జీన్-పాల్ సార్ట్రే: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 14: పంక్తి 14:
| main_interests = [[Metaphysics]], [[epistemology]], [[ethics]], [[consciousness]], [[self-consciousness]], [[literature]], [[political philosophy]], [[ontology]]
| main_interests = [[Metaphysics]], [[epistemology]], [[ethics]], [[consciousness]], [[self-consciousness]], [[literature]], [[political philosophy]], [[ontology]]
| alma_mater = [[École Normale Supérieure]], [[University of Paris]]<ref>At the time, the ENS was part of the University of Paris according to the decree of 10 November 1903.</ref> (BA/MA)<ref name="Schrift"/>
| alma_mater = [[École Normale Supérieure]], [[University of Paris]]<ref>At the time, the ENS was part of the University of Paris according to the decree of 10 November 1903.</ref> (BA/MA)<ref name="Schrift"/>
| influences = [[Kierkegaard]], [[Simone de Beauvoir|de Beauvoir]], [[Gustave Flaubert|Flaubert]], [[Sigmund Freud|Freud]], [[Georg Wilhelm Friedrich Hegel|Hegel]], [[Martin Heidegger|Heidegger]], [[Edmund Husserl|Husserl]], [[Henri Bergson|Bergson]], [[Alexandre Kojève|Kojève]], [[Karl Marx|Marx]], [[Maurice Merleau-Ponty|Merleau-Ponty]], [[Friedrich Nietzsche|Nietzsche]], [[Paul-Yves Nizan|Nizan]], [[Emmanuel Levinas|Levinas]], [[Marcel Proust|Proust]], [[Louis-Ferdinand Céline|Céline]], [[Wilhelm Stekel|Stekel]], [[Henri Lefebvre|Lefebvre]],<ref>Ian H. Birchall, ''Sartre against Stalinism'', Berghahn Books, 2004, p. 176: "Sartre praised highly [Lefebvre's] work on sociological methodology, saying of it: 'It remains regrettable that Lefebvre has not found imitators among other Marxist intellectuals'."</ref> [[Jean-Jacques Rousseau|Rousseau]]<ref>{{cite web|url=http://web.ics.purdue.edu/~smith132/French_Philosophy/Fa92/sartD.pdf |title=Sartre's Debt to Rousseau |format=PDF |accessdate=2 March 2010}}</ref>
| influences = [[Kierkegaard]], [[Simone de Beauvoir|de Beauvoir]], [[Gustave Flaubert|Flaubert]], [[Sigmund Freud|Freud]], [[Georg Wilhelm Friedrich Hegel|Hegel]], [[Martin Heidegger|Heidegger]], [[Edmund Husserl|Husserl]], [[Henri Bergson|Bergson]], [[Alexandre Kojève|Kojève]], [[Karl Marx|Marx]], [[Maurice Merleau-Ponty|Merleau-Ponty]], [[Friedrich Nietzsche|Nietzsche]], [[Paul-Yves Nizan|Nizan]], [[Emmanuel Levinas|Levinas]], [[Marcel Proust|Proust]], [[Louis-Ferdinand Céline|Céline]], [[Wilhelm Stekel|Stekel]], [[Henri Lefebvre|Lefebvre]],<ref>Ian H. Birchall, ''Sartre against Stalinism'', Berghahn Books, 2004, p. 176: "Sartre praised highly [Lefebvre's] work on sociological methodology, saying of it: 'It remains regrettable that Lefebvre has not found imitators among other Marxist intellectuals'."