అప్పుచేసి పప్పుకూడు (1959 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 185: పంక్తి 185:
==బయటి లింకులు==
==బయటి లింకులు==
* [http://www.imdb.com/title/tt0254967/ Appu Chesi Pappu Koodu film at IMDb.]
* [http://www.imdb.com/title/tt0254967/ Appu Chesi Pappu Koodu film at IMDb.]
* [http://www.cinegoer.com/appuchesipappukoodu.htm Appu Chesi Pappu Koodu film review at Cinegoer.com]
* [https://web.archive.org/web/20110629155026/http://www.cinegoer.com/appuchesipappukoodu.htm Appu Chesi Pappu Koodu film review at Cinegoer.com]
* [http://www.musicplug.in/songs.php?movieid=1367 Listen to Appu Chesi Pappu Kudu songs at Music plug.in]
* [http://www.musicplug.in/songs.php?movieid=1367 Listen to Appu Chesi Pappu Kudu songs at Music plug.in]



09:16, 13 జనవరి 2020 నాటి కూర్పు

అప్పుచేసి పప్పుకూడు
(1959 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎల్.వి.ప్రసాద్
నిర్మాణం నాగిరెడ్డి,
చక్రపాణి
చిత్రానువాదం చక్రపాణి,
ఎల్.వి.ప్రసాద్,
వెంపటి సదాశివబ్రహ్మం
తారాగణం నందమూరి తారక రామారావు,
సావిత్రి,
ఎస్.వి.రంగారావు,
కొంగర జగ్గయ్య,
జమున,
రేలంగి వెంకట్రామయ్య,
గిరిజ,
చిలకలపూడి సీతారామాంజనేయులు,
ముక్కామల,
ఆర్.నాగేశ్వరరావు,
రమణారెడ్డి,
సూర్యాకాంతం,
కస్తూరి శివరావు,
అల్లు రామలింగయ్య,
చదలవాడ,
ఇ.వి.సరోజ,
బాలకృష్ణ,
నల్ల రామమూర్తి
సంగీతం ఎస్.రాజేశ్వరరావు
నేపథ్య గానం ఘంటసాల,
పి.లీల,
ఎ.ఎం.రాజా,
పి.సుశీల,
స్వర్ణలత
నృత్యాలు పసుమర్తి కృష్ణమూర్తి
గీతరచన పింగళి నాగేంద్రరావు
సంభాషణలు వెంపటి సదాశివబ్రహ్మం
ఛాయాగ్రహణం మార్కస్ బార్ట్లే
కూర్పు జి.కళ్యాణ సుందరం,కె.రాధాకృష్ణ
నిర్మాణ సంస్థ విజయా ప్రొడక్షన్స్
విడుదల తేదీ జనవరి 14, 1959
నిడివి 176 నిమిషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

అప్పుచేసి పప్పుకూడు విజయా సంస్థ వారి సుప్రసిద్ధ చిత్రాలలో ఒకటి. ఇది ఒక హాస్యరస చిత్రము. ఈ చిత్రములోని దాదాపు అన్నీ పాటలు ప్రసిధ్ధి పొందాయి. ఈ సినిమా 1959 జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదలయ్యింది. ఈ చిత్రంతోపాటే తమిళం చిత్రం ‘కదన్ వాంగి కల్యాణం’ ఏక కాలంలో మొదలుపెట్టారు. ఆ చిత్రంలో రాజాగా జెమిని గణేశన్ (ఎన్టీఆర్ వేషం), జగ్గయ్య పాత్రలో టిఆర్ రామచంద్రన్, రేలంగి పాత్రలో తంగవేలు, గిరిజ పాత్రలో ఇ.వి.సరోజ నటించారు. ఎస్.వి.రంగారావు తమిళంలోనూ ముకుందరావుగా నటించగా, సిఎస్సాఆర్ పాత్రలో టిఎస్ బాలయ్య, ఆర్.నాగేశ్వరరావు రౌడీ రాంసింగ్ పాత్రనూ పోషించారు. తమిళ చిత్రానికి మాటలు, పాటలు తాంజై ఎన్.రామదాసు సమకూర్చారు. విజయా సంస్థే రెండు చిత్రాలూ ఏకకాలంలో రూపొందించి ముందుగా తమిళ చిత్రం 1958 సెప్టెంబర్ 17న విడుదల చేసింది. తమిళం, తెలుగులోనూ సావిత్రి, జమునలే వాళ్ల పాత్రలు పోషించారు.

