యతి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 52: పంక్తి 52:


[[బొమ్మ:సస్కృతాంధ్రములో చంధశాస్త్ర యతులు.png|thumbnail|center|700px|సంస్కృతాంధ్రములో చంధశాస్త్ర యతులు]]
[[బొమ్మ:సస్కృతాంధ్రములో చంధశాస్త్ర యతులు.png|thumbnail|center|700px|సంస్కృతాంధ్రములో చంధశాస్త్ర యతులు]]

















09:24, 3 ఏప్రిల్ 2020 నాటి కూర్పు

యతి అనగా విరామం. ప్రతి పాదం మొదటి అక్షరానికి వడి అని పేరు. పద్య లక్షణాలను బట్టి నిర్ణయింపబడిన యతి స్థానంలో వడిని లేదా దాని మిత్రాక్షరాన్ని చేర్చుతారు.

యతి, యతి మైత్రి

పద్య పాదంలో మొదటి అక్షరానికి ఆ పద్యం లక్షణములలో చెప్పబడిన యతి స్థానంలో మైత్రి గల అక్షరాన్ని వాడటాన్నే "యతి మైత్రి" అంటారు.

యతి అంటే విరామం అని అర్థం. లయబద్ధమైన పద్య నడకలో సహజంగా వచ్చే విరామాన్ని యతి స్థానం అంటారు. సంస్కృతంలో యతి విరామాన్ని సూచిస్తుంది. కానీ తెలుగు పద్యాలలో ఇది అక్షర సామ్యాన్ని నియమిస్తుంది. అంటే ఈ యతి స్థానంలో ఉండే అక్షరం పాదం మొదటి అక్షరంతో "యతి మైత్రి"లో ఉండాలనేది నియమం.

ఈ క్రింది అక్షర వర్గాలలో ఒక వర్గంలోని అన్ని అక్షరాలూ పరస్పరం యతి మైత్రిలో ఉంటాయి.

  1. అ, ఆ, ఐ, ఔ, హ, య, అం, అః
  2. ఇ, ఈ, ఎ, ఏ, ఋ
  3. ఉ, ఊ, ఒ, ఓ
  4. క, ఖ, గ, ఘ, క్ష
  5. చ, ఛ, జ, ఝ, శ, ష, స
  6. ట, ఠ, డ, ఢ
  7. త, థ, ద, ధ
  8. ప, ఫ, బ, భ, వ
  9. ణ, న
  10. ర, ఱ, ల, ళ
  11. పు, ఫు, బు, భు, ము, పొ, ఫొ, బొ, భొ, మొ

ఇతర నియమములు

  • హల్లుల యతి మైత్రి పాటించేటప్పుడు వాటితో కూడిన అచ్చులకు కూడా యతి మైత్రి పాటించాలి. అంటే: "చ", "జ" ఒకే యతి మైత్రి వర్గంలో ఉన్నా "చ"కి "జి"తో మైత్రి కుదరదు.
  • హల్లులకి యతి మైత్రి లేకపోయినా, అవి రెండూ అచ్చుతో కలిస్తే వాటి మధ్య యతి చెల్లుతుంది. ఉదాహరణకు, "ద"కు "గ" యతిమైత్రి లేకపోయినా, "దృ"కు "గృ"కు యతి కుదురుతుంది.
  • సంయుక్తాక్షరాలు వచ్చిన చోట, యతి కోసం ఏ అక్షరాన్నైనా గణించవచ్చు. ఉదా: "క్రొ" మొదటి అక్షరం అనుకోండి. యతి మైత్రి కోసం దీన్ని "కొ"గా గానీ "రొ"గా గానీ భావించ వచ్చు.
  • ప్రతి వర్గములో చివర ఉన్న అనునాసిక అక్షరానికి (ఙ, ఞ, ణ, న, మ), ఆ వర్గంలో ముందు ఉన్న నాలుగక్షరాలతో అవి బిందు పూర్వకములైతే యతి చెల్లుతుంది. ఉదాహరణకు, తథదధన వర్గములోని అనునాసికమైన "న"కు "కంద" లోని "ద"కు యతి చెల్లుతుంది. ఉచ్చారణ పరంగా "కంద"ని "కన్ద" అని పలుకుతాం. అందువలన "న్ద"లోని "న"తో యతి కుదురుతుంది.
  • "మ"కు పూర్ణబిందుపూర్వకమైన య, ర, ల, వ, శ, ష, స, హ లతో యతి కుదురుతుంది.
  • ఇదే విధంగా, ఒక అక్షరం ముందున్న అక్షరం పొల్లుతో అంతమైతే, ఆ పొల్లుతో కూడా యతిమైత్రి జరుగుతుంది. ఉదాహరణకి యీ కింద పద్యంలో చివరి పాదం చూడండి:

