కలంకారీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి కళంకారీ ను దారిమార్పు ద్వారా కలంకారీ కు తరలించాం: సరైన పేరు
చి అంతర్వికీ లింకులు
పంక్తి 23: పంక్తి 23:


[[వర్గం:కళలు]]
[[వర్గం:కళలు]]

<!-- అంతర్వికీ లింకులు -->
[[en:Kalamkari]]
[[es:Kalamkari]]
[[fr:Kalamkari]]

15:24, 12 ఏప్రిల్ 2008 నాటి కూర్పు

కళంకారీ అనగా వెదురుతో చేసిన కలంతో సహజమైన రంగులను ఉపయోగించి వస్త్రాలపై బొమ్మలు చిత్రించే ఒక కళ.ఇది చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి లో పుట్టింది. కారీ అనగా హిందీ లేదా ఉర్దూ లో పని అని అర్థం. 10వ శతాబ్దంలో పర్షియన్ మరియు భారతీయ వర్తకుల సంబంధాల నేపథ్యం నుంచి ఈ పదం ఉద్భవించి ఉండవచ్చు.[1] యూరోపియన్ వర్తకులు కూడా ఇలాంటి వస్త్రాలపై చిత్రించే కళను వేరే పేర్లతో పిలుస్తుంటారు.ఉదాహరణకు పోర్చుగీసు వారు దీనిని పింటాడో అని అంటారు. డచ్ వారు సిట్జ్ అనీ బ్రిటీష్ వారు షింజ్ అనీ పిలుస్తారు. కృష్ణా జిల్లా పెడన లో దీన్ని బ్లాక్ ప్రింటింగ్ పిలుస్తారు. ప్రస్థుతం మనం చూసే బ్లాక్ ప్రింటింగ్సు పెడన నుండి వస్తుంటే దేవతా చిత్రాలు (హస్త కళలు) అన్నీ కాళహస్తి నుండి వస్తున్నాయి. అయితే తూర్పుగోదావరి జిల్లా లో ఆర్యవటం లో కూడా కొంతమంది పెడన తరహాలోన బ్లాక్ ప్రింటింగ్ చేస్తున్నారు.

ఈ కళ శ్రీకాళహస్తిలో ఖచ్చితంగా ఎప్పుడు ప్రారంభమైందో తెలియజేయడానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు. ఉన్న ఆధారాలను బట్టి, 13 మరియు 19వ శతాబ్దాల్లో కోరమాండల్ తీరం వెంబడి వస్త్ర వ్యాపారం బాగా జరిగేది. కాబట్టి దక్కను పీఠభూమికి చెందిన అన్ని ప్రదేశాలలోనూ ఈ కళ విలసిల్లిందని తెలుస్తుంది. పట్టణాన్ని ఆనుకుని ఎల్లప్పుడూ ప్రవహించే సువర్ణముఖీ నదిలో ఈ కళకు ముఖ్యంగా అవసరమైన స్వచ్చమైన పారే నీరు లభించటం వలన ఇది ఇక్కడ బాగా ప్రాచుర్యం పొంది ఉండవచ్చు. ప్రసిద్ధి గాంచిన శ్రీకాళహస్తేశ్వరాలయం పర్యాటకులను, యాత్రుకులను ఆకర్షించడం కూడా ఇందుకు కారణం కావచ్చు. ఈ కళ ఎక్కువగా హిందూ సాంప్రదాయాన్నే ప్రతిబింబిస్తుంది. ఇక్కడగల కళాకారులు ఇప్పటికీ రామాయణము, మహాభారతం, శివ పురాణం మొదలైన వాటిని నుంచి పాత్రలను చిత్రిస్తూ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.

కోరమాండల్ తీరం వెంబడి ఉన్న ముఖ్యమైన మచిలీపట్నం ఓడరేవు ద్వారా ఈ కళంకారీ ఉత్పత్తులు ప్రపంచం నలుమూలలకూ వ్యాపించి ఉండవచ్చు. మచిలీపట్నం ఓడరేవుకు సౌకర్యాలు సరిగా లేక పోయినా గోల్కొండ ప్రభువులతో సంబంధాలు ఉండటవ్ వలన అది ముఖ్యమైన ఓడరేవుగా విలసిల్లింది.గోల్కొండ ప్రభువైన కుతుబ్ షాహీ కళంకారీ ఉత్పత్తులను ఎక్కువగా కోరే పర్షియన్ వర్తకులతో వ్యాపార సంబంధాలపై ప్రత్యేక శ్రద్ధ వహించేవాడు.


సుగంధ ద్రవ్యాల వ్యాపారస్థులు వస్తుమార్పిడి పద్దతి ప్రకారం తమ వ్యాపారం కోసం భారతీయ వస్త్రాలను ముఖ్యంగా కళంకారీ వస్త్రాలను వాడేవారు. ముఖ్యంగా ఈ కళంకారి లో చెప్పుకోవలసింది ఏమిటి అంటే ఈ విధానం లో వాడే రంగులు అన్నీ సహజ రంగులే (కూరగాయల నుంచి సేకరించినవి). ఇవి శరీరానికి ఏవిధమైన హానీ చేయవు. నిజాంల కాలంలో విదేశస్థులు కలంకారీ చేసిన గుడ్డకు సరితూగే బంగారాన్ని ఇచ్చి కొనుక్కొని మచిలీపట్నం (బందరు)ఓడరేవు ద్వారా తమ దేశాలకు తీసుకొని వెళ్ళేవారు.

19వ శతాబ్దపు ఈ కళాకారుల్లో ఎక్కువగా బలిజ కులస్తులే ఉండేవారు. వీరు సాంప్రదాయంగా వ్యవసాయం పై మరియు కుటీర పరిశ్రమలపై ఆధారపడి నివసించే వారు.ప్రస్తుతం కాళహస్తి చుట్టు పక్కలా సుమారు మూడు వందలమంది కళాకారులు కళంకారీకి సంబంధించిన వివిధ పనులపై ఆధారపడి జీవిస్తున్నారు.

చిత్రించే విధానం

  1. వస్త్రాలను శుభ్రం చేయడం
  2. వెదురు కలాల్ని సిద్ధం చేసుకోవడం
  3. బొగ్గుతో స్కెచ్ గీసుకోవడం
  4. నల్ల రంగుతో బొమ్మలను గీయడం
  5. సహజ రంగులను అద్దడం

ప్రముఖ కళంకారీ కళాకారులు

గురప్ప చెట్టి, దామోదరాచారి

మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=కలంకారీ&oldid=290599" నుండి వెలికితీశారు