వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 794: పంక్తి 794:


మీరు బ్రతికి ఉన్నంత కాలం ఇదేపనా అని అనుమానం వాడుకరులకు ఖచ్చితంగా వస్తుంది. ప్రతి వాడుకరిని అధికారంలో ఉన్న మనిషి, మంచిగానైనా లేదా చెడుగానైనా ఏవిధంగానైనా పాతచర్చలు ఉదహరిస్తూ చిత్రీకరణ చేయడం జరుగుతుంది. ఇది మంచి పద్ధతేనా అని ఒకసారి ఆలోచించాలి. అమ్మ ఒళ్ళో కూర్చుని పాలు తాగే వయసు నుండి చనిపోయే వరకు మనిషి ఒకేలా వుంటాడా ? తప్పులు ఎంచే మీరు మాత్రం మంచివారు, మీకు నచ్చని వారు చెడ్డవారు అనటం, జీవితకాలం ముద్ర వేయడం ఏమాత్రం సహించరాని విషయం. ఈ పెడ ధోరణి ఇప్పట్లో ఆగేటట్లు లేదు. అందుకే ఇక్కడకు నేను రావడం మానేసాను. ఎవరికీ ఊడేది యేమీలేదు కదా. ఇక్కడ పద్దతులు మారే వరకు, మంచి మనసులు ఉన్నవారు మాత్రం ఇక్కడకు రావద్దు, ఉండొద్దు, పని చేయవద్దు మాటలు అనిపించికోవద్దు, మీ సమయం వృధా చేసుకోవద్దని నా సలహా, సూచన. నా మాటలను అర్థం చేసుకుంటారని ఆశిస్తాను. ఇక్కడ నా మనసుకు బావుంది అని అనిపిస్తే పనిచేయమని నేనే పోస్ట్ పెడతాను. నాకు తప్పులు ఇక్కడ అనిపించినవి వ్రాస్తునే ఉంటాను. [[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 07:46, 30 మే 2020 (UTC)
మీరు బ్రతికి ఉన్నంత కాలం ఇదేపనా అని అనుమానం వాడుకరులకు ఖచ్చితంగా వస్తుంది. ప్రతి వాడుకరిని అధికారంలో ఉన్న మనిషి, మంచిగానైనా లేదా చెడుగానైనా ఏవిధంగానైనా పాతచర్చలు ఉదహరిస్తూ చిత్రీకరణ చేయడం జరుగుతుంది. ఇది మంచి పద్ధతేనా అని ఒకసారి ఆలోచించాలి. అమ్మ ఒళ్ళో కూర్చుని పాలు తాగే వయసు నుండి చనిపోయే వరకు మనిషి ఒకేలా వుంటాడా ? తప్పులు ఎంచే మీరు మాత్రం మంచివారు, మీకు నచ్చని వారు చెడ్డవారు అనటం, జీవితకాలం ముద్ర వేయడం ఏమాత్రం సహించరాని విషయం. ఈ పెడ ధోరణి ఇప్పట్లో ఆగేటట్లు లేదు. అందుకే ఇక్కడకు నేను రావడం మానేసాను. ఎవరికీ ఊడేది యేమీలేదు కదా. ఇక్కడ పద్దతులు మారే వరకు, మంచి మనసులు ఉన్నవారు మాత్రం ఇక్కడకు రావద్దు, ఉండొద్దు, పని చేయవద్దు మాటలు అనిపించికోవద్దు, మీ సమయం వృధా చేసుకోవద్దని నా సలహా, సూచన. నా మాటలను అర్థం చేసుకుంటారని ఆశిస్తాను. ఇక్కడ నా మనసుకు బావుంది అని అనిపిస్తే పనిచేయమని నేనే పోస్ట్ పెడతాను. నాకు తప్పులు ఇక్కడ అనిపించినవి వ్రాస్తునే ఉంటాను. [[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 07:46, 30 మే 2020 (UTC)

==దొంగపేర్లు==
దొంగపేర్లు పెట్టుకుని నీతైన మాటలు, ఇతరులకు సలహాలు చెప్పటం, విమర్శలు చేయటం, ఇలా చెప్పుకుపోతే ఎన్నెన్నో.... మీలాంటి వాళ్ళని బండబూతులు తిడితే ఆ బూతులకు నీలాంటి వాళ్లతో పాటుగా నీకొంపలో వాళ్ళు కూడా చెవులు పగిలి, కళ్ళు పేలి చచ్చిపోతారు. మీలాంటి వాళ్ళ వల్ల మాలాంటి వాళ్ళను ఇక్కడ ఎవరు పడితే వాళ్ళు ఇష్టం మొచ్చినట్లుగా రాతలు రాస్తున్నారు. దోంగపేర్లు గాళ్ళు లేదా ఎవడో సరిఅయినా సమాధానం వెంటనే వ్రాయకపోతే నువ్వు చచ్చేవరకు యేదో ఒకటి అడిగి వ్రాస్తునే ఉంటాను. నన్ను అన్న వాడిమీద నయినా నువ్వు సమాధానం వ్రాయలేని పనికిమాలిన వాడివా ? దేవుడు అనే (దొంగనాకొడుకుని),(లంజాకొడుకుని),వాడిని నేను కాదు సరేనా ! [[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 08:01, 30 మే 2020 (UTC)

08:01, 30 మే 2020 నాటి కూర్పు

అడ్డదారి:
WP:VP
రచ్చబండవార్తలుపాలసీలుసాంకేతికముప్రతిపాదనలుఆలోచనలుపత్రికా సంబంధాలుఇతరత్రా..



"మరియు" వడపోత విషయంలో ఒక గమనిక

ఈ రోజు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అనే పేజీని అనువాద పరికరం నుండి ప్రచురించే క్రమంలో నేను చేసిన పరిశీలన ఇది:

  1. అనువాదం ముగించి "ప్రచురించు" నొక్కాను.
  2. నీ పేజీలో "మరియు" ఉంది కాబట్టి వడపోత దాన్ని అడ్డుకుంది, లాంటిదేదో చెప్పి ప్రచురించలేదు.
  3. ఫైండ్ అండ్ రీప్లేస్ వాడి పేజీ అంతా వెతికాను. "మరియు" అనే ముక్క ఒక్కటి కూడా లేదు.
  4. సరే.. మళ్ళీ "ప్రచురించు" నొక్కాను. మళ్ళీ అదే ముక్క చెప్పి ప్రచురణను నిరాకరించింది.
  5. వడపోతలో ఏమైనా తప్పుగా రాసానేమోనని భావించి, దాన్ని అచేతనం చేసేసాను. పేజీని ప్రచురించాను.
  6. సందేహం మిగిలే పోయింది. అంచేత, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ పేజీని సోర్సు మోడులో తెరిచి "మరియు" కోసం వెతికాను. "నాసా"కు ఇచ్చిన పైపు లింకులో "మరియు" అనే మాట ఉంది. వడపోత ఎందుకు అడ్డం పడిందో అపుడర్థమైంది. తప్పు ఎక్కడ జరిగిందో తెలిసిపోయింది కాబట్టి, వెంటనే వడపోతను చేతనం చేసేసాను. విషయమేంటంటే..
    • అనువాద పరికరం విజువల్ ఎడిటరు మోడ్‌లో పనిచేస్తుంది. అందులోని ఫైండ్ రీప్లేస్ అంశం, "పైపు లింకు" లక్ష్యంలో వెతకదు.
    • వడపోత మాత్రం "పైపు లింకు" లక్ష్యంలో కూడా వెతుకుతుంది (అది వికీటెక్స్టులో వెతుకుతుందన్న మాట)

కాబట్టి, అనువాదాన్ని ప్రచురించేటపుడు, పైపు లింకుల్లో కూడా "మరియు" లేకుండా చూసుకోవాలి. నాబోటి మందమతులు ఇంకా ఎవరైనా ఉంటే వారి దృష్టికి తెస్తున్నాను. __చదువరి (చర్చరచనలు) 14:30, 3 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

"ప్రబోధానంద యోగీశ్వరులు" అను ఈ పేజీ ని వికీపీడియా నుండి తొలగించగలరు.

ప్రబోధానంద యోగీశ్వరులు గురువు గారి గురించి కేవలం ఆన్ లైన్ ఎడిషన్ లేదా వార్తా పత్రికలలో వచ్చిన సమాచారం ను ఆధారం చేసుకుని వికీపీడియా లో రాస్తున్నారు. అనేక అవాస్తవాలు ఈ పేజీ లో చేరుస్తున్నారు. ఎవరు పడితే వాళ్ళు మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఉదాహరణ కు ఈ పేజీ లో కొన్ని అవాస్తవాలు

  1. యోగీశ్వరులవారి మతము " ఇందు" అని రాశారు. ఇది తప్పు.
  2. యోగీశ్వరులవారు వివాదాస్పద రచయిత అని వ్రాశారు. ఇది తప్పు.
  3. ఆయుర్వేదం పై పుస్తకాలు రాశారు అన్నది తప్పు.
  4. "రాముడు భగవంతుడు కాదు అని గ్రంధాలలో రాశారు" అని వికీ పెడియా పేజీ లో చేర్చారు. గ్రంధాలలో ఎక్కడా ఆ విధంగా రాయలేధు, చెప్పలేదు.
  5. విరాళాలు సేకరిస్తారు అని రాశారు. ఇధి తప్పు.
  6. దైవ విషయాలపై భగవద్గీత బైబిల్ ఖురాన్ గ్రంధాల ఆధారంగా చెప్తుంటే, "వీరికి తమవైన వ్యాఖ్యానాలు ఉన్నాయి " అని రాశారు. ఇది తప్పు.
  7. "తెలుగు భాష వల్లనే ఆత్మ జ్ఞానం చెప్పేందుకు వీలుంది. రానున్న భవిష్యత్తులో అంధరూ తెలుగు నేర్చుకుంటారు." అని చెప్పని విషయాలను యోగీశ్వరుల వారు చెప్పినట్లుగా రాశారు.
  8. "వినాయక చవితి పండుగ తమ ఆచారాల కు విరుద్ధం అంటూ భక్తులు దాడి ప్రారంభించారు." అని అవాస్తవాన్ని రాశారు.
  9. "ముస్లీములు ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు." అని అవాస్తవాన్ని రాశారు.
  10. "వాహనాలకు భక్తులు నిప్పు పెట్టారు. " అని అబద్దం రాశారు.

యోగీశ్వరులవారు చెప్పే విషయాలు అర్థం కావాలంటే వారు రచించిన గ్రంధాలు శ్రద్ధగా చదవాలి, అర్థం చేసుకోవాలి. అంతేకానీ వార్తా పత్రికలలో వచ్చిన విషయాల ఆధారం గా యోగీశ్వరుల వారి గురించి అంచనావేయవద్దు. కావున వికీపెడియా నుండి ఈ పేజీ "ప్రబోధానంద యోగీశ్వరులు" ని తొలగించగలరు.05:33, 5 March 2020Time963 talk contribs

వికీపీడియాలో రాసే సమాచారమంతా పరిశోధనా పత్రాలు, పుస్తకాలు, పేరొందిన వార్తా పత్రికలు ద్వారా ప్రచురించిన వ్యాసాల ఆధారంగానే సాగుతుంది. సభ్యులు వ్యక్తిగత అభిప్రాయాలు రాయకూడదు. వికీ సభ్యులు తమ సొంత అభిప్రాయాలు కాకుండా ఇదివరకే ప్రచురితమైన సమాచారాన్ని ఆధారంగా రాసింది కాబట్టి ఈ వ్యాసాన్ని తొలగించడం కుదరదు. రవిచంద్ర (చర్చ) 08:11, 5 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
రవిచంద్ర గారి అభిప్రాయాన్ని సమర్ధిస్తున్నాను. Time963 గారూ,
  1. మీరు చాలా "తప్పు"లను ఎత్తి చూపారు. కానీ వ్యాసంలో ఆ "తప్పు"లకు మూలాలను చూపించారు. కాబట్టి మీరు తప్పు అన్నంత మాత్రాన చెల్లదు. ఎందుకు తప్పో ఆధారాలతో చూపాలి, ఏది ఒప్పో ఆధారాలతో చూపాలి.
  2. వార్తా పత్రికల ఆధారంగా రాస్తున్నారు అని అన్నారు.. వార్తాపత్రికలను వీకీఫీడియా విస్వసనీయ మూలాలు గానే పరిగణిస్తుంది. కాబట్టి దానిపట్ల మీ అభ్యంతరం చెల్లదు.
ఇకపోతే, మీరు చెప్పేవాటికి సరైన మూలాలను చూపిస్తూ చర్చ పేజీలో రాయండి. ఇతర వాడుకరులు కూడా పరిశీలించాక, మీరు చెప్పినవే సరైనవని తేలిన వాటిని మార్చవచ్చు. లేదంటే ఉంచెయ్యవచ్చు. పేజీని తొలగించాల్సిన అవసరం లేదు. __చదువరి (చర్చరచనలు) 15:01, 5 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
Time963 గారూ, తెలుగు వికీపీడియాకు మీరు ఇంకా బేబీలాంటివారు.ఎందుకన్నానంటే ఆ మాట మీరు వికీపీడియాలో రిజిష్టరై (2020 జనవరి 18) పూర్తిగా మూడు నెలలు కాలేదు.మీరు, నేను, వికీపీడియా మార్గదర్శకాలు,నియమాలు తెలుసుకోవలసినవి చాలా ఉన్నవి.మీకు అవి పూర్తిగా తెసుసుకోనందున అంత ఆవేశంగా ఉన్నారు.దయచేసి నిదానంగా ఆలోచంచండి.ఏ వ్యాసం ఉండాలో, ఏ వ్యాసం ఉండకూడదో వికీపీడియా మార్గదర్శకాలకు, నియమాలకు, సముదాయం నిర్ణయాల మేరకు లోబడి ఉంటుంది.ఏ వాడుకరికి వికీపీడియాలోని వ్యాసాలపై అతి అభిమానం, ద్వేషం ఉండకూడదు.అతి అభిమానం ఎందుకన్నానంటే ఈ లింకు గమనించండి. సమాచారపెట్టెలో పేరు ముందు మూడు శ్రీ లు తగిలించారు.ఆ ఎడిటును రద్దు చేయగా మరలా నెట్ ఐడి తో మూడు శ్రీ లు తగిలించారు.ఆ లింకు చూడండి.అది మీ తప్పు కాదు.వికీపీడియా నియమాలు మార్గదర్శకాలు తెలుసుకోనందువలన అలా చేసి ఉంటారనుకుంటున్నాను.వికీపీడియా:శైలి ఒకసారి చదవండి.రవిచంద్ర గారి, చదువరి గారి అభిప్రాయాలుతో నేను ఏకీభవిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 16:55, 5 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

."ప్రబోధానంద యోగీశ్వరులు" అను ఈ పేజీ కి సంబందించిన నిర్వాహకులు ఎవరు , వారి ఫోన్ నంబర్లను ఇవ్వగలరు

."ప్రబోధానంద యోగీశ్వరులు" అను ఈ పేజీ కి సంబందించిన9491040963. వికీపీడియా నిర్వాహకులు ఎవరు , వారి ఫోన్ నంబర్లను ఇవ్వగలరు . నా పేరు తిరుమలేశ 9491040963 కు కాల్ చేయగలరు. 2020-03-05T21:48:56(IST) Time963

వికీపీడియా లో ఏ పేజీకి నిర్వాహకులు అంటూ ఉండరు. ఏ వ్యాసమైనా సమిష్టిగా రాస్తారు. ఇకపోతే ఫోను నంబరు ఇవ్వరు. ఎందుకంటే వికీలో వ్యాసాలకు సంబంధించిన చర్చ వికీలో మాత్రమే రాతపూర్వకంగా జరగాలి. వ్యక్తిగతం మాట్లాడ్డం వల్ల సమస్య పరిష్కారం కాదు. రవిచంద్ర (చర్చ) 17:28, 5 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

కర్ణాటక సంగీతంలో రాగానికి నొటేషన్ తెలుగులొ ఎలా రాయాలి.

సంగీతంలో ఏడు స్వరాలు, పన్నెండు స్వరస్థానాలు ఉంటాయి. 'స' మరియు 'ప' స్వరాలకి ఎటువంటి వైవిధ్యాలు ఉండవు, అందుకే వాటిని ప్రకృతి స్వరాలు అంటారు. మిగితా స్వరాలు అంటే 'రి', 'గ', 'మ', 'ద', 'ని' కి వైవిధ్యాలు ఉంటాయి. ఈ వైవిధ్యాలను చూపించడానికి ఉపలిపి (సబ్స్క్రిట్) వాడతారు. ఈ స్వరాలని సూచించడానికి లాటిన్ అక్షరాలు 'S', 'R', 'G', 'M', 'P', 'D', 'N' కూడా వాడతారు. స్వరాలలో వైవిధ్యాలను చూపించడానికి రెండు మార్గాలు ఉన్నాయి.

మోదటి మార్గము: S, R1, R2, R3, G1, G2, G3, M1, M2, P, D1, D2, D3, N1, N2, N3 రెండొ మార్గము: స, రా, రి, రు, గా, గి, గు, మ, మా, ప, దా, ది, దు, నా, ని, ను

మొదటి వ్యవస్థ లాటిన్ అక్షరమాలను ఉపయోగిస్తున్నప్పటికీ అర్థం చేసుకోవడం చాలా సులభం. అందుకే రాగాల గురించి వికిపిడియాలొ వ్యాసాలు రాసినప్పుడు మోదటి పద్ధతి వాడడం ఉచితం అని భావిస్తున్నాను. --2020-03-18T12:43:14 వాడుకరి:Nikhilpriyatam

సంగీతం నొటేషన్ రాసే పద్ధతి

పైన సూచించిన పద్ధతి లో లాటిన్ అక్షరమాలలో రాస్తే ఎక్కువ మందికి అర్ధమయ్యే విధంగా ఉంటుందని భావిస్తున్నాను. మీ అభిప్రాయాలు తెలియజేయండి టి పతంజలి (చర్చ) 07:40, 18 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

సాముదాయిక కృషి అంటే ఏంటి

ఈ మధ్య వాడుకరి:యర్రా రామారావు గారు నిర్వహణ పనుల్లో భాగంగా అనువాదం కాని వ్యాసాలను వెతికి వాటిని సృష్టించిన వాడుకరులకు చూపి, అనువదించమని కోరారు. చాలామంది అనుకూలంగా స్పందించారు, కొన్ని అనువాదాలు చేసారు. రామారావు గారికీ, స్పందించిన వారందరికీ వందనాలు. అసలు స్పందించనివారు ఉన్నారు. నెగటివుగా స్పందించినవారూ కనిపించారు. అలాంటివారికి కనువిప్పు కలిగే సంఘటన ఒకటి నేను ఇవ్వాళ చూసాను. రామారావు గారు సూచించిన పేజీల జాబితాపై వెంకటరమణ గారు స్పందించిన తీరు (దానివలన వికీపీడియా ఎంత మెరుగు పడిందో మనం చూడొచ్చు) మనందరికీ మార్గదర్శకం, స్ఫూర్తిదాయకం. సీనియారిటీని చేతల్లో చూపించాలి గానీ, బడాయి కబుర్లు చెప్పడంలో కాదని వెంకటరమణ గారి చర్యలో నేను గ్రహించిన సత్యం. నమస్కారం వెంకటరమణ గారూ! __చదువరి (చర్చరచనలు) 12:46, 20 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

అవును... వ్యాసాల జాబితా తయారుచేసిన వాడుకరి:యర్రా రామారావు గారికి, వాటిని పూర్తిచేసిన వెంకటరమణ గారికి ధన్యవాదాలు. కొత్త వ్యాసాలను రాయడమేకాదు, పాత వ్యాసాలను పూర్తి చేయడమనేది కూడా ముఖ్యమని తెవికీ సభ్యులు గుర్తించాలి. అరకొర వ్యాసం రాసి, మూలాలు కూడా చేర్చని వ్యాసాలు చాలానే ఉన్నాయి. ఆయా వ్యాసాలను రాసిన వాడుకరులు వాటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 15:18, 20 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అరకొర వ్యాసాల విషయంలో Pranayraj Vangari గారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. మొలకల మీద సముదాయం పెట్టిన శ్రద్ధ కారణంగా గానీ, వాటి పట్ల మెరుగైన అవగాహన కలగడం వలన గానీ, మరేదైనా కారణం వలన గానీ.., ఇప్పుడు మొలకల సృష్టి తగ్గినట్టుగా తోస్తోంది (కొత్తగా చేరుతున్నవారు మాత్రం ఇంకా మొలకలు సృష్టిస్తున్నారు). పాతవారు ఇప్పుడు, పైన ప్రణయ్ రాజ్ గారు చెప్పినట్టు గతంలో తాము రాసిన అరకొర వ్యాసాలపై (మొలకల స్థాయి దాటితే దాటి ఉండొచ్చు గాక, కానీ వ్యాసం చిన్నదిగానే ఉంటుంది) దృష్టి పెట్టి మరింత సమాచారాన్ని, తగు మూలాలనూ, ఇతర హంగులనూ చేర్చి విస్తరించడం మీద దృష్టి పెడితే బాగుంటుంది. __చదువరి (చర్చరచనలు) 17:01, 20 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
వెంకటరమణ గారు సృష్టించిన వ్యాసాలు అనువదించటమే కాకుండా, స్పందించని ఇతర వాడుకరులు సృష్టించిన వ్యాసాలలో ముఖ్యమైన మంచి వ్యాసాలు తొలగింపుకు గురికాకూడదు అనే దృక్పదంతో ఇప్పటికి సుమారు 10 వ్యాసాలకు పైగా అనువదించారు.ఇది చాలా అభినందించతగ్గ విషయం.ఇది మనందరికీ స్పూర్తిదాయకం.--యర్రా రామారావు (చర్చ) 02:54, 24 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

కరోనావైరస్ సంబంధిత వ్యాసాలకు ప్రాజెక్టు, ప్రత్యేక కృషికి ఆహ్వానం

తోటి వికీపీడియన్ మిత్రులకు,

నమస్తే. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మహమ్మారిగా గుర్తించిన కరోనావైరస్ వ్యాధి వ్యాప్తి గురించి, భారతదేశంపై దాని ప్రత్యక్ష ప్రభావం గురించి అందరికీ తెలిసేవుంటుందని భావిస్తున్నాను. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది మరణించడం, రెండులక్షలకు పైచిలుకు జనాభా దాని బారిన పడడం జరిగింది. భారతదేశంలో 200 పైచిలుకు రోగులు కరోనావైరస్ 2019 కారణంగా వచ్చే కోవిడ్-19 వ్యాధి నిర్ధారణ అయినవారు ఉన్నారు.

దీని గురించి సరైన సమాచారం కన్నా తప్పుడు సమాచారం ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వాలు, సంస్థలు ఈ వ్యాధితో పాటుగా తప్పుడు సమాచారం మీద కూడా సమాంతరంగా పోరాడుతున్నాయి. ఈ నేపథ్యంలో అందరికీ స్వేచ్ఛగా విజ్ఞానాన్ని తెలుగులో అందించే లక్ష్యంతో పనిచేస్తున్న మనకి దీని విషయంలో పవిత్రమైన కర్తవ్యం ఉందని నా నమ్మిక. మనం ఉన్నది కొందరమే కావచ్చు, మన చేతిలో ఉన్న సమయం, శక్తి పరిమితమే కావచ్చు- కానీ కలిసి ప్రాధాన్యతలు నిర్ణయించుకుని మనం పనిచేస్తే గోరంత దీపంలా కొద్ది వ్యాసాలనైనా తయారుచేయడం, తాజాగా ఉంచడం చేయగలమనీ, తద్వారా ఈ పోరాటంలో మనదైన బాధ్యత నెరవేర్చిన సంతృప్తి దక్కుతుందని భావిస్తున్నాను.

ఇందుకోసం, వికీప్రాజెక్టు కోవిడ్-19 ప్రారంభించాను. దీనిలో నాకు తోచిన విధంగా ఓ ప్రాధాన్యతా క్రమాన్ని, చేయగల పనులను సూచించాను. ఇప్పటికే నేను, మహేశ్వరరాజు గారితో కలిసి వీటిలో కొన్ని పనులను చేస్తూ ఉన్నాం. ఐతే, ఈ పనిలో అందరం సమిష్టిగా కృషిచేస్తే మరింత ముందుకుపోగలం అన్న ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నాం.

దయచేసి పేజీని సందర్శించి మీకు ప్రయత్నం నచ్చితే పని ప్రారంభించగలరు: వికీపీడియా:వికీప్రాజెక్టు/కోవిడ్-19

ధన్యవాదాలతో, --పవన్ సంతోష్ (చర్చ) 11:27, 21 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి పేజీ

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి పేజీకి గత 30 రోజుల్లో వచ్చిన పేజీవ్యూలు: 15,405. వాటిలో, గత రెండు రోజుల్లో వచ్చినవి: 7,430 - దాదాపు సగం. కరోనావైరస్ నేపథ్యంలో వాట్సాప్, ఫేసుబుక్కు, ట్విట్టర్లాంటి సామాజిక మాధ్యమాల చలవ ఇది. దీన్ని సముదాయం దృష్టికి తెస్తున్నది, కాలక్షేపం కోసం మాత్రమే. __చదువరి (చర్చరచనలు) 15:44, 21 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఖాళీ వర్గాలు

ప్రత్యేక:వాడనివర్గములు వర్గంలో దాదాపు 1000 వర్గాలున్నాయి. పేజీలు గానీ, ఉపవర్గాలు గానీ ఏమీ లేని ఖాళీ వర్గాలు ఇవి. వీటిని AWB ఉపయోగించి తొలగిస్తున్నాను. __చదువరి (చర్చరచనలు) 15:58, 23 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగేనండి. -- Pranayraj Vangari (Talk2Me|Contribs) 17:02, 23 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారూ తెవికీలో మీ ప్రక్షాళన కార్యక్రమానికి ధన్యవాదాలు. --యర్రా రామారావు (చర్చ) 17:48, 23 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త వ్యాసాల సృష్టింపు ఆపి, పాత వ్యాసాల అభివృద్ధిపై కొంతకాలం దృష్టిపెడదాం

ప్రణయరాజ్ గారూ, చదువరి గారూ అభిప్రాయాలుతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను.నాకు అందరిలాగనే వ్యాసాలు సృష్టింపు చేయాలనే అభిలాష ఉన్నా, నిర్వాహకుని బాధ్యతలలో భాగంగా ఎక్కువ సమయం నేను పరిశీలించాటానికి సరిపోతుంది.దాని ప్రకారం తగిన సవరణలు చేయుట జరుగుతుంది. అందులో భాగంగా నేను కొన్ని వర్గాలలోని అన్ని వ్యాసాలను, ప్రతి వ్యాసం పరిశీలించగా నాకు కొన్ని లోటుపాట్లు సృష్టంగా తెలిసినవి. విషయసంగ్రహం ఎక్కువుగా రాయాల్సిన చాలా వ్యాసాలు రెండు లేక మూడు వాక్యాలతో అరకొర సమాచారంతో చాలా కాలం నుండి ఎటువంటి అభివృద్ధికినోచుకోకుండా అలానే ఉన్నవి.ఇంకా గమనించిన కొన్ని లోటుపాట్లు ఉన్ననూ ఎత్తిచూపుట సమంజసంకాదనిపిస్తుంది.తెవికీ నాణ్యతలో భాగంగా 2020 ఏప్రియల్ 1 నుండి ఎవరికివారు స్వచ్చంధంగా వ్యాసాలు సృష్టింపుఆపి, 15 రోజులపాటు పాత వ్యాసాల అభివృద్ధిపై దృష్టిపెట్టగలందులకు కోరుచున్నాను. మీరు సృష్టించిన వ్యాసాలలో 30 వ్యాసాలను ఎంపిక చేసుకొని రోజుకు రెండు చొప్పున విస్తరించవచ్చును.జాబితా తయారుచేసి ఏప్రియల్ 28లోపు సముదాయంలో ప్రవేశపెట్టవలసిందిగా కోరడమైనది.అలాంటి వ్యాసాలు లేని వాడుకరులు వారికినచ్చిన ముఖ్యమైన వ్యాసాలు ఎంపిక చేసుకొనవచ్చును.దీని మీద గౌరవ వికీపీడియన్లు స్పందించగలరు.

ఇక్కడ ఈ వ్యాసం మీద జరిగిన చర్చ, గమనించండి. వ్యాసం సృష్టించింది 2012 మే, అభివృద్ధి జరిగింది నిన్న, మొన్న. అభివృద్ది ఎలా జరిగిందో గమనించగలరు. సృష్టించిందొకరు. తొలగింపు మూస పెట్టినది ఒకరు.అభివృద్ది చేసింది ఒకరు. తిరిగి తొలగింపు మూస పెట్టిన వాడుకరిచే మూలాలు కూర్పు.--యర్రా రామారావు (చర్చ) 19:13, 24 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

(ఈ ప్రతిపాదనను ప్రత్యేక విభాగం లోకి మార్చాను)__చదువరి (చర్చరచనలు) 02:04, 25 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

స్పందనలు, అభిప్రాయాలు

రామారావు గారూ, కేంద్రం ప్రకటించిన మరో 21 రోజుల లాక్‌డౌన్‌ను గట్టిగా వాడుకోవాలని సంకల్పించినట్టున్నారు, భేష్! ప్రతిపాదన నాకు నచ్చింది సార్. ఈ వ్యాసాల అభివృద్ధి కార్యక్రమంలో నేను పాల్గొంటాను. ఇటీవల తొలగించిన యాంత్రికానువాద వ్యాసాల్లో, మార్చి 31 లోపు ఇరవయ్యింటిని సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. ఈ నెలంతా ఆ పనితో బిజీ. ఏప్రిల్ 1 నుండి కొత్త వ్యాసాల సృష్టి ఆపేసి, మీరు ఇస్తున్న పనిలో పాల్గొంటాను. ఈ 15 రోజుల్లో నేను 8 వ్యాసాలను అభివృద్ధి చెయ్యాలని అనుకుంటున్నాను. రెండు రోజుల్లో వ్యాసాలను ఎంచుకుని జాబితాను ఇక్కడ పెడతాను. కొన్ని సూచనలు:

  1. ఈ ప్రతిపాదనను ఒక వికీప్రాజెక్టుగా చేపడితే బాగుంటుంది. "వికీపీడియా:వికీప్రాజెక్టు/వ్యాసాల అభివృద్ధి ఉద్యమం 2020 ఏప్రిల్" లాంటి పేరుతో కొత్త పేజీని తెరవండి సార్. అక్కడి నుండే పని చేద్దాం.
  2. ఈ అభివృద్ధి కార్యక్రమం నెల రోజుల పాటు చేస్తే బాగుంటుంది.
  3. కార్యక్రమంలో భాగంగా ఒక పేజీపై ఒకరి కంటే ఎక్కువ మంది పాల్గొనవచ్చు.
  4. పాల్గొనాలి కూడా! నాబోటి కేవల-అనువాద-వీరులకు వ్యాసాలన్నీ పాఠ్యం, బొమ్మలు, మూలాలు, సమాచారపెట్టెలు.. వగైరాలతో వడ్డించిన విస్తరి లాగా ఉంటాయి కాబట్టి వాటి కోసం వెతుక్కోనక్కర్లేదు. అనువదించెయ్యడమే! దించెయ్యడమే!! కానీ నేరుగా అభివృద్ధి చేసే వ్యాసాల్లో అన్నిటినీ వెతుక్కోవాలి. అటువంటి వాటిపై అనేకమంది పనిచేస్తే తప్ప పని తెమలదు. (పదిమంది పనిచేసినపుడు కొన్ని సందర్భాల్లో వ్యాసం అతుకుల బొంతలా తయారౌతుంది. ఇది వికీ వ్యాసాల్లో చాలా సహజం. అసలు వికీ పద్ధతే అంత. అలా వ్యాసం అభివృద్ధి చెందాక, పాఠ్యం మొత్తాన్నీ ఒక పద్ధతిలో తిరగ రాసుకుంటే, వ్యాసం చదవడానికి మరింత వీలుగా ఉంటుంది.) కాబట్టి అలాంటి వ్యాసాలపై పనిచేసేవారు ఒక బృందం లాగా, పరస్పర సమన్వయంతో పని చేస్తే బాగుంటుంది -ప్రస్తుతం కోవిడ్-19 వ్యాసాలపై అలా పనిచేస్తున్నట్టున్నారు.
  5. ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే బాగుంటుంది. కనీసం పది మంది పాల్గొంటే, నెల రోజుల పాటు పనిచేస్తే, ఒక్కొక్కరూ సగటున పది వ్యాసాలను మెరుగు పరిస్తే మొత్తం వంద వ్యాసాలు మెరుగౌతాయి. పరిశీలించండి. యర్రా రామారావు, సుజాత, వెంకటరమణ, ప్రణయ్ రాజ్, స్వరలాసిక, రవిచంద్ర, మహేశ్వరరాజు, వైవియెస్ రెడ్డి, పవన్ సంతోష్, .. లాంటి చురుగ్గా రాసేవాళ్లంతా ముందుకొచ్చి ఇందులో పాల్గొంటే.. వంద ఒక లెక్క లోది కాదని నా ఉద్దేశం.

పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 03:13, 25 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఒక బృందం లాగా, పరస్పర సమన్వయంతో పని చేస్తే బాగుంటుంది అనే చదువరి గారి అభిప్రాయం నేనూ ఏకీభవిస్తున్నాను.వారి సూచన ప్రకారం ప్రాజెక్టు పేజీ తయారుచేస్తున్నాను.సాయంత్రంలోగా సముదాయంలో ప్రవేశపెట్టగలను.--యర్రా రామారావు (చర్చ) 07:36, 25 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టుపేజీ సముదాయం దృష్టికి ప్రవేశం

ఈ కార్యక్రమానికి ప్రాజెక్టుపేజీ నొకదానిని తయారుచేసి సముదాయం దృష్టికి ప్రవేశపెట్టటమైనది. సుజాత, వెంకటరమణ, ప్రణయ్ రాజ్, స్వరలాసిక, రవిచంద్ర, మహేశ్వరరాజు, వైవియెస్ రెడ్డి, పవన్ సంతోష్, చదువరి, Kasyap, Tpathanjali, Vmakumar, Naidugari Jayanna ... గారలు లాంటి చురుకైన వాడుకరులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచూ, సందేహాలు, సూచనలు, అభిప్రాయాలు, స్పందనలు ప్రాజెక్టుపేజీలో తెలుపవలసిందిగా కోరుచున్నాను. --యర్రా రామారావు (చర్చ) 15:58, 25 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
చాలా మంచి ఆలోచన , చాలా సాంకేతిక వ్యాసాలు లో మార్పులు చేయాలి, నేనూ మీతోనే Kasyap (చర్చ) 06:53, 25 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
చాలా మంచి ఆలోచన. అనేక సంవత్సరాల నుండి మొలక స్థాయి దాటని వ్యాసాలు అనేకం ఉన్నాయి. 2009లో ఈ మొలక వ్యాసాల అభివృద్ధి కోసం బాటుతో వికీపీడియా:మొలకల జాబితా/1.5 తయారుచేయడం జరిగింది. అందులో కొన్ని వ్యాసాలు మాత్రమే మొలక స్థాయి దాటినా అనేక వ్యాసాలు అలానే ఉన్నాయి. తరువాత ఏప్రిల్ 2013, జూన్ 2013, సెప్టెంబరు 2014,జూన్ 2014, జనవరి 2016 వంటి కొన్ని నెలవారీ పేజీలు సృష్టించబడిన మొలకల జాబితాలను తయారుచేసి, ఆయా వాడుకరులు అభివృద్ధి చేయాలని నిర్వాహకులు కోరినా ఎటువంటి ఫలితం కనబడలేదు. అప్పటి నుండి మొలకలు పెంచుకుంటూనే పోతున్నారు. మొలక పేజీల నియంత్రణ విధానం వచ్చిన తర్వాన కూడా మొలకల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం అటువంటి మొలక వ్యాసాల సృష్టి తక్కువగానే ఉంది. చాలా కాలం క్రితం క్రియాశీలకంగా ఉన్న వాడుకరులు మొలకలు సృష్టించిననూ, ప్రస్తుతం వారు క్రియాశీలకంగా లేనందున వారినే అభివృద్ధి చెయమనడం సరికాదు. ఈ మొలక వ్యాసాల విస్తరణ కృషి సమిష్టిగానే జరగాలి. అందరూ సమిష్టి కృషితోనే జరగాలి. దీని కోసం కొత్త వ్యాసాల సృష్టి ఆపవలసిన పనిలేదు. అవి ఆశక్తి ఉన్నవారు రాసుకొంటూ కూడా మొలకల విస్తరణపై కృషి చేయవచ్చు. కనుక మొలక వ్యాసాల జాబితాను తయారుచేస్తే వాటిని 2 కె.బి వ్యాసాలుగా, విస్తరిత వ్యాసాలుగా మార్చవచ్చు. ఈ ప్రాజెక్టులో నేను కూడా కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను.--కె.వెంకటరమణచర్చ 16:51, 25 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
కె.వెంకటరమణ గారూ ఇది స్వచ్ఛందంగా పాల్గొనే కార్యక్రమం. వ్యాసాల సృష్టింపు నిలుపుదల అనే మాట ప్రాజెక్టుపని ముందుకు సాగటానికి మాత్రమే ఉపయోగించబడింది.ఎవరైనా వాడుకరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ, వ్యాసాలు సృష్టింపుచేస్తూ ఉన్ననూ అభ్యంతరం ఏమీలేదు.ఏ విధంగా చేసినా మొలక వ్యాసాలు, అరకొర వ్యాసాలు అవసరమున్నంతవరకు పూర్తి సమాచారంతో అభివృద్ధి చేయాలనే గదా మనందరి సంకల్పం.వాటిమీద దృష్టిపెట్టకపోతే ఆ విధంగా రాసుకుంటూపోతూ ఉంటే వికీపీడియాలో కొన్నాళ్లకు అరకొర సమాచారం మాత్రమే ఉంటుందనే అభిప్రాయం రాకూడదని నా అభిప్రాయం.ఇప్పటికీ అలాంటి వ్యాసాలు సృష్టింపు జరుగుచున్నమాట వాస్తవం.మొలక వ్యాసాలమీద ఎంతమంది స్పందించి పనిజరుగుతుందో మనం గమనిస్తూనేఉన్నాం.--యర్రా రామారావు (చర్చ) 13:51, 26 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
చాలా మంచి ఆలోచన. నేను కూడా ఈ ప్రాజెక్టులో పాలుపంచుకుంటాను.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 06:21, 28 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఉపయుక్తకరమైన ఆలోచన..నేను కూడా ఈ ప్రాజెక్టులో పాల్గొంటాను.--Ajaybanbi (చర్చ) 17:04, 28 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

కొద్ది రోజులుగా ప్రాజెక్ట్ పనివల్ల దీనికి సమయం కేటాయించలేకపోయాను. ఇది చాలా మంచి ఆలోచన. తప్పక పనిచేస్తాను టి పతంజలి (చర్చ) 04:58, 16 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

పతంజలి గారూ పర్వాలేదు.--యర్రా రామారావు (చర్చ) 05:01, 16 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
యర్రా రామారావు గారు పని చేయవలసిన వ్యాసాలు ఇవేనా? వికీపీడియా:మొలకల జాబితా/1.5 టి పతంజలి (చర్చ) 05:05, 16 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
టి పతంజలి గారూ ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టుపేజీ చూడండి.వీటిలోవి గానీ లేదా మీకు నచ్చిన మొలక వ్యాసం ఏదైనా తీసుకుని నిరభ్యంతరంగా అభివృద్ధి చేయవచ్చుఅండీ.ఇతరులు చేసే వ్యాసాలలోకూడా సహేతుకమైన సవరణలు చేయవచ్చు.ధన్యవాదాలు.--యర్రా రామారావు (చర్చ) 06:26, 16 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Editing news 2020 #1 – Discussion tools

19:27, 8 ఏప్రిల్ 2020 (UTC)

Help with translation

(I apologize for posting in English ): Dear colleagues, We are organizing a project called WPWP that focus on the use of images collected as part of various contest and photowalks on Wikipedia articles across all languages and our team needs your help with translations into the language of this community. Here is the translation link: https://meta.wikimedia.org/w/index.php?title=Special:Translate&group=page-Wikipedia+Pages+Wanting+Photos&language=en&action=page&filter= I am sorry if I post in the won't venue. Thanks in anticipation. T Cells (చర్చ) 18:37, 13 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వర్గంలో ఉన్న 12 ఉపవర్గాలు, వాటిలో మొత్తం 369 వ్యాసములలో ఎటువంటి సమాచారం లేదు. 10 సంవత్సరములనుండి అందులో ఎటువంటి సమాచారం చేర్చబడలేదు. విస్తరిద్దామన్నా ఎటువంటి సమచారం లభించుటలేదు. కనుక వాటిని తొలగిస్తే బాగుండునని భావిస్తున్నాను. మిగిలిన నిర్వాహకులు కూడా పరిశీలించగలరు.--కె.వెంకటరమణచర్చ 09:40, 16 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

