శ్రీకూర్మం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి బాటు:మండల గ్రామాల మూస అతికించా
పంక్తి 3: పంక్తి 3:


శ్రీ కాకుళం నుండి 15 కి.మీ. దూరం గల శ్రీకూర్మంలో "కూర్మనాధ స్వామి" మందిరం ఉంది. [[శ్రీమహావిష్ణువు]] [[కూర్మావతారం]] రూపంలో ఇక్కడ పూజింపబడుతాడు. భారతదేశంలో ఈ మాదిరిగా కల కూర్మావతారం మందిరం ఇదొక్కటే. ఈ మందిరం శిల్పకళాశైలి విశిష్టమైనది. చిత్రంగా ఇక్కడి స్వామి పడమటి ముఖముగా ఉంటారు. మరొక విశేషం ఈ ఆలయంలో రెండు ధ్వజస్థంభాలు గలవు. 11వ శతాబ్దం కాలం నాటి శాసనాలు ఇక్కడ లభించాయి. దీనితో పాటు [[రామానుజాచార్యుడు|శ్రీరామానుజాచార్యుల]], [[శ్రీ వరదరాజస్వామి]], [[మధ్వాచార్యుడు|శ్రీ మధ్వాచార్యుల]], కోదండరామస్వామి వారల ఆలయాలు గలవు.
శ్రీ కాకుళం నుండి 15 కి.మీ. దూరం గల శ్రీకూర్మంలో "కూర్మనాధ స్వామి" మందిరం ఉంది. [[శ్రీమహావిష్ణువు]] [[కూర్మావతారం]] రూపంలో ఇక్కడ పూజింపబడుతాడు. భారతదేశంలో ఈ మాదిరిగా కల కూర్మావతారం మందిరం ఇదొక్కటే. ఈ మందిరం శిల్పకళాశైలి విశిష్టమైనది. చిత్రంగా ఇక్కడి స్వామి పడమటి ముఖముగా ఉంటారు. మరొక విశేషం ఈ ఆలయంలో రెండు ధ్వజస్థంభాలు గలవు. 11వ శతాబ్దం కాలం నాటి శాసనాలు ఇక్కడ లభించాయి. దీనితో పాటు [[రామానుజాచార్యుడు|శ్రీరామానుజాచార్యుల]], [[శ్రీ వరదరాజస్వామి]], [[మధ్వాచార్యుడు|శ్రీ మధ్వాచార్యుల]], కోదండరామస్వామి వారల ఆలయాలు గలవు.

<gallery>
Image:Entrance View Srikurmam Temple Srikakulam dist..jpg‎ |శ్రీకూర్మాం ఆలయ ముఖద్వారము.
Image:Inside corridor Srikurmam Temple Srikakulam dist-.jpg|గుడి లోపల ప్రదక్షిణ చేయు ఖాలీ ప్రదేశము (కారిడార్).
Image:Inside corridor Srikurmam Temple Srikakulam dist..jpg‎|గుడి లోపల ప్రదక్షిణ చేయు ఖాలీ ప్రదేశము (కారిడార్)2.
Image:OutSideWall Design Srikurmam Temple Srikakulam dist..jpg‎|శ్రీకూర్మాం గుడి బయటి గోడ శిల్పకళా నైపుణ్యము.
Image:Srikurmam - rajagopuram.jpg‎|శ్రీకూర్మాం గుడి రాజగోపురము.
Image:Srikurmama Temple Pillar Srikakulam dist..jpg‎|శ్రీకూర్మాం గుడి లోపల స్థంభం(పిల్లర్)ఏక శిల తో తయారయినది.
Image:Puskarini123.jpg|శ్రీకూర్మాం ఆలయ శ్వేత పుస్కరిణి.
</gallery>


==స్థలపురాణము==
==స్థలపురాణము==

01:51, 18 మార్చి 2008 నాటి కూర్పు

శ్రీకూర్మం, శ్రీకాకుళం జిల్లా, గార మండలానికి చెందిన గ్రామము.