</ref> [[Jean-Jacques Rousseau|Rousseau]]<ref>{{cite web |url=http://web.ics.purdue.edu/~smith132/French_Philosophy/Fa92/sartD.pdf |title=Sartre's Debt to Rousseau |format=PDF |accessdate=2 March 2010 |website= |archive-url=https://web.archive.org/web/20110608150812/http://web.ics.purdue.edu/~smith132/French_Philosophy/Fa92/sartD.pdf |archive-date=8 జూన్ 2011 |url-status=dead }}</ref>
| influenced = [[Raymond Aron|Aron]], [[Albert Camus|Camus]], [[Simone de Beauvoir|de Beauvoir]], [[Frantz Fanon|Fanon]], [[Che Guevara|Guevara]], [[R. D. Laing|Laing]], [[Maurice Merleau-Ponty|Merleau-Ponty]], [[André Gorz|Gorz]], [[Gilles Deleuze|Deleuze]], [[Jacques Rancière|Rancière]], [[René Leibowitz|Leibowitz]], [[Pierre Verstraeten|Verstraeten]]
| influenced = [[Raymond Aron|Aron]], [[Albert Camus|Camus]], [[Simone de Beauvoir|de Beauvoir]], [[Frantz Fanon|Fanon]], [[Che Guevara|Guevara]], [[R. D. Laing|Laing]], [[Maurice Merleau-Ponty|Merleau-Ponty]], [[André Gorz|Gorz]], [[Gilles Deleuze|Deleuze]], [[Jacques Rancière|Rancière]], [[René Leibowitz|Leibowitz]], [[Pierre Verstraeten|Verstraeten]]
| notable_ideas =[[Bad faith (existentialism)|Bad faith]], "[[existence precedes essence]]", [[Nothing#Existentialists|nothingness]], "Hell is other people", [[Situation (Sartre)|situation]], "every positional consciousness of an object is a non-positional consciousness of itself",<ref>Sartre, J.-P. 2004 [1937]. ''The Transcendence of the Ego''. Trans. Andrew Brown. Routledge, p. 7.</ref><ref>Siewert, Charles, [http://plato.stanford.edu/archives/fall2011/entries/consciousness-intentionality/ "Consciousness and Intentionality"], The Stanford Encyclopedia of Philosophy (Fall 2011 Edition), [[Edward N. Zalta]] (ed.).</ref> [[Sartrean terminology]]
| notable_ideas =[[Bad faith (existentialism)|Bad faith]], "[[existence precedes essence]]", [[Nothing#Existentialists|nothingness]], "Hell is other people", [[Situation (Sartre)|situation]], "every positional consciousness of an object is a non-positional consciousness of itself",<ref>Sartre, J.-P. 2004 [1937]. ''The Transcendence of the Ego''. Trans. Andrew Brown. Routledge, p. 7.</ref><ref>Siewert, Charles, [http://plato.stanford.edu/archives/fall2011/entries/consciousness-intentionality/ "Consciousness and Intentionality"], The Stanford Encyclopedia of Philosophy (Fall 2011 Edition), [[Edward N. Zalta]] (ed.).</ref> [[Sartrean terminology]]

