 13 మీటర్ల పొడవు ఉన్న బుద్ధుడి విగ్రహం. అజిన-తెప లో కనుగొన్నది.

థాయిలాండ్:

  • వాట్ ధమ్మచక్సెమరం లో ఉన్న 7వ శతాబ్దానికి చెందిన శయనావస్థ బుద్ధుడు. ద్వారావతి శైలిలో ఉంది.
  • అయుథ్థయ లో ఉన్న వాట్ లొకాయా సుతరం
  • బ్యాంగ్కాక్ లో ఉన్న వాట్ ఫొ

మూలాలు

  1. "మహాపరినిర్వాణం గురించిన ప్రవచన పాఠ్యం" (PDF). www.themindingcentre.org. p. 140. Retrieved 2018-12-07.
  2. "కాంబోడియా పర్యాటక వ్యాసంలో వివరాలు".
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 మా తనేజీ (February 2014). "చౌఖ్తత్గై బౌద్ధాలయంలో పడుకొని ఉన్న భంగిమలోనున్న బుద్ధుడి ఆకృతి" (PDF). మై మ్యాజికల్ మయాన్మార్. Archived from the original (PDF) on 4 March 2016. Retrieved 19 July 2015.
  4. "http://www.dawn.com/news/1264290". {{cite web}}: External link in |title= (help)

బయటి లంకెలు

Media related to పడుకున్న భంగిమలో ఉన్న బుద్ధుడి విగ్రహాల ఫోటోలు at Wikimedia Commons