శివగంగై జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి clean up, replaced: మరియు → , (15), typos fixed: , → , (14)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 43: పంక్తి 43:
| leader_name1 = V Rajaraman [[Indian Administrative Service|IAS]]
| leader_name1 = V Rajaraman [[Indian Administrative Service|IAS]]
| unit_pref = Metric
| unit_pref = Metric
| area_footnotes =<ref name=AnnualEmploymentReport200708>{{cite web|author=Additional Collector|title= Employment report of Sivaganga District|url=http://rural.nic.in/AER/TN/AER_Sivaganga.pdf|accessdate=23 March 2011}}</ref>
| area_footnotes =<ref name=AnnualEmploymentReport200708>{{cite web|author=Additional Collector|title=Employment report of Sivaganga District|url=http://rural.nic.in/AER/TN/AER_Sivaganga.pdf|accessdate=23 March 2011|website=|archive-url=https://web.archive.org/web/20101224034946/http://rural.nic.in/AER/TN/AER_Sivaganga.pdf|archive-date=24 డిసెంబర్ 2010|url-status=dead}}</ref>
| area_rank =
| area_rank =
| area_total_km2 = 4189
| area_total_km2 = 4189

09:18, 28 ఏప్రిల్ 2020 నాటి కూర్పు

Sivaganga District
சிவகங்கை மாவட்டம்
Sivagangai Mavattam
District
Entrance to the Velu Nachiar Palace, Sivaganga
Entrance to the Velu Nachiar Palace, Sivaganga
Location in Tamil Nadu, India
Location in Tamil Nadu, India
Country India
Stateతమిళనాడు
DistrictSivaganga
HeadquartersSivaganga
TalukasSivaganga, Devakottai
Government
 • Collector & District MagistrateV Rajaraman IAS
Area
 • Total4,189 km2 (1,617 sq mi)
Population
 (2011)[2]
 • Total13,41,250
 • Density274.7/km2 (711/sq mi)
Languages
 • OfficialTamil
Time zoneUTC+5:30 (IST)
PIN
630561
Telephone code04575
ISO 3166 code[[ISO 3166-2:IN|]]
Vehicle registrationTN-63[3]
Largest cityKaraikudi
Sex ratioM-49%/F-51% /
Literacy52.5%%
Legislature typeelected
ClimateVery dry and hot with low humidity (Köppen)
Precipitation875.2 millimetres (34.46 in)

చరిత్ర

నిర్వహణ

District Collector Office-Sivagangai

జిల్లా కేంద్రంగా శివగంగై నగరం ఉంది. జిల్లా రెండు రవెన్యూ విభాగాలు 6 తాలుకాలుగా విభజించబడి ఉంది.

రెవెన్యూ విభాగం తాలూకాలు రెవెన్యూ గ్రామాల సంఖ్య
శివగంగ 4 శివగంగ, మానామదురై, ఇళయంకుడి, తిరుభువనం 267
దేవకోట్టై 3 దేవకోట, కారైకుడి, తిరుపత్తూరు 255
మొత్తం 7 521

పర్యాటక ప్రదేశాలు

The Holy dargah of Paanch Peer Shuhadaa at Kannar Road, Manamadurai
  • అంజన్మార్ పంచ్ షహీద్ వాలియుల్లాహ్ దర్గాహ్, కన్నార్ స్ట్రీట్, మానామదురై.
  • హర్జత్ సయ్యద్ సాలార్ షా షహీద్ వాలియుల్లాహ్, రజియల్లాహ్, తలా అంహు దర్గా.
  • కారైకుడికి 3 కి.మీ దూరంలో అరియకుడి దక్షిణ తిరుపతి ఉంది
  • దక్షిణతురుపతిగా ప్రశంశించబడే అరియకుడి శివగంగైకు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలోని వెంకటేశ్వరునికి అంగప్రదక్షిణ, కల్యాణౌత్సవాలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి.
  • కారైకుడిలో ఉన్న కోవిలూరు ఆలయం.
  • కందాదేవి ఆలయం.
  • ఇదైకత్తూరు చర్చి.
  • కొల్లాంగుడి వెట్టుడైయారు కాళియమ్మన్ ఆలయం.
  • కాళీశ్వరాలయం.
  • నగరశివన్ ఆలయం.
  • కుంరకుడి ఆలయ.
  • కొల్లకళైయమ్మన్ ఆలయం.
  • కళ్ళళ్ సోమసుందరం సౌందర్యనాయకి ఆలయంలో ప్రతిసంవత్సరం ఫిబ్రవరి మాసంలో నిర్వహించబడుతుంటాయి.
  • మానామదురైక్కు 5 కి.మీ దూరంలో ఉంది. పంచభూతేశ్వరం (వేదియనెడల్ విళక్కు). ఈ ఆలయం పరమకుడి నుండి ఇళయంకుడి మార్గంలో ఉంది. ఇది శ్రీరాముడు లంకపై దండెత్తడానికి