కె.వెంకటరమణ గారు మంచి అంశాన్నే పెట్టారిక్కడ. వర్గం:చాంద్రమానమాసములు అనే వర్గంలోని ఉపవర్గాల్లో ఉన్న వ్యాసాలన్నీ కూడా మార్చి 15, జూలై 29 లాంటి తేదీ పేజీలే. ఆయా తిథుల్లో పుట్టిన, గిట్టిన, ఇతర ఘటనలను ఈ పేజీల్లో చేర్చితే బాగానే, కళకళ లాడుతూనే ఉంటాయి ఆ పేజీలన్నీ. అయితే అది మానవికంగా కాక, బాటు ద్వారా చెయ్యగలిగితే భలే ఉంటది. పని కూడా పెద్ద శ్రమ లేకుండా అయిపోద్ది. అందుకని నేను గతంలో దీని గురించి బాటు సహాయం అభ్యర్ధిస్తూ రాసాను. కానీ, అక్కడ సమాధానమేమీ లేదు. ఇలాంటి పని చెయ్యగల ఆసక్తి, శ్రద్ధా ఉన్నవారు మనకు అర్జున గారు ఒక్కరే ఉన్నారు. కానీ ఆయన సాంకేతిక పరంగా ఇలాంటి ఆంశాలపై పనిచెయ్య రనుకుంటాను. ఈ బాటు అవసరాలు ఏమైనా ఉంటే మాకు చెప్పండి మేం చేసేస్తాం అని ఐఐఐటి వాళ్ళు గతంలో జరిగిన సమావేశంలో చెప్పారు. అప్పుడు నేను వాళ్ళకు పై పేజీని సూచించాను (అప్పటికి ఈ అభ్యర్ధన రాయలేదు గానీ, ఇతర అభ్యర్ధన లున్నాయి). ఎవరైనా పని మొదలు పెట్టారో లేదో గానీ.., నాకైతే తెలియదు. ఇక పోతే..
ఆ బాటో మరోటో వచ్చేదాకా ఈ తిథుల పేజీలను ఇలాగే ఉంచేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఏదో ఒకరోజు బాటుబాబు రాకపోతాడా, ఆ పని చెయ్యకపోతాడా.. చూద్దాం. లేదూ ఏదో ఒక రోజున మనలోనే ఎవరో ఒకరికి మండకపోద్దా.., మనమూ బాటు నేర్చుకోకపోతామా.. ఈ బాటు పనులన్నిటినీ చేయకపోతామా.. చూద్దాం. అందాకా ఆ పేజిలను ఉంచేద్దాం. __చదువరి (చర్చరచనలు) 14:43, 16 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఆశాభావం బాగానే ఉంటుంది. కానీ సాధ్యాసాధ్యాలు కూడా చూసుకోవాలి. కింది ఇబ్బందులు ఈ పనికి ఎదురొస్తున్నై.
  1. బాటు పని చేసేందుకు శక్తి, ఆసక్తి ఉన్న్నవారు ముందుకు రావాలి
  2. తేదీకి తిథులను అనుసంధించే డేటాబేసు దొరకాలి. నాకు జాలంలో కొన్ని సైట్లు దొరికాయి గానీ, డేటాబేసు యాక్సెస్ కావాలి.
  3. తిథి ప్రాంతాన్ని బట్టి మారుతుంది. తేదీ కూడా మారుతుంది. కానీ ఇప్పుడు ఇచ్చిన తేదీలన్నీ స్థానిక సమయాన్ని బట్టి ఉండేవే. తిథులు కోసం మాత్రం ఆ తేదీ భారత సమయాన్ని బట్టి చూస్తాయని నా ఉద్దేశం. భారతదేశానికి "ఆవల" ఉన్న దేశాల తిథులు తప్పు వస్తాయి. స్థలాన్ని బట్టి తిథిని సూచించే డేటాబేసు దొరికితే కొంత ప్రయోజనం. కాకపోతే ఈ డేటాబేసును వాడుకుని సరైన తిథిని పట్టుకోవాలంటే బాటుకు ఇంకాస్త తెలివితేటలుండాలి - ఘటన (పుట్టుకలు, చావుల వంటివి) నుండి "ఎక్కడ" అనేదాన్ని పట్టుకుని వెలికి తీయగలగాలి (నాకు తెలిసినంతలో ఇది చాలా కష్టం). అయితే రెండు అనుకూల వాదనలున్నై... 1. తిథి కొంచెం అటూ ఇటూగా ఉంటే ఏంటంట.. భారత సమయం ప్రకారమే తిథి చూడమని చెబుదాం. 2. మనకు భారత ఘటనలే ఎక్కువ. అవన్నీ సరిగ్గానే వస్తాయి కదా. తప్పు వచ్చేవి బహు కొద్ది. వాటిని మానవికంగా సరి చేసుకుందాం. (ఈ రెండో తర్కం నాకు ఇష్టం, నచ్చింది కూడా) కాబట్టి ఈ మూడో ఇబ్బందిని పక్కన పెట్టొచ్చనుకుంటా.
పై ఇబ్బందులను పరిశీలించాక, నాకు అనిపిస్తున్నదేంటంటే.. గత వ్యాఖ్యలో నేను రాసినట్టు ఎదురు చూస్తూ కూచోడం కంటే, కె.వెంకటరమణ గారు చెప్పినట్టు తొలగించేద్దాం. అంతగా బాటు చేసేందుకు ఎవరైనా ముందుకొస్తే, అవసరమైనవన్నీ ముడిపడితే, అప్పుడు ఈ పేజీలను మళ్ళీ సృష్టించుకోవచ్చు. __చదువరి (చర్చరచనలు) 01:43, 17 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
తేదీల బట్టి తిధులు రాయాలంటే చాలా యిబ్బందులు ఉన్నాయి. ఒక తేదీలో సమయాన్ని బట్టి రెండు తిథులు వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు ఒక వ్యక్తి 2018 మార్చి 1వ తేదీన జన్మించాడనుకుందాం. అతను ఆ రోజు జన్మించిన సమయాన్ని బట్టి తిథి మారుతుంది. ఒక పంచాంగం ప్రకారం అతను ఆ రోజు ఉదయం 07.12 నిమిషముల ముందు జన్మిస్తే అతని పేరును ఫాల్గుణ శుద్ధ షష్ఠి వ్యాసంలో చేర్చాలి. అతను 07.12 తరువాత జన్మిస్తే ఫాల్గుణ శుద్ధ సప్తమి వ్యాసంలో చేర్చాలి. జనన సమయం తెలియకుండా, మన తెవికీలో వర్గం:జననాలు, వర్గం:మరణాలు వర్గాలలో ఉన్న వేల మంది వ్యక్తుల జనన తేదీల ఆధారంగా ఆయా "తెలుగు తిథుల" వర్గాలలో చేర్చలేము. అదే కాకుండా వివిధ వ్యక్తులు రాసే పంచాంగాలు కూడా వారు ఉన్న అక్షాంశ, రేఖాంశాల బట్టి సమయాలు మారుట వలన తిథులను ఖచ్చితంగా గుర్తించడం కష్టం. కనుక ఆయా వర్గాలను తొలగించడమే మంచిదని నేను భావిస్తున్నాను.--కె.వెంకటరమణచర్చ 04:45, 17 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
నా స్పందన చూడండి.--అర్జున (చర్చ) 06:38, 17 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
పైనున్న - కె.వెంకటరమణ గారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. అర్జున గారు వెలిబుచ్చిన తర్కంతో విభేదిస్తున్నా.__చదువరి (చర్చరచనలు) 15:49, 17 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
సరియైన పంధాలో సవరించటానికి అవకాశాలు లేనప్పుడు కె.వెంకటరమణ గారి అభిప్రాయం ప్రకారం తొగించటమే మంచిదని నా అభిప్రాయం.--యర్రా రామారావు (చర్చ) 16:02, 17 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వర్గంలోని అన్ని వ్యాసాలనూ తొలగించే బదులు సంఘటనలు, జననాలు, మరణాలు, పండుగ దినాలు ఉప విభాగాలలో ఏ సమాచారమూ లేని వ్యాసాలను మాత్రమే తొలగిస్తే మంచిదని నా అభిప్రాయం. కనీసం ఒక్క సమాచారం ఉన్న వ్యాసాన్ని తొలగించకూడదని నేను భావిస్తున్నాను. --స్వరలాసిక (చర్చ) 02:52, 19 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
స్వరలాసిక గారూ, ఖాళిగా ఉన్న పేజీలనే తొలగించండి అని ఒక నిబంధన పెట్టారు ముందు. ఆ తరువాత ఖాళీ పేజీ లేకుండా చేస్తున్నారు. ఇక తొలగించే అవకాశ మేదీ!! మొక్కే గదా అని పీకేస్తే తాట తీస్తా అని మీరు అనలేదు గానీ.., పీకేసేందుకు వీలు లేకుండా సమాచారం చేరుస్తున్నారు. చప్పట్లు సార్. __చదువరి (చర్చరచనలు) 17:57, 20 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
వికీసోర్సు లో తిథులలో జరిగే పండగల గూర్చి ఆండ్ర శేషగిరిరావు రాసిన పుస్తకం పండుగలు - పరమార్థములు ఉన్నది. అందులోని అంశాలను వివిధ పేజీలలో చేర్చవచ్చునేమో స్వరలాసికగారు పరిశీలించాలి. కె.వెంకటరమణ (చర్చ) 08:37, 9 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Indic Wikisource Proofreadthon

Sorry for writing this message in English - feel free to help us translating it

Bot approval request

Hello everyone, mw:Multilingual Templates and Modules was started by User:Yurik to help in centralisation of templates and modules. There's a Yurikbot for the same which was approved on mrwiki some time back. Is it possible to get the approval for same in tewiki as well? Capankajsmilyo (చర్చ) 02:49, 19 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Support ' మూసలను దిగుమతి చేసుకునే పని లేకుండా, దిగుమతి చేసుకున్నవాటిని పదేపదే తాజారించాల్సిన పని లేకుండా రూపొందిస్తున్న పద్ధతి ఇది. ప్రస్తుతం బొమ్మలను మనం కామన్స్ నుండి ఏవిధంగా తెచ్చుకుంటున్నామో ఖచ్చితంగా అదే విధంగా కాకపోయినా ఆ దిశగా జరుగుతున్న కొంత ప్రయత్నం ఇది. నాకు ఈ పద్ధతి నచ్చింది, నేను దీన్ని ఆహ్వానిస్తున్నాను. వాడుకరులంతా తమ తమ అభిప్రాయాలను ఇక్కడ చెప్పాల్సిందిగా కోరుతున్నాను. __చదువరి (చర్చరచనలు) 14:29, 19 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
Support ' - B.K.Viswanadh (చర్చ) 14:56, 19 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
Support ' -- Pranayraj Vangari (Talk2Me|Contribs) 17:17, 19 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
Support ''--కె.వెంకటరమణచర్చ 17:26, 19 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
Support '--అర్జున (చర్చ) 05:55, 20 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
Support ' -- This will help us maintain uniform templates across the articles. Now I see a lot of outdated templates which we are manually updating. రవిచంద్ర (చర్చ) 05:58, 20 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
Support ' ----యర్రా రామారావు (చర్చ) 07:02, 20 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
Support ' ఏదైనా కొత్త అంశం మీద వ్యాసం అనువదించినప్పుడల్లా మూసలు తెచ్చుకోవడం ఒక పెద్ద భారం అయిపోతుంది. ఒకవేళ తీసుకురాకపోతే ఆమేరకు నష్టపోవాల్సివస్తోంది. అలా కాకుండా ఇది చాలా ఉపయోగపడుతుందని భావిస్తూ మద్దతునిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 13:10, 20 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
Support ' Ch Maheswara Raju (చర్చ) 10:52, 22 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Result: Hi Capankajsmilyo, tewiki is in. Your proposal to extend the "centralisation of templates and modules" feature to tewiki has been approved by the community. Please go ahead with your plan. Thanks. __చదువరి (చర్చరచనలు) 18:02, 28 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Thanks a lot Chaduvari, but the bot status has not been updated yet on mw:Special:CentralAuth/DiBabelYurikBot. Please check and confirm. Capankajsmilyo (చర్చ) 19:13, 28 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
@Capankajsmilyo: Done. __చదువరి (చర్చరచనలు) 01:58, 29 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఉన్న వ్యాసాలే కొద్దిపాటి తేడాతో సృష్టింపు

కొత్త వాడుకరులు వారి దృష్టిలో ఉన్న వ్యాసం అది ఇంతకుముందే వికీపీడియాలో ఉందేమో అని పలు విధాలుగా పరిశీలించకుండా (బహుశా అంత పరిజ్ఞానం లేక పోవచ్చు) సృష్టించుట జరుగుతుంది.ఆ వ్యాసాన్ని నిర్వాహకులు (నాతో సహా) మొదటిసారి చూచినప్పుడు గమనించకుండా దానిలో సవరణలు చేస్తున్నాం.మన సవరణలు వారు ముందుకు పోవటానికి ఊతమిస్తున్నాయి.అవి తర్వాత ఏప్పుడో ఎవరి దృష్టికో వచ్చినప్పుడు విలీనం మూస పెట్టి పని అయిపోయిందనుకుంటున్నాం.ఇప్పటికే విలీనం చేయవలసిన వ్యాసాలు 100కు పైగా ఉన్నవి. సృష్టించినప్పుడు పరిశీలించనందున ఒకే శీర్షికకు కొద్దిపాటి అక్షరాల తేడాతో ఎన్ని పేజీలు ఉన్నాయో ఇది ఉదాహరణకు గమనించండి. గొల్ల , గొల్ల వారు , యాదవ, గొల్ల వారు(యాదవులు)(గోకులము) అనే నాలుగు పేజీలు ఉన్నవి.--యర్రా రామారావు (చర్చ) 04:22, 21 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఒకే విషయంపై నాలుగు వ్యాసాలుగా సృష్టించారు. ఆంగ్లంలో కూడా "yadav", "yadava", "golla (caste)" వంటి వ్యాసాలున్నాయి. అవి వేర్వేరు అంశాలుగా వ్రాసారు. కానీ ఇక్కడ అన్ని ఒకే అంశంతో కూడుకొని ఉన్నాయి. ఇందులో గొల్ల, గొల్ల వారు(యాదవులు)(గోకులము), గొల్ల వారు వ్యాసాలను విలీనం చేయాలి. యాదవ వ్యాసం యాదవ వంశం గూర్చి వివరాలు రాయాలి. --కె.వెంకటరమణచర్చ 09:27, 21 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఇంతకుముందే వికీపీడియాలో ఉన్న వ్యాసం పరిశీలించకుండా కొత్తగా వ్యాసం సృష్టించేవాళ్ళది ఎంత పొరపాటు ఉందో, ఇంతకుముందు ఆ వ్యాసం రాసినవాళ్ళది కూడా అంతే పొరపాటు ఉంది. కొంతమంది సభ్యులు వ్యాసం రాసినప్పుడు 1. వికీడేటాలో ఉన్న ఆంగ్ల వ్యాసం లింక్ ఇవ్వకపోవడం 2. తప్పుడు పేరుతో వ్యాసం రాయడం, 3. వాడుకలో ఉన్న పేర్లతో దారిమార్పు ఇవ్వకపోవడం వంటి పొరపాట్లు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల వ్యాసం గురించి వెతినప్పుడు కనిపించడంలేదు. వ్యాసం సృష్టించడంతో పని అయిపోయినట్టుకాకుండా నేను చెప్పిన పై విషయాల గురించి కూడా సహ సభ్యులు దృష్టి పెట్టగలరు.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 14:11, 21 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
Pranayraj Vangari గారు చెప్పింది చాలా కరెక్టు. నిన్నో ఇవ్వాళో ఒక పేజీ చూసాను - "2. కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్" అని. వెంకటరమణ గారు తొలగించారు దాన్ని. (ఏదో పేజీలో లింకు ఇచ్చేటపుడు పొరపాటున ఈ పేరుకు ఇచ్చి ఉంటారు. ఆ ఎర్ర లింకును నొక్కేసి, పేజీ సృష్టించి ఉంటారు అని నాకు అనిపించింది.) ఆ పేరేంటి అలా ఉంది అని కనీస మాత్రం ఆలోచన పెట్టలా. కొత్త పేజీని తయారుచేసినపుడు తప్పనిసరిగా చెయ్యాల్సిన కొన్ని పనులు, ప్రణయ్ రాజ్ గారు చెప్పిన అంశాలతో పాటు మరి కొన్ని కలిపి, ఇక్కడ:
  1. సరైన పేరుతో, ఎక్కువగా వాడుకలో ఉన్న పేరుతో, పేజీని తయారు చెయ్యాలి. ("భారతదేశం విడిచిపో ఉద్యమం" పేరుతో కాదు పేజీని సృష్టించాల్సింది, "క్విట్ ఇండియా ఉద్యమం" పేరుతో.)
  2. అంతర్వికీ లింకులు ఇవ్వాలి.
  3. తెవికీ లోని ఇతర పేజీల నుండి ఈ పేజీకి లింకులున్నాయో లేదో చూసి (ఇక్కడికి లింకున్న పేజీలు), ఎన్ని పేజీల నుండి వీలైతే అన్ని పేజీల నుండి లింకులు ఇవ్వాలి
  4. దారిమార్పులేమైనా ఇవ్వాలేమో చూసి సృష్టించాలి
  5. పేజీని తగు వర్గం లోకి చేర్చాలి
  6. ఇవి కూడా చూడండి - ఒక ముఖ్యమైన విభాగం. పేజీకి సంబంధించినవి, పేజీలో నేరుగా వికీలింకు ఇవ్వడానికి కుదరని వాటికి, ఈ విభాగంలో లింకులు ఇవ్వవచ్చు. లింకులనేవి వికీపేజీకి ప్రాణం.
  7. పేజీకి సంబంధించిన మూసలేమైనా ఉన్నాయేమో వెతికి, ఆ మూసలను చేర్చాలి.
పరిశీలించగలరు. __చదువరి (చర్చరచనలు) 15:33, 21 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

మంచి సంప్రదాయం కాదు

వ్యాసాలు పరిశీలించి తగిన సవరణలు కోసం పెట్టిన తొలగింపు మూస, మూలాలు మూస, వికీకరణ మూసలు కొంతమంది ఏకంగా తొలగించుట జరుగుతుంది. పెట్టిన మూస ప్రకారం సవరించి తొలగిస్తే మంచిదే! అవేమిలేకుండానే మూస పెట్టినవారిని ఎందుకు పెట్టారు అని వివరణ కోరకుండా వాటిని తొలగించేస్తున్నారు.ఇది మంచి సంప్రదాయం కాదని నా అభిప్రాయం.--యర్రా రామారావు (చర్చ) 04:33, 21 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

అవునండీ, వికీ నిర్వహణ మూసలు పెట్టినా వ్యాసం ప్రారంభించిన వ్యక్తులు పట్టించుకోవడంలేదు. ఎటువంటి మార్పులు, చర్చ లేకుండానే తొలగించడం జరుగుతుంది. ఇది మంచి సాంప్రదాయం కాదు. కనుక అట్లా చేసిన వాడుకరికి చర్చా పేజీలో తెలియజేయండి.--కె.వెంకటరమణచర్చ 09:32, 21 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
యర్రా రామారావు గారు చెప్పినట్టుగా వ్యాసాలలో మూసలు తొలగించడం నేను కూడా గమనించాను. ఒక వ్యాసానికి మూస పెట్టారు అంటే, అ వ్యాసం వికీ నియమాలకు అనుగుణంగా లేదు అని అర్థం. వ్యాసంలో మార్పులు చేసిన తరువాతనే తొలగించాలి. అలా కాకుండా ఎలాంటి మార్పులు చేయకుండా మూసలు తొలగిస్తున్నారు. కాబట్టి, వికీ పాలసీలను ఏవిధంగానైతే చర్చించి నిర్ణయం తీసుకుంటామో... తొలగింపు మూస, మూలాలు మూస, వికీకరణ మూసల విషయంలో కూడా చర్చించి (మూస పెట్టిన వ్యాసాన్ని వికీ నియమాలకనుగుణంగా మార్చి, వ్యాసం చర్చాపేజీలో మూస పెట్టిన వాడుకరిని ప్రస్తావిస్తూ మూస తొలగింపును కోరడం) నిర్ణయం తీసుకోవాలని ఒక పాలసీ పెడితే బాగుంటుందని నా అభిప్రాయం.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 14:21, 21 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
పేజీలో వ్యాస నిర్వహణ మూస ఉంటే, ఆ మూసలో సూచించిన సవరణలు చేసాకే దాన్ని తొలగించాలి. సముచితమైన, సంతృప్తికరమైన సవరణలు చేసానని భావిస్తే, చేసిన వాడుకరి ఏ చర్చా లేకుండా మూసను తొలగించవచ్చని నా ఉద్దేశం.
  • తగు సవరణలేమీ చెయ్యకపోయినా,
  • చేసిన సవరణ అంత సంతృప్తికరంగా ఉందో లేదో సందేహంగా ఉన్నా,
అసలు ఆ మూస పెట్టడం సముచితం కాదని మనకు అనిపించినా, నిజంగానే సముచితం కాకపోయినా సరే, నేరుగా దాన్ని తొలగించరాదు. చర్చా పేజీలో మూస పెట్టిన వాడుకరిని ప్రస్తావిస్తూ చర్చ మొదలు పెట్టాలి. ఎవరూ సమాధానం రాయక పోతే (ఒక వారంలో) అప్పుడు తన నిర్ణయం ప్రకారం వెళ్ళవచ్చు. ఇదీ నా అభిప్రాయం. పరిశీలించగలరు. __చదువరి (చర్చరచనలు) 15:12, 21 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

నాణ్యత లేని అనువాద వ్యాసాలు

ఒక పక్క మనం చాలా రోజులుగా పడి ఉన్న యాంత్రిక అనువాద వ్యాసాలు తొలగిస్తూ ఉంటే ఐఐఐటీ హైదరాబాదు ఉపకరణాల సహకారంతో నాణ్యతలేని అనువాద వ్యాసాలు తయారవుతూనే ఉన్నాయి. ఇవి రాసే సభ్యులు వికీ ప్రాథమిక నియమాల మీద అవగాహన ఉన్నట్లు కనిపించడం లేదు. వ్యాసంలో మూలాలు, లంకెలు ఇవ్వడం లేదు. ఒకరిద్దరి సభ్యులకు నేను చర్చా సందేశం పెట్టాను. కానీ వారు స్పందిస్తున్నట్లు కనబడ్డం లేదు. ఈ వ్యాసాల మీద మనం ఏదో ఖచ్చితమైన పాలసీ తీసుకొని రావాలి. రాసే సభ్యులకు ప్రాథమిక అవగాహన కల్పించకుండానే వ్యాసాలు ప్రారంభించ కూడదని మనం ముందుగానే అనుకున్నట్లు గుర్తు. దాన్ని మనం పూర్తిగా ఆచరణలో పెట్టాలి. నేను గమనించిన ఉదాహరణ వ్యాసాలు.

  1. అమెజాన్ (కంపెనీ)
  2. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం
  3. నెట్‌ఫ్లిక్స్

--రవిచంద్ర (చర్చ) 06:03, 23 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

నేనూ కొంతమందికి సలహాలిచ్చాను -భాష నాణ్యత గురించి, వికీ నియమాల గురించీ (వాళ్ళు ఐఐఐటీ వాళ్ళో కాదో నాకు తెలియదు). చాలా మంది పట్టించుకోలేదు. వాళ్ళకు నియమాలగురించి తెలిసినా పాటించడం లేదని నాకు అనిపించింది. పై వ్యాసాలు రాసినది ఐఐఐటీలో శిక్షణ తీసుకున్నవాళ్ళే అయితే, ఇక ఆ శిక్షణ కార్యక్రమంపై పెద్దగా ఆశలు పెట్టుకోవాల్సిన పన్లేదు అనిపిస్తోంది. పోతే.. ఇలాంటి విషయాల్లో చర్యలు ఎలా ఉండాలనే విషయం గురించి నా అభిప్రాయాలు
  1. వికీ నియమాలకు సంబంధించి (మూలాలు, లింకులు వగైరా): మళ్ళీమళ్ళీ తప్పు చేసే ఇలాంటి వారి పట్ల తగు చర్య తీసుకోవాలి. ఒక సలహా, ఎలా చెయ్యాలో, ఎలా చెయ్యకూడదో సూచనలు, ఒక హెచ్చరిక, ఇక చర్య. ఇదీ నా అభిప్రాయం.
  2. ఇక భాష నాణ్యతకు సంబంధించి: వాక్యనిర్మాణం సరిగ్గా ఉండాలని, కనీస వ్యాకరణ నియమాలను పాటించాలనీ ఎవరూ చెప్పాల్సిన పన్లేదు. వికీ చెప్పదు కూడా. అక్కడక్కడా ఉండే దోషాల గురించి నేను మాట్టాడ్డం లేదు. అక్షర దోషాల గురించి నేను మాట్టాడ్డం లేదు. యాంత్రికానువాదాన్ని సవరించకుండా ఆ కృతకభాషనే ప్రచురించే వాళ్ళ గురించి మాట్టాడుతున్నాను. వాక్య నిర్మాణం సరిగ్గా చెయ్య్ని వాళ్లగురించి మాట్టాడుతున్నాను. అలాంటి చెత్త రాసేవాళ్ళకు ఒక్క హెచ్చరిక కూడా పెద్ద లక్జరీ లాంటిదే.
ఈ సందర్భంగా ఒక సంగతి చెప్పాలి.. ఈ మధ్య ఒకాయన చెత్త భాషతో ఒక వ్యాసం రాసి పడేస్తే, వెంకటరమణ గారు తొలగింపు మూస పెట్టారు. ఆ పెద్దమనిషి అంటాడూ.. కొత్తగా వచ్చేవాళ్ళని ప్రోత్సహించండి అంట! ఆయనేదో గొప్ప భాష రాస్తే వెంకటరమణ గారు అడ్డుకుంటున్నట్టు విసుక్కున్నాడు. తాను రాసిన భాష ఎట్టా ఏడిసిందో కనీసం ఆ హెచ్చరిక తరవాత నైనా చూసుకోవద్దూ..!? చూసుకోలా! కొత్తవాణ్ణి గదా.. ఈయనేదో చెబుతున్నాడు, విషయాలేంటో తెలుసుకుందాం అనుకోవద్దూ? అనుకోలా!
కొత్తవాళ్ళైతే.. తెలుగు తెలుగు లాగా రాయాలని, వ్యాకరణ యుక్తంగా రాయాలని కూడా తెలియదా? అది కూడా చెప్పాలా? భాష విషయంలో, యాంత్రికానువాదం విషయంలో వికీ నియమాలను, వడపోతలనూ బైపాస్ చేసి మరీ తప్పులు చేసేవారి విషయంలో సముదాయం కఠినంగానే ఉండాలనేది నా అభిప్రాయం. __చదువరి (చర్చరచనలు) 01:55, 24 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారి స్పందనకు ధన్యవాదాలు. ఈ వ్యాసాల్లో మరీ పూర్తిగా తొలగించాల్సినవిగా కూడా అనిపించదు. కానీ వాటిని నాణ్యతా పరంగా తిరగరాయాలంటే శ్రమ. వారికి చెబితే పట్టించుకోరు. మనం చేద్దామా అంటే సమయం సరిపోదు. అందుకని కనీసం నాణ్యతా ప్రమాణాల ప్రకారం శుద్ధి అవసరం అని ఒక మూస పెడితే బాగుంటుందా? ఇలా ఆలోచిస్తున్నాను. రవిచంద్ర (చర్చ) 09:58, 25 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
రవిచంద్ర గారూ, సమస్య అక్కడే వచ్చిందండి. తొలగించడం అనేది చాలా కఠినమైన నిర్ణయం. కానీ మనకది తప్పనిసరి అవుతోంది -మీరు చెప్పిన కారణం వల్లనే. మనం చెయ్యడానికి సమయముండదు. వాళ్ళేమో చెయ్యరు. మీరు చెప్పినట్లుగా మూస పెడతామనుకోండి.. దానికి స్పందించి సవరణలు చేసేంత సమయం ఉండేవారు పెద్దగా ఉండరు. ఈ క్రమంలో ఏమౌతుందంటే, ఈ తప్పు చేసేవారికి లెజిటిమసీ వచ్చేస్తుంది. మీకు గుర్తుండే ఉంటుంది.. ఆ మధ్య గుంటూరు కాలేజీ కుర్రాళ్ళు కొందరు 24 గంటల్లో ఇన్నేసి వ్యాసాలు రాయాలని పోటీ పెట్టుకుని వందలు వందలుగా మందలు మందలుగా యంత్రికానువాదాలను వండి వార్చారు. వాళ్ళ చర్చా పేజీల్లో మొత్తుకున్నాం మనం.. ఇలా చెయ్యకండి, వీటిని సరిదిద్దండి అని. కనీసం ఇద్దరికి ఎలా సరిదిద్దాలో కూడా చేసి చూపించాన్నేను. అయినా పట్టించుకోలేదు, మరిన్ని వ్యాసాలను ప్రచురించారు. చేసేది లేక, బోలెడన్ని వ్యాసాలను తొలగించాం. వ్యక్తిగతంగా నా అభిప్రాయం చెబుతున్నాన్సార్.. శుద్ధి మూస వలన పెద్దగా ప్రయోజనం ఉండదు. మరీ తొలగించాల్సినంత దారుణంగా లేదనిపిస్తే అలాగే ఓ ప్రయత్నం చెయ్యండి, చూద్దాం. __చదువరి (చర్చరచనలు) 10:44, 25 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారూ, రవిచంద్ర గారూ- తొలగింపు అనేద పెద్ద నిర్ణయమనీ, శుద్ధి మూస అనేది ప్రయోజనం లేనంత సున్నితమైన చర్య అనీ కదా ఇక్కడ చర్చ సాగుతోంది. మధ్యే మార్గంగా ఆ వ్యాసాలను దారి మార్పు లేకుండా రాసినవారి వాడుకరి పేరుబరికి పంపించి (వాడుకరి పేరుబరి వారి స్వంతం మనం మార్చకూడదు, వంటి శషభిషలతో ఇలాంటి వ్యక్తుల విషయంలో ప్రయోజనం లేదని నా అభిప్రాయం), ఆ ముక్క వారికి చెప్పి అక్కడ రాసుకోండని చెప్పడం మంచిదని నా ఉద్దేశం. నేను అలా ఈ ఈ వాడుకరికి చెప్పి చూశాను. బహుశా, ఏం జరుగుతుందంటే- 1. మనం చెప్పింది అర్థం చేసుకోవచ్చు 2. అలాక్కాకుండా తిరిగి ఆ అనువాద ఉపకరణంలో ప్రచురించి ఆప్షన్‌తో మొదటి పేరుబరిలో మళ్ళీ సృష్టించవచ్చు. మొదటిది చేస్తే సంతోషం. రెండవది చేస్తే ముందుగా హెచ్చరించినట్టు చర్యలు తీసుకోవడమే. ఒకవేళ గనుక ఇలా నలుగురైదుగురిపై చర్యలు తీసుకోవాల్సి వస్తే, పైన చెప్పిన పద్ధతులు అనుసరించకుండా ఒక హెచ్చరిక చేసి, వ్యాసాల తొలగింపు-వ్యక్తులపై నిషేధం, ఐపీ బ్యాన్‌ చేద్దాం. ప్రాజెక్టు నిర్వాహకులను మనం గతంలో "ఏం చేయదలుచుకున్నారో వివరంగా చెప్పండి" అని అడిగాం. ఇప్పటిదాకా మనకి సరైన స్పష్టత లేదు. ప్రాజెక్టు పేజీలో వివరాలు శూన్యం. ఇలాంటప్పుడు గట్టి చర్యలు తీసుకోకపోతే మనం దెబ్బతింటాం. మూకుమ్మడి తొలగింపులు చేయాల్సి రావచ్చు. --పవన్ సంతోష్ (చర్చ) 07:20, 26 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఒక్క క్లిక్ తో వ్యాసం ప్రచురించడం జరుగుతుంటే మరిన్ని వ్యాసాలు రాస్తూ పోతున్నారుకానీ, ఆ వ్యాసాలను వికీశైలిలో ఉండాలని ప్రయత్నం చేయడంలేదు. మనం ఎన్నిసార్లు ఎంతమందికి చెప్పిచూసినా అలానే జరుగుతోంది. అలాంటి వ్యాసాలపై చర్య తీసుకోకుండా మూసలాంటిది పెడితే, అనువాదాలు చేసేవారికి మరింత అవకాశం ఇచ్చినట్టు అవుతుందేమోనని నా అభిప్రాయం. పవన్ సంతోష్ గారు చెప్పినట్టు వ్యాసాలను వాడుకరి పేరుబరికి పంపించి, ఆ వాడుకరికి సూచన చేసి, ఇలా 5 వ్యాసాల వరకు అనుమతిని ఇచ్చి, ఆ వ్యాసలను శుద్ధి చేసిన తురవాతనే వేరేవి రాయాలని చెప్పి, అప్పుడు కూడా మరిన్ని వ్యాసాలను సృష్టిస్తే దాన్నిబట్టి చర్యలు తీసుకుందామని నా అభిప్రాయం.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 08:19, 26 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్, మీరు చొరవ తీసుకున్నందుకు చాలా సంతోషం. సాండ్ బాక్స్ ని వాడమని చెప్పడం చాలా మంచి ఆలోచన, తేలికైనది కూడా. ఉన్న వ్యాసాలను సభ్యుల పేజీకి ఉపపేజీగా తరలించడం వల్ల వ్యాసాలను పూర్తిగా తుడిచేసినట్టు కాకుండా ఉంటుంది కాబట్టి వారు కూడా నిరుత్సాహ పడరు. అందులో మనం చెప్పిన సూచనలు పాటించి అభివృద్ధి చేసి నాణ్యమైన వ్యాసం తయారయ్యాక ప్రచురించపజేస్తే అందరికీ మంచి వ్యాసం అంటే ఏమిటో ఒక అవగాహన వస్తుంది. ఆంగ్ల వికీలో కూడా కొత్త వాడుకరులకు ఈ పద్ధతిని విరివిగా సూచించడం చూశాను నేను. ఈ పద్ధతి నాకు నచ్చింది. సూచించిన మీకు ధన్యవాదాలు. Pranayraj Vangari గారి స్పందనకు ధన్యవాదాలు.రవిచంద్ర (చర్చ) 13:20, 26 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఆంగ్ల వికీలో ఉన్నట్టుగా తెవికీలో కూడా సాండ్ బాక్స్ పెడితే బాగుంటుందని గత డిసెంబరులో 16వ వార్షికోత్సంలో మహేష్ సూచన చేశాడు. కొత్తగా రాసేవాళ్ళకి అది ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి, సాండ్ బాక్స్ గురించి ఒకసారి పరిశీలిద్దాము.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 17:12, 26 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారు చెప్పిన పద్ధతిలో ప్రయోజనం ఉంటుందని నాకు అనిపించడం లేదు. సదరు వాడుకరి, ఆ వ్యాసాన్ని వాడుకరి పేరుబరి నుండి తిరిగి ప్రధాన పేరుబరి లోకి తరలించదలిస్తే, అది అందుకు తగునో కాదో తేల్చాల్సిన బాధ్యతను తరలించిన వారు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే అది క్యురేషను చెయ్యడమే. బాధ్యతగా పని చేసేవారి పని పట్ల క్యురేషను బాధ్యత ఈ సరికే తీసుకుంటున్నాం -సూచనలిస్తూ, సలహాలిస్తూ, సవరిస్తూ, మెరుగుపరుస్తూ. బాధ్యతకు స్పెల్లింగు కూడా తెలియకుండా, భాష పట్ల వీసమెత్తు గౌరవం లేకుండా వ్యాసాలను రాసిపడేసే వారి పట్ల ఇలాంటి శ్రమ తీసుకునేంత సమయం మన దగ్గరుందా? __చదువరి (చర్చరచనలు) 13:27, 5 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కొత్త మార్గదర్శకాలు, విధి విధానాలు ఎవరైనా తయారుచేసి చర్చకు ప్రతిపాదించవలసిన అవసరముంది. ఇలానే ఉంటే సమస్యలు మరింత త్రీవమయ్యే అవకాశముంది. లోగడ ఉన్న కొన్ని మార్గదర్శకాలు, విధివిధానాలకు వేరేభాష్యం అన్వయించుకొని లేదా అడ్డుపెట్టుకుని కొందరు పనిసాగించుచున్నారు.కొన్ని అవసరమైతే కఠిన నిర్ణయాలు ఉన్నప్పుడే పనిసజావుగా సాగిందని నాఅభిప్రాయం.ఈ ఉదాశీనతను ఇలానే కొనసాగిస్తే వికీపీడియా ఉనికికి మనమందరం ప్రమాదం కలిగించనవారమవుతాం.ఇది వాస్తవం.ఆలోచించగలరు. --యర్రా రామారావు (చర్చ) 16:00, 6 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ విభాగంలో 257 వ్యాసములు మూలాలు, లింకులు లేకుండా అర్థం మాత్రమే ఉన్న పదాలు వ్యాసాలుగా ఉన్నాయి. వీటిలో కొన్ని విక్షనరీలో కూడా ఉండవచ్చు. వీటిని వ్యాసాలుగా పరిగణించలేమని అనుకుంటున్నాను. పరిశీలించగలరు. కె.వెంకటరమణ (చర్చ) 14:43, 23 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

  • ఈ వర్గంలో పదాలను సుమారు 20కి పైగా పరిశీలించగా నేను పరిశీలించిన అన్ని పదాలు విక్షనరీలో ఉన్నవి.దాదాపుగా వీటిలో తరలించేవికూడా ఏమీలేవు.కాకపోతే ఈ పదాలకు అంతర్వికీ లింకులు ఇచ్చి ఉండవచ్చు అనుకుంటాను.మరలా ఎర్ర లింకులు గమనించి పేజీలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతాయా అని ఒక అనుమానం.ఈ పదాలుకు వ్యాసాలు దాదాపుగా అవసరంలేదనుకుంటాను.ఈ పదాలకు తిరిగి పేజీలు సృష్టించకుండా సంరక్షణలో ఉంచాల్సి వస్తుందా?నాకైతే పూర్తి వివరాలు తెలియవు.నాకు తోచిన అభిప్రాయం వెలిబుచ్చాను.--యర్రా రామారావు (చర్చ) 15:02, 23 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • విక్షనరీకి తరలించాలి అనే మూస పెట్టారూ అంటే, ఇవి ఇక్కడ ఉండకూడదని, తొలగించాలనీ నిర్ణయం తీసుకున్నట్టే. విక్షనరీకి తరలించే వీలుందో లేదో నాకు తెలవదు. ఇన్నాళ్ళుగా చెయ్యలేదు కాబట్టి ఉండి ఉండదు. వీటిని తక్షణమే తొలగించవచ్చు. అవి ఇక్కడ ఉండాల్సినవి కావు. __చదువరి (చర్చరచనలు) 02:00, 24 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • తొలగించాలి.--స్వరలాసిక (చర్చ) 05:00, 24 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

చర్చను ఒక అర్థవంతమైన ముగింపుకు తీసుకుపోయేందుకు, చర్చలో పాల్గొననివారెవరూ ఆసక్తి చూపించనందున, చర్చలో పాల్గొన్నప్పటికీ, నేను చొరవ తీసుకుని ఈ చర్చకు ముగింపు నిస్తున్నాను: చర్చలో పాల్గొన్నవారంతా తొలగించాలనే భావించారు. కాబట్టి, వర్గం:విక్షనరీకి తరలించవలసిన వ్యాసాలు వర్గం లోని పేజీలన్నిటినీ తొలగించాలి. వెంకటరమణ గారూ, ఈ నిర్ణయానుసారం తగు చర్య తీసుకోండి. లేదా నన్ను తీసుకోమంటే నేను తీసుకుంటాను. __చదువరి (చర్చరచనలు) 12:55, 5 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి పై నిర్ణయానుసారం ఆ వ్యాసాలను తొలగించండి. కె.వెంకటరమణ (చర్చ) 13:10, 5 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
24 గంటల్లో తొలగిస్తాను. __చదువరి (చర్చరచనలు) 16:06, 6 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
తొలగించాను. వర్గం ఖాళీ అయినప్పటికీ, దాన్ని తొలగించకుండా అలాగే ఉంచాను -భవిష్యత్తు అవసరాల కోసం. __చదువరి (చర్చరచనలు) 12:44, 7 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వర్గంలో లలిత గీతాల వ్యాసాలు 72 ఉన్నవి. ఎందులోనూ మూలంగానీ, లింకు గానీ లేదు. వీటిని వ్యాసాలుగా పరిగణించవచ్చా? దయచేసి పరిశీలించగలరు. కె.వెంకటరమణ (చర్చ) 15:21, 23 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

నేను మూణ్ణాలుగు వ్యాసాలు చూసాను. ఎందులోనూ పాట "గురించి" లేదు. పాట మొత్తం తెచ్చి ఇక్కడ పెట్టారంతే. ఇవి వికీపీడియాలో ఉండదగ్గవి కాదు. అయితే, ఎక్కడైనా పాట గురించి ఉంటే, ఆ పేజీలను ఉంచాలి. ఇలాగే సినిమా పాటలకు కూడా పేజీలు పెట్టేసారు. __చదువరి (చర్చరచనలు) 02:06, 24 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
కొన్ని లలితగీతాలు అనే ఒక పేజీ సృష్టించి అందులో వీటినన్నింటినీ డంప్ చేస్తే ఎలా ఉంటుంది? భవిష్యత్తులో ఎవరైనా ఈ గీతాల గురించి వ్రాయదలచుకుంటే సాహిత్యానికై వెదుకుకొనే శ్రమ తప్పుతుంది.--స్వరలాసిక (చర్చ) 04:58, 24 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
కేవలం పాటల సాహిత్యం మాత్రమే ఉన్న వ్యాసాలు నియమం ప్రకారం ఉండకూడదు. ముఖ్యంగా చదువరిగారు చెప్పినట్లు అవి పాట "గురించి" కాదు, ఇంకోటి కాపీ హక్కుల సమస్య. కాపీ హక్కుల సమస్య లేకపోతే వికీసోర్సుకు తరలించడం లేదా తొలగించడం. మనలో మన మాట. ఈ తరలించడం అనే మాట తరచుగా వాడేస్తుంటాం గానీ, నాకు అర్థమైనంత వరకు దీని అర్థం, వికీసోర్సులోకి వెళ్ళి పేజీ సృష్టించి, ఇందులోనుంచి నకలు తీసి, అక్కడ అతికించడం. అది కాకుండా సులభతరమైన మార్గం ఉందేమో నాకు తెలియదు. నేననుకున్నదే అయితే ఇది చాలా ఓపిగ్గా చేయాల్సిన పని. రవిచంద్ర (చర్చ) 09:53, 25 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

చర్చను ఒక అర్థవంతమైన ముగింపుకు తీసుకుపోయేందుకు, చర్చలో పాల్గొన్నప్పటికీ, నేను చొరవ తీసుకుని ఈ చర్చకు ముగింపు నిస్తున్నాను: "చర్చలో పాల్గొన్నవారంతా తొలగించాలనే భావించారు. కాబట్టి, వర్గం:తెలుగు లలిత గీతాలు వర్గం లోని పేజీలన్నిటినీ తొలగించాలి. స్వరలాసిక గారు చెప్పినట్లు ఈ పేజీల్లోని పాఠ్యాన్నంతటినీ ఒకే పేజీలో డంపు చెయ్యడమనేది కూడా వికీ నియమాలకు వ్యతిరేకమే, కాపీహక్కులకు వ్యతిరేకమే. కాబట్టి అది చెయ్యడం కుదరదు. అయితే ఈ పాటల శీర్షికలను వికీపీడియా పేరుబరి పేజీ ఒకదానిలో జాబితా లాగా చెయ్యవచ్చు. స్వరలాసిక గారూ, మీకు అది సబబనిపిస్తే రెండు రోజుల్లో ఆ పేజీ తయారు చెయ్యండి." వెంకటరమణ గారూ, ఈ నిర్ణయం విషయమై స్వరలాసిక గారి స్పందన కోసం ఒక రెండు రోజులు చూసి, ఆ తరువాత (అంటే, మే 8 వ తేదీన) ఈ నిర్ణయానుసారం తగు చర్య తీసుకోండి. లేదా నన్ను తీసుకోమంటే నేను తీసుకుంటాను. __చదువరి (చర్చరచనలు) 13:06, 5 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

స్పష్టత కోసం నిర్ణయాన్ని కొద్దిగా సవరించాను. జాబితా పేజీ తయారు చెయ్యాల్సిన బాధ్యత స్వరలాసిక గారు తీసుకోవాలని స్పష్టంగా చెప్పాను. ఇంతకు ముందు అది కొంత అస్పష్టంగా ఉంది. __చదువరి (చర్చరచనలు) 14:05, 5 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరిగారూ ఇది వరకే తెలుగు లలితగీతాల జాబితా ఒకటి ఉంది. ఈ వర్గంలోని పేజీలకు చెందిన పాటల శీర్షికలు ఆ జాబితాలో లేకుంటే చేర్చగలను. --స్వరలాసిక (చర్చ) 14:37, 5 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
తెలుగు లలితగీతాల జాబితాను సరిచేశాను. ఈ జాబితా వికీపీడియా పేరుబరిలో ఉండాలా, ప్రధాన పేరుబరిలో ఉండాలా అన్నది నిర్ణయించగలరు.--స్వరలాసిక (చర్చ) 15:40, 9 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారూ ఈ వర్గంలోని అన్ని వ్యాసాలు ఒక జాబితాగా తయారైనందున ఈ వ్యాసాలపై తగు చర్య తీసుకోగలరు. కె.వెంకటరమణ (చర్చ) 16:00, 9 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
స్వరలాసిక గారూ, ఆ పేజీ అంటూ ఉంటే, ప్రధాన పేరుబరిలోనే ఉండాలి. కాకపోతే, బాగా పొడుగైపోయింది. దాన్ని ఎలా సవరించాలో పరిశీలించాలి. __చదువరి (చర్చరచనలు) 16:13, 9 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
నిడివి తగ్గించాలంటే రచయితను ప్రాతిపదికగా తీసుకుని అతని లలితగీతాలన్నిటినీ ఒకేచోట చేరిస్తే తగ్గటానికి అవకాశం ఉంది.ఉదాహరణకు వడ్డేపల్లి కృష్ణ గారి లలితగీతాలు 8 ఉన్నవి. అవి అన్నీ ఒకే చోట తీసుకువస్తే గడులు తగ్గి,నిడివి తగ్గగలదని భావిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 16:24, 9 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
స్వరలాసిక గారు పని పూర్తి చేసారు కాబట్టి, 24 గంటల్లో ఈ వర్గం లోని వ్యాసాలన్నిటినీ తొలగిస్తాను. __చదువరి (చర్చరచనలు) 16:15, 9 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
తొలగించాను. __చదువరి (చర్చరచనలు) 08:41, 11 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
మీరు తొలగించిన వ్యాసాలలో మా తెలుగు తల్లికి మల్లె పూదండ ను తిరిగి స్థాపించారు; మీరు అత్యంత ఉత్సాహంగా తొలగిసున్న వాటిలో ఇలాంటి మంచి వ్యాసాలను తొలగించవద్దని మనవి.--Rajasekhar1961 (చర్చ) 10:59, 11 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
Rajasekhar1961 గారూ, ఆ వ్యాసాన్ని తొలగించడం నాది పొరపాటే. కానీ.. "అత్యంత ఉత్సాహంగా" తొలగిస్తున్నాను అని నన్ను ఎటకారం చేసారు కాబట్టి, ఇక్కడ మీకు కొన్ని సంగతులు చెప్పాలి. అవన్నీ ఇక్కడ పెట్టడం అంత బాలేదు కాబట్టి, మీ చర్చ పేజీలో పెడుతున్నాను చూడండి. __చదువరి (చర్చరచనలు) 02:21, 12 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసాల అభివృద్ధి ఉద్యమం 2020 ఏప్రియల్ - ప్రాజెక్టుపనిపై గణాంకాల నివేదిక

