దువ్వాడ-విజయవాడ రైలు మార్గము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి clean up, replaced: మరియు → , (19), typos fixed: , → , (18)
చి "దువ్వాడ-విజయవాడ రైలు మార్గము" ను సంరక్షణ నుండి తీసివేసారు: సంరక్షణ అవసరం ప్రస్తుతం తీరిపోయిందని భావిస్తూ
(తేడా లేదు)

03:08, 8 ఏప్రిల్ 2020 నాటి కూర్పు

విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము
రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ - విజయవాడ జంక్షన్ నుండి బయలు దేరి విశాఖపట్నం-విజయవాడ మార్గములో ప్రయాణిస్తున్న 3 సూపర్ ఫాస్ట్ రైళ్లలో ఇది ఒకటి.
అవలోకనం
స్థితిఆపరేషనల్
లొకేల్ఆంధ్ర ప్రదేశ్
చివరిస్థానంవిశాఖపట్నం రైల్వే స్టేషను
విజయవాడ రైల్వే స్టేషను
ఆపరేషన్
ప్రారంభోత్సవం1897
యజమానిభారతీయ రైల్వేలు
నిర్వాహకులుదక్షిణ మధ్య రైల్వే జోను, తూర్పు తీర రైల్వే జోను (ఈస్ట్ కోస్ట్ రైల్వే జోను)
సాంకేతికం
ట్రాక్ పొడవు350 km (217 mi)
ట్రాకుల సంఖ్య2
ట్రాక్ గేజ్1676 బ్రాడ్‌గేజ్
ఆపరేటింగ్ వేగం130 km/h (81 mph) వరకు
దువ్వాడ-విజయవాడ మార్గము
ఖుర్దా రోడ్ - విశాఖపట్నం రైలు మార్గము వైపునకు
కొత్తవలస-కిరండల్ రైలు మార్గము వైపునకు
24
కొత్తవలస
15
పెందుర్తి
8
ఉత్తర సింహాచలం
7
సింహాచలం
6
గోపాలపట్నం
జాతీయ రహదారి 16
మార్షలింగ్ యార్డు (కుడివైపు లైన్లు
4
మర్రిపాలెం/ విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం
నావల్ డాక్ యార్డు
ఎస్సార్ స్టీల్
ఐరన్ ఓర్ సైడింగులు
9
కొత్తపాలెం
విశాఖపట్నం నౌకాశ్రయం - హార్బరు లోపల
0
విశాఖపట్నం
హిందూస్థాన్ జింక్ లిమిటెడ్
భారత్ హెవీ ప్లేట్ అండ్ వెసెల్స్(బిహెచ్‌పివి)
జాతీయ రహదారి 16
కోరమాండల్ ఇంటర్నేషనల్
విశాఖపట్నం రిఫైనరీ ఆఫ్ హెచ్‌పిసిఎల్
విశాఖపట్నం పోర్టు చానల్ (నీలం)
విశాఖపట్నం నౌకాశ్రయం - హార్బర్ లోపల
హిందూస్థాన్ షిప్ యార్డ్
విశాఖపట్నం పోర్టు - హార్బరు బయట
డాల్ఫిన్స్ నోస్ (కొండతో లైట్‌హౌస్)
బంగాళాఖాతంలింకుకు
విశాఖ ఉక్కు కర్మాగారం
గంగవరం పోర్ట్
17
దువ్వాడ
జాతీయ రహదారి 16
సింహాద్రి సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్
27
తాడి
జాతీయ రహదారి 16
33
అనకాపల్లి
38
కశింకోట
42
బయ్యవరం
జాతీయ రహదారి 16
50
నరసింగపల్లి
57
ఎలమంచిలి
జాతీయ రహదారి 16
62
రేగుపాలెం
75
నర్సీపట్నం రోడ్డు
86
గుల్లిపాడు
జాతీయ రహదారి 16
తాండవ నది
97
తుని
105
హంసవరం
110