ప్రయాణం చేసిన మార్గమని విశ్వసిస్తున్నారు. ఈ ఆలయ గ్రానైట్ రాయికి ప్రసిద్ధిచెందినది. ఈ ఆలయంలో పనముఖ ప్రత్యంగిరా దేవి ప్రధానదైవంగా ఉంది. ఇక్కడ మహా ప్రత్యగింరాదేవికి పెద్ద విగ్రహం ఉంది. ఇక్కడ లక్ష్మీగణపతులకు, సొరంగర్షణా భైరవునికి ప్రత్యేక సన్నిధులు ఉన్నాయి. ఈ ఆలయం 5 ఎకరాల ఆవరణలో నిర్మించబడి ఉంది.

  • మాదాపురంలో భద్రకాళియమ్మన్ ఆలయం ఉంది.[4]

శిగంగై పాలకులు

రామ్నాడు, శివగంగై, పుదుకోట్టై భూభాలు కలిపి రామ్నాడు రాజ్యంలో భాగంగా ఉంటూవచ్చింది. రామ్నాడు రాజ్యం 7వ రాజైన రేగునాథా సేతుపతి (కిళవన్ సేతుపతి) 1674 నుండి 1710 వరకూ పాలించాడు. శివగంగైకు 4 కి.మీ దూరంలో ఉన్న నాలుకోట్టై పాలకుడు పెరియ ఉడైయ దేవరు ధైర్యసాలు చూడడానికి నాలుకోట్టైకు వచ్చాడు. పెరియ ఉడైయారు ధైర్యసాహసాలకు మెచ్చి 1,000 మంది సన్యలను నిర్వహించడానికి అవసరమైన భూమిని ఇస్తూ ఒప్పందం మీద సంతకం చేసాడు. కిళవన్ సేతుపతి మరణం తరువాత రామ్నాడు రాజ్యానికి విజయసేతుపతి 1710లో రామ్నాడు రాజ్యానికి 8వ రాజుగా వచ్చాడు. రాజు తనకుమార్తె ఆండాల్‌ఆచ్చిని నాలుకోట్టై పాలకుడైన పెరియదేవర్ కుమారుడైన శశివర్ణదేవరుకు ఇచ్చి వివాహం చేసాడు. కుమార్తెను ఇస్తూ భరణంగా శశివర్ణదేవరుకు 1,000 సైనికుల నిర్వహణ కొరకు పెరియదేవర్ పాలనలో ఉన్న భూములను శిస్తురహితంగా ఇచ్చాడు. అలాగే తిరుపత్తూరు, పిరన్మలై, తిరుపత్తూరు, షోలపురం, తిరుభువనం అలాగే తొండై నైకాశ్రయానికి రాజప్రతినిధిని చేసాడు. ఒకవైపు కిళవన్ సేతుపతి కుమారుడు భవాని శంకరన్ రామ్నాడు భూ భాగాన్ని జయించి 9వ రాజైన సుందరేశ్వర రఘునాథను ఖైదుచేసాడు. తరువాత భవాని శంకర్ తనకుతానే రమ్నాడు రాజుగా ప్రకటినుకుని రమ్నాడు 10వ రాజైయ్యాడు. 1726 నుండి 1729 వరకు భవాని శంకర్ రామ్నాడును పాలించాడు. తరువాత భవాని శంకర్ నాలుకోట్టై అధిపతి అయిన శశివర్మ పెరియ ఉడైయారుతో తలపడి ఆయనను నాలుకోట్టై నుండి తరిమి కొట్టాడు. సుందరేశ్వర రఘునాథ సేతుపతి సహీదరుడు కట్టయ్య రామ్నాడు నుండి పారిపోయి తంజావూరు రాజా తులియాజీ శరణుజొచ్చాడు. ఒకవైపు నాలుకోట్టై నుండి తరుమికొట్టపడిన శశివర్ణదేవర్ అరణ్యాలలో తిరుగుతూ అడవిలో శివగంగై అనే జలపాతం సమీపంలో తపసు చేసుకుంటున్న సాతప్పయ్య అనే మునిని కలుసుకున్నారు. రాజ్యభ్రష్టుడైన రాజు ఆయన మీందు నిలిచి తన గాథను వివరించాడు. ఆ ముని రాజుకు ఒక మంత్రం ఉపదేశించి ఆ మంత్రాన్ని ఉపాసించిన తరువాత తంజావూరు పోయి అక్కడ పోటీకి ఉన్న పులిని చంపమని ఆదేశించాడు. అక్కడ శశివర్ణదేవర్ తనలాగే శరణార్ధి అయిన కాట్టయ్య దేవన్‌ను కలుసుకున్నాడు. వాతిరువురు ఒకరితో ఒకరు చర్చించుకుని భవానీ శంకర్‌తో తలపడడానికి అవసరమైన సహాయం అందించమని కోరారు. తంజావూరు రాజు వారికి పెద్ద సంఖ్యతో సైన్యాలను తీసుకుని సహకరించమని దళవాయిని ఆదేశించాడు. శశివర్ణదేవర్, కట్టయ్య దేవన్ సైన్యాలతో భవానీ శంకర్‌తో తలపడి 1730లో తిరిగి రామ్నాడును స్వాధీనపరచుకున్నారు. తరువాత కట్టయ్యదేవన్ రామ్నాడు 11వ రాజుగా అయ్యాడు.

