వాడుకరి చర్చ:Naidugari Jayanna: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 170: పంక్తి 170:
==వికీప్రాజెక్టు/మొలకల విస్తరణ ఋతువు 2020==
==వికీప్రాజెక్టు/మొలకల విస్తరణ ఋతువు 2020==
తెలుగు వికీపీడియాలో చాలా తక్కువ సమాచారమున్న వ్యాసాల జాబితాలను వివిధ విభాగాలలో తయారుచేయడం జరిగింది. వీటిని సమిష్టి కృషి ద్వారా ఒక ప్రాజెక్టు ద్వారా ద్వారా విస్తరింపదలచాం. కనుక [[వికీపీడియా:వికీప్రాజెక్టు/మొలకల విస్తరణ ఋతువు 2020]] లో చేరి మీకు ఇష్టం ఉన్న రంగంలోని వ్యాసాలను విస్తరణ చేసి వికీలో నాణ్యమైన వ్యాసాలనుంచాలనే లక్ష్యాన్ని నెరవేర్చడానికి మీ తోడ్పాటు నందించగలరు.[[User:K.Venkataramana|''' <span style="font-family:Jokerman; color: #0047AB">K.Venkataramana</span>''']][[User talk:K.Venkataramana|(talk)]] 14:14, 4 జూన్ 2020 (UTC)
తెలుగు వికీపీడియాలో చాలా తక్కువ సమాచారమున్న వ్యాసాల జాబితాలను వివిధ విభాగాలలో తయారుచేయడం జరిగింది. వీటిని సమిష్టి కృషి ద్వారా ఒక ప్రాజెక్టు ద్వారా ద్వారా విస్తరింపదలచాం. కనుక [[వికీపీడియా:వికీప్రాజెక్టు/మొలకల విస్తరణ ఋతువు 2020]] లో చేరి మీకు ఇష్టం ఉన్న రంగంలోని వ్యాసాలను విస్తరణ చేసి వికీలో నాణ్యమైన వ్యాసాలనుంచాలనే లక్ష్యాన్ని నెరవేర్చడానికి మీ తోడ్పాటు నందించగలరు.[[User:K.Venkataramana|''' <span style="font-family:Jokerman; color: #0047AB">K.Venkataramana</span>''']][[User talk:K.Venkataramana|(talk)]] 14:14, 4 జూన్ 2020 (UTC)
::వెంకటరమణ గారికి నమస్కారం.
ఈ వ్యాసాల విస్తరణకు నా వంతు తోడ్పాటును అందించగలను. --[[వాడుకరి:Naidugari Jayanna|నాయుడు గారి జయన్న]] ([[వాడుకరి చర్చ:Naidugari Jayanna|చర్చ]]) 09:07, 5 జూన్ 2020 (UTC)

09:07, 5 జూన్ 2020 నాటి కూర్పు

స్వాగతం

Naidugari Jayanna గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Naidugari Jayanna గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు


తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Pranayraj1985 (చర్చ) 11:04, 23 నవంబర్ 2013 (UTC)


ఈ నాటి చిట్కా...
అనువదించేటప్పుడు ఇబ్బంది

అనువాదం చేసేటప్పుడు ఒక ఆంగ్లపదానికి సరైన తెలుగు మాట ఎంత ఆలోచించినా తట్టడంలేదు

గూగుల్ లో ఆ పదం టైపు చేసి meaning in Telugu చేర్చి వెతకండి. ఆంధ్రభారతి వెబ్సైట్లో నిఘంటు శోధన ద్వారా వివిధ నిఘంటువులలో వెతకండి. అయినా తెలుగు పదం తెలియకపోతే ఆ పదాన్ని అలా తెలుగు లిప్యంతరీకరణ చేసి వ్రాయండి. తరువాత ఇతరులు మెరుగైన పదంతో మారుస్తారు. లేదా మరో రోజు మీకే తట్టవచ్చు.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

Pranayraj1985 (చర్చ) 11:04, 23 నవంబర్ 2013 (UTC)