తిమ్మాపురం
113
అన్నవరం
120
రావికంపాడు
123
దుర్గాడ గేటు
133
గొల్లప్రోలు
138
పిఠాపురం
150 / 13
సామర్లకోట
సర్పవరం
కాకినాడ టౌన్
0
కాకినాడ పోర్టు
నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్
కాకినాడ
కోరమాండల్ ఇంటర్నేషనల్
గోదావరి ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్
6
కొవ్వాడ
10
అర్తలకట్ట
15
కరప
18
వాకాడ
22
వేలంగి
24
నరసపురపుపేట
30
రామచంద్రపురం
35
ద్రాక్షారామం
39
కుందూరు
42
గంగవరం
45
కోటిపల్లి
కోటిపల్లి రేవు (యార్డు)
155
గూడపర్తి
159
మేడపాడు
162
పెదబ్రహ్మదేవం
167
బిక్కవోలు
171
బలభద్రపురం
177
అనపర్తి
181
ద్వారపూడి
185
కేశవరం
జివికె పవర్ ప్లాంట్
191
కడియం
జాతీయ రహదారి 16
200
రాజమండ్రి
204
గోదావరి / రాజమండ్రి విమానాశ్రయం
గోదావరి ఆర్చ్ వంతెన / గోదావరి
గోదావరి వంతెన / గోదావరి
208
కొవ్వూరు
211
పశివేదల
215
చాగల్లు
219
బ్రాహ్మణగూడెం
223
నిడదవోలు జంక్షన్
230
కాలధారి
234
సత్యవాడ
జాతీయ రహదారి 16
239
తణుకు
242
వేల్పూరు
245
రేలంగి
234
సత్యవాడ
250
అత్తిలి
252
మంచిలి
257
ఆరవిల్లి
260
లక్ష్మీనారాయణపురం
262
వేండ్ర
272 / 0
భీమవరం జంక్షను
30
నరసాపురం
26
గోరింటాడ
21
పాలకొల్లు
16
లంకలకోడేరు
13
శివదేవుచిక్కాల
11
వీరవాసరం
7
శృంగవృక్షం
5
పెన్నాడ అగ్రహారం
274
భీమవరం టౌన్
281
ఉండి
286
చెరుకువాడ
292
ఆకివీడు
302
పల్లెవాడ
308
కైకలూరు
316
మండవల్లి
319
మొఖాసాకలవపూడి
322
పుట్లచెరువు
324
పసలపూడి
327
గుంటకోడూరు
330
మోటూరు
337 / 0
గుడివాడ జంక్షన్
మచిలీపట్నం పోర్ట్ (ప్రణాళిక)
374
మచిలీపట్నం
370
చిలకలపూడి
364
పెడన
356
వడ్లమన్నాడు
352
కౌతరం
348
గుడ్లవల్లేరు
343
నూజెళ్ళ
7
దోసపాడు
9
వెంట్రప్రగడ
13
ఇందుపల్లి
18
తరిగొప్పుల
24
ఉప్పలూరు
30
నిడమానూరు
జాతీయ రహదారి 16
35
రామవరప్పాడు
39
మధురానగర్
230
మారంపల్లి
234
నవాబ్‌పాలెం
237
ప్రత్తిపాడు
243
తాడేపల్లిగూడెం
249
బాదంపూడి
254
ఉంగుటూరు
257
చేబ్రోలు
260
కైకరం
265
పూళ్ళ
271
భీమడోలు
277
సీతంపేట
281
దెందులూరు
జాతీయ రహదారి 16
290
ఏలూరు
292
పవర్‌పేట
299
వట్లూరు
జాతీయ రహదారి 16
309
నూజివీడు
315
వీరవల్లి
318
తేలప్రోలు
325
పెదఆవుటపల్లి
330
విజయవాడ విమానాశ్రయము
గన్నవరం
337
ముస్తాబాద
344
గుణదల
వరంగల్ కు
350 / 43
విజయవాడ జంక్షన్
కృష్ణానది
గుంటూరు-కృష్ణ కెనాల్ రైలు మార్గమునకు
విజయవాడ-చెన్నై రైలు మార్గము నకు