05:07, 30 మే 2020 నాటి కూర్పు

Jean-Paul Sartre
Sartre in 1967
జననంJean-Paul Charles Aymard Sartre
(1905-06-21)1905 జూన్ 21
Paris, France
మరణం1980 ఏప్రిల్ 15(1980-04-15) (వయసు 74)
Paris, France
యుగం20th-century philosophy
ప్రాంతంWestern philosophy
తత్వ శాస్త్ర పాఠశాలలుExistentialism
Phenomenology
Hermeneutics
Anarchism
Western Marxism (early)
ప్రధాన అభిరుచులుMetaphysics, epistemology, ethics, consciousness, self-consciousness, literature, political philosophy, ontology
Alma materÉcole Normale Supérieure, University of Paris[1] (BA/MA)[2]
ప్రసిద్ధ ప్రసిద్ధ ఆలోచనలుBad faith, "existence precedes essence", nothingness, "Hell is other people", situation, "every positional consciousness of an object is a non-positional consciousness of itself",[3][4] Sartrean terminology
ప్రభావితమైనవారు
సంతకం

జీన్-పాల్ సార్ట్రే (Jean-Paul Sartre) ఒక ప్రముఖ ఫ్రెంచ్ తత్వవేత్త. ఆతను మార్క్సిజం, అస్తిత్వవాదం పై రచనలు చేసేవాడు. అతను తాను మార్క్సిస్టునని చెప్పుకున్నప్పటికీ అతని రచనలు మార్క్సిజానికి దూరంగా ఉండేవి. అతనిలో మార్క్సిజానికి విరుద్ధమైన జడతత్వవాద ఆలోచనలు ఎక్కువగా ఉండేవి. కొన్ని విషయాలలో మాత్రం అతను మార్క్సిస్టులని బలంగా సమర్థించేవాడు. ఉదాహరణలు: రెండవ ప్రపంచ యుధ్ధం, వియత్నాం యుద్ధం విషయాలలో ఇతను మార్క్సిస్టుల వైపే ఉన్నాడు.

1905వ సంవత్సరం, జూన్ 5వ తారీఖున పాశ్చాత్య నాగరికతకు మెట్టినిల్లుగా భాసించే పారిస్ నగరం లో, మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు సార్ట్రే.మహా సంక్షోభమొకటి రాత్రింబవళ్ళును కాల్చివేస్తున్న ఆదుర్దినాలలో పారిస్ లోనూ, లోరోషెల్ లోనూ విద్యాభ్యాసం ముగించాడు. మూడు పదుల జీవితం నిండకుండానే 1930 నుండి వేదాంతశాస్త్రాన్ని బోధించే ఆచార్యుడిగా పొట్టపోసుకోవడంకోసం ప్రారంభించాడు.ఆచార్యుడిగా ఉండగానే కీర్క్ గార్డ్, హెయెడెగార్ వంటి ప్రముఖ దార్సినికుల రచనలు చదివి వారి ప్రభావానికి లోనయ్యాడు.ఆ ప్రభావమే తర్వాత తర్వాత అస్తిత్వవాదంగా పరిణమించింది.అయితే ఈ అస్తిత్వవాదం, 2వ ప్రపంచయుద్ధానికి ముందు అతడు ప్రచురించిన రచనలలో మనకెక్కడా కనిపించదు.1939సం.లో సైన్యంలో చేరాడు.40 నిండీ నిండకుండానే శత్రువుల చేతికి చిక్కి జీవన్మరణాల మధ్య ఊగిసలాడాడు. కానీ విధి అనుకూలించి, ఎల్లాగో తప్పించుకొని పారిస్ చేరి అజ్ఞాతజీవితం ప్రారంభించి, ఆదరిద్రస్థితిలోనే పంచమాంగదళంలో చేరి పనిచేయడం ప్రారంభించాడు. తన జీవన విధానాన్ని, తను నమ్మినదానిని సర్వ ప్రపంచానికి తేటతెల్లం చేయాలని, సాహిత్య కృషీవలుడై, అచిరకాలంలోనే అశేషమైన ప్రజాదరణను సంపాదించుకొని, పెక్కు నాటకాలను, నవలలను ప్రచురించాడు.