పాలమూరు కవులు

నాయుడు గారు, పాలమూరు జిల్లా కవుల గురించి రచనలు చేస్తున్నందుకు చాలా సంతోషం. పాలమూరు రచయితల గురించి ఆచార్య ఎస్వీ రామారావు రచించిన పుస్తకాలలో మంచి సమాచారం ఉంది. అదే విధంగా పాలమూరు పట్టణంలోని ఎస్.ఎస్.ఆర్.గ్రంథాలయంలోని పాత గ్రంథాలలో ప్రాచీన కవుల వివరాలున్నాయి. తెవికీ వర్గాలలో ఆయా రచయితల పేర్లు రావాలంటే ముందుగా వ్యాసాలను సృష్టించి, ఆ వ్యాసాలలో సంబంధిత వర్గం పేరు ఇవ్వాలి. అదేవిధంగా వ్యాసంలో సంతకం చేయకండి, చర్చాపేజీలలో మాత్రం చేయవచ్చు. ఇంకనూ ఏమైనా సందేహాలుంటే అడగవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:14, 23 నవంబర్ 2013 (UTC)

వికీపీడియాలో కొత్త వ్యాసాలు కనీసం రెండు కిలోబైట్ల స్థాయివుండాలన్న నియమం వుంది. కనుక మీరు వ్యాసాలపేర్లను సృష్టించేబదులు ఒక వ్యాసాన్ని కనీస స్థాయికి అభివృద్ధిచేసినతరువాతమాత్రమే కొత్త వ్యాసాలను ప్రారంభించండి.--అర్జున (చర్చ) 05:43, 28 నవంబర్ 2013 (UTC)
మీరు కొత్తగా తయారుచేసిన పాలమూరు జిల్లా కవుల రచనల గురించిన వ్యాసాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని దయచేసి విస్తరించండి. లేదా కొంతకాలం పిదప అవి తొలగించబడతాయి.Rajasekhar1961 (చర్చ) 04:07, 29 నవంబర్ 2013 (UTC)

చిత్రాలు చేర్చుట

గౌరవనీయులైన పెద్దలు నా వాడుకరి పేజికి నా చిత్రాన్ని గానీ, నేను రాస్తున్న వ్యాసాలకు, వాటికి సంబంధించిన చిత్రాలను గానీ నేనెలా చేర్చవచ్చో దయచేసి తెలిపి సహాయపడగలరు. అలాగే నేను రాస్తున్న కొన్ని వ్యాసాలను భద్రపరిచాక చూస్తే కొంత సమాచరం పెట్టెలోన మరికొంత సమాచారం బయట ఉన్నట్లుగా అగుపిస్తుంది. ఎందుకు? --వాడుకరి:Naidugari Jayanna

మీరు కొత్తగా చిత్రాన్ని తెవికీలో అప్లోడ్ చేయుటకు వికీపీడియా:ఫైల్ ఎక్కింపు విజర్డు ఉపయోగించండి. చిత్రం అప్లోడ్ చేసిన పిదప [[బొమ్మ:<చిత్రం పేరు>|200px|right|thumb|<చిత్రం యొక్క వ్యాఖ్య>]] లింకును ఆ చిత్రం వాడదల్చిన పేజీలో ఉంచండి చాలు. మరింత సమాచారం కోసం వికీపీడియా:బొమ్మలు వాడే విధానం చూడండి. అలాగే చర్చాపేజీలో మాత్రం సంతకం (~~~~) చేయడం మర్చిపోకండి. మీ రెండో సందేహం గురించి చెప్పాలంటే మీరు వ్యాసం వ్రాస్తున్నప్పుడు పేరా మొదట్లో ఖాళీ స్థలం (స్పేస్) వదలకండి. ప్రారంభంలో స్పే స్ ఇస్తే ఇలా వస్తుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:46, 29 నవంబర్ 2013 (UTC)
సభ్యుడు:C.Chandra Kanth Rao గారి స్పందనకు ధన్యవాదాలు. పక్కపట్టీలోని 'దస్త్రపు ఎక్కింపు' ఇప్పుడు నేరుగా కొత్త ఫైల్ ఎక్కింపు విజర్డును ప్రారంభిస్తుంది. దీనిని వాడేటప్పుడు గుర్తుంచుకోవలసినవి చిత్రం చేర్చబోయే వ్యాసం పేరు ముందుగానే నిర్ణయించుకొని సంబంధిత పెట్టెలో చేర్చాలి మరియు ఎర్ర నక్షత్రం గల పెట్టెలలో తప్పక సమాచారం చేర్చాలి.--అర్జున (చర్చ) 04:12, 30 నవంబర్ 2013 (UTC)
గౌరవనీయులైన సీనియర్ సభ్యులకు నమస్కారాలు! నా వాడుకరి పేజికి నా చిత్రాన్ని చేర్చుదామని ప్రయత్నించాను. వికీ కామంస్ ద్వారా అప్ లోడు చేశాను. కాని వాడుకరి పేజికి చేర్చలేక పోతున్నాను. కారణమేమిటో దయచేసి తెలియజేయగలరు .Naidugari Jayanna (చర్చ) 16:42, 30 నవంబర్ 2013 (UTC)
నేను సరిచేశాను. ఇప్పుడు మీ చిత్రం కనిపిస్తోంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:11, 30 నవంబర్ 2013 (UTC)