విశాఖపట్నం విజయవాడ విభాగం (అందరికీ తెలిసిన విశాఖపట్నం-విజయవాడ (లైన్) మార్గము) అనునది భారత దేశము లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని అనేక భూభాగములు కలుపుతూ విజయవాడ, విశాఖపట్నం రైల్వే స్టేషను మధ్యన ఉన్న ఒక రైలు మార్గము. ఈ మార్గము హౌరా-చెన్నై మార్గము ప్రధాన (లైన్) లోని ఒక భాగం. విశాఖపట్నం రైల్వే స్టేషను నుండి తాడి వరకు ఉన్న రైల్వే మార్గము యొక్క నిర్వహణ, పరిపాలన అనేది మాత్రము ఈస్ట్ కోస్ట్ రైల్వే (ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్) లేదా తూర్పు తీరప్రాంత రైల్వే (తూర్పు తీరప్రాంత రైల్వే జోన్) పరిధి లోనిది. మిగిలిన రైల్వే మార్గము అయిన అనకాపల్లి నుండి విజయవాడ రైల్వే స్టేషను వరకు ఉన్న దాని యొక్క నిర్వహణ, పరిపాలన దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఉంది.

భౌగోళికం

విశాఖపట్నం-విజయవాడ మార్గము (లైన్) తూర్పు కనుమలు, బంగాళాఖాతంల మధ్య ఉన్నటువంటిది, తూర్పు తీర మైదానాల యొక్క కేంద్ర భాగం గుండా ప్రయాణిస్తుంది, ఈ ప్రాంతం ఉత్తర సర్కారుల యొక్క కొంత భాగం కూడా ఉంది. ప్రధాన లైన్ గోదావరి నదిని దాటి దాని డెల్టా ఎగువకు ఉంది. ఈ లైన్ తీవ్ర ఒత్తిడితో కూడిన తుఫాను, వర్షాలకు రైల్వే ట్రాకులు, రైలు ప్రయాణానికి తీవ్ర అంతరాయం, నష్టం కలిగించే పరిణామాలకు లోబడి, తీర ప్రాంతం ద్వారా ప్రయాణిస్తుంది.[1][2] తీర మైదానాలు తరచుగా ఎక్కువగా ఋతుపవన కాలంలో వర్షం 55 అంగుళాలు (1,400 మి.మీ.) ఉంటుంది.[3][4][5][6]

నౌకాశ్రయము (పోర్ట్) అభివృద్ధి

  • విశాఖపట్నం పోర్ట్ మొదట మేఘాద్రిగడ్డ ముఖద్వారం వద్ద 1933 సం.లో ప్రారంభించబడింది. ఇది మొట్టమొదటగా బెంగాల్ - నాగపూర్ రైల్వే ద్వారా అభివృద్ధి చేయబడింది. పోర్ట్‌కు అంతర్గత నౌకాశ్రయం, ఒక ఔటర్ హార్బర్ ఉంది. విశాఖపట్నం ఓడరేవు 2010-11 సం.లో 68,04 మిలియన్ టన్నుల సరుకు ఎగుమతి, దిగుమతి పనులను నిర్వహించింది. ఇది భారతదేశంలోని కాండ్ల రేవు తర్వాత రెండవ అత్యధిక రవాణా నిర్వహణ. విశాఖపట్నం పోర్ట్ 200,000 డిడబ్ల్యుటి నౌకలు వరకు నిర్వహించడానికి తగిన సామర్ధ్యముతో ఆధునీకరణ చేపట్టబడి ఉంది.[7][8]
  • గంగవరం పోర్ట్ 2008 సం.లో ముందుకు వచ్చింది. ఇది 200,000 డిడబ్ల్యుటి నౌకలు వరకు నిర్వహించ గలుగుతుంది, ఇది భారతదేశం లోనే లోతైన ఓడరేవుగా నిలుస్తోంది.[9] ఒక చిన్న పోర్ట్ భీమునిపట్నం వద్ద గోస్తని నది ముఖద్వారం దగ్గర అభివృద్ధికి ప్రతిపాదించారు.[10] కాకినాడ పోర్ట్‌ లోని ఒక భాగంగా 1997 సం.లో కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ ప్రారంబించారు.[11] పోర్ట్ 50,000 డిడబ్ల్యుటి వరకు నౌకలను నిర్వహించగలుగుతుంది. పోర్ట్ 2010-2011 సం.లో 10.81 మిలియన్ టన్నుల సరుకు పనులను నిర్వహించింది.[12] మచిలీపట్నం వద్ద పోర్ట్ అభివృద్ధికి ప్రతిపాదించారు.[13]