వ్యాసాల అభివృద్ధి ఉద్యమం 2020 ఏప్రియల్ ప్రాజెక్టు పనిని ఏప్రియల్ మాసంలో చేపట్టిన సంగతి మీ అందరికి తెలిసిన విషయమే. ప్రాజెక్టు పనికాలపరిమితి ముగిసినందున ప్రాజెక్టు పూర్వా పరాలు, అభివృద్ధి చెందిన వ్యాసాల గణాంకాల వివరాలతో మున్ముందు సూచనలకు మార్గదర్శకంగా ఉండగలదని భావించి వ్యాసాల అభివృద్ధి ఉద్యమం 2020 ఏప్రియల్ - ప్రాజెక్టుపనిపై గణాంకాల నివేదిక తయారుచేయబడినది. గౌరవ వికీపీడియన్లు గమనించగోరుచున్నాను.ఈ సందర్బంగా నాదొక మనవి.అరకొర సమాచారంతో, ఒకటి రెండు వాక్యాలతో, కృతక భాషతో, వ్యాసాలు సృష్టించి వికీపీడియా ఉనికికి భంగం కలిగించవద్దని కోరుతూ ధన్యవాదాలుతో ....--యర్రా రామారావు (చర్చ) 18:08, 4 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

మనం వికీపీడియాలో మంచి వ్యాసాలు ఉండాలని, అరకొర సమాచారం ఉన్న పాత వ్యాసాలను అభివృద్ధి చేయడానికి ప్రాజెక్టులు నిర్వహిస్తుంటే, అనుభవం ఉన్న పాత వాడుకరులతో పాటు కొత్త వాడుకరులు మరల ఏక వాక్య వ్యాసాలు, మూలాలు లేని వ్యాసాలు, ఒకే పేరుతో రెండు వ్యాసాలు, అర్థంకాని యాంత్రిక అనువాద వ్యాసాలు వంటివి సృష్టిస్తూ పోతున్నారు. కొత్త వ్యాసాలను కూడా నిరంతరం సమీక్షిస్తుండాలి. యర్రా రామారావు చెప్పినట్లు అరకొర సమాచారంతో, ఒకటి రెండు వాక్యాలతో, కృతక భాషతో, వ్యాసాలు సృష్టించవద్దని మనవి. కె.వెంకటరమణ (చర్చ) 12:08, 5 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
మొలకలకు సంబంధించి, వికీపీడియా:మొలకపేజీల నియంత్రణ విధానం మనకు ఒకటుంది. నెల రోజుల పాటు ఓ వ్యాసం మొలకగానే ఉండిపోతే, తొలగించాలని ఈ విధానం చెబుతోంది. ముందు దీన్ని ఖచ్చితంగా ఆచరణలో పెడదాం. అలాంటి వ్యాసాలను ఏ ప్రతిపాదన, ఏ చర్చా లేకుండా తొలగిద్దాం. కొన్నాళ్ళ తరువాత మరేదైనా మార్పుచేర్పులు చెయ్యాల్సిన అవసరం ఉందనిపిస్తే, చేసుకుందాం.__చదువరి (చర్చరచనలు) 12:49, 5 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రస్తుతం కొందరు వాడుకరులు వికీపీడియా:మొలకపేజీల నియంత్రణ విధానం బాగా అర్థం చేసుకొని 2 కె.బి కి సరిపోయేటట్టు మాత్రమే ఆంగ్ల వ్యాసాన్ని అనువదించి, మూలాలేమీ చేర్చకుండా వ్యాసాన్ని వదిలేస్తున్నారు. ప్రతీ వ్యాసానికి మూలాల మూస అతికిస్తున్నా వాటిలో మూలాలను చేర్చకుండా వ్యాసాల సంఖ్యను పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వ్యాసాలకు తొలగింపు మూస చేర్చడం, చర్చ జరగడం తొలగింపు నిర్ణయాన్ని తీసుకోవడం నిర్వాహకులకు పెద్ద భారంగా మారింది. కె.వెంకటరమణ (చర్చ) 16:23, 6 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
లోగడ తొలగింపు మూసలు పెట్టిన తరువాత వాటిమీద ఉదాశీనతగా ఉన్నందున, తగిన సవరణలు చేయకపోగా, మూసను ఏకంగా తీసేసిచంకలు కొట్టుకున్నట్లుగా ఉంది.ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కొత్త మార్గదర్శకాలు, విధి విధానాలు ఎవరైనా తయారుచేసి చర్చకు ప్రతిపాదించవలసిన అవసరముంది. ఇలానే ఉంటే సమస్యలు మరింత త్రీవమయ్యే అవకాశముంది. లోగడ ఉన్న కొన్ని మార్గదర్శకాలు, విధివిధానాలకు వేరేభాష్యం అన్వయించుకొని లేదా అడ్డుపెట్టుకుని కొందరు పనిసాగించుచున్నారు.వారికి కావలసింది వికీపీడియా ఎలా ఉన్నా పర్వాలేదు.నేను ఇన్ని సృష్టించాను అనే మానసికతృప్తి ఉంటే చాలన్నట్లుగా ఉంది.ఏప్రియల్ మాసంలో అభివృద్ది చేసిన వ్యాసాలు ఇలాంటివే.వాస్తవంగా అటువంటి వ్యాసాలకు బాధ్యులైనవారు ఒక్కరు ఆ ప్రాజెక్టుపనిలో పాల్గొనలేదు.అందుకనే కొన్ని అవసరమైతే కఠిన నిర్ణయాలు ఉన్నప్పుడే పనిసజావుగా సాగిందని నాఅభిప్రాయం.ఈ ఉదాశీనతను ఇలానే కొనసాగిస్తే వికీపీడియా ఉనికికి మనమందరం ప్రమాదం కలిగించనవారమవుతాం.ఇది వాస్తవం.ఆలోచించగలరు.--యర్రా రామారావు (చర్చ) 16:36, 6 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
యర్రా రామారావుగారూ! ఏప్రియల్ మాసంలో అభివృద్ది చేసిన వ్యాసాలు ఇలాంటివే. ఈ వాక్యానికి సంబంధించి ఇంకాస్తా వివరంగా ఏమైనా తెలియజేయగలరా?--నాయుడు గారి జయన్న (చర్చ) 11:32, 7 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
నాయుడు గారి జయన్న గారూ ఆ ప్రాజెక్టు పనికి తయారుచేసిన గణాంకాల నివేదికను ప్రస్తావించుచూ ఈ చర్చలోనే పై పేరాలో వివరించబడింది.గణాంకాల నివేదిక గమనించగలరు.--యర్రా రామారావు (చర్చ) 11:48, 7 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా శుద్ది

వికీపీడియాను శుద్ది చేస్తున్న సభ్యులు, చదువరి, రామారావు, వెంకట్రమణ, రవిచంద్ర తదితర సభ్యులందరికీ అభినందనలు..B.K.Viswanadh (చర్చ) 05:14, 6 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

B.K.Viswanadh గారూ మీ అభినందనలకు ధన్యవాదాలు.--యర్రా రామారావు (చర్చ) 05:23, 6 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
B.K.Viswanadh గారూ, ఈ పనిలో ఎంత ఎక్కువ మంది పాల్గొంటే పని అంత నాణెంగా ఉంటది. ముఖ్యంగా విషయ పరిజ్ఞానం, వికీ పరిజ్ఞానం ఉన్న మీవంటి వాళ్ళు సముదాయానికి అండగా, ముందుండి నడిపించాలి. __చదువరి (చర్చరచనలు) 17:03, 6 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్వాహకత్వాన్ని దుర్వినియోగం చేస్తున్న నిర్వాహకుడు Pranayraj1985

  • వీడియో గేమ్ - విస్తరించిన వ్యాసాన్ని తొలగించారు. మళ్ళీ సృష్టించి విస్తరించాను. మళ్ళీ తొలగించారు.
  • సూసైడ్ నోట్ - తొలగింపు మూసకు ముందే నాలుగు లైన్ల సమాచారం ఉంది, అయినా తొలగించారు, మళ్ళీ సృష్టించి విస్తరించాను, మళ్ళీ తొలగించారు.
  • సమాధి - సమాధి వ్యాసంలో తక్కువ సమాచారం ఉందని నాకు సూచన వచ్చిన రోజునే దానిని నేను విస్తరించాను. అయినా తొలగించారు.

YVSREDDY (చర్చ) 02:45, 10 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

YVSREDDY గారూ, మీరు వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/వీడియో గేమ్, వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/సమాధి పేజీలలో అవి విస్తరిస్తున్నారని కనీసం చర్చ కూడా చేయలేదు. సరికదా ఆయా వ్యాసాలలోని తొలగింపు మూసను మీరే తొలగిస్తున్నారు. సమాధి తొలగింపు మూస తొలగింపు, వీడియో గేమ్‌ తొలగింపు మూస తొలగింపు మీరు ఎలా చేస్తారు. అనేక సంవత్సరాలుగా వికీపీడియా వ్యాసాలతో అనుభవం ఉన్న మీరు చర్చ జరుగుతున్నప్పుడు చర్చలో పాల్గొనకుండా, సూచనలు పాటించకుండా ఎలా తోలగిస్తారు? ఇది వికీ నియమాలకు విరుద్ధం. మీరు సృష్టించిన "సూసైడ్ నోట్" ను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/సూసైడ్ నోట్ తొలగింపుకు ప్రతిపాదించగా ఎటువంటి స్పందన లేకుండా అది తొలగించిన తరువాత మరల సృష్టించారు. తొలగింపు చర్చలో మీరు పాల్గొంటే మాకు ఇంత చర్చ అవసరమయ్యేది కాదుకదా. మీరు ఆయా వ్యాసాల చర్చలలో పాల్గొనకపోయే సరికి మీరు తొలగించుటకు సిద్ధంగా ఉన్నారనే అభిప్రాయంతో తొలగించి ఉంటారని అనుకుంటున్నాను. అయితే వ్యాసాన్ని తొలగించే ముందు వ్యాసంలో ఏమైనా మార్పులు జరిగాయో లేదో పరిశీలించవలసి ఉంది. కె.వెంకటరమణ (చర్చ) 03:43, 10 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
YVSREDDY గారూ, పైన మీరు చేసిన అరోపణలు తప్పో ఒప్పో నేను పరిశీలించలేదు. దానికంటే ముందు.., మరొకరిపై ఆరోపణ చేసేముందు మీరు ఎలా వ్యవహరిస్తున్నారో కూడా మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాల్సి ఉంది. ఆ విషయాన్ని నేను మీకు చెప్పదలచాను.
  • ఒక పక్క తొలగింపు చర్చ జరుగుతూ ఉంటే అక్కడ ఏమీ రాయరు. ప్రతిపాదించిన వ్యాసంలో సవరణలేమైనా చేస్తే, తొలగింపు చర్చలో ఆ సంగతి రాయరు. రాస్తే అందరికీ ఆ సంగతి తెలుస్తుంది. ఒక ఉదాహరణ ఇస్తాను: తొమ్మిది - వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/తొమ్మిది. తొమ్మిది పేజీలో తగు మార్పులు చేసాక, తొలగింపు చర్చలో ఆ సంగతి రాయాలి కదా, రాయలేదు. ఇతర వాడుకరులు తమ బాధ్యతగా తొలగింపు ప్రతిపాదన, చర్చలు చేస్తున్నారు. మీ స్పందన కూడా అంతే బాధ్యతగా ఉండాలి. కానీ ఇంతవరకూ దాన్ని మీరు ప్రదర్శించలేదు.
  • తొలగింపు ప్రతిపాదన చేసి, చర్చించి, నిర్ణయం తీసుకుని, అమలు చేసే దాకా ఏమీ మాట్టాడరు. మీ వాదన చెప్పరు. విస్తరిస్తాను కొన్నాళ్ళు ఆగండని చెప్పరు. తొలగించీ తొలగించగానే మాత్రం, వెంఠనే ఆ పేజిని తిరిగి సృష్టిస్తారు. మళ్ళీ చెబుతున్నానండి.. ఇతర వాడుకరులు తమ బాధ్యతగా తొలగింపులు చేస్తున్నారు, ఖాళీగా ఉండి కాదు.
  • ఇలా చెయ్యవద్దు, ఇలా చెయ్యండి అని అభ్యర్ధించినా మళ్ళీ అ పని చేసారు. మీ చర్చపేజీలో నేను రెండు మూడు సార్లు సూచనలు, అభ్యర్ధనలు, ప్రతిపాదనలూ చేసాను. ఒక్కదానిక్కూడా మీరు స్పందించలేదు. అవునో కాదో, తప్పో రైటో, మంచో చెడో.. ఏదో ఒకటి చెబుతారని ఆశించాను. ఏనాడూ స్పందించలా. (సముదాయంతో, సాటి వాడుకరులతో మీరు సహకారంతో పని చేస్తున్నట్లుగా నాకైతే అనిపించలేదండి).
ముందు మీరు మారాలండి. __చదువరి (చర్చరచనలు) 03:50, 10 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
YVS రెడ్డి గారూ మీరు వికీపీడియాలో సీనియర్ వాడుకరి.మీరు సృష్టించే వ్యాసాలు కూడా వికీపీడియాలో ఉండదగినవే! సీనియర్ వాడుకరి అయికూడా మీరు వికీపీడియాలో వ్యవహరించేతీరు ఏమీ తెలియని కొత్త వాడుకరి ప్రవర్తించేతీరుకన్నా ఇంకాస్త దిగువగానే ఉంది.ఎందుకన్నానంటే మీరు సృష్టించిన వ్యాసాలు చూస్తే ఎవరికైనా అంతే అనిపిస్తుంది.
  • వికీపీడియా నియమాలు, మార్గదర్శకాలు అవిఏమీ మీరు పట్టించుకోరు.
  • వ్యాసం సృష్టంచి సవరణలు చేస్తున్న వ్యాసానికి In Use మూస వాడరు.
  • కష్టపడి రెండులైన్లు రాసి, ఒక సమాచారపెట్టె కూర్పుచేసి, చేతులు దులుపుకుంటారు.
  • తొలగింపు మూస పెట్టినప్పుడు స్పందించకుండా, చర్చ అంతా అయిపోయి వ్యాసం తొలగించిన తరువాత, గుట్టుచప్పుడు కాకుండా తిరిగి వ్యాసం సృష్టిస్తారు. పొనీ అదన్నా సరిగా పూర్తి చేస్తారా అంటే అదీ జరగదు.
  • ఎటువంటి సవరణలు చేయకుండా తొలగింపు మూస మీరే తీసివేస్తారు.
  • మీ చర్చా పేజీలో పెట్టిన సందేశానికి స్పందించరు.
  • ఒక్క వ్యాసానికి మూలం ఉండదు.
  • ఈ జాబితాలో మీ మొలకలు సుమారు 500 పైగా ఉన్నవి.ఇవి సృష్టించి ఏళ్లు గడిచినవి.వాటికి ఒక మూలం లేదు, ఉండేది రెండు వాక్యాలు.అర్థవంతమైన పరిమాణం ఉండవలసిన వ్యాసాలు కూడా రెండే వాక్యాలతో ఉంటాయి.మీరు రెండే వాక్యాలతో సృష్టించిన మొలక వ్యాసాలు నేను, చదువరి, వెంకటరమణ, ప్రణయరాజ్, ఇంకా ఇతర వికీపీడియన్లు శ్రమ తీసుకుని అర్థవంతమైన పరిమాణంతో రాసిన వ్యాసాలు చాలా ఉన్నవి. మీ పాలసీ ఏమిటో ఎవరికీ అర్థంకాకుండా ఉన్నది.మీరు చేసే పనులకు నలుగురు, మీ వ్యాసాలు మీదే దృష్టి కేంద్రీకరించవలసివస్తుంది.ప్రణయరాజ్ గారి వలన ఏదైనా పొరపాటు జరిగింది అనుకుంటే దానిలో మీ పాత్ర కూడా ఉంది. తొలగింపు మూసలు పెట్టినప్పుడు మీరు స్పందించి, వాటికి తగిన సందేశం చర్చాలో తెలిపితే ఇలా జరిగేదికాదు.ఇలాంటి సమస్యలు మున్ముందు ఏర్పడకుండా చదువరి గారు మీ చర్చాపేజీలో "ఒక ప్రతిపాదన" అనే విభాగంలో పెట్టిన సందేశం ఒకసారి చూసి అభిప్రాయం తెలపండి.వికీపీడియాలో ఎప్పుడైతే వ్యాసలు తొలగించటానికి ఉండవో, ఆరోజు మాత్రమే వికీపీడియా బాగుంది అనుకోవాల్సి ఉంటుంది.గమనించగలరు.నా అభిప్రాయలు మీకు కఠినం అనిపించవచ్చు.కానీ వాస్తవం.నిజంగా మీకు బాధ కలిగిస్తే క్షమించండి.భాధ కలిగినప్పడే సవరించుకుంటాం.--యర్రా రామారావు (చర్చ) 04:57, 10 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
YVSREDDY గారు
  1. వీడియో గేమ్ వ్యాసంకు 2020, ఏప్రిల్ 30న తొలగింపు మూస పెట్టారు. అప్పుడు తొలగింపు చర్చాపేజీలో మీరు ఎలాంటి చర్చ చేయలేదు. తొలగించబడింది. మళ్ళీ మే 6న పేజీ సృష్టించి కొంత సమాచారం రాసారు, మూలాలు (ఇప్పటికీ కూడా) పెట్టలేదు. నిన్నటి వరకి ఆ వ్యాసం అలానే ఉంది. కనీసం inuse మూస కూడా పెట్టలేదు.
  2. సూసైడ్ నోట్ వ్యాసంకు 2020, ఏప్రిల్ 30న తొలగింపు మూస పెట్టారు. అప్పుడు తొలగింపు చర్చాపేజీలో మీరు ఎలాంటి చర్చ చేయలేదు. తొలగించబడింది. కానీ, మీరు మళ్ళీ సృష్టిస్తున్నాను అని ఎక్కడ రాయలేదు. కనీసం inuse మూస కూడా పెట్టలేదు.
  3. సమాధి వ్యాసంకు 2020, మే 3న తొలగింపు మూస పెట్టి, ప్రతిపాదించబడింది. తొలగింపు చర్చలో ఎలాంటి చర్చను చేయకుండా మీరు వ్యాసంలో తొలగింపు మూసను తొలగించారు. మూలాలు (ఇప్పటికీ కూడా) చేర్చలేదు. కనీసం inuse మూస కూడా పెట్టలేదు.

కాబట్టి... వెంకటరమణ గారు, చదువరి గారు, యర్రా రామారావు గారు ప్రస్తావించినట్టుగా తొలగింపు మూసలు పెట్టినప్పుడు మీరు స్పందించి వాటికి తగిన సందేశం చర్చలో తెలపండి. అలాగే వ్యాసం సృష్టంచి సవరణలు చేస్తున్న వ్యాసానికి In Use మూస వాడితే, వ్యాస స్థితి నిర్వాహులకు సులభంగా అర్థం అవుతుంది. ఇకపై ఈ సూచనలు పాటిస్తారని ఆశిస్తున్నాను. వికీపీడియాలో నిర్వాహకత్వం అనేది పదవి కాదండి, బాధ్యత. నాకు ఇచ్చిన బాధ్యతను నేను నెరవేరుస్తున్నానంతే. Pranayraj Vangari (Talk2Me|Contribs) 05:48, 10 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

వాడుకరి:YVSREDDY గారూ, మీరు సృష్టించిన వందల ఏకవాక్య వ్యాసాలు మూలాలు లేకుండా పడి ఉన్నాయి. వాటిని విస్తరించి మూలాలు చేర్చడానికి కృషిచేయండి. అవి ఉంటూండగా మరలా మొలకలను, మూలాలు లేని వ్యాసాలను సృష్టిస్తూ పోతున్నారు. మీ చర్చా పేజీలో తెలియజేసిన తొలగించవలసిన వ్యాసాల చర్చలలో మీ అభిప్రాయాలను తెలియజేయండి. కె.వెంకటరమణ (చర్చ) 08:51, 10 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

వాడుకరి:YVSREDDY గారి వైఖరి

వాడుకరి:YVSREDDY గారు, వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/పెద్దలకు మాత్రమే ప్రతిపాదన 28 April 2020 న చేయడం జరిగింది. దానిపై ఇంతవరకు ఎటువంటి చర్చ లేకుండా ఉండి, అది తొలగించే సరికి మరలా సృష్టించారు. మాకు ఈ వ్యాసాలను సమీక్షించేందుకే సమయం సరిపోతుంది. ఇలా వందల సంఖ్యలో ఏక వాక్య వ్యాసాలున్నా వాటి జోలికి పోరు. అతని చర్చా పేజీలో తొలగింపు చర్చల లింకులున్నా ఎటువంటి చర్చలు చేయరు. తొలగిస్తే మరల ప్రారంభిస్తారు. నిర్వాహకులకు నిరంతరం ఈ తొలగింపు వ్యాసాలపై సమీక్షతోటే సరిపోతుంది. సూచనలు చేసినా సరే వాటికి స్పందిచరు. వాడుకరి:YVSREDDY గారు మీరు మీ చర్చాపేజీలో ఉన్న తొలగింపు చర్చలలో స్పందించండి. కె.వెంకటరమణ (చర్చ) 05:52, 11 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

అసలు వ్యాసాలు తొలగించాల్సిన పని ఏముంది, నేను ప్రారంభించిన ప్రతి వ్యాసంలో రెండు వేల బైట్లకు మించి సమాచారం చేరుస్తానని ముందే తెలిపివున్నాను.YVSREDDY (చర్చ) 06:03, 11 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
వాడుకరి:YVSREDDY గారూ, వ్యాసం రాయడమంటే 2000 బైట్లు రాసి వదిలివేయడమా? విస్తరించడానికి సమాచారం ఉన్నా మీరు చేర్చడం లేదు. దానికి మూలాలు ఉండాలి. లింకులు ఉండాలు. ఇతర పేజీల నుండి లింకులు ఉండాలి. మీరు రాసిన 90% వ్యాసాలలో ఎటువంటి మూలాలు లేవు. అనేక సంవత్సరాల తరబడి ఉన్నాయి. వాటిని ఎవరూ విస్తరించరు. మీరు వాటిని వదిలివేసి కొత్త వ్యాసాలు రాస్తుంటారు. వ్యాసాల సంఖ్యపైనే మీకు ఎక్కు అభిరుచి ఉన్నట్లుంది. మంచి వ్యాసాన్ని అందించడానికి కృషిచేయండి. కొన్ని వ్యాసాలలో ఒక మూస మాత్రమే ఉండి అవికూడా 2000 బైట్లకు చేరాయి. వాటిని వ్యాసాలుగా పరిగణించగలమా? అందువలన వికీ నియమాలు పాటించకుండా రాసిన వ్యాసాలు తొలగించబడతాయి. మీరు మీ చర్చాపేజీలలో ఉన్న తొలగింపు వ్యాసాల లింకులలో మీ అభిప్రాయాలను తెలియజేయండి. కె.వెంకటరమణ (చర్చ) 13:14, 11 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
YVSR గారూ మీరు వికీపీడియాలోని మార్గదర్శకాలకు,నియమాలకు ఒక సీనియర్ వాడుకరిగా వక్రభాష్యంకల్పించి ఇలా వితండవాదం చేయుట భావ్యంగాలేదు.పొనీ మీ ఒక్కరి వ్యాసాలే తొలగింపుకు గురి అవుతున్నాయా?లేదే!ఎవరిఅయినా అలాంటి వ్యాసాలు దృష్టికి వచ్చినవి తొలగింపబడుతున్నవి.కాకపోతే మీరు మొలక వ్యాసాలు సృష్టించుటలో గణతికెక్కినందున, తొలగింపుకు మీ వ్యాసాలు ఎక్కువుగా గురౌవుతున్నమాట వాస్తవం.వికీపీడియాలో గణాంకాలు ఎక్కువ ఉంటే ఉపయోగంగురించి చెబితే,నచ్చితే నేనుకూడా ఆ పద్దతి అనుసరిస్తాను. మనం చేసే వాదన సహేతుకంగా ఉండాలి.ఉదాహరణకు మీరు సృష్టించిన రెండు వ్యాసాలు చూడండి.అవి ఏరకంగా తీర్చి దిద్దబడినవో!
  • జీన్ బాటన్ ఈ వ్యాసాన్ని 2016 సెప్టెంబరు 15 న సృష్టించారు.మీరుగా దానిని 1860 బైట్స్ వరకు చాలా కష్టపడి తీసుకొచ్చి వదిలి వేసారు. దానిని పూర్తి అర్థవంతమైన వ్యాసంగా (54,668 బైట్స్ కు) తీసుకురాబడింది.మంచి ఉద్దేశం ఉంటే మీరే ఆ పనిచేసేవారు.మీరు గణాంకాల మోజులో పడి మంచి ఉద్దేశాలకు తిలోదకాలు ఇస్తున్నారు.
  • నూతన సంవత్సర రోజు మీరు సృష్టించిన ఈ వ్యాసానికి మూలంలేదు.ఈ వ్యాసాన్ని మరికొంత అభివృద్దిచేసి,మూడు మూలాలు కూర్పు చేయబడినవి.పరిశీలించండి.మీ వ్యాసాలు పరిశీలిస్తే, మూలం పెడదామనే ఆలోచన మీకు ఉన్నట్లుగా అనిపించదు.మరి మీరు రాసేవాటికి మూలం అవసరంలేదని భావిస్తారో ఏమో అర్థం కావటంలేదు.ప్రెండ్లీగా చెపుతున్నాను.భాదపడకండి.మనసు మార్చుకొని సహకరించగలరు.మీరు ఇలానే ఉంటే, "మీ ఇష్టం వచ్చినది చేసుకోండి" అని భావించవలసి వస్తుంది.--యర్రా రామారావు (చర్చ) 14:19, 11 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
వాడుకరి:YVSREDDY గారు, మొలక వ్యాసాల గురించి ఇంత చర్చ జరుగుతున్నా మళ్ళీ ఈరోజు మీరు జనన ధృవీకరణ పత్రం (1057 బైట్లు, మూలం లేదు), పెద్దలకు మాత్రమే (మూలం లేదు) రెండు వ్యాసాలు సృష్టించారు. అసలు మీరు తెలియక చేస్తున్నారో, తెలిసి చేస్తున్నారో, మీ ఉద్దేశ్యం ఏంటో మాకు అర్థంకావడం లేదు. అందరం ఒకమాట మీద ఉంటేనే వికీపీడియా నాణ్యత పెరుగుతుంది. ఒకసారి ఆలోచించండి. Pranayraj Vangari (Talk2Me|Contribs) 14:59, 11 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • 2016 కు ముందు అనువాదం చాలా కష్టంగా ఉండేది, అప్పుడు గూగుల్ ట్రాన్స్‌లేటర్ లో తప్పులు అధికంగా ఉండేవి, ఆ సమయంలో గూగుల్ ట్రాన్స్‌లేటర్ కి అనువాద ప్రక్రియలో నేను కూడా సహకరించాను. అప్పట్లో 2000 బైట్ల అనువాదం అంటే చాలా శ్రమతో కూడుకున్న పని. అందువలన పాత వ్యాసాలలో తక్కువ సమాచారం ఉన్నా తొలగించకూడదు.YVSREDDY (చర్చ) 20:17, 11 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

YVSR గారూ మీరు చెప్పేదానిలో వాస్తవం లేకపోలేదు.ఇప్పుడు బాగుందికదా!వాటిని ఇప్పుడు అభివృద్ది చేయండి.మీ చర్చాపేజీలో మూడు చాయస్ లో ఒక చాయస్ ఎంచుకొని అభివృద్ధి చేయండి.ఇప్పుడు బాగుంది అని మీరే ఒప్పుకున్నారు.మరి ఇప్పుడు కూడా అలాంటి వ్యాసాలు సృష్టించి గాలికి వదలి వేస్తున్నారు గదా.ఈ వ్యాసాలు పరిశీలించండి.కేరళ ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయము, ఫాదర్ ముల్లర్ వైద్య కళాశాల రెండు రాయతగ్గ వ్యాసాలు.ఆలోచించండి.--యర్రా రామారావు (చర్చ) 02:33, 12 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

మనం ఎన్ని చెప్పినా వాడుకరి:YVSREDDY గారు ఇంకా సమర్దించుకుంటూనే ఉంటున్నారు. చర్చలతో కాలయాపన చేయడమే తప్ప మరోటి కనిపించడం లేదు. ఆయన సృష్టించిన మొలక వ్యాసాల అభివృద్ధి విషయంలో తన నిర్ణయం చెప్తే వాటిని తొలగించాలా, ఉంచాలా అనేది చూడొచ్చు. ఇక ఈ విషయం గురించి చర్చ అనవసరని నా అభిప్రాయం. Pranayraj Vangari (Talk2Me|Contribs) 03:16, 12 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

పాత వ్యాసాల అనువాదం చిత్రలేఖనం వంటిది, కొత్త వ్యాసాల అనువాదం జెరాక్స్ వంటిది. చిత్రలేఖనాలు బాగా లేవు, జెరాక్స్‌లు బాగా ఉన్నాయి అంటే, జెరాక్సులు బాగానే ఉంటాయి. కానీ చిత్రలేఖనం విలువ జెరాక్సులకు రాదు. పాతకాలంలో ఇంటర్నెట్ స్పీడ్ ఎంత, ఇప్పుడు ఇంటర్నెట్ స్పీడ్ ఎంత కొన్ని వందల రెట్లు తేడా వుంది. నిర్వాహకులు నేను ప్రారంభించిన వ్యాసాల యొక్క మొలక జాబితాను తయారు చేస్తే రోజుకు కనీసం ఒక వ్యాసం చొప్పున మొలక స్థాయిని దాటిస్తాను. నేను ప్రారంభించే కొత్త వ్యాసంలో ప్రారంభించిన రోజునే రెండు వేల బైట్లకు మించి సమాచారమును చేరుస్తాను. తొలగించిన వ్యాసాలను సృష్టించేటప్పుడు, సృష్టించిన రోజునే ఐదు వేల బైట్లకు మించి సమాచారం చేరుస్తాను. చెత్తరాతలు ఉన్న వ్యాసాలు తప్ప ఎవరి రాసిన వ్యాసమైనా, దానిలో అర్థవంతమైన సమాచారం ఒక వాక్యమే ఉన్నా తొలగించరాదు. YVSREDDY (చర్చ) 05:12, 12 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఎబ్బే ఏం లాభం లేదు YVSREDDY గారూ, మీ చిత్రలేఖనం జిరాక్సుల పోలిక అస్సలు కుదరలేదు. ఈ రెండైనా, ఫోటోలైనా, ఫాక్సిమిలీ అయినా మరోటైనా.. చేత్తో గీసాడా, జిరాక్సు తీసాడా, ఫ్రేం కట్టాడా, దండేసాడా.. ఇవి కాదు కావాల్సింది, అందులో అసలు సరుకుందా అనేది ముఖ్యం. అది సమాజానికి ఉపయోగపడుతుందా అనేది ముఖ్యం. అప్పుడే దానికి విలువ. చిన్నమెత్తు ఉపయోగం లేకపోయినా.. చిత్రలేఖనం కాబట్టి దానికి విలువ ఇవ్వాలి అంటే అస్సలు కుదరదు.
ఇక, ఇంటర్నెట్టు స్పీడుకు మొలకలకూ లంకె పెట్టడం గురించి.. మీరు మొలకలు సృష్టించడం మొదలుపెట్టడానికి చాలా ఏళ్ళకు ముందే, ఇంటర్నెట్టు స్పీడు అంతకంటే తక్కువ ఉన్నపుడే.. తెవికీలో వందలాది వ్యాసాలు పేజీలకు పేజీలు రాసారు. అంచేత, ఇంటర్నెట్టు స్పీడుకు మొలకకూ లంకె పెట్టడం - బట్టతలకూ మోకాలికీ ముడిపెట్టడం లాగుంది. ఇక్కడ మీరు చెప్పిన లాజిక్కులు మీ మొలకలకు రక్షణ కల్పించడం లేదు. ఆ మొలకలకు రక్షించుకునే మార్గమల్లా ఒకటే.. సముచితమైన సమాచారంతో వాటిని విస్తరించడమే. __చదువరి (చర్చరచనలు) 04:00, 13 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

మొలక వ్యాసాలు మూకుమ్మడిగా తొలగించుటగురించి

వికీపీడియాలో ఉన్న మొలక వ్యాసాలు అభివృద్ధిపరుచుటకు 2020 జనవరిలో మొలక వ్యాసాల గణాంకాలు తయారుచేసి, వాటిని అభివృద్ధి చేయవలసిందిగా రచ్చబండలోని మొలకల నియంత్రణ విభాగంలో అభివృద్ధి చేయగలందులకు కోరుటజరిగింది.కొంతమంది గౌరవ వికీపీడియన్లు స్పందించి అభివృద్ది చేయుట జరిగింది.ఇవి చాలాకాలం నుండి అభివృద్దికినోచుకోకుండా అలానే ఉన్నవి.ఇంతకాలం వాటిని అలానే ఉంచటం భావ్యంకాదని భావించి, తొలగించే రోజుకు ఉన్న అన్ని మొలక వ్యాసాలు మొలకపేజీల నియంత్రణ విధానం లో సూచించిన మార్గదర్శకాలకు లోబడి మూకుమ్మడిగా తొలగించటానికి ప్రతిపాదిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 08:52, 11 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ముందుగా.. మొలక లేనిదే మాను లేదు అని నేను నమ్ముతాను. అంతమాత్రాన, అరకొర సమాచారంతో ఎందుకూ పనికిరాని మొలకలు వికీపీడియాలో ఉండీ ప్రయోజనం లేదు కూడా. తాము సృష్టించిన మొలకల పట్ల కొందరు వాడుకరులు ప్రవర్తిస్తున్న నిరాసక్త ధోరణి చూస్తోంటే, మొలకలను మూకుమ్మడిగా తొలగించడమే సరైన విధానమని అనిపించినప్పటికీ, 2048 బైట్లకు దిగువన ఉన్న ప్రతీదాన్నీ నరికి పారెయ్యడం ఏమాత్రం సమంజసం అన్న ప్రశ్నకు సమాధానం చెప్పుకోలేకపోతున్నాను. అంతమాత్రాన.., మొలకలను సృష్టించి, ఎవరో ఒకరు సాకక పోతారా అని లోకమ్మీద వదిలెయ్యడాన్ని సమర్ధించలేం కూడా. దీనికి మధ్యేమార్గం ఏమైనా ఉందేమో కూడా పరిశీలించాలి. శిక్ష మొలకలకు వెయ్యకుండా, మొలకలను సృష్టించినవారికి వెయ్యాలని నా అభిప్రాయంగా ఉంది. నాకు తోచిన పద్ధతి రాస్తున్నాను, పరిశీలించండి:
ఇకపై తయారు చెయ్యబోయే మొలకల గురించి:
  1. మొలక అంటే 2 కె.బి అనే నిర్వచనం బాగా దుర్వినియోగమౌతోంది. కొత్తగా సృష్టించే వ్యాసాలకు మొలక నిర్వచనాన్ని మార్చాలి. ఉదా:
    1. కనీసం 5 కెబి ఉండాలి.
    2. కనీసం ఒక్కటైనా సరైన మూలం ఉండాలి.
    3. ప్రధాన పేరుబరి నుండి కనీసం ఒకటైనా ఇన్‌కమింగు లింకు ఉండాలి. మూడుంటే మంచిది. ("ఇక్కడికి లింకున్న పేజీలు" లింకును నొక్కినపుడు చూపించాలి)
    4. కనీసం మూడు సందర్భోచిత వికీలింకులు ఉండాలి.
    5. ఖచ్చితంగా అంతర్వికీ లింకులుండాలి -ఇంగ్లీషులో ఆ వ్యాసం లేని సందర్భంలో తప్ప.
  2. పై నిర్వచనానికి సరిపోయే మొలకలను సృష్టించినపుడు, ఒక వారం రోజుల్లో దాన్ని మొలక స్థాయిని దాటించాలి. ఆ వారం తరువాత వేరే వాడుకరి దాన్ని విస్తరించదలిస్తే, ఆ వాడుకరి ఈ పేజీని తొలగించమని కోరవచ్చు. తొలగించి వెంటనే ఈ కొత్త వాడుకరి ఆ పేజీని తిరిగి సృష్టిస్తారు. (తద్వారా ఆ పేజీ కొత్త వాడుకరి పేరిట ఉంటుంది). ఈ అంశం ఎందుకు చెబుతున్నానంటే, తన పేరిట కొత్త పేజీలను సృష్టించాలన్న దుగ్ధ ఈ మొలకల సృష్టికి కారణమౌతోందని నా అభిప్రాయం.
ఇక పాత మొలకల గురించి:
  1. మరీ ఒకటి లేదా రెండు వాక్యాలున్న వ్యాసాలుంటాయి (వీటిలో బొమ్మ, సమాచారపెట్టె, వర్గం, ఏదైనా మూస లాంటివి ఉంటే ఉండవచ్చు ఉండకపోనూ వచ్చు). వీటిని ఏ చర్చా లేకుండా తొలగించాలి.
  2. మూడు లేదా అంతకంటే ఎక్కువ వాక్యాలున్న వ్యాసాలను తొలగింపు చర్చకు పెట్టి తొలగించాలి. వ్యాసంలో వాక్యాలు ఎన్ని ఉన్నాయన్న దానికంటే, ఎంత అర్థవంతమైన సమాచారం ఉందన్నదే ప్రధాన సూత్రం.
  3. వాడుకరులు ఎవరైనా ముందుకు వచ్చి నేను ఫలానా వ్యాసాన్ని విస్తరిస్తాను. కానీ ప్రస్తుతమున్న మొలకను తొలగించండి నేను మళ్ళీ సృష్టిస్తాను అని కోరితే, ఆ మొలకను ఏ చర్చా లేకుండా తొలగించవచ్చు. ఈ అభ్యర్ధన వికీపీడియా:నిర్వాహకుల నోటీసుబోర్డులో చెయ్యాలి. కొత్త వ్యాసం సృష్టి 24 గంటల్లో జరగాలి, మొలక కాకూడదు.
  4. తన పేరిట ఉన్న మొలకల సంఖ్యను బట్టి వాడుకరికి కొత్త వ్యాసాలను సృష్టించే వీలు కల్పించాలి:
    1. సంఖ్య 10% లేదా 100 మొలకలు (ఏది ఎక్కువైతే అది) కంటే ఎక్కువ ఉన్న వాడుకరులు ఇకపై కొత్త పేజీలను సృష్టించకూడదు. ఆ మొలకలను విస్తరించేవరకూ, వాటి సంఖ్యను ఈ పరిమితి లోపుకు తీసుకువచ్చే వరకూ ఈ నియమం వర్తిస్తుంది.
    2. సంఖ్య 5 - 9.99% మధ్యగాని లేదా 50-100 మధ్యగాని (ఏది ఎక్కువైతే అది) ఉన్నవారు, కొత్తగా మొలకలను సృష్టించ రాదు. తమ మొలకల సంఖ్య ఈ పరిమితి లోపుకు వచ్చేవరకూ వారు నేరుగా పెద్ద వ్యాసాలనే సృష్టించాలి.
  5. ఎవరెవరు ఏ పరిమితుల్లోకి వస్తారో తయారు చేసి ఒక పేజీలో పెడదాం. దాని ప్రకారం వాడుకరులు తమకు తామే క్రమశిక్షణతో ఆ నియమాలను పాటించాలి. ఎవరైనా ధిక్కరిస్తే రెండు హెచ్చరికల తరువాత చర్య తీసుకోవచ్చు.
ఈ ప్రతిపాదన మొలకపేజీల నియంత్రణ విధానానికి వ్యతిరేకంగా ఉంటుంది. అందులో మార్పు చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. పరిశీలించండి. సభ్యులు ఇది అవసరమని భావిస్తే తగు మార్పు చేర్పులతో దీన్ని ఒక విధానంగా తయారు చేసుకుందాం. __చదువరి (చర్చరచనలు) 11:35, 11 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