గౌ. పెద్దలకు నమస్కారాలు! మహబూబ్ నగర్ జిల్లా మానోపాడు మండలం పల్లెపాడు గ్రామానికి సంబంధించిన కొన్ని చిత్రాలను వికీ కామంస్ లో చేర్చాను, దయచేసి గ్రామానికి సంబంధించిన పేజికి జతచేయగలరు. అలాగే వి,కా,లోని చిత్రాలను వ్యాస పేజికి చేర్చడమెలానో దయచేసి తెలియజేయగలరు.Naidugari Jayanna (చర్చ) 15:10, 1 డిసెంబర్ 2013 (UTC)

నేను పల్లెపాడు గ్రామవ్యాసంలో చేర్చాను. మీరు కామన్స్‌లో చేర్చిన చిత్రాల లింకు ఇవ్వనందున మరియు ఆ చిత్రాలకు పేర్లు కూడా లేనందున వెదకటంలో ఇబ్బందులొచ్చాయి. ఇక మీదట మీరు అప్లోడ్ చేసే చిత్రాలకు పేర్లు ఇవ్వండి. అలాగే గ్యాలరీగా చేర్చిన చిత్రాల కింద సంక్షిప్తంగా వ్యాఖ్యలు వ్రాయండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:15, 1 డిసెంబర్ 2013 (UTC)

వ్యాసాలలో రెఫరెన్సులు పెట్టండి

జయన్న గారు, మీరు పాలమూరు జిల్లాకు చెందిన కవుల వివరాలు చేర్చుతున్నందుకు కృతజ్ఞతలు. వ్యాసాలలో వ్రాస్తున్న సమాచారంలోని ప్రధాన వాక్యాలకు మూలాలు (రెఫరెన్సులు) పెట్టండి. అంటే ఆ వాక్యం ఏ గ్రంథం నుంచి తీసుకున్నారో తెలియజేయాలన్నమాట. మూలాలు లేని వ్యాసం స్వంతకథనంగా లేదా ఊహాజనితంగా భావించబడే అవకాశం ఉంటుంది. మూలాల గురించి, వాటిని ఎలా పెట్టాలి?, ఎందుకు పెట్టాలి? తదితర విషయాల గురించి తెవికీనిర్వహణ బ్లాగులో చూడవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:23, 3 డిసెంబర్ 2013 (UTC)

