రెండవ శ్రీరంగ రాయలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 21: పంక్తి 21:
== మరణం ==
== మరణం ==
మైసూరి పాలకుడు కంఠీరవ నరసరాజు I శ్రీరంగను రాజుగానే గుర్తించాడు. శ్రీరంగ 1678/1681 లో రాజ్యం లేని రాజుగా మరణించాడు, భారతదేశంలో మూడు శతాబ్దాలకు పైగా సాగిన విజయనగర పాలనకు అంతం పలికాడు. శ్రీరంగ ఏకైక కుమార్తెకు నరసింహచార్య వంశీకుడు శ్రీవల్లభతో వివాహం జరిపించాడు.
మైసూరి పాలకుడు కంఠీరవ నరసరాజు I శ్రీరంగను రాజుగానే గుర్తించాడు. శ్రీరంగ 1678/1681 లో రాజ్యం లేని రాజుగా మరణించాడు, భారతదేశంలో మూడు శతాబ్దాలకు పైగా సాగిన విజయనగర పాలనకు అంతం పలికాడు. శ్రీరంగ ఏకైక కుమార్తెకు నరసింహచార్య వంశీకుడు శ్రీవల్లభతో వివాహం జరిపించాడు.
==వేంకట పతి రాయలు==
'''వేంకట పతి రాయలు''' [[శ్రీ రంగ రాయలు 2|శ్రీరంగ రాయల]] కుమారుడు. వేంకటపతి రాయలు తండ్రి తరువాత సింహాసనము అధిస్టించి రెండు సంవత్సరములు పాలించినాదు, అది కూడా కేవలము నామ మాత్ర పరిపాలనే, ఇంతటితో [[ఆరవీటి వంశము]] అంతరించింది.


== మూలాలు ==
== మూలాలు ==

12:50, 10 మే 2020 నాటి కూర్పు

విజయ నగర రాజులు
సంగమ వంశము
మొదటి హరిహర రాయలు 1336-1356
మొదటి బుక్క రాయలు 1356-1377
రెండవ హరిహర రాయలు 1377-1404
విరూపాక్ష రాయలు 1404-1405
రెండవ బుక్క రాయలు 1405-1406
మొదటి దేవరాయలు 1406-1422
రామచంద్ర రాయలు 1422
వీర విజయ బుక్క రాయలు 1422-1424
రెండవ దేవ రాయలు 1424-1446
మల్లికార్జున రాయలు 1446-1465
రెండవ విరూపాక్ష రాయలు 1465-1485
ప్రౌఢరాయలు 1485
సాళువ వంశము
సాళువ నరసింహదేవ రాయలు 1485-1491
తిమ్మ భూపాలుడు 1491
రెండవ నరసింహ రాయలు 1491-1505
తుళువ వంశము
తుళువ నరస నాయకుడు 1491-1503
వీరనరసింహ రాయలు 1503-1509
శ్రీ కృష్ణదేవ రాయలు 1509-1529
అచ్యుత దేవ రాయలు 1529-1542
సదాశివ రాయలు 1542-1570
ఆరవీటి వంశము
రామ రాయ 1542-1565
తిరుమల దేవ రాయలు 1565-1572
శ్రీరంగ దేవ రాయలు 1572-1586
వేంకటపతి దేవ రాయలు 1586-1614
శ్రీరంగ రాయలు 1 1614-1614
రామదేవ రాయలు 1617-1632
పెద వేంకట రాయలు 1632-1642
శ్రీరంగ రాయలు 2 1642-1646

రెండవ శ్రీరంగ రాయలు (1642-1678 / 1681 CE) విజయనగర సామ్రాజ్యం యొక్క చివరి పాలకుడు, అతను మామ వెంకట III మరణం తరువాత 1642 లో అధికారంలోకి వచ్చాడు. అతను అళియ రామరాయల మునిమనవడు కూడా.

తిరుగుబాట్లు

సింహాసనాన్ని అధిష్టించే ముందు, రెండవ శ్రీరంగ రాయలు తన మామ వెంకట III పై తిరుగుబాటు చేసాడు. అతను బీజాపూర్ సుల్తాన్ సహాయం తీసుకుని 1638 లో చంద్రగిరి - వెల్లూరులో వెంకట III పై దాడి చేశాడు. 1642 లో ఈ రెండింటిపై అతడు చేసిన మరొక దండయాత్రను వెంకట III సైన్యం ఓడించింది. ఆ సమయంలో వీరు మద్రాసు సమీపంలో గోల్కొండ సైన్యాన్ని కూడా ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యాత్మక పరిస్థితులలో వెంకట III మరణించాడు. బీజాపూర్ సైన్యంతో ఉన్న రెండవ శ్రీరంగ రాయలు వారిని విడిచిపెట్టి వెల్లూరుకు తిరిగి వచ్చి తనను తాను విజయనగర రాజుగా చేసుకున్నాడు.

