సురభి జమునా రాయలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 56: పంక్తి 56:
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}


==యితర లింకులు==
* [http://archives.andhrabhoomi.net/kalabhoomi/k-242 ఆంధ్ర భూమిలో "అసాధ్యాన్ని సాధించిన జమున"]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}
* [http://www.suryaa.com/main/features/Article.asp?category=4&subCategory=0&ContentId=76297 సూర్య లో "రంగస్థల రమణి"]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}
* [http://www.sakshi.com/main/Weeklydetails.aspx?Newsid=34172&Categoryid=6&subcatid=4 సాక్షిలో "కథ,నిర్మాత,దర్శకత్వం జమునా రాయలు]
[[వర్గం:తెలుగు నాటకరంగం]]
[[వర్గం:తెలుగు నాటకరంగం]]
[[వర్గం:తెలుగు రంగస్థల నటీమణులు]]
[[వర్గం:తెలుగు రంగస్థల నటీమణులు]]

14:55, 22 జనవరి 2020 నాటి కూర్పు

జమునా రాయలు
దస్త్రం:Jamuna Rayalu.jpg
జమునా రాయలు
జననంజమునా రాయలు
జనవరి 22, 1960
ఇతర పేర్లునట శిరోమణి, నటనా విదూషీమణి, గానకోకిల
వృత్తిసురభి నాటక సమాజం
ప్రసిద్ధిరంగస్థల కళాకారిణి,బుర్రకథ, హరికథ కళాకారిణి
భార్య / భర్తసురభి రాయలు
తండ్రివనారస కొండలరావు
తల్లివసుంధరాదేవి

జమునా రాయలు రంగస్థల నటి, బుర్రకథ హరికథ కళాకారిణి. నాలుగు దశాబ్దాలకుపైగా రంగస్థల అనుభవం ఉన్న ఈమె సురభి నాటక సమాజం ప్రదర్శించిన అనేక నాటకాల్లో నటించింది.[1]

జననం

జమునా రాయలు 1960, జనవరి 22న వనారస కొండలరావు, వసుంధరాదేవి దంపతులకు గుంటూరు జిల్లా, తెనాలిలో జన్మించింది. తన మేనమామ సురభి రాయలునే వివాహం చేసుకుంది.

రంగస్థల ప్రస్థానం

8 ఏళ్ళ వయసులో హరికథలు, బుర్రకథలు చెప్పడం ప్రారంభించింది. తొలిసారిగా చింతామణి నాటకంలో శ్రీకృష్ణుడు పాత్ర పోషించింది. షణ్ముఖి ఆంజనేయ రాజుతో సత్యభామగా, పీసపాటి నరసింహమూర్తితో రాధగా, వేమూరి రామయ్యతో సుధేష్ణగా నటించడంతోపాటు బాలనాగమ్మ, గుణసుందరి, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణీ మాలినీదేవి, చంద్రమతి, ద్రౌపది, సక్కుబాయి వంటి పాత్రలు పోషించింది.

బహుమతులు - పురస్కారాలు

  1. ఉత్తమ దర్శకత్వం - శశిరేఖా పరిణయం (నాటకం) - నంది అవార్డు
  2. పైడి లక్ష్మయ్య అవార్డు - తెలుగు విశ్వవిద్యాలయం
  3. సత్యసాయి బాబా నుండి ‘నవరత్నమాల’ను బహుకరణ
  4. బెస్ట్ ఎక్స్ లెన్సీ అవార్డు
  5. అక్కినేని ప్రథమ గోల్డ్ మెడల్
  6. జి.వి.ఆర్. జీవిత పురస్కారం
  7. నట శిరోమణి, నటనా విదూషీమణి, గానకోకిల బిరుదులు

మూలాలు

  1. జమునా రాయలు, కళాదీపికలు (సమకాలీన రంగస్థల నటీమణులు), ప్రథమ ముద్రణ, సంపాదకులు: వి.ఎస్. రాఘవాచారి., కళాదీపిక మాసపత్రిక, తిరుపతి, అక్టోబర్ 2011, పుట. 42.