జయన్న గారూ, కొలరావిపుప్ర కొరకు నాపేరు ప్రతిపాదించినందుకు కృతజ్ఞతలు కాని ఇదివరకే వికీపీడియా:2013 కొలరావిపుప్ర/C.Chandra Kanth Rao నా పేరు ప్రతిపాదించబడినది. అయితే నేను కొన్ని కారణాల వల్ల సమ్మతి తెలపడం లేదు. మీరు కొత్తగా ప్రతిపాదించిన పేజీ తొలగింపునకు గురికావచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:43, 4 డిసెంబర్ 2013 (UTC)
మీరు కొత్తగా చేరిననూ తెవికీని బాగా గమనిస్తున్నారు, అన్ని అవకాశాలు ఉపయోగించుకొని మంచి పరిణతి చెందుతున్నారు. మీరు రచించిన ఒక వ్యాసంలో నేను సరిచేసిన ఒక దిద్దుబాటుకై నోటిఫికేషన్ ద్వారా ధన్యవాదాలు తెలపడం మీ పరిణతికి నిదర్శనం. వ్యాసాలలో కూడా మూలాలను చేర్చుతున్నారు. బొమ్మలను కామన్స్‌లో అప్లోడ్ చేశారు. అక్షరదోషాలు లేకుండా వ్రాస్తున్నారు. మీ కృషి ఇలాగే కొనసాగించండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:41, 4 డిసెంబర్ 2013 (UTC)

కొలరావిపుప్ర

మీరు తెవికీ లో చక్కగా కొనసాగుతున్నారు, అభినందనలు. అలాగే, కొలరావిపుప్ర కొరకు చంద్రకాంతరావు గారి పేరు ప్రతిపాదించినందుకు ధన్యవాదాలు. కానీ, వికీపీడియా:2013 కొలరావిపుప్ర/C.Chandra Kanth Rao అనే పేజీ లో ముందే ప్రతిపాదింపబడినది. కావున, ఆ పేజీ లో మీరు మద్దతు ప్రకటించండి. అహ్మద్ నిసార్ (చర్చ) 18:19, 4 డిసెంబర్ 2013 (UTC)

పాలమూరు జిల్లా కవుల రచనలు

జయన్నగారూ, మీరు సృష్టించిన పాలమూరు జిల్లా కవుల రచనలు వ్యాసం పూర్తిగా ఒక పుస్తక పరిచయంగా ఉన్నది. అది మట్టి గంప అనే పుస్తకంగా ఉన్నది. కనుక మీరు "మట్టి గంప" అనే వ్యాసంలో ఈ వ్యాస భాగాన్ని చేర్చి పాలమూరు జిల్లా కవుల రచనలన్నింటినీ పాలమూరు జిల్లా కవుల రచనలు వ్యాసంలో విస్తరించండి.----కె.వెంకటరమణ (చర్చ) 13:51, 24 డిసెంబర్ 2013 (UTC)

వ్యాస విలీనం గూర్చి

'ఎలకూచి బాలసరస్వతి వ్యాసాన్ని ఏలకూచి బాలసరస్వతితో విలీనం చేయుటకు మీ అభిప్రాయాలను సంబంధిత వ్యాసాల చర్చా పేజీలో వ్రాయండి.----కె.వెంకటరమణ (చర్చ) 17:15, 29 డిసెంబర్ 2013 (UTC)

బొమ్మలు

జయన్నగారూ, మీరు అప్లోడ్ చేస్తున్న బొమ్మలు బాగున్నాయి. దీనిపై కొన్ని సూచనలు - కామన్స్‌లో చేర్చే బొమ్మలకు తప్పనిసరిగా పేర్లు ఆంగ్లంలోనే ఇవ్వండి. అలాగే బొమ్మపేర్లు కూడా బొమ్మలకు సంబంధించిన పేర్లనే ఇవ్వండి. బొమ్మలు అప్లోడ్ చేసేటప్పుడే వర్గాలు కూడా చేర్చండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 09:18, 12 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

