ఉప రాష్ట్రపతి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 15: పంక్తి 15:


ఉప రాష్ట్రపతి ఐదేళ్ళు పదవిలో ఉంటారు. అయితే కింది సందర్భాలలో పదవీకాలం ముందే ముగియవచ్చు.
ఉప రాష్ట్రపతి ఐదేళ్ళు పదవిలో ఉంటారు. అయితే కింది సందర్భాలలో పదవీకాలం ముందే ముగియవచ్చు.
* ఉప రాష్ట్రప్తి తన రాజీనామాను రాష్ట్రపతికి పంపినపుడు
* ఉప రాష్ట్రపతి తన రాజీనామాను రాష్ట్రపతికి పంపినపుడు
* రాజ్యసభ తీర్మానం ద్వారా ఉప రాష్ట్రపతిని పదవి నుండి తొలగించినపుడు
* రాజ్యసభ తీర్మానం ద్వారా ఉప రాష్ట్రపతిని పదవి నుండి తొలగించినపుడు



13:38, 26 జనవరి 2020 నాటి కూర్పు


భారతదేశం

ఈ వ్యాసం భారతదేశం రాజకీయాలు, ప్రభుత్వంలో ఒక భాగం.


కేంద్ర ప్రభుత్వం

రాజ్యాంగం



భారత ప్రభుత్వ పోర్టల్


ఉప రాష్ట్రపతి భారత ప్రభుత్వంలో రెండో అత్యున్నత స్థానం. భారత రాజ్యాంగంలోని 63 వ అధికరణంలో ఉప రాష్ట్రపతి పదవి గురించిన ప్రస్తావన ఉంది. ఈ పదవికి సంబంధించి భారత్ కు ఒక ప్రత్యేకత ఉంది. ప్రపంచంలోని మరే పెద్ద పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోను లేని అంశం ఇది. పెద్ద ప్రజాస్వామ్యాలలో, అమెరికాలో మాత్రమే ఈ పదవి ఉంది. అయితే భారత్, అమెరికాలలో ప్రజాస్వామ్య విధానాలు వేరు (భారత్‌లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యము, అమెరికాలో అధ్యక ప్రజాస్వామ్య పద్ధతి ఉన్నాయి) కనుక, ఉప రాష్ట్రపతి విధులకు, అమెరికా ఉపాధ్యక్షుడి విధులకు చాలా తేడా ఉంది.

అర్హతలు

ఉప రాష్ట్రపతి పదవికి ఎన్నిక కావడానికి కింది అర్హతలు ఉండాలి.

  • భారత పౌరుడై ఉండాలి.
  • 35 సంవత్సరాలు లేదా ఆ పైబడి వయసు ఉండాలి.
  • రాజ్యసభ సభ్యుడయేందుకు అవసరమైన అర్హతలు కలిగి ఉండాలి.
  • అభ్యర్థి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో లేదా వటి నియంత్రణ కలిగిన సంస్థలలో ఆదాయం వచ్చే పదవిలో ఉండరాదు.

ఎన్నిక విధానం, కాలపరిమితి

ఉప రాష్ట్రపతి ఎన్నిక ఎలెక్టోరల్ కాలేజి ద్వారా జరుగుతుంది. ఈ కాలేజిలో లోక్‌సభ, రాజ్యసభల సభ్యులు సభ్యులుగా ఉంటారు.

ఉప రాష్ట్రపతి ఐదేళ్ళు పదవిలో ఉంటారు. అయితే కింది సందర్భాలలో పదవీకాలం ముందే ముగియవచ్చు.

  • ఉప రాష్ట్రపతి తన రాజీనామాను రాష్ట్రపతికి పంపినపుడు
  • రాజ్యసభ తీర్మానం ద్వారా ఉప రాష్ట్రపతిని పదవి నుండి తొలగించినపుడు

అయితే ఉప రాష్ట్రపతి ఐదేళ్ళ కాలం ముగిసినా, తన వారసుడు పదవి చేపట్టే వరకు పదవిలో కొనసాగుతారు.

ఉప రాష్ట్రపతి పదవీకాలం ముగిసే లోపు తదుపరి ఉప రాష్ట్రపతి ఎన్నిక పూర్తి అయిపోవాలి. ఒకవేళ ఉప రాష్ట్రపతి పదవి అర్ధంతరంగా ఖాళీ అయితే (మరణం, రాజీనామా, తొలగింపు మొదలైన వాటి వలన) తదుపరి ఉప రాష్ట్రపతి కొరకు ఎన్నిక వీలయినంత త్వరగా జరగాలి. అప్పుడు ఎన్నికయ్యే వ్యక్తి ఐదేళ్ళ పూర్తి కాలం అధికారంలో ఉంటారు.

విధులు, అధికారాలు

ఉప రాష్ట్రపతి రెండు ప్రముఖమైన విధులు నిర్వర్తిస్తారు. కార్య నిర్వాహక వ్యవస్థకు సంబంధించి, ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, శాసన వ్యవస్థకు సంబంధించి, రాజ్యసభ ఉపాధ్యక్ష బాధ్యతలు కూడా నిర్వర్తిస్తారు.

మరణం, రాజీనామా, అభ్శంసన వంటి కారణాల వలన రాష్ట్రపతి పదవి ఖాళీ అయినపుడు, ఉప రాష్ట్రపతి, రాష్ట్రపతి విధులు నిర్వర్తిస్తారు. అనారోగ్య కారణాల వలన రాష్ట్రపతి విధులు నిర్వర్తించలేని పరిస్థితిలో, ఉప రాష్ట్రపతి ఈ విధులు చేపడతారు. రాష్ట్రపతి విధులు నిర్వర్తించే సమయంలో, ఆ పదవికి లభించే అన్ని అధికారాలు, సౌకర్యాలు, వేతనం మొదలైనవన్నీ ఉప రాష్ట్రపతికి లభిస్తాయి.

రాజ్యసభ అధ్యక్షుడిగా సభా కార్యక్రమాలను నిర్వహిస్తారు. దీనికి డిప్యూటీ ఛైర్మను సహకరిస్తారు.

ఉప రాష్ట్రపతుల జాబితా

సంఖ్య పేరు నుండి వరకు
1 డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ మే 13 1952 మే 12 1962
2 డా.జాకీర్ హుస్సేన్ మే 13 1962 మే 12 1967
3 వి.వి.గిరి మే 13 1967 మే 3 1969
4 డా.గోపాల్ స్వరూప్ పాఠక్ ఆగష్టు 31 1969 ఆగష్టు 30 1974
5 బి.డి.జట్టి ఆగష్టు 31 1974 ఆగష్టు 30 1979
6 ఎం.హిదయతుల్లా ఆగష్టు 31 1979 ఆగష్టు 30 1984
7 ఆర్.వెంకటరామన్ ఆగష్టు 31 1984 జూలై 24 1987
8 డా.శంకర్ దయాళ్ శర్మ సెప్టెంబర్ 3 1987 జూలై 24 1992
9 కె.ఆర్.నారాయణన్ ఆగష్టు 21 1992 జూలై 24 1997
10 కృష్ణకాంత్ ఆగష్టు 21 1997 జూలై 27 2002
11 భైరన్ సింగ్ షెఖావత్ ఆగష్టు 19 2002 జూలై 21 2007
12 మహ్మద్ హమీద్ అన్సారి ఆగష్టు 11 2007 ఆగష్టు 11 2017
13 ఎం. వెంకయనాయుడు ఆగష్టు 11 2017

వనరులు