పాలన

శ్రీరంగ రాయలు మాజీ రాజుపై తిరుగుబాటు చేయడంలో అతడు చేసిన కుట్ర వలన జింజీ కి చెందిన నాయకుడు, మద్రాసు నాయకుడు దామర్ల వెంకటాద్రి నాయకుడు వంటి వారు చాలా మంది అతన్ని ఇష్టపడలేదు. బీజాపూర్, గోల్కొండ సుల్తాన్ల మధ్య గొడవలు రెండవ శ్రీరంగ రాయలు కి కొంతకాలం సహాయపడ్డాయి. 1644 లో గోల్కొండ సుల్తాను విస్తారమైన సైన్యంతో దాడిచేసాడు, కాని రెండవ శ్రీరంగ రాయలు చేతిలో ఓడిపోయాడు. రెండవ శ్రీరంగ రాయలు, ఇప్పుడు దక్షిణాది నాయకుల నుండి డబ్బు డిమాండ్ చేసేంత బలంగా ఉన్నాడు. దక్షిణ దిశగా దాడి వెళ్ళాడు. 1640 లలో, ఫోర్ట్ సెయింట్ జార్జ్ (మద్రాస్) ఉన్న స్థలాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ ఏజెంట్లకు మంజూరు చేశాడు. [1]

విరించిపురం యుద్ధం

1646 లో మైసూర్, జింజీ, తంజావూరుల సాయంతో పెద్ద సైన్యాన్ని సేకరించుకుని, గోల్కొండ దళాలపై దాడి చేసాడు.

ముస్లిం దళాలు తొలుత నష్టపోయినా, దక్కన్ నుండి అదనపు సైన్యాలు వచ్చి చేరడంతో అవి ముందుకు సాగాయి. 1652 వరకు యుద్ధం కొనసాగింది. 1649 లో మదురై తిరుమలాయ నాయకుడు బీజాపూర్ పాలకుడికి మద్దతుగా తన బలగాలను పంపాడు. కాని జింజీ కోట వద్ద కలుసుకున్న తరువాత, బీజాపూర్, గోల్కొండలు ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు, మదురై దళాలు గందరగోళాన్ని సృష్టించి, జింగీ సైన్యంతో కలిసిపోయాయి. ఇది 1649 లో జింగీ నాయక పాలనను ముగించడానికి దారితీసింది.

1652 నాటికి, రెండవ శ్రీరంగ రాయలు కి వెల్లూరు కోట మాత్రమే మిగిలింది. దాన్ని కూడా చివరికి గోల్కొండ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ సమయానికి ఆయనకు మైసూర్ మద్దతు మాత్రమే మిగిలి ఉంది. తంజావూరు ముస్లిం దళాలకు లొంగిపోగా, మదురై నాయకులు ముస్లిం దళాలకు భారీ మొత్తాలను చెల్లించారు. కాని ముగ్గురూ తమ రాజ్యాలను నిలుపుకున్నారు.

అంత్య కాలం

రెండవ శ్రీరంగ రాయలు తన చివరి సంవత్సరాలను తన ప్రధాన నాయకులలో ఒకరైన ఇక్కేరికి చెందిన శివప్ప నాయకుని మద్దతుతో గడిపాడు. ముస్లిం దళాల నుండి వెల్లూరును తిరిగి పొందగలనన్న ఆశతో ఉన్నాడు. రెండవ శ్రీరంగ రాయలు కి తిరుమలాయ నాయకుడు చేసిన ద్రోహం కారణంగా మైసూరు పాలకుడు కంఠీరవ నరసరాజు I మదురైతో వరుస యుద్ధాలు చేసి, కోయంబత్తూరు, సేలం భూభాగాలను స్వాధీనం చేసుకున్నాడు. 1800 వరకు ఈ ప్రాంతాలు మైసూరు రాజ్యం లోనే ఉండేవి.

మరణం

మైసూరి పాలకుడు కంఠీరవ నరసరాజు I శ్రీరంగను రాజుగానే గుర్తించాడు. శ్రీరంగ 1678/1681 లో రాజ్యం లేని రాజుగా మరణించాడు, భారతదేశంలో మూడు శతాబ్దాలకు పైగా సాగిన విజయనగర పాలనకు అంతం పలికాడు. శ్రీరంగ ఏకైక కుమార్తెకు నరసింహచార్య వంశీకుడు శ్రీవల్లభతో వివాహం జరిపించాడు.

వేంకట పతి రాయలు

వేంకట పతి రాయలు శ్రీరంగ రాయల కుమారుడు. వేంకటపతి రాయలు తండ్రి తరువాత సింహాసనము అధిస్టించి రెండు సంవత్సరములు పాలించినాదు, అది కూడా కేవలము నామ మాత్ర పరిపాలనే, ఇంతటితో ఆరవీటి వంశము అంతరించింది.

మూలాలు

  1. "Raja & Rani Mahal, Chandragiri Fort". Archeological Survey of India. Retrieved 5 December 2019.
విజయనగర రాజులు విజయ నగర రాజులు
సంగమ వంశం | సాళువ వంశం | తుళువ వంశం | ఆరవీడు వంశం | వంశ వృక్షం | పరిపాలన కాలం | సామ్రాజ్య స్థాపన | తళ్ళికోట యుద్ధం | పన్నులు | సామంతులు | ఆర్ధిక పరిస్థితులు | సైనిక స్థితి | సాహిత్య పరిస్థితులు | సామ్రాజ్యం


ఇంతకు ముందు ఉన్నవారు:
వేంకటపతి రాయలు
విజయనగర సామ్రాజ్యము
1642 — 1646
తరువాత వచ్చినవారు:
వేంకట పతి రాయలు 2