రచనలు

1943లో తన మొట్టమొదటి నాటకం హెయిస్ క్లోస్ ను ప్రచురించాడు.ఈనాటకమే లండను నగరంలో విషస్ సర్కిల్ అన్నపేరుతోనూ, న్యూయార్క్లో నో ఎగ్జిట్ అన్నపేరుతోనూ ప్రచురించబడి ప్రదర్శనలో పెక్కుమంది విమర్సకులచేత అద్భుతమైన ప్రదర్శనగా పొగడబడింది.అతన నాటక రచయితగా స్థిరపడడానికి ఈ రచన ఎంతో దోహదపడినది.ఆ తరువాత అదే సం. (1943)లోనే లేమోషెస్ (The Flies / Les mouches) 1946లో మోర్ట్స్ సాంస్ సెపుల్చర్ (Morts sans sépulture) లాపుటైరెస్ రెస్పెక్టుస్ (The Respectful Prostitute / La putain respectueuse ) అన్న నాటకాలనూ వరుసగా ప్రచురించాడు.ఈ నాటకాలన్నే లండను నగర రంగస్థలం మీద ప్రదర్సించబడి ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యచకితులను చేశాయి.అయితే సార్ట్రేకు సర్వప్రపంచంలోనూ ఎనలేని గౌరవాన్ని కూర్చి పెట్టినవి నలభై-నలభైఏడు లమధ్య లే కెమిన్ డిలా లిబర్టే అన్న పేరుతో అతను వాసిన నవలాత్రయం.ఈ నవలలో ఆధునిక మానవుడు అధికారదాహంతో రాజకీయ సుడిగుండాలలో చిక్కుకొని ఎలా తనను తాను హింసించుకుంటున్నదీ-అతి వాస్తవికంగా, నగ్నంగా, భయంకరంగా ఎక్సురే కళ్ళతో చిత్రీకరించాడు సార్ట్రే. ఈనగ్న చిత్రణం మూలాన ఆతని రచనలకు 1948లో బహిష్కార సన్మానం కూడా జరిగింది.

ఎగ్జిస్టెన్షియలిజం అన్నపేరుతో సార్ట్రే ఆంగ్లంలో పిలవబడుతున్న సార్ట్రే జీవన ధృక్పధానికి అస్తిత్వవాదం అని తెలుగులోకి అనువదించి ప్రచారం చేశారు శ్రీ. పిలకా గణపతిశాస్త్రి గారూ తదితరులునూ.సార్ట్రే రచనలలో పెక్కింటికి ఈవాదం జీవనాడి.మానవుని ఉనికిని, ప్రపంచపు మనుగడను తెలియజెప్పే ఆతని తీవ్ర వేదన, ఈవాద రూపమై విశ్వానికి వెలుగునిస్తోంది. ఏది నిత్యమో, ఏది చిరయో, ఏది సార్వజనికమో దానిని గూర్చి తెలియజేస్తుంది ఈవాదం.వ్యక్తి స్వభావాన్నీ, మానవుని విచిత్రానుభూతులనూ తరచి తరచి జగద్రహస్య సిద్ధాంతాలను తేటతెల్లం చేస్తుందీ ఆస్తిత్వం. సర్వ ప్రపంచమూ ముందుకు సాగడానికి ఏకదలిక ముఖ్యమో ఏ కదలికలో జీవ గుణం నిబిడీకృతమై నడిపిస్తుందో ఆజీవగుణాన్నే అస్తిత్వం తెలియజేస్తుంది. కఠోపనిషత్తులో చెప్పినట్టుగా ఇంద్రియములకు కారణ భూతములైన శబ్దాది విషయాలు స్వకార్యములయిన ఇంద్రియములకంటే సూక్ష్మములూ ప్రత్యగాత్మ భూతములూ అని ఈవాదమూ అంటుంది.ప్రతీవాడూ అహం అనుకుంటూనే తన బ్రతుకు గతిని నిర్ణయించుకుంటూంటాడు.ఈ అహాన్ని గూర్చిన స్పర్స అతని రక్తంలో జీర్ణమై ఉంటుంది.తనను గూర్చిన అహం భావం జ్ఞానం లేకుండా మనిషి బ్రతకడమే కష్టం.అందుచేతనే ఈబ్రతుకులో నిత్యమనుకునే కొన్ని కొన్ని సత్యాలు వ్యక్తి గతమైనటువంటివి, ఆయా కాలాలకు, ఆయా పరిస్థితులకు తగినటువంటివే కాని, సార్వజనికములూ సార్వకాలికములు అయినటువంటివి కావు అని సార్ట్రే ప్రతిపాదిస్తాడు.