మొక్కే కదా అని మనం పీకేస్తే, చెట్టే కదా మనం నరికేద్దాం అని మరికొందరు తయారవుతారు. కలుపును (చెత్తరాతలు) మాత్రమే తొలగించాలి. నిర్వాహకులు వ్యాసాలను ఏలా తొలగించాలి అనే ఆలోచన నుంచి ఏలా రక్షించాలి అనే ఆలోచనకు రావాలి.YVSREDDY (చర్చ) 16:37, 11 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రస్తుతం నిర్వాహకులు చేస్తున్నదదే YVSREDDY గారు. పాఠకుడికి ఏమాత్రం పనికిరాని, ఒకటో రెండో నాలుగో వాక్యాలతో వ్యాసాలు రాసి, ఎవరో ఒకరు విస్తరించకపోతారా అని దేశమ్మీద వదిలేస్తే, ఏళ్ళ తరబడి అవి దిక్కూ మొక్కూ లేకుండా పడి ఉంటే, వాటిని నిర్వాహకులు ఓపిగ్గా తొలగిస్తున్నారు. చెత్త ఊడ్చేస్తున్నారు. ఆ బాపతు పనికిమాలిన వ్యాసాల్లో, ఆ చెత్తలో, ఆ కలుపులో మీవీ కొన్నున్నై. అలాంటి వ్యాసాలను సృష్టించిన వాళ్ళకే పట్టని వాటిని, ఏళ్ళ తరబడి ఇతరులకూ పట్టని వాటిని తొలగించి నిర్వాహకులు వికీకి ప్రయోజనమే కలిగిస్తున్నారు. అలాంటి నిర్వాహకులపై దుమ్మెత్తి పోస్తే, మీరు చేసే తప్పులు దాచిపెట్టొచ్చనుకుంటున్నారేమో. ముందు మీ తప్పులను సవరించుకోండి. పై విభాగంలో మిమ్మల్ని ఉద్దేశించి చాలా రాసారు. ముందు వాటికి సమాధానం రాయండి. __చదువరి (చర్చరచనలు) 17:50, 11 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
YVSR గారూ మీ నోటి నుండి వరాలమాట వచ్చింది.మీకు శతకోటి వందనాలు.నిజమే మీరు చెప్పేది నూటికి రెండు వందల శాతం నిజం.మీరు వికీపీడియాలోనేకాదు, వ్యవసాయంలోకూడా దిట్ట అని లోగడ మీతో మాట్లాడిన సందర్బంగా తెలుసుకున్నాను.విత్తనాలు నాటతాం.మొలకలు (మొక్కలు) వస్తాయి.వాటిని ఏమి చేస్తాం.వాటిని తగువిధంగా పోషించి ఎంతవరకు సాగాలనో అంతవరకుసాగి,తగిన జాగ్రత్తలతో పెంచి పెద్దవి చేస్తాం.అప్పుడు అది చెట్టుగా మనకు ఫలితాలు ఇస్తుంది.దీనిని నరికి పారవేస్తామా!అలా చేయంగదా! ఆ సంగతి మీకు తెలుసు, నాకు తెలుసు,అందరికి తెలుసు.అయితే ఇక్కడ అలా జరగలేదు.ఒక రైతు ఆత్రంకొద్ది వాటువేసుకొని సరియైన పద్దతులు పాటించకుండా పొలంలో విత్తనాలు ఎలా పడితే అలా చల్లాడు. దానివలన మొలకలు కాస్తా కలుపు మొక్కలుగా దాపురించినవి.ఇవి మొలకలుగావు.మీరు ఉదహరించినట్లు ఇవి కలుపు మొక్కలే!అందువలనే కలుపుమొక్కలను తొలగించుకుందాం.ముందు మీరు మీ మొలకలు కలుపు మొక్కలుగా మారకుండా వృక్షాలుగా మార్చిఫలితాలు వచ్చేటట్లుచేసి సహకరించగలరు.
“నిర్వాహకులు వ్యాసాలను ఏలా తొలగించాలి అనే ఆలోచన నుంచి ఏలా రక్షించాలి అనే ఆలోచనకు రావాలి” ఈ సూచన కూడా మంచిదే చేసారు.ఇప్పుడు పైన వివరించిన అభిప్రాయాలు కూడా మీరు చేసిన సూచనకు అనుగుణంగా చర్యలు ఉండాలనే.మొలక వ్యాసాల సృష్టింపు అనేది లేదనుకొండి.ఇక తొలగించే ప్రశ్న కూడా ఉండదుకదా!మొలక వ్యాసాల సృష్టింపుకు రక్షణకల్పించామనుకోండి. మీరన్నట్లు తొలగించేపనిలేకుండా సరిపోతుంది. నేను ఇంతే ఉంటాను.మీరు మాత్రం మారండి అన్నచందంగా ఉంది. మంచిసూచనలు చేసినందుకు దన్యవాదాలు.--యర్రా రామారావు (చర్చ) 17:53, 11 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
మొలక వ్యాసాల తొలగింపు విషయంలో ప్రస్తుతం నిర్వాహకులు చేస్తున్న పనిలో నాకు ఎక్కడా పక్షపాతం కనిపించడం లేదు. దయచేసి ఇంకెవరికైనా అలా అనిపిస్తే మరొక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. మనందరం మొదట్లో వికీ నియమాలు అన్నీ తెలిసి ప్రారంభించ లేదు. రాసేకొద్దీ మనకు అనుభవం వస్తోంది. గతంలో చేసిన పొరపాట్లు తెలిసి వస్తున్నాయి. మళ్ళీ వాటిని సరిదిద్దుకునే అవకాశం వచ్చినప్పుడు మనం ఏ మాత్రం వెనుకాడ కూడదు. నేను సృష్టించిన మొలక వ్యాసాలు అలాగే పడిఉన్నప్పుడు వాటి తొలగింపు ప్రతిపాదనలు వచ్చాయి. వాటిని నేను హుందాగా స్వీకరించాను. ఒకవేళ విస్తరించాలని నిర్ణయించుకుంటే నేను ఆ విషయం చర్చా పేజీల్లో తెలియజేస్తున్నాను. చేయలేకపోతే అలాగే తొలగించమని చెబుతున్నాయి. ఇందులో అవమానమేమీ లేదు. దయచేసి అలాంటి అభిప్రాయాలు మీ మనసులోకి రానీయకండి. కాలం గడిచేకొద్దీ వికీ రచనల్లో మనం రాటుదేలుతున్నాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వ్యక్తిగతంగా తీసుకోకండి. రవిచంద్ర (చర్చ) 04:29, 12 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
మొలక వ్యాసాల మూకుమ్మడి తొలగింపు చర్చను లేవనెత్తిన యర్రా రామారావు గారికి నా ధన్యవాదాలు. గతంలో ఇంటర్నెట్ లో తెలుగు ఎక్కువగా లేనికాలంలో ఇంగ్లీష్ వికీపీడియా నుండి ఎంతోకొంత అనువదించి తెలుగు వికీలో వ్యాసాలను రాసారు. అప్పటికాలానికి ఆ కొంత సమాచారం సరిపోయింది. కానీ, ఇప్పుడు పరిస్థితి వేరు. ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్, ఫోన్లో ఇంటర్నెట్, తెలుగు కీబోర్డు ఉన్నాయి. అంతేకాకుండా న్యూస్ సైట్స్, ఇతర వెబ్సైట్లలో తెలుగు సమాచారం ఎక్కువగానే అందుబాటులోకి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు వికీపీడియాలో మొలక వ్యాసాలను చూసిన చదువరులు వికీపీడియా మొత్తం వ్యాసాలు ఒకటి, రెండు వాక్యాలతోనే ఉంటాయని, వికీపీడియాలో కంటే ఇతర వెబ్సైట్లలో మంచి సమాచారం ఉంటుందన్న అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంది. మొలక వ్యాసాలను అభివృద్ధి చేయాలని ప్రతిపాదన వచ్చినప్పుడు నేను రాసిన వాటిల్లో 28 మొలక వ్యాసాలు ఉంటే వాటిని అభివృద్ధి పరిచాను. అందరూ అలా బాధ్యత తీసుకుంటే బాగుండేది. కానీ, అలా జరగలేదు జరగదు కూడా. వికీలో రాయండి అని సూచన చేయగలమే కానీ, ఆర్డర్ వేయలేం. గత కొద్దికాలంగా తెవికీ విషయంలో సంఖ్య కంటే, నాణ్యత విషయంలో దృష్టి సారించాము. మొలకల విషయంలో కఠినమైన చర్యలు తీసుకుంటేనే బాగుంటుంది. కాబట్టి, మొలక వ్యాసాల మూకుమ్మడి తొలగింపును నేను కూడా సమర్దిస్తున్నాను.
ఇకపై తయారు చెయ్యబోయే మొలకల గురించి చదువరి గారు ప్రతిపాదించిన పద్దతితో ఏకీభవిస్తున్నాను. "పాత మొలకల విషయలో తన పేరిట ఉన్న మొలకల సంఖ్యను బట్టి వాడుకరికి కొత్త వ్యాసాలను సృష్టించే వీలు కల్పించాలి" అన్నదానిలో మొలక వ్యాసాల సృష్టి పరిమితిని 5 లేదా 10 వ్యాసాల వరకే అనుమతి ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం.
2013, ఏప్రిల్ 1నాడు చేసిన నియమాలు ఇప్పటివరకి పాటిస్తూ వస్తున్నాం. వాటిని సాకుగా చేసుకొని కొందరు మొలకలు సృష్టిస్తూ పోతున్నారు. కాబట్టి, కొత్త వ్యాసాల సృష్టి విషయంలో కొంచెం కష్టమైనా పర్లేదుకానీ కఠిన నియమాలు ఉండాలి. రవిచంద్ర గారు చెప్పినట్టు, కాలం గడిచేకొద్దీ వికీ రచనల్లో మనం రాటుదేలుతున్నాం కాబట్టి, ఈ కొత్త నియమాలు పాటించడం మనకు కష్టమేమీకాదు. Pranayraj Vangari (Talk2Me|Contribs) 06:08, 12 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • తెలుగు వికీపీడియాలో మొదటి వ్యాసం తెలుగుదనం, ఇది మొలకగా ఉన్నది, నేను ఈ మొలకను రక్షించడానికి మొలక స్థాయి దాటించాను. ఇటువంటి ముఖ్యమైన మొలకలు అనేకం ఉండవచ్చు, కావున నిర్వాహకులు వ్యాసాలను ఏలా తొలగించాలి అనే ఆలోచన నుంచి ఏలా రక్షించాలి అనే ఆలోచనకు రావాలి.YVSREDDY (చర్చ) 07:41, 12 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఒక వేళ యర్రా రామారావు గారు ప్రతిపాదించినట్లు మూకుమ్మడిగా మొలక వ్యాసాల తొలగింపు ఇక్కడ చర్చలో ఆమోదించబడి మొలక వ్యాసాలను తొలగించినట్లైతే YVSREDDY గారు పేర్కొన్న తెలుగు వికీపీడియాలో మొదటి వ్యాసం తెలుగుదనం మనకు తెలియకుండానే కనుమరుగై పోయి ఒక చారిత్రక తప్పిదం చేసి ఉండేవారమేమో. కాబట్టి మూకుమ్మడిగా తొలగించే ప్రతిపాదనను పునఃపరిశీలించాల్సిందిగా కోరుతున్నాను. చాలా సినిమా వ్యాసాలు మొలకలుగానే ఉన్నాయి. వాటిని తొలగిస్తే భవిష్యత్తులో పాత సినిమాల గురించి ఉన్న కొద్ది సమాచారం కూడా ఎవరికీ లభ్యం కాకపోవచ్చు. --స్వరలాసిక (చర్చ) 12:51, 12 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
సమాచారం లభించని విస్తరించలేని మొలకలను మరొక వ్యాసంలో విలీనం చేయాలి. మూలాలు లేని ఏక వాక్య మొలకలను తొలగించాలి. ప్రస్తుతం ఆంగ్లంలో విస్తారంగా సమాచారం లభ్యమగునపుడు ఎవరి మొలకలు వారు అబివృద్ధి చేయవచ్చు కదా. గత కొంత కాలంగా నిర్వాహకులుగా మేము చేస్తున్నది మా మొలకలనే కాదు అందరి మొలకలను విస్తరించే కార్యక్రమం. తొలగించడమే మా పని కాదు. వాడుకరులు క్రియాశీలకంగా వికీలో పని చేస్తున్నప్పుడు వారి వ్యాసాలను వారు అభివృద్ధి ఎందుకు చేయరు? క్రియాశీలకంగా లేని వ్యాస కర్తల వ్యాసాలను, ప్రస్తుతం క్రియాశీలకంగా ఉన్న వ్యాసకర్తల వ్యాసాలను విస్తరిస్తున్నాము. మొలకలను ఏకపక్షంగా తొలగించడం లేదు. చర్చా పేజీలో అవి ఎందుకు తొలగించాలో రాస్తున్నాము. వాడుకరులు అక్కడ స్పందిచరెందుకు? తొలగిస్తే అప్పుడు వస్తారు. ఎందుకు తొలగించారు? అది చాలా ఉపయోగకరమైన వ్యాసం అని చెబుతారు. తొలగింపు మూస తమ చర్చా పేజీలో ఉన్నప్పుడు వాటి ఉపయోగం, అవసరం తెలియదా? అప్పుడు స్పందించరా? కొన్ని వ్యాసాలు ఒక్క మూసతో 2000 కె.బి ఉన్నాయి.అవి వికీకి అవసరమా? వాటిని తొలగించాలి. వాడుకరులు కొన్ని వ్యాసాలకు వ్యాసకర్తలుగా ఉండాలనే వ్యామోహంతో మొలకలను సృష్టిస్తూ పోతున్నారు. అవి తొలగిస్తే ఎవరైనా ఇతరులు మంచి వ్యాసాలుగా సృష్టించి తీర్చి దిద్దుతారు. ఉదాహరణగా గూగుల్ అనువాద వ్యాసాలు అనేక సంవత్సరాలుగా పడిఉన్నా ఎవరూ వాటి శుద్ది కొరకు కృషి చేయలేదు. అవి తొలగించిన తరువాత ఎవరి అభిరుచిని బట్టి ఆయా వ్యాసాలు వృద్ధి చెందుతున్నాయి. కనుక ఏక వాక్య వ్యాసాలను తొలగించాలి. ప్రస్తుతం కొంతమంది వాడుకరులు ఎంత ఆంగ్ల వ్యాసం ఉన్నా 2000 కె.బి వరకు మాత్రమే విస్తరించి మొలకల నియంత్రణ విధానాన్ని దుర్వినియోగ పరుస్తున్నారు. కనుక వికీలో మంచి వ్యాసాలుండాలంటే, వికీ వ్యాసాలపై పాఠకులకు మంచి అభిప్రాయం రావాలంటే, అందరికీ ఉపయోగకరంగా వికీ ఉండాలంటే మొలక వ్యాసాలు ఉండరాదు. ఇకపై తయారు చెయ్యబోయే మొలకల గురించి చదువరి గారు ప్రతిపాదించిన పద్దతితో ఏకీభవిస్తున్నాను. ఒక మొలక వ్యాసం ఎవరైనా మంచి వ్యాసంగా వృద్ధి చేస్తామని మనకి తెలియజేస్తే ఆ వ్యాసాన్ని తొలగించి కొత్త వాడుకరికి అభివృద్ధి చేసే అవకాశం ఉండాలి. ప్రస్తుతం సమిష్టి కృషి కంటే ఎవరు ఎన్ని వ్యాసాలు సృష్టిస్తున్నారనే వ్యామోహంలో కొందరు వికీపీడియనులు ఉన్నట్లుగా ఉంది. దీనికి ఒక విధానాన్ని ఏర్పాటు చేస్తే మంచిది. కె.వెంకటరమణ (చర్చ) 13:30, 12 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
దొరకదు మూలం వెదికిన
ఉరవగ పుటకర్తలయ్యె నుత్సాహముతో
తరగని మొలకలు జేరిచి
చేరరు తొలగింపు పుటల చర్చలనందున్

—కె.వెంకటరమణ

YVSREDDY గారు, మూకుమ్మడిగా మొలక వ్యాసాల తొలగింపు అనగానే ఒకే క్లిక్ తో వ్యాసాలను తొలగించరండి. కె.వెంకటరమణ గారు చెప్పినట్టు మొలక వ్యాసాలను వివిధ వర్గాలుగా చేసుకొని (సాధ్యమైతే జాబితా తయారుచేసి) వాటిని తొలగిస్తారు. 1717 బైట్లు ఉన్న ఒక మొలక వ్యాసానికి 621 బైట్లు చేర్చి 2338 బైట్లు చేసి (కనీసం మూలం కూడా చేర్చలేదు) దాన్ని గొప్పగా చెప్పుకొంటూ మీరు చేస్తున్న మొలక వ్యాసాల సృష్టిని సమర్దించుకుంటున్నారు. గత కొన్నేళ్ళుగా మీరు సృష్టిస్తున్న కొన్ని వందల మొలక వ్యాసాలు ఈ జాబితాలో ఉన్నాయి. వాటి గురించి కూడా మాట్లాడండి మరి. ఇలా మీరు వందలకొద్ది సృష్టిస్తూ పోతే, మీ వ్యాసాల రక్షణకు ఎంతమంది నిర్వాహకులు కావలసివుంటుందో ఆలోచించండి. Pranayraj Vangari (Talk2Me|Contribs) 14:03, 12 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
మూకుమ్మడిగా మొలక వ్యాసాలు తొలగిస్తే తెలుగుదనం వ్యాసం కూడా తొలగింపులకుగురై చారిత్రక తప్పిదం జరిగి ఉండేదని కొందరు గౌరవ వికీపీడియన్లు గొంతెత్తి ఆవేదన వెలిబుచ్చారు.వారి ఆవేదనలో అర్థం ఉంది.దానిలో ఎవ్వరం తప్పుపట్టకూడదు.తప్పుపట్టటానికి అవకాశం లేదు.ఇంకొక గౌరవ వికీపీడియను ఇది తొలగింపుకు గురికాకుండా రక్షించటానికి మొలకస్థాయి దాటించాను అని సగర్వంగా చెప్పుకున్నారు.వారికి ఈ సందర్బంగా ధన్యవాదాలు.సరే అసలు ఈ తెలుగుదనం వ్యాసం చరిత్రకు వద్దాం.ఇది 2004 నవంబర్ 24 న 19 బైట్లుతో సృష్టించి మొదలుపెట్టబడినది.2004 ఆఖరుకు 1507 బైట్లుతో సృష్టించిన వాడుకరిచేతనే విస్తరించబడింది. 2005 లో 214 బైట్లుతో, 2006లో 0 బైట్లుతో, 2007లో 706 బైట్లకు పెరిగి మైనస్ 754 బైట్లుపోను 1673 కుదించబడ్డది.తరువాత తిరిగి 2017లో 8 బైట్లు, 2019లో 36 బైట్లుతో 1717 బైట్లకు ఉన్నదానిని 621 బైట్లుతో విస్తరించి ఘోరం జరగగుండా YVSR గారిచే రక్షించబడింది.నాకైతే ఈ వ్యాసం చూపి,మా తెలుగుదనం గొప్పదనం అనిచెప్పుకోవటానికి సిగ్గుతో తలదించుకుంటున్నాను.ముఖ్యమైన వ్యాసం అని గొంతెత్తి అరుస్తున్న గౌరవ వికీపీడియన్లుకు 16 సంవత్సరాలనుండి ఈ వ్యాసాన్ని అభివృద్ది చేయటానికి వ్యాసాన్ని మీరు కనుగొనలేకపోయారా? లేక గణాంకాల మోజులోపడి ఎవరికి వారు మనం సృష్టించిన వ్యాసంకాదుగదా అని చూసి కూడా చూడనట్లు నటిస్తున్నారా!కనపడినా తప్పుకున్నారా!ఒకవేళ కనపడినా వ్యాసంలో నైస్ ఎడిట్లు చేసి నేనుకూడా దానిలో చేసానని ఆత్మసంతృప్తి పొందారా! ఇంత చిన్న వ్యాసం చూపించి మా తెలుగుతనం గొప్పదనం అని చెప్పటం మన సంసృతిని ఒకరకంగా అవమానించినట్లే.ఈ రోజు కనపడిందా ఈ వ్యాసం.ఇన్నాళ్లు నుండి మీ దృష్టికి రాలేదా!వికీపీడియా అంతాబాగుండాలి అని కోరుకోవాలిగాని ఏదో ఒక వ్యాసం, లేదా నేను సృష్టించినవ్యాసాలకు ఎన్ని అవలక్షణాలు ఉన్నా తొలగించకూడదు అనే అభిప్రాయం కలిగి ఉండటం ఎంతవరకు సమంజసం.మనం ఎవరినైనా బోజనానికి పిలిస్తే వట్టి కూరఅన్నంతో సరిపెట్టడం తెలుగు సంస్కృతి కాదుగదా!వ్యాసాలు తొలగిస్తూ పోతుంటే వికీపీడియాలో ఇంక ఏమీ ఉండవుగదా! అనే అబిప్రాయం ఉండవచ్చు.వికీపీడియా అంటే కొన్ని వ్యాసాలు ఆంగ్లంలోనూ,కొన్ని వ్యాసాలు రెండు మూడు వాఖ్యాలతోను,కొన్ని వ్యాసాలు కేవలం శీర్షికతోనూ,కొన్ని వ్యాసానికి సంబంధంలోని చెత్తరాతలతోనూ, కొద్దిపాటి అక్షరాలతేడాలతో నాలుగైదు వ్యాసాలు ఉండటమా!ఆలోచించండి.మనం ఒకరిని వేలెత్తి చూపేవారు ఎవరైనా ఎవరికివారు వికీపీడియాలో మనం సృష్టించిన వ్యాసాలుపై ఆత్మపరిశీలన చేసుకున్నరోజు మాత్రమే వికీపీడియా బాగుపడింది.గొంతెత్తి అరిసినంతమాత్రాన వికీపీడియా బాగుపడిందని నేను అనుకోవటంలా!నా మాటలు ఎవరికైనా భాధ కలిగిస్తే క్షమించండి.తొలగించేవారికి భాదలేదనే దురభి ప్రాయం మనసునుండి తుడిచివేసుకుంటారని నమ్ముతున్నాను. ఇంకొక మాట మొలక వ్యాసాలకు పరిధి నుండి సినిమా వ్యాసాలుకు,గ్రామ వ్యాసాలుకు మినహాయింపు ఉన్నసంగతి గమనించండి.నేను పైన చెప్పిన అన్ని లక్షణాలు ఉన్న మొలక వ్యాసాలు జాబితా చూడండి. ఈ జాబితాను వాడుకరి:స్వరలాసిక గారు కూడా కాస్త ఓపిక తీసుకుని పరిశీలించగలరు.నిర్వాహకులు లెక్కకు 10 మందికి పైగా ఉన్నారు.అందరికి భాధ్యత ఉంది.కొంత మంది స్తబ్థతగా ఉంటున్నారు.దాని వలన వికీపీడియాకు ఏమి ప్రయోజనమో ఆలోచించాలి.--యర్రా రామారావు (చర్చ) 14:57, 12 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
07:06, 15 జనవరి 2012‎ YVSREDDY చర్చ రచనలు‎  3,211 బైట్లు +3,211‎  కొత్త పేజీ: ఉత్తరాయణం దేవతలకు
గౌరవ వికీ మిత్రులు చదువరి, రామారావు, వెంకట్రమణ, రవిచంద్ర తదితర సభ్యులందరికీ ఒక మనవి. YVSREDDY గారు రాసిన వ్యాసాలపై చర్చ జరుగుతున్నది. ఆయన మొలక వ్యాసాల జాబితా ఉన్నది కనుక, ఆయనకు కొంత సమయం ఇస్తే ఎలా ఉంటుంది అనేది.. (ఒక నెల అనుకోండి) ఇస్తే ఆయన మొలకలను మొలకలో బొమ్మలు, వర్గాలకు లింకు, అంతర్వికీలింకు, ఆధారం, మూలం తో మెరుగుపరచుకొని, చేయలేని వాటికి తొలగింపు మూసలు తగిలించగలిగేట్టు .. గడువు సమయం పూర్తి అయిన వెంటనే మొలకలను నిర్వహకులు తొలగించుటకు అంగీకారం తెలిపితే మనకు ఇబ్బంది ఏమైనా ఉంటుందా? ఇది కేవలం ఆయన ఒకరి వ్యాసాలకు మాత్రమే అందరూ ఉమ్మడిగా తీసుకోగలిగిన నిర్ణయం అయితేనే.. B.K.Viswanadh (చర్చ) 12:53, 13 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
B.K.Viswanadh గారూ, మీరు చెప్పేది బాగుంది. నేనూ సరిగ్గా ఇదే ప్రతిపాదన చేసాను. నాలుగు రోజులైంది గానీ, ఆయన ఇంకా స్పందించలేదు. __చదువరి (చర్చరచనలు) 13:30, 13 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
విశ్వనాధ్ గారూ, మీ సూచనలు సహేతుకంగా ఉన్నవి.దానికి పైన చదువరిగారు వివరించారు.పైన చర్చ నేను ప్రవేశపెట్టినది ఏ ఒక్కరి మొలకల వ్యాసాలకో కాదండీ, వికీపీడియాలో ఈ రోజువరకు ఉన్న అన్ని మొలక వ్యాసాలు మొలకపేజీల నియంత్రణ విధానం ప్రకారం మూకుమ్మడిగా తొలగించటానికి ప్రవేశపెట్టాను.గమనించగలరు.ధన్యవాదాలు--యర్రా రామారావు (చర్చ) 14:01, 13 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి, రామారావు,గార్లకు, YVSREDDYగారి చర్చాపేజీలో మీ సూచనలు గమనించలేదు. క్షమించాలి. ఆయనకు గడువిచ్చి తదుపరి తొలగించుటకు సభ్యులు తీసుకున్న నిర్ణయం సరి అయినదే. మరోసారి మీ అందరి కృషికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ...B.K.Viswanadh (చర్చ) 01:22, 14 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

మంచి వ్యాసాలను తప్పుల తడక వ్యాసాలుగా మారుస్తున్న బాట్

ఒకసారి తొలగించిన వ్యాసాన్ని కోరి మరీ పునస్థాపించుకున్నారు. మళ్ళీ తప్పుల తడక వ్యాసాన్ని, మూలాలేమీ లేకుండా సృష్టించారు. తొలగించాలి. __చదువరి (చర్చరచనలు) 08:40, 13 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

  • 11:39, 27 నవంబర్ 2013 నాటి కూర్పు
  • ఆస్తి చట్టం అనగా ఆస్తులకు సంబంధించిన చట్టం. యాజమాన్యం యొక్క వివిధ రూపాలపై మరియు సాధారణ చట్ట న్యాయ వ్యవస్థలోని స్థిరాస్తి మరియు వ్యక్తిగత ఆస్తుల అద్దెలపై ఈ చట్టం అధికారాన్ని చెలాయిస్తుంది. పౌర చట్టం వ్యవస్థలో, చర మరియు స్థిర ఆస్తుల మధ్య ఒక విభజన ఏర్పడింది. చరాస్తి రమారమి వ్యక్తిగత ఆస్తిని సూచిస్తుంది, అయితే స్థిరాస్తి వాస్తవ ఆస్తిని సూచిస్తుంది, మరియు వీనికి సంబంధించిన హక్కులు మరియు బాధ్యతలు ఆస్తిచట్టం ఆధీనంలో ఉంటాయి. భావన, ఆలోచన లేదా ఆస్తి యొక్క తత్వశాస్త్రంలతో మొత్తం ఆస్తిచట్టం ముడిపడివుంది. కొన్ని చట్ట పరిధులలో చారిత్రకంగా అన్ని ఆస్తులు చక్రవర్తి యాజమాన్యంలో ఉండేవి, మరియు అవి విశ్వాస మరియు విధేయతా భూస్వామ్య వ్యవస్థల ద్వారా బదిలీ అవుతుండేవి. అయితే ఆధునిక కాలం యొక్క మొదటి ప్రభుత్వ చర్యల మధ్య నెపోలియన్ కోడ్ ఉంది, ఇది సంపూర్ణ యాజమాన్య భావనను చట్టానికి పరిచయం చేసింది. ప్రస్తుత వ్యక్తిగత ఆస్తి హక్కుల రక్షణ మధ్యయుగ ఇస్లామిక్ చట్టంలోనివి, మరియు చట్టశాస్త్రంలోనివి, మరియు మధ్యయుగపు మరియు ప్రారంభ ఆధునిక ఇంగ్లాండ్ యొక్క సాధారణ న్యాయస్థానాలలోనివి మరికొన్ని ప్రస్తుత చట్ట పద్ధతులు.
  • ఒక బాటు ఆస్తి చట్టం వ్యాసంలో మార్పులు చేసిన కారణంగా ఒక మంచి వ్యాసం తప్పుల తడక వ్యాసంగా తయారయినది. చదువరి గారు గమనించగలరు.YVSREDDY (చర్చ) 09:18, 13 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • గమనించాను, YVSREDDY గారు. ఆ బాటు దానికి చేతనైనంతలో మంచిపనే చేసింది. మీరు రాసిన అధ్వాన్నపు భాషను కొంతవరకూ సరిచేసింది. పోతే అది బాటు కదా అధ్వాన్నాన్ని పూర్తిగా సరిచెయ్యలేక పోయింది. ఉదా: "అయితే ఆధునిక కాలం యొక్క మొదటి ప్రభుత్వ చర్యల మధ్య నెపోలియన్ కోడ్ ఉంది, ఇది సంపూర్ణ యాజమాన్య భావనను చట్టానికి పరిచయం చేసింది.". దీని అర్థం ఏంటి?
  • ఇక పోతే, ఈ వ్యాసానికి అసలు మూలాలేవి?
  • మరో సంగతి.. మీరు ఈ చర్చ చెయ్యాల్సింది, ఆ వ్యాసం చర్చ పేజీలోగాని, దాని తొలగింపు చర్చ పేజీలోగాని, మీ చర్చ పేజీలో గానీ, నా చర్చ పేజీలో గాని. రచ్చబండలో కాదు చెయ్యాల్సింది. ఇకపై ఇక్కడ చెయ్యకండి. __చదువరి (చర్చరచనలు) 10:40, 13 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • YVSREDDY గారు, ఈ చర్చల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. పైగా ఇలాంటి చర్చలు చేసి మీ సమయాన్ని, మా సమయాన్ని వృధా చేస్తున్నారు. మీరు చర్చల మీద చూపే శ్రద్ధ వ్యాసాల అభివృద్ధి మీద చూపిస్తే కొన్ని వ్యాసలైనా మొలకల స్థాయిని దాటించేయగలరు. ఆలోచించండి. Pranayraj Vangari (Talk2Me|Contribs) 11:23, 13 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Though the Napoleonic code was among the first government acts of modern times to introduce the notion of absolute ownership into statute, protection of personal property rights was present in medieval Islamic law and jurisprudence,[1] and in more feudalist forms in the common law courts of medieval and early modern England.

  • ప్రస్తుత వ్యక్తిగత ఆస్తి హక్కుల రక్షణ మధ్యయుగ ఇస్లామిక్ చట్టంలోనివి, మరియు చట్టశాస్త్రంలోనివి, మరియు మధ్యయుగపు మరియు ప్రారంభ ఆధునిక ఇంగ్లాండ్ యొక్క సాధారణ న్యాయస్థానాలలోనివి మరికొన్ని ప్రస్తుత చట్ట పద్ధతులు. - ఆంగ్ల వ్యాసం నుంచి నేను చేసిన అనువాదం ఈ లైను.
  • సంపూర్ణ యాజమాన్యం యొక్క భావనను శాసనం లోకి ప్రవేశపెట్టిన ఆధునిక ప్రభుత్వపు మొదటి చర్యలలో నెపోలియన్ కోడ్ ఉన్నప్పటికీ, వ్యక్తిగత ఆస్తి హక్కుల రక్షణ మధ్యయుగ ఇస్లామిక్ చట్టం మరియు న్యాయ శాస్త్రంలో ఉంది, [1] మరియు సాధారణ న్యాయస్థానాలలో మరింత ఫ్యూడలిస్ట్ రూపాల్లో మధ్యయుగ మరియు ప్రారంభ ఆధునిక ఇంగ్లాండ్. - గూగుల్ అనువాదం ఈ లైను.
  • jurisprudence, and in more feudalist forms - ను
  • jurisprudence, , in more feudalist forms - బాటు మార్చుతున్నది ఇలా
  • చట్టంలోనివి, మరియు చట్టశాస్త్రంలోనివి, మరియు మధ్యయుగపు మరియు ప్రారంభ - ను
  • చట్టంలోనివి,, చట్టశాస్త్రంలోనివి,, మధ్యయుగపు, ప్రారంభ - బాటు మార్చుతున్నది ఇలా
  • ఇక్కడ విషయం కామాల (కామా పక్కన కామా చేరుస్తున్నది) గురించి దానిని సరిచేయండి. YVSREDDY (చర్చ) 03:05, 15 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

The 2030 movement strategy recommendations are here!

Greetings! We are pleased to inform that the 2030 movement strategy recommendations have been published on Meta-wiki. Over the last two years, our movement has worked tirelessly to produce these ideas to change our shared future. Many of you participated in the online conversations, hosted strategy salons, attended regional events, and connected with us in-person at Wikimania. These contributions were invaluable, and will help make our movement stronger for years to come. 

The finished set of 10 recommendations emphasizes many of our core values, such as equity, innovation, safety, and coordination, while tasking us jointly to turn this vision into a reality. These recommendations clarify and refine the previous version, which was published in January this year. They are at a high strategic level so that the ideas are flexible enough to be adapted to different global and local settings and will allow us to navigate future challenges. Along with the recommendations, we have outlined 10 underlying principles, a narrative of change, and a glossary of key terms for better context.

The recommendations are available in numerous languages, including Arabic, German, Hindi, English, French, Portuguese, and Spanish for you to read and share widely. We encourage you to read the recommendations in your own time and at your own pace, either online or in a PDF. There are a couple of other formats for you to take a deeper dive if you wish, such as a one-page summary, slides, and office hours, all collected on Meta. If you would like to comment, you are welcome to do so on the Meta talk pages. However, please note that these are the final version of the recommendations. No further edits will be made. This final version of the recommendations embodies an aspiration for how the Wikimedia movement should continue to change in order to advance that direction and meet the Wikimedia vision in a changing world. 

In terms of next steps, our focus now shifts toward implementation. In light of the cancellation of the Wikimedia Summit, the Wikimedia Foundation is determining the best steps for moving forward through a series of virtual events over the coming months. We will also be hosting live office hours in the next coming few days, where you can join us to celebrate the Strategy and ask questions! Please stay tuned, and thank you once again for helping to drive our movement forward, together. RSharma (WMF)

వికీపీడియాలో చారిత్రక ప్రాధాన్యం కల అంశాల పరిరక్షణ

ఇటీవల YVSREDDY గారు తెలుగు వికీపీడియాలో మొదటి వ్యాసం తెలుగుదనం అని పేర్కొన్నారు. దానిపై కొంత చర్చ జరిగింది. ఆ వ్యాసాన్ని మరో వ్యాసంలో విలీనం చేయాలనే ప్రతిపాదన వచ్చింది. అయితే మొట్టమొదటి వ్యాసం గురించి తెలుగు వికీపీడియా వ్యాసంలో ప్రస్తావన లేదు. వెన్నా నాగార్జున గారి కృషితో 2003 డిసెంబరు 10 న ఆవిర్భవించిన సమాచారం మటుకు ఉంది. ఆ వ్యాసంలోనే "2003 డిసెంబరులో ఆరంభించిన తెవికీలో 2004 ఆగస్టు వరకూ ఒక్క వ్యాసం కూడా నమోదు కాలేదు" అని ఉంది. తెలుగుదనం వ్యాస చరిత్రలో 2004 నవంబర్ 24న ఆ వ్యాసం సృష్టించబడినట్లు ఉంది. 2004 ఆగస్టు నుండి నవంబరు 24 మధ్యలో ఏ వ్యాసమైనా సృష్టించబడిందా అనే విషయం తేలాల్సి ఉంది. అంత వరకు తెలుగుదనం మొట్టమొదటి తెలుగు వికీపీడియా వ్యాసంగానే భావించాల్సి ఉంది. మనం అన్ని విషయాలకూ ప్రామాణికంగా తీసుకునే ఇంగ్లీషు వికీపీడియా తన చరిత్రను పదిల పరుచుకుంది. ఆ భాషలో మొట్టమొదటి మూడు ఎడిట్లు, మొదటి వ్యాసం, మొదటి వంద పుటలు వంటివి రికార్డు చేయబడి ఉన్నాయి. ఇంగ్లీషు వికీపీడియా మొదటి వంద పుటలలో 63 ఇప్పటికీ సచేతనంగా ఉన్నాయి. భవిష్యత్తులో తెలుగు వికీపీడియా చరిత్ర తెలుసుకొనే వారికోసం తెలుగు వికీపీడియాలో కూడా అటువంటి వాటిని పరిరక్షించాల్సి ఉంది. ఆ పుటలలో సమాచారం లేదనో, నాణ్యత లేదనో మరో కారణం చేతనో ఆ వ్యాసాలను తొలగించకూడదు. వీలైతే వాటిని మన నియమాలకు అనుగుణంగా మలచుకోవాలి. లేకుంటే యథాతథంగా ఉంచేయాలి. వాటిని తొలగించడమో, వేరే వ్యాసంలోనికి విలీనం చేయడమో చేయరాదు.--స్వరలాసిక (చర్చ) 02:44, 14 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

వెన్నా నాగార్జున గారు తెలుగుదనం కంటే ముందు ఊరగాయ వ్యాసాన్ని సృష్టించినట్లు ఆయన రచనల జాబితాలో ఉందండి. దానికంటే ముందు, 2004 ఆగస్టు 5 న భూగోళ శాస్త్రము పుట్టింది. బహుశా తెవికీలో తొట్టతొలి వ్యాసం ఇదే కావచ్చు. మరింత పరిశోధించి నిర్ధారించుకుందాం. స్వరలాసిక గారూ ఇంగ్లీషు వారి తొలి వంద వ్యాసాల జాబితా ఎక్కడుందో లింకు ఇస్తారా? __చదువరి (చర్చరచనలు) 03:10, 14 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
__చదువరి (చర్చరచనలు) 03:25, 14 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
స్వరలాసిక గారు ప్రస్తావించినట్టుగా "2003 డిసెంబరులో ఆరంభించిన తెవికీలో 2004 ఆగస్టు వరకూ ఒక్క వ్యాసం కూడా నమోదు కాలేదు" అంటే 2004 ఆగస్టులో ఒక వ్యాసం నమోదు అయినట్టు అర్థం కదా. మరి 2004 నవంబర్ 24న సృష్టించబడిన తెలుగుదనం వ్యాసం తొలి వ్యాసం ఎలా అవుతుందో సహా సభ్యులు గమనించాలి. చారిత్రక నేపథ్యం ఉన్న వ్యాసాలను తప్పకుండా పరిరక్షించుకుందాం. Pranayraj Vangari (Talk2Me|Contribs) 03:31, 14 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
బహుశా తెవికీలో తొట్టతొలి విజ్ఞాన సర్వస్వ వ్యాసాన్ని సృష్టించిన వారు వాడుకరి:Jchan7575 అయి ఉండవచ్చు -నిర్ధారించుకుందాం.
ఖమ్మం 2004 అక్టోబరు 16 న మొదలైంది.
__చదువరి (చర్చరచనలు) 03:35, 14 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • శాస్త్రము 2004 నవంబరు 24 న మొదలైంది
  • ఒక విశేషం - 2005 డిసెంబరు 13 న సృష్టించిన రాజకీయం వ్యాసాన్ని 2009 లో ఎటువంటి సమాచారం లేదని తొలగించారు. ఆ తరువాత ఇప్పుడున్న వ్యాసాన్ని సృష్టించారు.
  • తెలుగు వ్యాసం 2004 నవంబరు 27 న వెలుగు చూసింది
__చదువరి (చర్చరచనలు) 03:55, 14 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
చారిత్రక ప్రాధాన్యం కలిగిన వ్యాసాలు ఉంచాలనే అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. అయితే వాటిని ఏరడం, వాటికి తగ్గ మూలాలు వెతుక్కోవడం, అభివృద్ధి చేయడం కొంచెం సమయంతో కూడుకున్న పని. కాబట్టి అప్పటిదాకా వాటిని ఒక దీర్ఘకాలిక ప్రాజెక్టులో భాగంగా చేస్తే బాగుంటుందని నా ఆలోచన. రవిచంద్ర (చర్చ) 04:34, 14 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
__చదువరి (చర్చరచనలు) 04:51, 14 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
వికీమీడియా గణాంకాల ప్రకారం వివిధ నెలల్లో వ్యాసాల సంఖ్య ఇలా ఉంది:
అన్ని వ్యాసాల జాబితా తయారయ్యాక, తెవికీ ప్రస్థానం గురించిన పేజీ తయారు చేసుకోవచ్చు. __చదువరి (చర్చరచనలు) 06:58, 14 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
వికీపీడియాలో ప్రారంభ పేజీలు వికీపీడియాలో ప్రారంభంలో చేరిన వాడుకరులు, అజ్ఞాత వాడుకరుల సృష్టించిన వ్యాసాల చరిత్రల ఆధారంగా తయారుచేయబడినది. ఇంకా ఏమైనా ఉంటే చేర్చగలరు. కె.వెంకటరమణ (చర్చ) 11:06, 14 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
స్వరలాసిక గారూ, తెవికీలో తొలివంద తయారైంది. ఒకసారి పరిశీలించండి. కింద వెంకటరమణ గారిచ్చిన జాబితాకూ దీనికీ కొన్ని తేడాలున్నాయి. అవి ఎందుకొచ్చాయో చూడాలి, చూద్దాం.
పోతే, వ్యాసాలు, వాడుకరులు, దిద్దుబాట్లు, తరలింపులు, తొలగింపులు, దిద్దుబాటు యుద్ధం, చర్చా యుద్ధం,.. వంటివి తొలి వంద, తొలి పది.. ఉంటే బానే ఉంటది. అంతేకాదు.. తెవికీ చరిత్రను కూడా అక్షర బద్ధం చెయ్యాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే పదారేళ్ళై పోయింది. కనీసం పది పదిహేను పెద్ద సంఘటనలుండే ఉంటాయి తెవికీ చరిత్రలో. చిన్నా చితకా ఎన్నో ఉండొచ్చు. అందరం పూనుకుని ఆ పని చెయ్యాలి. రవిచంద్ర గారన్నట్టు ఒక ప్రాజెక్టు చేపట్టాలి దీనికోసం. అంతర్జాలంలో తెలుగు ఎప్పుడు ఎలా మొదలై ఎలా విస్తరించిందో రాస్తే బాగుంటుందని ఒకప్పుడు అనుకున్నాం (తెవికీలో కాదు, బయట అనుకున్నాం).. కానీ అడుగు ముందుకు పడలా. ఇప్పుడు మనకు తెవికీ చరిత్ర రాసేందుకు అవసరమైన ఆనాటివాళ్ళ నుంచి ఈనాటివాళ్ళ వరకూ జనమున్నారు, వాళ్ళ జ్ఞాపకాలున్నై. రాయొచ్చు మనం. రాయాలి కూడా. __చదువరి (చర్చరచనలు) 15:02, 14 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారూ, పై జాబితాలో కాణిపాకం, శ్రీకాళహస్తి వ్యాసాలను చేర్చగలరు. కె.వెంకటరమణ (చర్చ) 03:50, 15 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారూ, జాబితాలో కందం వ్యాసాన్ని చేర్చండి. కె.వెంకటరమణ (చర్చ) 04:18, 15 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారూ, జాబితాలో సినిమా, సీసము (పద్యం) వ్యాసాలను ‎ను చేర్చగలరు. కె.వెంకటరమణ (చర్చ) 04:59, 15 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
జాబితాలో నన్నయ్య, తేటగీతి లను చేర్చండి. కె.వెంకటరమణ (చర్చ) 05:17, 15 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ జాబితాలో వికటకవి8 డిసెంబరు 2004 న సృష్టించబడినది. తొలగించబడినది. ఆపరేటింగ్ సిస్టమ్ 20 జనవరి 2005 న సృష్టించబడి తొలగించబడినది. మరల సృష్టి జరిగినది. 21 జనవరి 2005 న చంపూ కవిత సృష్టించబడి తొలగించబడినది. కె.వెంకటరమణ (చర్చ) 16:15, 15 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
24 నవంబరు 2004 న డిజిటల్‌ కంప్యూటర్‌ వేమూరి వెంకటేశ్వరరావుచే ప్రారంభించబడి, తరువాత తొలగించబడినది. కె.వెంకటరమణ (చర్చ) 11:56, 16 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
24 డిసెంబరు 2004 న సాహిత్యం వ్యాసం సృష్టించబడి తరువాత కాలంలో తొలగించబడి మరల సృష్టించబడినది. కె.వెంకటరమణ (చర్చ) 12:14, 16 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
25 నవంబరు 2004 న సృష్టించబడి సమాచారం లేదని తొలగించబడిన జనరంజక శాస్త్రము వ్యాసాన్ని పునరుద్ధరించి సమాచారాన్ని చేర్చాను. కె.వెంకటరమణ (చర్చ) 15:15, 16 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
15 నవంబరు 2004 న సృష్టించబడి సమాచారం లేదని తొలగించబడిన తర్క శాస్త్రము వ్యాసాన్ని పునరుద్ధరించి సమాచారాన్ని చేర్చాను. కె.వెంకటరమణ (చర్చ) 08:47, 17 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

[Small wiki toolkits – Indic workshop series 2020] Register now!

Greetings, hope this message finds you all in the best of your health, and you are staying safe amid the ongoing crisis.

Firstly, to give you context, Small wiki toolkits (SWT) is an initiative to support small wiki communities, to learn and share technical and semi-technical skills to support, maintain, and grow. We are happy to inform you that the SWT group has planned a series of four online workshops for Indic Wikimedia community members during June & July 2020. These workshops have been specifically designed and curated for Indic communities, based on a survey conducted early this year. The four workshops planned in this regard are;

  • Understanding the technical challenges of Indic language wikis (by Birgit): Brainstorming about technical challenges faced by contributors to Indic language Wikimedia projects.
  • Writing user scripts & gadgets (by Jayprakash12345): Basics to intermediate-level training on writing user scripts (Javascript and jQuery fundamentals are prerequisites).
  • Using project management & bug reporting tool Phabricator (by Andre): Introduction to Phabricator, a tool used for project management and software bug reporting.
  • Writing Wikidata queries (by Mahir256): Introduction to the Wikidata Query Service, from writing simple queries to constructing complex visualizations of structured data.
You can read more about these workshops at: SWT Indic Workshop Series 2020/Workshops -- exact dates and timings will be informed later to selected participants.