శ్రీ కాకుళం నుండి 15 కి.మీ. దూరం గల శ్రీకూర్మంలో "కూర్మనాధ స్వామి" మందిరం ఉంది. శ్రీమహావిష్ణువు కూర్మావతారం రూపంలో ఇక్కడ పూజింపబడుతాడు. భారతదేశంలో ఈ మాదిరిగా కల కూర్మావతారం మందిరం ఇదొక్కటే. ఈ మందిరం శిల్పకళాశైలి విశిష్టమైనది. చిత్రంగా ఇక్కడి స్వామి పడమటి ముఖముగా ఉంటారు. మరొక విశేషం ఈ ఆలయంలో రెండు ధ్వజస్థంభాలు గలవు. 11వ శతాబ్దం కాలం నాటి శాసనాలు ఇక్కడ లభించాయి. దీనితో పాటు శ్రీరామానుజాచార్యుల, శ్రీ వరదరాజస్వామి, శ్రీ మధ్వాచార్యుల, కోదండరామస్వామి వారల ఆలయాలు గలవు.

స్థలపురాణము

దక్షిణ సముద్ర తీరమున శ్వేతపురమనే పట్టణమును శ్వేతచక్రవర్తి పరిపాలించేవాడు. ఆయనకు విష్ణుప్రియ అనే భార్య ఉండేది. ఆమె మహా విష్ణు భక్తురాలు. ఆమె ఒకనాటి ఏకాదశి వ్రత దీక్షలో ఉండగా ఆమె భర్త అయిన శ్వేతమహారాజు కామమోహితుడై ఆమె వద్దకు వచ్చెను. అప్పుడు విష్ణుప్రియ భర్తను సాదరంగా ఆహ్వానించి, కూర్చుండబెట్టి, పూజా మందిరానికి పోయి విష్ణువును ధ్యానించి, స్వామీ! అటు నా భర్తను కాదనలేను, ఇటు నీ వ్రతమును భంగపడనివ్వలేను. నువ్వే నన్ను రక్షించమని పరిపరి విధముల వేడుకొంది. స్వామీ! కూర్మరూపమున భూమిని ధరించలేదా? అట్లే నన్ను ఆదుకోమని ప్రార్థించింది. శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చి, అక్కడనే గంగను ఉద్భవింపజేసెను. ఆ గంగ మహా ఉదృతంగా రాజు వేపు రాగా మహారాజు భయంతో పరుగిడి ఒక పర్వతము మీదకు చేరి తమ మంత్రిని విషయము అడుగగా, ఆతను రాజుకు విషయమంతా వివరించెను.


అప్పుడు రాజు పశ్చాతాపంతో మరణమే తన పాపమునకు ప్రాయశ్ఛిత్తమని తలచి, శ్రీమహా విష్ణువును ధ్యానించుచుండెను. అప్పుడు నారదుడు అటుగా వచ్చి, రాజును విషయమడుగగా, రాజు తన బాధను వివరించెను. అప్పుడు నారదుడు రాజుకు శ్రీకూర్మ మంత్రమును ఉపదేశించి దీక్షతో ధ్యానించమని చెప్పెను. ఈ గంగా ప్రవాహము వంశధార అను పేరుతో సాగరములో లీనమగునని, ఇది సాగరసంగమ ప్రదేశమని చెప్పెను. రాజు వంశధారలో స్నానమాచరించి, అక్కడే వెలసి ఉన్న జ్ఞానేశ్వరుని మరియు సోమేశ్వరుని పూజించి, ఘోర తపస్సు చేసినా, మహానిష్ణువు కరుణించలేదు. అప్పుడు నారదుడు కూడా స్వామిని ప్రార్థించి రాజుకు దర్శనమివ్వవలసిందిగా కోరగా శ్రీమహావిష్ణువు, కూర్మావతారంలో చక్రతీర్థగుండము నుండి వెలువడి, శ్వేతమహారాజుకు దర్శనమిచ్చెను. స్వామి నాలుగు చేతులతో, శంఖము, చక్రము, గద మరియు పద్మము లు ధరించి ఉన్నాడు. రాజు స్వామిని వేడి అక్కడ కొలువై ఉండుమని ప్రార్ధింపగా శ్రీమహావిష్ణువు కొలువై ఉండేందుకు తనకు తగిన మంచి స్థానమునకై రాజు మరియు నారదునితో కలసి ఒక వటవృక్షము వద్దకు వచ్చి, ఆవృక్షముపై చక్ర ప్రయోగము చేసెను. అక్కడ క్షీర సమానమైన జలము ఉద్భవించెను. ఈ గుండమునే కూర్మగుండము లేక శ్వేత గుండము అంటారు. చక్రము వెళ్ళిన మార్గము నుండి శ్రీమహాలక్ష్మి ప్రత్యక్షమై, స్వామివారి వామభాగము నందు వసించెను. అంత శ్రీకూర్మనాధుడు లక్ష్మీ సమేతుడై అక్కడనే నిత్యనివాసమేర్పరుచుకొనెను.