చిన్న కధలు

సార్ట్రే నవలలూ, నాటకాలే కాదు పెక్కు కథలు కూడా వ్రాశాడు.అయితే ఆచిన్న కథలను, కథలుగా ఆధునికులు, కొంతమంది సమకాలీకులు ఒప్పొకోలేదు.కారణం ఈకథలలో ఓ హెన్రీ కథలలో కనిపించే ముగింపు బిగింపు కానీ సొమర్సెట్ మాం రచనలలో కొట్టొచ్చినట్లు కనబడే కథాక్ధనంగానీ, మనకు కనిపించవు.పైగా కొన్ని కొన్ని పూర్వ సంప్రదాయాలలో కట్టుబాట్లలో సాంఘిక నిబంధనలలో చాందస మానస్తత్వాలలో పెరిగిన వారికి ఈ కథలు చదవగానే జుగుప్స, సాహిత్యమంటే భయం, సార్ట్రేమీద కోపం అనుకోకుండానే కలుగుతాయి. ఉదాహరణకు: అది ఒక మాహానగరం లో, అనుక్షనం అరక్షణం విశ్రాంతి నెరుగని నాలుగురోడ్ల కూడలిలో, కూడలికి ఓప్రక్కగా ఎనిమిదంతస్తుల రాజ ప్రాసాదం లాంటి భవనం లో, చిట్ట చివరి అంతస్తుమీద పిట్టగోడమీదకువంగీ, కిందరోడ్డుమీద పోతున్న జనాన్ని ముఖ్యంగా ఆడవాళ్ళను, మగవాళ్ళనూ నిశితంగా పరిశీలుస్తున్న ఓయువకుడు, యువకుడిమనస్సులో కొన్నికొన్ను విషపుటూహలూ కదిలిపోతున్నాయి. ఈఆడవారినీ, మగవారినీ నగ్నదేహులను చేసి వీధులలో నడిపిస్తే... ఆయువకుడి తాపత్రయం రేణువులుగానున్న ఆస్త్రీపురుషుల జఘనభాగాలను నగ్నంగా చూడాలను. ఇంత రాక్షస ప్రవృత్తి కల ఆయువకుడి మనస్థితిని అంత రాక్షసం గానూ చిత్రిస్తాడు సార్ట్రే. ఆయువకుడు ఆతరువాత స్త్రీ సౌఖ్యాన్వేషణలో ఒక చీకటి గదిలోకి జొరబడతాడు.ఆచీకటి గదిలో పట్టపగల్లా కోటి వోల్టుల దీపాలు ప్యారిస్ నగర స్త్రీ సౌందర్యమంతా అక్కడే కుప్పపోసినట్లుంది. ఒక యువతిని ఎన్నిక చేస్తాడు ఈ ఆధునిక ఉన్మాది.ఆస్త్రీ ఆతనివైపు అర్ధంకాని కనులతొ చూస్తుంటుంది.ఇంత ధర పెట్టీ యువకుడు తన నెందుకు కొన్నట్లా అని. అతడామెను మెల్ల మెల్లగా సమీపిస్తాడు. ప్రణయక్రీడా విశేషంకన్నా, ఆతడనిమిషుడై చూడడమే ఆమెకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఉన్నట్లుండి ఆమెను నగ్నదేహం కమ్మంటాడు.తదుపరి ఆగదిలో ఒక మూలనుండి మరిక మూలకు నడవమంటాడు. ఇటువంటి సంఘటనలు సార్ట్రే రచనలలో చాలా వరకు కనిపిస్తాయి. సార్ట్రే నేటి సివిలైజేషన్ మోజును సిపిలైజైషన్ గా చూపించి ఆకర్షిస్తాడు.

