మొఘల్ చిత్రకళ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 23: పంక్తి 23:
==మొఘల్ చిత్రకళా విస్తృతి==
==మొఘల్ చిత్రకళా విస్తృతి==
మొఘల్ చిత్రకళా విస్తృతి ప్రధానంగా రెండు దిశలలో కొనసాగింది.
1. గ్రంథ చిత్రణ (Illustrated books)
2. దర్బారీ చిత్రణ

మొఘల్ చిత్రకళా విస్తృతి ప్రధానంగా రెండు దిశలలో కొనసాగింది.
1. గ్రంథ చిత్రణ (Illustrated books)
2. దర్బారీ చిత్రణ

ఒక గ్రంధం లోని విషయాలను వివరిస్తూ గీయబడిన చిత్రాలను ఇలస్ట్రేషన్స్ (గ్రంథస్త విషయవివరణ చిత్రాలు)గా పేర్కొంటారు. ఈ విధంగా ఒక గ్రంధానికి చిత్రాలు చేర్చబడటాన్ని ఇలస్ట్రేటెడ్ చిత్రరచన లేదా గ్రంథ చిత్రణ గా వ్యవహరిస్తారు.

దర్బారీ చిత్రకళ మొఘల్ చక్రవర్తుల ప్రీతర్ధ్యం రూపుదిద్దుకొంది. దీనిలో భాగంగా వైవిధ్యభరితమైన దృశ్యాలు కోకోల్లలుగా చిత్రించబడ్డాయి. దర్బారు దృశ్యాలు, సంఘటనలతో పాటు ప్రకృతి దృశ్యాలు, వన్యప్రాణులు, వేట దృశ్యాలు, యుద్ధ దృశ్యాలతో కూడిన చిత్రాలు అనేకంగా అలరిస్తాయి. దీనిలో మరో భాగమైన రూపచిత్రణ (portraiture) లో చక్రవర్తి, అతని రాచకుటుంబీకులు, ఉన్నతోద్యోగులను చిత్రించిన మూర్తి చిత్రాలు ఎక్కువగా కనిపిస్తాయి.

18:31, 31 మార్చి 2020 నాటి కూర్పు

ముఘల్ శైలిలో బాబర్ సభలోని ఒక దృశ్యము

మొఘల్ చిత్రకళ (ఆంగ్లం: Mughal Painting) దక్షిణాసియాలో విలసిల్లిన ఒక ప్రత్యేకమైన చిత్రకళాశైలి. దీనికి మూలం పర్షియన్ లఘుచిత్రలేఖనం. మంగోల్ (చైనీస్) చిత్రకళా స్ఫూర్తితో వృద్ధి చెందిన పర్షియన్ చిత్రకళాశైలి, ఈ మొఘల్ చిత్రకళాశైలికి స్ఫూర్తి నిచ్చింది. భారతదేశాన్ని పరిపాలించిన మొఘల్ చక్రవర్తుల ఆస్థానంలో 16,17 శతాబ్దాల కాల పరిదిలో ఈ శైలి పరిఢవిల్లింది. హుమాయూన్ ప్రోత్సాహంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రకళ అక్బర్ కాలంలో ఉన్నతస్థాయికి వికసించింది. తరువాత జహంగీర్ కాలంలో శిఖర స్థాయికి చేరుకొని, ఆ తరువాత ఔరంగజేబు కాలంలో క్షీణించి అదృశ్యమైంది. మొఘల్ చిత్రకళా శైలిలో మన్సూర్, అబ్దుల్ సమద్, అబుల్ హాసన్ ఉస్తాద్, మురాద్, దశవంత్, కేశవ్, ముకుంద్ మొదలైన వారు మేటి చిత్రకారులుగా వెలుగొందడమే కాకుండా మొఘల్ దర్బారులను సైతం అలంకరించారు. ఈ చిత్రకళాశైలిపై హిందూ, బౌద్ధ, జైన మతాలు ప్రభావం చూపాయి.

ఈ శైలిలో రూపొందించిన చిత్రాలు లఘుచిత్రాలుగా (miniatures) వున్నాయి. సాధారణంగా వీటి పరిమాణం అంగుళాల కొలతల్లో ఉంటాయి. భారతదేశంలో లఘుచిత్రాలను నూలువస్త్రంపై, చేతితో తయారైన కాగితంపై , చెక్క ఫలకాలపైన గీయడం అనేది మొఘల్ చక్రవర్తుల కాలం నుండి ప్రారంభమైంది. మొఘల్ చిత్రకళకు పూర్వం మనదేశంలో లఘుచిత్రణ కేవలం తాళపత్రాలపై మాత్రమే జరిగేది. అక్బర్ చక్రవర్తి పోషణలో ఆగ్రాలో ఒక ఇంపీరియల్ చిత్రశాల స్థాపించబడింది. మొఘల్ చిత్ర శైలిలో అద్భుతమైన చిత్రాలను సృష్టించడంలో దర్బారుకు చెందిన మేటి చిత్రకారులతో పాటు ఈ చిత్రశాలకు చెందిన వందలాది చిత్రకారుల సామూహిక కృషి తోడ్పడింది.