ఇతర అభివృద్ధి పనులు

విశాఖపట్నం చమురు శుద్ధి కర్మాగారం షిప్‌యార్డు నుండి స్టీల్ ప్లాంట్ వరకు, అనేక మరిన్ని పరిశ్రమలుతో, విస్తరిస్తున్న పారిశ్రామిక నగరం. సింధియా షిప్‌యార్డు పేరుతో 1941 సం.లో స్థాపించి, సింధియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ లిమిటెడ్ నకు షిప్‌యార్డు ఒక భాగంగా నిర్మించబడి, అది హిందూస్థాన్ షిప్‌యార్డు గా 1961 లో మారింది.[14] విశాఖపట్నం రిఫైనరీ, తూర్పు తీరంలోని మొదటి నూనె శుద్ధి కర్మాగారం, అది 1957 లో, కాల్టెక్స్ ఆయిల్ రిఫైనింగ్ లిమిటెడ్‌చే స్థాపించబడింది. తరువాత 1976 లో భారతదేశం యొక్క ప్రభుత్వం స్వాధీనం చేసుకుని హిందూస్తాన్ పెట్రోలియంలో 1978 లో విలీనం చేశారు.[15] విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, భారతదేశంలో మొట్ట మొదటి తీరం ఆధారిత స్టీల్ ప్లాంట్ 1992 సం.లో ప్రారంబించారు.[16]

చరిత్ర

కొన్ని సంవత్సరాల ముందు రైల్వేలు ప్రయాణీకుల కోసం పనిచేయటం ఆరంభించింది. భారతదేశం రైల్వే లైన్లులో నిర్మాణ సామాగ్రి వాటిపై తరలించబడ్డాయి. వీటితో పాటు రూర్కీ 1830 సం.లో సమీపంలో గంగా కాలువ మీద సొలానీ కాలువ నిర్మాణం కోసం, రెడ్ హిల్ రైల్ రోడ్ 1837 సం.లో చెన్నై సమీపంలో కాలువ నిర్మాణం కోసం, గోదావరి ఆనకట్ట నిర్మాణం రైల్వే 1845 సం. ప్రాంతములో రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణానికి కావల్సిన సామాగ్రి రవాణా చేయడానికి ఒక లైన్ ఉపయోగించారు. ఈ ప్రాజెక్ట్ 1852 సం.లో పూర్తయ్యింది, ఆ తదుపరి ఈ రైల్వే మూసివేశారు.[17] చెన్నై సమీపంలో రెడ్ హిల్ రైల్ రోడ్ 1837 సం.లో గ్రానైట్ రవాణా కొరకు ఉపయోగించారు. ఇది భారతదేశంలో పనిచేస్తున్న మొదటి రైల్వే వంటిది అని అనేక మంది భావిస్తారు. అంతకుముందు స్థాపించబడిన మద్రాస్ రైల్వే 1853 సం.లో విలీనం చేయబడి, భారతదేశం యొక్క గ్రేట్ దక్షిణ రైల్వే గా 1858 సం.లో ఏర్పాటైంది.[18] భారతదేశం యొక్క గ్రేట్ దక్షిణ రైల్వే 1872 సం.లో కర్నాటిక్ రైల్వే లో విలీనం చేయబడి, 1874 సం.లో దక్షిణ భారతీయ రైల్వే గా పేరు మార్చబడింది. దక్షిణ మరాఠా రైల్వే యొక్క ప్రధాన తూర్పువైపు మార్గం విజయవాడ (అప్పుడు బెజవాడగా పిలుచేవారు) వరకు ఇతర మార్గాలతోను 1888 సం. వరకు అనుసంధానం చేయబడింది. 1889 సం.లో నిజాంస్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే యొక్క ప్రధాన మార్గం విజయవాడ వరకు పొడిగించారు.[19] 1893 నుండి 1896 వరకు ఉన్న మధ్య కాలంలో ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క 1,287 కి.మీ. (800 మైళ్ళు) విజయవాడ నుండి కటక్ వరకు నిర్మించబడింది. ఆ తదుపరి ట్రాఫిక్ కొరకు ప్రారంభిచారు.[20][21] ఓల్డ్ గోదావరి బ్రిడ్జ్ 1897 సం.లో నిర్మాణం జరిగింది.[19][22], 1899 సం.లో విజయవాడ-మద్రాసు లింక్ లైను నిర్మాణం జరిగి, రైళ్లు ఎకాఎకీ ఈ మార్గము గుండా నడిచేందుకు ప్రారంభించారు.[19] ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేరు నుండి విజయవాడ వరకు ) 1901 సం.లో మద్రాస్ రైల్వే వారు హస్తగతం చేసుకున్నారు.[23]