పుస్తకాలతో- శబ్దమయం జగత్తు

సార్ట్రే కు పుస్తకాలతో తనశబ్దప్రపంచాన్నే నిర్మించుకున్నాడు, అందుకే ఈప్రపంచం అంతా శబ్దమయం లేదా శబ్దమయం ప్రపంచం అంటాడు సార్ట్రే. తన డైరీలో పుస్తకాలతో తన జీవితానికి ఉన్న అనుబంధాన్ని ఇలా వ్రాసుకున్నాడు. పుస్తకాలతో నాజీవితం ప్రారంభం అయ్యింది. అనుమానం ఏమీలేదు పుస్తకాలతోనే ముగుస్తుంది.మాతాతగారికి ఒక అధ్యయన మందిరం ఉండేది. అందులో పుస్తకాలు ఎక్కడపడితే అక్కడ ఉండేవి. సంవత్సరానికి ఒక్కసారిగాని వాటి దుమ్ముదులపరాదు. అదికూడా అక్టోబరు రాకముందు జరగాలి. ఇదోనిషేధం. నేను ఇంకాచహ్దవడం నేర్వకముందే నేను ఆపుస్తకాలను ముట్టుకొని పవిత్రం అయినాను. పుస్తకాలు నిలిచిన రాళ్ళనుపోలేవి. లైబ్రరీ అరల్లో ఇటుకలు పేర్చినట్లు ఉండేవి. హుందాగా ఉండేవి.మా వంశం ఆస్తిఅంతా అదేనని మాకుటుంబం అదృష్టం అంతా వాటిమీదే ఆధారపడి ఉండేదని అనుకుంటూ ఉండేవాడిని. అవి ఉన్నచోట నాకు దేవాలయం. నేను అందులో గాలిలో తేలిపోతూ ఉండేవాడిని. ఆగుడిలో పురాణస్మృతి చిహ్నాలను పోలి ఆ పుస్తకాలు అట్లా పడిఉండేవి. నేను పుట్టడం వాటికి తెలుసు. అవి అందుకు సాక్షీభుత్తలు. అట్లా నామృతిని కూడా చూస్తాయి. అవి అంత శాశ్వతమైనవి. అవి శాశ్వతమైనవి కనుక నాభవిష్యత్తు సంబంధించిన చింతనాకులేదు. జరిగిన కాలాన్ని గూర్చి నామనస్సు ఎంత శాంతంగా ఉంటుందో భవిష్యత్తుని గూర్చికూడా ఈ పుస్తకాలు నాకు అదే ధైర్యాన్నిస్తాయి. వాటి దుమ్ము నాచేతికి అంటితే చాలు నేను పునీతుణ్ణి అవితాను.