మొదటి రాజా శశివర్ణదేవర్

కాట్టయ్య దేవన్ రామ్నాడును ఐదుభాగాలుగా విభజించి అందులో మూడుభాగాలను తన ఆధీనంలో ఉంచుకుని మిగిలిన రెండు భాగాలకు నాలుకోట్టని కేంద్రగా చేసి దానికి శశివర్ణదేవరును రాజప్రతినిధిగా చేసాడు. అంతేకాక శశివర్ణదేవరుకు " రాజా ముత్తు విజయ రఘునాథ పెరియ ఉడైయ దేవర్ అనే " బిరుదుప్రదానం చేసాడు.

2వ ముత్తు వడుగనాథ పెరియ ఉడైయదేవర్ (1750–1772)

శశివర్ణ పెరియ ఉడైయ దేవర్ 1750లో మరణించాడు. తరువాత ఆయన ఏకైక కుమారుడు ముత్తు వడుగనాథ పెరియ ఉడైయారు శివగగైకు 2వ పాలకుడయ్యాడు. ఆయన భార్య " రాణి వేలునాచ్చియార్" ఆయనకు మిత్రురాలిగా, మార్గదర్శిగా, ఫిలాసఫర్‌గా " వ్యవహరించింది. శివగంగైకు తాండవరాయ పిళ్ళై శక్తియుతులు కలిగిన మత్రిగా సేవలందించాడు. ముత్తు వడుగనాథ పెరియ ఉడైయారు ఆంగ్లేయులు నిరాకరించిన వాణిజ్య అవకాశాలను డచ్ వారికి అందచేసాడు. ఈ కార్యకలాపంతో ఆగ్రహించిన ఆంగ్ల ప్రభుత్వం నవాబుకు సామంతరాజుగా కప్పం చెల్లించమని డచ్ వారుకి సహకరించడం ఆపివేయయమని ఆదేశాలు జారీ చేసారు. 1772లో తూర్పు నుండి స్మిత్ , పడమటి వైపు నుండి బెంజూరు శివగంగై మీద దాడిచేసారు. ఈ దాడిని ఎదురుచూసిన " రాజా ముత్తు వడుగనాథ పెరియ ఉడైయారు " కాళయర్‌కోయిల్ వద్ద సరికొత్త స్థావరం ఏర్పరుచుకుని శిగంగై నుండి తన మాకాం కాళయర్‌కోయిల్‌కు మార్చుకున్నాడు. 1772 జూన్ 25న శివగగైని ఆగ్లసైన్యాలు వశపరచుకున్నాయి. తరువాత రోజు ఆగ్లసైన్యాలు కాళయర్‌కోయిల్ మీద దాడిచేసి కీళనూరు, షోలపురం సైనిక స్థావరాలను స్వాధీనపరచుకున్నాయి. బెంజూరు దాడిని కొనసాగించి చివరకు రాజా ముత్తు వడుగనాథ పెరియ ఉడైయారు మీద దాడి చేసాడు. రాజా ముత్తు వడుగనాథ పెరియ ఉడైయారు తన అనుచరులతో యుద్ధంలో వీరమరణం పొందాడు. యుద్ధరంగంలో వేలునాచ్చియార్ ప్రదర్శించిన ధైర్యసాహసాలు పలువురి ప్రశంశలను అందుకున్నాయి. వేలునాచ్చియార్ తనకుమార్తె వేళాచ్చి నాచ్చియార్‌తో మంత్రి తాండవరాయ పిళ్ళై సాయంతో దిండిగల్ లోని విరుఇపాక్షికి పారిపోయింది. తరువాత వారు స్వాతంత్ర్య సమర యోధులు పెరియ మరిదు, చిన్న మరుదులతో కలిసింది.