మొఘల్ చిత్రకళ దాదాపుగా లఘుచిత్రాలకే పరిమితమైందని చెప్పవచ్చు. వీరి లఘుచిత్రాలలో కొన్ని ఇలస్ట్రేటెడ్ చిత్రాలుగా ఉంటే, మరికొన్ని ఆల్బమ్ (muraqqa) చిత్రాలుగా వున్నాయి. మొఘల్ చిత్రకారులు ఆల్బమ్‌ల కోసం అనేక లఘుచిత్రాలలో పుష్పాలు, మొక్కలు, పక్షులు, జంతువులను ప్రధానంగా తీసుకొని వాటిని ఎంతో వాస్తవికతతో చిత్రీకరించారు.

మొఘల్ చిత్రకళా శైలిలో పర్షియన్ క్లాసిక్ గ్రంధాలతో పాటు భారతీయ గ్రంధాలకు కూడా చిత్రరచన కొనసాగింది. వీటిలో పేర్కొనతగ్గది. "హంజనామా" అనే పర్షియన్ బృహత్గ్రంధం. అమీర్ హంజా అనే పారశీక వీరుని ప్రేమగాధావృత్తంతో కూడి వున్న ఈ గ్రంథంలోని దృశ్యాలకు సంబంధించి సుమారు 1400 కు పైగా చిత్రాలను 100 మందికి పైగా భారతీయ చిత్రకారులు సమిష్టికృషితో ఒక పెద్ద నూలువస్త్రంపై చిత్రించడం జరిగింది. ఇదే కోవలో బాబర్ నామా, అక్బర్ నామా, జహంగీర్ నామా, పాద్ షా నామా వంటి రాచరిక 'స్వీయ చరిత్ర' గ్రంధాల లోని దృశ్యాలకు చిత్ర రచన సాగింది. అదేవిధంగా భారత, రామాయణ, హరివంశం, శుకసప్తతి గాధలు వంటి కావ్యాలను పర్షియన్ భాషలో అనువదించి వాటికి సైతం రమణీయమైన చిత్రాలను గీయడం జరిగింది.

మొఘల్ చిత్రకళలో వైవిధ్యత అత్యధికం. వీరి చిత్రాలలో వైవిధ్యభరితమైన దృశ్యాలు విరివిరిగా కనిపిస్తాయి. ముఖ్యంగా దర్బారు దృశ్యాలు, సంఘటనలతో పాటు, ప్రకృతి దృశ్యాలు, వన్యప్రాణులు, వేట దృశ్యాలు, యుద్ధ దృశ్యాలు మొదలైనవి అనేకంగా అలరిస్తాయి.

ప్రారంభంలో ఇలస్ట్రేషన్ (illustrations) చిత్రణగా మొదలైన ఈ చిత్రకళ తరువాత కాలంలో రూపపట (Portrait) చిత్రణలోకి వికసించింది. మాతృక అయిన పర్షియన్ చిత్రకళతో పోలిస్తే మొఘల్ చిత్రకళాకారులు లఘుచిత్రాల కంటే వాస్తవిక రూప చిత్రపటాల్లొనే మరింత ఆసక్తిని కనపరిచారు. రూపచిత్రణ (portraiture) లో చక్రవర్తి, అతని రాచకుటుంబీకులు, ఉన్నతోద్యోగులను చిత్రించిన మూర్తి చిత్రాలు ఎక్కువగా కనిపిస్తాయి. వాస్తవికధోరణితో వున్న ఆ నాటి రూపపట చిత్రాలు మొఘల్ చిత్రకళలో ఒక నూతన ఒరవడిని సృష్టించాయి.