మాఅమ్మగది సంగతి. అది ఇంకో విధంగా ఉండేది. పుస్తకాలు అక్కడ నేలమీద పడుకొన్నట్లు పడిఉండేవి.ఆవిడ పుస్తకాల్ను బయటనుంచి, లైబ్రరీ లోంచి తెచ్చుకొనేది. రెండు పుస్తకాలను మించి ఆవిడ తీసుకురాదు. వాటిని చూస్తే ఉగాది పండుగనాడు పిల్లలకోసం తెచ్చే మిఠాయి పొట్లాలు నాకు గుర్తుకువచ్చేవి. నాలో నాకు ఇన్ని రహస్యాలు ఉన్నవి కదా! వాటికి ఇవి ఏమో కారణాలు అయినట్లు భావించేవాడిని. ప్రతిశుక్రవారం మాఅమ్మ మంచి బట్టలు వేసుకొని అట్లా బయటకు వెళ్ళేది. వాటిని తీసుకురావడానికి వెళుతున్నాము అనేది. ఎప్పుడూ అదేమాట తిరిగి వచ్చి, తలమీంచి నల్లని టోపీని, మేలుముసుగు తొలగించేది. అప్పుడు చేతి సంచిలోంచి వాటిని తీసేది. వాటిని అట్లా ఆవిడ బయటకి తీసునప్పుడల్లా ఇవి ఆపాత పుస్త్కకాలేనా? అని నాకు అనిపిస్తూ ఉండేది. ఆవిడకేమో ఆ పుస్తకాలు ఎంతో భద్రం.భద్రంగా దాచుకునేది. చూడనిచ్చేది కాదు. అప్పుడప్పుడు నా సంతోషానికి పగాలు ఉండేవికావు. అడవులను గూర్చి, మృగాలను, పక్షులనుగూర్చి పుస్తకాలు ఉన్నాయి నా లైబ్రరీలో. అవి ఎప్పుడు ఏదో కలకలం చేస్తున్నట్లు ఉంటాయి. ఎండిపోయిన కంఠాలు అన్నీను. ఒక్కసారి అట్లా చూస్తేచాలు, తాతయ్యకు అన్ని ప్రోతలు వినిపిస్తాయి. నాకు మొదట్లో వినిపించేవికావు. ఇప్పుడు అవి నాసొంతం అయ్యాక తాతయ్యలా నాకూ వినిపిస్తున్నాయి. నేను ఇప్పుడు బయట లైబ్రరీకి పోవచ్చు. అక్కడే కాలం గడపవచ్చ్చు.అక్కడ మరింత మానవ విజ్ఞానం సొరగులలో దాగి ఉంది. నేను ఇంతవాణ్ణయ్యాని అందుకు కారణం ఈ పుస్తకాలే. నా పుస్తకాలే నా ప్రపంచం అవే నా కొనసాగించే సంభాషణలు, అవే నా జంతువులు, పల్లుటూళ్ళు, జంతువులు ఉండే చోట్లు. లైబ్రరీలే నాకు సర్వస్వమూ!!అద్దంలో అది పెద్ద అద్దం. ప్రపంచమంతా అందులో అద్దబడి ఉన్నది. దాని పరిణామం దానికి ఉంది. దాని వైశాల్యం దానికి ఉంది. ఇదమిద్ధమని చెప్పడానికి దైవస్థితి అని ఒకటి ఉంటే, అట్టి దాని స్థితి దీనికీ ఉంది. నేను ఒక మహా సాహసం చేస్తున్నూను. అందులో కుర్చీలు ఎక్కడం. బల్లలు దూకడం ఘనకార్యాలు. అందులోనూ ప్రమాదాలున్నాయి. ఈ ఎక్కడంలో, ఈ దూకడంలో ఏమైనా తప్పు జరిగినా పుస్తకాలు మంచుకొండలు విరిగినట్లు ఒరిగి పడతాయి. నేను క్రిందకి త్రూలక తప్పదు. చాలా చదవని పుస్తకాలు ఇంకా ఉన్నాయి. చదివినవి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేననుకుంటాను. మళ్ళే వాటి ముఖం చూడాలంటే రోజులకు రోజులు పట్టేవి. వారాలకు వారాలు గడిచేవి. ఒక్కొక్కప్పుడు పెద్ద యుద్ధాలే జరిగేవి. ఆల్బమ్ములు తెరిచేవాడిని అందులో రంగురంగుల బొమ్మలు ఉండేవి. ఒక బొమ్మ దగ్గరకు వచ్చేవాణ్ణి. వికృతమైన కీటకాలు పొడిచినట్లు ఉండేది. కళ్లముందు అవి ఒకటే ఆడేవి. వీటితో జాగ్రత్తగా పక్కకు తప్పుకు పోతూఉండేవాడిని. ఇక్కడ బోలెడన్ని రహస్యాలు అంతు పట్టేవి కావు. ఒక్కోసారి నేను వాస్కోడిగామా అయిపోయేవాడిని.విచిత్రమైన దేశాలకు పోయి, విచిత్రమైన జనాల్ని కనుక్కొనేవాడిని.