Registration is open until 24 May 2020, and you can register yourself by visiting this page! These workshops will be quite helpful for Indic communities to expand their technical bandwidth, and further iterations will be conducted based on the response to the current series. Looking forward to your participation! If you have any questions, please contact us on the talk page here. MediaWiki message delivery (చర్చ) 17:38, 16 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఫిలింఫేర్/ఫిల్మ్‌ఫేర్

ఫిలింఫేర్ లేదా ఫిల్మ్‌ఫేర్ (Filmfare) ఒక ప్రసిద్ధిచెందిన పత్రిక. ఇది ఎక్కువగా బాలీవుడ్ కు చెందిన వ్యాసాలను ముద్రిస్తుంది. అయితే తెలుగులో దీనికి సంబంధించిన వ్యాసం కొన్నికారణాల వలన తొలగించబడింది. కానీ ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు మరియు దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు ఇలా ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ తెలుగు సినిమాలు వంటి కొన్ని వ్యాసాలుమాత్రం ఉన్నాయి. దక్షిణాది (South) ఒకటేనా. నేను ఈ చర్చ మొదలుపెట్టాడానికి కారణం అసలు ఈపేరు ఎలా వ్రాయాలి అని. మనం ఒక అంగీకారానికి వస్తే అదేవిధంగా ఈ పత్రికకు సంబంధించిన వ్యాసాలు అన్ని మార్చవచ్చును లేదా విస్తరించవచ్చును. --Rajasekhar1961 (చర్చ) 04:54, 19 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

నాకు తెలిసినంత వరకు "ఫిలింఫేర్" అనేదే సరైనది. పలకడంలో కూడా ఫిలింఫేర్ అనే పలుకుతాము. ఫిల్మ్‌ఫేర్ అనడం పదాన్ని విడదీసినట్టు అనిపిస్తోంది. Pranayraj Vangari (Talk2Me|Contribs) 05:14, 19 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు సరైనదని అనుకుంటున్నాను. హిందీవికీలో फ़िल्मफ़ेयर पुरस्कार అని, కన్నడంలో ಫಿಲ್ಮ್ ಫೇರ್ ಪ್ರಶಸ್ತಿಗಳು అని ఉన్నది. కనుక ఇది సరైన పదం అనుకుంటున్నాను. గూగుల్ ఫలితాలలో ఫిల్మ్‌ఫేర్ కు 29,000 తెలుగు పదానికి సంబంధించిన ఫలితాలున్నాయి. ఫిలిం పేర్ కు 1,64,00,000 ఫలితాలున్ననూ ఎక్కువగా ఆంగ్ల పద ఫలితాలు కనిపిస్తున్నాయి. అందువలన "ఫిల్మ్‌ఫేర్" సరైన పదం అని భావిస్తున్నాను. కె.వెంకటరమణ (చర్చ) 06:53, 19 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఫిల్మ్ అనే పదం జన సామాన్యంలో ఫిలిం అయ్యుంటుంది నా అభిప్రాయం. కాబట్టి ఫిల్మ్ ఫేర్ అనేదే సరైన పదం అనుకుంటున్నాను. -రవిచంద్ర (చర్చ) 07:41, 19 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
నాకు తెలిసిన కొంతమంది సినీ మిత్రులను అడిగాను. వాళ్ళు ఫిల్మ్‌ఫేర్ అన్నదే సరైన పదం అని చెప్పారు. Pranayraj Vangari (Talk2Me|Contribs) 08:27, 19 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
నాకైతే రెండూ రైటే ననిపిస్తోంది. అయితే..
ఇది ఒక మాటకు మాత్రమే చెందిన అంశం కాదు. తెలుగేతర పేర్లను ఎలా రాయాలి అనే ఒక విధానపరమైన అంశం ఇది. దాని పట్ల ఇదమిత్థంగా మనకొక విధానం లేకపోవడం వలన ఈ ఇబ్బంది వచ్చింది. అసలు ఒక ఖచ్చితమైన విధానం ఏర్పాటు చేసికోవడం కుదురుతుందా అనేది పరిశీలించాలి.
  1. కొన్నిటిని ఎలా పలుకుతామో అలా రాయడం లేదు - వరల్డ్ రాయాలా వాల్డ్ రాయాలా అంటే వరల్డ్ అనే రాస్తాం. వాల్డ్ అనేది ఎక్కడోగానీ కనబడదు. "వరల్డ్ -world -wald -wold -vorld -vald -vold -valde -walde" కు గూగుల్ ఫలితాలు "వాల్డ్ -world -wald -vold -vald -valde -walde -walad -valad" కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. కానీ పలికేటపుడు వాల్డ్ అనే పలుకుతాం, వరల్డ్ అనం. అంటే ఇక్కడ ఎలా పలుకుతామో అలా రాయడం లేదు.
  2. కొన్నిటిని ఎలా పలుకుతామో అలాగే రాస్తున్నాం - ఉదా: కాఫ్ సిరప్. ఈ రెండింటి ప్రకారం చూస్తే ఇంగ్లీషులో r సైలెంటుగా ఉన్న పదాలను ఎలా రాస్తామో అలాగే పలుకుతాం. l సైలెంటుగా ఉన్న పదాలను ఎలా పలుకుతామో అలా రాస్తాం అని అనుకోవచ్చేమో - పరిశీలించాలి.
  3. అజంతం చెయ్యాలా హలంతంగానే ఉంచెయ్యాలా? - వ్యక్తులు, స్థలాలు, జీవులూ.. వగైరాల పేర్లను హలంతంగానే ఉంచెయ్యాలి. ఇతర నామవాచకాలు, క్రియా పదాలు.. కొన్నిటిని అజంతం చెయ్యాలి.
  4. బహువచనాలను ఎలా రాయాలి? - నియాండర్తల్స్ అని రాయాలా లేక నియండర్తల్‌లు/నియాండర్తళ్ళు అని రాయాలా?
ఇలాంటి విషయాలన్నిటి పట్ల మనకొక విధానం అంటూ ఉంటే చాలావరకూ పదాల విషయంలో మనకు స్పష్టత వచ్చేస్తుంది. దాని కోసం గతంలో ఒక ప్రయత్నం మొదలైంది గానీ, దానిపై వాడుకరుల స్పందన పెద్దగా లేనందున, ముందుకు పోక అలాగే పడి ఉంది. విధానాల ఏర్పాటు పట్ల మనం నిరాసక్తంగా ఉంటే ఇలాంటి పీస్‌మీల్ చర్చలు తప్పవు మనకు. __చదువరి (చర్చరచనలు) 16:01, 21 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
జరిగిన చర్చ ఆధారంగా ఈ అంశం వరకు ఫిల్మ్‌ఫేర్ సరైన పదముగా నిర్ణయించబడినది. ఆవిధంగానే పురస్కారాలను, విజేతలను వర్గీకరించాలి లేదా వ్యాసాల పేర్లను తయారుచేయండి. South కి సరైన పదంగా దక్షిణాది అనే పదాన్ని తీసుకుందాము.--Rajasekhar1961 (చర్చ) 10:25, 22 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
తెలుగు పుస్తకాలలో, పత్రికలలో ఫిలింఫేర్ అనే పదమే ఎక్కువగా వాడుతారు. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:11, 24 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త వ్యాసాలకు నిబంధన

మూలాలు లేని వ్యాసాలు కుప్పలు తెప్పలుగా సృష్టిస్తున్నారు కాబట్టి, కనీసం ఒక మూలమైనా లేనిదే వ్యాసం సృష్టించకుండా కట్టడి చేద్దామా? ఆ మూలం కూడా నిర్ధారించదగినది, విశ్వసనీయమైనది కూడా అయి ఉండాలి. యూట్యూబు వీడియోలు లాంటి మూలాలు కూడదు. ఈ ప్రతిపాదన వీలవుతుందేమో చర్చిద్దాం. సభ్యులు మీ అభిప్రాయాలు తెలియజేయండి. -రవిచంద్ర (చర్చ) 07:39, 19 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

మూలలు లేని వ్యాసాలను కట్టడి చేస్తే మందిదే. మనం గతంలో ఉన్న మొలక వ్యాసాలను, మూలాలు లేని వ్యాసాలను సరిద్దడానికి మన సమయం అంతా కేటాయిస్తూంటే అనుభవం గల వాడుకరులు వారు గతంలో ఉన్న వ్యాసాలను విస్తరణలు చేయకుండా, మూలాలు చేర్చకుండా కొత్త వ్యాసాలను సృష్టించడానికే ఎక్కువ శ్రద్ద పెట్టడం గమనిస్తున్నాము. కొత్త వ్యాసాలు కూడా మొలకలే. అలా అంటే 2000 బైట్లకు తెచ్చి వదిలేస్తారు. మూలాలు ఉండవు. ఇతర వ్యాసాలతో లింకులు ఉండవు. ఈ వ్యాస నుండి ఇతర వ్యాసాలకు లింకులు ఉండవు. అందువలన ఈ వ్యాసాలపై విధానమేదైనా రూపకల్పన చేస్తే మంచిదని భావిస్తున్నాను. కొత్త వాడుకరులు సృష్టిస్తే వారికి చర్చా పేజీలో వ్యాసం రాసే విధానాన్ని తెలియజేయాలి. అనుభవజ్ఞులైన పాతవాడుకరులు మొలక వ్యాసాలు సృష్టిస్తే ఒక వారం రోజులు చూసి అందులో మూలాలు లేక పోయినా, ఇతర వ్యాసాల నుండి లింకులు లేకపోయినా, శుద్ది చేయని యాంత్రిక అనువాదమైనా చర్చ లేకుండా తొలగించాలి. కె.వెంకటరమణ (చర్చ) 08:01, 19 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
వికీపీడియా రచనలో కొత్త నిబంధనలను రూపొందించుకోవాల్సిన అవసరం, సమయం వచ్చింది. ఆ దిశగా చర్చను కొనసాగిద్దాం. Pranayraj Vangari (Talk2Me|Contribs) 08:09, 19 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
పై అభిప్రాయాలతో నేనూ ఏకీభవిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 08:03, 20 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఈనాడు వెబ్ వంటి డైనమిక్ లింకులు మూలాలుగా ఇచ్ఛేటప్పుడు, ఆర్కైవ్ చేయాలి , మూలమైనా లేనిదే వ్యాసం సృష్టించకుండా కట్టడి చేయటం మంచి ఆలోచన Kasyap (చర్చ) 07:22, 21 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
కట్టడి చెయ్యడమంటే అసలు ప్రచురించనీయకుండా వడపోత ద్వారా అడ్డుకోవడమే మీ ఉద్దేశంగా ఉన్నట్టు నాకు తోస్తోంది. దాని సాధ్యాసాధ్యాల గురించి నాకు తెలియదు గానీ, నిర్ధారించదగిన, విశ్వసనీయమైన మూలమా కాదా అనేదాన్ని మాత్రం వడపోత ద్వారా ఆటోమాటిగ్గా నిర్ధారించలేమనుకుంటా. ఈ విషయంలో నా అభిప్రాయం ఇది: వడపోత ద్వారా కంటే మానవికంగానే మూలాల్లేని పాఠ్యాన్ని గుర్తించాలి (ఇప్పుడు చేస్తున్నట్లే). అయితే అలవాటుగా మూలాలు చేర్చనివారిని, చెప్పినా పట్టించుకోనివారిని గుర్తించి, అలాంటి వారిని ప్రధాన పేరుబరిలో రాయనీకుండా నిర్దుష్ట కాలావధుల పాటు నిరోధించే ఒక విధానాన్ని రూపొందించుకుంటే బాగుంటుంది. __చదువరి (చర్చరచనలు) 16:22, 21 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి అవునండీ, మూలం లేనిదే వ్యాసం సృష్టించకుండా అడ్డుకోవాలి. అదే నాఉద్దేశ్యం. మీరన్నట్లు విశ్వసనీయమైనా మూలమా కాదా అనేది తర్వాత మానవికంగానే గుర్తిద్దాము. కానీ ఏదో ఒక మూలం లేనిదే వ్యాసమే సృష్టించకుండా ఉండే ఉపాయం చూడాలి. అదీ నా ప్రతిపాదన. దీని వల్ల వికీకి కొత్తగా వచ్చేవారు వెంటనే వ్యాసం సృష్టించలేరు. కొన్ని ముఖ్య సూత్రాలు తెలుసుకున్నాకే వ్యాసం సృష్టించడానికి పూనుకుంటారు. ఇది ఆటోమేటిగ్గా చేయడం వీలవుతుందా? ఒక వేళ వీలయితే అభిప్రాయ సేకరణ చేద్దాము. - రవిచంద్ర (చర్చ) 09:01, 22 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
రవిచంద్ర గారూ, ఒకే తడవలో మూలంతో సహా వ్యాసాన్ని మొదలుపెట్టడం బాగానే ఉంటుంది. అనువాద వ్యాసాలకు అది ఖచ్చితంగా సాధ్యమే. కానీ..
  • నేరుగా కొత్త వ్యాసాన్ని సృష్టించేటపుడు మూలాలు అవీ సిద్ధంగా ఉన్నప్పటికీ, పేజీని సృష్టించే సమయంలోనే వాటిని చేర్చడం కొన్ని సందర్భాల్లో సాధ్యం కాకపోవచ్చు (పెద్దగా అనుభవం లేని వాడుకరి అవడంతో మూలాలనివ్వడంలో ఇబ్బంది తలెత్తడం వలన గానీ, అంత విస్వసనీయం గాని ఇంటర్నెట్ వలన వీలైనంత తక్కువ కంటెంటుతో వ్యాసాన్ని సృష్టించి ఆ తరువాత పెంచుకుంటూ పోవడం వలన గానీ, మరో కారణం వలన గానీ). అలాంటపుడు పేజీని సృష్టించలేకపోవడం నిరాశను, నిస్పృహనూ కలిగించవచ్చు. కొత్తవారికి ఇది చాలా నిరుత్సాహం కలిగిస్తుంది.
  • పైగా, వికీలో పేజీ నిర్మాణమౌతూ ఉంటుంది. ఒక్కసారే ఫలానావి ఉండాలని నిర్బంధించలేమేమో పరిశీలించండి.
  • ఇంకోటి.. కేవలం వడపోతను ఏమార్చేందుకు ఏదో ఒక మూలాన్ని ఇచ్చి ప్రచురించేసి (ఉదా:http://www.somewebsite.com), వెనువెంటనే ఆ మూలాన్ని తీసెయ్యొచ్చు. లేదా తీసెయ్యకుండా అలాగే వదిలెయ్యనూ వచ్చు.
అంచేత మూలం లేని వ్యాసాన్ని సృష్టించకుండా వడపోతను సృష్టించడం వాంఛనీయం కాకపోవచ్చు. అయితే మీ ప్రతిపాదన ప్రకారమే ఒక వడపోతను సృష్టించి (సాధ్యపడే పక్షంలో), అయితే దానితో పేజీ సృష్టిని నిరోధించకుండా, దానికి ఒక "మూలం లేని పేజీ" అని ఒక ట్యాగును పెడదాం. దాంతో అలాంటి పేజీలను తేలిగ్గా గుర్తించవచ్చు. __చదువరి (చర్చరచనలు) 14:08, 23 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారూ, పైన మీరు పేర్కొన్న అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను. మూలంలేని వ్యాసాలు సృష్టించినపుడు ఒక మూసో లేదా ట్యాగో తగిలించినా సరే. -- రవిచంద్ర (చర్చ) 07:50, 24 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఇలాంటి నిబంధనలు కొత్త సభ్యులకు చాలా ఇబ్బందికరంగా తయారౌతుంది. మూలమంటే ఏమిటో తెలియని కొత్తసభ్యులకు మూలాలు లేనిదే వ్యాసం ప్రచురితం కాకపోవడం ఆ సభ్యుల దిద్దుబాట్ల హక్కులను హరించినట్లవుతుంది. కాబట్టి ఇది కఠిన నిబంధన కిందికే వస్తుంది. మూలాల గురించి చెప్పాలంటే చాలా లోతుగా ఆలోచించాల్సి ఉంటుంది. ప్రస్తుతం తెవికీలో ఉన్న మూలాలపద్దతి ఎలా ఉందంటే అనువాద వ్యాసాలలో ఆంగ్లవికీలో ఉన్న మూలాలనే చేరుస్తున్నాం. వాస్తవానికి ఆ మూల పుస్తకాలు కాని వెబ్‌సైట్లు కాని ఏమీ కూడా సమాచారాన్ని కూర్చే సభ్యులు పరిశీలించడం లేదు. మూలవ్యాసంలో చర్చల ద్వారా వాక్యం, మూలం మారిననూ మనవద్ద సమాచారం మారడం లేదు. చాలా వాక్యాలకు ఆధారం కోరబడింది ఉన్న చోట కూడా దశాబ్దం నుంచి వాక్యాలు అలాగే ఉంటున్నాయి. ఎక్కడిదో సమాచారం కాపీ చేసి దానికి మూలం ఇస్తున్నారు, పెద్దవ్యాసం అనీ, మూలం ఉంది అనీ వదిలివేస్తున్నాము కాని అది కాపీ వ్యాసమనీ మాత్రం తొలగించడం లేదు. మూలం అంటే వ్యాసంలో ఒక్క మూలం కాకుండా పలు మూలాలుండాలి. అప్పుడే ఆ వ్యాసం కాపీ వ్యాసం కాదని చెప్పవచ్చు. కాని ఇప్పుడు సభ్యులు చేస్తున్నది ఏమంటే ఉన్న సమాచారానికే మూలాల కోసం సెర్చ్ చేసి వ్యాసాలలో అతికిస్తున్నారు. వ్యాసం రచించేటప్పుడు ఉన్న సమాచారం మారినప్పుడు కేవలం సమాచార్ం మాత్రమే మారుస్తున్నారు కాని మూలం మార్పుచేయడం లేదు. కొన్నిచోట్ల మూలానికి చెందిన వాక్యాలు తొలగించిననూ మూలం మాత్రం అలాగే వదిలివేస్తున్నారు. దీనిపై కొత్తగా చర్చతీస్తే పూర్తివివరాలు చెప్పగలను. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:08, 24 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
మూలాలు లేకుండా వ్యాస సృష్టిని ఆపుచేయడం కఠినమైన నిబంధన అని నేను కూడా అంగీకరిస్తున్నాను. ప్రస్తుతం తెవికీలో ఉన్న మూలాలపద్దతి ఎలా ఉందంటే అనువాద వ్యాసాలలో ఆంగ్లవికీలో ఉన్న మూలాలనే చేరుస్తున్నాం. ఇది కేవలం అనువాద వ్యాసాలకు సంబంధించినది. అనువాద వ్యాసాలు కాకుండా మనం ఇతర వ్యాసాలు ఎన్నో రాస్తున్నాము. వీటిలో ఎన్నో వ్యాసాలు సమాచారం చేర్చేటపుడే మూలాలు కూడా చేరుస్తున్నాము. మూలాలు ఎక్కువుండాలని నేను ఒప్పుకుంటాను. కానీ అసలు మూలాలే లేకుండా ఉండటం కన్న ఒక్క మూలమైనా చూపించడం మంచిదే కదా. మీరు చెబుతున్న సమస్యలన్నీ పరిష్కరించాలంటే వికీ నియమాలు అర్థం చేసుకుని గౌరవించే బాధ్యతాయుతమైన మరికొంతమంది రచయితలు కావాలి. లేకపోతే సమస్య మరింత తీవ్రమౌతుంది. కాబట్టే కొత్తగా వచ్చేవారికి కనీస నియమాలు అనుసరించేలా సలహాలు ఇవ్వాలి. వ్యాసాల స్థితిని తెలియజేయడానికి కొన్ని నిర్వహణ సంబంధిత మూసలు చేర్చాలి. చివరగా నేను చెప్పదలుచుకున్నది ఇదే. -- రవిచంద్ర (చర్చ)
మొలకలైన వాటికి వికీపీడియా:మొలకపేజీల నియంత్రణ విధానం సవరించడం మంచిది. చర్చా పేజీలో నేను కొన్ని సూచనలు చేశాను. ఇతరులు కొన్ని సూచనలు చేశారు. మొలకలు కానివి చాలావరకు అనువాద వ్యాసాలైవుంటాయి. వాటికొరకు ప్రత్యేక విధానం రూపొందించుకోవచ్చు. ప్రస్తుతం అంతర్జాలం సగటు వాడుకరికి అందుబాటులోకి వచ్చిన దృష్ట్యా, ఒక మూలమైన తప్పనిసరిచేయటం మంచిదని నా అభిప్రాయం. --అర్జున (చర్చ) 06:48, 26 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

YVSREDDY ని ఎందుకు నిరోధించాలి

  • నిర్వాహకులు చేసిన తప్పును ఎత్తి చూపినందుకా
  • తాను సృష్టింఛిన వ్యాసాలను విస్తరిస్తునందుకా
  • తాను సృష్టించిన వ్యాసాలను తొలగించినా అడగనందుకా
  • ఒకే రోజు తాను సృష్టించిన పది మొలక వ్యాసాలను విస్తరించినందుకా
  • తొలగించిన వ్యాసాలను సృష్టించుటకు విధానాలు ఏమిటి అని అడిగినందుకా
  • లేక నిర్వాహకుల ప్రతాపం ఏమిటో చూపడానికా
  • తాను సృష్టింఛిన వ్యాసాలను విస్తరిస్తే తొలగించడానికి వ్యాసాలు ఉండవనా
  • చెత్తరాతలు వున్న వ్యాసాలు తప్ప ఎవరు సృష్టించిన వ్యాసమైనా తొలగించవద్దని కోరినందుకా
  • నేను ప్రారంభించిన వాటిలో కొన్ని మొలక వ్యాసాలుగా ఉండి ఉండవచ్చు. నేను ప్రస్తుతం రెండు వేల బైట్లకు మించి వాటిని ఇప్పుడు విస్తరిస్తున్నాను కదా. వాడుకరులకు నియమాలు తెలియకపోయి ఉండవచ్చు. నియమాలను తెలపమని కోరినప్పుడు నియమాలు తెలుపవలసిన బాధ్యత నిర్వాహకులకు ఉంది కదా. నేను నలుగురు నిర్వాహకులను తొలగింపబడిన వ్యాసాలను ఏలా ప్రారంభించాలి అని అడిగితే ఒక నిర్వాహకుడైనా సమాధానం ఇచ్చారా. YVSREDDY (చర్చ) 07:35, 20 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

వైవిఎస్‌ రెడ్డి గారిపైచర్య గురించి.. వికి సభ్యులు ఆయనపై చర్య తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారని ఈ చర్చను బట్టి, YVSREDDY గారు మీ మీద మీకే అనుమానం వచ్చిందా ...నిర్వాహకులు ఎన్ని చెప్పినా పట్టించుకోకుండా వ్యాసాలు పునఃసృష్టి చేస్తున్నారు కాబట్టి ముందుగా నిరోధం గురించి ఆలోచించడం మీ దుశ్చర్యలు ఆపకపోతే నిరోధం తప్పదని, ముందు జాగ్రతాగా 2-3 ఖాతాలు సృష్టించుకొని నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తుంటే నిరోధించడం ఒక్కటే మార్గము అని నిర్వాహకులకు తప్పదని మీ మీద మీకే అనుమానం వచ్చిందా ?. కొత్త వాడుకరి లా విపరీతం, వింత ప్రవర్తన, సార్ నిర్వాహకులకు మీ మీద కోపం ఎందుకు ఉంటుంది ... మీ మొలక వ్యాసాల మీ విధానం మారకపోతే నిర్వాహకులకు మీ మీద తలారి వృత్తి పని తప్పక పోవచ్చును. ప్రభాకర్ గౌడ్ నోముల 10:09, 20 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

YVSREDDY మీరు వికీ వ్యాసాలకు అత్యంత ముఖ్యమైన మూలాలు ఇవ్వడం లేదు. మీ అనువాద వాక్యాలు అర్థం కాకుండా ఉన్నాయి. వాటిని ఎత్తిచూపినందుకు సవరించడం బదులు అదే ప్రవర్తన కొనసాగిస్తున్నారు. మీరు నిర్వాహక సభ్యుల మాటలకు విలువ ఇవ్వడం లేదు. చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. ఇవి మిమ్మల్ని నిరోధించేందుకు నేను గమనించిన అంశాలు. -రవిచంద్ర (చర్చ) 10:39, 20 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • నేను నిర్వాహకులను కోరేది వ్యాసాల మీద తలారి వృత్తి చేయవద్దని, అలా కోరినందుకు మీపై కూడా తలారి వృత్తి పని తప్పక పోవచ్చును అని అంటున్నారు. అంటే ఇక్కడ తలారులుగా వృత్తి చేసేందుకు మాత్రమే నిర్వాహకులు ఉన్నారని అర్థమవుతుంది. ప్రభాకర్ గౌడ్ నోముల గారు పొరపాటున ఏదైనా తెవికీలో మంచి పని చేస్తారేమో జాగ్రత్త, ఇక్కడి నిర్వాహకుల చేతుల్లో మీపై కూడా తలారి వృత్తి పని తప్పక పోవచ్చును. YVSREDDY (చర్చ) 14:29, 20 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
YVSREDDYగారూ, 2013 నుండి ఇప్పటి దాకా మీ వ్యాసాలపై జరిగిన చర్చల గురించి తెలియని వాళ్ళు పైన మీరు రాసినది చూస్తే పాపం రెడ్డిగారు ఎంత అమాయకుడో గదా... అని అనుకునే అవకాశముంది. అసలు సంగతులు కనీసం కొన్నైనా తెలియాల్సిన అవసరం ఉందిప్పుడు. నాకు తెలిసిన కొన్ని రాస్తున్నాను:
  1. కింది వ్యాఖ్యలను చూడండి. ఇవన్నీ మీ వాడుకరి చర్చ పేజీ లోనివే. 2013 జనవరిలో మీ చర్చ పేజీలో ఉన్న ఇలాంటి అనేక వ్యాఖ్యలను మూకుమ్మడిగా తీసేసారు. మొత్తం 70% పేజీని ఖాళీ చేసేసారు (50 వేల పైచిలుకు బైట్లను తీసేసారు). మీరు రాస్తున్న రాతల గురించి వివిధ వాడుకరులు చేసిన వ్యాఖ్యలే మీరు తీసేసిన వాటిలో ఉన్నాయి. అసలు మీ చర్చా పేజీలో ఇతర వాడుకరులు రాసిన (అనుచితమేమీ కాని, వికీ నియమాలకు అనుగుణమైనవాటిని) తీసేసినందుకు మీపై ఆనాడే చర్య తోసుకుని ఉండాల్సింది. కానీ అలా చెయ్యకుండా సముదాయం మీపై కరుణ చూపించింది. అది గ్రహించలేదు మీరు. మీరు తొలగించిన వాటిల్లో మచ్చుకు కొన్ని వ్యాఖ్యలు కింద ఇస్తున్నాను. ఇవి కొన్ని మాత్రమే. మీరు తొలగించిన పాఠ్యంలో ఇంకా అనేక వ్యాఖ్యలున్నాయి. గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఇదంతా జరిగింది 2013 లో. ఈ వ్యాఖ్యలను బట్టి తెలుస్తున్నదేంటంటే.. 1. ఎప్పుడో 2013 నుండే మీకు కొత్త మొలకలను సృష్టించి పడేసి, వాటి ఖర్మానికి అలాగే వదిలేసే అలవాటు మీకు ఉంది 2. అనేకమంది వాడుకరులు అనేక సార్లు మీకు అలా చెయ్యవద్దని చెప్పారు. 3 మీరు వారి వ్యాఖ్యలను పట్టించుకోలేదు, తుడిచిపారేసారు. పైగా వాళ్ళ మీద ఎదురుదాడి చేసారు. మీమీద కక్ష గట్టారని వాళ్ళను రచ్చబండలో ఆడిపోసుకున్నారు. అప్పటి ఆ అలవాటును ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు. మీ తప్పులను ఒప్పుకోరు. ఎదటి వాళ్ళపై తప్పుడు ఆరోపణలు చేస్తారు. సరే అప్పటి వాడుకరులు చేసిన వ్యాఖ్యలు చూద్దాం..
    1. "మీలాంటి వారికోసమే ఏక వాక్య వ్యాసాలపై రచ్చబండ లో చర్చ తీవ్రంగా జరుగిచున్నది. ఇక విషయ నాణ్యత లేని వ్యాసాలు ఆపండి"
    2. "మీరు ప్రారంభించిన కాశినాయన నకలుహక్కుల వుల్లంఘనగా నిర్ధారించడమైనది. దయచేసి ఆ వ్యాసాన్ని తిరిగి రాయండి లేకపోతే అది త్వరలో తొలగించబడుతుంది."
    3. "మీరు ధారాళంగా వ్యాసాలు రాస్తున్నారు, సంతోషం. అయితే ప్రస్తుతం రాసి కన్నా వాసి ముఖ్యమైనదిగా తెవికీ ముఖ్యోద్దేశంగా వుంది. మీ రచనలలో కొన్ని (ఉదా:శ్మశానం) నాణ్యత తక్కువగా వుంది. అందుకని నా సూచనలు రాస్తున్నాను."
    4. "వంద వ్యాసాలు నాలుగు ముక్కలతో మొదలు పెట్టడం కంటే మీరు అనుకొన్న వ్యాసం ఒకటి పూర్తి చేసి మరొక వ్యాసం మొదలుపెడితే ఈ సమస్యలు అసలు రావు."
    5. "కాని మీరు వ్యాసాల సంఖ్యకె ప్రాధాన్యత నిస్తున్నారు. కాని వ్యాసాన్ని విస్తృత పరచడం పై దృష్టి పెట్టడం లెదని తెలియుచున్నది."
    6. "మీరు వ్రాసిన న్యాయవాది పేజీ చాలా బాగున్నది. ఒక్క వాక్యంలో వ్రాయడం విశేషం. ఏక వాక్య వ్యాసాలు రాయటంలో మీకు మీరే సాటి." (సున్నితంగా ఎగతాళి చేసినా మీరు తుడిచేసుకున్నారు, తుడిచేసారు.)
    7. "మీరు రచించిన సూక్ష్మ వ్యాసం.(వ్యాసం అనే కన్నా వాక్యం అనిన బాగుండును) బాగుంది. కాని మీరు రోకలి అనే వ్యాసం వ్రాసారు." (మరో సున్నితంమైన ఎగతాళి.)
    8. "మీరు ఏ వ్యాసాన్ని పూర్తి స్థాయిలొ తయారు చేయరు. కొత్త వ్యాసాలు ప్రారంభించటంలో గల శ్రద్ధ వాటిని వాటిని పూర్తి చేయటం లో ఉండదు."
  2. అప్పట్లో రచ్చబండలో జరిగిన చర్చ గుర్తుకు తెచ్చుకోండి.
  3. ఆ సమయంలో తొలగించిన కొన్ని వ్యాసాలను పునస్థాపిస్తే వాటిని విస్తరిస్తానని అప్పటి నిర్వాహకులకు చెప్పి పునస్థాపింప జేసుకున్నారు. పునస్థాపించాక, వాటిని విస్తరించకుండా వాటి ఖర్మానికి అలాగే వదిలేసారు. అవే వ్యాసాలని ఇటీవల మళ్ళీ తొలగింపుకు ప్రతిపాదించారు. నిర్వాహకులకు ఎంత శ్రమ, సమయం వృథా చేసారో చూడండి. వికీ నియమాలు ఏమైపోయినా, ఇతరుల సమయం ఏమైపోయినా మీకు పర్లేదు.. మీ పేరిట మాత్రం మీకు వ్యాసాలుండాలి.. అవి వికీకి పనికిరాకపోయినా పర్లేదు.
  4. మీరు సృష్టించిన వందలాది మొలకల్లో ఒక 50 పైచిలుకు వ్యాసాలను విస్తరించమనీ, మూలాలను చేర్చమనీ లేదంటే తొలగిస్తామనీ వివిధ వాడుకరులు గత రెండు మూడు నెలల్లో అనేక గమనింపులు పంపారు. మీ చర్చ పేజీ నిండా ఆ గమనింపులే. మరి మీరేం చేసారు..? ఒక్క తొలగింపు చర్చలో కూడా పాల్గొనలేదు. తొలగించవద్దు, విస్తరిస్తానని చెప్పలేదు. విస్తరించనూ లేదు. మూలాలు చేర్చనేలేదు. ఏమీ పట్టనట్టు కూచ్చున్నారు. చివరికి.., వాటిని తొలగించిన వెనువెంటనే తిరిగి సృష్టించేసారు. ఇది వికీ నియమాలకు విరుద్ధం అని చెప్పినా మీరు వినలా.
  5. వ్యాసంలోని సమాచార నాణ్యత పట్ల మీకు పట్టింపు లేదు, భాష నాణ్యత పట్ల పట్టింపు లేదు. వాటి గురించి చెబితే అస్సలు పట్టించుకోరు. మూలాలను చేర్చమంటే చేర్చరు. ఉదాహరణగా శిలాజ ఇంధనం పేజీ చూడండి. మూలాల్లేకపోతే మనం చెప్పే శుద్ధ తప్పులే నిజమనుకుంటాం. ఆ తప్పులే చెలామణీ లోకి పోతాయి అనడానికి ఈ పేజీ గొప్ప ఉదాహరణ.
  6. జీవ ఇంధనం, జీవ ఇంధనం (బయోఫ్యూయల్) - ఈ వ్యాసాల సృష్టి వాటి హేతుబద్ధత, వాటి నిర్వచనం... ఆ ప్రహసనం మర్చిపోకండి.
  7. మీ మొలకల్లోను, ఇతర వ్యాసాల్లోనూ మూలాల సమస్యను పరిష్కరించేందుకు గత రెండు నెలల్లో వివిధ వాడుకరులు మీకు సూచనలు చేసారు, సలహాలిచ్చారు, ప్రతిపాదనలు చేసారు. కానీ మీరు ఎక్కడా స్పందించలేదు. అసలు మీరు చర్చల్లోనే పాల్గొనరు. అసలు పట్టించుకోరు.
  8. రెడ్డి గారూ.., మీరు రాసే వ్యాసాల్లో మూలాలు చేర్చండి అని తోటి వాడుకరి, నిర్వాహకుడూ చేసిన సూచన ఇది. దాన్ని పట్టించుకోనే లేదు.
  9. ఈ ప్రతిపాదనపై కూడా మీనుంచి సమాధానం లేదు.
  10. మీరు సృష్టించిన మొలకలు ఎక్కడున్నాయో తెలీదంటూ అనేక సార్లు అనేకమందిని అడిగారు. మొలకల జాబితా ఎక్కడుందో తెలీదు కాబట్టి విస్తరించలేకపోతున్నాను అనే చిత్రాన్ని ప్రపంచానికి చూపనెంచారు. కానీ మీ సంగతి ఇట్టే బట్టబయలైపోయింద, అనేక విధాలుగా. - 1. మీ రచనల్లో మీ మొలకలను చూడొచ్చు. 2. మీ వాడుకరి పేజీకి అనుబంధంగా మీ మొలకల పేజీ ఉంది. 3. పైగా ఈ సంగతి మీకు ఈసరికే చెప్పారు. 4. క్రియాశీల వాడుకరులందరి మొలకల జాబితా ఉందని, అందులో మీవీ ఉన్నాయని తెలుసు. 5. ఇదిగో మీ మొలకలు ఫలానా చోట ఉన్నాయని మీకు మరో లింకు ఇచ్చాన్నేను. ఇన్ని రకాలుగా తెలిసినా.., నా మొలకలెక్కడున్నాయో నిర్వాహకులు చెప్పాలి అంటూ మళ్ళీ మళ్ళీ అడిగారు. మీ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు, మీరు అమాయకులని చూపించుకునేందుకు రాసిన రాతలే ఇవి.
  11. నియమాలేంటో నాకు తెలియదు చెప్పండని మీరు అమాయకంగా అడిగారు. వాడుకరులు తగు లింకులిస్తూ మీ సంగతిని బైట పెట్టారు.
  12. ఈ రకంగా ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని చర్చలు, వికీ నియమాల పట్ల మీకున్న వ్యతిరేకతను పట్టించేసాయి.
  13. "వ్యాసాల తొలగింపు చర్చలనే నేను అంగీకరించను, వ్యాసాలను తొలగించడానికి నేను ఎలా అంగీకరిస్తాను." అని మీరు చెప్పేసారు. వికీ నియమ నిబంధనలు అంటే మీకు గౌరవం లేదని చెప్పడానికి ఇదే చివరి మాట!
ఇక ఇప్పుడు ప్రభాకర్ గౌడ్ నోముల గారు చేసిన వ్యాఖ్యను వక్రీకరించి, నిర్వాహకులపై "అంటే ఇక్కడ తలారులుగా వృత్తి చేసేందుకు మాత్రమే నిర్వాహకులు ఉన్నారని అర్థమవుతుంది." అంటూ అనుచితమైన వ్యాఖ్య చేసారు. ఇది నింద. ప్రస్తుతానికి మీకు మారే ఉద్దేశం లేదని, మీ తప్పులను సవరించుకోరనీ దీంతో నాకు అర్థమైంది. అందుచేత, ఇకముందైనా మీరు మీ తప్పులను తెలుసుకుంటారని ఆశిస్తూ మీపై వారం రోజుల నిరోధం విధిస్తున్నాను. ఈ వారంలో మీ పనులను ఒకసారి నిష్పాక్షికంగా, బయటివ్యక్తిలా, నిర్మోహంగా సమీక్షించుకోండి. మీకు తెలిసిన వికీ వాడుకరి ఎవరితోనైనా ఫోనులోనో నేరుగానో మాట్లాడండి. వారు చెప్పేది వినండి. అది మీకు ఉపయోగపడవచ్చు.
__చదువరి (చర్చరచనలు) 18:32, 20 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

త్వరలో జరగబోయే పరిశోధనా కార్యక్రమం లో పాల్గొని, మీ కోసం మరియు వికీపీడియా యొక్క మెరుగుదల కోసం సహాయపడగలరు

అందరికి నమస్కారాలు,

త్వరలో జరగబోయే పరిశోధనా కార్యక్రమం లో పాల్గొని, మీ కోసం మరియు వికీపీడియా యొక్క మెరుగుదల కోసం సహాయపడగలరు. ఈ అవకాశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకొనుటకు కొన్ని ప్రశ్నల కు సమాధానములు ఇవ్వవలెను, మేము అర్హులను సంప్రదించి వారికి తగిన సమయానికి సమావేశాన్ని ఏర్పాటు చేస్తాము.

ఆసక్తిగల ఇతర సంఘ సభ్యులు మీకు తెలిసిన యెడల, వారికీ ఈ సమాచారాన్ని అందించగలరు.

కృతజ్ఞతలు మరియు శుభాకాంక్షలు, EAsikingarmager (WMF) (చర్చ) 20:32, 21 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ సర్వే వేరొక సంస్థ (థర్డ్ పార్టీ ) ద్వారా జరపబడుచున్నది, కావున వాటికీ అదనపు నిబంధనలు వర్తిస్తాయి. గోప్యత మరియు సమాచార నిర్వహణ గురించి మరిన్ని వివరాల కోసం సర్వే గోప్యతా ప్రకటన చూడవలెను.

తెవికీలో ఒక సమీక్షా సంఘం

తెవికీలో మనం తీసుకునే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు సమీక్షలకు అతీతంగా ఉంటున్నాయి. నిర్వాహకులు అమలు చేసే నిరోధాలు, నిషేధాలు, సంరక్షణలు వంటివి ఎన్నో చర్చోపచర్చల తరువాతనే నిర్ణయాలు తీసుకుని, అమలు చేస్తున్నాం. ఈ విషయంలో నాకు ఆరోపణలూ, అభ్యంతరాలూ ఏమీ లేవు. కానీ, ప్రతి అభిప్రాయానికీ ప్రత్యామ్నాయంగా వ్యతిరేకమైన అభిప్రాయాలు ఉండవచ్చు. ఆ ఆభిప్రాయాలు సదరు చర్చల్లో వెల్లడి కాకపోయి ఉండవచ్చు. అవసరమైనపుడు బాధ్యులైన వాడుకరులు మౌనం వీడకపోవడం వలన ప్రత్యామ్నాయ అభిప్రాయాలు వెలుగు చూడకపోయి ఉండవచ్చు. సముదాయం తీసుకునే నిర్ణయాలు లేదా నిర్వాహకులు తీసుకునే నిర్ణయాలు నూటికి నూరుపాళ్ళూ సరైనవి కాకపోవచ్చు. తెలిసో తెలియకో తప్పులు జరగవచ్చు. తప్పు నిర్ణయాలు జరిగి, అమలై పోవచ్చు. అలాంటి తప్పుడు నిర్ణయాల బాధితులకు తరుణోపాయం ఏంటి? నిర్ణయాలు సరైనవే అయినప్పటికీ, బాధితులు అలా భావించకపోవచ్చు. తమకు అన్యాయం జరిగిందనీ, ఆ నిర్ణయాన్ని మరెవరైనా సమీక్షిస్తే బాగుంటుందని వారు భావించవచ్చు.

ఇలాంటి పని కోసం ఇతర వికీపీడియాల్లో మధ్యవర్తిత్వ సంఘాలున్నాయి. ఇంగ్లీషు వికీపీడియాలోని ఆర్బిట్రేషన్ కమిటీ అలాంటిదే. దీన్లో ఎన్వికీ వాడుకరులే సభ్యులుగా ఎన్నికౌతారు. ఈ కమిటీ చెప్పిన నిర్ణయాలు సముదాయానికి శిరోధార్యం. మనకటువంటిది లేదు. నా ఉద్దేశంలో అటూఇటూగా ఇలాంటిది మనకూ ఒకటుండాలి. అయితే తెవికీలో ఆర్బిట్రేషన్ కమిటీ పెట్టుకోడానికి సరిపడినంత మంది అనుభవమున్న వాడుకరులు లేరు. ఒకవేళ పెట్టినా ఉన్న కొద్దిమంది అనుభవశాలురలోంచే ఈ సభ్యులూ ఎన్నికౌతూ ఉంటారు. అప్పుడు ఆ కమిటీ తీసుకునే నిర్ణయం నిష్పాక్షికంగా న్యాయబద్ధంగా ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా.., అలా ఉన్నట్టు కనిపించకపోవచ్చు.

అందుచేత ఈ విషయమై నాకున్న ఆలోచన ఏంటంటే.. మనకు ఒక సమీక్షా సంఘం ఉండాలి. సభ్యుల అర్హతల విషయంలో నాకు కొన్ని ఆలోచనలున్నాయి.

  1. వికీపీడియా విధానాలు, పద్ధతుల పట్ల మంచి అవగాహన కలిగిన వికీ వాడుకరులై ఉండాలి
  2. తెలుగు వికీపీడియాలో చురుగ్గా పాల్గొనే సభ్యులై "ఉండకూడదు". (అందువలన నిష్పాక్షికతకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది.)
  3. తెలుగు మాతృభాషగా కలిగినవారు లేదా తెలుగు క్షుణ్ణంగా రాయడం చదవడం తెలిసినవారై ఉండాలి. (వివాదం గురించి ఎవరూ అనువదించి చెప్పే పని లేకుండా, జరిగిందేంటో నేరుగా తామే చదివి తెలుసుకోగలుగుతారు.)

తెవికీలో నిర్వాహకుల తప్పుడు నిర్ణయానికి బలయ్యానని భావించే వాడుకరి, ఈ సమీక్షా సంఘానికి తన వాదన చెబుతూ తగు ఆధారాలలనిచ్చి ఫిర్యాదు చేసుకుంటారు. ఈ సంఘం విచారించి తన నిర్ణయాన్ని ప్రకటిస్తుంది. స్థూలంగా ఇదీ నా ప్రతిపాదన. దీన్ని వాడుకరులంతా పరిశీలించి బాగుందని భావిస్తే ఒక ప్రతిపాదన పేజీని తయారుచేసుకుని, వివరాలన్నీ అక్కడ పూర్తిగా రాసుకుని, క్షుణ్ణంగా చర్చించి విధానాన్ని రూపొందించుకుందాం. పరిశీలించగలరు.