ఔరంగజేబు కాలంలో రాజాదరణను కోల్పోయిన అనేక చిత్రకారులు ఇతర రాజ్యాలకు తరలిపోయారు. తదనంతరకాలంలో మొఘల్ చిత్రకళా శైలి ఇతర హిందూ, ముస్లిం ప్రాంతీయ రాజ్యాలకు, ఆ తరువాత సిక్కు ప్రాంతీయ రాజ్యాలకు వ్యాపించింది. ఆయా సంస్థానాలలో అనేక ప్రాంతీయ శైలులను అభివృద్ధి చేసింది. ఈ సమయంలోనే ఉత్తర భారతదేశంలో ఈ కళ హిందూ పురాణేతిహాస గాథా చిత్రణతో ఎక్కువగా ముడిపడింది. అయితే ప్రాంతీయ చిత్రకళారీతులు రాశి పరంగా ఎక్కువైనప్పటికీ వాసి పరంగా తక్కువ సొగసు తోనే అభివ్యక్తమయ్యాయి. వీటిని తరచుగా "మొఘల్ తదనంతర", "ఉప-మొఘల్" లేదా "ప్రాంతీయ మొఘల్" చిత్రకళగా అభివర్ణిస్తారు.

మొఘల్ చిత్రకళ-ఆవిర్భావం

మొఘల్ చిత్రకళకు మూలం పర్షియన్ చిత్రకళ. ఈ పర్షియన్ చిత్రకళ మంగోలియన్ చిత్రకళ చేత ప్రభావితమైంది. పర్షియాలో సఫావి (Safawi) రాజవంశీయులు ఈ చిత్రకళాభిమానంతో మంగోలియన్ చిత్రకారులను తమదేశానికి ఆహ్వానించి వారిచే తమ ప్రజలకు ఈ చిత్రకళారీతిని నేర్పింప చేశారు. పర్షియా సఫావి సుల్తాన్ అయిన షా ఇస్మాయిల్ కాలంలో, బిహజాద్, మిరాక్ వంటి విఖ్యాత చిత్రకారుల కృషితో ఈ మంగోలియన్ చిత్రకళ పూర్తిస్థాయి పర్షియన్ చిత్రకళగా రూపుదిద్దుకొంది. భారతదేశంలో మొఘుల్ చక్రవర్తి హుమాయూన్ పదవీచ్యుతుడై దేశం వదిలి పర్షియాలో తలదాచుకోవాల్సి వచ్చింది. సహజంగా చిత్రకళాభిమాని అయిన హుమాయూన్ పర్షియాలో ఆశ్రయం పొందుతున్నప్పుడు, అక్కడి ఆస్థాన చిత్రకారులైన బిహజాద్ వంటి మేటి చిత్రకారుల పరిచయంతో ఈ పర్షియన్ చిత్ర శైలి పట్ల అమితంగా ఆకర్షితుడయ్యాడు. క్రీ.శ. 1555 లో తిరిగి భారతదేశానికి వచ్చిన తరువాత తనతోపాటు మీరు సయ్యద్ ఆలీ, క్వాజా అబ్దుస్ సమద్ అనే విఖ్యాత చిత్రకారులను తీసుకొనివచ్చాడు. ముఖ్యంగా క్వాజా అబ్దుస్ సమద్ రాకతో భారతదేశంలో మొఘల్ చిత్రకళ ప్రారంభం అయినట్లుగా చెప్పవచ్చు. 1562 నాటికి సుల్తాన్ దర్బారులో కొలువుతీరిన పర్షియన్ చిత్రకారులు భారతీయ చిత్రకారులకు తమ నూతన చిత్రకళారీతులను నేర్పించడం ప్రారంభించారు. దానితో భారతదేశంలో మొఘల్ చిత్రకళ వేళ్లూనుకోవడం ప్రారంభించింది.

ఈ విధంగా మంగోలియన్ చిత్రకళ పర్షియాలో పర్షియన్-మంగోలియన్ పద్దతిగా ఏర్పడింది. 1560 వరకు భారతదేశంలో ఈ పద్దతి అమలులో ఉండేది 1562 నాటికి ఇది అప్పటికే భారతదేశంలో వాడుకలో వున్న స్థానిక విజయనగరం, బీజాపూర్, అహ్మద్ నగర్, రాజపుత్ర చిత్రకళా పద్దతులతో కలసి భారత-పర్షియా-మంగోలియా సమ్మేళన రీతిగా రూపొందింది. దీనినే మొఘల్ చిత్రకళా రీతి అని వ్యవహరిస్తారు. 1562 లో చిత్రించిన "అక్బర్ దర్బార్ లో తాన్ సేన్ ప్రవేశించిన దృశ్యం" చిత్రపటంలో ఈ మొఘల్ చిత్రకళా రీతి మొట్టమొదటగా కనిపిస్తుందని విమర్శకులు పేర్కొంటారు.

మొఘల్ చిత్రకళా విస్తృతి