దశాబ్ధి ఉత్సవాలకు స్వాగతం

తెవికీ మిత్రులందరకూ దశాబ్ది ఉత్సవ కమిటీ తరపున ఆహ్వానం

2003 డిసెంబర్ 10న తెలుగు వికీపీడియా ప్రారంభమయింది. పది సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో యాభై వేల పైబడి వ్యాసాలతో భారతదేశంలోని అన్ని భాషలలో అధిక వ్యాసాలు కలిగిన భాషలలో ఒకటిగా నిలిచింది. ఇందుకు కారణం వికీపీడియాలో వ్యాసాలు రాస్తూ అభివృద్ధి పరుస్తున్న ఎందరో మహానుభావులు. వీరిలో విశేష కృషిచేసిన కొందరిని సత్కరించాలనీ, సమూహ సభ్యులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవడం ద్వారా సమిష్టి కృషిలో పాల్గొనేందుకు మరింత స్ఫూర్తి దొరుకుతుందనే ఆశయంతో ఈ నెల (ఫిబ్రవరి) 15, 16 తేదీలలో దశాబ్ది సంబరాలుగా జరుపుకోబోతున్నాం.

ఈ కార్యక్రమంలో ఎందరో కొత్త ఔత్సాహికులకు వికీతో అనుబంధాన్ని ఏర్పరచి భావి వికీపీడియన్లుగా తీర్చిదిద్దాలని కోరికతో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. వాటిలో మీరూ పాల్గొని కొత్త వారికి విజయవాడలోగల కే.బీ.ఎన్ కళాశాల వద్దనే ప్రత్యక్ష సహాయం చేస్తూ మార్గనిర్దేశం చేయాలని మా కోరిక, ప్రయాణం, వసతి వంటివి ఏర్పాటు చేయబడినవి. కనుక ఇప్పటికీ నమోదు చేసుకొనకపోతే దయచేసి పైన గల సైటు నోటీసు ద్వారా మీ వివరాలు నమోదుచేసుకొంటే మాకు ఏర్పాట్లకు అంచనా ఏర్పడుతుంది.

ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని వికీ మిత్రులంతా సహకరించి కార్యక్రమం విజయవంతం చేసి భావితరాలకు వికీ మార్గదర్శినిగా ఉండేలా చేయాలని మా కోరిక

......దశాబ్ది ఉత్సవ కార్యవర్గం, సహాయమండలి

వికీసోర్సు

మీరు వికీసోర్సులో పని ప్రారంభించారా. సమస్యలుంటే తెలుపండి.Rajasekhar1961 (చర్చ) 14:38, 22 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త సభ్యులకు స్వాగతం

జయన్నగారూ, కొత్త సభ్యులకు స్వాగతం పలకడానికి మీరు {{subst:welcome}} ఉపయోగించండి చాలు. పేరు, సంతకం కూడా అవసరం లేదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:27, 26 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ఏప్రిల్ 27, 2014 సమావేశం

ఈనెల 27 తేదీన తెవికీ సమావేశం జరుగుతున్నది. మీరు దయచేసి ఇందులో ప్రత్యక్షంగా గాని స్కైప్ ద్వారా పాల్గొని సమావేశాన్ని సఫలీకృతం చేస్తారని కోరుతున్నాను.Rajasekhar1961 (చర్చ) 13:21, 23 ఏప్రిల్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టు విషయంలో సహకారం కోసం