3వ రాణి వేలునాచ్చియార్ (1772–1780)

Velu Nachiar Aranmanai

రాణివేలునాచ్చియార్, ఆమె కుమార్తె వెళ్ళాచ్చినాచ్చియార్ హైదర్ ఆలి సంరక్షణలో దిండిగల్ సమీపంలోని విరూపాక్షిలో నివసించించారు. తరువాత నవాబు వేలునాచ్చియార్, మరుదు సహోదరులను శివగంగై పాలన చెయ్యమని తమ సంరాజ్యానికి కప్పం చెల్లించమని ఆదేశించాడు. రాణి వేలునాచ్చియార్ మరుదు సహోదరులను వెంటపెట్టుకుని శివగంగైకు వెళ్ళి 1780 నుండి రాజ్యపాలన చేపట్టి చిన్నమరుదును మంత్రిగా, పెద్దమరుదును సేనాధిపతిగా చేసి పాలన కొనసాగించింది.

1780లో వేలునాచ్చియార్ మరుదు సహోదరులకు పాలనా బాధ్యతలు అప్పగించి 1790 వరకు పాలన కొనసాగించి సుమారు1790లో పరమపదించి ఉండవచ్చని భావించబడుతుంది. మరుదు సహోదరులు ఉడయార్ సరవై (మూకయ్యాపళనియప్పన్), సరవై అందాయర్ (పొన్నత్తాళ్)ల కుమారులు. వారు ప్రస్తుత రామనాథపురం కొంగులు వీధిలో నివసించారు. వారు పురాతన పొలిగర్ లేక దాని అనుబంధ జాతికి చెందినవారని భావించబడుతుంది.

మరుదు సహోదరుల సాహసం

సరవైకరన్ మరుదుషోదరుల జాతిని తెలుపుతూ వారు ఇంటిపేరుగా ఉంటూవచ్చింది. మరుదు సహోదరులు ముత్తువడుగనాదర్ వద్ద పనిచేస్తూ ఉండేవారు. తరువాత వారు సైనికాధిపతులుగా రాణించారు. చెక్కతో తయారు చెయ్యబడి చంద్రవంక ఆకారంతో పదునైన కొనతో ఉండే బూమరంగా (తమిళంలో వళరి కొయ్య) అనే ఆయుధం ప్రయోగించడంలో మరుదు సహోదరులు ఉద్దండులు అని ప్రఖ్యాతి వహించారు. మరుదు సహోదరులు ఆంగ్లేయులతో తలపడిన పొలింగర్ యుద్ధాలలో ఈ ఆయుధాన్ని ప్రయోగించారు. 12,000 సైనికులతో శివగంగ వద్ద నవాబు సైనికులతో తలపడి విజయం సాధించారు. పరాజితుడైన నవాబు 1789 మార్చి 10న మద్రాసు కౌంసిల్‌కు సహాయం కొరకు అభ్యర్ధన చేసుకున్నాడు. 1789 ఏప్రిల్ 29న ఆంగ్లసైనికులు కొల్లగడిని ముట్టడించారు. మరుదు సహోదరులు పెద్ద సైన్యం సాయంతో ఆంగ్లసైన్యాలను ఓడించారు.

