కె. ఎన్. కేసరి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 39: పంక్తి 39:
</gallery>
</gallery>
==రచనలు==
==రచనలు==
[[File:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf|thumb|Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P]]
ఆయన జీవిత విశేషాలను చిన్ననాటి ముచ్చట్లు పేరుతో పుస్తకంగా రాశాడు.<ref>{{Cite wikisource|title=చిన్ననాటి ముచ్చట్లు}}</ref>
ఆయన జీవిత విశేషాలను చిన్ననాటి ముచ్చట్లు పేరుతో పుస్తకంగా రాశాడు.<ref>{{Cite wikisource|title=చిన్ననాటి ముచ్చట్లు}}</ref>



11:59, 3 జూలై 2020 నాటి కూర్పు

కె. ఎన్. కేసరి
జననం
కోట నరసింహం

1875
మరణం1953

కె.ఎన్.కేసరి (1875 - 1953) గా పేరు పొందిన ఈయన అసలు పేరు కోట నరసింహం. కేసరి కుటీరం అనే ఔషధశాల స్థాపకుడు. మదరాసులోని మైలాపూరులో కేసరి పాఠశాలను స్థాపించాడు. కేసరి దానశీలిగా పేరు గాంచారు. స్త్రీ జనోద్దరణకై గృహలక్ష్మి మాసపత్రికను స్థాపించాడు. కర్నాటక సంగీతం విద్వాంసుడు, సినీ గాయకుడు ఉన్ని కృష్ణన్ ఆయనకు మునిమనుమడు.

బాల్యం

ఇతని స్వస్థలం ఒంగోలు ప్రాంతం. ఈయన తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు. వీరిది పేద కుటుంబం. తల్లికి ఇంటి పనుల్లో సహాయం చేస్తూ ఉండటం వల్ల బడికి సరిగా వెళ్ళగలిగేవాడు కాదు. తల్లి దర్జీ పని చేస్తుండేది. తల్లి కష్టపడి తనను పెంచి పెద్ద చేస్తుండటం గమనించిన ఈయన కాలినడకనే మద్రాసు చేరుకుని అక్కడే చదువుకోవడం మొదలు పెట్టాడు. కొంతకాలానికి తల్లికూడా అక్కడికే వచ్చి అతనితో ఉండసాగింది. కొద్దికాలానికే ఆమె మరణించింది.

వైద్యవృత్తి

చదువు పూర్తి చేసుకుని పలుచోట్ల ఉద్యోగ ప్రయత్నాలు చేసినా అవేమీ సత్ఫలితాలను ఇవ్వలేదు. తర్వాత ఆయన వైద్యం నేర్చుకోవడం ప్రారంభించాడు. కోమట్ల సహాయంతో శ్రీ కన్యకాపరమేశ్వరీ ఆయుర్వేద వైద్య కళాశాలలో కొలువు సంపాదించాడు. 1900 సంవత్సరంలో మద్రాసు జార్జిటవున్ నారాయణ మొదలి వీధిలో ఒక చిన్న బాడుగ ఇంటిలో కేసరి కుటీరము పేరుతో మందుల తయారీ సంస్థను ప్రారంభించాడు.

కేసరి కుటీరం ఉత్పాదనలు

  • అమృత, రక్తశుద్ధిద్రావకము
  • అర్క, సర్వజ్వరనివారిణి
  • కేసరి డెంటల్ క్రీం, దంతధావన నవనీతము
  • కేసరి పుష్పత్రయము
  • లోధ్ర

గ్యాలరీ

రచనలు

Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P

ఆయన జీవిత విశేషాలను చిన్ననాటి ముచ్చట్లు పేరుతో పుస్తకంగా రాశాడు.[1]

మూలాలు

  1. Wikisource link to చిన్ననాటి ముచ్చట్లు. వికీసోర్స్.