నమస్కారం..
తెలుగు వికీపీడియాలో తెలంగాణా ప్రాజెక్టు, మరీ ముఖ్యంగా తెలంగాణా సాహితీ మూర్తుల గురించిన రచనలలో, మీరు చేస్తున్న కృషికి అభినందనలు. తెలుగు వికీపీడియాలో ప్రస్తుతానికి వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు జరుగుతోంది. ఆ ప్రాజెక్టుకు బాధ్యునిగా మీరు ఇటువంటి ప్రాజెక్టుల్లో మరింత ఉత్సాహంగా పనిచేయగలరని భావిస్తున్నాను. ఇందులో భాగంగా డిజిటల్ లైబ్రరీ ఆ ఇండియాలోని తెలుగు పుస్తకాలను వికీపీడియన్లకు పనికివచ్చే విధంగా కాటలాగ్ చేస్తున్నాము. అలాగే కాటలాగులోని తెలుగు పుస్తకాలను డిజిటల్ లైబ్రరీ ద్వారా దించుకుని చదివి వికీలో చక్కని వ్యాసాలూ రాస్తున్నాము, ఉన్న వ్యాసాలూ అభివృద్ధి చేస్తున్నాం. వికీసోర్సులో రాజశేఖర్ గారి చొరవతో సమర్థ రామదాసు, ఆంధ్ర వీరులు మొదటి భాగం, రెండవ భాగం, భారతీయ నాగరికతా విస్తరణము, కలియుగ రాజవంశములు, కాశీ యాత్రా చరిత్ర, కోలాచలం శ్రీనివాసరావు, నా జీవిత యాత్ర (టంగుటూరి ఆత్మకథ) వంటి అపురూపమైన గ్రంథాలు ఈ ప్రాజెక్టు ద్వారా చేర్చి అభివృద్ధీ చేస్తున్నాం. వీటిలో మీకు ఏదైనా విభాగం ఆసక్తికరంగా తోస్తే దానిని ఎంచుకుని మొత్తం ప్రాజెక్టును అభివృద్ధి చేసే దిశకు వెళ్ళాలని ఆశిస్తున్నాము. మీతో పాటుగా ఈ ప్రాజెక్టులో పనిచేయడానికి ఉత్సుకతతో --పవన్ సంతోష్ (చర్చ) 12:30, 26 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు పతకం

తెలుగు మెడల్
జయన్న గారూ, మీరు తెలుగువికీపీడియాలో చక్కగా వ్రాస్తున్నారు. మీ కృషికి అభినందనలు అలాగే మీకృషిని కొనసాగించండి. వ్యాసాల అభివృద్దికి చేస్తున్న కృషికి అందుకోండి ఈ పతకం ___అహ్మద్ నిసార్.

గడియారం వెంకటశేషశాస్త్రి

గడియారం వేంకట శేషశాస్త్రి పై ఇది వరకే ఒక పేజి సృష్టించబడి ఉంది. దానిని అభివృద్ధి చేయండి. --స్వరలాసిక (చర్చ) 07:53, 28 ఆగష్టు 2014 (UTC)

వికీ పేజీల చరిత్రను తరలించడం సాధ్యమేనా?

చర్చలో పాల్గొని తమ అభిప్రాయాలు తెలియజేసిన సభ్యులు కటకం వెంకట రమణ గారికి, Naidugari Jayanna గారికి, YVSREDDY గారికి, రాజశేఖర్ గారికి ధన్యవాదాలు. YVSREDDY గారు , రాజశేఖర్ గార్ల సమ్మతితో నియంతలు పేజీ ని నియంత పేజీలో విలీనం చేసి అలాగే చరిత్ర ను కూడా విలీనం చేసి, ఈ చర్చకు అర్ధవంతనైన ముగింపును ఇద్దాం.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 16:09, 23 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

గద్వాల సంస్థాన రాజుల వంశవృక్షం

మీరు విస్తరించిన గద్వాల సంస్థానము‎ లో గల వంశవృక్షం శీర్షిక ను సరిచేసి {{గద్వాల సంస్థాన రాజుల వంశవృక్షం}} ను సృష్టించి ఆ వ్యాసం లో చేర్చితిని. ఈ వంశవృక్షం ఇంకా ఉంటే అందులో చేర్చండి. లేదా పూర్తి వంశవృక్షం ఉంటే తెలియజేయండి సరిచేస్తాను.-- కె.వెంకటరమణ 12:25, 12 జనవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

గద్వాల సంస్థాన రాజుల వంశవృక్షం-మరింత సమాచారం

వెంకటరమణ గార్కి నమస్కారాలు. గద్వాల సంస్థాన రాజుల వంశవృక్షాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దినందుకు ధన్యవాదాలు. వంశవృక్షానికి సంబంధించిన అధనపు సమాచారాన్ని ఇక్కడ ఇస్తున్నాను. గద్వాల సంస్థానముపేజీలో పొందుపరుచగలరు.--Naidugari Jayanna (చర్చ) 17:16, 18 జనవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

గద్వాల సంస్థాన వంశవృక్షం

బక్కమ్మ

|
↓(పెంపుడు కుమారుడు)

