చిరంజీవి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2: పంక్తి 2:
{{సమాచారపట్టిక నటుడు
{{సమాచారపట్టిక నటుడు
| పేరు = చిరంజీవి
| పేరు = చిరంజీవి
| చిత్రం = Chiranjeevi.JPG
| బొమ్మ = Chiranjeevi.JPG
| చిత్రం_పరిమాణం = 200px
| బొమ్మ_పరిమాణం = 200px
| చిత్రం_ఓమాట = చిరంజీవి
| బొమ్మ_ఓమాట = చిరంజీవి
| జననం_పేరు = కొణిదెల శివశంకర వరప్రసాద్
| జననం_పేరు = కొణిదెల శివశంకర వరప్రసాద్
| జననం_తేదీ = [[1955]], [[ఆగష్టు 22]]
| జననం_తేదీ = [[1955]], [[ఆగష్టు 22]]

04:06, 25 మార్చి 2008 నాటి కూర్పు


చిరంజీవి
జననం కొణిదెల శివశంకర వరప్రసాద్
1955, ఆగష్టు 22
మొగల్తూరు, ఆంధ్రప్రదేశ్
బిరుదు(లు) పద్మశ్రీ, పద్మభూషణ్, మెగాస్టార్
వేరేపేరు(లు) చిరు
వృత్తి సినిమా
భార్య / భర్త(లు) సురేఖ

చిరంజీవి (Chiranjeevi) గా ప్రసిద్ధి చెందిన కొణిదెల శివశంకర వరప్రసాద్ (Konidela Shiva Shankara Vara Prasad)తెలుగు సినిమా రంగంలో ఒక ప్రముఖ కధానాయకుడు. అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్గా ఆంధ్ర ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. మొత్తం దేశంలో చిరంజీవికి మూడు వేలకు పైగా అభిమాన సంఘాలున్నాయని ఒక అంచనా [1].

కుటుంబం

ఆగష్టు 22, 1955పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు లో కొణిదెల వెంకట్రావు,అంజనాదేవి దంపతులకు ప్రథమ సంతానంగా చిరంజీవి జన్మించాడు.చిరంజీవి వివాహం ప్రసిద్ధ హాస్య నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో 1980లో జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు.

చిరంజీవి సోదరులు నాగేంద్రబాబు (సినిమా నిర్మాత, నటుడు), పవన్ కళ్యాణ్ (మరొక కధానాయకుడు). చిరంజీవి బావ అల్లు అరవింద్ ప్రముఖ సినిమా నిర్మాత. చిరంజీవి మేనల్లుడు అల్లు అర్జున్ కూడా సినిమా కధానాయకునిగా రాణిస్తున్నాడు. చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ హీరోగా సినిమా నిర్మాణం 2007లో "చిరుత"తో ప్రారంభమైంది. ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదలై 170 కేంద్రాలలో 50 రోజులు పూర్తి చేసుకుంది.

చలనచిత్ర ప్రస్థానం

చెన్నై లోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుండి డిప్లొమా పొందిన తర్వాత 1978 లో పునాది రాళ్లు సినిమా చిరంజీవి నటించిన మొదటి సినిమా. కాని ప్రాణం ఖరీదు ముందుగా విడుదల అయ్యింది. మొదటిసారి నిర్మాత జయకృష్ణ ద్వారా చిరంజీవికి ముట్టిన పారితోషకం 1,116 రూపాయలు. మనవూరి పాండవులు, మోసగాడు, రాణీ కాసుల రంగమ్మ, ఇది కధ కాదు వంటి సినిమాలలో చిన్న పాత్రలు, విలన్ పాత్రలు పోషించాడు.


ఎ.కోదండరామి రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమాతో చిరంజీవి హీరోగా నిలద్రొక్కుకున్నాడు. ఇంకా రుద్రవీణ, చంటబ్బాయ్,ఛాలెంజ్, శుభలేఖ చిత్రాలలో వివిధ తరహా పాత్రలలో మెప్పించి మంచి గుర్తింపు పొందాడు. గాంగ్ లీడర్ సినిమా చిరంజీవికి బలఙయన మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. 1980, 90లలో రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు వంటి వినోదాత్మక చిత్రాలు, ఆపద్బాంధవుడు, స్వయంకృషి వంటి సున్నితమైన పాత్రలతో వచ్చిన సినిమాలు కూడా విజయవంతమయ్యాయి. తరువాత కొంతకాలం చిరంజీవి సినిమాలు అంతగా విజయవంతంగా నడువ లేదు.

