కె.వి.మహదేవన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
→‎మూలాలు: +వర్గం
పంక్తి 42: పంక్తి 42:
[[వర్గం:తెలుగు సినిమా సంగీత దర్శకులు]]
[[వర్గం:తెలుగు సినిమా సంగీత దర్శకులు]]
[[en:K. V. Mahadevan]]
[[en:K. V. Mahadevan]]
శ్రుతిలయలు
స్వాతికిరణం

11:45, 16 ఏప్రిల్ 2008 నాటి కూర్పు

కృష్ణన్‌కోయిల్ వెంకటాచలం భాగవతార్ మహదేవన్ (కె.వి.మహదేవన్) (1917 - 2001) సుప్రసిద్ధ తెలుగు చలన చిత్ర సంగీత దర్శకుడు. వందలకొద్దీ తెలుగు, తమిళ చలన చిత్రాలకు ఈయన సంగీత దర్శకత్వం వహించారు. జానకిరాముడు, శంకరాభరణం, శ్రీనివాస కళ్యాణం (వెంకటేష్, గౌతమి, భానుప్రియ)మొదలైనవి ఆయన దర్శకత్వం వహించిన కొన్ని తెలుగు ఆణి ముత్యాలు.

మహదేవన్ 1917లో తమిళనాడులోని నాగర్‌కోయిల్‌లో జన్మించాడు. ఎం.ఎస్ విశ్వనాథన్ సమకాలీకుడైన మహదేవన్ 1942లో ఆనందన్ అనే తమిళ సినిమాతో చిత్రరంగములో అడుగుపెట్టి ఐదు దశాబ్దాలపాటు 600కు పైగా దక్షిణభారత సినిమాలకు సంగీతం సమకూర్చాడు. 1990లో ఆరోగ్య కారణాలు ఈయన సినీజీవితానికి తెరదించాయి. ఈయన సంగీతము సమకూర్చిన చివరి సినిమా మురుగనే తుణై (1990).[1]

సంపూర్ణ రామాయణము, తిరువిళయదల్ వంటి పౌరాణికచిత్రాలకు పేరుమోసిన మహదేవన్ శాస్త్రీయ సంగీతాన్ని, సినిమా సంగీతముతో మిళితం చేసే ఒరవడికి ఆద్యుడని భావిస్తారు. అనేకమంది సినీ సంగీత దర్శకులు ఈయన గురువు. ఈయన సంగీతం సమకూర్చిన సినిమాలలో శంకరాభరణం, కందన్ కరుణై, వసంత మాలిగై, వియత్నాం వీడు, పడిక్కథ మీతై మరియు వానంబాడి ప్రసిద్ధిగాంచినవి.

మహదేవన్ అంతిమదినాలలో శ్వాసపీల్చుకోవటం కష్టమై వారం రోజులపాటు అస్వస్థతతో ఆసుపత్రిలో ఉండి 2001, జూన్ 22న 83 సంవత్సరాల వయసులో మద్రాసులో మరణించాడు.[2]

పురస్కారాలు

అవీ ఇవీ

  • జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకునిగా పురస్కారం అందుకొన్న మొదటి వ్యక్తి.

తెలుగు చిత్రాలు

కె.వి.మహదేవన్ స్వరపరచిన కొన్ని తెలుగు చిత్రాలు:

మూలాలు

శ్రుతిలయలు స్వాతికిరణం