పెద శోభనాద్రి|పెదసోమ భూపాలుడు|సోమనాద్రి (1663-1712)

 రాణి అమ్మక్కమ్మ  || రాణి లింగమ్మ
(సోమనాద్ర పెద్దభార్య)||(సోమనాద్రి చిన్నభార్య)
(1746-47)          (1747-60)
                      |
                      ↓(దత్తపుత్రుడు)
                   రాజా తిరుమలరావు (1760-64)
          రాణి మంగమ్మ    || రాణి చొక్కమ్మ
   (తిరుమలరావు పెద భార్య)   || (తిరుమలరావు చిన్న భార్య) −−−−−−−−−−−−−−−−−→ రాజా రామరాయలు (1768-83)
      (1764- ... )             (1764- 68)                          (చొక్కమ్మ మరిది)
                            | (చొక్కమ్మ కుమారులు)
                            ↓ (రాజ రామరాయల పెంపుడు కుమారులు)
               ↓ −−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−− ↓
      రాజా చినసోమభూపాలుడు                   రాజా చిన రామభూపాలుడు
         (1784-1815)                          (1816-28)
                                                 |
                                                 ↓(ఏకైక కుమారై)
                                                లింగమ్మ   −−−−−−−−|భర్త| రాజా సీతారామభూపాలుడు (రాజా చిన రామభూపాలుడి ఇల్లరికపు అల్లుడు)
                                         (రా.సీ.రా.భూ. రెండవ భార్య)                    (1828-61)
                                            (1861-63)                           వెంకటలక్ష్మమ్మ   ||        అనంతమ్మ
                                                 |                    (రా.సీ.రా.భూ. మొదటి భార్య)       (రా.సీ.రా.భూ.మూడవ భార్య)
                                                 |(లింగమ్మ దత్తపుత్రుడు)             (1867-87)
                                                 ↓                                  | 
                                          రాజా సోమభూపాలుడు                            | (వెంకటలక్ష్మమ్మ దత్తపుత్రుడు)
                                            (1863-66)                               ↓
                                                                                రాజా రామభూపాలుడు
                                                                                   (1887-1923)
                                                                                    |భార్య||రాణి లక్ష్మీదేవి (1923-35)
                                                                                    |
                                                                                    | (దత్తపుత్రుడు)
                                                                                    ↓
                                                                           రాజా చిన సీతరామభూపాలుడు
                                                                                (1935-46)
                                                                                ||భార్య||రాణి ఆదిలక్ష్మిదేవమ్మ (1946-47)

అభినంధనలు

మీరు తెలుగు వికీ 11 వ వార్షికోత్సవాలకు అర్హత సాధించినందుకు అభినందనలు - ఈ దిగువ ఇచ్చిన పత్రం పూర్తి చేసి దిగువ సబ్మిట్ బటన్ ద్వారా మాకు పంపించగలరు

https://docs.google.com/forms/d/15OiOeYDQhMzlTptpGcQkY3QoNq9r6pIp6mXWKroOriE/viewform?c=0&w=1

తెవికీ 11 ఉత్సవ కమిటీ --- --t.sujatha (చర్చ) 14:39, 9 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగులో మీ సంతకం

జయన్న గారూ నమస్కారం. కుశలమా!...మీ వాడుకరి పేజీ ఆంగ్లంలో ఉన్ననూ, మీ సంతకాన్ని తెలుగులో చేయవచ్చు. ప్రయత్నించగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:34, 13 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ఖాదర్ గారూ నమస్కారం. కుశలమే. మీరూ క్షేమమేనని తలుస్తున్నాను. మీ సూచనకు ధన్యవాదాలు. మీరు చెప్పినట్లుగానే మారుస్తున్నాను.నాయుడుగారి జయన్న (చర్చ) 14:52, 13 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]


నూతన కళాకారులను కాపాడవలసిందిగా మనవి

జైశంకర్ చిగురుల అనే ఈ వ్యాసాన్ని తొలగించవలసిన వ్యాసం వర్గం లిస్టు లో చేర్చారు మీరు దయచేసి మూలాలు పరిశీలించి జైశంకర్ చిగురుల అనే ఈ వ్యాసాన్ని విస్తరిం నూతన కళాకారులను కాపాడవలసిందిగా నాయుడుగారి జయన్న గారి కీ నా మనవి.