దస్త్రం:Chiranjeevi politics poster.JPG
2007-2008 సంవత్సరాలలో చిరంజీవి రాజకీయాలలోకి రావాలని రాష్ట్రమంతటా ప్రదర్శనలు జరిగాయి. పోస్టర్లు వెలిశాయి.

మళ్ళీ 1990 దశకం చివరిలో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి, హిట్లర్, చూడాలని వుంది సినిమాలు మంచి విజయాలను సాధించాయి. 2002లో వచ్చిన ఇంద్ర సినిమా తారా పధంలో చిరంజీవిని అత్యుత్తమ స్థానానికి తీసుకు వెళ్ళింది. ఇదే సమయంలో చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశంపై ఊహాగానాలు విస్తృతంగా చర్చనీయాంశాలయ్యాయి. తరువాత వచ్చిన ఠాగూర్, శంకర్ దాదా ఎమ్.బి.బి.ఎస్, స్టాలిన్ వంటి సినిమాలు విజయవంతాలైనా గాని సినిమా బడ్జెట్‌లు విపరీతంగా పెరిగి పోవడం వలనా, ప్రేక్షకుల అంచనాలు అతిగా ఉండడం వలనా, రంగంలో తీవ్రమైన పోటీ నెలకొనడం వలనా అంత పెద్ద హిట్‌లుగా పరిగణించబడడం లేదు.

తెలుగు సినిమా రంగంలో చిరంజీవిని మొదటి యాక్షన్-డాన్స్ మాస్ హీరోగా చెప్పుకోవచ్చును. అంతకు ముందు హీరోల సినిమాలలో ఈ అంశాలున్నా వాటికి అంత ప్రాముఖ్యత ఉండేది కాదు. ఇంకా ఈ ఇమెజ్ వలన చిరంజీవి సున్నితమైన పాత్రలు పోషించిన సినిమాలకు తగినంత ప్రాధాన్యత రాలేదనిపిస్తుంది.

సేవా కార్యక్రమాలు

హైదరాబాద్‌లో చిరంజీవి రక్త, నేత్రనిధి ప్రధాన కార్యాలయం

చిరంజీవి అక్టోబర్ 2, 1998లో 'చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్' స్థాపించాడు. 'చిరంజీవి బ్లడ్ బాంక్', 'చిరంజీవి ఐ బాంక్' ఈ ట్రస్టు నడుపుతున్న ముఖ్య సేవా సౌకర్యాలు. రాష్ట్రంలో అత్యధికంగా నేత్రదానం, రక్తదానం సాగిస్తున్న సంస్థలుగా ఇవి గుర్తింపు పొందాయి.[2]. అభిమానుల ఉత్సాహాన్ని, సేవా దృక్పధాన్ని పెద్దయెత్తున సమాజసేవా కార్యక్రమాలకు మళ్ళించడం ఈ ట్రస్టులు సాధించిన ఘనవిజయం. వీరి రక్తదానం వలన రాష్ట్రంలో 80,000 మంది, నేత్రదానం వలన 1000 మంది సేవలనందుకొన్నారని అంచనా .[3]. ఇప్పటికి ఈ సంస్థలకు 3.5 లక్షల మంది తమ మరణానంతరం నేత్రాలను దానం చేయడానికి ముందుకొచ్చారు. నాలుగు సంవత్సరాలు ఈ సంస్థలు 'అత్యుత్తమ సేవా సంస్థలు'గా రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలనందుకొన్నాయి.

సత్కారాలు

దస్త్రం:Chiranjeevi.jpg
పద్మభూషణ్ సత్కారం లభించిన సందర్భంలో చిరంజీవికి సన్మానం జరిగింది.