ఒకనాడు అటుగా వచ్చిన ఒక కిరాత స్త్రీ కూర్మగుండములో దాహముతీర్చుకొని, శ్రీకూర్మనాథుని దర్శించుకొని, తన భర్త అయిన భిల్లురాజుకు ఈ విషయము తెలుపగా, ఆతను వచ్చి చూడగా ఆ గుండముపైన చక్రాకారములో తేజము కనుపించెను. ఆ వెలుగు క్రమముగా కూర్మనాథుని ఆకృతిని దాల్చెను. భిల్లురాజు ఆశ్చర్యముగా ఆ స్వామిని చూస్తూ,మహాపురుషుడా లేక ఏదైనా విచిత్ర జలచరమా అని ఆలోచిస్తుండగా, అక్కడకు వచ్చిన శ్వేతమహారాజు, నీ పూర్వపుణ్యమున శ్రీమన్నారాయణుడు, కూర్మరూపములో నీకు సులభముగానే దర్శనమిచ్చాడు అని చెప్పెను. అంత భిల్లురాజు సంతోషముతో స్వామిని పూజించెను. స్వామి సంతోషించి, భిల్లురాజును కూర్మగుండమునకు కట్టడము, సోపానములు కట్టించవలసిందిగానూ , శ్వేతమహారాజును దేవాలయ నిర్మాణము గావించవలసిందిగానూ ఆజ్ఞాపించెను. వారట్లే చేసిరి. భిల్లురాజును, స్వామి, పశ్చిమదిక్కుగా సదంగ మహాముని ఆశ్రమ సమీపములో నివాసమేర్పరుచుకోమని ఆజ్ఞాపించెను. అంతట భిల్లురాజు, తనవైపు ఎల్లప్పుడూ కరుణాదృష్టితో చూస్తూ ఉండమని స్వామిని వేడుకొనెను. శ్రీకూర్మనాథుడు అట్లే ఆభిల్లురాజుకు వరమిచ్చెను. అప్పటినుండి స్వామి పశ్చిమాభిముఖుడుగా తిరిగెను.


ఒకనాడు నారదుడు కూర్మనాథుని సేవించుటకు రాగా, శ్వేతమహారాజు, స్వామిని అర్చారూపమున ఆరధించుటకు ఏ మంత్రముతో ప్రతిష్ఠించవలెనని అడిగెను. అంతట నారదుడు, బ్రహ్మదేవుని కోరగా బ్రహ్మదేవుడే శ్రీకూర్మనాథుని, సుదర్శన మంత్రముతో ప్రతిష్ఠించెను. అప్పుడు స్వామి అగ్నిజ్వాలలచే భయంకరముగా ప్రకాశిస్తున్న శ్రీకూర్మనాథుని చూసి దేవతలందరూ భయకంపితులైరి. అప్పుడు శ్వేతమహారాజు ,స్వామిని, గోపాలమంత్రంతో ప్రతిష్ఠించవలసిందిగా బ్రహ్మను కోరగా, బ్రహ్మదేవుడు అట్లే శ్రీకూర్మనాథుని గోపాలమంత్రంతో పునహ ప్రతిష్ఠచేసెను. అప్పుడు స్వామి శాంతరూపములో దర్శనమిచ్చి, తనకు నారాయణ మంత్రముతో అభిషేకము, సంకర్షణ మంత్రముతో వస్త్ర సమర్పణ, వాసుదేవ మంత్రముతో ఏక హారతి, అనంత మంత్రముతో ధూపము, పద్మనాభ మంత్రముతో పంచహారతి సమర్పించవలెనని బ్రహ్మకు చెప్పగా, బ్రహ్మ స్వామిని అట్లే ఆరాధించెను. శ్రీకూర్మనాథుడే ప్రాకారాది దేవతా స్థాపనకు ఆజ్ఞనిస్తూ, తూర్పున పార్వతీ సమేతంగా శివుని, ఆగ్నేయమున నరశింహుని, దక్షణమున గోపాలమూర్తిని, నైరుతి దిక్కున వైకుంఠనాథుని, వాయువ్యమున వైష్ణవీ దుర్గను, ఆమెకు ముందు భాగమున విశ్వక్షేసులను, తరువాత అనంతుని స్థాపించమనగా, బ్రహ్మ అట్లే చేసెను.


