Coordinates: 42°22′28″N 71°07′01″W / 42.37444°N 71.11694°W / 42.37444; -71.11694

హార్వర్డ్ విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6: పంక్తి 6:
| coordinates= {{Coord|42|22|28|N|71|07|01|W|region:US_type:edu|display=title,inline}}
| coordinates= {{Coord|42|22|28|N|71|07|01|W|region:US_type:edu|display=title,inline}}
| website = {{URL|harvard.edu}}
| website = {{URL|harvard.edu}}
| students = 20,739 (Fall 2018)<ref name=CDS-B>{{cite web|url=https://oir.harvard.edu/files/huoir/files/harvard_cds_2018-19.pdf |title=Harvard Common Data Set 2018-2019, Part B |publisher=Harvard University}}</ref>
}}
}}
[[File:Harvard square harvard yard.JPG|thumb|right|upright=1.35|హార్వర్డ్ యార్డ్]]
[[File:Harvard square harvard yard.JPG|thumb|right|upright=1.35|హార్వర్డ్ యార్డ్]]

16:53, 21 ఏప్రిల్ 2020 నాటి కూర్పు

హార్వర్డ్ విశ్వవిద్యాలయం
విద్యార్థులు20,739 (Fall 2018)[1]
స్థానం కేంబ్రిడ్జ్, మసాచుసెట్స్, యునైటెడ్ స్టేట్స్
42°22′28″N 71°07′01″W / 42.37444°N 71.11694°W / 42.37444; -71.11694
హార్వర్డ్ యార్డ్

హార్వర్డ్ విశ్వవిద్యాలయం (హార్వర్డ్ యూనివర్శిటీ) అనేది మసాచుసెట్స్ లోని కేంబ్రిడ్జ్ లోని ఒక ప్రైవేట్ ఐవీ లీగ్ పరిశోధనా విశ్వవిద్యాలయం. దీనిలో సుమారు 6,800 అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, సుమారు 14,000 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఉన్నారు. ఇది 1636 లో స్థాపించబడింది. దీనికి ఆర్థిక సాయం అందజేసిన మొదటి దాత, మతాధికారి జాన్ హార్వర్డ్ పేరు పెట్టబడింది. హార్వర్డ్ యునైటెడ్ స్టేట్స్ యొక్క పురాతన ఉన్నత విద్యా సంస్థ. ఈ విశ్వవిద్యాలయం యొక్క చరిత్ర, ప్రభావం, సంపద, విద్యా ఖ్యాతి ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలలో దీనిని ఒకటిగా నిలిపాయి.

1650 లో హార్వర్డ్ కార్పొరేషన్ హార్వర్డ్ యొక్క పాలకమండలిగా ఆమోదం పొందింది. ప్రారంభ సంవత్సరాల్లో హార్వర్డ్ కళాశాల ప్రధానంగా కాంగ్రేగేషనల్, యూనిటారియన్ మతాధికారులకు శిక్షణ ఇచ్చింది, అయినప్పటికీ ఇది అధికారికంగా ఏ తెగకైనా చెందినదని చెప్పబడలేదు, ఏ తెగతోనూ అనుబంధించబడలేదు.

18వ శతాబ్దంలో దీని పాఠ్యాంశాలు, విద్యార్థి సంఘం క్రమంగా లౌకికమయ్యాయి, 19వ శతాబ్దం నాటికి హార్వర్డ్ బోస్టన్ ఉన్నత వర్గాలలో కేంద్ర సాంస్కృతిక స్థాపనగా అవతరించింది. అమెరికన్ సివిల్ వార్ తరువాత, ప్రెసిడెంట్ చార్లెస్ డబ్ల్యూ.ఎలియట్ యొక్క సుదీర్ఘ పదవీకాలం (1869-1909) ఈ కళాశాల, అనుబంధ ప్రొఫెషనల్ పాఠశాలలను ఆధునిక పరిశోధనా విశ్వవిద్యాలయంగా మార్చింది; హార్వర్డ్ 1900లో అసోసియేషన్ ఆఫ్ అమెరికన్ యూనివర్సిటీస్ యొక్క వ్యవస్థాపక సభ్యత్వమును పొందింది. ఎలియట్ తరువాత వచ్చిన లారెన్స్ లోవెల్ అండర్గ్రాడ్యుయేట్ పాఠ్యాంశాలను మరింత సంస్కరించాడు, హార్వర్డ్ విశ్వవిద్వాలయం యొక్క భూములను, ప్రాంగణాన్ని వేగవంతంగా విస్తరించాడు. జేమ్స్ బ్రయంట్ కోనాంట్ రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో విశ్వవిద్యాలయాన్ని నడిపించాడు; అతను యుద్ధం తరువాత ప్రవేశాలను సరళీకృతం చేయడం ప్రారంభించాడు.

హార్వర్డ్ యొక్క పూర్వ విద్యార్థులలో 8 మంది యు.ఎస్. అధ్యక్షులు, 30 మందికి పైగా విదేశీ దేశాధినేతలు, 188 బిలియనీర్లు ఉన్నారు. మార్చి 2020 నాటికి 160 మంది నోబెల్ గ్రహీతలు, 18 ఫీల్డ్స్ పతక విజేతలు, 14 ట్యూరింగ్ అవార్డు గ్రహీతలు ఉన్నారు, వీరు ఈ విశ్వవిద్యాలయానికి విద్యార్థులు, అధ్యాపకులు లేదా పరిశోధకులుగా అనుబంధించబడ్డారు. అదనంగా, హార్వర్డ్ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు 10 అకాడమీ అవార్డులు, 48 పులిట్జర్ బహుమతులు, 108 ఒలింపిక్ పతకాలు (46 బంగారు, 41 రజత, 21 కాంస్య) గెలుచుకున్నారు, ఇంకా ఈ విశ్వవిద్యాలయ విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రముఖ సంస్థలను స్థాపించారు.[2][3][4]

మూలాలజాబితా

  1. "Harvard Common Data Set 2018-2019, Part B" (PDF). Harvard University.
  2. "Pulitzer Prize Winners". Harvard University. Retrieved February 2, 2018.
  3. "Harvard Olympians". gocrimson.com. Retrieved February 2, 2018.
  4. "Companies - Entrepreneurship - Harvard Business School". entrepreneurship.hbs.edu. Retrieved 2019-03-28.