నటించిన సినిమాలు

సంవత్సరం పేరు పాత్ర ఇతరత్రా విశేషాలు
2007 శంకర్‌దాదా జిందాబాద్ శంకర్‌ ప్రసాద్ చిరంజీవి మొదటి సీక్వెల్ చిత్రం (శంకర్‌దాదా MBBS చిత్రానికి)
2006 స్టాలిన్ స్టాలిన్ ఇది రుద్రవీణ ,ఠాగూర్ ,శంకర్‌దాదా లాంటి గొప్ప సందేసాత్మక చిత్రం
స్టైల్ ఒక అతిథి పాత్ర
2005 జై చిరంజీవ సత్యనారాయణ మూర్తి
అందరివాడు గోవిందరాజులు/సిద్ధార్ధ్
2004 శంకర్ దాదా MBBS శంకర్ ప్రసాద్ విజేత: ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటుడు అవార్డు (తెలుగు)
విజేత: సంతోషం ఉత్తమ నటుడు అవార్డు
అంజి అంజి
2003 ఠాగూర్ ఠాగూర్ విజేత: సంతోషం ఉత్తమ నటుడు అవార్డు
2002 ఇంద్ర ఇంద్రసేనా రెడ్డి విజేత: నంది అవార్డు ఉత్తమ నటుడు
విజేత:ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటుడు అవార్డు (తెలుగు)
2001 డాడీ రాజకుమార్
మంజునాధ మంజునాధ స్వామి/శివుడు
మృగరాజు రాజు నేపథ్యగాయకునిగా కూడా
2000 అన్నయ్య రాజారామ్
హ్యండ్సప్ అతిధిపాత్ర
1999 ఇద్దరుమిత్రులు విజయ్
స్నేహంకోసం సింహాద్రి/చిన్నయ్య విజేత: ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటుడు అవార్డు (తెలుగు)
1998 చూడాలనివుంది రామకృష్ణ
బావగారు బాగున్నారా! రాజు
1997 మాస్టర్ రాజకుమార్ నేపథ్యగానం చేసిన తొలి సినిమా
హిట్లర్ మాధవరావు
1995 రిక్షావాడు రాజు
బిగ్ బాస్ సురేంద్ర
అల్లుడామజాకా సీతారాముడు/మిస్టర్ టయోట
1994 ది జంటిల్ మ్యాన్ విజయ్ హింది
యస్.పి.పరశురామ్ పరశురామ్
ముగ్గురు మోనగాళ్ళు ప్రుద్వి/విక్రమ్/దత్తాత్రేయ త్రిప్రాత్రాభినయం
1993 మెకానిక్ అల్లుడు రవి
ముఠామేస్త్రి సుభాష్ చంద్ర బోస్ విజేత: ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటుడు అవార్డు (తెలుగు)
1992 ఆపద్భాధవుడు మాధవ విజేత: నంది అవార్డు ఉత్తమ నటుడు
ఆజ్ కా గూండారాజ్ రాజా హింది
ఘరానామొగుడు రాజు
1991 రౌడీఅల్లుడు జానీ/కళ్యాణ్
గ్యాంగ్ లీడర్ రాజారామ్
స్టువార్టుపురం పోలీసుస్టేషన్ రాణాప్రతాప్
1990 రాజావిక్రమార్క రాజా విక్రమార్క
ప్రతిబంధ్ సిద్ధాన్థ్ హింది
కొదమసింహం భరత్
జగదేకవీరుడు అతిలోకసుందరి రాజు
కొండవీటిదొంగ రాజా
1989 లంకేశ్వరుడు శంకర్
రుద్రనేత్ర నేత్ర
స్టేట్ రౌడి కాళీచరణ్/ప్రుద్వి
అత్తకు యముడు అమ్మాయికి మొగుడు కళ్యణ్
1988 యుద్ధభూమి
త్రినేత్రుడు అభిమన్యు నిర్మాత
మరణమృదంగం జనార్ధన్/జానీ
ఖైదీ నెంబరు.786 గోపి
యముడికి మొగుడు కాళి/బాలు
రుద్రవీణ సూర్యనారాయణ శర్మ విజేత: ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటుడు అవార్డు (తెలుగు)
మంచిదొంగ వీరేంద్ర
1987 జేబుదొంగ చిట్టిబాబు
స్వయంకృషి సాంబయ్య విజేత: నంది అవార్డు ఉత్తమ నటుడు
పసివాడిప్రాణం మధు
ఛక్రవర్తి ఛక్రవర్తి
ఆరాధన పులిరాజు
దొంగ మొగుడు రవితేజ/నాగరాజు
1986 చాణక్య శపదం చాణక్య
దైర్యవంతుడు
రాక్షసుడు
చంటబ్బాయి పాండురంగా రావు
వేట రాణా ప్రతాపకుమార్ వర్మ
మగధీరుడు
కొండవీటి రాజా రాజా
కిరాతకుడు చరణ్
1985 విజేత చిన్నబాబు
అడవిదొంగ కాళిదాస్
రక్తసింధూరం గండ్రగొడ్డలి & ఇన్స్పెక్టర్ గోపి
పులి క్రాంతి
జ్వాల రాజు
చిరంజీవి చిరంజీవి
దొంగ ఫణి
చట్టంతో పోరాటం రవిశంకర్
1984 రుస్తుమ్ గోపి