తిలోత్తమ స్వర్గము నుండి శ్రీకూర్మనాథుని పూజించుటకు వచ్చి అక్కడనే ఉండిపోయింది. బ్రహ్మ, స్వామికి నివేదించిన ప్రసాదము ఆమెకు లభించకపోవుటచే దుఖితురాలై, వక్రాంగ మహామునిని ఆశ్రయించగా, ఆయన, తిలోత్తమకు నారశింహమంత్రమును ఉపదేశించెను. ఆమె ఆమంత్రముతో తపమాచరించగా, ఆమె కాలిబొటనవ్రేలు దగ్గర ఒక గుండమేర్పడింది. అందుండి, శ్రీకూర్మనాథుడు, నరశింహరూపమున ఉద్భవించి, ఆమెకు దర్శనమిచ్చెను. తిలోత్తమ ఆనందంతో స్వామిని అక్కడ అట్లే వెలయవలసిందిగా కోరగా స్వామి అక్కడ అలాగే వెలసెను. ఆకుండము, నరసింహతీర్థమని, అక్కడ వెలసిన స్వామి, పాతాళ నరసింహుడని అందురని స్వామి చెప్పెను. అంత తిలోత్తమ తనకు ప్రసాదము లభించలేదని వివరించగా స్వామి ఆమె భక్తికు మెచ్చి, తన ప్రసాదముపై శాశ్వత ఆధిపత్యమును ఆమెకు ప్రసాదించెను. అప్పటినుండి స్వామివారి ప్రసాదమును తిలోత్తమే అందరికీ పంచేదట.


పద్మపురాణము నందలి శ్వేతగిరి మహత్యమను ముపయ్యేవ అధ్యాయము లో చెప్పబడిన విశేషముల ప్రకారము:

శ్రీకూర్మక్షేత్రమునకు వంశధారానదీ తీరములో శ్రీకూర్మశైలమను పర్వతము ఉంది. ఇది శ్రీకూర్మనాథుని విరాడ్రూపమని నమ్మకము. క్షేత్రమునకు దక్షిణమున ప్రేతశిల అను పర్వతముంది. ఇక్కడ కౌటిల్యతీర్థముంది. ఈ తీర్థములో స్నానమాచరించి, ప్రేతశిల యందున్న విష్ణుపాదాలపై పిండప్రదానము చేసి కౌటిల్య తీర్థములో పితృతర్పణము చేసిన గయలో శ్రాద్ధము వలన కలుగు ఫలమే లభంచును.ఇక్కడ ఉన్న అష్టతీర్థములందు స్నానముచేసి, శ్రీకూర్మనాథుని కొలుచుట ఒక ఆచారముగా వస్తున్నది. ఇక్క డ ఉన్న చక్రతీర్థము, నారదతీర్థము, కౌటిల్యతీర్థము, మాధవతీర్థము, నరసింహతీర్థము, కూర్మతీర్థము, వంశధార నది, లాంగలీనది మరియు సముద్రము లో మూడురోజులుగానీ, ఎనిమిదిరోజులు గానీ ఈ క్షేత్రములో ఉండి, స్నానములాచరిస్తూ, స్వామిని కొలుచుట ఒక ఆచారము.


ఈ శ్రీకూర్మక్షేత్రము పంచలింగారాధ్యక్షేత్రము (ఐదుగురు శివులు క్షేత్రపాలకులుగా ఉన్న క్షేత్రము) తూర్పున వంశధారాసాగర సంగమ ప్రదేశములో కళింగ పట్టణములో కర్పూరేశ్వరుడు, ఉత్తరమున సింధూర పర్వతమున (సింగుపురపుకొండ) హటకేశ్వరుడు, పశ్చిమమున నాగావళీ తీరమున శ్రీకాకుళ పట్టణములో కోటీశ్వరుడు, ఉత్తరమున (పిప్పల) ఇప్పిలి గ్రామమున సుందరేశ్వరుడు, శ్రీకూర్మక్షేత్రమున సుధాకుండతీరమున సిద్ధేశ్వరుడు వేంచేసి ఉన్నారు. శ్రీకూర్మక్షేత్ర ముఖద్వారమున భైరవుడు, మరియు ఆలయ ప్రాకారమున అష్టదిక్పాలురును క్షేత్రపాలకులై స్వామిని సేవిస్తున్నారు.

మూలాలు

  • బ్రహ్మాండపురాణములో మూడు అధ్యాయములు.
  • పద్మపురాణములో ముప్పది అధ్యాయములు
  • శ్రీ కూర్మనాధ దేవస్థాన ప్రచురణ "శ్రీ కూర్మనాథ క్షేత్ర మహత్మ్యము".


బయటి లింకులు