యమున (నటి): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎బయటి లింకులు: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
పంక్తి 30: పంక్తి 30:


[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]

{{మొలక-వ్యక్తులు}}

14:54, 30 మే 2020 నాటి కూర్పు

యమున
జననం
ప్రేమ
వృత్తినటి
పిల్లలువిశేష్టి, కౌశికి

యమున దక్షిణ భారత సినిమా నటి. ప్రధానంగా తెలుగు సినిమాలలో నటించడమే కాక కన్నడ, మలయాళ, తమిళ భాషా సినిమాలలో, టెలివిజన్ ధారావాహికలలో నటించింది.[1][2] . ఈమె కర్ణాటకకు చెందిన తెలుగు కుటుంబం నుండి వచ్చింది.

వ్యక్తిగత జీవితం

ఈమె అసలు పేరు ప్రేమ. దర్శకుడు కె.బాలచందర్ ఈమె పేరును యమునగా మార్చాడు.

వృత్తి

యమున కన్నడ సినిమా మోడద మరెయల్లిలో శివరాజకుమార్ సరసన తొలిసారి నటించింది. ఈమె సుమారు 50 తెలుగు, కన్నడ చిత్రాలలో కథానాయికగా నటించింది.[3] 1989లో విడుదలైన మౌన పోరాటం సినిమా ద్వారా ఈమె పేరుగడించింది.[4][5] ఈ సినిమా మీడియాలో ప్రాచుర్యం పొందిన సబితా బధేయి అనే ఆమె వాస్తవగాధ ఆధారంగా నిర్మించబడింది. ఈ సినిమాలో ఈమె ఒక ప్రభుత్వోగి చేత మోసగింపబడి, వైవాహిక హక్కులకోసం, తన అక్రమ సంతానానికి సరైన గుర్తింపు కోసం పోరాడే యువతి గౌరి పాత్రను ధరించింది.[6] ఈమె తరువాత వినోద్ కుమార్ సరసన మరో అవార్డు చిత్రం మామగారులో నటించింది.[7] తరువాత పుట్టింటి పట్టుచీర, ఎర్ర మందారం వంటి చిత్రాలలో చెప్పుకోదగ్గ పాత్రలను ధరించింది[8].కన్నడ సినిమాలలో శివరాజ్ కుమార్, రవిచంద్రన్‌ల సరసన నటించింది[9]. ఈమె వివాహం తరువాత కొంతకాలం సినిమాలలో నటించడం మానివేసింది. కొంత విరామం తరువాత టి.వి.సీరియళ్లలో నటించడం ప్రారంభించింది. ఈటీవిలో ప్రసారమైన ధారావాహిక అన్వేషితలో ఈమె నటించింది.

నటించిన సినిమాలు

మూలాలు

  1. "Yamuna profile on Fimibeat". filmibeat.com. Filmibeat. Retrieved 24 November 2016.
  2. Bollineni, Haribabu. "Why Senior Actress Tried to Commit Suicide?". chitramala.in. Chitramala. Retrieved 24 November 2016.
  3. Shyam, Prasad S (27 September 2016). "Yamuna back on the big screen". Bangalore Mirror.
  4. "1989 Nandi Awards". awardsandwinners.com.
  5. "List of winners of the Nandi Award for Best Feature Film". telugufilmz.org.
  6. "Mouna Poratam Music by S Janaki". sjanaki.net.
  7. "1991 Nandi awards". awardsandwinners.com. Retrieved 24 November 2016.
  8. "1990 Nandi Awards". awardsandwinners.com. Awards & Winners. Retrieved 24 November 2016.
  9. "ఆ రూమర్ వచ్చాక... సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నా.. నటి యమున". telugu.webdunia.com. Webdunia. Retrieved 24 November 2016.

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=యమున_(నటి)&oldid=2948545" నుండి వెలికితీశారు