కింద చూపిన విభాగాల్లో మీ అభిప్రాయాన్ని రాయండి. __చదువరి (చర్చరచనలు) 05:57, 22 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

సమీక్షా విధానం ఉండాలి

  1. ఏకపక్ష నిర్ణయం జరగకుండా ఇది ఉపయోగపడుతుంది కాబట్టి, సమీక్షా విధానం ఉండాలి. Pranayraj Vangari (Talk2Me|Contribs) 07:47, 22 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  2. ఇది నేను పూర్తిగా సమర్థిస్తున్నాను. దీనివల్ల నిర్వాహణ చర్యలు మరింత బాధ్యతాయుతంగా తీసుకోగలుగుతాం. ప్రస్తుతం నిర్వాహకులు వికీస్ఫూర్తితో, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారని నా అభిప్రాయం. ఇలాంటి సమయంలోనే ఇటువంటి వ్యవస్థ ఏర్పాటుచేసుకోగలిగితే, భవిష్యత్తులో కూడా బాధ్యతారహితంగా, నిర్వాహక బాధ్యతలను అధికారాలుగా వాడే ఒక నిర్వాహక వర్గం ఏర్పాటుకావడాన్ని నిరోధిస్తుంది. వికీమీడియా 2030 స్ట్రాటజీలో భాగంగా నేను కమ్యూనిటీ హెల్త్ వర్కింగ్ గ్రూపులో సభ్యుడిగా పనిచేసినప్పుడు వికీమీడియా ఉద్యమ భవిష్యత్తు కోసం అందించిన రికమెండేషన్లలో "యూనివర్శల్ కోడ్ ఆఫ్‌ కండక్ట్" దానిని అమలు చేయడానికి అంతర్జాతీయ స్థాయిలో ఒక వ్యవస్థ ఉండాలన్నది ఒకటి. అదీ ఇలానే విడివిడి వికీల నిర్వాహకుల చేతిలో హక్కులు, అధికారాలు ఉంటూనే వాటిని స్థూలంగా వికీ మెరుగుదలకే వాడేందుకు ఉపకరించే ప్రయత్నం. ఇలాంటిది మనం తప్పక ఏర్పాటుచేసుకోవాలి. --పవన్ సంతోష్ (చర్చ) 12:17, 22 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  3. ఇతర భాషల్లో సమీక్షా సంఘాలు ఉన్నాయి అంటే వాళ్లు చర్చించే కదా ఉండాలి అనే అభిప్రాయానికి వచ్చింది అలాగే తెలుగులోను ఉంటే బాగుంటుంది మంచి ప్రతిపాదన, దీనితో వాడుకరికి కూడా తన వాదన చెప్పుకునే అవకాశం ఉంటుంది.ప్రభాకర్ గౌడ్ నోముల 16:55, 22 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  4. ప్రస్తుతం నిర్ణయాలు సముదాయం నిర్ణయం మేరకు తీసుకుంటున్నప్పటికీ, కొన్ని సందర్భాలలో బాధితుడు అలా భావించకపోవచ్చు. కొన్ని సందర్భాలలో వాండలిజం చేసినప్పుడు నిర్వాహకుడు అతని విచక్షణ మేరకు ఆ సభ్యుడిని నిరోధిస్తాడు. కొన్ని సందర్భాలలో అనుభవజ్ఞుడైన వాడుకరి సహేతుకమైన వాదన చేస్తున్నప్పుడు నిర్వాహకుడు విచక్షణ కోల్పోయి అతనిని నిరోధించే సందర్భం రావచ్చును. అటువంటి సందర్భంలో ఏకపక్షంగా నిర్ణయం జరిగిందని సభ్యుడు భావించినపుడు తమకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించే అధికారం ఇవ్వాలి. ఆ నిర్ణయన్ని ఎవరైనా సమీక్ష చేసే అవకాశం ఉంటే బాగుంటుంది. కనుక సమీక్షా విధానం ఉండాలి. K.Venkataramana(talk) 01:30, 23 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  5. సమీక్షా విధానం ఉండాలనే అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 02:41, 23 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  6. సమీక్షా విధానం ఉండాలి Wikibantu (చర్చ) 04:34, 23 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  7. ఇపుడున్న వాడుకరులే తక్కువ. ఉన్నవారిలో దాదాపు అంతా అనుభవజ్ఞులే, నిజాయితీ, సేవా భావం కలిగి పనిచేస్తున్నవారే. అధికంగా చర్చల్లో పాల్గొంటున్నవారే. ఏ నిర్ణయాలైనా సరైన అవగాహన,ఆలోచనతోనే తీసుకొంటూన్నారు అనుకుంటున్నాను. నిర్ణయాలైపై ఇపుడు జరుగుతున్న చర్చలూ ఆరోగ్యకరంగానే ఉన్నాయి. నచ్చని దాని గురించి నిర్మొహమాటంగా తెలియచేయగల సభ్యులూ ఉన్నారు. చర్చల అనంతరం మెజారిటీ సభ్యులు తీసుకొనే నిర్ణయాలను గౌరవించడం, గౌరవించకపోవడం ఆయా వాడుకరుల మనస్తతత్వం పై ఆధారపడి ఉంటుంది. అయినా అన్యాయం జరిగినట్టుగా భావించే సభ్యునికి ఒక అవకాశం ఇవ్వడం మంచి నిర్ణయం కనుక సమీక్ష జరగాలి..B.K.Viswanadh (చర్చ) 03:26, 24 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  8. సమీక్షా విధానం ఉండాలి. ఉత్తరత్రా తెవికీలో తీసుకొంటున్న నిర్ణయాలకు తొలగించిన తర్వాత నిందలు పడకుండా ఇవి ఉపకరిస్తాయి.--Rajasekhar1961 (చర్చ) 10:43, 24 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  9. నిర్వాహక చర్యలపై సమీక్షావిధానం ఉండాలి. ప్రతి నిర్వాహక చర్యకు సమీక్ష ఉండాలా లేక బాధితుడు కోరితేనే సమీక్ష చేయాలా? (నిషేధానికి గురైన బాధితుడు సమీక్ష కోరుట సాధ్యం కాదుకదా!) సమీక్ష ఆధారంగానే చర్యలు తీసుకోవాలా? (కోర్టు తీర్పుల ఆధారంగా చర్యలు తీసుకున్నట్లుగా) లేక చర్యల అనంతరం సమీక్ష చేయాలా? (ఇది కొంత ఇబ్బందే) సమీక్ష చేసేవారికి ఉండే బాధ్యతలు ఏమిటి? సమీక్ష అనంతరం సమీక్షనే పొరపాటు అంటూ ఆధారలతో సహా ఎవరైనా చర్చ తీస్తే? నిర్వాహకులు చేసే చర్యలపై నిష్పక్షపాతంగా సమీక్ష చేసే సభ్యులను ఎలా గుర్తించాలి? ఇచ్చిన సమీక్షను నిర్వాహకులు అంగీకరించకపోతే? నిర్వాహకులపై తీసుకొనే చర్యలు ఎలాంటివి? సమీక్షపై క్షమాభిక్ష అధికారం కూడా ఉంటుందా? సమీక్షామండలిలో అనేది సింగిల్ బెంచ్‌నా, డివిజన్ బెంచ్‌నా లేక ఫుల్ బెంచ్‌నా? సమీక్షా మండలి కాలం ఎంత? ఇది నియామకమా లేక ఎన్నిక విధానమా? సమీక్షామండలి సభ్యులకు ఉండాల్సిన అర్హతలేమిటి? సభ్యులందరూ ఒకరితో ఒకరు పరిచయాలున్నప్పుడు వారిలో నుంచే సమీక్షామండలిలో చేరిన సభ్యులైతే సరైన నిర్ణయం వెలువడుతుందా? సమీక్షామండలి అధికారాలను ఎలా నిర్ణయించాలి. సమీక్షామండలి నిర్ణయం అనంతరం నియమావళిని ముందుతేదీ నుంచి మార్పుచేస్తే అప్పుడేం చేయాలి? సమీక్ష చేసే సమయానికి సమీక్షసంఘం సభ్యుడు సెలవులో ఉంటే? సమీక్ష అనంతరం తీర్పు బాధితుడికి అనుకూలంగా వచ్చినప్పుడు నిర్వాహకులు తమకు అన్యాయం జరిగింది అన్నప్పుడు సూపర్ సమీక్ష (?) కూడా ఉండాలా? ... ఇలా ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ముందుగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకొంటే బాగుంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:41, 24 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

సమీక్షా విధానం అక్కర్లేదు

  1. తెవికీ క్రియాశీలత పరంగా ఇంకా పదేళ్ల క్రిందటి స్థాయిలోనే వున్నందున, ప్రస్తుత పరిస్థితులలో సమీక్ష విధానం అవసరంలేదు. నిర్వాహకుల ఎంపికను జాగ్రత్తగా నిర్వహించితే మంచిది. ఒకవేళ తప్పులు జరిగినప్పుడు ఇతర నిర్వాహకులు చర్చించి తప్పుని సరిచేయవచ్చు. ఏడేళ్ల క్రితం రూపొందించిన వికీపీడియా:మొలకపేజీల నియంత్రణ విధానం కూడా సమగ్రంగా అమలు చేయలేని స్థితిలో వున్నాం కావున, కొత్త విధానాలు తయారీ, నిర్వహణ పనులను పెంచుతాయి కాని వాటివలన ఉపయోగం తగినంత ఉండదని నా అభిప్రాయం.--అర్జున (చర్చ) 06:16, 26 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ విషయంలో నాకు అభిప్రాయమేమీ లేదు

  1. అసలు ఏకపక్ష నిర్ణయాలే ఈ స్వేచ్ఛా విజ్ఞాన యజ్ఞం లో జరగకుండా ఉండాలనేది నా అభిమతం , ఉన్న క్రియాశీల వాడుకరులే తక్కువగా చర్చలలో పాల్గొంటున్నప్పడు ఈ విషయంలో నాకు అభిప్రాయమేమీ లేదు, ఉన్న ఆ ఐదు మూల స్థంబాలను పట్టుకు వేళ్లాడటం తప్ప ! Kasyap (చర్చ) 12:01, 22 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]


ఇటీవలి పరిణామాలు - నిర్వాహకుల పొరపాట్లు

తెవికీలో ఇటీవలి చర్చలను పరిశీలిస్తే నిర్వాహకులు పలు పొరపాట్లు చేస్తున్నారని గమనించవచ్చు. పలు కారణాల వల్ల నేను తెవికీలో చురుకుగా ఉండటం లేదు. సమయం లభించింది కదాని ఒక చూపుచూశాను. నేను ఎప్పుడో ఒకప్పుడు చూసిననూ వ్యాసాలను కాకుండా సభ్యుల చర్చలను, నిర్వాహకుల చర్యలను మాత్రం బాగా గమనిస్తాను. నేను గమనించిన వాటి ప్రకారం ఇటీవలి కాలంలో నిర్వాహకుల తప్పిదాలు, పొరపాట్లు కొన్ని క్రింద వివరిస్తున్నాను.

1) "...గత చర్చలో రెడ్డి గారికి అత్యంత పటిష్ఠమైన సమర్ధకుడుగా నిలిచిన వాడుకరి..." అంటూ @సభ్యుడు:చదువరి నన్ను ఉద్దేశించి రాశారు. నన్ను సభ్యుడు:రెడ్డికి సమర్థకుడిగా ఎలా ఆపాదించారు? అంత ఖచ్చితంగా ఎలా నిర్థారించారు? ఏ తెవికీ ప్రధాన వాడుకరిలా కాకుండా నేను అందరికీ దూరంగా ఉంటూ, నిష్పక్షపాతంగా ఉండడానికై కనీసం నా సెల్‌ఫోన్ నెంబరు కూడా ఎవరికీ ఇవ్వలేను. ఎవరితోనూ సంప్రదింపులు లేవు, సంబంధాలు లేవు. ఇప్పటివరకు ఏ సమావేశాలకు ప్రత్యక్షంగా హాజరు కాలేను. తెవికీలో నాకు మిత్రులు, శత్రువులంటూ ఎవరూ లేవు. ఆన్‌లైన్ వికీపీడియాలో సేవలకై ఆన్‌లైన్‌లో మాత్రమే నా సేవలందించాను. గత కొన్ని సంవత్సరాలుగా మాత్రం అప్పుడప్పుడు తెవికీని సందర్శిస్తూ పొరపాట్లను (అది ఎవరిదైనా సరే) నిష్పక్షపాతంగా బయటపెడుతున్నాను. నిష్పక్షపాతంగా నా భావాలను ప్రకటించడానికి ఎవరితోనూ సంబంధాలు పెట్టుకోలేను. నేను వాడుకరిని కాకుండా వాడుకరి చర్చలపై మాత్రమే దృష్టిపెడతాను. ఒకే వాడుకరికి ఒక సమయంలో పొరపాట్లు బయటపెట్టిననూ మరో సమయంలో ఆయన చర్యలను సమర్థంచిన సంఘటనలూ ఉన్నాయి. నేను చురుకుగా పనిచేసిన కాలంలో మీరు చురుకుగా లేరు కాబట్టి నా గురించి మీకంతగా తెలియదేమో! ఏడేళ్ళ క్రిందట అప్పటి నిర్వాహకులు పొరపాట్లపై పొరపాటు చేస్తూ నిబంధనలకు వ్యతిరేకంగా చర్చలతో సంబంధం ఉన్న నిర్వాహకులే సదరు సభ్యుడిపై, అతను రాసిన వ్యాసాలపై చర్యలకు ఉపక్రమించి ఎలాంటి హెచ్చరిక లేకుండా నిషేధం విధించడం, నిష్కారణంగా చర్చాపేజీలను కూడా తొలగించడం లాంటి తీవ్రతప్పిదాలు చేస్తుంటే సభ్యుడు దీనస్థితిలో ఉన్న దశలో నేను రంగప్రవేశం చేసి నిర్వాహకుల తప్పులను ఎత్తిచూపానే తప్ప సభ్యుడికి, సభ్యుడి వ్యాసాలకు, సభ్యుడి చర్యలకు ఏ దశలోనూ సమర్థంచలేననే సంగతి చర్చల ద్వారా గమనించవచ్చు. ఆ సభ్యుడు చేసింది సరైనదేనని ఎప్పుడూ చెప్పలేను. ఇదే విషయాన్ని నేను అదే చర్చలో స్పష్టంగా పేర్కొన్నాను కూడా. పొరపాట్లు చేసిన నిర్వాహకులైనా, సభ్యులైనా వారికి గుడ్డిగా మద్దతు ఇవ్వడానికి మాత్రం నాకు మనసొప్పదు. ఈ సంగతి కూడా నేను ఏనాడో పలికాను. సమర్థకుడనే మాటను మాత్రం నేనొప్పుకోను, దీనికై మీ వివరణ కోరుచున్నాను. (ఇప్పుడు కూడా క్రమపద్దతి లో చర్యలు తీసుకోని నిషేధాన్ని వ్యతిరేకిస్తున్నాను, మళ్ళీ సమర్థన అంటారేమో!!)

2) ఇప్పుడు సభ్యుడు:వైవీఎస్‌రెడ్డి పై వారం రోజుల నిషేధం విధించడం కూడా నిబంధలకు విరుద్దమే. నిబంధనలు ఉల్లంఘించిన సభ్యులపై చర్యలకు నేను వ్యతిరేకిని కాను, కాని తీసుకొనే చర్యలు మాత్రం నిబంధనల ప్రకారం క్రమపద్దతిలో ఉండాలి కాని ప్రస్తుత చర్యలు ఆ దిశలో సాగలేవు. నిషేధం విధించే ముందు హెచ్చరిక జారీచేయడం కనీస భాధ్యత. ఎప్పుడో ఒకప్పుడు ఒక రోజు నిషేధం ఎదుర్కొన్నాడనీ, దాన్ని అవకాశంగా తీసుకొని ప్రస్తుతం హెచ్చరిక లేకుండా ఒకేసారిగా వారంరోజుల నిషేధం విధించడం తగునా? అప్పటి చర్చలకు ఇది కొనసాగింపు కాదు అంటూనే అప్పటి నిషేధాన్ని కొనసాగింపుగా ఇప్పుడు వారంరోజుల నిషేధాన్ని విధించడం ఏ మాత్రం సరైనది కాదని నేను గట్టిగా చెప్పగలను. కనీసం అప్పుడు విధించిన నిషేధమైనా నిబంధనల ప్రకారం జరిగిందా అంటే అదీ కాదు. అది నిర్వాహకుల తప్పిదమేనని నేను ఆనాడే చెప్పాను. ఏదో కారణాల వల్ల నిబంధనలకు విరుద్ధంగా ఏడేళ్ళ క్రితం విధించిన ఒకరోజు నిషేధాన్ని సాకుగా తీసుకొని, గత చర్చలకు ఈ చర్చలు కొనసాగింపు కాదు అంటూనే గతంలో నిషేధం ఎదుర్కొన్నాడనీ ఇప్పుడు హెచ్చరిక లేకుండా నిషేధం విధించడాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. ఇలా చేయడం నిర్వాహక తప్పిదం గానూ, నిబంధనలు అతిక్రమించినట్లుగానూ పరిగణిస్తున్నాను.

3) సాక్‌పప్పేట్‌ల గురించి చెబుతూ సభ్యుడు:రవిచంద్ర కేవలం అనుమానంతో ఏకంగా వాడుకరి:JVRKPRASAD పేరు బయటపెట్టేశారు. ఇది చాలా పెద్ద తప్పిదం. విచారణ లేకుండా, ఆధారాలు లేకుండా కేవలం అనుమానంతో ఒకరి పేరును బయటపెట్టడం వివాదాలకు దారితీస్తుంది మరియు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. తెవికీకి కూడా ఇలాంటి చర్యలు నష్టం కలిగించవచ్చు. సుమారు 12 సం.ల క్రితం నాటి అనుభవం చెబుతాను. అప్పుడు సభ్యుడు:సాయి నిర్వాహక ఎన్నిక వివాదంలో సాక్‌పప్పెట్‌గా అనుమానంతో అప్పుడు చురుకుగా ఉన్న నిర్వాహకుడు దేవా సభ్యుడు:రంగారావు పేరును వ్రాసి మళ్ళీ దిద్దుబాటును రద్దుచేశారు. కాని అప్పటికే జరగరాని ఘోరం జరిగింది (చూడండి). చివరికి స్టీవార్డులను సంప్రదిస్తే ఒక సాక్‌పప్పెట్‌గా నిర్వాహకుడైన సభ్యుడు:రవిచంద్ర పేరు బయటపడింది. (చూడండి). ఈ వివాదం వల్ల చురుకైన నిర్వాహకుడు దేవా మరియు సభ్యుడు:రంగారావు ఇద్దరూ తెవికీకి దూరమైనారు. ఇప్పడు సాక్‌పప్పెట్ గురించి చెప్పాలంటే ఆ సభ్యుడెవరో పసిగట్టడం పెద్ద పనేమీ కాదు. కాని ఆధారాలు లేకుండా పేరు బయటపెట్టడం మాత్రం సరికాదు. గత దశాబ్దం నుంచి వివిధ మార్పుపేర్లతో (కొన్ని సార్లు ఐపి అడ్రస్‌తో) రాస్తున్న ఆ సభ్యుడు చాలా సార్లు తెవికీలో జరుగుతున్న పొరపాట్లను బయటపెడ్డడం చూస్తున్నాం. నేను రాసిన వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 39#సరదా సరదాగాలో కూడా ఆ సభ్యుడి రెండు వాక్యాలున్నాయి (సభ్యుడిగా మరియు ఐపీ అడ్రస్‌తో). అసలు సభ్యనామంతో చెబితే సంబంధాలు చెడిపోతాయనే ఉద్దేశ్యంతోనే మారుపేరుతో రావడానికి కారణమేమో! ఇదే అభిప్రాయం గతంలో చర్చలలో నమోదైనట్లు గుర్తుంది. మన "మారుకరి" సీనియర్ సభ్యుడు కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకొనియుంటే స్టీవార్డులకు కూడా చిక్కకపోవచ్చు.

4) మరో సభ్యుడు "నిర్వాహకులు లెక్కకు 10 మందికి పైగా ఉన్నారు.అందరికి భాధ్యత ఉంది.కొంత మంది స్తబ్థతగా ఉంటున్నారు.దాని వలన వికీపీడియాకు ఏమి ప్రయోజనమో ఆలోచించాలి" అంటూ రాశారు. ఇది ఎవరెవరిని ఉద్దేశించి చెప్పబడిందో కాని నిర్వాహకులంటే తమ వ్యక్తిగత పనులు మానుకొని తప్పనిసరిగా తెవికీలో పనిచేయాలని ఏమీలేదు. ఎవరి వ్యక్తిగత ఇబ్బందులు వారికుంటాయి. తెవికీలో పని చేసేవారు చేస్తారు, చూసేవారు చూస్తారు, చదివేవారు చదువుతారు, అంతే. తెవికీలో నిర్వాహకుల హోదా ఉన్నవారిని మిగితా నిర్వాహకులెవరూ పెంచిపోషించడం లేదుకదా! ఇది స్వచ్ఛందంగా చేసే ప్రవృత్తి మాత్రమే. ఇప్పుడు చురుకుగా లేని నిర్వాహకులలో అధికమంది ఒకానొక సమయంలో తెవికీని అభివృద్ధి పర్చడానికి భుజాలనెత్తుకున్నవారే. అప్పుడు నిర్వాహకులు తెవికీని ప్రగతిపథంలో పయనింపజేసి ఈ స్థితికి తెచ్చారనే విషయం కూడా మరవొద్దు. చాలా కాలం నుంచి చురుకుగా లేనట్లయితే ఎలాగూ నిర్వాహక హోదా నుంచి తొలగించబడతారు. అసలు చురుకుగా ఉంటూ కూడా నిర్వాహక పనులు చేయని నిర్వాహకులెవరో వారిపై దృష్టిసారించాలి. నిర్వాహకులు అంటే ఎల్లకాలం తెవికీలోనే కృషిచేయాలనీ, ఇదివరకు చేసింది గ్రహించక ఇప్పుడు మేము చేస్తున్నాము కాబట్టి అందరూ చేయాలనే అభిప్రాయంతో ఉండటం ఏ మాత్రం సరైనదికాదు. ఇప్పుడు చురుకుగా ఉన్న ఒక నిర్వాహకుడు మధ్యలో చాలా కాలం పాటు స్తబ్దుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు స్తబ్దుగా ఉన్నవారు తర్వాతి దశలో చురుకుగా మారవచ్చేమో! లేకుంటే హోదానే కోల్పోతారు, అంతేకాని ఇతరులపై చెప్పడం సరికాదు.

5) ఒక సభ్యుడు చిన్న వ్యాసాలను సిగ్గుపడే వ్యాసాలుగా పేర్కొనడం కూడా జరిగింది. కాని వాస్తవంగా పాఠకులు సిగ్గుపడేది నాణ్యమైన చిన్నవ్యాసాలు కాదు, పెద్దవ్యాసాలలో తాజాకరణలేని అంశాలు, పొరపాట్లు తెవికీలో బోలెడన్ని ఉన్నాయి ("మారుకరి"-మారుపేరుతో వ్రాసే వాడుకరి కూడా ఇటీవల ఇదే విషయాన్ని బయటపెట్టారు). ఆన్‌లైన్ విజ్ఞానసర్వస్వానికి తాజాకరణ అత్యావశక్యం. పెద్దవ్యాసాలు వ్రాసి (కాదుకాదు మక్కికిమక్కిఅనువదించి) పడేస్తున్నారు కాని తాజాకరణకు ఎవరూ పూనుకోవడం లేదు. ఉదా:కు పదేళ్ళ క్రితం మరణించిన వ్యక్తిని కూడా ఇంకనూ దేశాధినేతగానే కీర్తిస్తున్నాం. సిగ్గుపడాల్సింది ఇలాంటి విషయాలలోనే.

6) ప్రతీదానికి ఆంగ్లవికీని ప్రామాణికంగా తీసుకొనే మెజారిటీ నిర్వాహకులు ఈ విషయంలో మాత్రం చిన్న వ్యాసాలపై కఠినంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో సరైన కారణాలు లేవు. తెవికీ అనేది ఏ కొందరి నిర్వాహకుల సొత్తు కాదు. ఇక్కడ రచనలు చేయడానికి అందరికీ హక్కు ఉంది (ప్రామాణిక నిబంధనలకు లోబడి). కేవలం పెద్దవ్యాసాలే ఉండాలనడం ఏ మాత్రం సరైనది కాదు (నాణ్యత కల్గిన చిన్న వ్యాసాలకు కొన్ని మినహాయింపులు ఉండాల్సిందే). కేవలం వ్యాసపరిమాణం ఆధారంగా వ్యాసాలు తొలగించడం వికీపీడియా మూలనిబంధనలకు వ్యతిరేకమని నేను ఎప్పటినుంచో చెబుతున్నాను. అదే కారణంతో సభ్యులపై చర్యలు తీసుకోవడం సమస్య తీవ్రతను పెంచుతుంది. దిద్దుబాట్లు చేసే హక్కు, తమ రచనలు వికీలో చూసుకొనే హక్కు విషయంలో ఎవరినీ కాదనలేము. కొన్ని అంశాలపై పెద్ద వ్యాసం వ్రాయడం కూడా కుదరకపోవచ్చు. పెద్దపెద్ద విజ్ఞాన సర్వస్వాలలో కూడా చిన్నచిన్న వ్యాసాలు మస్తుగా ఉన్నాయి. ఈ విషయంలో తెవికీలో దశాబ్దాల నుంచి ఎడతెగని చర్చలు సాగుతూనే ఉన్నాయి. చిన్న వ్యాసాలపై చర్చలు ఇంకనూ ఒక కొలిక్కి రాలేవు. అలాంటప్పుడు సభ్యులపై, వారి రచించే వ్యాసాలపై చర్యలు తీసుకోవడంలో తొందరెందుకు అన్నదే నా ప్రశ్న. ఈ విషయంలో ఇంకనూ చర్చలు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఇకముందు దీనిపై పాలసీలు ఖచ్చితంగా మారవచ్చు. అలాంటప్పుడు కేవలం పరిమాణం ఆధారంగా వ్యాసాలను తొలగించడం సరైనది కాదు. కేవలం ఒకట్రెండు వాక్యాలున్న అతిచిన్న వ్యాసాలను తొలగించవచ్చేమో కాని సమాచారం లభించని నాణ్యమైన చిన్న వ్యాసాల విషయంలో తొలగింపులు ఏ మాత్రం సరైనది కాదని నేను గతంలో కూడా చెప్పాను. రేపు పాలసీలు మారి నాణ్యమైన చిన్న వ్యాసాలకు మినహాయింపు ఇచ్చినప్పుడు ఇప్పుడు తొలగించిన నాణ్యమైన చిన్న వ్యాసాల సంగతి ఏమిటి? ఈ సభ్యుల దిద్దుబాట్ల హక్కును హరించినట్లుగా ఎందుకు భావించరాదు? చర్చలు కూడా ఒక కొలిక్కి రానప్పుడు, మూలనిబంధనలకు వ్యతిరేకమైన పాలసీలు ఉన్నప్పుడు దాని ప్రకారం తీవ్రచర్యలు తీసుకోవడం సరైనదేనా? సి. చంద్ర కాంత రావు- చర్చ 06:20, 24 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

@C.Chandra Kanth Rao: గారూ, "నాణ్యమైన చిన్న వ్యాసాలకు" అంటే ఏమిటన్నది తెలియట్లేదండీ. మీ ఉద్దేశంలో అలాంటి నాణ్యమైన చిన్న వ్యాసం ఏదైనా వై.వి.ఎస్.రెడ్డి గారు ప్రారంభించినవాటిలో తొలగింపుకు గురై ఉంటే ఉదాహరణ ఇస్తారా? --పవన్ సంతోష్ (చర్చ) 07:32, 24 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
సాక్ పప్పెట్ విషయంలో నేను చేసిన ప్రతిపాదన విషయంలో నా మనసులో ఉన్న అనుమానం ఉన్నదున్నట్టుగా బయట పెట్టాను. దానికి కారణాలు కూడా వివరించాను. దానికి సంబంధించిన పర్యవసానాలకు బాధ్యుణ్ణి నేను. ఇదేదో పెద్ద తప్పు అని నేను భావించడం లేదు. -- రవిచంద్ర (చర్చ) 07:47, 24 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
@పవన్ సంతోష్ నేను వ్రాసిన పై విషయాలన్నీ వాడుకరి:రెడ్డికి సంబంధం లేవండి. నేనేమీ ఆయనకు సమర్థకుడిని కాదు అని స్పష్టంగానే చెప్పాను కదా! ఇటీవలి పరిణామాల లోటుపాట్లపై, దాని ఆధారంగా మాత్రమే చర్చ తీశాను. నాణ్యమైన చిన్న వ్యాసాల గురించి నేను ఇదివరకే చాలా సార్లు సందర్భానుసారం చెప్పాను. ఇప్పుడు మళ్ళీ చెప్పాలంటే నా చర్చాపేజీలోనే జాన్ రిచర్డ్ హిక్స్ వ్యాసం తొలగింపు ప్రతిపాదన వచ్చింది. తొలగింపుకు రెండే కారణాలు. ఒకటి మొలక అనీ, రెండోది మూలాలు లేవనీ. మొలకపై స్పష్టమైన నిర్వచనం లేనప్పుడు ఇది మొలక అని ఏ విధంగా నిర్థారిస్తారు. ఉన్న 5 వాక్యాలు మంచి సమాచారం ఇచ్చేవిగా లేవా? ఇందులో తప్పుడు సమాచారం గాని, పొరపాట్లుగాని ఉన్నాయా? కనీసం ఈ 5 వాక్యాల సమాచారమైనా పాఠకులకు ఎందుకు అందుబాటులో ఉంచరాదు. ఈ వ్యాసం వల్ల తెవికీకీ ఏమైనా నష్టమా? ఇప్పుడు ఈ వ్యాసం తొలగిస్తే తెవికీకి కలిగే ప్రయోజనమేమిటి? ఇలాంటి వ్యాసాల తొలగింపు వల్ల నష్టమే తప్ప ప్రయోజనం ఏమీ లేదనీ గతంలో చెప్పాను కూడా. నాణ్యమైన చిన్న వ్యాసాలంటే ఇవేనండి. ఇక మూలాల గురించి చెప్పాలంటే వ్యాసంలో ఏ వాక్యం కూడా అభ్యంతరంగా లేదు. వికీపీడియా ఐదు మూలస్తంభాలలో రెండోది ఏమి చెబుతుంది? " ... అవసరమైన చోట ... మరీ ముఖ్యంగా, వివాదాస్పద విషయాల్లో ..." అని మాత్రమేగా! వ్యాసంలో మూలాలు ఉండుట మంచిదే కాని అవి లేనంత మాత్రాన ఆ కారణంతో నాన్యమైన చిన్న వ్యాసం తొలగింపుకు గురయ్యే పరిస్థితి మాత్రం ఉండరాదు. వాక్యాలపై ఎవరికైనా అభ్యంతరం ఉంటే ఆధారం కోరబడింది మూస ఉంచవచ్చు. వాక్యాలు తొలగించవచ్చు. కొత్త సభ్యులకు మూలాల గురించి సాధారణంగా తెలియదు. మరి అలాంటప్పుడు వారు రచించే వ్యాసాలన్నీ తొలగించాలా? సి. చంద్ర కాంత రావు- చర్చ 08:34, 24 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
@రవిచంద్ర మీరు రాసిన దానికి మీరు బాధ్యులే కావచ్చు. కాని ఇది నలుగురు కలిసి పనిచేసే వ్యవస్థ. ఇలాంటి చర్యలవల్ల తెవికీకి నష్టం జరుగుతుందనీ, గత్ అనుభవాన్ని ఆధారాలతో వివరించాను. అప్పుడు తొందరపడి కేవలం అనుమానంతో ఒక నిర్వాహకుడు ఒక సభ్యుడి పేరు ప్రస్తావించడం వల్ల చురుకైన ఇద్దరు సభ్యులను తెవికీ కోల్పోయిన సంఘటన తెలుసు కదా! ఈ పాయింటు వ్రాయడానికి అదే కారణం. సి. చంద్ర కాంత రావు- చర్చ
జాన్ రిచర్డ్ హిక్స్ వ్యాసం 2007 నుండి తొలగింపు మూస పెట్టేనాటికి రెండు వరుసలు మాత్రమే. ఎటువంటి మూలాలు లేవు. 2013లో మనం ఆమోదించిన మొలకల నియంత్రణ విధానంప్రకారం దానిని తొలగించాలి. తెవికీలో ఏ వ్యాసం అనవసరంగా తొలగించడం నిర్వాహకుల ఉద్దేశ్యం కాదు. విస్తరించలేని, సమాచారం లభ్యం కాని వ్యాసాలు మొలకలుగా ఉండవచ్చని నా అభిప్రాయం. ఈ వ్యాసం 2007 నుండి అలాగే ఉంది. ఎవరూ విస్తరించలేదు. "ఇది తొలగించడం వలన వికీకి ఏదైనా ప్రయోజనం చేకూరుస్తుందంటే తప్పకుండా తొలగించవచ్చు" అని తెలియజేసారు. అవును, ప్రయోజనం చేకూరదు. కానీ ఈ రెండు వాక్యాలు గల వ్యాసాలను భవిష్యత్తులో ఇతర వాడుకరులు ప్రమాణంగా తీసుకొని విపరీతమైన మొలకలను సృష్టిస్తారు. మూలాలు లేని వ్యాసాలను పరిగణనలోకి తీసుకోవచ్చా? మూలాలు లేని ఆ ఐదు వాక్యాలు సరైనవని ఎలా నిర్థారిస్థారు. మనం అనుకుంటే సరిపోతుందా? అవి సరైన వాక్యాలే, మూలాల గురించి ప్రస్తావనలు అక్కరలేదు అని భావిస్తే చాలా మంది వాడుకరులు స్వంతంగా వారికి తెలిసిన నాలుగు వాక్యాలను వ్యాసాలుగా చేరుస్తారు. ఈ మొలక వ్యాసాల అభివృద్ధి లో భాగంగా మేము 2020 ఏప్రియల్ నెలలో అనేక వందల మొలక వ్యాసాలను ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేసాము. ఇందులో అందరి వాడుకరులు సృష్టించిన వ్యాసాలూ ఉన్నాయి. తొలగింపు మూస పెట్టడంలో ఉద్దేశ్యం దీనిని కొంతవరకు విస్తరించి మూలాలు చేరుస్తారని. నిర్వాహకులుగా మనం "మూలాలు లేకపోయినా ఫరవాలేదు. సమాచారం ఒకటి రెండు వాక్యాలు ఉన్నా ఫరవాలేదు" అని సూచనలిస్తే చాలా మంది వాడుకరులు ఇలాంటి మొలకలను విపరీతంగా సృష్టించే అవకాశం ఉంది. ప్రస్తుతం అర్థంకాని గూగుల్ అనువాద వ్యాసాలను సృష్టిస్తూ, అనవసర వాదనలు చేస్తున్న వాడుకరులను చూస్తున్నాము. వ్యాసం శుద్ధి చేయండి అని అడిగితే మేము వ్యాసాలు ఎలాగో రాస్తూ పోతుంటాము, నిర్వాహకులుగా మీరు శుద్ధి చేయండి. అని ఒక వాడుకరి ప్రశ్నించాడు. ఎన్ని వ్యాసాలని నిర్వాహకులు సమీక్షించగలరు? K.Venkataramana(talk) 10:15, 24 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

@వెంకటరమణ మీరన్నట్లు అది రెండు వాక్యాల వ్యాసం కాదు, 2007 నుంచి ఐదు వాక్యాలున్నాయందులో. నేను వ్యాసం రాస్తున్న సమయంలోనే ఆ వ్యాసపు రెండో దిద్దుబాటు ద్వారానే మొలక మూసను నేనే పెట్టాను. అది 5 వాక్యాల చిన్న వ్యాసం అని ఒప్పుకుంటాను కాని అలాంటి తక్కువ పరిమాణం కల వ్యాసాల తొలగింపు విషయంలో మినహాయింపులకై కూడా ఎప్పటినుంచో చెబుతున్నాను. ఎప్పుడూ చిన్న వ్యాసాలను సృష్టించే సభ్యుడికీ, పెద్ద వ్యాసాలను షృష్టిస్తూ తెవికీ అభివృద్ధిలో భాగంగా ఆ సభ్యుడి నుంచి జాలువారే కొన్ని చిన్న వ్యాసాలకు (ఒకట్రెండు వాక్యాల వ్యాసాలకు కాదు) తేడా ఉంటుందనీ కూడా నేను సంవత్సరాల నుంచి చర్చలలో చెప్తున్నాను. ఇక మూలాల విషయానికి వస్తే అసలు మూలం యొక్క ముఖ్యోద్దేశ్యం ఆ సమాచారం సభ్యుడు స్వంతంగా వ్రాయలేడనీ, ఏ ఒక్క చోటు నుంచి కాపీ చేయలేడనీ, పలు ఆధారాల నుంచి సమాచారం సేకరించాడనీ, సమాచారం సభ్యుడి స్వంత అభిప్రాయం కాదనీ, సమాచారంలో ఏదేనీ అభ్యంతరకర సమాచారం ఉన్నచో ఆ సమాచారం ఫలానా చోటు నుంచి తీసుకున్నాననీ ... ఇలా తెల్పడానికే మూలాలు ఉంచాల్సి ఉంటుంది. ఒక సభ్యుడు పెద్ద పరిమాణం కల సమాచారంను ఏదోసైట్ నుంచి కాపీ చేసి మూలం కూడా సూచించిననూ (అది పరిమాణం కల్గిన వ్యాసమూ, మూలం కల్గిన వ్యాసమూ అయిననూ) తక్షణమే తొలగించాల్సిన వ్యాసమే అవుతుంది. అందరు సభ్యులను ఒకే గాటన కట్టడం సరికాదని కూడా నేను ఏనాడో చెప్పాను. వారు తెవికీకి చేసి అభివృద్ధి పనులను కూడా చూడాలి. ఒక కొత్త సభ్యుడికి సంవత్సరాల నుంచి తెవికీకి సేవ చేసే సభ్యుడికి తేడా ఉంటుంది. ఎప్పుడూ చిన్న వ్యాసాలు సృష్టించే సభ్యుడికీ, తెవికీ అభివృద్ధిలో భాగంగా ఆయన సృష్టించిన చిన్న వ్యాసాలకు తేడా ఉంటుంది. ప్రస్తుతం మొలకలపై నియమాలు స్పష్టంగా లేవు, వాటిపై సమీక్షించడం అవసరం. ముందుగా మొలకల సీనియారిటీ పట్టికను తయారుచేసుకొని వాటి ప్రకారం (మినహాయింపు వ్యాసాలు పోగా) తొలగింపులు చేయాలి. సభ్యులపై చర్యలు తీసుకుంటూ పోతే తెవికీలో వ్రాసేవారు ఎవరూ మిగలరు. ఇప్పుడున్న సభ్యులలో కూడా అభద్రతాభావం ఏర్పడవచ్చు. ఇది తెవికీకి చాలా ప్రమాదకరమైన పరిస్థితి. సి. చంద్ర కాంత రావు- చర్చ 11:30, 24 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా విధానాలు అందరికీ ఒకటే అనే భావనతో నిర్వాహకుల మొలక వ్యాసాలు కూడా చాలా తొలగించబడ్డాయి. అదే విధంగా కొందరు నిర్వాహకులు కూడా తమ మొలక వ్యాసాలను నియమాలకు విరుద్ధంగా ఉంటే తొలగించమని కోరారు. ఇక్కడ తొలగించడమే నిర్వాహకుల పని కాదు కదా. అలాగని ప్రాజెక్టులు చేస్తూ అనేక మొలక వ్యాసాలను విస్తరించామనే విషయాన్ని గమనించాలి. కొత్త వాడుకరి ఐదు వాక్యాలు గల వ్యాసాన్ని సృష్టించి మూలాలు చేర్చకుండా ఉంటే, దానిని నిర్వాహకుడు ప్రశ్నిస్తే మీ వ్యాసాలు కూడా అనేకం ఉన్నాయి, వాటిని ముందు సమీక్షించండి అనే అడుగుతారు. అందరికీ ఒకే నియమాలు ఉండాలి. మనం అనేక సంవత్సరాలుగా వికీలో పనిచేస్తున్న మాత్రాన మొలక వ్యాసాలు రాస్తే ఫరవాలేదంటే ఎలా? మనం కొత్త వాడుకరులకు ఆదర్శంగా ఉండాలి. మనం మన వ్యాసాలను విస్తరిస్తే గదా కొత్త వారికి చెప్పగలం. అందుకే మొదట ఎవరి మొలకలను వారు అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని చేసాం. కొంతమంది ఏదో కారణాల వల్ల చేయలేకపోయారు. వారి వ్యాసాలను కూడా విస్తరించాం. అందరూ వికీ అభివృద్ధికి తోడ్పడుతున్నారు గానీ ఇందులో వ్యక్తిగత స్వార్థం ఏముంది? K.Venkataramana(talk) 13:07, 24 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
నా అభిప్రాయాలు ముందు నుంచి స్పష్టంగానే చెబుతున్నాను. ఎవరో అడిగిప్పుడు చెప్పడానికి నియమాలు కూడా స్పష్టంగానే ఉండాలి. మొలక వ్యాసాల తొలగింపునకు కూడా స్పష్టమైన మినహాయింపులు ఉన్నప్పుడు ఎవరికీ భయపడే అవసరం ఉండదు. ఆ స్పష్టమైన నిబంధనల కోసమే నేను కోరుచున్నాను (అంతవరకు కఠిన చర్యలకూ వ్యతిరేకినే). నేను కేవలం ఒక్క వ్యాసం కోసం పట్టుబడలేను (ఉదా: కోసం ఆ వ్యాసం చూపించాను అంతే). ఒక ఆర్థికశాస్త్ర వ్యాసాన్ని అభివృద్ధి చేయాలంటే నాకు చిటికెలో పని, కాని అలాంటివి వందలాదిగా (ఉండొచ్చు?) ఉన్న ఐదు-పది వాక్యాల వ్యాసాల కోసమే నా ప్రయత్నం. ఒకట్రెండు వాక్యాల వ్యాసాల విషయంలో నాకెలాంటి అభ్యంతరం లేదు. ఐదువాక్యాల వ్యాసాలు ఎవరు వ్రాసిననూ తొలగింపునకు నాకు వ్యక్తిగతంగా ఇష్టంలేదు. ఇదింకనూ అభివృద్ధి చెందుతున్న వికీనే కాబట్టి వ్యాస పరిమాణంపై ఇలాంటి కఠిన నియమాలు అవసరం లేదనుకుంటా. కొత్త వాడుకరులకు ఆదర్శంగా ఉండాలంటే సీనియర్ సభ్యులు కొత్తవారికి ప్రోత్సాహం అందిస్తూ వ్యాస అభివృద్ధికి తోడ్పడాలి అంతేకాని వారు సృష్టించే చిన్న వ్యాసాలను తొలగించడం కాదుకదా! ఉద్దేశ్యపూర్వకంగా అన్నీ చిన్న వ్యాసాలను సృష్టించే సభ్యులపై మాత్రం క్రమపద్దతిలో చర్యలు తీసుకోవచ్చు. లక్షలు చేతులుమారే గూగుల్ అనువాదవ్యాసాలపై కారుణ్యం చూపే అవసరం ఏ మాత్రంలేదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:42, 24 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అలాగే చంద్రకాంతరావు గారూ, మొలకల తొలగింపు విషయం కాస్త పక్కన పెడదాం, ముందు మీరు మూలాల ఆవశ్యకత గురించి వెలిబుచ్చిన అభిప్రాయాలు కూడా విజ్ఞాన సర్వస్వ నిర్మాణానికి తగినట్టుగా లేవు. ఒక వ్యాసంలో మూలాలు ఎందుకు ఉండాలి? అన్నదానిపైనే మీరొక కొత్త ధోరణిలో వాదన తీసుకువచ్చినప్పుడు ఇప్పుడు అభిప్రాయం రాయాలన్నా ఏవేవో విషయాలు కలగాపులగంగా మాట్లాడుతున్నదున వేరే విషయం టకీమని ముందుకు రావడం, తద్వారా చర్చ వేరే మార్గం పట్టడం, దానికి మళ్ళీ చర్చ పెరుగుతూ ఫలోన్ముఖంగా సాగకపోవడం జరుగుతుందన్నది నాకు అనుభవం రీత్యా తెలిసిన సంగతే. కాబట్టి, మీరు చెప్పినట్టుగానే స్పష్టంగా ఉంటే మంచిది కదా. ఒక వారం రోజుల్లోగా మూలాల ఆవశ్యకతకు సంబంధించి ఒక విధాన ప్రతిపాదనను మూలస్తంభాలు, విజ్ఞాన శాస్త్ర నిర్మాణం వంటి విషయాల ఆధారంగా రూపొందిస్తాను. ఏమైనా చర్చించాల్సినవి ఉంటే అక్కడ చర్చించండి. --పవన్ సంతోష్ (చర్చ) 14:59, 24 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
@K.Venkataramana: గారూ, ఇప్పటికే మొలకల విధానం స్ఫుటంగా ఉంటే దాని లింకు ఇక్కడే ఇచ్చి ఈ చర్చ మనవైపు నుంచి ముగించేద్దాం. ఆ లింకు చర్చా పేజీపై తమ అభ్యంతరాలపై సాధ్యమైనంత సూటిగా చంద్రకాంతరావు గారు చర్చ ప్రారంభిస్తే అక్కడే మాట్లాడదాం విడిగా. ఒకవేళ ఇప్పటివరకూ జరిగిన చర్చలు విధాన పేజీ రూపం తీసుకోనట్టైతే మీరు లీడ్ తీసుకుని రాసినా మంచిదే, లేదూ జరిగిన చర్చలు చూసిపెట్టి లింకులు ఇచ్చినా ఓకే. దానిని విధాన పేజీగా రూపొందిద్దాం. అప్పుడు చంద్రకాంతరావు గారు తన అభిప్రాయం ఏమిటన్నది అక్కడ చర్చ పేజీలో వెల్లడిస్తారు. ఏమంటారు? --పవన్ సంతోష్ (చర్చ) 15:03, 24 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
కార్యోన్ముఖంగా లేకుండా, ఇలా చెదురుమదురుగా అనేకానేక విషయాలు కలగాపులగంగా అభిప్రాయాలు వెల్లడించడం, దానిపై ఖండించడం - ఈ సర్కిల్ వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు కాబట్టి ఈ ప్రతిపాదన చేస్తున్నాను. ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 15:05, 24 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
@పవన్ సంతోష్, మూలాల గురించి నా అభిప్రాయాలు నచ్చలేవంటున్నారు కాని నా స్వంత అభిప్రాయం ఏమీ చెప్పలేను. గత అనుభవం ప్రకారం చెప్పాలంటే నా చర్చలను మీరు అర్థం చేసుకోరు. ఇంతకుమించి ఇప్పటికైతే ఏమీ చెప్పలేను. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:10, 24 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

నా అభిప్రాయం విమానాశ్రయం రిచ్చిగా ఉండాలని ఒక విమానంలో (తెలుగు వికీపీడియాలో) ప్రయాణికులం మనం టికెట్ తీసుకున్న సీట్లు ఈరోజు మనవి మరో రోజుకి ఎవరికీ సీట్లు మనకే తెలియదు కూడా, అంతే ఈరోజు తెలుగు వికీపీడియాలో మనం ఉన్నాం, తర్వాత వారిని ఊహించలేం కావున పెద్దలు సమయాన్ని వృధా చేయకుండా నియమాలు పాటిస్తూ ఎంతో అనుభవం ఉన్న మీ నుండి ఎన్నో మంచి మంచి వ్యాసాలను ఆశిస్తున్నాను, ఇది ఎవరి సొంతం కాదు కాబట్టి వికీపీడియాకు సేవలు అందించండి ఒకరి మీద ఒకరికి కోపం తో భావితరాలకు మీ సేవలను దూరం చేయకండి వాస్తవంగా ఒకరికి ఒకరి ఎవరో మనకే తెలియదు అందుకే విమానం ప్రయాణం తో పోలిక చేశా మీ సేవలు అందించండి...ప్రభాకర్ గౌడ్ నోముల 19:15, 24 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

మొత్తానికి చంద్రకాంతరావు గారు చెప్పేది ఏమంటే ఆయన అనదలుచుకున్నది ఏదో అనేశారు. ఇప్పుడు నేను ఏదైనా కార్యోన్ముఖంగా పాలసీ పేజీ రూపొందిస్తాను, చర్చిస్తారా అంటే "నా చర్చలను మీరు అర్థం చేసుకోరు" అనేసి ఊరుకుంటారు. మళ్ళీ ఎప్పుడైనా అనదలుచుకున్నప్పుడు వచ్చి మనకు సరైన పాలసీలు లేవు, అదీ ఇదీ అని చర్యలు తీసుకుంటూ తమ సమయాన్ని వెచ్చిస్తున్నవారిని విమర్శిస్తారు. ఇదీ విషయం. స్వస్తి. మంగళం మహత్ శ్రీశ్రీశ్రీ. --పవన్ సంతోష్ (చర్చ) 06:33, 25 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
@పవన్ సంతోష్, మీతో చర్చలు జరిపితే నేను చెప్పే విషయాన్ని మీరు అర్థం చేసుకోకుండా అసలు విషయాన్ని వదిలి చర్చను డైవర్ట్ చేసి ఎక్కడెక్కడో తోసుకెళతారని నా అనుభవం చెబుతుంది. కాబట్టి ఇక్కడ అదే విషయాన్ని క్లుప్తంగా చెప్పి ఇదే పేజీలో పైన కొత్త వ్యాసాలకు నిబంధనలో జరుగుతున్న మూలాలపైన చర్చలలో నా అభిప్రాయం సంక్షిప్తంగా చెప్పాను. కొత్తగా చర్చను ప్రారంభిస్తే పూర్తివివరాలు చెప్పగలనని కూడా తెవికీ సమూహానికి వివరించాను. గమనించగలరు. సి. చంద్ర కాంత రావు- చర్చ 12:31, 25 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
"ఒక వారం రోజుల్లోగా మూలాల ఆవశ్యకతకు సంబంధించి ఒక విధాన ప్రతిపాదనను మూలస్తంభాలు, విజ్ఞాన శాస్త్ర నిర్మాణం వంటి విషయాల ఆధారంగా రూపొందిస్తాను." అని నేను ప్రతిపాదించాను. సాధారణంగా ఇలా ఏదైనా నిర్మాణాత్మకమైన పని చేస్తానని ఒకరు ముందుకువస్తే తెలుగు వికీపీడియాలో ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇప్పటికిప్పుడు తాము చేయలేకపోతున్నప్పుడు పక్కవారు చేస్తామన్నప్పుడు కనీసం ప్రోత్సాహించడం వల్ల "నాది నాది అని చెప్పుకునే వికీపీడియాకు ఎంతో కొంత మేలు చేసినట్టు అవుతుంది. మీరు మాత్రం నా మీద ఆరోపణలు చేస్తున్నారు. శభాష్! చక్కని కృషి. --పవన్ సంతోష్ (చర్చ) 16:25, 25 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి స్పందన

చంద్రకాంతరావు గారి విమర్శలకు స్పందన రాద్దామంటే ఆ విభాగం బాగా పెరిగిపోవడం వల్లనో ఏమోగానీ.. నా బ్రౌజర్లో పేజీ సరిగ్గా స్పందించడం లేదు. అందుకే ఈ ఉపవిభాగం.