రైల్వే పునర్వ్యవస్థీకరణ

ప్రారంభ 1950 సం.లో, స్వతంత్ర రైల్వే వ్యవస్థలు అప్పట్లో కలిగిన ఉన్న వాటిని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు అధికారిక చట్టాన్ని ఆమోదింఛడము జరిగింది. 1951 సం. ఏప్రిల్ 14 న మద్రాస్, దక్షిణ మరాఠా రైల్వే, దక్షిణ ఇండియన్ రైల్వే కంపెనీ, మైసూర్ స్టేట్ రైల్వే దక్షిణ రైల్వే జోన్ నిర్మించటానికి గాను, విలీనం చెయ్యబడ్డాయి. 1966 సం. అక్టోబరు 2 న గతంలో ఉన్న (1) నిజాంస్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే లో కలసి ఉన్నటువంటి సికింద్రాబాద్, షోలాపూర్, హుబ్లి, విజయవాడ డివిజన్ల ప్రాంతాలు,, (2) దక్షిణ రైల్వే లో విలీనం చేయబడ్డ మద్రాసు రైల్వే, దక్షిణ మరాఠా రైల్వే లోని కొన్ని భాగాలను వేరుచేసి దక్షిణ మధ్య రైల్వే జోన్ (సౌత్ సెంట్రల్ రైల్వే) ఏర్పాటు చేయడం జరిగింది. 1977 సం.లో, దక్షిణ రైల్వే లోని గుంతకల్లు డివిజన్ దక్షిణ మధ్య రైల్వేకు, సోలాపూర్ డివిజన్ సెంట్రల్ రైల్వేకు బదిలీ చేయబడ్డాయి. 2010 సం.లో కొత్తగా రూపొందించిన ఏడు మండలాల వాటిలో ఉన్నటువంటి పశ్చిమ కనుమల రైల్వే జోన్ (సౌత్ వెస్ట్రన్ రైల్వే) అనేది దక్షిణ రైల్వే నుండి. వేరుచేసి ఏర్పాటు చేశారు.[24]

విద్యుద్దీకరణం(ఎలక్ట్రిఫికేషన్)

1965 సంవత్సరములో చెన్నై మెయిల్, భారత లోకోమోటివ్ తరగతి ( డబ్ల్యుడిఎమ్ - 1 ) / (డబ్ల్యుడిఎమ్- 2 ) అనే ఒక డీజిల్ ఇంజన్‌తో దక్షిణ తూర్పు రైల్వే జోన్ పరిధిలో హౌరా - చెన్నై మార్గములో నడిచిన మొట్ట మొదటి రైలు.[25] ఈ విశాఖపట్నం-విజయవాడ మార్గము అనునది 1997వ సంవత్సరములో సంపూర్ణముగా విద్యుద్దీకరణ (ఎలక్ట్రిఫికేషన్) చేయబడింది. అదేవిధముగా, హౌరా-చెన్నైమార్గము కూడా 2005 వ సంవత్సరములో సంపూర్ణముగా విద్యుద్దీకరణ జరిగింది.[26]

వేగ (స్పీడ్) పరిమితులు

మొత్తం ఖరగ్‌పూర్-విశాఖపట్నం-విజయవాడ ఈ ప్రధాన ఒక రైలు రహదారి (లైన్) ని " గ్రూప్ బి " వర్గీకరించబడి, ఈ మార్గములో 130 కి.మీ./గంటకు వేగం వరకు ప్రయాణించ వచ్చును. కాని, బ్రాంచి రైలు రహదారి (లైన్) లో మాత్రము 100 కి.మీ./గంటకు వేగ పరిమితితో మాత్రము ప్రయాణించ వచ్చును.[27]