జననీస్తన్యము గ్రోలుచున్ జరణ కంజాతంబునన్ గింకిణీ

స్వన మింపారగ దల్లి మేన మృదుల స్పర్శంబుగా దొండ మ
ల్లన యాడించుచు జొక్కు విఘ్నపతి యుల్లాసంబుతో మంత్రి వె

న్ననికిన్ మన్నపు పొంపుమీర నొసగున్ భద్రంబు లెల్లెప్పుడున్

చివరి పాదంలో మొదటి అక్షరం "న". యతిస్థానంలోని అక్షరం "భ". ఈ రెండు హల్లులకీ యతి చెల్లదు. కానీ, "భ"ముందు పదం "నొసగున్"లో "న్" ఉంది కాబట్టి, దానికి "న"తో యతి చెల్లుతుంది.

  • యతిస్థానంలో సంధి జరిగినప్పుడు, సాధారణంగా సంధి జరగకముందు ఉన్న అక్షరంతోనే యతిమైత్రి జరుగుతుంది. ఉదాహరణకు, ఈ కింద పద్యంలో రెండు, నాలుగు పాదాలు గమనించండి:

అంకము జేరి శైలతనయా స్తనదుగ్ధములాను వేళ బా

ల్యాంక విచేష్ట దొండమున నవ్వలి చన్ గబళింపబోయి యా
వంక గుచంబు గాన కహివల్లభ హారము గాంచి వే మృణా

ళాంకుర శంక నంటెడి గజాస్యుని గొల్తు నభీష్ట సిద్ధికిన్!

రెండవ పాదంలో, మొదటి అక్షరంలో సంధి జరిగింది, "బాల్య + అంక". అలాగే యతిస్థానంలో (10వ అక్షరం) కూడా సంధి జరిగింది, "తొండమునన్ + అవ్వలి". సంధి జరగక ముందున్న అక్షరాలు "అం"కు, "అ"కు యతిమైత్రి జరిగింది. అలాగే నాల్గవ పాదంలో, "మృణాళ + అంకుర", "గజ + ఆస్య". అక్కడ "అం"కు "ఆ"కు యతిమైత్రి.

  • యతి అక్షరాలలో ఒకటి అచ్చు అక్షరం మరొకటి హల్లు అక్షరం అయితే, వాటి మధ్య యతి కుదరదు. ఉదాహరణకి పాదంలో మొదటి అక్షరం "అ" అయితే, యతిస్థానంలో "క" అనే అక్షరం ఉండాలంటే, యతిమైత్రి కుదరదు. అయితే, దీనికి ఒక మినహాయింపు ఉంది. సంబోధనలో చివరి అక్షరం హల్లయినా, దానికి అచ్చుతో యతిమైత్రి కుదురుతుంది. ఉదాహరణకి మొదటి అక్షరం "అ" అయినప్పుడు, "అక్కా!", "ఔరా!" వంటి పదాలలోని "క్కా", "రా" అక్షరాలు యతిస్థానంలో ఊండవచ్చు, వాటికి "అ"తో యతిమైత్రి చెల్లుతుంది.

పై చెప్పినవి కాక మరికొన్ని ప్రత్యేక యతి మైత్రులు ఉన్నాయి. కాని అవి అరుదు.

సంస్కృతాంధ్రములో చంధశాస్త్ర యతులు

సంస్కృత భాషయందు ఏలాక్షణికుడు విరచించిన చ్చందశాస్త్ర గ్రంధము నందైనను ప్రతిశ్లోకముయొక్కయు యతిస్థాన నిర్దేశములో భేదము కనిపించదు. ఆంధ్రములో ఈ యతిస్థాన నిర్దేశము ద్వివిధముగా కనిపిస్తున్నది. యతిర్విచ్చేధః అనెడు లక్షణ యుక్తమైన స్థానమునందే పద్యములో యతి నిర్దేశము చేయుటొకటి. రెండవది చిత్రకవి పెద్దనార్యుని లక్షణసార సంగ్రహమునందును అనంతుని చంధోదర్పణము నందును శార్దూల విక్రీడిత వృత్తలక్షణము చెప్పునప్పుడు వివరించినారు. ఇట్లే మరికొన్ని చంధోగ్రంధములలో యతిస్థాన నిర్దేశమునందు ఈ క్రింద బొమ్మలో వివరించబడినది.

సంస్కృతాంధ్రములో చంధశాస్త్ర యతులు








బాహ్య లంకెలు

యతి అనగా ముని, యోగి అనే అర్ధాలు కూడా ఉన్నాయి.

"https://te.wikipedia.org/w/index.php?title=యతి&oldid=2906761" నుండి వెలికితీశారు