చంద్రకాంతరావు గారూ, మీ విమర్శలపై ఒక్కో పాయింటు గురించి రాస్తాను.

1. ముందుగా మొదటి పాయింటు గురించి.. మీరు అపార్థం చేసుకోకుండా ఉండేలా చెప్పలేకపోయాను. ఇప్పుడు చెబుతా... నేను గమనించినంతలో ఆ రోజుల్లో మరే వాడుకరి కూడా రెడ్డి గారికి అనుకూలంగా మీ అంత మాట్టాడలేదు. "రెడ్డి గారికి అత్యంత అనుకూలుడైన వాడుకరే వ్యాసాలను విస్తరించాలని సలహా ఇచ్చారు. అదే సలహా ఇప్పుడు నిర్వాహకులూ ఇచ్చారు" అని చెప్పడం నా ఉద్దేశం. అది మీపై (చంద్రకాంతరావు గారిపై) విమర్శ కాదు. "మీపట్ల సానుకూలంగా ఉన్న వ్యక్తి కూడా మీరు చేసిన పని తప్పనే చెప్పారు చూడండి" అని రెడ్డి గారికి చెప్పడం నా ఉద్దేశం. అది మీపై సానుకూలతే గానీ ప్రతికూలంగా కాదు. ఇక మీరు "సంప్రదింపులు లేవు, సంబంధాలు లేవు..." అంటూ ఏవేవో చెప్పుకుపోయారు. అవన్నీ నాకు అనవసరం. వికీలో మీరు ఏంచేస్తారు అనే దాంతోనే నాకు పట్టింపు. వికీ వెనక మీరేంటో నాకు చెప్పొద్దు. నాకు అవన్నీ వినేంత సమయం లేదు.

2. రెడ్డి గారి మీద చర్య గురించి ముందే హెచ్చరిక చెయ్యలేదని అన్నారు. 1. వికీ నియమాలను పాటించకపోతే ప్రస్తుతానికి వ్యాసాలమీద తీసుకుంటున్న చర్యను వాడుకరి మీద కూడా తీసుకోవలసిరావచ్చు 2. ..ఇది హద్దు. ఇప్పటికే మీరు చాలా అవకాశాలను తీసుకున్నారు. ఇకపై అవకాశాలు మీకు లభించవు. గమనించగలరు. 3. వైవిఎస్‌ రెడ్డి గారిపై చర్య తీసుకోవడం గురించి చేసిన చర్చ వీటికి అర్థాలేమిటి? ఇవి హెచ్చరికలు కాకపోతే ఏంటి? ఓపక్క ఇవ్వన్నీ ఉండగా హెచ్చరించలేదు అంటారేంటి? ఏం జరిగిందో అంతా చూసి కూడా, అన్నీ తెలిసి కూడా, అందులో మీకు అనువుగా లేనివాటిని పక్కన పడేసి, నచ్చింది మాత్రమే తీసుకుని మీ ప్రయోజనాలకు అనుగుణంగా వాడేసుకుంటానంటే కుదరదు రావు గారూ.

3. "విచారణ లేకుండా, ఆధారాలు లేకుండా కేవలం అనుమానంతో ఒకరి పేరును బయటపెట్టడం వివాదాలకు దారితీస్తుంది" - విచారణ లేకుండా పేరు బయట పెట్టకూడదా? ముందు విచారణ చేసేసి ఆ తరవాత అనుమానాలు బైటపెడతారా!!? ఏంటీ చోద్యం? విచారణ చెయ్యాలంటే పేరు చెప్పాలి కదా? ఎవరి మీద విచారణ చేస్తారు? ఏమన్నా అర్థముందా మీరు మాట్టాడేదానికి? బండికి వెనకాల ఎద్దుల్ని కట్టడమంటే ఇదే. రవిచంద్ర గారు పేరు చెప్పారు, తన అనుమానానికి హేతువూ చెప్పారు. సాక్ పపెట్ల విషయంలో అనుమానం ఉన్న పేరును బయట పెట్టడంలో తప్పేమీ లేదు. ఆయన మీలాగా మారుకరి అనో వేరుకరి అనో దొంగదెబ్బ తియ్యలా. షంషేరుగా, సూటిగా చెప్పారు. రవిచంద్ర గారిని నేను అభినందిస్తున్నాను. ఆయన ప్రసాదు గారి పేరు చెప్పినందుకు మీరు భయపెట్టనక్కర్లేదు కూడా. ఎందుకంటే ప్రసాదు గారు సాక్ కాదని ఇక్కడే దాదాపు తేలిపోయింది. ఆవిధంగా ఆయనకు మంచే జరిగింది.

4. "తెవికీలో పని చేసేవారు చేస్తారు, చూసేవారు చూస్తారు, చదివేవారు చదువుతారు," - ఇది మాత్రం బానే చెప్పారు. రంధ్రాన్వేషకుడు రంధ్రాన్వేషణ చేస్తారు అని కూడా చేర్చాలి.

5. అసలు సిగ్గుపడాల్సింది ఎవరంటే.. తాను పని చెయ్యకుండా, పని చేసేవాళ్ళపై దాడి చేస్తూ వారిని డీమోరలైజు చేసిన వాళ్ళు.

6."వ్యాసపరిమాణం ఆధారంగా వ్యాసాలు తొలగించడం వికీపీడియా మూలనిబంధనలకు వ్యతిరేకమని నేను ఎప్పటినుంచో చెబుతున్నాను." - మనమేం చెబుతున్నామో ఎప్పట్నుంచి చెబుతున్నామో సముదాయానికి అక్కర్లేదు. వికీలో విధానం ఏం చెబుతోంది అనేది సముదాయానికి ముఖ్యం. ఒకసారి విధానం ఏర్పడ్డాక, మీ అభిప్రాయం ఏదైనా సరే.., దాన్ని పక్కన పెట్టాల్సిందే, విధానాన్ని పాటించి తీరాల్సిందే. ఇది మనకుండాల్సిన కనీస మాత్రపు అవగాహన.

"అలాంటప్పుడు సభ్యులపై, వారి రచించే వ్యాసాలపై చర్యలు తీసుకోవడంలో తొందరెందుకు అన్నదే నా ప్రశ్న" -ఇదొక ప్రశ్నా!!? రెండేళ్ళు, ఐదేళ్ళు, పదేళ్ళు, పన్నెండేళ్ళు.. నిర్వహణ మూసలు పెట్టాక, ఏ మార్పులూ లేకుండా వ్యాసాలు అలాగే పడి ఉన్న కాలం ఇది. అయినా తొందరెందుకు అని అడుగుతున్నారు. ఎన్నేళ్ళాగుదాం.. పాతిక? పోనీ యాభయ్యేళ్ళు?

ఈ మధ్య మీ తీరు ఎలా ఉంటోందో గమనించుకోండి. ఏదో ఒక వంక పెట్టి నిర్వాహకులపై దుమ్మెత్తి పోయడానికి వస్తారు. లేనిపోనివి కల్పించి (హెచ్చరించకుండానే నిరోధించానని నన్ను విమర్శించినట్టు) పేరాలకు పేరాలు రాసేసి పోతారు. నిర్మాణాత్మక విమర్శ అయితే ఒక్క వాక్యం రాసినా అది ఆయా వాడుకరులకూ ఉపయోగపడుతుంది, తద్వారా వికీకీ ఉపయోగపడుతుంది. కానీ ఇలాంటి బురద జల్లే కార్యక్రమాల వల్ల ఉపయోగం లేదు సరికదా.. పనిచేసేవాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. మీ లక్ష్యం అదే అయితే, ఈ లక్ష్య సాధనలో మీరు ఇంకా విజయం సాధించలేదు. కానీ మీరు ఇదే ధోరణి కొనసాగిస్తే ఏదో ఒకరోజు మీరది సాధించగలిగే ప్రమాదం ఉంది. దయచేసి ఆపండి.

ఒక వాడుకరి ఇలా అన్నాడు, ఒక నిర్వాహకుడు అలా రాసాడు అంటూనో, మారుకరి అనో వేరుకరి అనో పేర్లుపెట్టి నర్మగర్భంగా ఏంటీ విమర్శలు? నేరుగా పేరుపెట్టి చెప్పవచ్చు కదా.. ఈ ముసుగులెందుకు? ఇలా దొంగదెబ్బ తీయడమెందుకు? మెచ్చుకునే పనైతే అలా పేరు పెట్టకుండా చేసినా పర్లేదు. మారుపేరు కల్పించి మెచ్చుకున్నా ఎవరికీ నష్టం లేదు. కానీ విమర్శకు ఈ ముసుగు లెందుకు? మీరు చేసే విమర్శల పట్ల మీరే ఆ మాత్రపు కనీస బాధ్యత తీసుకోకపోతే ఎట్లా?

మీరు బాధ్యత తీసుకోరు అనే మాట ఊరికే అన్నది కాదు, మీరు చేస్తున్న పనులు బాధ్యతకు బహు దూరంగా ఉంటున్నై. ఇది నేను తగు ఆధారాలతోనే అన్నాను. కొన్ని ఉదాహరణలు కూడా ఇస్తాను చూడండి:

  1. ఒక మండలం లోని గ్రామాలన్నీ సముద్ర మట్టం నుండి ఒకే ఎత్తులో ఉన్నాయని రాయడం తప్పు, కొనసాగిస్తే నిరోధిస్తా అని అని భాస్కరనాయుడు గారికి హెచ్చరిక నోటీసులు పెట్టారు మీరు. ఆయన చేసినది తప్పే. కానీ మీరు చేసినదేంటి.. అలాంటి సమాచారాన్నే (సకల జనుల సమ్మె గురించి) అనేక పేజీల్లో చేర్చారు గదా. మీరు చేసిన తప్పే ఇతరులు కూడా చేస్తే వారిపై చర్య తీసుకుంటానని హెచ్చరిక చేస్తారా? కనీసం ఆ సమయంలోనైనా నేను ఈ తప్పు పని చేసాను కనీసం ఇప్పుడైనా సరిచేసుకుంటాను అని అనుకున్నారా? లేదు. సరే, చర్య తీసుకునే హక్కు ఉందని మీరు అనవచ్చు. కానీ నైతికత అనేది ఒకటి లేదూ? ఇదేం నిర్వాహకత్వం? ఇదేం బాధ్యత? పైగా మీరు మరొకరి నిర్వాహకత్వం గురించి వ్యాఖ్యానిస్తారా? నన్నెవరూ అనర్లే అని అనుకున్నారా?
  2. సకల జనుల సమ్మె సమాచారాన్ని చేర్చిన సంగతి రచ్చబండలో చర్చకు వచ్చినపుడు మీరిచ్చిన సమాధానం ఏంటి? చేసిన తప్పును అంగీకరించారా? "అప్పటి పరిస్థితుల" (ఆ పరిస్థితి ఏంటో చెప్పాల్సిన అవసరం ఉందని కూడా భావించలా మీరు) కోసం ఆ సమాచారాన్ని చేర్చి వెంటనే మీ పనైపోయాక తొలగించాలని భావించానని రాసారు. అది వికీ ప్రయోజనం కాదని స్పష్టంగా తెలుస్తోంది, మీ స్వప్రయోజనాల కోసం వికీని వాడేసుకున్నారు. పైగా, ఆ సమాచారం ఇంకా అలాగే ఉండడం "బాధాకరం" అని అన్నారు. తప్పు ఒప్పుకోలా.., "బాధాకరం" అంట! (రాజకీయ నాయకులు "దురదృష్టకరం" అని వ్యాఖ్యానించినట్టు) ఇదండీ.. మీ బాధ్యత!! మీరు చేసిన తప్పు కంటే భాస్కరనాయుడు గారు చేసినది చిన్నది.
  3. పోనీ.. యర్రా రామారావు గారు ఆ సంగతిని రచ్చబండలో లేవనెత్తాక మీరేం చేసారు? ఆ సమాచారాన్ని "ఎవరైనా తొలగించాలని" కోరారు. అప్పుడు కూడా మీ తప్పును సరి చేసుకుందామని తలంచలేదు. తోటి వాడుకరి చర్చకు తెచ్చాక కూడా బాధ్యత తీసుకోలేదు. వాటిని మరెవరైనా తొలగించాలని చెప్పేసి చేతులు దులిపేసుకున్నారు. అది మీ పని, మీరే చెయ్యాల్సిన పని. దాన్ని మరొకరు చెయ్యాలా? మీ "బాధ్యత" ఇలా ఉంది!
  4. మీకున్నది వికీపై బాధ్యత కాదు. కొంతమంది నిర్వాహకులపై ద్వేషం. ఆ కుచ్చితాన్ని మనసులో పెట్టుకుని అప్పుడప్పుడూ ఇలా వచ్చి దుమ్ము చల్లేసి పోతారు. ఫలానా పని చేద్దాం రండి రావు గారూ అంటే మాత్రం ఐపూ అజా లేకుండా పోతారు మళ్ళీ సమాధానం కూడా చెప్పరు. ఉదాహరణకు AWB అనుమతులపై చర్చ కోసం వేరే పేజీ మొదలుపెట్టండి అని మీరు ఒక సలహా పడేసారు. ఆ పనికి మీరే పూనుకోండి సార్ అని నేను మీకు చెప్పాను. అంతే.. ఇక ఆ తరువాత ఆ చర్చలో మళ్ళీ కనబళ్ళా మీరు. ఇదీ మీ బాధ్యత. పనంతా అవతలి వాళ్ళు చెయ్యాలి, మీరు మాత్రం రంధ్రాలు వెతుకుతారు! ఏం పాలసీ సార్!! (అలాంటి పనికి పాల్పడే అగత్యం నాకు మాత్రం పట్టకూడదని కోరుకుంటాను.)

పైన రాసినవి మీ బాధ్యతకు మచ్చులు. ఇక ఇతరులు తమ బాధ్యతను ఎలా తీసుకున్నారో చూద్దాం..

తాము సృష్టించిన మొలకల్లో, అనువాదాల్లో, ఇతర నిర్వహణ అవసరమైన వ్యాసాల్లో ఇతర వాడుకరులు ఎలా స్పందించారో మచ్చుకు కొన్ని చూడండి:

యర్రా రామారావు గారి జాబితాకు సుజాత గారి స్పందన చూడండి. ముందు పని చేసి తరువాత స్పందించారామె. అలాగే వెంకటరమణ గారి స్పందన. అర్జున గారి స్పందన కూడా చూడండి. విశ్వనాధ్ గారి బాధ్యత ఇలా ఉంది. రమణ గారి ప్రతిపాదనకు పవన్ సంతోష్ గారి స్పందన చూసారా? అలాగే, రవిచంద్ర గారు ఏమన్నారో చూడండి. ఇవి మచ్చుకు మాత్రమే. వీళ్లతో మిమ్మల్ని మీరు పోల్చి చూసుకోండి. మీరు వాళ్లపై చల్లుతున్న దుమ్ము సూర్యుడిపై ఊసే ఉమ్ము అని గ్రహించండి. అనేక వేల మొలక వ్యాసాలను వివిధ రంగాల వారీగా విడదీసి చేస్తున్న యర్రా రామారావు గారి కృషిని గమనించారా? మారుపేరుతోటో, మరో పేరుపెట్టో, అసలు పేరే చెప్పకుండానో, నర్మగర్భంగానో మీరు ఇతరులపై దుమ్మెత్తి పోయడాన్ని ఎంచుకుంటే, ఆయన మాత్రం కృషి చెయ్యడాన్ని ఎంచుకున్నారు. వీళ్ళంతా ఏ పొరపాటూ చెయ్యని మహోన్నతులని నేనేమీ కీర్తించడం లేదు. కానీ, ఎలా పనిచెయ్యాలో ఇతరులకు ఆదర్శంగా నిలవగల లక్షణాలు వీళ్ళలో ఉన్నాయి. ఎలా పనిచెయ్యకూడదో ఏది వికీపీడియాకు ఉపయోగపడదో చెప్పేందుకు మీరొక్కరు చాలు. (మళ్ళీ నిరుడు కురిసిన హిమసమూహాలను బైటికి తియ్యకండి.)

నిరుడు కురిసిన హిమసమూహాల గురించి కొంత.. ఒకానొకప్పుడు నేను వికీలో ఎంతో పనిచేసాను, నేను అది చెప్పాను, నేను ఇలా రాసాను, వికీలో చరిత్ర సృష్టించాను, వాడుకరి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు నేను రంగప్రవేశం చేసాను, ఎవరూ పట్టించుకోనపుడు నేను ఒక్కణ్ణే పనిచేసాను.. లాంటి కబుర్లు చెబితే విసుగు కలిగిస్తాయి. ఇప్పుడు చేసింది ఏమీ లేకపోతేనే జనం నిరుటి గొప్పలు చెప్పుకుంటారు. అవి నిరుడు కురిసిన హిమసమూహాలేనని గుర్తుంచుకోవాలి. ఇంకో సంగతి.. మన గొప్ప అవతలోడు చెబితే అదీ గొప్ప. మనమే చెప్పుకుంటే దాన్ని స్వోత్కర్ష అంటారు. స్వకుచ మర్దనం అని కూడా అంటారు.

సముదాయానికి

స్పందన చాలా పెద్దదై పోయింది, మన్నించండి.

ఆంగ్లవికీని ప్రామాణికంగా తీసుకొనే మెజారిటీ నిర్వాహకులు ఈ విషయంలో మాత్రం చిన్న వ్యాసాలపై కఠినంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో సరైన కారణాలు లేవు. అంటూ చంద్రకాంతరావు గారు, పనికొచ్చే సంగతి ఒకటి రాసారు. ఆంగ్ల వికీలో ఒకరు సృష్టించిన వ్యాసాన్ని మెరుగుపరచేందుకూ, విస్తరించేందుకూ ఇతరులు ఉంటారు, చేస్తారు. మనకు అలా కాదు. తెవికీలో వాడుకరుల సంఖ్య చాలా చాలా తక్కువ. విస్తరణ, శుద్ధి, అనువాదం వంటి నిర్వహణ మూసలు అనేకం పెడుతూ ఉన్నాం మనం. కొన్ని వ్యాసాలకైతే, పలు సమస్యలున్నయంటూ ఒకటి కంటే ఎక్కువ మూసలు పెట్టడం కూడా చేసాం, చూసాం. కానీ ఎన్నిటికి సంబంధిత సవరణలు జరిగాయి.. పెద్దగా జరగలేదు. నిర్వహణ అవసరమైన పేజీలు వందలూ వేలూ ఉన్నాయి. నిర్వహణ మూసలు పెట్టమని సలహాలివ్వడం బహు తేలిక. కానీ ఆ మూసలు పెట్టినా ఆ పనులు కావు. ఎందుకంటే మన దగ్గర ఉన్న వాడుకరుల సంఖ్య చాలా తక్కువ. ఆ నోటీసులు పెట్టిన వ్యాసాలు ఏళ్ళకేళ్ళు అలాగే పడి ఉంటున్నాయి. వాటిని సృష్టించిన వాడుకరులు కూడా వాటిని విస్తరించేందుకు, మూలాలను చేర్చేందుకూ ముందుకు రాకపోతే ఏం చెయ్యాలి? వెంకటరమణ గారి లాగా, ఇతరుల్లాగా చేతనైనంతలో తగు మార్పులు చేసి, తన వల్ల కానివాటిని తొలగింపుకు ప్రతిపాదించి ఇతరులకు ఆదర్శంగా నిలవాలా? లేక చంద్రకంతరావు గారి లాగా వారి పనుల్లో కంతలు వెతకాలా? __చదువరి (చర్చరచనలు) 12:10, 26 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారూ, తెవికీలో ఇటీవల జరిగిన పొరపాట్లు బయటపెడితే విమర్శలంటూ, నన్ను విమర్శిస్తూ, నా పై అభాండాలేస్తూ, తిట్ల పరంపరను కొనసాగిస్తూ (బూతులొక్కటే తక్కువ), కోపంతో రగిలిపోతూ, ఆవేశాన్ని గుమ్మరిస్తూ నా తెవికీ చరిత్ర మొత్తం శోధించి మొత్తంపై కొండను త్రవ్వి ఎలుకను పట్టి వింతైన సమాధానం ఇచ్చినందుకు ముందుగా థాంక్స్.
1) అపార్థం చేసుకోకుండా ఉండేలా చెప్పలేకపోయానంటూనే మళ్ళీ "మీపట్ల సానుకూలంగా ఉన్న వ్యక్తి కూడా..." అంటూ ఎందుకండి చదువరి గారూ. మీ ఉద్దేశ్యం ఏంటో నాకక్కరలేదు, సమర్థన అని ఎందుకు రాశారని అడిగితే మీరిచ్చే సమాధానం ఇదా! ఒక తప్పును కప్పిపుచ్చేందుకు మరో తప్పు చేస్తారా?
2) మీకు హెచ్చరిక అంటే ఏంటో తెలుసా చదువరి గారు. అది తెలుసుకొని మాట్లాడండి.
3) "విచారణ లేకుండా పేరు బయట పెట్టకూడదా? విచారణ చెయ్యాలంటే పేరు చెప్పాలి కదా?" అని అంటున్నారు. ఎలా బయట పెడతారండి? చదువరి గారు. "ఏంటీ చోద్యం? బండికి వెనకాల ఎద్దుల్ని కట్టడమంటే ఇదే" అంటూ మాటలు బాగానే చెబుతున్నారు కాని కనీస అవగాహన, ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారు. విచారణకు ఎవరైనా అనుమానుడి పేరు చెబుతారా? సాక్‌పప్పెట్ సభ్యుల పేర్లు చెప్పి వీరి అసలు సభ్యులెవరో కనుగొనాలని చెప్పాలి కాని ప్రసాద్ అనో మరో అనుమానుడి పేరో ఎలా చెబుతారు? మీ సమాధానం ఏ మాత్రం సరైనది కాదండి. ఇలాంటి సమాధానాల వల్ల చదివిన వారు సిగ్గుపడతారు.
4) అయ్యా నేను రంధ్రాన్వేషణ చేస్తానా మరేమి చేస్తానా అనేది మీకెందుకు చదువరి గారు. ఇక్కడ యజమానులు, బానిసలంటూ ఎవరూ ఉండరు. కొందరు మేస్త్రీల అవతారం ఎత్తి ఇతరులను కూలీలుగా భావించడం తగదని చర్చలలో చూడలేరా?. అందరూ మీకు నచ్చిందే చేయాలని ఏమీలేదు. నియమాలు అతిక్రమించనంతవరకు ఎవరికిష్టమైన పని వారు చేసుకోవచ్చు. సర్దుకోక తప్పదు చదువరి గారు. ఇలాంటి విషయంలో మీ వాదన పనికి రాదండి.
5) పని చేసేవాళ్ళపై దాడి చేస్తున్నట్లుగా చిత్రీకరించడం తగదండి చదువరి గారు. మీ సమాధానాలు ఏమాత్రం సరైనవిగా లేవు. నన్ను నిర్దేశించించేందుకు ఇక్కడ మీరేమి నా యజమానులు కారని గుర్తించుకోండి. పొరపాట్లు బయటపెడితే ఎవరు దాడికి దిగుతున్నారో గుర్తించుకోండి.
6) "ఒకసారి విధానం ఏర్పడ్డాక, మీ అభిప్రాయం ఏదైనా సరే.., దాన్ని పక్కన పెట్టాల్సిందే.." అన్నారు. ఇదేం సమాధానమండి. నియమోల్లంఘనకు, నియమాల ప్రక్షాళనకు తేడా కూడా తెలియకుండా మాట్లాడుతున్నారు. నియమం ఖరారైనా నియమాల మార్పుకై ప్రయత్నించడం, చర్చను తీయడం, అభిప్రాయం తెల్పడం, ఉన్న నియమాలు సరిగాలేవనీ, నియమాలలో లోపాలున్నాయనీ ... ఇలా చెప్పడం తప్పెలా అవుతుందో ఆలోచించండి. ప్రజాస్వామ్య పద్దతి ఏంటొ కొద్దిగానైనా తెలుసుకోండి. నియంత పాలనకు ప్రజాస్వామ్యానికి తేడా ఉంటుందని గ్రహించండి. ఇలాగైతే దశాబ్దాలు, శతాబ్దాలు గడిచినా నియమాలు మార్పు చెందవు చదువరి గారు. ఏం ఆలోచిస్తారండి. మార్పు చెందరాదనీ లేదా మీరొక్కరే మార్పుకై ప్రతిపాదన చేయాలనుకుంటే అది తప్పండి చదువరి గారు. దయచేసి మీ వైఖరి మార్చుకోండి.
7) "సభ్యులపై చర్యకు ... పాతిక? పోనీ యాభయ్యేళ్ళు?" అని ఎందుకు ఆవేశపడుతున్నారు చదువరి గారు. సభ్యులపై నిరోధం మాత్రమే ముఖ్యమనీ ఎందుకంటున్నారు. ముందు నియమాలు చక్కదిద్దుకుందాం అని తెలుసుకోలేరా? మీ ఆవేశానికో నమస్కారమండి చదువరి గారు.
8) "దుమ్మెత్తి పోయడానికి వస్తారు.." అంటూ విమర్శిస్తున్నారు. చేసిన పొరపాట్లండీ అవి. ఆ మాత్రం కూడా చెప్పకుంటే ఎలాగా? ఏమీ చెప్పరాదు అని అనడానికి ఇది మీ స్వంత బ్లాగు కాదు కదా చదువరి గారు. తెవికీలో ఎవరు ఏ బాధ్యతనైనా తీసుకోవచ్చు అని తెలుసుకోండి. ఈ విషయం నేను గతేడాదే చెప్పాను.
9) పనిచేసేవాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది అంటున్నారు. అదికాదండి పొరపాట్లు సరిదిద్దుకోవడం ముఖ్యమండి చదువరి గారు. నియమాలు తెలిసిన వారుంటారు, తెలియని వారుంటారు, తెలుసుకొనేవారూ ఉంటారని గుర్తించుకోండి. మీకు నచ్చకుంటే గప్పుగుండండి చాలు. సరిదిద్దుకొనేవాళ్ళు సరిదిద్దుకుంటారు. ఎవరికీ లేని ఆవేశం మీకెందుకు?
10) నా ధోరణి ప్రమాదకరం అంటున్నారు కాని మీ మాట వినని ఒక్కొక్కరిని ఇంటికి సాగనంపుతున్నారు. ఇదే చాలా ప్రమాదము చదువరి గారు. తెవికీ మొత్తం ఖాళీ అవుతుంది అప్పుడెవ్వరూ మిగలరు. ఇప్పటికే తెవికీ ఊబి నుంచి మరింత ఊబిలోకి దిగజారుతోందని గుర్తించుకోండి.
11) మారుపేరుతో రాసే వాడుకరికి నేను మారుకరి అని సంక్షిప్తనామం ఇస్తే మీకెందుకండి బెంగ? ఇదీ ఒక ఆక్షేపణనా? ఇదీ అభ్యంతరకరమా? ఇదేమైన తిట్టా? "ఈ ముసుగులెందుకు? ఇలా దొంగదెబ్బ తీయడమెందుకు?" అంటూ ఏవేవో అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్నారు. మరి అసలుపేరు ఆధారం లేకుండా ఎలా చెప్పాలి చదువరి గారు. ఆధారం లేకుండా చెప్పడమే తప్పు అని అర్థం చేసుకోలేరా? మీరు ఆవేశంతో అన్నీ తప్పుడు సలహాలిస్తున్నారు కాని నేను అలా చేయను. కొత్త సభ్యులు గట్టిగా ఏదైనా రాస్తే మీరు ఏమంటారో తెలుసా? "మర్యాద అనేదొకటుంది మరవకండి" అని, మరిప్పుడు?
12) సకల జనుల సమ్మెపై మండలాలలో నేను AWB ద్వారా చేర్చిన సాధారణ సమాచారం గురించి బాగా శోధించారు చదువరి గారు. కొండను తవ్వి ఎలుకను బాగానే పట్టారు. అదొక్కటే తప్పుకానితప్పు దొరికింది! తెలంగాణ మండల వ్యాసాలలో సమ్మె విభాగాన్ని పరిపూర్ణం చేయాలనే ప్రత్యేక ఉద్దేశ్యంతో అన్ని మండలాలకు చెందిన మూలాలు కూడా సేకరించాను. ఆ తర్వాత ఆ పని జరగలేదనుకోండి. తర్వాత దాన్ని మర్చిపోయాం. దానికి కారణం మీకు చెప్పే అవసరం లేదు. చెప్పినా అర్థం చేసుకోరు. మీకెందుకండి ఈ బెంగ. ఇందులో నా స్వార్థప్రయోజనం ఉందా? మీ వాదనలో పసలేదు. "మీ స్వప్రయోజనాల కోసం వికీని వాడేసుకున్నారు" అన్నారు, ఊరికే చెప్పడం కాదు ఆధారం చూపించండి. మీ వాదన హాస్యాస్పదంగా ఉంది.
13) పొరపాట్లు చెబితే "నిర్వాహకులపై ద్వేషం" అంటూ విమర్శిస్తున్నారు. ఏది చేసినా ఎవరేమీ చెప్పరాదని మీ ఉద్దేశ్యమా? ఇలా కుదరదు చదువరి గారు. చేసిన పొరపాట్లను సరిదిద్దుకోకున్నా సరే కాని చెప్పింది అర్థం చేసుకోండి చాలు. నేను చెప్పే పొరపాట్లలో ఏమైనా పొరపాటు ఉంటే చెప్పండి అంతేకాని ఆవేశంతో తగిలిపోతూ రెచ్చగొడుతూ రాయడం సరికాదు.
14) ఇతరుల పనుల గురించి మీరు నాకు చెప్పే అవసరం లేదు. వచ్చినప్పుడు మీ చర్యలతో పాటు అందరివీ గమనిస్తాను. అది మీకంటే నాకే ఎక్కువ తెలుసు. కావాలంటే వెంకటరమణ గారిని ఆదర్శంగా తీసుకోండి. నేను సంవత్సరాల తరబడి ఆయన చర్యల్ని చూస్తున్నాను. పొరపాటేమీ చేయరు. తెలిపితే ఇతరుల పొరపాట్లను కూడా సరిదిద్దుతారు. మీలా లేనిపోని ఆవేశం తెచ్చుకొని మాటలు కక్కరు.
15) మీరేమి చేసినా ఎవరూ ఏమీ చెప్పరాదని అనుకోకండి చదువరి గారు. ఇటీవలి పొరపాట్లు అంటూ నేను చర్చతీస్తే దానికి అర్థంపర్థం లేని సమాధానమిచ్చారు. పొరపాట్లు తెల్పితే దాడి అంటారు, నిర్వాహకులపై ధ్వేషం అంటూ చిత్రీకరిస్తారు, దుమ్ముదులిపే వ్యక్తిగా భాష్యం చెబుతారు. ఆరు పాయింట్లు రాస్తే వాటికి సరైన సమాధానం ఇవ్వకుండా (సమాధానం ఇవ్వాలనీ కూడా ఏమీ లేదని గుర్తించుకోండి, మొదటి పాయింటుకు మాత్రమే వివరణ అడిగాను, గుర్తించుకోండి) నా తెవికీ చరిత్ర మొత్తం పరిశోధించారు. పొరపాట్లు చెబితే కెలకడం అంటున్నారు కాని ఎవరు కెలకడం ప్రారంభించారో ఆలోచించండి. మరి నేనూ మీ తెవికీ చరిత్ర పరిశోధిస్తే కుప్పలుగా పొరపాట్లు బయటపడితే ఎంత ఆవేశం తెచ్చుకుంటారో చదువరి గారు.
16) "... ఆ తరువాత ఆ చర్చలో మళ్ళీ కనబళ్ళా మీరు. ఇదీ మీ బాధ్యత ..." అంటూ విషం కక్కకండి. నాకున్న వృత్తి బాధ్యతల వల్ల ఇక్కడికి రోజూ వచ్చే పరిస్థితి ఏ మాత్రం లేదు. తెవికీ సెలవులో ఉన్నప్పుడు మెయిల్ పంపొచ్చుగా? (బొట్టు పెట్టి పిలవాలా అని విమర్శిస్తారేమో! అలాంటప్పుడు చర్చలోకి రానివాళ్లకు విమర్శించే హక్కులేదని కూడా గుర్తించుకోండి) ప్రసాద్ గారిపై చర్య తీసుకొనే ముందు నాకు 2 సార్లు మెయిళ్ళు పంపి చర్చలోకి లాగిన సంగతి గుర్తుందా! అంటే సభ్యులపై నిరోధాలు, కఠిన చర్యలకు ఇచ్చిన ప్రాధాన్యత మిగితా సమయంలో మీరు ఇవ్వరన్నమాట!! ఇదీ సంగతి ! మీ అసలు ఉద్దేశ్యమేమిటో తెలుస్తోంది చదువరి గారు.
17) సందర్భాన్ని బట్టి గతానుభవాలు చెప్పాను, దాన్ని స్వోత్కర్ష అనుకున్నా నాకభ్యంతరం లేదు. కాకుంటే నా గత తెవికీ పనులు విని ఈర్ష్యపడితే ఎలాగండి. ఇది కూడా ఒక అభ్యంతరమా? ఏం శోధన చేశారు చదువరి గారు! సందర్భానుసారం చెప్పేమాటలకు కూడానా? ప్రతి ఒక్కరు మీకు నచ్చే మాటలనే రాయాలంటే కుదరదు. నేను చురుకుగా పనిచేసిన కాలంలో తెవికీ మహోన్నతస్థాయిలో ఉండేదని కూడా చాలా సార్లు తెల్పాను. మరి అది రాయలేదే! ఉన్న వాస్తవం చెబితే ఈర్ష్య పడితే ఎలాగండి!
18) JVRKPRASAD గారి నిర్వాహక హోదా రద్దు ప్రతిపాదనలో "మర్యాదగా వ్యవహరించరు. పిచ్చిరాతలు, చెత్త రాతలు, ఎవడు, కెలకడం, అతిగా, అతి తెలివిగా పత్తిత్తు వంటి మాటలు వాడుతూ ఉంటారు" అంటూ రాశారు. మరి ఇప్పుడు మీ భాష ఎలా ఉందో ఆవేశం తగ్గాక ఒకసారి పరిశీలించండి. దొంగదెబ్బ తియ్యలా, ఈ ముసుగులెందుకు? ఇలా దొంగదెబ్బ తీయడమెందుకు?, సూర్యుడిపై ఊసే ఉమ్ము, కెలకడం ... అంటూ ఇవేమి మాటలండి. ఈ మాటలన్నీ మూటకట్టి మీకే ఇస్తున్నాను స్వీకరించండి.
19) మీ చర్యల వల్ల తెవికీ ఎంత దెబ్బతిందో పరిశీలన చేయాల్సి ఉంది. కఠిన నియమాలు మరియు వికీ మూలనిబంధనలకు వ్యతిరేకంగా పాలసీలు ప్రతిపాదించి అమలులోకి తెచ్చినట్లుగా తెలుస్తోంది. (పూర్తి వివరాలు పరిశీలన తర్వాత బయటపడతాయి)
20) మీరు ఏదిచేసినా సభ్యులు, నిర్వాహకులు సమర్థించాలనీ, మీ పొరపాట్ల గురించి చెప్పే సభ్యుడిని పూర్తిగా అణగద్రొక్కాలనేది మీ వ్యూహంలో భాగం కావచ్చు కాని తెవికీపై ప్రేమ ఉన్న వారెవరూ మీకు భయపడరని గుర్తించుకోండి. సభ్యులను, నిర్వాహకులను అణగద్రొక్కే పద్దతిని మార్చుకోవాల్సిందిగా కోరుచున్నాను.