విశాఖపట్నం-విజయవాడ
మార్గములోని రైలుబండ్ల
చిత్రములు

ప్రయాణీకుల ప్రయాణాలు

ఈ మార్గములో, భారతీయ రైల్వేలలోని అత్యంత రద్దీగా ఉన్న ప్రధాన వంద బుకింగ్ స్టేషనులలలో విశాఖపట్నం జంక్షన్ , రాజమండ్రి రైల్వే స్టేషను , విజయవాడ జంక్షన్ ఈ మూడు ఎల్లప్పుడూ ఉంటాయి .[28]

మూలాలు

  1. "Coastal Plains of India". Country facts – the world at your finger tips. Retrieved 2013-01-17.
  2. "The Coastal Plains of India". Zahie.com. Retrieved 2013-01-17.
  3. Rao, A. Srinivasa. "24 dead in Cyclone Nilam, Andhra Govt blames Met department for not predicting monsoon". India Today, 5 November 2012. Retrieved 2013-01-19.
  4. "Andhra Pradesh: Torrential rain in north coastal area, one dead". The Hindu, 5 October 2004. Retrieved 2013-01-19.
  5. "Andhra Pradesh". Encyclopaedia Brittanica. Retrieved 2013-01-19.
  6. "Cyclone 'Laila' weakening: to cross Andhra Coast Thursday afternoon". Netindian. Retrieved 2013-01-19.
  7. "Port of Visakhapatnam". History. Vizagport. Archived from the original on 2012-11-11. Retrieved 2013-01-24.
  8. "Vizag port feels the heat of competition from Gangavaram". The Hindu Business Line, 19 April 2011. Access My Library. Archived from the original on 22 మే 2015. Retrieved 2013-01-24.
  9. "Welcome to Gangavaram Port". Port Gangavaram. Retrieved 2013-01-24.
  10. "Bheemunipatnam Port". Department of Ports, Government of Andhra Pradesh. Archived from the original on 2013-03-10. Retrieved 2013-01-24.
  11. "Kakinada Seaports Ltd". Archived from the original on 2012-07-02. Retrieved 2013-01-24.
  12. "Kakinada Deep Water Port". Department of Ports, Government of Andhra Pradesh. Archived from the original on 2013-01-26. Retrieved 2013-01-25.
  13. "Machilipatnam Port". Department of Ports, Govt. of Andhra Pradesh. Archived from the original on 2013-01-23. Retrieved 2013-01-24.
  14. "Hindustan Shipyard: Making Waves". India Today. 2009-10-09. Retrieved 2013-01-25.
  15. "Hindustan Petroleum Corporation Ltd". Archived from the original on 2011-11-22. Retrieved 2013-01-24.
  16. "Rashtriya Ispat Nigam Ltd". ICVL. Retrieved 2013-01-24.
  17. Darvill, Simon. "India's first railways". Godavari Dam Construction Railway. IRFCA. Retrieved 2013-01-19.
  18. "IR History – Early days". 1832-1869. IRFCA. Retrieved 2013-01-19.
  19. 19.0 19.1 19.2 "IR History:Early days II". 1870-1899. IRFCA. Retrieved 2013-01-19.
  20. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2013-01-02.
  21. "History of Waltair Division". Mannanna.com. Archived from the original on 2012-10-11. Retrieved 2013-01-02.
  22. Address Resolution Protocol  Earthling . "Godavari River". En.academic.ru. Retrieved 2012-07-30.{{cite web}}: CS1 maint: extra punctuation (link)
  23. "IR History: Part III (1900-1947)". IRFCA. Retrieved 2013-01-19.
  24. "Geography – Railway Zones". IRFCA. Retrieved 2013-01-23.
  25. "IR History: Part - IV (1947 - 1970)". IRFCA. Retrieved 2012-11-21.
  26. "IR History Part VII (2000-present)". IRFCA. Retrieved 2013-01-23.
  27. "Chapter II – The Maintenance of Permanent Way". Retrieved 2013-01-02.
  28. "Indian Railways Passenger Reservation Enquiry". Availability in trains for Top 100 Booking Stations of Indian Railways. IRFCA. Retrieved 2012-12-30.

బయటి లింకులు

ఇవి కూడా చూడండి

మూసలు , వర్గాలు