కట్టబొమ్మన్ సహోదరులతో మరుదు సహోదరుల మైత్రి

మరుదసహోదరులకు వీరపాండ్యకట్టబొమ్మన్ సహోదరులతో గాఢమైత్రి ఉంటూవచ్చింది. వారిరువురు తరచూ చర్చలు సాగిస్తూ ఉండేవారు. 1799 అక్టోబరు 17న ఉరితీతకు గురైన తరువాత మూగదొరకు (ఊమైదొర)కు చిన్న మరుదు ఆశ్రయం ఇచ్చాడు. తరువాత మరుదుసహోదరులు ఆగ్లేయులను ఎదిరిస్తూ మతాతీతంగా దక్షిణభారతదేశ ముస్లిములు,క్రైస్తవులు, హొందువులను సమైక్యం చేస్తూ జంబూద్వీప ప్రకటన జారీచేసారు. ఆంగ్లేయుల నుండి మాతృదేశాన్ని విడుదల చేయాలని సంకల్పించి స్వాతన్య్రసమరంలో పాల్గొని మరుదుసహోదరులు సైతం ఓటమి పాలైయ్యారు. స్వాతంత్ర్యసమర యోధులకు నాయకత్వం వహించిన మరుదపాండ్యన్ గాయపడిన తన సహోదరుడు వెళ్ళై మరుదుతో కలిసి 1801 అక్టోబరు 24 శివగంగైజిల్లా లోని తిరుపత్తూరులో ఉన్న శిథిలమైన కోటలో ఉరితీతకు గురయ్యాడు. 1801న జరిగిన చివరి పోరాటంలో మరుదుసహోదరులు అసమానమైన ధైర్యం ప్రదర్శిస్తూ ఆంగ్లేయులను అడ్డుకుంటూ సిరువాయల్ గ్రామాన్ని అగ్నికి ఆహుతి చేసారు. మరుదు సహోదరులు వీరులు మాత్రమే కాదు. వారు ఉత్తమమైన పరిపాలనాదక్షత కూడా ప్రదర్శించారు. వారు పాలించిన 1783-1801 మద్యకాలంలో చెరువులు, బావులు తవ్వించడం ద్వారా వ్యవసాయానికి అవసరమైన సదుపాయాలు కల్పించారు. వారిపాలనలో శివగంగైలో వ్యవసాయం అభివృద్ధి చేయబడి పాడిపంటలు మెరుగునపడ్డాయి. మరుదసహోదరులు శివగంగై ప్రాంతంలో పలు ఆలయాలను కూడా నిర్మించారు.

చివరిపాలకుకులు

వరుసగా వచ్చిన పలువురు పాలకుల తరువాత శ్రీ కార్తికేయ వెంకటాచలపతి రాజయ్యా శ్రీషణ్ముగ రాజయ్యా శివగంగా సంస్థానం వారసుడయ్యాడు. ఈ ట్రస్టీ ఆధీనంలో 108 ఆలయాలు, 22 కట్టళైలు, 20 సత్రాలు నిర్వహించబడుతున్నాయి. డాక్టర్ వెంకటాచలపతి రాజయ్యా తన కుమార్తె శ్రీమతి మదురతంగై నాచ్చియారును వారసురాలిగా వదిలి 1986 ఆగస్టు 30న మరణించాడు. ప్రస్తుతం మదురతంగై నాచ్చియార్ శివగంగై సంస్థానాన్ని నిర్వహిస్తున్నారు. రామనాథపురం జిల్లా గజిట్ ఆధారంగా 1990 శివగంగై సంస్థానం నిర్వహింతున్న శివగంగై చరిత్రలో శివగంగైజిల్లా శివగంగై జమీన్, రామనాధపురం జమీను నుండి రూపుదిద్దుకున్నదని తెలుస్తుంది.

వెలుపలి లింకులు

మూస:తమిళనాడులోని జిల్లాలు

  1. Additional Collector. "Employment report of Sivaganga District" (PDF). Archived from the original (PDF) on 24 డిసెంబర్ 2010. Retrieved 23 March 2011. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  2. "2011 Census of India" (Excel). Indian government. 16 April 2011.
  3. www.tn.gov.in/sta/a2.pdf
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-01-13. Retrieved 2014-04-03.