కింజరాపు రామ్మోహన నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి Reverted edits by 2409:4070:2E23:F216:0:0:BC48:F604 (talk) to last version by Yarra RamaraoAWB: unexplained content removal
ట్యాగులు: రోల్‌బ్యాక్ SWViewer [1.3]
పంక్తి 54: పంక్తి 54:
{{reflist}}
{{reflist}}


==ఇతర లింకులు==16వ లోక్‌సభ సభ్యులు]]
==ఇతర లింకులు==
[[వర్గం:16వ లోక్‌సభ సభ్యులు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
[[వర్గం:తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకులు]]
[[వర్గం:తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకులు]]

05:02, 24 మే 2020 నాటి కూర్పు

రామ్మోహన నాయుడు కింజరాపు

భారతదేశ పార్లమెంటు సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
16 మే 2014 నుండి
ముందు కిల్లి కృపారాణి
నియోజకవర్గం శ్రీకాకుళం లోకసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1987-12-18) 1987 డిసెంబరు 18 (వయసు 36)
నిమ్మాడ, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు విజయలక్ష్మి
కింజరాపు ఎర్రన్నాయుడు
జీవిత భాగస్వామి శ్రావ్య
నివాసం శ్రీకాకుళం (పట్టణం)
పూర్వ విద్యార్థి పర్డ్యూ విశ్వవిద్యాలయం (బ్యాచులర్ ఆఫ్ సైన్సు)
లాంగ్ ఐలాండ్ విశ్వవిద్యాలయం ఎం. బి. ఎ
మతం హిందూ మతము

కింజరాపు రామ్మోహననాయుడు (జననం 1987 డిసెంబరు 18) భారతదేశ 16వ లోక్‌సభ సభ్యుడు. ఈయన శ్రీకాకుళం లోకసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన తెలుగుదేశం పార్టీ నాయకులు.[1] ఆయన ప్రముఖ తెలుగుదేశం నాయకుడు కింజరాపు ఎర్రంనాయుడు యొక్క కుమారుడు. ఇంజనీరింగ్లో పట్టభద్రులైనాడు. తన 26 సంవత్సరాల ప్రాయం నుండి రాజకీయ జీవితంలోనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రులు అయిన ప్రతిభాభారతి, గుండ అప్పలసూర్యనారాయణ, ఆయన పినతండ్రి కింజరాపు అచ్చంనాయుడు సమక్షంలో ప్రవేశించారు. యాదృచ్ఛికంగా ఎర్రన్నాయుడు, అతని సోదరుడు అచ్చన్నాయుడు కూడా 26 సంవత్సరాల వయస్సునుండే తమ రాజకీయ జీవితం ప్రారంభించారు. ఎర్రన్నాయుడు గారి గృహంలో ప్రజలతో కలవడానికి, ప్రెస్ కాన్ఫరెన్సుల కొరకు ఆయన "ప్రజా సదన్"ను ప్రవేశపెట్టారు.[2]

వ్యక్తిగత జీవితం

ఆయన శ్రీకాకుళం జిమ్మాడ గ్రామంలో డిసెంబరు 18 1987 న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు విజయలక్ష్మి , ఎర్రన్నాయుడు.[3] రామ్మోహన్ నాయుడు ఒక అక్క ఉంది. ఒకటి నుంచి మూడో తరగతి దాకా శ్రీకాకుళంలోని గురజాడ ఎడ్యుకేషనల్ సొసైటీ హాస్టల్ లో ఉండి చదువుకున్నారరు. 1994 లో తండ్రి ఎర్రన్నాయుడు చీఫ్ విప్ అయ్యాడు. అప్పుడు పిల్లలను చదువుకోసం శ్రీకాకుళం నుంచి హైదరాబాదుకు తరలించాడు. అక్కడ భారతీయ విద్యాభవన్ లో నాలుగు, ఐదు తరగతులు చదివాడు. 1996 లో ఎర్రన్నాయుడు ఎం. పి గా ఎన్నికై కేంద్ర ప్రభుత్వ మంత్రి దక్కడంతో రామ్మోహన్ ఆరో తరగతిలో ఉండగా వీరి కుటుంబం ఢిల్లీకి మారింది.[4] ఢిల్లీలో ఆర్. కె. పురం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు.

చిన్నప్పుడు ఇంజనీరింగ్ పై ఆసక్తి ఉండేది. ఇంటర్ పూర్తి కాగానే అమెరికాలో బి. ఎస్ చదవడం కోసం పరీక్ష రాశాడు. అందులో ఎంపికై పర్డ్యూ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో చేరాడు. తర్వాత అక్కడే లాంగ్ ఐలాండ్ విశ్వవిద్యాలయం నుంచి ఎం. బి. ఎ పూర్తి చేశాడు. తర్వాత ఢిల్లీకి తిరిగివచ్చి ఒక ఇంటీరియర్ డెవెలప్మెంట్ కంపెనీ మార్కెటింగ్ వ్యవహారాలు చూసుకునేవాడు. అప్పుడే తండ్రి మరణం గురించి తెలిసింది.

రాజకీయ జీవితం

ఆయన భారత పార్లమెంటు సభ్యులలో ఉన్న యువకులలో ఒకడు. ఆయన 16వ లోక్‌సభకు ఎన్నికైనారు. ఆయన లోక్‌సభలో హోమ్‌ అఫైర్స్ స్టాండింగ్ కమిటీ, కన్సల్టేటివ్ కమిటీ, పర్యాటక , సంస్కృతి మంత్రిత్వ సాఖ, అధికార భాష , వెనుకబడినతరగతుల సంక్షేమం కమిటీలలో సభ్యులుగా ఉన్నారు.[3]

రాజకీయ గణాంకాలు

క్ర.సం. సంవత్సరం నియోజకవర్గం ప్రత్యర్థి ఓట్లు ఆధిక్యత ఫలితం
1 2014 శ్రీకాకుళం రెడ్డి శాంతి (వై.యస్.ఆర్.సి.పి.) 556163 - 428591 127,572 గెలుపు

మూలాలు

  1. "Constituencywise-All Candidates". Retrieved 17 May 2014.
  2. "Rammohan Naidu named successor of Yerran Naidu". The Hindu (in Indian English). 2012-11-24. ISSN 0971-751X. Retrieved 2016-03-04.
  3. 3.0 3.1 "Members : Lok Sabha". 164.100.47.192. Archived from the original on 2016-03-06. Retrieved 2016-03-04.
  4. చల్లా, విజయభాస్కర్. "హిందీకి భయపడి దిల్లీకి వద్దన్నాం!". eenadu.net. ఈనాడు. Retrieved 1 August 2018.

ఇతర లింకులు