నామతం ఏమిటో, నాధర్మం ఏమిటో నాకు తెలిసిపోయింది. పుస్తక ప్రపంచం కన్నా నాకు వేరే ప్రపంచం తెలీది. వేరే మతం లేదు. పుస్తకం ముందు అన్నే తీసికట్టే. యేదీ ముఖ్యం కాదు అంటాడు సార్ట్రే. లైబ్రరీ నాకు దేవాలయం. నేను ఒక మతాధికారి మనవణ్ణి. ప్రపంచం యొక్క శిఖరస్థానంలో నా నివాసం. అంది కేంద్ర స్థానంలో మహా వృక్షం లాంటిది. అక్కడ నేను చెట్టుమీద పక్షి గూడు చేసుకున్నట్లు నివాసం ఏర్పాటుచేసుకున్నాను. శైశవదశలో ఉన్నపిల్లవాళ్ళలో కూడా స్త్రీ సహజమైన మెత్తని లక్షణం ఒకటి ఉంటుంది. అది ఆ వయస్సులో నాలోనూ ఉంది. మా అమ్మ నన్ను లగ్జంబర్గ్ గార్డెంస్ కు తీసుకుపోతూ ఉండేది, అప్పుడు మాత్రమే నేను అధోలోకాలకు అడుగు పెట్టడం జరుగుతుంది. కాని నా కాయం మాత్రం నాగూట్ళోనే ఉంటుంది. అదే చెట్టు మీద చిటారు కొమ్మమీద. ప్రతీ మనిషికి సహజమైన స్థానం, సహజమైన తీరు అంటూ ఉంటాయి. మనిషి ఔన్నత్యం, అభిమానం వంటివి విలువైన వస్తువులతో నిర్ణయించలేము. వీటి అన్నింటిని మనిషి శైశవదశ నిర్ణయిస్తుంది. అందరి జాతకాలు అక్కడే తేలుతాయి. అక్కడ పుస్తకాల ప్రాముఖ్యం చాలా ముఖ్యం అంటాడు సార్ట్రే.

తెలుగులో సార్ట్రే

విశ్వవ్యాప్తి చెందిన సార్ట్రే రచనలు అంతగా తెలుగులోకి అనువదించబడలేదు. కానీ, భాస్కరభట్ల కృష్ణారావుగారి వెలువతో పూచిన పూచిక పుల్లలు శ్రీమతి లత చెప్పీ చెప్పకుండా అనువాదమూ అనుకరణా స్వేచ్ఛగా చేసిన గాలి పడగలూ-నీటి బుడగలూ నీలి నేడలు మొదలగు నవలలూ, శ్రీ గొల్లపూడి మారుతీరావు గారి ఒకటి రెండు కథానీకాలు, శ్రెరాజ మన్నార్ రేడియోలో ప్రచారం చేసిన నాటకాలు, సార్ట్రే ప్రభావానికి నిదర్శనాలు. ఇటీవలి కాలంలో శ్రీ శ్రీ, కాశీభట్ల_వేణుగోపాల్, త్రిపుర రచనలలో సార్ట్రే అస్తిత్వవాదం తీరు కొంతకనిపిస్తుంది.


ఇతడు 1964 సంవత్సరానికి సాహిత్యంలో నోబెల్ బహుమతి గెలుపొందాడు.

బయటి లింకులు

  1. At the time, the ENS was part of the University of Paris according to the decree of 10 November 1903.
  2. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Schrift అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  3. Sartre, J.-P. 2004 [1937]. The Transcendence of the Ego. Trans. Andrew Brown. Routledge, p. 7.
  4. Siewert, Charles, "Consciousness and Intentionality", The Stanford Encyclopedia of Philosophy (Fall 2011 Edition), Edward N. Zalta (ed.).
  5. Ian H. Birchall, Sartre against Stalinism, Berghahn Books, 2004, p. 176: "Sartre praised highly [Lefebvre's] work on sociological methodology, saying of it: 'It remains regrettable that Lefebvre has not found imitators among other Marxist intellectuals'."
  6. "Sartre's Debt to Rousseau" (PDF). Archived from the original (PDF) on 8 జూన్ 2011. Retrieved 2 March 2010.