అగ్నిగుండం విజయ్
నాగు నాగు
ఇంటిగుట్టు విజయ కుమార్ విజేత: ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటుడు అవార్డు (తెలుగు)
ఛాలెంజ్ గాంధి
మహానగరంలో మాయగాడు
దేవాంతకుడు
హీరో కృష్ణ
గూండా కాళిదాస్/రాజా
అల్లుళ్ళు వస్తున్నారు
1983 సంఘర్షణ దిలీప్
మంత్రిగారి వియ్యంకుడు బాబ్జి
ఖైది సూర్యమ్
సింహపురి సింహం విజయ్
మాఇంటి ప్రేమాయణం
రోషగాడు సికంధర్
మగమహారాజు రాజు
గూడచారి నెంబర్.1 విజయ్
పులి బెబ్బులి
శివుడు శివుడు శివుడు
ఆలయశిఖరం
అభిలాష చిరంజీవి
పల్లెటూరి మొనగాడు
ప్రేమ పిచ్చోళ్ళు రవి
1982 బంధాలూ అనుబంధాలు
మంచు పల్లకి
మొండి ఘటం రవింద్ర
యమకింకరుడు విజయ్
బిర్లా రంగా బిర్లా
పట్ణం వచ్చిన పతివ్రతలు గోపి
టింగు రంగడు రంగడు
రాధ మై డార్లింగ్
సీతాదేవి
ఇది పెళ్ళంటారా
శుభలేఖ నరసింహ మూర్తి విజేత: ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటుడు అవార్డు (తెలుగు)
బందిపోటు సింహం
ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య రాజశేఖరం
1981 కిరాయి రౌడీలు
చట్టానికి కళ్ళు లేవు విజయ్
ప్రియ
శ్రీరస్తు శుభమస్తు
47 రోజులు
రాణీకాసుల రంగమ్మ
ఊరికిచ్చిన మాట రాముడు
న్యాయం కావాలి సురేష్ కుమార్
ప్రేమ నాటకం అతిధి పాత్ర
తిరుగులేని మనిషి
తోడు దొంగలు
పార్వతీపరమేశ్వరులు
ఆడవాళ్ళూ మీకు జోహార్లు
1980 రక్తసంబంధం
మొగుడు కావాలి
ప్రేమ తరంగాలు కుమార్
లవ్ ఇన్ సింగపూర్ సురేష్
తాతయ్య ప్రేమలీలలు
కాళి
నకిలీ మనిషి ప్రసాద్ / శ్యామ్
పున్నమినాగు నాగులు
మోసగాడు
జాతర
ఆరని మంటలు
చండీప్రియ
కొత్తపేట రౌడి అతిధి పాత్ర
అగ్ని సంస్కారం
1979 కోతల రాయుడు
శ్రీరామబంటు
ఇది కధ కాదు
పునాది రాళ్ళు
ఐ లవ్ యూ రమేష్
కొత్త అల్లుడు
కుక్క కాటుకు చెప్పుదెబ్బ
తాయారమ్మ బంగారయ్య
గోలీమార్
1978 మనవూరి పాండవులు పార్ధు
ప్రాణం ఖరీదు నరసింహ

మూలాలు, వనరులు

  1. Devotion and Defiance in Fan Activity - S.V.Srinivas http://apache.cscsarchive.org/Hongkong_Action/docs/devotion_defiance.pdf
  2. "idlebrain.com". A Notable Deed by Megastar. Retrieved 3 November. {{cite web}}: Check date values in: |accessdate= (help); Unknown parameter |accessyear= ignored (|access-date= suggested) (help)
  3. "idlebrain.com". Chiranjeevi Charitable Trust. Retrieved 3 December. {{cite web}}: Check date values in: |accessdate= (help); Unknown parameter |accessyear= ignored (|access-date= suggested) (help)
  4. "andhravilas.com". Chiranjeevi receives Padma Bhushan. Retrieved 3 November. {{cite web}}: Check date values in: |accessdate= (help); Unknown parameter |accessyear= ignored (|access-date= suggested) (help)
  5. "in.yahoo.com". Chiranjeevi receives Doctorate. Retrieved 2 November. {{cite web}}: Check date values in: |accessdate= (help); Unknown parameter |accessyear= ignored (|access-date= suggested) (help)

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=చిరంజీవి&oldid=283455" నుండి వెలికితీశారు