తెవికీలో జరిగిన పొరపాట్లను లేవనెత్తితే చురుకైన నిర్వాహకుడిగా సానుకూలంగా ఆలోచించడం మాని ఎదురుదాడికి దిగినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. అది ఆవేశమా? విచక్షణ కోల్పోయి రాశాడా? అసలు నైజమా? రెచ్చగొట్టడానికి రాశాడా? పొరపాట్లను తెలుసుకొనే శక్తి లేదా? మరోసారి పొరపాట్లు లేవనెత్తరాదనా? దాడి చేయడమే ఉద్దేశ్యమా? మరే ఉద్దేశ్యమో తెలియదు కాని ఈ రాతలను, వాడిన భాషను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఇక్కడ రాసిన రాతలు స్థాయికి తగ్గట్టుగా లేవు. బయటివారు చూస్తే తెవికీ నిర్వాహకులు ఇలాంటి భాష కూడా వాడతారా అని సిగ్గుపడిపోతారు. ఆవేశంతో, కోపంతో రాసినది తప్ప సమాధానంలో ఎలాంటి పసలేదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:20, 27 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
సకల జనుల సమ్మెపై మండలాలలో నేను AWB ద్వారా చేర్చిన సాధారణ సమాచారం గురించి బాగా శోధించారు చదువరి గారు. కొండను తవ్వి ఎలుకను బాగానే పట్టారు. అదొక్కటే తప్పుకానితప్పు దొరికింది! తెలంగాణ మండల వ్యాసాలలో సమ్మె విభాగాన్ని పరిపూర్ణం చేయాలనే ప్రత్యేక ఉద్దేశ్యంతో అన్ని మండలాలకు చెందిన మూలాలు కూడా సేకరించాను. ఆ తర్వాత ఆ పని జరగలేదనుకోండి. తర్వాత దాన్ని మర్చిపోయాం. దానికి కారణం మీకు చెప్పే అవసరం లేదు. చెప్పినా అర్థం చేసుకోరు. మీకెందుకండి ఈ బెంగ. ఇందులో నా స్వార్థప్రయోజనం ఉందా? మీ వాదనలో పసలేదు. "మీ స్వప్రయోజనాల కోసం వికీని వాడేసుకున్నారు" అన్నారు, ఊరికే చెప్పడం కాదు ఆధారం చూపించండి. మీ వాదన హాస్యాస్పదంగా ఉంది. బావుంది. తప్పుకాని తప్పు అట. సకల జనుల సమ్మె ఈ ఊళ్ళో జరిగింది ఈ ఊళ్ళో జరిగింది అంటూ ఏడబ్ల్యూబీ వాడి పెట్టెయ్యడం, తర్వాత కనీసం వాటిని తొలగించకపోవడం. ఎవరైనా అడిగితే "కారణం మీకు చెప్పే అవసరం లేదు.", "మీకెందుకు బెంగ" అనడం. శభాష్! మంచి వాదన. బానిసలు, యజమానులు అన్నది ఇప్పుడు వర్తించింది-కాకపోతే మీది యాజమాన్యం. మీరేమైనా చేస్తే కారణం చెప్పనక్కర లేదు. --పవన్ సంతోష్ (చర్చ) 06:45, 28 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
తమాషా ఏమంటే ఇదే పెద్దమనిషి, తనలాగే సాధారణ సమాచారాన్ని వందలాది వ్యాసాల్లో చేర్చిన భాస్కరనాయుడి గారి చర్చ పేజీకి వెళ్ళి హెచ్చరించారు. అది కూడా ఎప్పుడూ? తాను ఇలాటి పనిచేసిన తర్వాతనే. అంటే తాను ఎవరినైనా ఎందుకైనా ప్రశ్నించవచ్చు, తను మాత్రం ఎవరికీ కారణం చెప్పుకోనక్కరలేదు. ఇదీ వింత. --పవన్ సంతోష్ (చర్చ) 07:19, 28 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
చంద్రకాంతరావు గారూ, మీరు చేస్తున్న విమర్శలు ఇదివరకే తమకు వీలైనంతలో నిర్వహణ పనులు చేస్తున్న వారికి బెదరగొట్టేదిగా, భయపెట్టేదిగా ఉంది కానీ నిర్మాణాత్మకంగా నాకు అనిపించలేదు. అలాగే ఎన్ని సార్లు చెప్పినా పదే పదే తప్పులు చేస్తున్న వారి పైన చర్యల విషయంలో మీరు నిర్వాహకులనే తప్పుపడుతున్నట్లు అనిపిస్తుంది. మీరు తప్ప మిగతా ఎవరూ ఈ మధ్య జరిగిన పనులు నిర్వాహకులు బాధ్యతారహితంగా చేసినవి అనలేదు. నేను మొదటనుంచి గమనిస్తున్నది మీ శైలి ముక్కుసూటితనం. ఇందువల్ల చర్చలు వికీకి సహాయపడాల్సింది పోయి దారి తప్పి వ్యక్తిగతం అయిపోతున్నాయని నా అభిప్రాయం. - రవిచంద్ర (చర్చ) 10:58, 28 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
చంద్రకాంతరావు గారూ, సకల జనుల సమ్మె విషయంలో మీరు చేసిన తప్పు సకల జనులకూ తెలిసిపోయింది. ఇంకా బుకాయించి ప్రయోజనం లేదు. మీ బండారాన్ని పవన్ గారు బయట పెట్టేసారు. మిగతావి:
  1. మీ అబద్ధాల చిట్టా పెరిగిపోతోంది. నేను "కెలకడం" అనే మాట అసలు వాడనే లేదు, మీరే నాలుగైదు సార్లు వాడారు. పైగా "ఇవేమి మాటలండి" అని నన్ను అంటున్నారు. తప్పు మీరు చేసి, నన్ను అంటారేంటంట!! కొంపదీసి, ఇప్పుడు మీరు తప్పు చేసినందుకు గాను, నన్ను మీకు సారీ చెప్పమంటారా ఏంటి?
  2. "చేసిన పొరపాట్లను సరిదిద్దుకోకున్నా సరే కాని చెప్పింది అర్థం చేసుకోండి చాలు." - అని మీరు నన్ను అన్నారు. రావు గారూ, మీరు చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు. నా పొరపాట్లు ఎత్తిచూపినవారి పట్ల నేను ఎలా ఉంటానో ఓ రెండు ఇటీవలి ఉదాహరణ లిస్తాను.
    1. Juice Bucket Jr గారు చేసిన ఒక దిద్దుబాటును వెనక్కి తిప్పాను. ఎందుకలా చేసావని ఆయన నన్ను ప్రశ్నిస్తే నేను ఆయన్ను మన్నించమని అడిగాను చూడండి. ఆయన కొత్త వాడుకరి, అప్పటికి ఇంకా 10 దిద్దుబాట్లు కూడా చెయ్యలేదు.
    2. మరొక సందర్భం కూడా చెబుతాను.. కారణమేదైనా కావచ్చు గానీ, వాడుకరి:దేవుడు కినుక వహించి, వికీ నుండి వెళ్ళిపోతానని అంటే, నేను వద్దని కోరాను. ఒకవేళ నేను ఆయనకు మనస్తాపం కలిగిస్తే క్షమాపణ చెబుతానని కూడా చెప్పాను. తెలియక చేసినా, తెలిసి చేసినా... నావల్ల తప్పంటూ జరిగితే దాన్ని ఒప్పుకుంటానికి - అవతలి వ్యక్తి ఎవరైనా సరే- నేను సిగ్గుపడను. కానీ అసత్యమైన ఆరోపణలు (హెచ్చరించకుండానే చర్య తీసుకున్నారు లాంటివన్నమాట. ఇప్పుడు హెచ్చరిక అనగానేమీ.. అని నాకు చెప్పకండి) చేస్తే దాన్ని వ్యతిరేకించడానికి వెనకాడను. ఆ సంగతి మీకు నిన్న తెలిసిపోయింది.
  3. "ప్రసాద్ గారిపై చర్య తీసుకొనే ముందు నాకు 2 సార్లు మెయిళ్ళు పంపి చర్చలోకి లాగిన సంగతి గుర్తుందా!" అని అన్నారు. మీ అబద్ధాలకు హద్దూ ఆపూ లేదా రావు గారూ!! ఆ ఈమెయిలు చర్చలో ఉన్నది ఇది:
    1. మొదట నేను రాసినది (ఒకే లైను): నమస్కారం రావుగారూ, బాగున్నారని తలుస్తాను. చాన్నాళ్ళైంది మిమ్మల్ని వికీలో చూసి. సెలవు ఎప్పటి వరకూ తీసుకుంటున్నార్సార్?
    2. దానికి మీ సమాధానం (పేర్లు చెప్పకుండా తోటి వాడుకరులను విమర్శిస్తూ ఒక పేరా): నమస్కారములు చదువరి గారు, తెవికీలో కొందరు సభ్యులు నియమాలకు విరుద్ధంగా ప్రవర్తించడం, పలుమార్లు చెప్పిచూసిననూ వారి ప్రవర్తనను ఏ మాత్రం సరిదిద్దుకోకపోవడం, బాటు/AWB ద్వారా చేసే పనికి కూడా ఉద్దేశ్యపూర్వకంగా చిన్న మరియు సునాయాస దిదుబాట్ల ద్వారా ఇతరులను చికాకు పర్చడం, తెవికీలో సమాచారం చేర్చడానికి ఎన్ని అవకాశాలున్ననూ కేవలం అనవసర మార్పులు చేర్పులతో (కొందరు అనవసర వర్గాలు, మూసలు, ఖాళీ విభాగాలు,  చేరిస్తే మరికొందరు వాటిని తొలిగిస్తూ ఉంటారు. ముఖ్యంగా గ్రామవ్యాసాలలో) దిద్దుబాట్ల సంఖ్యను పెంచుకోవడానికి ప్రయత్నించడం, ఇదివరకు నేను చురుకుగా ఉన్న సందర్భాలలో పలు పర్యాయాలు ఎన్ని సూచనలు చేసిననూ తోటి సభ్యుల నుంచి ఎలాంటి ప్రతిస్పందనలు లేకపోవడం తదితర కారణాలవల్ల విరక్తి చెంది తాత్కాలికంగా దూరంగా ఉన్నాను. మనకు సభ్యుల కంటే వ్యవస్థ ముఖ్యం కాబట్టి ఎప్పటికైనా మళ్ళీ చురుకుగా ప్రవర్తిస్తూ తెవికీ అభివృద్ధికి తోడ్పడగలను. ఆ రోజు త్వరలోనే వస్తుందనే ఆశాభావంతో ఉన్నాను.
    3. దానికి నా సమాధానం (మళ్ళీ ఒకే లైను): తెవికీ అభివృద్ధికి మీవంటి వారి అవసరం ఎంతో ఉంది. మీరు మళ్ళీ తెవికీలో చురుగ్గా పాల్గొనాలని కోరుకుంటున్నాను. ఉంటానండి

-ఇందులో నేను ప్రసాదు గారి గురించి ప్రస్తావించినది ఎక్కడ? ఎందుకిలా అబద్ధాలు చెబుతున్నారు? ఆయన గురించే కాదు, ఏ వికీ వాడుకరి గురించీ నేను రాయలేదు. మీరు మాత్రం పేరు పెట్టకుండా (మీకు అలవాటే కదా) "కొందరు సభ్యుల" గురించి మీ గోడు వెళ్ళబోసుకున్నారు. అదీ.. మీకూ నాకూ తేడా! ఇంకో సంగతి.. మీకే కాదు, వికీలో చురుగ్గా లేని మరో నలుగురైదుగురికి కూడా నేను మెయిలు రాసాను. అప్పుడే కాదు దానికి ముందూ రాసాను, ఆ తరువాతా రాసాను. ఎవరికి రాసినా ఒకటే.. బావున్నారా? వికీకి తిరిగిరండి. అనే. అదే నా "అసలు ఉద్దేశం".

అబద్ధాలు చెప్పో అసత్యాలు చెప్పో నన్ను విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు మీరు. ఇక మీతో వాదించి ఇక నా సమయాన్ని వృథా చేసుకోదలచుకోలేదు, చేసుకోను. మీ శక్తియుక్తులను వికీకి పనికొచ్చే పనులకు వాడుతారని ఆశిస్తూ, వాడమని కోరుతూ.. సెలవ్. __చదువరి (చర్చరచనలు) 15:55, 28 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

దేవుడు ఎవరు

అందరికీ నమస్కారం. నేను ఇక్కడ పని చేయటం మాని చాలాకాలం అయ్యింది. నేను https://www.smule.com/JVRKPRASAD నందు అప్పటి నుంచి పాటలు పాడుకుంటూ ఉన్నాను. సామాజిక సైట్స్ నందు కూడా నా హాజరు తగ్గించుకున్నాను. ఈరోజు వరకు నామీద కొంతమంది సభ్యులకు సదభిప్రాయం లేదు. ఆ కారణాలు వారికే తెలియాలి. ఈరకంగా మాట్లాడటం సరైన పద్ధతి కాదు. నన్ను అనవసరంగా అంటే నేను అంటాను అని చాలా మందికి అనుభవమే. నన్ను అన్న వ్యక్తులే సాక్ పప్పెట్లు కాదా అని ఆలోచించాలి. ఆ "దేవుడు" అనే మాయమనిషి నాకు కూడా మంచి మాటలు, పొగడటం ఇది వరకు జరిగింది. మంచి మాటాలతో మాయగాళ్ళు బయటకు రారు. అడ్డమైన మాటలంటే ఎవరో బయట పడతారు. ఎవరైనా ఆపని చేయండి. మీరు చెయ్యనంటే నేను బండబూతులు తిడతాను. ఆ మనిషి బయటకు వస్తాడు, లేదా మళ్ళీ ఇక్కడకు ఆ పేరుతో రాడు. అంతేకాని, నామేద పిచ్చి రాతలు వ్రాయవద్దు. నేను మరోపేరుతో ఇక్కడకు వచ్చి వ్రాయావలసిన దరిద్రం, నాకు లేదు. ఏదైనా ఎంత పెంటైనా వ్రాయాలనుకుంటే నాపేరుతోనే వ్రాస్తాను. ముందు వాడుకరులు అది తెలుసుకుంటే మంచిది. ఇక దొంగరాతగాళ్ళు ఎవరో (ఎవడో) బయట పెట్టండి. నన్ను కెలికిన వారి మీద చర్యలకు, నిర్వాహక, అధికారులు నాకు మీ సమాధానం ఇవ్వండి.JVRKPRASAD (చర్చ) 07:22, 30 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియాపై విమర్శలు

ఈ చర్చలో నా ప్రస్తావన కూడా ఉంది కాబట్టి, ఓ కొత్త వాడుకరిగా కొన్ని విషయాలు అందరికీ ఇక్కడ ఉపయోగపడుతుంది అని భావించేవి ప్రస్తావించదల్చుకుంటున్నా! మీరు ప్రస్తుతం చర్చించే విషయాలు ఆంగ్ల వికీపీడియాలోని criticism of wikipedia లో ముందే ఉన్నాయి. వీటన్నిటి ని నేను కూడా గత నెల రోజులుగా పడుతున్నా. కావాలంటే కొన్ని నా స్వానుభవం నుంచి కొన్ని ఉదాహరణలు ప్రస్తావించగలను.

  1. వికీపీడియాకి తాము చెప్పిందే వేదం అనే భావనలో వికీపీడియా లోని ఎక్కువ అనుభవం కలిగిన వాడుకరులు, నిర్వాహకులు ఉండటం.
  2. తాము చెప్పినట్టే వికీపీడియాలో రచనలు ఉండాలి అని పరిమిత నిర్వాహకులు భావించడం. అందుకుగా ఎక్కువ తమకు సాధ్యమైనన్ని నియమాలు పెట్టడం.
  3. అధిక సంఖ్య లోని కొత్త, పాత వాడుకారులలో కూడా నిర్వహకులకి మించిన రాయగలిగే సామర్ధ్యం ఉన్నప్పుడు వారిని ఒప్పుకోకపోవడం.
  4. కొత్త వాడుకరులకి ఇక్కడ కొన్ని ఆపాదించే విధానాలు, వాతావరణం ఇబ్బందికరంగా ఉండటం. ఎక్కువ సంఖ్యలో కొత్త వాడుకరులు నిరాశతో తిరిగి వెళ్ళడం.
  5. నిర్వాహకులు, అనుభవం కలిగిన వాడుకరులు తమ మంకుపట్టు వీడకపోవడం. తాము రాసే విధానం, చెప్పే విధానంలోనే వికీ ఉండాలని భావించడం.
  6. కొత్త విధానాలకు అంగీకరించక పోవడం, ఎక్కువ మంది కొత్త వారి మంచి ఆలోచనలను కూడా ఆమోదించకపోవడం, కాలానుగుణ మార్పులను అంగీకరించకపోవడం.
  7. వాడుకరులను వేధించడం.
  8. వికీపీడియా పేరుకు ప్రజాస్వామ్యం అయినా నిర్వహణ ఆ విధంగా లేకపోవడం.
  9. వాడుకరులకి ఆపాదించే నియమాలు, తప్పొప్పులు నిర్వహకులకి కూడా వర్తించినప్పటికి అవి నిర్వాహకులు ఒప్పుకోకపోవడం.
  10. నిర్వహకులకి, అనుభవం కలిగిన వాడుకరులకి ఉద్దేశ పూర్వక వివక్ష ఉన్నప్పుడు మామూలు వాడుకరి వారికి లక్ష్యం కావడం, అధికారబలంతో అతనికి ఉద్దేశాలు ఆపాదించడం.

నేను పై వాదంలో ఎవరినీ సమర్ధించను లేదు, విమర్శించను లేదు. ఎందుకనటే నాకు ఈ చర్చ అసలు ఉద్దేశ్యము పూర్తిగా తెలియదు. చదువరి గారు, వెంకట రమణ ప్రత్యేకంగా రవిచంద్ర, పవన్ సంతోష్ గార్లతో నాకు ఈ criticism లోని కొన్ని అంశాలు సరిపోలాయి. criticism of wikipedia; https://en.wikipedia.org/wiki/Criticism_of_Wikipedia లో

In a 2008 article in The Brooklyn Rail, Wikipedia contributor David Shankbone contended that he had been harassed and stalked because of his work on Wikipedia, had received no support from the authorities or the Wikimedia Foundation, and only mixed support from the Wikipedia community. Shankbone wrote, "If you become a target on Wikipedia, do not expect a supportive community."[188]

David Auerbach, writing in Slate magazine, said: I am not exaggerating when I say it is the closest thing to Kafka’s The Trial I have ever witnessed, with editors and administrators giving conflicting and confusing advice, complaints getting "boomeranged" onto complainants who then face disciplinary action for complaining, and very little consistency in the standards applied. In my short time there, I repeatedly observed editors lawyering an issue with acronyms, only to turn around and declare "Ignore all rules!" when faced with the same rules used against them ... The problem instead stems from the fact that administrators and longtime editors have developed a fortress mentality in which they see new editors as dangerous intruders who will wreck their beautiful encyclopedia, and thus antagonize and even persecute them.

Consensus and the "hive mind" Oliver Kamm, in an article for The Times, said Wikipedia's reliance on consensus in forming its content was dubious:[2]

Wikipedia seeks not truth but consensus, and like an interminable political meeting the end result will be dominated by the loudest and most persistent voices.

Wikimedia advisor Benjamin Mako Hill also talked about Wikipedia's disproportional representation of viewpoints, saying:

In Wikipedia, debates can be won by stamina. If you care more and argue longer, you will tend to get your way. The result, very often, is that individuals and organizations with a very strong interest in having Wikipedia say a particular thing tend to win out over other editors who just want the encyclopedia to be solid, neutral, and reliable. These less-committed editors simply have less at stake and their attention is more distributed.[191] Various figures involved with the Wikimedia Foundation have argued that Wikipedia's increasingly complex policies and guidelines are driving away new contributors to the site. Former chair Kat Walsh has criticized the project in recent years, saying, "It was easier when I joined in 2004 ... Everything was a little less complicated ... It's harder and harder for new people to adjust."[195] Wikipedia administrator Oliver Moran views "policy creep" as the major barrier, writing that "the loose collective running the site today, estimated to be 90 percent male, operates a crushing bureaucracy with an often abrasive atmosphere that deters newcomers who might increase participation in Wikipedia and broaden its coverage".[196] According to Jemielniak, the sheer complexity of the rules and laws governing content and editor behavior has become excessive and creates a learning burden for new editors.

Despite the perception that the Wikipedia process is democratic, "a small number of people are running the show",[198] including administrators, bureaucrats, stewards, checkusers, mediators, arbitrators, and oversighters.[7] In an article on Wikipedia conflicts in 2007, The Guardian discussed "a backlash among some editors, who say that blocking users compromises the supposedly open nature of the project and the imbalance of power between users and administrators may even be a reason some users choose to vandalize in the first place" based on the experiences of one editor who became a vandal after his edits were reverted and he was blocked for edit warring. దేవుడు (చర్చ) 06:25, 29 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

దేవుడు గారూ, పైన మీరు నిర్వాహకులపై కొన్ని విమర్శలు చేసారు. మీరు 2020 ఏప్రిల్ 19న పైశాచిక వ్యక్తిత్వ రోగము వ్యాసం సృష్టితో వికీపీడియాలో ప్రస్థానాన్ని ప్రారంభించారు.ఐదో దిద్దుబాటులోనే వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/సిల్వియా లైకెన్స్ హత్య నిర్వాహకులతో చర్చను విస్తృతంగా ప్రారంభించారు. అక్కడ నిర్వాహకులు కోరుకున్నదేమిటి? యాంత్రిక అనువాద వ్యాసాన్ని అర్థమయ్యేరీతిలో శుద్ధి చేయమని. ఎవరైనా అలానే ఆలోచిస్తారు. మీకు నిర్వాహకులు తగినన్ని సూచనలు చేసారు. కానీ మీరు సరైన రీతిలో శుద్ధి చేయలేకపోయారు. చివరకు ఈ వాదనలు చూడలేక తిరిగి ఆ వ్యాసాన్ని తిరిగి రాయడం జరిగింది. ఇతర వ్యాసాల చర్చలలో కూడా మీరు ఎక్కువగా పాల్గొంటున్నారు. మీరు రాసిన వ్యాసాలను విస్తరించడంలో గానీ, శుద్ధి చేయడంలో గానీ నిర్వాహకులు మీకు తోడ్పడ్డారు కదా. సరే మీకు నిర్వాహకుల వల్ల కలిగిన అసౌకర్యమేమిటి? మీరు నిర్వాహకులపై అనవసరంగా చేసిన విమర్శలకు ఆధారాలను చూపండి. K.Venkataramana(talk) 08:48, 29 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

వెంకట రమణ గారు, పైన చెప్పిన విషయాలన్నీ మీ తప్పులని నేను అనలేదు. పైన జరుగుతున్న చర్చలో వాదోపవాదాలలో Criticism of Wikipedia లో ఉన్న అంశాలే కనిపించాయి. అందుకే ఆ పాయింట్లు ఇక్కడ మీ అందరికీ కూడా ఉపయోగపడవచ్చని ప్రస్తావించాను. అన్నీ మీ గురించి కాదు, మొత్తం వికీ గురించి. కొన్నింటిలో మాత్రమే నేను అలా భావించిన సందర్భాలూ ఉన్నాయి అని తెలిపాను. మీరు రాసిన వ్యాసాలను విస్తరించడంలో గానీ, శుద్ధి చేయడంలో గానీ నిర్వాహకులు మీకు తోడ్పడ్డారు కదా.. అవును, కానీ ఇంకొంచెం సున్నితంగా వ్యవహరించాలి. కొత్త వాడుకరులకి మంచి అనుభూతి తెవికీ తో మిగిలేలా చెప్పండి, నేర్పించండి. ఇదేదో సర్జికల్ స్ట్రైక్ లా ఉండకూడదు. యాంత్రిక అనువాద వ్యాసాన్ని అర్థమయ్యేరీతిలో శుద్ధి చేయమని. ఎవరైనా అలానే ఆలోచిస్తారు. మీకు నిర్వాహకులు తగినన్ని సూచనలు చేసారు. కానీ మీరు సరైన రీతిలో శుద్ధి చేయలేకపోయారు. చివరకు ఈ వాదనలు చూడలేక తిరిగి ఆ వ్యాసాన్ని తిరిగి రాయడం జరిగింది. చదువరి గారు, వివరించిన తీరు నాకు బాగా నచ్చింది. ఆయన నా రెండు వాదనలు వినడంతోనే నాకు ఎలా అనువాదం చేయాలి, సంతకం ఎలా చేయాలి ఇవన్నీ నేను ఆడగక పోయిన నేను రాసే విధానంలోనే అర్థం చేసుకుని నాకు వివరించారు. నిర్వహకులంటే అలా ఉండాలి. అందుకే ఆయనతో తీవ్ర చర్చ జరగలేదు. అందుకే ఆయనకు అక్కడే ధన్యవాదాలు తెలిపాను. ఏదైనా మనం అర్థం చేసుకునే విధానంలోనే ఉంది. కానీ నన్ను ఎవరికో ముసుగు వీరుడినని ఏవేవో నిందలు మోపారు. మీరు ఎవరినో ఊహించుకుని వారు నేను గా భావించి నా మీద నిందలు వేశారు. నేను వ్యాసంతో పాటు నా ఖాతా కూడా తొలగించమని చెప్పాను. నేను చిత్త శుద్దీతో చేసిన పనికి కొన్ని అసంబద్దపదాలు, కారణాలు వాడడం సవ్యంగా అనిపించలేదు. నేను అడిగిన ప్రశ్నలకు పూర్తి సమాధానాలు నాకు చెప్పలేదు. చదువరి ఎలాగో దేవుడు కూడా అంతే, అదేమీ దేశ ద్రోహం కాదే. మనుషులలో ఎక్కడా ఒక మనిషి ఇంకో మనిషిలా ఆలోచించలేడు. తెలుగులో కూడా తేడాలు ఉంటాయి, తెలంగాణ తెలుగుకు, ఆంధ్ర తెలుగుకు, ములుకనాడు తెలుగుకు, రాయలసీమ తెలుగుకు, ఉత్తరంధ్రా తెలుగుకు, తమిళనాడు తెలుగుకు, కర్ణాటక తెలుగుకు, డబున్న వాడి తెలుగు కు, పేదవాడి తెలుగుకు, పండితుడి తెలుగుకు, చదువుకొని వాడి తెలుగుకు ఇలా. ఒకరిని చులకన చేయడం తగదు, అది ఏ దురుద్దేశం లేని కొత్తవారిని. ఈ సమస్యలన్నీ తెలుగు వికీపీడియా కూడా ప్రపంచ వికీపీడియా తో పాటుగా ఓవర్ కం అవ్వాలి. అదే నా ఉద్దేశం. పైన నేను ప్రస్తావించిన పేర్లు నేను తెవికీ లోకి వచ్చిన తరువాత నేను సంభాషించిన నా అనుభవం వికీలో పెన వేసుకున్న వారి పేర్లు. వికీ నియమాలకి, క్రమశిక్షణకు నేను వ్యతిరేఖం కాదు. కానీ దుర్వినియోగం ఆమోదయోగ్యం కాదు. వాడుకరులు కొత్తవారు కావున, నిర్వాహకులు, అనుభవజ్ఞులు కాకపోయినప్పటికి వారు చెప్పేవి కూడా గౌరవించండి. మీ భావాలే అందరి భావాలు కాకపోవచ్చు. పరస్పర గౌరవం సభ్యులందరికీ ఉండాలి. అందరి అభిప్రాయాలను గౌరవించండి. ఎందుకు చెబుతున్నారో కూడా కొంచెం ఆలకించండి. దేవుడు (చర్చ) 09:34, 29 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

//వాడుకరులు కొత్తవారు కావున, నిర్వాహకులు, అనుభవజ్ఞులు కాకపోయినప్పటికి వారు చెప్పేవి కూడా గౌరవించండి. మీ భావాలే అందరి భావాలు కాకపోవచ్చు. పరస్పర గౌరవం సభ్యులందరికీ ఉండాలి. అందరి అభిప్రాయాలను గౌరవించండి. ఎందుకు చెబుతున్నారో కూడా కొంచెం ఆలకించండి.// @దేవుడు: ఇన్ని చెప్పారు కదా. నేను మీతో చేసిన చర్చల్లో (నా పేరు ప్రత్యేకించి తీసుకువచ్చారు కాబట్టి చెప్తున్నాను) మీమాట ఆలకించనిదీ, మిమ్మల్ని గౌరవించనిదీ (అభిప్రాయాలను వ్యతిరేకించివుండొచ్చు. వ్యక్తి మీద అగౌరవం ఉంటే చెప్పండి) ఎక్కడో చెప్పండి కాస్త. --పవన్ సంతోష్ (చర్చ) 10:07, 29 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్ గారు, "మీరు కూడా కాస్త స్పష్టంగా మీ సమస్య వ్యక్తం చేస్తూ ఉంటే బావుంటుంది. మరో సంగతి అవతలివారికి ఏం తెలుసో ఏం తెలియదో ఊహించుకుని రాయవద్దు, దానివల్ల మంచికన్నా చెడే ఎక్కువ జరుగుతుంది. ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 11:37, 28 మే 2020 (UTC)." ____ఇది నిన్నటి మీ సూచన. అది ఎలాగో ఇది కూడా అలాగే. ____దేవుడు (చర్చ) 10:36, 29 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఆ చర్చ జరిగిన సందర్భంలో నేను అలా సూచించడం మిమ్మల్ని అగౌరవించినట్టు అంటారా? మీరు అనేదేమిటి అన్నది అర్థం కావట్లేదు? సూటిగా చెప్పగలరా? --పవన్ సంతోష్ (చర్చ) 10:57, 29 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
దేవుడు నా వలన మీకు ఇక్కడ ఏమేమి ఇబ్బంది కలిగిందో నా చర్చా పేజీలో రాయండి. పాయింట్లుగా రాయండి. ఒక్కో దానికి సమాధానం ఇస్తాను. - రవిచంద్ర (చర్చ) 11:28, 29 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా విధి విధానాలపై పున:సమీక్ష

ఇటీవలి నిర్వహకులపై జరుగుతున్న చర్చలు గమనిస్తే ఒక విషయం తెలుస్తుంది. ఏవైనా నిర్ణయాలపై చర్చలు జరుతున్నపుడు వాటిలో పాల్గొనని వాడుకరులు తరువాత ఆ నిర్ణయాలను అమలుచేస్తున్నపుడు విమర్శలు, వాదనలు చేయడం. కారణాలు ఏవైనా ఒక నిర్ణయాన్ని మెజారిటీ సభ్యులు ఆమోదించి అమలుచేస్తున్నపుడు అంగీకరించని సభ్యులు తప్పుకోవడం, లేదా వికీకి దూరమవడం జరగొచ్చు. అది కొందరి సభ్యులకు నచ్చకపోవడం వలన మళ్ళీ వాటిపై చర్చలు జరగడం ఇది ఒక నిరంతర ప్రక్రియలా ఉన్నది. కొన్ని పాలసీలను రూపొందించుకున్నాక లేదా ఒక విషయంపై నిర్ణయం తీసుకున్నాక దాన్ని అమలుచేస్తున్నవారిపై కోపం ఎందుకు రావాలి. అది వారి వ్యక్తిగత నిర్ణయాధికారం కాదు. బలవంతంగా అమలుచేయడానికి. దాన్ని ఎవరైనా అంగీకరించి వారికి సహకరించవాల్సిందే. దేవుడుగారు చర్చ తీసింది వికీపీడియాపై విమర్శలు అని. కాని ప్రస్తుతం క్రియాశీలకంగా ఉన్న నిర్వహకుల తీరు తాము చెప్పిందే వేదం, తాము చెప్పినట్టే వికీపీడియాలో రచనలు ఉండాలి వంటి పలు ఆరోపణలు చేసారు. కాని ఆరోపణలు చేసేముందు వాటిపై కొన్ని ఉదాహరణలు అందించి ఉండవలసింది. ముఖ్యంగా వాడుకరులకి ఆపాదించే నియమాలు, తప్పొప్పులు నిర్వహకులకి కూడా వర్తించినప్పటికి అవి నిర్వాహకులు ఒప్పుకోకపోవడం. అనేదానిపై. ఎక్కడ ఎలా, ఎందుకు ఒప్పుకోలేదు అనేవి కొన్ని ఉదాహరణలు ఇస్తే బావుందేది. తెలుగు వికీలో నిలకడగా రచనలుచేసే వాడూకరులే తక్కువ. వాళ్ళలో ఎక్కువ మంది నిర్వహకులుగానే ఉన్నారు. నిర్వహకులుగా ఉన్నవారు చెప్తే అది అధికారంగా అనిపించడం బహుశా వాడుకరి రచన మీద వారు దిద్దుబాట్లు చేయడం నచ్చకపోవడం వలన అయిఉంటుంది. లేదా మరొకటి, కారణం ఏదైనా అలాంటి అభిప్రాయాలు ఎక్కువ మంది సభ్యుల్లో ఉంటే విధి విధానాలను సవరించడానికి మొదట దీనిపై ఒక చర్చమొదలుపెట్టడం అవసరం. ఆరోపణలు, విమర్శలు లేదా సలహాలు ఇచ్చే అందరూ దీన్లో పాల్గొనాలి. స్పష్టమైన విధి విధానాలను, ముఖ్యంగా రచనల తొలగింపు, కొత్త వాడుకరుల రచనలపై ఆంక్షలు, కొత్త వాడుకరులతో చర్చల్లో తీసుకోవల్సిన జాగ్రత్తలు, వివాస్పదమైయ్యే అంశాలపై ఓటింగ్ నిర్ణయాలువంటి మరిన్ని అంశాలపై పాలసీలు రూపొందించుకున్నాక వికీ శుద్ది లేదా కొత్త వ్యాసాలు వంటి వాటిపై పనిచేయడం మంచిదని నా అభిప్రాయం...B.K.Viswanadh (చర్చ) 16:42, 29 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఇటీవలి నిర్వహకులపై జరుగుతున్న చర్చలు గమనిస్తే ఒక విషయం తెలుస్తుంది. ఏవైనా నిర్ణయాలపై చర్చలు జరుతున్నపుడు వాటిలో పాల్గొనని వాడుకరులు తరువాత ఆ నిర్ణయాలను అమలుచేస్తున్నపుడు విమర్శలు, వాదనలు చేయడం. కారణాలు ఏవైనా ఒక నిర్ణయాన్ని మెజారిటీ సభ్యులు ఆమోదించి అమలుచేస్తున్నపుడు అంగీకరించని సభ్యులు తప్పుకోవడం, లేదా వికీకి దూరమవడం జరగొచ్చు. అది కొందరి సభ్యులకు నచ్చకపోవడం వలన మళ్ళీ వాటిపై చర్చలు జరగడం ఇది ఒక నిరంతర ప్రక్రియలా ఉన్నది. కొన్ని పాలసీలను రూపొందించుకున్నాక లేదా ఒక విషయంపై నిర్ణయం తీసుకున్నాక దాన్ని అమలుచేస్తున్నవారిపై కోపం ఎందుకు రావాలి. అది వారి వ్యక్తిగత నిర్ణయాధికారం కాదు. బలవంతంగా అమలుచేయడానికి. దాన్ని ఎవరైనా అంగీకరించి వారికి సహకరించవాల్సిందే.  దేవుడుగారు చర్చ తీసింది వికీపీడియాపై విమర్శలు అని. కాని ప్రస్తుతం క్రియాశీలకంగా ఉన్న నిర్వహకుల తీరు తాము చెప్పిందే వేదం, తాము చెప్పినట్టే వికీపీడియాలో రచనలు ఉండాలి వంటి పలు ఆరోపణలు చేసారు. కాని ఆరోపణలు చేసేముందు వాటిపై కొన్ని ఉదాహరణలు అందించి ఉండవలసింది. ముఖ్యంగా వాడుకరులకి ఆపాదించే నియమాలు, తప్పొప్పులు నిర్వహకులకి కూడా వర్తించినప్పటికి అవి నిర్వాహకులు ఒప్పుకోకపోవడం. అనేదానిపై. ఎక్కడ ఎలా, ఎందుకు ఒప్పుకోలేదు అనేవి కొన్ని ఉదాహరణలు ఇస్తే బావుందేది. తెలుగు వికీలో నిలకడగా రచనలుచేసే వాడూకరులే తక్కువ. వాళ్ళలో ఎక్కువ మంది నిర్వహకులుగానే ఉన్నారు. నిర్వహకులుగా ఉన్నవారు చెప్తే అది అధికారంగా అనిపించడం బహుశా వాడుకరి రచన మీద వారు దిద్దుబాట్లు చేయడం నచ్చకపోవడం వలన అయిఉంటుంది. లేదా మరొకటి, కారణం ఏదైనా అలాంటి అభిప్రాయాలు ఎక్కువ మంది సభ్యుల్లో ఉంటే విధి విధానాలను సవరించడానికి మొదట దీనిపై ఒక చర్చమొదలుపెట్టడం అవసరం. ఆరోపణలు, విమర్శలు లేదా సలహాలు ఇచ్చే అందరూ దీన్లో పాల్గొనాలి. స్పష్టమైన విధి విధానాలను, ముఖ్యంగా రచనల తొలగింపు, కొత్త వాడుకరుల రచనలపై ఆంక్షలు, కొత్త వాడుకరులతో చర్చల్లో తీసుకోవల్సిన జాగ్రత్తలు, వివాస్పదమైయ్యే అంశాలపై ఓటింగ్ నిర్ణయాలువంటి మరిన్ని అంశాలపై పాలసీలు రూపొందించుకున్నాక వికీ శుద్ది లేదా కొత్త వ్యాసాలు వంటి వాటిపై పనిచేయడం మంచిదని నా అభిప్రాయం...B.K.Viswanadh (చర్చ) 16:42, 29 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

B.K.Viswanadh గారూ ఏవో 10 ఆరోపణలు దేవుడుగారు చేసేసారు. ప్రతీ ఆరోపణకు తనకుగానీ, ఇతర వాడుకరులకు గానీ ఏ విధమైన ఇబ్బంది కలిగిందో లింకులతో చూపించాలి. అలా కాకుండా నిర్వాహకులపై ఏవో ఆరోపణలు చేయడం సరియైన చర్య అవుతుందా? అతను తనకు ఎవరి వల్ల ఏ ఇబ్బంది కలిగిందో తెలియజేస్తే దానిపై వివరణలు రాయవచ్చు. K.Venkataramana(talk) 03:36, 30 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
B.K.Viswanadh గారు, నేను రాసింది పూర్తిగా చదివితే మీకు అర్థం అవుతుంది. ఈ పేరా చదవండి. David Auerbach, writing in Slate magazine, said: I am not exaggerating when I say it is the closest thing to Kafka’s The Trial I have ever witnessed, with editors and administrators giving conflicting and confusing advice, complaints getting "boomeranged" onto complainants who then face disciplinary action for complaining, and very little consistency in the standards applied. In my short time there, I repeatedly observed editors lawyering an issue with acronyms, only to turn around and declare "Ignore all rules!" when faced with the same rules used against them ... The problem instead stems from the fact that administrators and longtime editors have developed a fortress mentality in which they see new editors as dangerous intruders who will wreck their beautiful encyclopedia, and thus antagonize and even persecute them. పైన నేనేదో అన్నీ మన తెవికీ నిర్వహకులందర్నీ అన్నట్టు దయచేసి ఆపాదించుకోకండి. అవి మొత్తం వికీపడియా సమస్యల గురించి. మీ కోసం criticism of wikiepdia వ్యాసాన్ని తెలుగులోకి అనువదిస్తాను. అప్పుడు మీకు అర్థం అవుతుంది. నేను ఇప్పటికీ సభ్యుల అభిప్రాయాలపై జరుగుతున్న చర్చలు, ప్రస్తావిస్తున్న సమస్యలు కేవలం నేను సంభాషించిన నలుగురు నిర్వహకులవిగా మాత్రమే చూడటం లేదు. అందుకే వారిపై నాకు ద్వేషం లేదు. ఇది నా ఒక్కడి సమస్య కాదు. మొత్తం వికీ సమస్య. నేను చేసిన చాలా వ్యాసాలకి నా అంతట నేనే సవరణలు సూచించమని నిర్వహకులని ఆహ్వానించాను. చర్చలలో కూడా పాల్గొన్నాను. ____ దేవుడు (చర్చ) 04:09, 30 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అలాంటి అభిప్రాయాలు ఎక్కువ మంది సభ్యుల్లో ఉంటే విధి విధానాలను సవరించడానికి మొదట దీనిపై ఒక చర్చమొదలుపెట్టడం అవసరం. ఆరోపణలు, విమర్శలు లేదా సలహాలు ఇచ్చే అందరూ దీన్లో పాల్గొనాలి. స్పష్టమైన విధి విధానాలను, ముఖ్యంగా రచనల తొలగింపు, కొత్త వాడుకరుల రచనలపై ఆంక్షలు, కొత్త వాడుకరులతో చర్చల్లో తీసుకోవల్సిన జాగ్రత్తలు, వివాస్పదమైయ్యే అంశాలపై ఓటింగ్ నిర్ణయాలువంటి మరిన్ని అంశాలపై పాలసీలు రూపొందించుకున్నాక వికీ శుద్ది లేదా కొత్త వ్యాసాలు వంటి వాటిపై పనిచేయడం మంచిదని నా అభిప్రాయం.. __ ఈ వాఖ్యను ఆహ్వానిస్తున్నాను దేవుడు (చర్చ) 04:41, 30 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

వెంకట రమణ గారు, అన్నీ వివరంగా చెబుతాను. దయచేసి కొంచెం ఓపిక కలిగి ఉండండి. __దేవుడు (చర్చ) 04:46, 30 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

  • ఈ చర్చలన్నీ ప్రారంభం కాక ముందే ఒక ఒక సమీక్షా సంఘం ఏర్పాటుచేయడానికి ఒకానొక నిర్వాహకులు చొరవ తీసుకుని ప్రతిపాదించడం, దాన్ని బలంగా తొమ్మిది మంది సమర్థించడం చూస్తే - నిర్వాహకులు అసలు ఆ ప్రశ్న ఉత్పన్నం కావడానికి ముందే నిర్వాహకులు పబ్లిక్ స్క్రూటినీకి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. కాబట్టి, ఈ దిశగా ఆ సమీక్షా సంఘం ఏర్పాటును మించిన కార్యాచరణ మరొకటి ఉండబోదని నా అభిప్రాయం విశ్వనాథ్ గారూ. అసలు అది అలా ఉంచండి, చురుకుగా ఉన్న నిర్వాహకులే ఒక సమీక్షా సంఘాన్ని ప్రతిపాదించి, బలంగా సమర్థించడాన్ని మించిన ఆరోగ్య సూచిక మరేదీ లేదు. ఇటువంటి ప్రయత్నం భారతీయ భాషల వికీపీడియాల్లో జరగగా నేను చూడలేదు, పైగా ఆంగ్లంలో ఉన్న ఆర్బిట్రేషన్ కమిటీని మించిన నిష్పాక్షికత దీని ప్రాతిపదికలోనే ఉండడం గొప్ప విశేషం. ఇటువంటి ప్రతిపాదన చూసి కూడా తాము రాస్తున్న వాటిలో దీన్ని గురించి ప్రస్తావించకుండా కేవలం విమర్శలే చేస్తూ, నిర్వాహకుల చిత్తశుద్ధిని గ్రహించనివారి అభిప్రాయాలను కూడా సహనంతో చర్చించడాన్ని మించి సర్టిఫికెట్ ఈ సముదాయ ఆరోగ్యానికి ఏమీ అక్కరలేదు. ఈ గుణాన్ని మనం ఆభరణంగా ధరిస్తూనే మనం తలపెట్టే "గట్టి మేల్" తలపెడుతూనే పోవాలని నా అభిప్రాయం. ఇదండీ నిర్మొహమాటంగా నా అభిప్రాయం. మళ్ళీ చెప్తున్నాను మనం చేయాల్సినదల్లా సమీక్షా సంఘం పని శాశ్వతంగా నిలిచిపోయే కృషి అని గుర్తించి దాన్ని ముందుకు తీసుకువెళ్ళడం. --పవన్ సంతోష్ (చర్చ) 06:16, 30 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు బ్రతికి ఉన్నంత కాలం ఇదేపనా

మీరు బ్రతికి ఉన్నంత కాలం ఇదేపనా అని అనుమానం వాడుకరులకు ఖచ్చితంగా వస్తుంది. ప్రతి వాడుకరిని అధికారంలో ఉన్న మనిషి, మంచిగానైనా లేదా చెడుగానైనా ఏవిధంగానైనా పాతచర్చలు ఉదహరిస్తూ చిత్రీకరణ చేయడం జరుగుతుంది. ఇది మంచి పద్ధతేనా అని ఒకసారి ఆలోచించాలి. అమ్మ ఒళ్ళో కూర్చుని పాలు తాగే వయసు నుండి చనిపోయే వరకు మనిషి ఒకేలా వుంటాడా ? తప్పులు ఎంచే మీరు మాత్రం మంచివారు, మీకు నచ్చని వారు చెడ్డవారు అనటం, జీవితకాలం ముద్ర వేయడం ఏమాత్రం సహించరాని విషయం. ఈ పెడ ధోరణి ఇప్పట్లో ఆగేటట్లు లేదు. అందుకే ఇక్కడకు నేను రావడం మానేసాను. ఎవరికీ ఊడేది యేమీలేదు కదా. ఇక్కడ పద్దతులు మారే వరకు, మంచి మనసులు ఉన్నవారు మాత్రం ఇక్కడకు రావద్దు, ఉండొద్దు, పని చేయవద్దు మాటలు అనిపించికోవద్దు, మీ సమయం వృధా చేసుకోవద్దని నా సలహా, సూచన. నా మాటలను అర్థం చేసుకుంటారని ఆశిస్తాను. ఇక్కడ నా మనసుకు బావుంది అని అనిపిస్తే పనిచేయమని నేనే పోస్ట్ పెడతాను. నాకు తప్పులు ఇక్కడ అనిపించినవి వ్రాస్తునే ఉంటాను. JVRKPRASAD (చర్చ) 07:46, 30 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

దొంగపేర్లు

దొంగపేర్లు పెట్టుకుని నీతైన మాటలు, ఇతరులకు సలహాలు చెప్పటం, విమర్శలు చేయటం, ఇలా చెప్పుకుపోతే ఎన్నెన్నో.... మీలాంటి వాళ్ళని బండబూతులు తిడితే ఆ బూతులకు నీలాంటి వాళ్లతో పాటుగా నీకొంపలో వాళ్ళు కూడా చెవులు పగిలి, కళ్ళు పేలి చచ్చిపోతారు. మీలాంటి వాళ్ళ వల్ల మాలాంటి వాళ్ళను ఇక్కడ ఎవరు పడితే వాళ్ళు ఇష్టం మొచ్చినట్లుగా రాతలు రాస్తున్నారు. దోంగపేర్లు గాళ్ళు లేదా ఎవడో సరిఅయినా సమాధానం వెంటనే వ్రాయకపోతే నువ్వు చచ్చేవరకు యేదో ఒకటి అడిగి వ్రాస్తునే ఉంటాను. నన్ను అన్న వాడిమీద నయినా నువ్వు సమాధానం వ్రాయలేని పనికిమాలిన వాడివా ? దేవుడు అనే (దొంగనాకొడుకుని),(లంజాకొడుకుని),వాడిని నేను కాదు సరేనా ! JVRKPRASAD (చర్చ) 08:01, 30 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]