పాత్రలు

పాత్రధారి పాత్ర
నందమూరి తారకరామారావు రాజారావు
సావిత్రి మంజరి
ఎస్వీ రంగారావు దివాన్ బహుద్దూర్ ముకుందరావు
కొంగర జగ్గయ్య రఘు, రామదాసు కొడుకు
జమున లీల (రఘు భార్య / రాజారావు చెల్లెలు)
చిలకలపూడి సీతారామాంజనేయులు రావుబహుద్దూర్ రామదాసు
రేలంగి వెంకట్రామయ్య భజగోవిందం
గిరిజ ఉష
ఆర్.నాగేశ్వరరావు వస్తాదు రామ్‌సింగ్
అల్లు రామలింగయ్య చిదంబరం శెట్టి
ముక్కామల కృష్ణమూర్తి రామదాసు తండ్రి
బాలకృష్ణ అవతారం
చదలవాడ కుటుంబరావు చెంచయ్య
రమణారెడ్డి రామలింగం (ఉష తండ్రి)
సూర్యకాంతం రాజారత్నం (రామలింగం భార్య)
బి.పద్మనాభం పానకాలరావు (అతిథి పాత్ర)
కస్తూరి శివరావు టక్కు
నల్ల రామమూర్తి టిక్కు

సాంకేతిక వర్గం

  • కథ: చక్రపాణి, యల్‌వి ప్రసాద్, వెంపటి సదాశివబ్రహ్మం;
  • మాటలు: సదాశివబ్రహ్మం;
  • పాటలు: పింగళి నాగేంద్రరావు;
  • సంగీతం: ఎస్ రాజేశ్వరరావు;
  • కళ: గోఖలే- కళాధర్;
  • ఫొటోగ్రఫీ: మార్కస్ బారెట్లే;
  • ఎడిటింగ్: కల్యాణ సుందరం, కె రాధాకృష్ణ;
  • నృత్యం: పసుమర్తి కృష్ణమూర్తి;
  • దర్శకత్వం: యల్‌వి ప్రసాద్;
  • నిర్మాతలు: నాగిరెడ్డి, చక్రపాణి

కథాంశం

దివాన్ బహుద్దూర్ ముకుందరావు (ఎస్వీ రంగారావు) లక్షాధికారి, అతని మనుమరాలు మంజరి (సావిత్రి) ఆయన ఆస్తికి ఒక్కగానొక్క వారసురాలు. ముకుందరావుకి తన మనుమరాలిని ఎవరైనా రాజుకిచ్చి పెళ్ళి చేయాలనే కోరిక ఉంటుంది. మంజరి రాజారావు (ఎన్టీఆర్) అనే దేశభక్తుడిని ప్రేమిస్తుంది. రాజారావు చెల్లెలు లీల (జమున). రావుబహుద్దూర్ రామదాసు (చిలకలపూడి సీతారామంజనేయులు) కొడుకైన రఘు (జగ్గయ్య)తో వివాహమయి ఉంటుంది. విచిత్రంగా, రఘుకి లీల ఎలా ఉంటుందో తెలియదు. రఘు పైచదువులు చదువుటకు విదేశాలకు వెళ్తాడు. రామదాసు లీలను ఇంటినుండి తరిమేసి, లీల చనిపోయిందన్న అబద్దపు వార్త రఘుకు తెలుపుతాడు. ఇదంతా రాజారావు ఒక ఉద్యమంలో పాల్గొని చెరసాలకు వెళ్ళినప్పుడు జరుగుతుంది. చెరసాల నుండి విడుదలై రాజారావు తన చెల్లెల్ని తీసుకుని రామదాసు ఇంటికి అతనిని నిలదీయటానికి వెళ్తాడు. కానీ, ఇరువైపువారి పరువు కోసం లీలను మూగ పనిమనిషిలాగా రామాదాసు ఇంట్లో కొన్ని సమస్యలు తొలగిపోయేదాకా ఉండటానికి ఒప్పుకుంటాడు. రామదాసు కొందరి దగ్గర అప్పు చేసి వేరేవారికి అప్పులిస్తుంటాడు. రామదాసు దగ్గర గుమాస్తాగా భజగోవిందం (రేలంగి) పనిచేస్తుంటాడు. భజగోవిందం తన అత్త రాజారత్నం (సూర్యకాంతం) కూతురైన ఉష (గిరిజ)ను ప్రేమిస్తాడు. ఇది రాజారత్నం భర్త రామలింగం (రమణారెడ్డి)కి నచ్చదు, అతను కూతురికి పెళ్ళిచూపులు జరిపిస్తూవుంటే వాటిని భజగోవిందం తన సన్నిహితులతో కలిసి చెడగొట్టుతూ ఉంటాడు. చివరికి భజగోవిందం (రేలంగి) మేనమామ రామలింగం (రమణారెడ్డి) ఆటలుకట్టించి, అతని కూతురు ఉష (గిరిజ)తో భజగోవిందానికి వివాహం నిశ్చయింపచేస్తాడు. పనిమనిషి తన భార్య లీలేనని గ్రహించిన రఘు, రాజాకు సాయపడతాడు. చివరకు అంతాకలిసి ‘రామదాసు’కు బుద్ధివచ్చేలా చేస్తారు. జరిగినదంతా గ్రహించిన ముకుందరావు పేదవాడైనా రాజాకే తన మనుమరాలిని ఇచ్చి వివాహం చేస్తాననటంతో -రామదాసే రాజా, మంజరిల చేతులు కలపుతాడు. కథ శుభంగా ముగుస్తుంది.

