నిలువు దోపిడి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 20: పంక్తి 20:
* [[నాగభూషణం (నటుడు)|నాగభూషణం]] - భూషణం
* [[నాగభూషణం (నటుడు)|నాగభూషణం]] - భూషణం
* [[రాజబాబు]] - రాజు
* [[రాజబాబు]] - రాజు
* [[చిత్తూరు నాగయ్య]]
* [[చిత్తూరు నాగయ్య]] -స్వామీజీ
* [[పద్మనాభం]] - లింగం
* [[పద్మనాభం]] - లింగం
* [[రమాప్రభ]]
* [[రమాప్రభ]]

14:06, 3 జూలై 2020 నాటి కూర్పు

నిలువు దోపిడి
(1968 తెలుగు సినిమా)
దర్శకత్వం సి.ఎస్.రావు
తారాగణం నందమూరి తారక రామారావు,
దేవిక,
కృష్ణ ,
జయలలిత
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ మంజులా సినీ సిండికేట్
భాష తెలుగు

నిలువు దోపిడి మంజుల సినీ సిండికేట్ బ్యానర్‌పై యు.విశ్వేశ్వర రావు నిర్మించిన తెలుగు సినిమా. ఈ సినిమా 1968, జనవరి 25న విడుదలయ్యింది.

నటీనటులు

సాంకేతికవర్గం

చిత్రకథ

రంగవరం జమీందారు చనిపోతూ తన కుమారులు రాము, కృష్ణలను తన తోబుట్టువులైన చుక్కమ్మ, శేషమ్మలకు అప్పజెపుతాడు. చుక్కమ్మకు జమీందారీ ఆస్తిని చూసి కన్నుకుట్టి శేషమ్మతో కలిసి కుట్రపన్ని తమ్ముడు నాగభూషణం సహాయంతో మేనల్లులను హతమార్చబోతుంది. రైల్లో హంతకుడి చేతుల్లో పడిన పిల్లలను ఒక ముసుగు మనిషి రక్షించి ఒక గురుకులంలో చేరుస్తాడు. అక్కడే పెద్దవారైన అన్నదమ్ములు గురువుద్వారా నిజవృత్తాంతం తెలుసుకుని రంగవరం చేరుకుంటారు. ఈ లోగానే చుక్కమ్మ కూతురు రాధను కృష్ణ, శేషమ్మ కూతురు జానకిని రాము పట్టణంలో ప్రేమించడం జరుగుతుంది.

రంగవరం వచ్చిన రాము, కృష్ణలు కోయ వేషాలు వేస్తారు. చుక్కమ్మను తమ మాటలు వినేటట్లు చేస్తారు. ఆ తర్వాత రాము రౌడీ వేషం వేస్తాడు. చుక్కమ్మకు నమ్మినబంటుగా తయారవుతాడు. చుక్కమ్మకు, ఆమె సహాయంతో సమితి ప్రెసిడెంటు అయిన భూషణానికి లంకె బిందెల ఆశ పుట్టిస్తాడు. భూషణం తన కొడుకు రాజుకు రాధను చేసుకుని ఆస్తి అపహరించాలనుకుంటాడు. తోబుట్టువుకే ఎసరు పెట్టబోతాడు. కాని రాము, కృష్ణలు అడ్డుపడటంతో అసలు రహస్యం బయటపడుతుంది[1].

మూలాలు

  1. వి.ఆర్. (2 February 1968). "చిత్రసమీక్ష:నిలువు దోపిడి". ఆంధ్రపత్రిక దినపత్రిక. Retrieved 3 July 2020.

బయటిలింకులు