తెలుగు కవులు - బిరుదులు

తెలుగు కవులు - బిరుదులు వ్యాసం అభివృద్ధికి కావలసిన వనరుల కోసం mmkodihalli@gmail.com నకు సంప్రదించగలరు.--స్వరలాసిక (చర్చ) 16:30, 29 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

స్వరలాసిక గార్కి ! నమస్కారములు. మీ 'ఆంధ్ర సాహిత్యంలో బిరుదనామములు ' పంపినందుకు ధన్యవాదాలు . మీ పుస్తకం ఆధారంగా తెవికీ వ్యాసాన్ని అభివృద్ధి పరచడానికి ప్రయత్నిస్తాను. వ్యక్తిగతంగానూ ఇది నాకెంతో ఉపయోగకరమైన పుస్తకం. అందుకు మీకు మరోసారి ధన్యవాదాలు.--నాయుడుగారి జయన్న (చర్చ) 14:08, 30 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

కామారెడ్డి జిల్లా పేజీల్లో పనులు

జయన్న గారూ, మీరు కామారెడ్డి జిల్లా పేజీల పనులను చేపట్టగలరా? అక్కడ చెయ్యాల్సిన పనులు ఇవి:

  1. ముందుగా జిల్లాకు చెందిన మండలాలతో ఒక మూసను తయారు చెయ్యాలి.
    1. ఈ మూసను ఒక్కో మండలం పేజీలో పెట్టాలి. దాంతో పాటు పేజీలో చెయ్యాల్సిన ఇతర మార్పులు కూడా చెయ్యాలి.
  2. ఒక్కో మందలానికీ ఆ మండలంలోని గ్రామాలతో ఒక మూసను తయారు చెయ్యాలి.
    1. ఈ మూసను ప్రతీ గ్రామం పేజీలోనూ పెట్టాలి. దాంతో పాటు పేజీలో చెయ్యాల్సిన ఇతర మార్పులు కూడా చెయ్యాలి.

వివరాలకు ప్రాజెక్టు పేజీలో పని చెయ్యడం ఎలా విభాగం చూడండి. __చదువరి (చర్చరచనలు) 18:07, 15 నవంబర్ 2017 (UTC)

చదువరి గారికి నమస్కారం. మీ ఆహ్వానానికి ధన్యవాదాలు. ముందు జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించిన పని చేద్దామనుకుంటున్నాను. ఆ దిశగా ఇది వరకే కొంత పని కూడా చేశాను. తరువాత వీలును బట్టి చేయగలను.నాయుడుగారి జయన్న (చర్చ) 14:28, 16 నవంబర్ 2017 (UTC)

వికీప్రాజెక్టు/మొలకల విస్తరణ ఋతువు 2020

తెలుగు వికీపీడియాలో చాలా తక్కువ సమాచారమున్న వ్యాసాల జాబితాలను వివిధ విభాగాలలో తయారుచేయడం జరిగింది. వీటిని సమిష్టి కృషి ద్వారా ఒక ప్రాజెక్టు ద్వారా ద్వారా విస్తరింపదలచాం. కనుక వికీపీడియా:వికీప్రాజెక్టు/మొలకల విస్తరణ ఋతువు 2020 లో చేరి మీకు ఇష్టం ఉన్న రంగంలోని వ్యాసాలను విస్తరణ చేసి వికీలో నాణ్యమైన వ్యాసాలనుంచాలనే లక్ష్యాన్ని నెరవేర్చడానికి మీ తోడ్పాటు నందించగలరు. K.Venkataramana(talk) 14:14, 4 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

వెంకటరమణ గారికి నమస్కారం.

ఈ వ్యాసాల విస్తరణకు నా వంతు తోడ్పాటును అందించగలను. --నాయుడు గారి జయన్న (చర్చ) 09:07, 5 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]