పాటలు

పాట రచయిత సంగీతం గాయకులు
అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా, గొప్ప నీతివాక్యమిదే వినరా పామరుడా (శీర్షిక గీతం) పింగళి నాగేంద్రరావు సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల, బృందం
కాలం కాని కాలంలో కోయిల కూతలెందుకనో...కాలం కాని కాలంలో కోయిల కూతలందుకనే పింగళి నాగేంద్రరావు సాలూరు రాజేశ్వరరావు పి.లీల, పి.సుశీల
రామ రామ శరణం, భద్రాద్రి రామ శరణం పింగళి నాగేంద్రరావు సాలూరు రాజేశ్వరరావు పి.లీల
నవకళాసమితిలో నా దేశమును చూసి ఎచ్చటెచ్చటి జనుల్ మెచ్చవలదే...(పద్యం) పింగళి నాగేంద్రరావు సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల
ఎచటినుండి వేచెనో...ఈ చల్లని గాలి పింగళి నాగేంద్రరావు సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల, పి.లీల
సుందరాంగులను చూసిన వేళన పింగళి నాగేంద్రరావు సాలూరు రాజేశ్వరరావు పి.లీల, ఘంటసాల, ఏ.యం.రాజా
జోహారు జైకొనరా, దేవా జోహారు జైకొనరా పింగళి నాగేంద్రరావు సాలూరు రాజేశ్వరరావు పి.లీల
మూగవైన ఏమిలే నగుమోమె చాలులే పింగళి నాగేంద్రరావు సాలూరు రాజేశ్వరరావు ఏ.యం.రాజా
ఓ పంచవన్నెల చిలకా నీకెందుకింత అలక పింగళి నాగేంద్రరావు సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల, స్వర్ణలత
ఆనందం పరమానందం... పింగళి నాగేంద్రరావు సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల, పి.లీల
కప్పనుబట్టిన పామును గప్పునబట్టంగ గ్రద్ద కనిపెట్టుండెన్...(పద్యం) పింగళి నాగేంద్రరావు సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల
నీలోపలి నాలోపలి లోలోపలి గుట్టుతెలియ...(పద్యం) పింగళి నాగేంద్రరావు సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల
చేయి చేయి కలుపరావె హాయి హాయిగా, నదురు బెదురు మనకింకా లేదు లేదుగా పింగళి నాగేంద్రరావు సాలూరు రాజేశ్వరరావు ఏ.యం.రాజా, పి.లీల
కాశీకి పోయాను రామాహరి, గంగతీర్థమ్ము తెచ్చాను రామాహరి పింగళి నాగేంద్రరావు సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల, స్వర్ణలత

మూలాలు

  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.

బయటి లింకులు